
కేసీఆర్ పై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరంగల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని టీకాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు టీకాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు అభ్యర్థుల వయసును సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టీకాంగ్రెస్ నేతలు భన్వర్లాల్ను కోరినట్లు తెలుస్తోంది.