Tcongress
-
పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3 శాతం ఓట్లు సంపాదించింది. ఆ మూడు శాతం ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్‌ను చంద్రబాబు చేతిలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణా యూనిట్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒక సారో పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే! లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో ‘హోమ్లీ ఫీలింగ్’ను కలుగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనుకాడటం లేదు. తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇండియా టుడే’ జాతీయ న్యూస్ ఛానల్ వాళ్లు హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతోపాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రెండు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ‘1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించింద’ని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50 వేల ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథా లాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటా యనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే రెండు చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? ఎనభయ్యో దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో యెల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి యెల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను ముని గింది గంగ! తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగివుండి తీరాలి. వేరే మార్గం లేదు! ఆ దశలో చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని సృష్టించి పరుగులరాణి పంచకల్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ‘ఐటీ రంగ సృష్టికర్త అతనే’ అని డప్పు వేయించారు. ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే – చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి, తనను తాను ఐన్‌స్టీన్‌కు అన్నయ్యగా, న్యూటన్‌కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా! రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్‌ఫోన్, కంప్యూటర్ వగైరా వగైరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేక పోవడానికి యెల్లో మీడియా డప్పుల మోతే కారణం. వాస్తవానికి హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసు కున్న దార్శనికుడు... నాటి ప్రధాని పీవీ నరసింహారావు. ‘సాఫ్ట్వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్‌పై ఉండే మక్కువతో మొదటి పార్క్‌ను హైదరాబాద్‌కు కేటాయించారు. ఇప్పుడు ‘సైబర్ టవర్స్’గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) శంకు స్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి, ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు, బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలిస్థానంలో ఉండవలసిన హైదరాబాద్‌ను బెంగళూరు అధిగమించింది. ఆ రకంగా హైద రాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం! వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావల్సినవాడ య్యారు. కనుక ఐటీని కనిపెట్టినవాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు’ అనుకున్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్‌నని నమ్మడం మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్‌ను తీసుకోవాలి కదా? విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ వాళ్లే దీన్ని గుర్తించి క్రెడిట్‌ను కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాటపడుతున్నారు. దాని కొనసాగింపే నిన్నటి ‘ఇండియా టుడే’ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు. చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్‌కు కాంగ్రెస్ వాళ్లు శంకుస్థాపన చేస్తే, ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారం భంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగురోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కి.మీ. రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే! కాగితం కదిలిందీ లేదు. సర్వే జరిగిందీ లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో, 175 కి.మీ. పొడవునా నిర్మించాలని సంకల్పించి, సర్వేలను ముగించి, శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే! ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి, ‘పెద్దలా? గద్దలా..?’ పేరుతో విషప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనుక ఆయన సలహాను వైఎస్సార్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభు త్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలామందికి గుర్తే! భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90 శాతాన్ని రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుదీ కరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా వుంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం యెల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభి మానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహ రిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్ఠలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు, పాంచాల రాజైన ద్రుపదుడు బాల్యస్నేహితులు. కష్టాల్లో ఉన్న ద్రోణుడు ఒకసారి సాయం కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడట. ద్రుపదుడు అవమానించి పంపాడు. ఆ కోపాన్ని చానాళ్లపాటు ద్రోణుడు కడుపులో దాచుకున్నాడు. కురు, పాండవ రాకుమారులకు విద్య నేర్పిన తర్వాత కడుపులోని అక్కసును వాళ్ల ముందు ద్రోణా చార్యుడు వెళ్లగక్కాడు. వెంటనే అర్జునుడు బయల్దేరి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు ముందు నిలబెడతాడు. ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదుర వుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోలెడంత ఊరట. తన విజన్‌ను పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు. ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు. అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకూ, రాచకొండ గుట్టలకూ మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్‌గా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివా దాలు వగైరా వేరే అంశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్ర బాబు గురువు. చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురుపరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకూ ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి! గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయాన్నందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు బాబు వర్గం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారూ సుమారు 150 మంది హైదరాబాద్‌లోని ఓ క్లబ్లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో భూములు కొనుగోలు చేసినవారున్నారు. ఇంకొందరు తెలుగు దేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలనీ, అందుకు అవసరమైన ‘సహకారాన్ని’ అందించాలనీ కూడా వారు తీర్మా నించినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి. అమరావతి వెంచర్లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు రాచకొండ ప్రక టనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్ష ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్‌ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది. రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు. భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు కావలసింది అరచేతిలో వైకుంఠం చూపడమే! అమ రావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ‘హస్తం’లో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే! క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నాలుగు వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28వ తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నేడు కాంగ్రెస్‌లోకి జూపల్లి, కూచుకుళ్ల
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పారీ్టలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ తదితరులు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం వీరంతా ఢిల్లీ వెళ్లారు. లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి తదితరులు పారీ్టలో చేరుతారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. వీలైతే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేక ప్రియాంకాగాంధీ ఈ చేరిక కార్యక్రమానికి రావొచ్చని అంటున్నారు. ప్రియాంకా సమక్షంలో చేరాల్సి ఉన్నా.. వాస్తవానికి, కొల్లాపూర్‌లో జరగాల్సిన బహిరంగసభలో ప్రియాంకాగాం«ధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పారీ్టలో చేరాల్సి ఉంది. కానీ, ఇప్పటికే రెండు సార్లు ఈ సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ సభ ఇక రద్దయినట్టేనని తెలుస్తోంది. అయితే సభ రద్దు కాలేదని, ఈనెల 7–14 తేదీల్లో ప్రియాంకాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాకు వస్తారని కానీ పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకే ఖర్గే సమక్షంలో జూపల్లి అండ్ టీం ఢిల్లీ వెళ్లి పారీ్టలో చేరుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ ‘జోష్’..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు. కలిసికట్టుగా.. కర్ణాటక కాంగ్రెస్‌తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. జోడో యాత్రపై ఆశలు కర్ణాటకలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణలోనూ రాహుల్ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి. నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగపల్లి, పఠాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్నిచి్చందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
తెలంగాణలో 'కర్ణాటక వ్యూహం'.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిన బీజేపీ కంచుకోటను భారీ మెజారిటీతో బద్దలుకొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టింది. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అడుగులు ప్రారంభించనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుభూతి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కన్నడ నాట ఫలించిన వ్యూహాలను కూడా ఉపయోగించాలని అధిష్టానం యోచిస్తోంది. కన్నడ కాంగ్రెస్‌లో కొదమ సింహాలైన డీకే శివకుమార్, సిద్దరామయ్యలను ఒకేతాటిపైకి తెచ్చి పార్టీలో ఐకమత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధంగానే తెలంగాణలో నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చేలా శ్రేణులకు సంకేతాలు పంపుతోంది. సగానికిపైగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటంబపాలన, కుంభకోణాలపై బీఆర్ఎస్ను ఎండగడుతూనే పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా.. అంతర్గత కుమ్ములాటలు, పలువురు ముఖ్యమంత్రుల అభ్యర్థులు, నేతల మధ్య ఐకమత్యం లేకపోవడం... ఇదీ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే ముందుగా పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని అధిష్టానం డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు సంకేతాలు పంపింది. వేర్వేరు పాదయాత్రలు, వేర్వేరు సభలు పెడుతూ కేవలం పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసింది. ఎన్నికల తేదీకి ముందుగా ఇద్దరు బడా నేతల్ని ఒకే వేదికపైకి తెచ్చి పార్టీలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవని సంకేతాలు పంపింది. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ఐకమత్యం లేకపోవడాన్ని గుర్తించి అధిష్టానం తొలిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సీనియర్లందరికీ వేర్వేరు టాస్్కలు అప్పగించి పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశం చేయనుంది. ముఖ్యమంత్రి అభ్యరి్థని కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటించేందుకు సిద్ధమైంది. కుమ్ములాటలను ప్రోత్సహించే నేతలకు ముందుగానే చెక్ పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అవినీతి.. ఉద్యోగ కల్పన తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకెళ్లొచ్చని అధిష్టానం భావిస్తోంది. ప్రాజెక్టుల పేరిట చేస్తున్న అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా.. దీన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలోనూ బీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో కుటుంబ పాలనకు తెర దించి అధికారంలోకి వచ్చేలా శ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాల్లో ఒకటైన ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని మేనిఫెస్టోలో ఉద్యోగ కేలండర్‌ను పొందుపరచాలని భావిస్తోంది. ముందుగానే ప్రకటన అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఒక అడుగు ముందు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో 100 స్ధానాలు ప్రకటించినట్లే.. తెలంగాణలో నూ కనీసం 60 స్థానాల్లో ప్రకటించేందుకు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది. ఏకాభిప్రా యం ఉన్న చోట్ల అభ్యర్థులను ముందుగా ప్రకటించి కదనరంగంలో ముందడుగు తమదేనని శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తోంది. అభ్యర్థుల విషయానికొస్తే ప్రజల్లో గుర్తింపు ఉన్న గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. మరింత ఉత్సాహంగా గర్జనలు తెలంగాణ కాంగ్రెస్ యువ గర్జన, దళిత–గిరిజన గర్జన, రైతు గర్జన అంటూ వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పింది. ఆయా వర్గాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెబుతూ వారికి దగ్గరయ్యే యత్నాలు ప్రారంభించింది. త్వరలోనే మహిళా గర్జన, యువ గర్జన, మైనారిటీ గర్జనలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి సమాయత్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ప్రభుత్వం ఉంటుందన్న విశ్వాసం నెలకొనేలా మేనిఫెస్టో రూపొందించేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించనుంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహల్‌గాంధీ తెలంగాణలో రాజకీయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల పనితీరు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల విషయాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలు, మైనార్టీల మొగ్గు, ఓబీసీల జనగణన వంటి అంశాలపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యలో ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో ఆగారు. కొద్దిసేపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్‌చౌదరిలు పాల్గొన్నారు. జాతీయ నాయకులొస్తే బాగుంటుంది.. రాష్ట్రంలో హాథ్‌సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరు గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు. యాత్రలు బాగా జరుగుతున్నాయని, అయితే వీటికి జాతీయ స్థాయి నేతలు హాజరయితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి కోరినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్ పారీ్టవైపు మరల్చుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను అమలు చేస్తారన్న దానిపై కూడా రాహుల్ చర్చించారు. బీజేపీ కార్యకలాపాలపై కూడా ఆరా తీశారు. మైనార్టీలు.. ఓబీసీల జనగణన.. ముఖ్యంగా రెండు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో మైనారీ్టల మూడ్ ఎలా ఉందని, ఆ వర్గాలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశముందని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలోని మైనారీ్టలు ఎక్కువగా ఎంఐఎం వైపే ఉంటారని, గ్రామీణ జిల్లాల్లోని మైనార్టీలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్కు అండగా ఉంటారని రాష్ట్ర నేతలు తెలిపారు. అయితే బీజేపీపై కాంగ్రెస్ పోరాటం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు లాంటి అంశాల నేపథ్యంలో ఈసారి మైనార్టీల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మరలే అవకాశముందని నేతలు వివరించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఓబీసీల జనగణన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జనగణనకు కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజలకు చెప్పాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధానం అనుకూలంగా ఉన్నందున అన్ని రాష్ట్రాల పీసీసీలతో తీర్మానాలు చేయించాలని, దీంతో ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ పారీ్టకి సానుకూలంగా మారే అవకాశం ఉందని యాష్కీ సూచించగా, రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. 30–35 నిమిషాల పాటు రాష్ట్ర నేతలతో మాట్లాడిన రాహుల్.. శాండ్విచ్ తిని, తేనీరు సేవించి ఢిల్లీ వెళ్లారు. చదవండి: ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా నేతలు.. అసమ్మతిపై బీఆర్ఎస్ ఆరా! -
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.. ఆద్యంతం భట్టికి ఆత్మీయ అనుబంధమే
మంచిర్యాల టౌన్/ మంచిర్యాల రూరల్ (హాజీపూర్): హాథ్‌సే హాథ్ జోడో యత్ర కొనసాగింపులో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా పిప్రి వద్ద షురూ అయిన ఈ యాత్ర 31 రోజుల పాటు సాగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి భట్టి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్సవ విగ్రహంలా ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మంచిర్యాల అ భివృద్ధికి నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మె ల్యే విఫలమయ్యారని ఆరోపించారు. గోదావరి బ్యా క్ వాటర్ వచ్చి, రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోయినా నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికి పరిహారం ఇవ్వకుండా, ఉత్సవ విగ్రహంలా దివాకర్‌రావు ఉన్నారని విమర్శించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు. పనిచేయని ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. యాత్రలో పాల్గొన్న జనం మాకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. పనిచేసే వారు, ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకులే మనకు కావాలన్నారు. అధికారంలో ఉ న్నా, లేకపోయినా ప్రజల కోసం తపించే నా యకు డు ప్రేమ్‌సాగర్‌రావు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కో రారు. చేతగాని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. సమస్యలు తెలుసుకుంటూ... పాదయాత్రలో భాగంగా మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో దోస, పండ్లు అమ్ముకునే వారిని భట్టి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేదరివాడలో వెదురు బుట్టలు, చాటలు తయారు చేసి అమ్ముకునే బొల్లం రజితతో మాట్లాడగా, తాను బీఈడీ చదివానని చెప్పింది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోగా, డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు సైతం ఇవ్వడం లేదని చెప్పింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే కులవృత్తులకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని భట్టి తెలిపారు. హాజీపూర్ మండలంలో ఘన స్వాగతం.. పాదయాత్ర హాజీపూర్ మండలం వేంపల్లికి చేరగానే స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భట్టితోపాటు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీటీసీ డేగ బాపు దంపుతులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతీయ రహదారి మీదుగా ముల్కల్ల, గుడిపేట వరకు యాత్ర చేశారు. గుడిపేటలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత గుడిపేట గోదావరి రోడ్ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీదుగా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. భట్టి విక్రమార్క పాదయాత్రలో స్థానికులకు అభివాదం చేస్తూ కలిసిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని, నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, భూములు కోల్పోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కటింగ్.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కట్ చేశారు. మత్స్యకారులు భట్టికి చేపల వల అందజేశారు. అనంతరం భట్టి పాదయాత్రకు ప్రాజెక్ట్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు భట్టికి జిల్లాలోకి స్వాగతం పలికారు. పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, రఘునాథ్‌రెడ్డి, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఒడ్డె రాజమౌళి, ఎంపీటీసీ బాలరాజు, నాయకులు సురేందర్, కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు. -
Telangana Congress: ఠాక్రే మంతనాలతో కాంగ్రెస్ మూడ్ ఛేంజ్!
సాక్షి, హైదరాబాద్: కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న స్ఫూర్తితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నియామకమైన తర్వాత రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన ఆయన.. నేతలను కూర్చోబెట్టి మంతనాలు జరపడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో విడివిడిగా, సామూహికంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు, అంతర్గత విభేదాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనకు పూర్తి అవగాహనకు వచ్చినట్టేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఆయన చర్యల ఫలితంగానే రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడ్ మారిందని, నేతల్లో విభేదాలు దూరం అవుతున్నాయని చెప్తున్నాయి. రెండో దశ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యటించిన ఠాక్రే ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలపై దృష్టి కేంద్రీకరించినా.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ నేతలను సన్నద్ధం చేసే పనికి కూడా శ్రీకారం చుట్టారని అంటున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల్లో మూడో దఫా పర్యటనకు రానున్నారని చెప్తున్నాయి. మీ వంతుగా ఏం చేశారు.. ఏం చేస్తారు? తొలి పర్యటనలో పార్టీ సీనియర్లతో విడివిడిగా భేటీ అయిన ఠాక్రే.. తాజా పర్యటనలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు. కీలకమైన టీపీసీసీ ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. పార్టీ బలంగా ఉందని, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, పార్టీలో ప్రాధాన్యత కావాలని కొందరు నేతలు చెప్పడాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ విషయాలన్నీ తాను చూసుకుంటానని, మీ వంతుగా ఏం చేశారు, ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించినట్టు సమాచారం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో మీ టీంలు ఏం పనులు చేస్తున్నాయో చెప్పాలని నేతలను అడిగినట్టు తెలిసింది. తొలుత ఎన్నికలకు సిద్ధమయ్యే దిశలో తమ కమిటీలు, బృందాలను సిద్ధం చేసుకోవాలని.. క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఠాక్రే తన రెండో పర్యటనలోనే బహిరంగ సభకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. చదవండి: రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా? -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల నిధుల విషయంపై ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా కోసం బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సమయం రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగింది. అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు.. రేవంత్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ధర్నా విషయంపై మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్పంచ్ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. నిధులు కాజేసిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఇదీ చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్ -
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, మల్లురవి సహా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలను సోమవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్‌లు చేపట్టారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాకు అనుమతులు లేవని, ఎవరైనా బయటకువచ్చి నిరసనలు చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీలకు నిధుల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని, సర్పంచులందరినీ ఏకం చేయాలని నేతలకు సూచించింది. అయితే, ఈ ధర్నాలకు పోలీసులు అనుమతులు లేవని తెలపడం, గృహనిర్బంధం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధర్నాను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’ -
దిద్దుబాటు ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లాక పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అధిష్టానం దూతగా వచ్చిన ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది. దిగ్విజయ్ పర్యటన అనంతరం హైలెవల్ కమిటీ ఆయనతో సమావేశమవుతుందని, ఆ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర నేతలను ఒప్పించాకే దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే అందరినీ మూకుమ్మడిగా రమ్మంటారా? లేక విడివిడిగా పిలిచి మాట్లాడతారా? అన్నదానిపై స్పష్టత రాలేదు. మొత్తంమీద త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని, మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్థానంలో కొత్తగా సీనియర్ నాయకుడిని పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ మాటల ఆంతర్యమేంటో? కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్‌కు పెద్ద బాధ్యతే అప్పగించిందని ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడితే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ హెచ్చరించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించడం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని నిర్వర్తించడంలో వయసుతో పనిలేదని, అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని వెళ్తే విజయవంతం కావచ్చని ఆయన ఇచ్చిన సలహా రేవంత్ వ్యవహారశైలిని ఉద్దేశించి చేసిందేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఉన్నతస్థాయి కమిటీకి దిగ్విజయ్ నివేదిక! తన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులను అవగాహన చేసుకున్న దిగ్విజయ్‌సింగ్... పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల్లోని అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నివేదిక ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వచ్చాక 54 మందికిపైగా నేతలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి దిగ్విజయ్ ఇచ్చిన నివేదికలో ఆయన పలు సిఫారసులు కూడా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిఫారసుల అమలుపై చర్చించడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను త్వరలో ఢిల్లీకి పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
Telangana: వార్ రూం ఇష్యూ.. కాంగ్రెస్‌కు మేలా? కీడా?
వార్ రూమ్ ఇష్యూ టీ.కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వార్ రూమ్‌లో సోదాలు చేసి తెలంగాణ సర్కార్... కాంగ్రెస్‌కు ఆయుధం తానే ఇచ్చిందా? వచ్చిన ఆయుధాన్ని హస్తం పార్టీ నేతలు వాడుకుంటారా? తమ ఆధిపత్య పోరాటాలతో జార విడుచుకుంటారా? వార్ రూమ్ ఆందోళనలో టీ.కాంగ్రెస్ నేతలంతా ఎందుకు పాల్గొనలేదు? చేయి కాలుతూనే ఉంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ తెలంగాణ కాంగ్రెస్‌కు సానుకూలంగా వార్తలు రావడం అరుదైన అంశంగా మారిపోయింది. పార్టీ బాగు మరచి కొట్టుకుంటున్న నాయకులు..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..మీడియాలో ఒకరి మీద ఒకరి విమర్శలతో గాంధీభవన్ హోరెత్తిపోయేది. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వంటి ఎన్నో అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌కు నెగిటివ్‌గా మారాయి. కొంతకాలం నుంచి కారు, కమలం పార్టీల మధ్య నడుస్తున్న వార్..రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న సందేహాన్ని కూడా ప్రజల్లో కలిగిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక పార్టీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకున్నారు. సునీల్ టీమ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సైబరాబాద్ పోలీసులు ఆయన కార్యాలయం అయిన కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని అక్కడి సిబ్బందిని అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ భగ్గుమంది. రాష్ట్ర మంతా కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఒక్క రోజే హడావిడా? పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిని టీ.కాంగ్రెస్ సకాలంలో సక్రమంగానే ఉపయోగించుకోగలిగింది. అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదనే యాంగిల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు నాయకులు. దాడి జరిగిన రోజు రాత్రంతా సునీల్ ఆఫీస్ లో షబ్బీర్ అలీ, మల్లురవి, హైదరాబాద్ నగర నాయకులు పోలీసుల తీరుపై ఆందోళన చేసారు. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. చాలా కాలంగా మీడియాలో పాజిటివ్ వార్తలే లేని కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం బాగా ఉపయోగపడింది. ఆ రోజంతా మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన వార్తలు కనిపించాయి. ఇంట్లోనే పెద్ద వార్ ఇక కొందరు నేతలు మినహా మిగతా వారంతా కాంగ్రెస్ వార్ రూమ్‌లో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వరకు కమిటీల ఏర్పాటు గురించి పార్టీలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సునీల్ అంశం తెరపైకి వచ్చి కాంగ్రెస్‌కు మేలు చేసింది. అయితే కొందరు నేతలు అసలు విషయాన్ని పక్కన పెట్టి సునీల్ అంశాన్ని ఎత్తుకున్నారంటూ కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు సునీల్ ఎవరు అంటూ కొందరు.. వార్ రూమ్ అయితే గాంధీ భవన్ లో ఉండాలి కానీ బయట ఎందుకు ఉందని ఇంకొందరు.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులు చర్చకు రాకుండా చేయడానికే అని మరికొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. వార్ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడిని ఒక అంశంగానే కొందరు నేతలు పరిగణించకపోవడం విశేషం. అర చేతికి అయిదు వేళ్లు, ఏ ఒక్కరికి కలవని దారులు ఒక సీరియస్ విషయంలోనే విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక ముందైనా కలిసి పనిచేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఇలాగే పలు అంశాలపై నాయకులంతా ఏకమైనా...అది తాత్కాలికమే అని నిరూపించారు. పార్టీ ఒకటైనా ఎవరి వ్యవహారం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వార్ రూమ్ ఇష్యూని కాంగ్రెస్ నేతలు ఏమేరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం.. దిద్దుబాటలో డిగ్గీరాజా
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ తీరును నిరసిస్తూ పలువురు సీనియర్లు పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలను దిగ్విజయ్‌కు సమర్పించారని, కోవర్టులంటూ జరిగిన ప్రచారం, కమిటీల్లో ప్రాధాన్యంపై ఫిర్యాదు చేశారనే సమాచారం ఓవైపు.. ఇదే సమయంలో రేవంత్ వల్ల రాష్ట్ర పార్టీలో ఊపు వచ్చిందంటూ ఆయనను సమర్థించే నేతలు వివరించారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపాయి. అసలు దిగ్విజయ్ ఏ సమాచారం సేకరించారు, అధిష్టానానికి ఏం చెబుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గాంధీభవన్‌లో డిగ్గీరాజా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. ఉస్మానియా విద్యార్థి నేతలు చేసిన రచ్చ, దానిపై దిగ్విజయ్ ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం కూడా పలువురు నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. మీడియా సమావేశంలో ఏం చెప్తారోనని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పది గంటలు.. సుదీర్ఘ భేటీలు బుధవారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కొందరు నేతలు ఉదయమే హోటల్ వద్ద కలిసి మాట్లాడారు. తర్వాత గాంధీభవన్‌లో సీనియర్లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల వరకు.. అంటే దాదాపు పది గంటల పాటు విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీలో పరిణామాలు, చక్కదిద్దే చర్యలపై అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థి నేతల రచ్చ.. దిగ్విజయ్ పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్న సమయంలోనే ఓయూ విద్యార్థి నేతలు తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గాంధీభవన్ వద్ద నినాదాలు చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరికొందరు నాయకులకు.. విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీనిపై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌లో ముసలం: రేవంత్‌రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు
సాక్షి, కాంగ్రెస్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్తగా ఏర్పాటైన కమిటీలు కాకరేపుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం లభించలేదంటూ సీనియర్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఉన్న సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారేనని, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ తమదేనని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కొత్త కమిటీలపై తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త కమిటీలు, నేతల అసంతృప్తిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో టీకాంగ్రెస్ నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీపై మీడియాతో మాట్లాడారు సీనియర్ నేతలు. ‘కమిటీల్లో అన్యాయం జరిగిందని చాలా మంది చెప్పారు. అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవటం ప్రతి ఒక్కరిపై ఉంది. సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు సాగాలని నేతలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కొందరు కావాలనే బలమైన నేతలు, పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చర్చకు వచ్చింది.’ అని తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే: ఉత్తమ్ సీఎల్పీ నేత ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కాంగ్రెస్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీ ప్రకటించినట్లుంది. 108 మందిలో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. సోషల్ మీడియాలో నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. కొంత మంది అసత్యప్రచారం చేయిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవారు చేయలేనిది రేవంత్ చేస్తారా? అధిష్టానానికి అవగాహన లేకుండానే కొందరు చెబితే కమిటీ వేశారు. ఒరిజినల్ కాంగ్రెస్‌ను కాపాడుకోవడమే మా లక్ష్యం. కావాలని సోషల్ మీడియాలో మాపై బురదజల్లుతున్నారు. సీఎల్పీ నేతను అవమానిస్తున్నారు. ’ అని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో అప్పుడు చెబుతాను.. ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి! -
మీరు పాదయాత్ర అంటే.. వాళ్లు బస్సు యాత్ర అంటారట!
మీరు పాదయాత్ర అంటే.. వాళ్లు బస్సు యాత్ర అంటారట! మీరు బస్సుయాత్ర అంటే వాళ్లు పాదయాత్రకు ప్రిపేర్ అవుతారట సార్!! -
కాంగ్రెస్ ‘సామాజిక అస్త్రం’.. రాజ్యాంగ పరిరక్షణ కవాతు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కవాతు (సంవిధాన్ బచావో మార్చ్) నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా 2 వారాలపాటు కవాతు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 4న కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 3వ వారం తర్వాత.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ లోకి రావాల్సిన యాత్ర 3–4 రోజులు ఆల స్యం కావొచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబు తున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1లోగా ఏదో ఒకరోజు తెలంగాణలోకి యాత్ర వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ యాత్ర కనీసం 13 రోజులపాటు జరగ నుంది. అంటే నవంబర్ మూడో వారం వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో జరగనుండగా ఆ తర్వాత 75 కి.మీ. రాజ్యాంగ పరి రక్షణ కవాతు ప్రారంభించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నూ ఇలాంటి యాత్రలు చేపడుతున్నారని, అయితే తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రా లకు భిన్నంగా కవాతు నిర్వహించాలనేది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం టీపీసీసీకి అనుబంధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్, వృత్తి దారులు, కిసాన్, ఫిషర్మెన్ సెల్‌లను భాగ స్వాములను చేస్తూ యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. అన్యాయాన్ని వివరించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ హయాంలో ఆయా వర్గాలకు ఇచ్చి న ప్రాధాన్యం గురించి చెప్పడంతోపాటు బీజేపీ, టీఆర్ఎస్ల హయాంలో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివ రించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని, భారత్ జోడో యాత్రకు ఎంత ప్రాధాన్య మి చ్చామో సామాజిక కవాతుకూ అంతే ప్రాధా న్యమిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కవాతు ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వచ్చే నెల 4న హైదరా బాద్‌కు రానున్నారు. ఈ సమావేశానికి హాజ రుకావాలంటూ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌లకు ఏఐసీసీ సమన్వయకర్త కొప్పుల రాజు లేఖలు కూడా రాశారు. ఈ సమావేశంలోనే కవాతు ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలి, ముగింపు సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభకు ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై స్పష్టత రానుంది. -
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఈడీ నోటీసులు..!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను ప్రశ్నిస్తారనే అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో వీరికేం సంబంధమన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఇంతకుముందే కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్‌కు తాము ఇచ్చిన విరాళాలపై ఈడీ ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు కూడా. మొదట నలుగురికి! రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పార్టీ పొలిటికల్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నా యి. ఈ ప్రచారం పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన రేపుతోంది. అయితే ఈ నేతలు ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్తున్నారు. మరోవైపు ఈ నలుగురితోపాటు కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మరికొందరికి కూడా హెరాల్డ్ కేసులో నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. ముందు కొందరు.. తర్వాత మరికొందరు.. వచ్చే నెల 10వ తేదీన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆ తర్వాతిరోజు షబ్బీర్ అలీ ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఆ తర్వాతి దశలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లను ఈడీ విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2005 అండర్ సెక్షన్ 50 కింద నోటీసులు ఇస్తున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు రాలేదు.. వస్తే గర్వంగా వెళ్తాం: అంజన్‌కుమార్ తమకు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ చెప్పారు. తాను నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం రూ.20 లక్షలు విరాళం చెక్ రూపంలో ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బుకు ట్యాక్స్ కూడా కట్టానని, ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఏమాత్రం భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో తనను ఈడీ పిలిస్తే గర్వపడతానని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన కేసులో తనను కూడా పిలవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్తా: సుదర్శన్‌రెడ్డి నేషనల్ హెరాల్డ్‌కు నాలుగు నెలల క్రితం రూ.15 లక్షల విరాళం ఇచ్చానని, అది పన్ను కట్టిన డబ్బేనని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వస్తే దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు చెప్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎప్పుడు పిలిచినా వెళ్తా..: గీతారెడ్డి తాను నేషనల్ హెరాల్డ్‌కు కొంత మేర చెక్ రూపంలో విరాళం ఇచ్చానని.. ఈ కేసులో ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి గీతారెడ్డి చెప్పారు. పార్టీలో చాలా పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్లిన వాళ్లకు సిగ్గు వచ్చేలా ధైర్యంగా వెళ్లి విచారణ ఎదుర్కొంటానని తెలిపారు. తాను ఇచ్చిన డబ్బుకు లెక్కాపత్రం అన్నీ ఉన్నాయన్నారు. -
కాంగ్రెస్ నేతలపై ‘కన్ను’గోలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రనేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేది కలు తెప్పించుకుంటోంది. ఇందుకోసం పార్టీ పక్షాన నియ మించిన సునీల్ కనుగోలు రిపోర్టులు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో నేతలు ప్రజల్లో ఏ మేరకు ఉంటున్నారు... పార్టీకి ఇంకా పట్టురావా ల్సిన ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనే అంశా లను ఫోకస్ చేస్తూ సునీల్ ఈ నివేదికలు తయారు చేసి అధిష్టానానికి పంపిస్తున్నారని సమాచారం. ఈ నివేదికలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ద్వారా అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి వెళుతున్నాయని సమాచారం. ‘రచ్చబండ’పై రోజువారీ నివేదికలు రాహుల్ సమక్షంలో మే ఆరో తేదీన వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏ మేరకు ప్రజ ల్లోకి వెళ్లిందన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈ డిక్లరేషన్‌ను రాష్ట్రంలోని 12 ఏళ్ల బాలుడికి కూడా అర్థమయ్యేలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ రాష్ట్ర నేతలను ఇదివరకే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నెలరోజులపాటు పల్లెపల్లెకు కాంగ్రెస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్ర మాలను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను రైతులకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయాలను తెలియజేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై సునీల్ ప్రతిరోజు నియోజకవర్గాలవారీగా వివరాలను ఏఐసీసీకి పంపించారు. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత రైతు రచ్చబండల నిర్వహణపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో ఈ నెల 21తో ముగియాల్సిన ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగించారని తెలిసింది. రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మమూ అదే... ఏఐసీసీ ఆలోచనలకు అనుగుణంగానే శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ‘నాయకులు పనిచేయకపోతే పదవులు రావు. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావు. గ్రామాల్లో తిరగాలి. ప్రతి గడపా తట్టాలి. పెద్ద నాయకులు బాగా పనిచేస్తుంటే, కాబోయే నేతలు ప్రజల్లో తిరగడంలేదు. ఎప్పటికప్పుడు ఏఐసీసీకి నివేదికలు వెళుతున్నాయి. ప్రజల్లో నిత్యం ఉండే నాయకులకే పదవులు వస్తాయి’అన్న రేవంత్ వ్యాఖ్యల వెనుక మర్మం కూడా ఇదేనని తెలుస్తోంది. -
యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతోష్
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధా న కార్యదర్శిగా వికారా బాద్‌కు చెందిన సంతోష్ కోలుకుండను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కొత్తగా 10 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 49 మంది జాతీయ కార్యదర్శులు, 9 మంది సం యుక్త కార్యదర్శులు, 8 భిన్న విభాగాలకు చైర్మన్లను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. నల్లగొండకు చెందిన మమత నాగిరెడ్డి, మంచి ర్యాలకు చెందిన శ్రవణ్‌రావు, వరంగల్‌కు చెందిన సాగరిక రావులతో పాటు ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బి.రమేశ్ బాబులను జాతీయ కార్యదర్శులుగా నియమించారు. -
రాష్ట్రంలో ఒకరు పాదయాత్ర.. మరొకరు మోకాళ్ల యాత్ర
సాక్షి,సిద్దిపేట: రాష్ట్రంలో అధి కారానికి ఒకరు పాదయాత్ర, మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని, ఎవరెన్ని గిమ్మి క్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విశ్వసించరని, తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు మన రాష్ట్రంలోని పథకాలు కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటోం దని ఆయన ఆరోపించారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభు త్వం దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరిం చారు. అమర్నాథ్ యాత్రికులకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గతంలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో ఇచ్చేవారని, ఈ ఏడాది నుంచి నిజామాబాద్, ఆదిలా బాద్ ఆస్పత్రుల్లో కూడా ఇస్తామని మంత్రి వెల్లడించారు. -
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ: జానారెడ్డి
దామరచర్ల(మిర్యాలగూడ): ఎన్నికల్లో రైతులకు ఇచి్చన ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమలు చేయకుండా రైతులను దగా చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మాజీమంత్రి గీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్లను దండుకుంటోందని ఆరోపించారు. జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే గారడీ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని, దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూపంపిణీ, దళితబంధు వంటి వాటిని విస్మరించిందని విమర్శించారు. -
ముందే చెబితే ‘చెయ్యి’స్తారేమో?
సాక్షి, హైదరాబాద్: చింతన్ శిబిర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చింతలు తెచ్చి పెట్టేలా ఉంది. మేధోమథనం పేరుతో ఈనెల 1, 2 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చేసిన రాజకీయ తీర్మానాలపై ఆ పారీ్టలోనే అంతర్మథనం జరుగుతోంది. నేతల మధ్య పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆరు నెలల ముందే ప్రకటించాలంటూ చేసిన తీర్మానం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. గత అనుభవాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ తీర్మానం అమలుకు నోచుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరు నెలల ముందు అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ అభ్యర్థి పార్టీ కేడర్‌ను, నియోజకవర్గంలోని ప్రజలను ఆరునెలల పాటు ఎలా భరించగలడని ప్రశి్నస్తున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ కేడర్‌ను కాపాడుకోవడం ఆ అభ్యరి్థకి కత్తిమీద సామేనని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు. అభ్యర్థిని, పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం రాష్ట్ర నాయకత్వానికి కూడా సవాల్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందస్తు ఎన్నికలోస్తే.... ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ ముఖ్య నేతలే పలుమార్లు నొక్కి వక్కాణిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అవకాశముంటుంది. అంటే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. మార్చికి ఆరు నెలల ముందు అంటే ఈ ఏడాది సెపె్టంబర్ కల్లా అభ్యర్థులను ప్రకటించాలి. ఇందుకు కేవలం మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఇంత స్వల్ప సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడం ఎలా సాధ్యమనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏఐసీసీతో అయ్యే పనేనా? కాంగ్రెస్ పారీ్టలో అభ్యర్థుల ప్రకటన రాష్ట్ర స్థాయిలో జరగదు. వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఏర్పాటయ్యే ఏఐసీసీ కమిటీ రాష్ట్రంలో పార్టీ అభ్యరి్థత్వం కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే ఎన్నికల కమిటీ ఒక్కో స్థానానికి రెండు లేదా మూడు పేర్లు సిఫారసు చేసి ఏఐసీసీకి పంపాల్సి ఉంటుంది. అలా వెళ్లిన పేర్లలో ఒక పేరును ఖరారు చేసి ఏఐసీసీ అధికారికంగా అభ్యరి్థత్వాలను ప్రకటిస్తుంది. కాగా గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఏఐసీసీ ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన సందర్భం లేదని, ఏఐసీసీ నిర్వహించాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఆరు నెలల ముందు అభ్యర్థుల ప్రకటన ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ముఖ్య కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు, నేతల మధ్య పోటీ లేనివి 40కి పైగానే ఉన్నాయని, ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు క్లియరెన్స్ ఇస్తూ ఏఐసీసీ నుంచి మౌఖిక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని, దీన్నే ఆరునెలల ముందే అభ్యర్థుల ప్రకటనగా చెప్పొచ్చంటూ టీపీసీసీ ముఖ్య నేతలు చర్చించుకోవడం గమనార్హం. కాపీ కొడితే.. ఖతమే మూడు నెలల ముందే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చింతన్ శిబిర్‌లో చేసిన మరో తీర్మానం కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈ తీర్మానం అమలు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల సందర్భంలో సామాజిక పింఛన్లు, నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. గతంలో ఉన్న దానికంటే పెంచి నెలకు రూ.2,000, రూ.3,000 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మరో రూ.16 పెంచి తాము అధికారంలోకి వస్తే ఆ మేరకు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ఇస్తామన్న దాని కంటే కేవలం రూ.16 ఎక్కువ ఇస్తామని ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందింది. రైతు రుణ మాఫీ విషయంలో తప్ప మిగిలిన చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మించే విధంగా టీఆర్ఎస్ ఆ ఎన్నికలలో హామీలు ఇవ్వగలిగింది. ‘ఎన్నికలకు మూడు నెలల ముందే మేనిఫెస్టో ప్రకటించి ఉపయోగం ఏముంటుంది. పైగా ఇతర పారీ్టలు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తాయి. అందువల్ల మేనిఫెస్టోలోని కీలకాంశాలను సమయానుకూలంగా ప్రకటించడమే మంచిది.’అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘50 ఏళ్ల లోపు’పైనా చర్చ 50 ఏళ్లలోపు వారికి పారీ్టలోనూ, ఎన్నికల్లోనూ ప్రాధాన్యమివ్వాలనే అంశం కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో.. ఆ మాటకొస్తే రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీలోనూ 50 ఏళ్ల కన్నా తక్కువ వయసుండి ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉన్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది కూడా ఉండరని, పైగా కాంగ్రెస్ పారీ్టలోని సీనియర్లు, అనుభవజ్ఞులను కాదని ఈ ప్రతిపాదన అమలు ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సోనియా, రాహుల్‌కు ప్రజలు అండగా ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రపూరితంగా ఈడీ నోటీసులు ఇప్పించిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇప్పించినంత మాత్రాన దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ వారసులు భయపడతారా? అని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ‘1978 నవంబర్‌లో ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నికైనప్పుడు అధికారంలో ఉన్న జనతా పార్టీ కక్షపూరితంగా వ్యవహరించింది. కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పేరిట ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించి అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత దేశం మొత్తం తిరగబడి ఇందిరకు అండగా నిలబడింది. 1980లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని 350 సీట్లతో గెలిపించి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారు. ఇప్పుడు అదే తరహాలో సోనియా, రాహుల్‌లకు దేశ ప్రజలు అండగా నిలబడతారు’అని భట్టి తెలిపారు. -
సీబీఐ విచారణ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో బాలికపై అత్యాచార ఘటన దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, పూర్తిస్థాయి విచారణను సీబీఐకి అప్పగిం చాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అను బంధ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిం చేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు. సర్కారు తీరుతో డ్రగ్, పబ్ కల్చర్ టీఆర్ఎస్కు భజన చేసే వారికి పబ్‌ల అను మతి ఇస్తున్నారని.. పబ్ లైసెన్సులను ని యంత్రించకపోవడం వల్లనే రాష్ట్రంలో దారు ణ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారని నిలదీశారు. డ్రగ్స్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ‘మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు ధైర్యం గా ఫిర్యాదు చేసినా.. పోలీసుశాఖ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా.. నేరాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చూడాలని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం రొమేనియా బాలికపై రేప్ ఘటనను నిర సిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్ఎస్ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వ ర్యంలో శనివారం డీజీపీ కార్యాలయ ముట్ట డి చేపట్టారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్య క్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్ యువ జన కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు ఆందోళ నకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అనంతరం వెంకట్, సునీతారావు మీడియా తో మాట్లాడారు. బాలికపై అత్యాచారం విష యంలో రాజకీయ డ్రామా నడుస్తోందని వెంకట్ మండిపడ్డారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏం చేస్తున్నాయని సునీతారావు ప్రశ్నించా రు. పోలీసులకు గాజులు, చీరలు పంపిస్తా మని, వాటిని వేసుకుని ఇంట్లో కూర్చోవాల న్నారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి అమ్నీషియా పబ్ వద్ద ధర్నాకు దిగారు. పబ్‌ను సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. -
Nava Sankalp Shivir: అధికారంపై మథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శిబిర్ అనంతరం విడుదల చేసిన ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’లోని అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఆరు కమిటీలను నియమించారు. సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయం, సామాజిక న్యాయం, యువజనం పేరిట ఏర్పాటు చేసిన ఈ కమిటీలకు ఒక్కో దానికి సీనియర్ నేత కన్వీనర్‌గా 10 మంది సభ్యుల చొప్పున నియమించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి అంశంపై ఆయా కమిటీలు చర్చించి సభ్యుల అభిప్రాయాల మేరకు నివేదికను నవసంకల్ప్ శిబిర్ ముఖ్య కమిటీకి అప్పగించనున్నాయి. ఈ కమిటీ ఆ నివేదికలను రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ప్రవేశపెట్టి చర్చించి.. అనంతరం వాటిని పార్టీ పాలసీగా, చింతన్ శిబిర్ నిర్ణయాలుగా అధికారికంగా రెండోరోజు ప్రకటించనుంది. ఈ నివేదికనే 2023 ఎన్నికల్లో పార్టీ రూట్మ్యాప్గా తీసుకోనున్నారు. ఈ చింతన్ శిబిర్కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పర్యవేక్షకుడిగా హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఈ శిబిరంలో పాల్గొననున్నారు. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ఏఐసీసీ కమిటీల్లోని ఆఫీస్ బేరర్లు, మాజీ మంత్రులు, ఎంపీలకు ఈ సమావేశ ఆహ్వానం లభించింది. ప్రజల ఆకాంక్షల మేరకే..: భట్టి టీపీసీసీ ఆధ్వర్యంలో నవ సంకల్ప శిబిర్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కీసరలో నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేధోమథన శిబిర్ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, ముఖ్య నేతలు అద్దంకి దయాకర్, హజ్మతుల్లా, సునీతారావుతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్ర సాధన ఫలాలను అన్ని వర్గాలకు అందించేందుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో లోతైన అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు. ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రస్థాయిలో గాంధీ భవన్లో వేడుకలు నిర్వహించనున్నట్టు భట్టి తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులివ్వండి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోందని విక్రమార్క దుయ్యబట్టారు. తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేయించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ ఒత్తిడి చేసిన కారణంగానే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేసి సర్పంచ్‌లకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.