కరీంనగర్:ఈనెల 15లోగా ఓటర్లందరూ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా100 శాతం ఆధార్ అనుసంధానంతో మొదటి స్థానంలో ఉన్నట్లు భన్వర్ లాల్ తెలిపారు. నల్లొండ జిల్లా 87 శాతంతో రెండో స్థానంలో ఉండగా,, 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్ తో అనుసంధానం జరిగినట్లు భన్వర్ లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసి మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు అడ్రస్, ఆధార్ కార్డు అడ్రస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు.