bhanwarlal
-
వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!
Billionaire to Monk: సాధారణంగా ఎవరైనా కడు పేదరికం నుంచి సంపన్న జీవితం గడపాలని కలలు కంటారు. సంపన్న జీవితం వదిలి సన్యాసిగా బతకాలని మాత్రం ఎవరూ అనుకోరు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిని వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు. 'భన్వర్‌లాల్ రఘునాథ్ దోషి' (Bhanwarlal Raghunath Doshi) ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాజస్థాన్‌లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి రూ.30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం ప్రారంభించాడు భన్వర్‌లాల్. కొన్ని సంవత్సరాలలోనే వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధిస్తూ ఢిల్లీ కింగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. క్రమంగా ఎంతో నేర్పుతో తన వ్యాపారాన్ని రూ. 600 కోట్లకు విస్తరించాడు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరికతో కోట్ల సామ్రాజ్యం త్యజించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. అనుకున్న విధంగానే అహ్మదాబాద్‌లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో దోషి జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందాడు. ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దోషిని సత్కరించారు. (ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!) ఎప్పటినుంచో సన్యాసి కావాలని అనుకుంటున్న దోషి.. కుటుంబం, వ్యాపార లావాదేవీల వల్ల 1982లో తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశాడు. అనుకున్నది సాధించిన తర్వాత జైన మతం స్వీకరించారు. ఈ వేడుక 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో వైభవంగా జరిగింది. మొత్తానికి కోట్లు వదులుకుని జైన మతాన్ని స్వీకరించి ఎంతోమందికి ఆదర్శనీయుడయ్యాడు. -
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్.పి.సిసోడియాను నియమిస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్ సీఈవో అనూప్‌సింగ్ రెండు రాష్ట్రాలకు ఇన్చార్జి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. -
బన్వర్‌లాల్ పదవీ విరమణ రోజే తెరపైకి పాత వివాదం
-
ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి
నల్లగొండ : రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటెన్సివ్ రివిజన్ –2018 చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం వల్ల ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లు, ఒకే ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటెన్సివ్ రివిజన్లో నూతనంగా పోలింగ్ ఏరియాలను నిర్ధారించాలని సూచించారు. నవంబర్ 1నుంచి మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో బీఎల్ఓలు, ట్యాబ్లెట్ పీసీ ఆపరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని సూచిం చారు. ఇంటెన్సివ్ రివిజన్ 2018 చేపట్టే ముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. 01.01.2018ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఫొటో ఓటర్ల జాబితా రూపొందించాలని అన్నారు. 01.01.2018 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఫొటో ఓటరు జాబితా తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ నల్లగొండ మున్సిపాల్టీలో పూర్తి చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ మున్సిపాల్టీ, దేవరకొండ నగర పం చాయతీలో ప్రణాళికాబద్ధంగా చేపట్టను న్నట్లు వివరించారు. వీసీలో డీఆర్ఓ కీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, నల్లగొండ, దేవరకొండ ఆర్డీఓలు వెంకటాచారి, లింగ్యానాయక్‌పాల్గొన్నారు. -
భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు
-
మీ ఓటు రహస్యమే
-
లైవ్ వెబ్‌కాస్టింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-
భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు
సర్వేలను నిషేధించడం నిబంధనలకు విరుద్ధమని వాదన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, మాల్యాద్రి శ్రీరామ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతితో సమావేశమై.. నంద్యాల ఉపఎన్నికలో భన్వర్‌లాల్ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్న భన్వర్‌లాల్.. తాము చేసే ఫిర్యాదులను అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఆయన్ను బదిలీ చేసిందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిపై విపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సర్వేలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉప ఎన్నికపై సాక్షి దినపత్రిక, చానల్లో వస్తున్న కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలన్నారు. -
మీ ఓటు రహస్యమే
మీరు ఓటెవరికి వేశారో ఇతరులు ఎవరికీ తెలియదు నిర్భయంగా ఓటు వేయండి.. నంద్యాల ఓటర్లకు ఈసీ భన్వర్‌లాల్ పిలుపు - ఓటర్లు 92231 66166 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు - లైవ్ వెబ్‌కాస్టింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు - 23వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాక్షి, హైదరాబాద్: ఓటరు ఎవరికి ఓటు వేసింది ఇతరులకు తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదని, నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. తమకు నచ్చినవారికి, అభీష్టం మేరకు ఓటు వేయాలని సూచించారు. ఈ విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని పునరు ద్ఘాటించారు. సోమవారం హైదరాబా ద్‌లోని కార్యాలయంలో భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగు తుందని చెప్పారు. ఆరు గంటల సమయానికి పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో ఉన్న వారిని రాత్రి ఎన్ని గంటల వరకైనా ఓటేయడానికి అనుమతిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోపలా, బయట లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, పోలింగ్ తీరును అనుక్షణం పరిశీలిస్తారని భన్వర్‌లాల్ వివరించారు. ఎక్కడ ఏం జరిగినా ఎన్నికల సిబ్బంది క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారం ముగిసినందున స్థానికేత రులు నంద్యాల విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారు. భారీ బందోబస్తు: 2,500 మంది పోలీ సులు, ఆరు కంపెనీల పారామిలటరీ బలగా లు బందోబస్తులో పాల్గొంటున్నారని భన్వర్ లాల్ తెలిపారు. 82 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లంద రికీ ఓటింగ్ స్లిప్‌లు పంపామని, పోలింగ్ బూత్‌ల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించామని చెప్పారు. వికలాంగులకు ప్రత్యే క ఏర్పాట్లున్నాయని, అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించామని తెలిపారు. ఓటరు ఎవరికి ఓటు వేసిందీ ఇతరులెవరికీ తెలిసే అవకాశం లేదని, పోలిం గ్ బూత్‌లో ఓటరు తాను వేసిన ఓటును ఏడు సెకన్ల పాటు చూసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 15 వేలమంది ఓటర్లకు ఓటింగ్ స్లిప్ లు ఇవ్వలేదని, వీరిలో స్థానికంగా లేనివారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. చానళ్లపై నిఘా: రాష్ట్రంలోని 16 తెలుగు చానళ్లను 24 గంటలూ వాచ్ చేస్తున్నామని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రసారాలు చేసినా చర్యలు తప్పవని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, చర్చలను అనుమతించవద్దని ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలను కోరారు. పోలింగ్ ఫలితాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేసినా దాన్ని ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం కొనసాగుతుం దన్నారు. వీటినీ ఎన్నికల సిబ్బంది గమనిస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పారు. ఓటర్లు తమకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, పార్టీలు నిబంధనలు ఉల్లంఘించినా 9223166166 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేసినట్టు వచ్చిన ఫిర్యాదులపై భన్వర్‌లాల్ స్పందించారు. దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరిందని, తమకు అందిన వివరణతో జిల్లా కలెక్టర్ ఓ నివేదిక పంపారని, అయితే, దాన్ని మరోసారి పరిశీలించి నివేదిక పంపాలని ఆయన్ను కోరినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.16 కోట్ల నగదు సీజ్ చేశామని, 316 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
ప్రతీ బూత్కూ కేంద్ర బలగాలు
నంద్యాల ఉప ఎన్నిక నిర్వహణపై భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక జరిగే నంద్యాల శాసనసభ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌ల బందోబస్తుకు కేంద్ర బలగాలను దించుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లను వెబ్ కాస్టింగ్‌కు అనుసంధానం చేస్తామని, ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే మంత్రులైనా సహించమన్నారు. హైదరాబాద్‌లో గురువారం విలేకరులకు నంద్యాల ఉప ఎన్నిక ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఈ అసెంబ్లీ స్థానంలో మొత్తం 2,19,108 ఓట్లు ఉన్నాయని, ఈ నెల 5వ తేదీ వరకూ నమోదు చేసుకున్న ప్రతీ వ్యక్తిని ఓటర్ జాబితా పరిధిలోకి తెచ్చామన్నారు. ఆరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిపారు. అధికార దుర్వినియోగం సహించం అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని భన్వర్‌లాల్ హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పదాదికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ సమయంలో అధికార యంత్రాంగాన్ని వాడుకున్నా, వాహనాలు ఉపయోగించినా, ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేసినా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టే భావిస్తామని, వారిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని భన్వర్‌లాల్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీన్ని జిల్లా కలెక్టర్‌కు పంపామని, ఆయన రిమార్క్స్ వచ్చాక, తానూ వీడియోను పరిశీలించి, వాస్తవ పరిస్థితిని ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. -
నంద్యాలలో మంత్రుల తిష్టపై దృష్టి పెట్టాం: ఈసీ
నంద్యాల: ఎన్నికల నియమవళిని ఉల్లంఘిస్తే మంత్రులకైనా నోటీసులిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. నంద్యాలలో పెద్ద ఎత్తున మంత్రులు తిష్ట వేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. మంత్రుల పర్యటనను సుమోటోగా స్వీకరించామని, వారి పర్యటనపై దృష్టి పెట్టాలని తాము సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నంద్యాల ఉపఎన్నికలకు నేటితో(శనివారంతో) నామినేషన్ల గడువు ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన భన్వర్‌లాల్ ఈ ఉప ఎన్నికకు మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయని, చివరి రోజు 28 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు. ఈ నామినేషన్లను 7న పరిశీలించి, 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తామని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా.. విచారణ చేయమని కలెక్టర్ ఆదేశించినట్టు తెలిపారు. -
నంద్యాలలో మంత్రుల తిష్టపై దృష్టి పెట్టాం: ఈసీ
-
బోగస్ ఓట్లపై స్పందించిన భన్వర్‌లాల్
-
ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పడైనా రావచ్చు
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అధికారులకు సూచించారు. నంద్యాల ఉప ఎన్నికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులతో కర్నూలు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ స్థానం ఖాళీ అయి సెప్టెంబర్ 12 నాటికి ఆరు నెలలు ముగుస్తాయని, అందువల్ల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. ఓటరు నమోదులో డబుల్ ఎంట్రీలను నివారించడంలో విఫలమయ్యారని, వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. -
దొంగ ఓటర్లను చేరిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ తిరుపతి మంగళం :రాజకీయ నాయకులతో అధికారులు చేతులు కలిపి దొంగ ఓటర్లను చేరిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ హెచ్చరించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన యువతచే యుద్ధప్రాతిపదికన ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శనివారం చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎన్నికల అధికారులతో 2017 నాటికి ఓటర్ల జాబితా తయారీ.. 2017 శాసన మండలి ఎన్నికల్లో వివిధ కేసుల ఫిర్యాదులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి బూత్ లెవల్ అధికారుల నియామకం చేపట్టి ఓటర్ల జాబితా సవరణ చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సమగ్రంగా చేయాలన్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలై దొంగ ఓటర్లను చేరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్ల జాబితా, పేర్ల నమోదు, తప్పులపై స్థానిక రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి మార్పులు చేర్పులు జరపాలని సూచించారు. 2018 జనవరి, 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. యువతకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వోలు రజియాబేగం, సుబ్రమణ్యేశ్వరరెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఏవో అబ్దుల్ మునాఫ్ పాల్గొన్నారు. -
నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన లేదు
కాంగ్రెస్ నేతకు ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ లేఖ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన ఏదీ లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 9 జిల్లాల్లో ఉన్న డెల్టా ప్రాంతాల్లోని గిరిజనులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ట్రైఫెడ్ మాజీ చైర్మన్ ఎం.సూర్యానాయక్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఇటీవల లేఖ రాశారు. దీనికి ఎన్నికల అధికారి.. ప్రస్తుతానికి పునర్విభజన ప్రతిపాదన ఏదీ లేదని, భవిష్యత్తులో అలాంటిదేమైనా ఉంటే రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలిస్తామని సూర్యానాయక్కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. -
భద్రకాళిని దర్శించుకున్న భన్వర్‌లాల్
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. -
'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్
కసాపురం (గుంతకల్లు) : కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మలోల, తహసీల్దార్ హరిప్రసాద్, ఆలయ ఈఓ ముత్యాలరావులు, రెవెన్యూ సిబ్బంది భన్వర్‌లాల్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
కమనీయం.. రంగనాథుడి కల్యాణం
హిందూపురం అర్బన్ : అశేష భక్తజన వాహినీ మధ్య గుడ్డం రంగనాథస్వామి కల్యాణోత్సవం మంగళ వాయిద్యాల నడుమ శనివారం కమనీయంగా జరిగింది. గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించి బెంగళూరు నుంచి తీసుకువచ్చిన విశేష పుష్పాలంకరణలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు జ్యోతులతో ఆలయ ప్రదర్శన చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో ప్రాకారోత్సవంగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో కల్యాణ వేదికలో కొలువుదీర్చారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు అర్చకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సుగూరు, గుడ్డం ఆలయ కమిటీ «అధ్యక్షుడు ప్రభాకర్, మోహన్, అర్చకులు గోవిందశర్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష
హిందూపురం రూరల్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రే హిందూపురం చేరుకున్నారు. సమీక్ష అనంతరం ఆదివారం కసాపురం సందర్శించనున్నారని తహశీల్దార్ చల్లా విశ్వనాథ్ తెలిపారు. -
సీఈఓ బన్వర్‌లాల్ రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటారు. ఎనిమిది గంటలకు కసాపురం చేరుకుని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. 10.30 గంటలకు అనంతపురం చేరుకుని డీఈఓ, ఈఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి కదిరికి వెళతారు. రెండు గంటలకు అక్కడికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం 3.30 అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళతారు. -
చాకరిమెట్లలో బన్వర్‌లాల్ పూజలు
శివ్వంపేట: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ కుటుంబ సమేతంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామిని గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ పూర్ణకుంభంతో బన్వర్‌లాల్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఓటరు నమోదు కార్యక్రమం నిర్వమిస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాధాకిషన్‌రావు శర్మ, సిబ్బంది రామకృష్ణ ఉన్నారు. -
కోడ్ ముగిసింది: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థాని క సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియటంతో బుధవారం సాయంత్రం నుంచి కోడ్ నిబంధనలు తొలిగినట్లేనని చెప్పారు. స్థానిక కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పది స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందినట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో రెండు స్థానాలు, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కరొక్కరే అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఏకగీవ్రమైనట్లుగా విజేతలను ప్రకటించినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు పోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో 25 ఓట్లు చెల్లనివి ఉన్నట్లు గుర్తించి వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 13, నల్లగొండలో 6, మహబూబ్‌నగర్‌లో 4, ఖమ్మంలో 2 చెల్లని ఓట్లున్నట్లు చెప్పారు. త్వరలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక: నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానానికి నిర్వహించనున్న ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని భన్వర్‌లాల్ చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని అన్నారు. ఫిబ్రవరి 25లోగా ఈ ఎన్నిక జరగాల్సి ఉందని చెప్పారు ఏకగ్రీవమైన స్థానాలు: విజేతలు ఆదిలాబాద్: పురాణం సతీష్(టీఆర్ఎస్) నిజామాబాద్: భూపతి రెడ్డి(టీఆర్ఎస్) కరీంనగర్: నారదాసు లక్ష్మణ్‌రావు(టీఆర్ఎస్), టి.భానుప్రసాద్‌రావు (టీఆర్ఎస్) మెదక్: వి.భూపాల్‌రెడ్డి (టీఆర్ఎస్) వరంగల్: కె. మురళీధర్ర్రావు (టీఆర్ఎస్) ఓటింగ్ జరిగిన స్థానాలు: విజేతలు రంగారెడ్డి: పట్నం నరేందర్‌రెడ్డి (టీఆర్ఎస్), శంభీపూర్ రాజు(టీఆర్ఎస్) మహబూబ్‌నగర్: కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్ఎస్) కె.దామోదర్‌రెడ్డి(కాంగ్రెస్) నల్లగొండ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) ఖమ్మం: బాలసాని లక్ష్మీనారాయణ (టీఆర్ఎస్) -
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి ♦ అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ♦ ‘నోటా’కు ఒకటో ప్రాధాన్యత ఓటేస్తే తర్వాతి ప్రాధాన్యతలు చెల్లవు ♦ 145 మంది ఓటర్లకు పోలింగ్ సహాయకులు సాక్షి, హైదరాబాద్: నాలుగు జిల్లాల్లో ఆదివారం జరిగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు మున్సిపాలిటీల కార్పొరేటర్లు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఓటర్లుగా ఉంటారని తెలిపారు. నాలుగు జిల్లాల్లోని 19 రె వెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ప్రాధాన్యత కమంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఉదా రంగు(వాయిలెట్) స్కెచ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. ఓట్లను ప్రాధాన్యత క్రమంలో సంఖ్యల్లోనే రాయాలని, అక్షరాలు, గుర్తులు వాడితే ఓట్లు చెల్లకుండా పోతాయని వివరించారు. నిరక్షరాస్యులు, అంధులు, ఓటు హక్కు వినియోగించుకోలేని 145 మంది ఓటర్లకు సహాయకులను తీసుకెళ్లే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు సహాయకుల కోసం 509 మంది దరఖాస్తు చేసుకుంటే అర్హులైన 145 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 30వ తేదీన నాలుగు జిల్లాల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, ఖమ్మం, నల్లగొండలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగనుందని, రెండు స్థానాలు ఉన్న చోట కూడా ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుందని వివరించారు. నోటాకూ ఓటేసే అవకాశం మండలి ఎన్నికల్లో ‘నోటా’కు కూడా అవకాశం కల్పించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. బ్యాలెట్ పేపర్లో చివరన ‘నోటా’ గుర్తు ఉంటుందని, ఒకటో ప్రాధాన్యత ఓటు నోటాకు వేసి, 2, 3 ప్రాధాన్యత ఓట్లను వేరే అభ్యర్థులకు వేసినా చెల్లదని తెలిపారు. ఒకటో ప్రాధాన్యత ఓటు ఎవరైనా వేసి, రెండో ప్రాధాన్యత ‘నోటా’కు ఇస్తే ఒకటో ప్రాధాన్యత ఓటు చెల్లుతుందన్నారు. పోలింగ్ సందర్భంగా భద్రత కోసం రాష్ట్ర పోలీసులకు అదనంగా కేంద్ర బలగాలను రప్పించినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను 19 పోలింగ్ స్టేషన్లలో నియమించినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, ఓటు వినియోగించుకోవడం మినహా అన్నీ లైవ్ వెబ్కాస్ట్లో ఎన్నికల సంఘం పరిశీలిస్తుందన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ బయట కూడా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బోమన్నారు. ఓటు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రతి స్టేషన్లో పది ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాంపుల గురించి తమకు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీయగా... ఓటర్లు సొంత డబ్బులతో వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు తేలిందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఓటర్లను తీసుకెళ్లినట్లు రుజువులు చూపిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శిక్షించే అవకాశం ఉంటుందన్నారు. -
కేసీఆర్ పై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరంగల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని టీకాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు టీకాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు అభ్యర్థుల వయసును సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టీకాంగ్రెస్ నేతలు భన్వర్‌లాల్‌ను కోరినట్లు తెలుస్తోంది. -
'తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షల బోగస్ ఓట్లు'
మదనపల్లె రూరల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 56 లక్షల బోగస్ ఓట్లను గుర్తించామని, వీటన్నింటినీ త్వరలో తొలగిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అర్హులందరూ నవంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. వయస్సు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని చెప్పారు. ఓటరు కార్డులో మార్పులు సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించినట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి 4 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బూత్‌లెవల్ అధికారులు(బీఎల్వో) ఆయా పోలింగ్ సెంటర్ల వద్ద అందుబాటులో ఉంటారన్నారు. 2016 జనవరి 11న కొత్త ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారని తెలిపారు. అదే నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారని చెప్పారు. జిల్లాకు సరాసరి 2 నుంచి 3 లక్షల వరకు బోగస్ ఓటర్లను తొలగిస్తామని తెలిపారు. -
సీఈసీతో భన్వర్‌లాల్ భేటీ
ఓటర్ల సవరణపై నివేదిక అందజేత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటర్ల సవరణలపై నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీం జైదీతో భన్వర్‌లాల్ సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఓటర్ల సవరణ, తొలగింపు ప్రక్రియలో పాటిస్తున్న నిబంధనలను వివరించారు. జిల్లాలవారీగా తొలగించిన, తొలగించడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన జైదీకి తెలియచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉప ఎన్నికలపైనా చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి చేసిన ఫిర్యాదులపై భన్వర్‌లాల్ నుంచి సీఈసీ వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘గ్రేటర్’లో తొలగింపులు 6 శాతమే: భన్వర్‌లాల్ గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల తొలగింపు ఆరు శాతమేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. సీఈసీతో భేటీ అనంతరం భన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లో 26 శాతం తొలగింపులు జరిగాయని, నిజామాబాద్‌తో పోలిస్తే గ్రేటర్లో తొలగించింది ఆరు శాతమేనని, ఎక్కువ తొలగింపులు జరగలేదన్నారు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో చాలా తొలగింపులు ఉన్నాయన్నారు. ఓటర్ల తొలగింపులో నిబంధనలు పాటిస్తున్న విషయమై సీఈసీకి నివేదిక అందజేశామన్నారు. సనత్‌నగర్‌లో ఓటర్ల తొలగింపుపై చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓటర్ల తొలగింపునకు సంబంధించి కొంత ధ్రువీకరణ జరిగిందని, ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికపై ఎన్నికల సంఘం ప్రకటిస్తే అందరికీ తెలుస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై చర్యల విషయమై ప్రశ్నించగా.. ‘ఆ అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, కేవలం ఎన్నికలు నిర్వహించడమే మా పని’ అంటూ బదులిచ్చారు. టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ప్రశ్నించగా ‘టీఆర్ఎస్కు, నాకు సంబంధం ఎలా ఉంటుంది? నేను ఏపీ కేడర్ అధికారిని. అక్కడ టీఆర్ఎస్ పార్టీ లేదు కదా. తెలంగాణకు ఇన్చార్జి సీఈవోగా ఉన్నా. అధికారిగా సీఎం కేసీఆర్‌ను కలుస్తుంటా’ అని బదులిచ్చారు. -
ఓట్లు తొలిగింపు అవాస్తవం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అర్హులైన వారి ఓట్లు తొలగించినట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేయవచ్చని మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, ఆధార్ అనుసంధానం ద్వారా 89,085 నకిలీ ఓటర్లను గుర్తించామని చెప్పారు. నకిలీ ఓటర్లను మాత్రమే తాము తొలగించామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టంచేశారు. -
'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం'
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు అంశంపై కేంద్ర అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
పానకాల స్వామిని దర్శించుకున్న భన్వర్‌లాల్
మంగళగిరి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల నర్సింహాస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం మంగళగిరి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో భన్వర్‌లాల్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డీఆర్వో, ఆర్డీవో, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. -
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈనెల 15లోగా ఓటర్లందరూ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బోగస్ ఓటర్ల ఏరివేసేందుకు ఆయన ఈ ప్రక్రియ ప్రారంభించారు. అయితే, ప్రభుత్వ పథకాలకు ఆధార్‌తో ముడి పెట్టొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో.. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలన్న ఎన్నికల కమిషన్ ప్రాజెక్టుకు గండిపడింది. వేర్వేరు రాష్ట్రాలు లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఓటుహక్కు కలిగి ఉండేవారిని గుర్తించి, అలాంటి వాటిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అర్ధంతరంగా ఆగింది. తక్షణం ఈ ప్రక్రియను నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ నుంచి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే భన్వర్ లాల్ తాజా ఆదేశాలు జారీ చేశారు. -
'ఈనెల 15 లోగా ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి'
కరీంనగర్:ఈనెల 15లోగా ఓటర్లందరూ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా100 శాతం ఆధార్ అనుసంధానంతో మొదటి స్థానంలో ఉన్నట్లు భన్వర్ లాల్ తెలిపారు. నల్లొండ జిల్లా 87 శాతంతో రెండో స్థానంలో ఉండగా,, 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్ తో అనుసంధానం జరిగినట్లు భన్వర్ లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసి మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు అడ్రస్, ఆధార్ కార్డు అడ్రస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్
కరీంనగర్ : ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ సూచించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద శాతం అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండోస్థానం ఉందని తెలిపారు. ఇక 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు చెప్పారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్‌తో అనుసంధానం జరిగిందని భన్వర్‌లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటరు గుర్తింపు అడ్రసు, ఆధార్ కార్డు అడ్రస్‌కు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగంలో దాదాపు 15 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, ఈ బోగస్ ఓట్లే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తనను కలిసిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై భన్వర్ లాల్.. సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియను తొలుత హైదరాబాద్ నగరంలో ఆ తరువాత మిగతా జిల్లాల్లో అమలుచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఈవో ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒకే ఓటరు జాబితా ఉండాలని అభిప్రాయం వ్యక్తిచేసిన కేసీఆర్.. బోగస్ ఓట్ల తొలిగింపులో అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. -
‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ముమ్మాటికీ అవినీతే: భన్వర్‌లాల్
-
'ఆ ఎంపీటీసీ సభ్యులు ఎక్కడున్నారో చెప్పాలి'
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లారు. సీఈఓ భన్వర్‌లాల్‌ను కలిసి.. ఓటుకు రూ. 3 లక్షల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. 30 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులకు డబ్బులిచ్చి వాళ్లను శిబిరానికి తరలించారన్నారు. నెల్లూరులో వాళ్లను తాము పట్టుకున్నా, పోలీసులు మళ్లీ వారిని టీడీపీ నేతలకు అప్పగించారని తెలిపారు. ఈ అంశంపై తాము ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తక్షణమే ఆ 30 మంది ఎంపీటీసీ సభ్యులు ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తమకు రూ. 50 వేలు అడ్వాన్సు ఇచ్చినట్లు మీడియా సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యుడు చెప్పారని అన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తాము కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భన్వర్‌లాల్‌ను కలిసినవారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్, గొట్టిపాటి రవి, డేవిడ్ రాజు, చిన వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. -
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ- ఓటింగ్
కర్నూలు (ఆదోని) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో జరిగే ఎన్నికలు) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలకు ఈ-ఓటింగ్ ద్వారా అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్ఆర్ఐల కోసం ప్రవేశ పెట్టిన ఈ-ఓటింగ్ విధానాన్ని స్థానిక ఓటర్ల కోసం కూడా అమలు చేయవచ్చన్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ-ఓటింగ్ విధానం అమలు చేయడం వల్ల ఖర్చు ఆదా అవుతోందని, పోలింగ్‌లో పారదర్శకత పెరుగుతుందన్నారు. జనాభా కన్నా ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని, ఈ నెల చివరిలోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల రీత్యా స్థానాలను పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. పార్లమెంట్ మాత్రమే ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
ఆ రెండు రోజులూ ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుగాను ఈ నెల 7, 14 తేదీల ఆదివారాల ను ప్రత్యేక క్యాంపెయిన్ డేలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఈవీఎం గోదాముల నిర్మాణం, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. గత ఆదివారం నిర్వహించిన క్యాంపెయిన్‌లో చాలా కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో లేరని ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చే 2 ఆదివారాల్లో నిర్వహించే క్యాంపెయిన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు తప్పనిసరిగా కేంద్రాల్లో ఉండి ఓటర్ల నమోదు, సవరణలపై దరఖాస్తులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక క్యాంపెయిన్ల నిర్వహణపై కేబుల్ టీవీలు, పత్రికలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. జనవరి 1, 2015 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా సాధారణ ఓటరుగా, నవంబరు 1, 2011 నాటికి డిగ్రీ పూర్తయిన వారంతా గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. సాధారణ ఓటరు జాబితా సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 33,083 దరఖాస్తులు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరు నమోదుకు గాను 6,400 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. మొత్తం అందిన దరఖాస్తుల్లో మూడో వంతు గత ఆదివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌లోనే అందాయని వివరించారు. జిల్లాలో ఈవీఎం గోదాము నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి మరో రూ.20లక్షలు అవసరమవుతాయని తెలిపారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి పూర్తి నివేదిక ను త్వరలో సమర్పిస్తామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ సూర్యారావు, ఎన్నికల విభాగం తహసీల్దార్ జ్ఞానప్రసూనాంబ పాల్గొన్నారు. -
ఓటర్ల నమోదు ప్రక్రియలోని ఉద్యోగుల బదిలీలు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు బదిలీల ప్రక్రియను కొనసాగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఓటర్ల నమో దు ప్రక్రియతో సంబంధమున్న జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ల బదిలీలపై ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు ప్రక్రియతో సంబంధం ఉన్న ఏ ఉద్యోగి, అధికారి నైనా బదిలీ చేయాలంటే అందుకు తగిన కారణాలను వివరిస్తూ ముందస్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గత నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఆర్డీవోలు, మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లను బది లీలు చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఓటర్ల జాబితా సవరణ, నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేస్తే ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీలకు చెందిన 40 మంది మున్సిపల్ కమిషనర్ల బది లీలకు సంబంధించిన ఫైలును సంబంధిత శాఖ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించింది. 13వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున బదిలీలపై నిషేధం ఉందని, అయినా మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు కారణం ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మున్సిపల్ శాఖను కోరింది. మున్సిపల్ శాఖ నుంచి కారణాలు తెలియజేస్తూ సమాధానం వస్తే ఆ వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపనుంది. -
నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు
-
నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు
డిసెంబర్ 8 వరకు అవకాశం రెండు రాష్ట్రాల్లోను ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్లు ‘సాక్షి’తో రెండు రాష్ట్రాల సీఈఓ భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో గురువారం నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదుకు అర్హులని చెప్పారు. డిసెంబర్ 8వ తేదీ వరకు ఓటర్లగా నమోదుకు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లు నియోజకవర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటిస్తారని, ఆ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా ఇస్తారని వివరించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నేపథ్యంలో భన్వర్‌లాల్ బుధవారం సచివాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లో ఇ-రిజస్ట్రేషన్ ద్వారా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు. సీఈఓ ఆంధ్రా, సీఈఓ తెలంగాణ వెబ్ సైట్ల ద్వారా ఆన్లైన్లో ఓటర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు ఓటర్లుగా నమోదు దరఖాస్తు చేసుకున్న వారితోపాటు గురువారం నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లను వచ్చే ఏడాది జవనరి 15వ తేదీ కల్లా పరిష్కారం పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఓటర్ల తుది జాబితాను కూడా వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన ప్రకటిస్తామన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమం, జాబితాలో సవరణలను పర్యవేక్షించేందుకు రెండు రాష్ట్రాలకు కలిపి తొమ్మిదిమంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్లందరికీ జనవరి 25వ తేదీ నుంచి కలర్ ఫొటోతో కూడిన స్మార్ట్ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోను ఓటర్ల జాబితాల నుంచి డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోను, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గురువారం నుంచి ఓటర్ల జాబితాల్లోని పేర్లకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆధార్ నెంబర్ల అనుసంధానం పూర్తి చేయగా పది శాతం మేర డూప్లికేట్ ఓటర్లున్నట్లు తేలిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 80 లక్షల ఓటర్లలో 8 లక్షలు ఓటర్లు డూప్లికేట్ ఉంటాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టే ఆధార్ అనుసంధానం ఫలితాలు ఆధారంగా వచ్చే ఏడాదికల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్లందరికీ ఆధార్ నెంబర్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తామని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నమోదుకు పరిశీలకులగా జిల్లాల వారీగా నియమించిన ఐఏఎస్ అధికారులు: ఎం. జగదీశ్వర్ (నల్గొండ, మహబూబ్‌నగర్), బి.ఎం.డి. ఎక్కా (వరంగల్, ఖమ్మం), బి.వెంకటేశం (కరీంనగర్, ఆదిలాబాద్), ఎల్. శశిధర్ (మెదక్, నిజామాబాద్), అనితా రాజేంద్ర (హైదరాబాద్, రంగారెడ్డి). ఏపీలో ఓటర్ల నమోదుకు పరిశీలకులుగా నియమించిన ఐఏఎస్ అధికారులు: కె. మధుసూధనరావు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం), జయేశ్ రంజన్ (తూర్పూ, పశ్చిమ గోదావరి, కడప), బి. ఉదయలక్ష్మి ( నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు), వి. ఉషారాణి (కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం). ఓటర్ల నమోదు, జాబితా సవరణ షెడ్యూల్.. ముసాయిదా జాబితా ప్రకటన :13-11-2014 ఓటర్లగా నమోదు, అభ్యంతరాలు, సవరణలు : 13-11-2014 నుంచి 08-12-2014 గ్రామసభల్లో, స్థానిక సంస్థల్లో పేర్లు చదివేది : 19-11-2014, మరియు 26-11-2014 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, పార్టీల ఏజెంట్లు కూర్చుని దరఖాస్తులు స్వీకరణ : 16-11-2014, 23-11-2014, 30-11-2014, 07-12-2014 దరఖాస్తుల పరిష్కారం : 22-12-2014 సప్లిమెంటరీ జాబితా ప్రచురణ,ఫొటోలు, పేర్లు నమోదు : 05-01-2015 ఓటర్ల తుది జాబితా ప్రకటన: 15-01-2015 -
పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్‌లాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని అమలు చేస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశాన్ని ఈసారి రాజకీయ పక్షాలకు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. -
'ఆ' 29 కేంద్రాల్లో రీ పోలింగ్
-
'స్వేఛ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి'
-
స్లిప్పుల్లేకున్నా ఓటేయెచ్చు.. అయితే..
-
సీమాంధ్రలో ఎన్నికలకు సర్వం సిద్ధం
-
శోభా నాగిరెడ్డికి ఓటేసినా...
-
ఎన్నికల వాయిదా ఉండదు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు వచ్చే నెల తొలి వారంలో షెడ్యూలు రాష్ట్రంలో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ ఎన్నికల సిబ్బంది పక్షపాతం చూపితే కఠిన చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. విభజన ఎన్నికల ముందు జరుగుతుందా? ఎన్నికల తరువాత జరుగుతుందా? అనేది కమిషన్‌కు సంబంధం లేదని... పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో మార్పులు, చేర్పులు లేనందున ఎన్నికల వాయిదాకు అవకాశం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల అధికారుల బదిలీలు, అధికారుల పోస్టింగ్‌లపై భన్వర్‌లాల్ శనివారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ్హ వచ్చే నెల తొలివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చు. ్హ ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి సమస్యలు లేవని ఆ సమీక్షలో స్పష్టం చేశాం. ్హ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు తటస్థంగా ఉండాలి. ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటారుు. ్హ కొన్ని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై ఓట్ల కోసం దౌర్జన్యం, ఒత్తిడి చేసే ఘటనలు జరిగే అవకాశముంది. అలాంటి గ్రామాల్లో ఓటర్లను, దౌర్జన్యం, ఒత్తిడి చేసే వ్యక్తులను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకుంటాం. ్హ ఎవరి ఒత్తిడికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పిస్తాం. ్హ వేసవిలో ఎన్నికలు జరగనున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పిస్తాం. మంచినీరు, టాయిలెట్, విద్యుత్ సౌకర్యాలతో పాటు వికలాంగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేస్తాం. ్హ ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ అధికంగా ఉండే అవకాశమున్నందున.. దాన్ని నిరోధించడానికి నిఘాను మరింత పటిష్టం చేస్తున్నాం. ్హ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 1.89 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరం. మూడు లక్షల యంత్రాలు కొత్తగా వస్తున్నారుు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బెల్, మహారాష్ట్ర నుంచి యంత్రాలు రానున్నారుు. ్హ ఎన్నికల సంబంధ బదిలీలు 95 శాతం పూర్తయ్యూరుు. మిగతా ఐదు శాతం సోమవారానికి పూర్తి అవుతారుు. నేతలపై కేసుల గురించి ఆరా! ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కదిలిన పోలీసుశాఖ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులలో ఎవరెవరిపై ఏయే కేసులున్నాయనే సమాచారాన్ని పోలీసు శాఖ సేకరిస్తోంది. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధుల వివరాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ సమాచారాన్ని సేకరించి పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాల్సిందిగా డీజీపీ బి.ప్రసాదరావు నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించే బాధ్యతను జిల్లాల్లో డీఎస్పీలకు, కమిషనరేట్లలో ఏసీపీలకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే చాలా మంది వివరాలను అధికారులు సేకరించి, పై అధికారులకు అందజేసినట్లు సమాచారం. మిగతా వివరాలను కూడా ఒకటి రెండు రోజుల్లో సేకరించి... పూర్తి నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు తెలిసింది. -
రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: భన్వర్‌లాల్
-
276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. రేపు నిర్వహించే రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి బి.ప్రసాదరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఎమ్మెల్యే పోలింగ్ ఏజెంట్‌కు చూపించే ఓటు వేయాల్సి ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ ఏజెంట్, పార్టీ ఓటు రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు. -
మాల్స్‌లో ఓటర్ సవరణ కేంద్రాలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు, ఓటర్ల జాబితాలో సవరణలు కోరేందుకు డిసెంబర్ 17 ఆఖరి తేదీ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. నగరంలోని ఐమాక్స్‌లో ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన ఓటరు వెరిఫికేషన్ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ల్లో స్వచ్చంధ సంస్థల సహకారంతో మొత్తం 77 వెరిఫికేషన్ సెంటర్లను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ సెంటర్ల వద్దకు ఎవరైనా వచ్చి తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని, లేనివారు అక్కడే నేరుగా వివరాలు అందించే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమీషనర్ నవీన్‌మిట్టల్, అడిషినల్ కమీషనర్ రోనాల్డ్‌రోజ్, ప్రసాద్ ఐమాక్స్ చైర్మన్ రమేష్ ప్రసాద్, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జే.ఏ.చౌదరి, గీతామారుతి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ఓటర్ల శాతం తగ్గింది: భన్వర్‌లాల్
మహిళల ఓటర్ల శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు లక్షలమంది తగ్గినట్టు శనివారం వెల్లడించారు. 19, 18 ఏళ్ల వయసు వారు 38 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డులు తీసుకోలేదని భన్వర్‌లాల్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనవరి 1లోగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు కూడా ఉంటుందని చెప్పారు. అన్ని పార్టీలు ఉత్తమ అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలపాలని భన్వర్‌లాల్ పేర్కొన్నారు. -
జనవరి 1కి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరుగా నమోదుకండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకల్లా 18 సంవత్సరాలు వయస్సు నిండే యువతీ, యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకించి ఈనెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపడుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ నెల 15న పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, దానిని పరిశీలించి పేర్లులేని అర్హులందరూ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల నమోదుకోసం దరఖాస్తులను, అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతోపాటు అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించనున్నట్లు భన్వర్‌లాల్ వివరించారు. ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేకించి గ్రామసభల్లోను, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేసే సమావేశాల్లో జాబితాలో పేర్లను చదివి వినిపిస్తారని, ఆ సందర్భంగా పేర్లలో పొరపాట్లుంటే సరిచేసుకోవాలని సూచించారు. అలాగే ఈ నెల 17, 24 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయపార్టీల ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తారని, ఆ సమావేశాల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తులను, అలాగే అభ్యంతరాలకు సంబంధించిన అంశాల్ని స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లుగా నమోదుకోసం వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలను వచ్చే నెల 16వ తేదీకల్లా పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీకల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేస్తారని, జనవరి 16న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ జాబితా ఆధారంగానే వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం, తరువాత వరదలు కారణంగా గత నెలలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికి వాయిదా పడింది.