Voter card
-
న్యూజీలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు.. మన దగ్గర కూడా అమలయితే బావుండు!
మన దగ్గర కూడా అమలయితే బావుండు.. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ ఇచ్చి ఈజీగా ఓట్లు కొనవచ్చు! -
కొత్త ఓటర్లకు డిజిటల్ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు. 22,350 మంది అర్హులకు పంపిణీ ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
సాక్షి కార్టూన్ 30-07-2022
ఇక మన టార్గెట్ స్కూళ్లూ, కాలేజీలే సార్! -
ఇక 17ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు
-
ఇకపై 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తు.. ఈసీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. ఏడాదిలో మూడుసార్లు అవకాశం.. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఇదీ చదవండి: గూగుల్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ ఉండదటా! -
ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించడం సహా కీలక సంస్కరణలున్న ఎన్నికల చట్టాల సవరణ బిల్లు– 2021కి రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లుపై నిరసనలు వ్యక్తం చేసిన విపక్షాలు వాకౌట్ చేశాయి. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదం లభించడంతో తదుపరి దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. గతంలో పలు పార్టీల అభిప్రాయాలను సేకరించిన ఎన్నికల కమిషన్ ఈ అనుసంధాన సూచన చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు నిరసనకు దిగాయి. ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు ఈ బిల్లు ఆటంకమని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని విపక్షసభ్యులు ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న వీరి డిమాండ్‌ను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. బోగస్ ఓటర్ల ఏరివేతకు దీనితో అడ్డుకట్ట వేయవచ్చని న్యాయమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దొంగ ఓట్లకు అనుకూలురైనవారే ఈ బిల్లును నిరాకరిస్తారన్నారు. ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదని మరోమారు స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, బీజేడీ, టీడీపీ, టీఎంసీ–ఎం తదితర పార్టీల సభ్యులు బిల్లుకు మద్దతు పలికారు. కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, ఎన్సీపీ తదితర విపక్షాల సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేశారు. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టింది. చదవండి: (నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకయ్యాయి) దేశ చరిత్రలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు అనేక వ్యక్తిగత చట్టాలపై ప్రభావం చూపుతుందని, ప్రాథమిక హక్కులకు భంగకరమని విపక్ష సభ్యులు విమర్శించారు. లోతైన అధ్యయనం కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపుతున్నామని ఈసందర్భంగా ఇరానీ చెప్పారు. లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష వీక్షణకు వీలు కల్పించే ఒక మొబైల్ యాప్‌ను లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆవిష్కరించారు. సాధారణ ప్రజలు పలు పార్లమెంటరీ డాక్యుమెంట్లను చూసేందుకు, వివిధ కమిటీల నివేదికలు చదివేందుకు కూడా ఈ ‘ఎల్ఎస్ మెంబర్ యాప్’ ఉపయోగపడుతుంది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లు ఈ నెల 23 వరకు కాకుండా 22కే ముగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: (Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’) ఈ చట్టాల్లో మార్పులు అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుతో బాల్య వివాహా నిషేధ చట్టం– 2006లో సవరణలు చేస్తారు. ఇందులో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21కి మారుస్తారు. ఈ చట్టంలో మార్పుతో కొన్ని పర్సనల్ చట్టాల్లో కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ద్వారా కింది చట్టాల్లో సవరణలు చేస్తారు. 1. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 2. ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ 3. ద ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ 4. ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 5. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 6. ద ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ డెరెక్ ఓబ్రియాన్పై సస్పెన్షన్ వేటు రాజ్యసభలో టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రియాన్పై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ‘ ప్రభుత్వం సాగు చట్టాల సమయంలో చేసినట్లే ఇప్పుడూ చేస్తోంది’ అంటూ చేతిలోని రూల్‌బుక్‌ను డెరెక్ చైర్‌పైకి విసిరి వాకౌట్ చేశారు. ఆయన విసిరిన పుస్తకం సభాపతికి ముందు కూర్చునే అధికారుల బల్లపై పడింది. దీంతో డెరెక్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈసీ సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే.. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ►పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్‌ను అనుమతిస్తారు. అయితే, ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ►వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వయోజనులు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉండేది. చదవండి: (కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్) ►ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇకమీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించారు. ►ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్‌కి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. వీటన్నిటిని ఆమోదిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. చదవండి: (కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భారత మాజీ క్రికెటర్?) -
ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్లోడ్ చేసుకోండి
న్యూఢిల్లీ: ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకు ఓటరు గుర్తింపు కార్డును సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్(ఎలక్రానిక్: ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది. ఓటరు తమ రిజిస్టర్డ్ మొబైల్లోనే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు.(చదవండి: డయల్ 100కు బదులుగా 112) 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఈ నెల 25 నుంచి 81 వరకు ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. "ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ ఫర్ ఏపిక్" అనే పేరుతో పేద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోర్టల్: http://voterportal.eci.gov.in, NVSP: https://nsvp.in ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలను భాగస్వాములను చేసి కొత్త ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. -
ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్ లోకేష్ కుమార్ శనివారం తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ప్రతీ ఒక్క ఓటరు గుర్తింపు నిర్థారణకు గాను ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాగా ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కింద పేర్కొన్న 18 గుర్తింపు కార్డులు ఓటర్లు తమ వెంట తీసుకురావచ్చు. అవి ఏంటంటే 1. ఆధార్ కార్డు 2. పాస్‌పోర్ట్ 3. డ్రైవింగ్ లైసెన్స్ 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్ 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్ 6. పాన్ కార్డు7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు 9. హెల్త్ కార్డు 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్ 11. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం 12. రేషన్ కార్డు 13. కుల ధృవీకరణ పత్రం 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు 16. అంగవైకల్యం సర్టిఫికెట్ 17. లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు 18. పట్టదారు పాస్‌బుక్ -
గంభీర్‌కు 2 ఓటర్‌ఐడీలు!
న్యూఢిల్లీ: రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ బీజేపీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో తిస్హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. గంభీర్ దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నీ సరైనవేనని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పష్టం చేశారు. రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా తనకు రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు ఉందంటూ గంభీర్ తన అఫిడవిట్లో డిక్లరేషన్ ఇచ్చారని, కానీ రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు. ఎవరైన అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి ఏడాది జైలుశిక్షగాని, జరిమానాగానీ, జరిమానాతోపాటు జైలుశిక్షగానీ విధించవచ్చు. -
ఓటరు గుర్తింపు కార్డుకు 23 ఏళ్లు..
ఆర్మూర్: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారత దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేక సంస్కరణలు తెచ్చింది. అందులో భాగంగా దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను అమలులోకి తెచ్చారు. ఓటరు గుర్తింపు కార్డులు అమలులోకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తోంది. 1995లో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ఓటరు నమోదు పారదర్శకంగా ఉండడంతో పాటు దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. ఓటరు జాబితాలో ఉన్న క్రమసంఖ్య ప్రకారం ఓటరు ఫొటోను కార్డుపై ముద్రించి ఇస్తున్నారు. ఐడీ కార్డుపై పాస్‌పోర్టు సైజ్ ఫొటో, జనన తేదీ, కార్డు హోల్డర్ చిరునామా సైతం ముద్రిస్తారు. సీరియల్ నంబర్, హోలో గ్రామ్ స్టిక్కర్, కార్డును జారీ చేసిన అధికారి స్టాంపు, సంతకం కూడా ఉంటాయి. దీనిపై ముద్రించిన సీరియల్ నంబర్ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ ఇది ప్రతి సంవత్సరం మారుతుంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ లిస్టు డాటాను ఆన్లైన్లో ఉంచినప్పుడు ఓటరు తమ ఎన్నికల సంఖ్య, సీరియల్ నంబర్‌ను సులభంగా కనుక్కోవచ్చు. ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేసే విధంగా నిబంధనలు విధించడంతో దొంగ ఓట్ల నివారణకు తోడ్పడుతోంది. భారతీయ పౌరసత్వం కలిగి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందడంతో పాటు ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకొనే అవకాశాలను పలుమార్లు కల్పించారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను ఇప్పుడు డిజిటల్ విధానంలో ఏటీఎం కార్డు సైజ్‌లో ఓటరు కార్డులను స్పష్టంగా ముద్రిస్తున్నారు. ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులోకి వచ్చాక ప్రజలకు తమ ఓటు హక్కుపై పూర్తి అవగాహన వచ్చింది. ఓటరు జాబితాలో సైతం ప్రతీ ఓటరు ఫొటో ముద్రిస్తుండడంతో మరింత పారదర్శకత పెరిగింది. ఓటరు గుర్తింపు కార్డు అన్నది ప్రతి ఓటరుకు అందుబాటులోకి వచ్చింది. ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరును పోలింగ్ ఏజెంట్లు సులువుగా జాబితాలో గల పేరును సరిచూసుకొని ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఓటర్ గుర్తింపు కార్డులు అందుబాటులో లేని వారు పోల్ చీటీలో పొందు పరిచిన తమ ఓటు క్రమ సంఖ్య వివరాలతో కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
ఓటు కార్డులోచ్చాయోచ్!
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు): నగరపాలక సంస్థ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎన్నికల కమిషన్ నూతన ఓటు కార్డులను వీఎంసీకి అందించింది. ఆయా నియోజవర్గాలకు సంబంధించి సుమారు లక్షమంది నూతన ఓటర్లు ఉండటంతో నియోజవకర్గాల వారిగా వాటిని అధికారులు విభజించిన పోలింగ్ బూత్‌ల వారిగా వేరు చేస్తున్నారు. ఓటర్లకు ఆయా కార్డులను బీఎల్ఓ(బూత్ లెవల్ అధికారి) ద్వారా పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 30 వేల మంది నూతన ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు. -
ఓటరు గుర్తింపు కార్డుకు 23 ఏళ్లు..
సాక్షి, ఆర్మూర్: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారత దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేక సంస్కరణలు తెచ్చింది. అందులో భాగంగా దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను అమలులోకి తెచ్చారు. ఓటరు గుర్తింపు కార్డులు అమలులోకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తోంది. 1995లో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ఓటరు నమోదు పారదర్శకంగా ఉండడంతో పాటు దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. ఓటరు జాబితాలో ఉన్న క్రమసంఖ్య ప్రకారం ఓటరు ఫొటోను కార్డుపై ముద్రించి ఇస్తున్నారు. ఐడీ కార్డుపై పాస్‌పోర్టు సైజ్ ఫొటో, జనన తేదీ, కార్డు హోల్డర్ చిరునామా సైతం ముద్రిస్తారు. సీరియల్ నంబర్, హోలో గ్రామ్ స్టిక్కర్, కార్డును జారీ చేసిన అధికారి స్టాంపు, సంతకం కూడా ఉంటాయి. దీనిపై ముద్రించిన సీరియల్ నంబర్ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ ఇది ప్రతి సంవత్సరం మారుతుంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ లిస్టు డాటాను ఆన్లైన్లో ఉంచినప్పుడు ఓటరు తమ ఎన్నికల సంఖ్య, సీరియల్ నంబర్‌ను సులభంగా కనుక్కోవచ్చు. ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేసే విధంగా నిబంధనలు విధించడంతో దొంగ ఓట్ల నివారణకు తోడ్పడుతోంది. భారతీయ పౌరసత్వం కలిగి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందడంతో పాటు ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకొనే అవకాశాలను పలుమార్లు కల్పించారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను ఇప్పుడు డిజిటల్ విధానంలో ఏటీఎం కార్డు సైజ్‌లో ఓటరు కార్డులను స్పష్టంగా ముద్రిస్తున్నారు. ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులోకి వచ్చాక ప్రజలకు తమ ఓటు హక్కుపై పూర్తి అవగాహన వచ్చింది. ఓటరు జాబితాలో సైతం ప్రతీ ఓటరు ఫొటో ముద్రిస్తుండడంతో మరింత పారదర్శకత పెరిగింది. ఓటరు గుర్తింపు కార్డు అన్నది ప్రతి ఓటరుకు అందుబాటులోకి వచ్చింది. ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరును పోలింగ్ ఏజెంట్లు సులువుగా జాబితాలో గల పేరును సరిచూసుకొని ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఓటర్ గుర్తింపు కార్డులు అందుబాటులో లేని వారు పోల్ చీటీలో పొందు పరిచిన తమ ఓటు క్రమ సంఖ్య వివరాలతో కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు
సాక్షి, హైదరాబాద్: అంధుల సదుపాయార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్) జారీ చేపట్టింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ చేతుల మీదుగా కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు. ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది. ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి.. తదితర వివరాలున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర కమిషనర్ బి.శైలజ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌లు, వలంటీర్లు, చక్రాల కుర్చీలు, తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డు ఐకాన్లుగా దివ్యాంగ సెలబ్రిటీలు.. వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్న 9 మంది దివ్యాంగులతో ఓపీ రావత్, కమిషనర్లు అశోక్ లవాసా, సునీల్ అరోరా సమావేశమయ్యారు. అంధత్వ దివ్యాంగులైన గాయని శ్రావ్య, అంతర్జాతీయ క్రికెటర్లు మహేందర్ వైష్ణవ్, జి.మధు, ఐటీ డెవలపర్ అనీస్ సుల్తానా, రేడియో జాకీ టి.వెంకటేశ్, బధిర దివ్యాంగులు నటి అభినయ, ఆర్థోపెడిక్‌కు సంబంధించి సైంటిస్ట్ (ఆర్ అండ్ డీ) థాండర్ బాబూ నాయక్, బారియర్ ఫ్రీ కంపెయినర్ నర్సింగ్‌రావు, టీవీ యాంకర్ సుజాత వీరిలో ఉన్నారు. ఐకాన్లుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు వీరంతా సమ్మతి తెలిపారు. సదరం జాబితాలోని వివరాలతో రాష్ట్రంలోని 4,12,098 మంది దివ్యాంగులను ఓటరు జాబితాలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో దాదాపు 56 వేల మంది అంధత్వ దివ్యాంగులున్నారని తెలిపారు. వాదా యాప్ ప్రారంభం.. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ చైతన్య రథాలు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సహాయపడే మొబైల్ యాప్ ‘వాదా’(ఓటర్ యాక్సెస్బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్)లను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్ ప్రారంభించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లవాస, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ చైతన్య రథాల్లో కొన్నింటిని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులందరూ ఓటు వేసేందుకు సహాయ సహకారాలు అందించేందుకు వాదా యాప్‌ను రూపొందించామని దానకిశోర్ వివరించారు. -
వైరలవుతున్న పెళ్లి శుభలేఖ..
బెంగళూరు: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ వేడుకకు సంబంధించిన అంశాలను ప్రతి జంట తమ జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటుంది. కర్ణాటకకు చెందిన ఓ జంట కూడా అలానే అనుకుంది. అనుకోవడమే కాక ఓ వినూత్నమైన ఆలోచన కూడా చేశారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు తమ పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో డిజైన్ చేయించారు. వినూత్నమైన పెళ్లికార్డుకు కర్ణాకటలోని హవేరి జిల్లా వేదికైంది. జిల్లాలోని హంగల్ ప్రాంతానికి చెందిన సిద్దప్ప దొడ్డచిక్కన్ననవార్ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. సామాజిక కార్యకర్త కూడా అయిన సిద్దప్పకు ఇదే ప్రాంతానికి చెందిన జ్యోతితో వివాహం నిశ్చయం అయింది. ఈ నెల 27న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. 'నా వివాహ వేడుక సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా. ఇదే విషయాన్ని పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నా స్నేహితుడి వద్ద ప్రస్తావించాను. ఇద్దరం ఆలోచించి పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో అచ్చు వేయించాలనుకున్నాం. అందుకుగాను జిల్లా కలెక్టరు అనుమతి కూడా తీసుకున్నామని' తెలిపాడు సిద్దప్ప. ఓటరు ఐడీలో వివరాలు ఎలా ఉంటాయో అలానే తన వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను రూపొందించాడు. శుభలేఖ చివర్లో మీ ఓటు ఎంతో విలువైనది దాన్ని అమ్ముకోకండి అనే సందేశాన్ని కూడా అచ్చువేయించడం గమనార్హం. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మే 12న కర్ణాటకలో 224 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 56,696 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మే 15న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. -
బోగస్ ఓటర్లు 2.52. లక్షలు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను అధికారులు గుర్తించారు. జిల్లా జనాభా 42,90,589 మంది కాగా 34,31,822 ఓటర్లు ఉన్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తయిన 66 శాతంలో 2,52,418 బోగస్ ఓటర్లు ఉన్నట్టు తేల్చారు. వీరు జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్టుగా గుర్తించారు. చనిపోయిన ఓటర్లు 57,846 మంది, అనర్హులైన ఓటర్లు 3136 మంది ఉన్నారు. వలస వెళ్లిన వారు (5,16,747), సర్వే సమయంలో డోర్లాక్డ్(4,64,365)గా గుర్తించిన ఓటర్లు ఏకంగా 9,81,112 మంది ఉన్నారు. అంటే డూప్లికేట్, డోర్ లాక్డ్, షిఫ్టెడ్, ఇన్ఎలిజబుల్, డెత్ ఓటర్లు కలిపి ఏకంగా 12,94,512 మంది ఉన్నారు. వీరి విషయంలో ఈ నెల 20వ తేదీలోగా క్షేత్ర స్థాయి విచారణ జరిపి తుది నివేదికలు ఇవ్వాల్సిందిగా తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. డూప్లికేట్ (డబుల్ ఎంట్రీ)విషయంలో ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఓటు హక్కును ఉంచి మిగిలిన చోట్ల జాబితాల నుంచి వారి పేర్లను తొలగించనున్నారు. ఇక చనిపోయిన ఓటర్లను వారి డెత్ సర్టిఫికెట్స్‌ను ఆధారంగా తొలగిస్తారు. ఇన్ఎలిజబుల్, షిఫ్టెడ్, డోర్లాక్డ్ జాబితాలో ఉన్న ఓటర్ల విషయంలో మాత్రం నోటీసులు.. విచారణాలనంతరమే నిర్ధారణకు వస్తారు. ఏది ఏమైనప్పటికీ ఓటర్ల జాబితాలో భారీగా కోతపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 20లోగా విచారణ పూర్తి చేసి ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తారు. చివరగా క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం తుది జాబితాలను సిద్ధం చేస్తారు. మరొకపక్క తుది ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఇందు కోసం ఈనెల 19న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. -
'ఈనెల 15 లోగా ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి'
కరీంనగర్:ఈనెల 15లోగా ఓటర్లందరూ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా100 శాతం ఆధార్ అనుసంధానంతో మొదటి స్థానంలో ఉన్నట్లు భన్వర్ లాల్ తెలిపారు. నల్లొండ జిల్లా 87 శాతంతో రెండో స్థానంలో ఉండగా,, 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్ తో అనుసంధానం జరిగినట్లు భన్వర్ లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసి మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు అడ్రస్, ఆధార్ కార్డు అడ్రస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్
కరీంనగర్ : ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ సూచించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద శాతం అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండోస్థానం ఉందని తెలిపారు. ఇక 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు చెప్పారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్‌తో అనుసంధానం జరిగిందని భన్వర్‌లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటరు గుర్తింపు అడ్రసు, ఆధార్ కార్డు అడ్రస్‌కు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. -
ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన
హైదరాబాద్ సిటీ: సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన లభిస్తోంది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకొని, బోగస్ ఓట్లకు చరమగీతం పాడాలని పభుత్వంపిలుపునివ్వడంతో ప్రజలు ఈ కార్యక్రమానికి క్యూ కట్టారు. ఇప్పటికే సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన లింకేజీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం సనత్‌నగర్, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌తో పాటు నగరంలోని పలుప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. -
తెలంగాణలో ఆ నలుగురే!
ఎన్ఆర్ఐలు ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి: భన్వర్‌లాల్ ప్రగతినగర్: తెలంగాణలో నలుగురు ఎన్ఆర్ఐలు మాత్రమే ఓటరు కార్డుకు ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఓటరుకు ఆధార్ అనుసంధానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి యంత్రాంగా న్ని, సహకరించిన పార్టీల నాయకులను అభినందించారు. తెలంగాణలోని పది జిల్లాలలో నలుగురు ఎన్ఆర్ఐలు మాత్రమే ఓటరుకు ఆధార్‌తో అనుసందానం చేయించుకున్నారని, నిజామాబాద్ జిల్లాలోనే నాలుగు లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారన్నారు. ఎన్ఆర్ఐలు ఈ-రిజిస్ట్రేషన్ ద్వారా వారి ఓటరు కార్డు పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు నంబర్ సంబంధిత బీఎల్ఓకు పంపిస్తే, ఇక్కడ విచార ణ జరిపి వారి ఓటరు నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తారన్నారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు తమ ఓటు హక్కును ‘ఆన్లైన్’ ద్వారా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. -
వంద శాతం
జిల్లాలో ఆధార్ అనుసంధానం పూర్తి నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాక మధ్యాహ్నం 3 గంటలకు {పగతిభవన్లో సమావేశం ప్రగతినగర్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లా వంద శాతం నమోదు పూర్తిచేసుకొని దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పక్కా ప్రణాళికతో ఓటరు కార్డును ఆధార్ అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయనతో పాటు బీఎల్వోలు, ఇతర అధికారులు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వంద శాతం అనుసంధానంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆధార్ అనుసంధానానికి కలెక్టర్ ప్రత్యేక కౌంటర్లు, మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు సైతం అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 14,04,306 మంది ఓటర్లు ఉండగా మొబైల్ ఫోన్ ద్వారా 361 మంది ఓటర్లు, స్వంతంగా 1957 మంది, కాల్ సెంటర్లకు ఫోన్‌చేసి 76 మంది, ఎస్ఎంఎస్ల ద్వారా 6392 మంది ఓటర్‌కార్డును ఆధార్‌కు అనుసంధానం చేయించుకున్నారు. మిగిలినవి బూత్ లెవల్ ఆఫీసర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి ఓటర్ కార్డు ఐహెచ్ఎల్ నంబర్ సేకరించి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయించారు. నేడు జిల్లాకు ఎన్నికల అధికారి రాక.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు 100 శాతం ఆధార్ అనుసంధానంతో జిల్లా దేశంలోనే ముందున్న నేపథ్యంలో కలెక్టర్, నియోజక వర్గ స్థాయి తహశీల్దార్లతో సమావేశం నిర్వహించేందుకు భన్వర్‌లాల్ వస్తున్నారని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ప్రగతిభవన్‌లో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి బాసరకు వెళుతారని కలెక్టర్ పేర్కొన్నారు. -
అంతా డిజిటల్ పాలనే..!
పత్రాల పాలన కనుమరుగు కానుంది. వివిధ రకాల ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కష్టాలకు ఇక చెక్ పడనుంది. ఏ ధ్రువపత్రం అవసరమైనా ఆధార్ నంబరే ప్రధానం. దానితో ఖాతా తెరిచి కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లెసైన్‌స, ఆదాయపన్ను ఖాతా వివరాలు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టులతో పాటు భూములకు సంబంధించి సమస్త వివరాలను భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు. ధ్రువపత్రాల నంబర్‌ను నమోదు చేసి నేరుగా పొందవచ్చు. డిజిటల్ పాలనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న శ్రీకారం చుట్టగా, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న ప్రారంభించింది. -వీరఘట్టం డిజిటల్ లాకర్ సదుపాయం వ్యక్తిగత నివాస, విద్యార్హత, ఆదాయ పన్ను ఖాతా, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కుల, నివాస, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు వంటివి తమ అవసరాల కోసం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాల్సి వస్తోంది. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఏ ధ్రువీకరణ పత్రాలు అడుగుతారో తెలియక అన్నీ ఫైల్లో ఉంచుకొని తిరగాల్సి వస్తోంది. వీటిని పోగొట్టుకుంటే అంతే సంగతులు. మళ్లీ పొందాలంటే కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి ప్రదక్షణలు చేయాలి. డిజిటల్ ఇండియా పాలనలో ఈ కష్టాలు ఉండవు. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ ఆన్లైన్ లాకర్లో భద్రపరుచుకోవచ్చు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లాకర్ సదుపాయా న్ని ప్రజల ముగింటల్లోకి తెచ్చాయి. నెట్ సెంటర్లు, మొబైల్ నెట్‌వర్క్‌తో కూడా డిజిటల్ లాకర్లో ధ్రువపత్రాలను భద్రంగా దాచుకొని అవసరమైన సమయాల్లో ఆన్లైన్లో అవసరమైన సంస్థలు, కార్యాలయాలకు పంపుకొనే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఇండియాలో దేశంలో 8,73,079 మంది భాగస్వాములు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 62,462 మంది డిజిటల్ లాకర్ సదుపాయం కలిగి ఉన్నారు. లాకర్ ప్రవేశం ఇలా..... ఆధార్సంఖ్య, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఉండాలి. డిజిటల్ లాకర్ వెబ్సైట్లోకి వెళ్లి సైన్ అప్ క్లిక్ చేసి ఆధార్ సంఖ్య నమోదు చేయగానే ఆధార్‌లో ఉన్న మొబైల్, ఈ-మెయిల్‌కు ఒన్‌టైం పాస్ వర్డు (ఓటీపి) వస్తుంది. వ్యాలిడేట్ ఓటీపీ వద్ద సంఖ్యను నమోదు చేసి వెబ్సైట్లోకి ప్రవేశించవచ్చు. మన దగ్గర ఉన్న ధ్రువపత్రాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేసుకోవడంతో పాటు డిజిటల్ సంతకం తో ఉన్న ఈ ధ్రువీకరణలు ఇందులో భద్రపరుచుకోవచ్చు. అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఆధార్ సంఖ్య జతచేస్తే డిజిటల్ ధ్రువీకరణ జారీ ప్రభుత్వ సంస్థలకు అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన వాటిని దరఖాస్తులు చేసుకొనే సమయంలో కేవలం ఆధార్ నంబరును సంబంధిత సంస్థలకు తెలిపితే వారే నేరుగా ధ్రువపత్రాలను డిజిటల్ లాకర్ ద్వారా ప్రింటు తీసుకుంటారు. దీంతో పత్రాల జిరాక్సు ఖర్చులు మిగులుతాయి. దరఖాస్తు చేసుకునే సమయం మిగులుతుంది. 19 రకాల పౌరసేవలు డిజిటల్ ఇండియాలో భాగంగా 19 రకాల పౌర సేవలతో మీసేవ యాప్‌ను ప్రారంభించారు. మీసేవా కేం ద్రాల్లో లభించే ఆదాయ, కుల, నివాస, నగదు చెల్లింపులు వ్యవసాయ శాఖకు సంబంధించిన అడంగల్, పుట్టిన తేదీ వంటి ధ్రువపత్రాలు పొందవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల ఆధార్ సంఖ్యను కంప్యూటర్లో పొందుపరిచేలా కళాశాలల యాజ మాన్యం చర్యలు తీసుకొంది. తరుచూ ధ్రువపత్రాల సమర్పణ అవసరం లేకుండా డిజిటల్ లాకర్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మొబైల్‌యాప్‌లు, ఫిర్యాదుల యంత్రాలు,తదితర సాంకేతిక సేవల వినియోగాన్ని పెంచనున్నారు. విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర స్థాయి లో సాంకేతిక కమిటీని నియమించారు. ఇప్పటికే విశాఖపట్టణం రేంజ్ పరిధిలో ఐ క్లిక్, అభయం యాప్‌లను ప్రవేశపెట్టారు. మరోవైపు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా కొన్ని జిల్లాల్లో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను పోలీసులు ఆరంభించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ శ్రీకాకుళం జిల్లాకు సుమారు 1000 ట్యాబ్‌లు సరఫరా చేశారు. వీటిని జిల్లాలోని తహశీల్దార్లు, వీఆర్వోలకు, ఆర్ఐఓలకు వారం రోజుల్లో పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఇందిరాకాంత్రి పథకం మహిళలకు కూడా ట్యాబ్‌లు అందజేయనున్నారు. డిజిటల్ ఇండియాతో సాంకేతిక అభివృద్ధి యువతీ, యువకుల్లో కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్లైన్ సేవలు పెరిగిపోవడంతో ధ్రువపత్రాల అవసరం లేకుండా పోయింది. ప్రజలు సామాజిక మాద్యమాలను వినియోగించుకుంటున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.పనుల్లో జాప్యం లేకుండా క్షణాల్లో జరిగిపోతాయి. -కె.సాల్మన్‌రాజ్, ఆర్డీవో, పాలకొండ -
మే చివరికి ఆధార్ లింకేజీ పూర్తి
- రెండు రాష్ట్రాల సీఈవో భన్వర్‌లాల్ హైదరాబాద్: ఓటర్లకు ఆధార్ అనుసంధానంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓటర్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను మే నెలాఖరులోగా నూటికి నూరు శాతం పూర్తి చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్లకు ఆధార్ అనుసంధానంపై భన్వర్‌లాల్ బుధవారం సచివాలయంలో తెలంగాణలోని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటి వరకు 76.35 శాతం ఓటర్లకు ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. ఏపీలో 84.30 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రక్రియ కేవలం 30 శాతమే జరిగిందని, దీంతో తెలంగాణ అనుసంధానం శాతం తక్కువగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట ర్లకు ఆధార్ అనుసంధానం వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి గురువారం అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలి పారు. తెలంగాణకు చెందిన పార్టీల ప్రతి నిధులు కూడా ఆధార్ అనుసంధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరగా పూర్తి చేయడానికి సహకరిస్తామని తెలిపారన్నారు. మే నెలాఖరు నాటికి నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి ప్రత్యేకంగా బూత్ స్థాయి ఆఫీసర్లను ఇంటింటికీ పంపించి ఆధార్ నంబర్లను సేకరించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. జూలై ఒకటి కల్లా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి ఓటర్ల జాబితాలను ప్రకటిస్తామని వివరించారు. ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ ఓటర్లను, మృతి చెందిన ఓటర్లను మాత్రమే తొలగిస్తామన్నారు. ఇంటికి తాళం వేసి ఉన్నంత మాత్రాన వెంటనే ఆధార్ లేదని ఓటర్లను తొలగించబోమన్నారు. అనుసంధానం కోసం ఆధార్ నంబర్‌ను, ఓటర్ కార్డు నంబర్‌ను 87904 99899కు ఫోన్లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా పంపించవచ్చని తెలిపారు. అలాగే 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్, ఆధార్ నంబర్ వివరాలను తెలపవచ్చన్నారు. ఈ ప్రక్రియలో బాగా పనిచేసిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బూత్ స్థాయి అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగదు బహుమతులను ప్రకటించిందని, ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వాటిని బహూకరిస్తామని తెలిపారు. -
‘జంట’ జిల్లాలతో తంటా
పూర్తికాని ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం రంగారెడ్డి, హైదరాబాద్‌లో 40 శాతం దాటని వైనం మిగతా ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా సీడింగ్ రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓటర్లకు చెక్ పెడుతూ.. ఓటరు జాబితాలో అక్రమాలకు కళ్ళెం వేయాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటరు కార్డు వివరాలను ఆధార్‌తో అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రాష్ట్ర లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,81,52,182 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకూ 2,13,04,942 ఓటరు కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 75.67 శాతం సీడింగ్ పూర్తయింది. రెండు జిల్లాల్లోనే వెనుకబాటు.. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాలకుగానూ ఎనిమిది జిల్లాల్లో ఓటర్ కార్డులు, ఆధార్ వివరాల అనుసంధాన ప్రక్రియ 90 శాతానికి పైగా పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.98 శాతం ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్ (99.94%), మహబూబ్‌నగర్(99.86%) జిల్లాలున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 90 శాతానికి పైగా సీడింగ్ పూర్తయింది. కానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ 40 శాతం దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు దిగిన రెవెన్యూ యంత్రాంగం దాదాపు ఆరు నెలలుగా కుస్తీపడుతున్నా ఇప్పటికీ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు. ఈ క్రతువులో అధికారులు బిజీగా ఉండడంతో ఎపిక్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. వచ్చే నెలలో పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో సీడింగ్ ప్రక్రియ అటకెక్కినట్లైంది. ఫలితంగా క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకూ సీడింగ్ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుందని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఓటరు కార్డులకూ ఆధార్‌తో లింకు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే తొలిసారిగా ఓటరు కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానించే కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దీని ద్వారా బోగస్ కార్డులను ఏరివేయడంతోపాటు.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగ్గలదని అంచనా వేస్తున్నారు. తొలుత జీహెచ్ఎంసీలో అమలు చేశాక.. మిగతా ప్రాంతాలకూ దీన్ని వర్తింపచేయనున్నారు. అధికారులతో సమావేశానంతరం భన్వర్‌లాల్ ఈ కార్యక్రమాన్ని గురించి విలేకరులకు వివరించారు. సీఈఓ ఏమన్నారంటే.. కార్డుల లింకు వల్ల గ్రేటర్ పరిధిలో ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పెరగనుంది. తెలంగాణలో 2. 63 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 81.54 లక్షల ఓటర్లున్నారు. వీటిల్లో డూప్లికేట్లు భారీ సంఖ్యలో ఉండవచ్చు. అనుసంధానం ద్వారా బోగస్ ఓటర్లను తొలగించేందుకు వీలవుతుంది. చిరునామా మారిన వారు, మృతి చెందిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానం ద్వారా వీటిని తొలగించవచ్చు. ఓటర్ల నమోదు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్రేటర్లో ఆశించిన స్థాయిలో ఓటర్లు నమోదు చేసుకోవడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌శాతం కేవలం 52-54 శాతంగా నమోదైంది. రాబోయే ఎన్నికల నాటికి ఓటరు జాబితాలో పేరు నమోదుకు.. తద్వారా పోలింగ్ శాతం పెంపునకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. నేడు శిక్షణ.. దీని అమలుకు సంబంధించి సీఈవో సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్(ఎన్నికలు)లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నేడు (మంగళవారం) ఈఆర్ఓలు, ఏఈర్ఓలకు హరిహరకళాభవన్‌లో శిక్షణ నిర్వహించాల్సిందిగా అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) ఎస్. హరికృష్ణకు సూచించారు. త్వరితంగా అమలు.. నిర్ణీత వ్యవధిలోగా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా భన్వర్‌లాల్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. అందుకు కమిషనర్ స్పందిస్తూ .. యుద్ధప్రాతిపదికన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలుత నాలుగు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఫలితాలను బట్టి మిగతా నియోజకవర్గాల్లోనూ చేపడతామని వెల్లడించారు. ఆధార్‌కార్డులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఓటరు గుర్తింపు(ఎపిక్)కార్డులతో అనుసంధానిస్తామని, డూప్లికేట్లు , మృతులు , తదితరుల పేర్లు తొలగించేముందు నిర్ధారణ కోసం ఎన్నికల సిబ్బందిని ఇళ్లవద్దకు పంపిస్తామని తెలిపారు. ఓటర్లే తమ ఆధార్ వివరాలను తెలిపేందుకు వీలుగా టోల్‌ఫ్రీ ద్వారా ఎస్ఎంఎస్, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం వంటి విధానాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో.. భన్వర్‌లాల్‌తో సమావేశం ముగిసిన వెంటనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఖైరతాబాద్‌లోని 100, 104, 186 నెంబర్ల పోలింగ్ కేంద్రాల్లో, నాంపల్లిలోని 75, 213, 207 పోలింగ్ కేంద్రాల్లో, కార్వాన్ లోని 30, 90, 96 నెంబర్ల పోలింగ్‌కేంద్రాల పరిధిలో, సికింద్రాబాద్‌లోని 165, 163, 151, పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సోమేశ్‌కుమార్ సంబంధిత ఈఆర్‌లను ఆదేశించారు. -
కదులుతున్న ‘నకిలీ’ల డొంక
వెలుగుచూస్తున్న మరిన్ని విషయాలు యూనివర్సిటీ సర్టిఫికెట్లు సైతం తయారీ పెరుగుతున్న నిందితుల సంఖ్య ఒక్క దివిసీమలోనే 600 ఆటోలకు నకిలీ బీమా ! గుడివాడ అర్బన్/ చల్లపల్లి : నకిలీ సర్టిఫికెట్ల కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. రెండు రోజులుగా టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్న 9మంది నిందితులు వెల్లడిస్తున్న వాస్తవాలు తీవ్ర సంచలనానికి దారి తీస్తున్నాయి. దీంతో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరు కార్డులే కాకుండా యూనివర్సిటీస్థాయి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ పట్టాలను సైతం నకిలీవి సృష్టించి ఇస్తున్నట్లు విచారణలో గణేష్ అనే నిందితుడు బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఈ తరహా సర్టిఫికెట్లను తయారు చేసే వారిని, వీరి వద్ద నుంచి సర్టి ఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెలుగు చూసిందిలా.... ఇటీవల గుడివాడ సివిల్ కోర్టుకు చెందిన ఓ ఉన్నతాధికారి భర్త ద్విచక్ర వాహనం బీమా రెన్యూవల్ చేయించమని కారు డ్రైవర్‌కు ఇచ్చారు. కారు డ్రైవర్ నకిలీ పత్రాలు సృష్టించే గణేష్‌ను ఆశ్రయించాడు. అతను ఇన్సూరెన్స్ పత్రాన్ని అందించాడు. ఇన్సూరెన్స్ పత్రం తీసుకున్న తరువాత కూడా కంపెనీ నుంచి యజమానికి ఫోన్ రావడంతో నెట్లో ఇన్సూరెన్స్‌ను చెక్ చేశాడు. ఇన్సూరెన్స్ రె న్యూవల్ చేయించలేదని తేలడంతో కారు డ్రైవర్ని నిలదీశాడు. గణేష్ అనే యువకుడు రెన్యూవల్ చేసి ఇచ్చాడని చెప్పాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వలపన్ని శనివారం రాత్రి గణేష్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల అదుపులో ఉన్నవారిని ప్రశ్నించడంతో 17ప్రైవేటు కంపెనీలకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికెట్‌నైనా సృష్టిస్తాడు.. ఏ సర్టిఫికెట్లనైనా సునాయాసంగా సృష్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి గణేష్ అని పోలీసుల విచారణలో బయటపడింది. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరుకార్డులతో పాటు ఆచార్య నాగార్జున, అంబేద్కర్, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి అమ్ముతున్నాడు. రూ.2000నుంచి రూ.3000 తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. అదుపులో 15మంది నిందితులు.. ఆదివారం అదుపులోకి తీసుకున్న 9మంది నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. ఈ తరహా సర్టిఫికెట్లను ఏ నెట్ సెంటర్ నిర్వాహకులు తయారుచేస్తారని అడగడంతో మరో ఆరుగురు పేర్లను చెప్పారు. దీంతో ఆ ఆరుగురిని పోలీసులు ఆదివారం రాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఈ కేసులో మరో 20మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. గుడివాడలో 35శాతం అక్రమ ఆధార్‌లే.. గుడివాడలో నివసిస్తున్న వారిలో ఆధార్ కార్డులు పొందినవారిలో 35శాతం వరకూ అక్రమ కార్డులు పొందినవారేనని సమాచారం. ఒక్క గుడివాడ పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కేసులు చాలా ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. బెంబేలెత్తుతున్న ఆటో డ్రైవర్లు.... దివిసీమలో వెలుగుచూసిన నకిలీబీమా పత్రాలు ఆటో డ్త్రెవర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నకిలీ పత్రాల వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి బీమా సౌకర్యం వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారికి భద్రత లేకుండా పోయింది. దివిసీమ కేంద్రంగా ఏడాదిన్నర నుంచి సంబంధిత శాఖాధికారులకు తెలిసి ఈ బాగోతం సాగుతున్నా ముడుపులు తీసుకుని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. రూ.3,893 బీమా రూ.1,500లకే! ఆటోకు సంబంధించి పెంచిన ధరల ప్రకారం ఏడాదికి రూ.11,500 వరకూ బీమా చెల్లించాల్సి ఉంది. ప్రమాదం జరిగినపుడు ఆటోకు, వాహనం నడిపే డ్త్రెవర్, అందులోని ముగ్గురు ప్రయాణికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీమా సొమ్ము చెల్లిస్తారు. అలాకాకుండా చాలా మంది డ్రెవర్లు థర్డ్‌పార్టీకి మాత్రమే బీమా చేయిస్తుంటారు. ఇందుకోసం ఏడాదికి రూ.3,893 చెల్లించాల్సి ఉండగా, ఇదికూడా భారంగా భావిస్తున్న డ్త్రెవ ర్ల కోసం అక్రమార్కులు ప్రత్యేక స్కీం పెట్టారు. కొంతమంది ఆటోడ్త్రెవర్లకు ఈ విషయాన్ని చెప్పి రూ.3,893 విలువగల బీమా పత్రాలను రూ.1,500కే అందజేస్తున్నారు. తనిఖీల సమయంలో బీమా రెన్యూవల్ అయిందా లేదా అని మాత్రమే సంబంధిత అధికారులు పరిశీలిస్తుండటంతో నకిలీ బీమా పత్రాలు చెల్లుబాటవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి దివిసీమలో ఇలాంటి పత్రాలు 600ఆటోలకు అందజేసినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. -
సర్వేకు చక్కటి స్పందన
వివరాలు నమోదు చేసుకున్న ఇన్చార్జి కలెక్టర్ - పట్టణంలో కర్ఫ్యూ మాదిరి వాతావరణం - నిర్మానుష్యంగా సంగారెడ్డి - స్వచ్ఛందంగా సినిమా హాళ్లు, - పెట్రోల్ బంకుల మూత సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సర్వే సందర్భంగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు సైతం తిరగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొని వివరాలను తెలియజేశారు. ఏఎస్పీ మధుమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు సంగారెడ్డిలో కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి సోమేశ్వర వాడలో పేర్లు నమోదు చేయించుకున్నారు. మాజీ ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి స్థానికంగా లేకపోవడంతో సర్వేలో పాల్గొనలేకపోయారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్దన్ నాయక్ సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను తెలియజేశారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ఇంటి నంబర్లు దొరకక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంజీరా నగర్‌లోని 7-8-686/4/6 నంబరు గల ఇంటిలో యజమాని రాజయ్య పేరు ఉందని 739వ ఎన్యూమరేటర్‌కు మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చారు. అదే ఇంటి నంబరు ప్రభుగౌడ్ పేరును మరో ఎన్యూమరేటర్‌కు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రశాంత్‌నగర్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు సర్వేలో పేర్లను నమోదు చేయించుకోగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. తమకు ఆధార్, ఓటరు కార్డుతో పాటు సొంత ఇల్లు ఉన్నందున ఇక్కడే నమోదు చేయించుకుంటామని చెప్పగా, స్థానికులు అడ్డుకొని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి పేర్లను ఇక్కడ నమోదు చేయించవద్దని స్థానికులు అధికారులను కోరారు. సర్వేకు ముందుగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రీ సర్వే సమయంలో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సర్వే ఫారాలను తీసుకువచ్చిన సిబ్బందికి సర్వే చేసే రోజు వారి సంఖ్య పెరగడంతో ఫారాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైంది. సర్వేను ఇన్చార్జి కలెక్టర్ శరత్‌తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తహశీల్దార్ రాధాబాయి, మున్సిపల్ ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. పట్టణం నుంచి పల్లెలకు... సర్వేలో పాల్గొనేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పట్టణంలోని వివిధ పరిశ్రమలు, అడ్డా కూలీలు, వ్యాపార సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో పట్టణంలోని కొత్త సంగారెడ్డి ప్రాంతంలో మెజార్టీ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించింది. ఇంటి యజమానులు హైదరాబాద్‌లో స్థిరపడగా స్థానికంగా ఉన్న ఇండ్లను అద్దెకు ఇచ్చారు. అద్దెకుంటున్న వారు సైతం సర్వేలో పాల్గొనేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పట్టణంలోని పలు కాలనీలు జన సంచారం లేక వెలవెలబోయాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు సిద్దిపేట టౌన్: సర్వే సందర్భంగా తప్పుడు సమాచారమిస్తే తిప్పలు తప్పవని సర్వే మెదక్ స్పెషలాఫీసర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ బుర్ర వెంకటేశం, ఇన్చార్జి కలెక్టర్ శరత్ హెచ్చరించారు. సిద్దిపేట రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. మన ఊరు- మన ప్రణాళిక పక్కాగా రూపొందించుకొని అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న స్పందన అభినందనీయమన్నారు. జిల్లాలో 8.48 లక్షల కుటుంబాలు ఉండగా 32 వేల మంది సిబ్బందిని సర్వే కోసం ఏర్పాటు చేశామన్నారు. సర్వే కన్నా ముందు ఇళ్ల సంఖ్యను లెక్కించామని, ఇందుకు అనుగుణంగా నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లను నియమించామని, రిజర్వ్‌లో సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని, సపోర్ట్ ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేశామని, సర్వేలో అవాంతరాలు చోటు చేసుకోకుండా వివిధ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు. అయితే కొందరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేర్వేరు కుటుంబాల పేరుతో నమోదు చేయించుకోవడంతో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. కుటుంబాల సంఖ్య కన్న 15 శాతం ఎక్కువ సర్వే ఫారాలను ఏర్పాటు చేసినప్పటికీ స్వల్ప కొరత ఏర్పడిందన్నారు. వెంటనే అదనపు సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని ఎంత రాత్రి అయినా సర్వేను పూర్తి చేస్తామని, అన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తామన్నారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేయాలో, ఎవరికి సంక్షేమ ఫలాలు అందించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రజలు కూడా పారదర్శకంగా ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. సమావేశంలో గడా స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్‌గా దోపిడీ
ఓటరు కార్డుల పంపిణీలో చేతివాటం రూ.20 నుంచి రూ.50 వసూలు మీ సేవ కేంద్రాల్లోనూ ఇదే తంతు అమలుకు నోచుకోని ఎన్నికల సంఘం హామీ పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు యథేచ్ఛగా వసూళ్ల పర్వం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన ఓటరు స్మార్ట్‌కార్డుల పంపిణీలో పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.పది విలువ జేసే కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి ఓటరుకు బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ఉండేలా పూర్తిస్థాయి వివరాలు, చిరునామాలతో స్మార్ట్‌కార్డుల పంపిణీకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటు కోసం ఇటీవల ఆరు వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న 13 వేల మందికి ఎన్నికల సంఘం స్మార్ట్‌కార్డులను జారీ చేసింది. వీటిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గంలో 213 మంది బూత్ లెవల్ సిబ్బందిని నియమించింది. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు వేలకు పైచిలుకు స్మార్ట్‌కార్డులు జారీ అయ్యూరుు. 225 మంది బూత్ లెవల్ సిబ్బంది స్మార్ట్‌కార్డుల పంపిణీ చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఓటర్లకు ఉచితంగా అందచేయాల్సిన స్మార్ట్‌కార్డులకు ధర నిర్ణయించి ఓటర్లను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు తీసుకుని పంపిణీ చేస్తున్నారు. వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తుండడంతో అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. ఉచితంగా ఇవ్వాల్సిన కార్డులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా అడిగితే... ‘మీ ఇష్టం... ఎండలో తిరుగుతున్నాం... ఎంతో కొంత ఇవ్వాల్సిందే...’ అని దబాయిస్తుండడం గమనార్హం. మీ సేవ కేంద్రాల్లోనూ వసూళ్లు ఎన్నికల సంఘం ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన స్మార్ట్‌కార్డులను ఎక్కువగా మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. బూత్ లెవల్ సిబ్బంది సకాలంలో ఓటరు స్మార్ట్‌కార్డులను పంపిణీ చేయకపోవడం... ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కార్డుల కోసం ఓటర్లు మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా... మీ సేవ కేంద్రాల నిర్వహకులు ఓటర్ల నుంచి అధికసొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.50 నుంచి రూ.100 వరకు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి... ఉచితంగా స్మార్ట్‌కార్డుల జారీ చేస్తామన్న ఎన్నికల సంఘం హామీ అమలుకు కృషి చేయూలని ఓటర్లు కోరుతున్నారు. -
ఏప్రిల్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు:భన్వర్ లాల్
-
ఓటు కోసం కదలండి
ఓటు వజ్రాయుధం. మన తలరాతను మార్చే సాధనం. ఓటు ఉంటేనే హక్కులు సాధించుకోగలం. నేతలనూ నిలదీయగలం. అర్హత వున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయినప్పుడే ఇది సాధ్యం. ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం, వినియోగించాల్సిన అవసరం వచ్చేసింది. మే 7న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆ జాబితాలో మీ పేర్లు ఉంటే సరి. లేని పక్షంలో నమోదుకు ఒక రోజు అవకాశం కల్పించారు. మార్చి 9న కొత్త ఓటుకోసం దరఖాస్తు చేయవచ్చు. అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్: నగరపాలక సంస్థలో ఓటరు దరఖాస్తులు స్వీకరిం చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు చేశారు. కొత్తగా నమోదు కావాల్సి ఉన్నా, ఒక వేళ ఓటర్ల జాబి తాలో పేర్లు గల్లంతయినా, నగరంలో ఒక ప్రాం తం నుంచి మరొక ప్రాంతానికి ఇల్లు మారినా, మీ పేర్లు కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. = ఓటు కోసం దరఖాస్తు చేసుకొనే వారు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. = కొత్తగా ఓటుకోసం దరఖాస్తు చేసుకొనే వారు ఫారం-6 పూర్తిచేయాలి. = రెండు స్టాంప్‌సైజు ఫొటోలు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. -
ఓటున్నా.. కార్డు లేదన్నా!
పాలమూరు, జిల్లాలో చాలామందికి ఓటరు కార్డులేదు. కొత్తగా నమోదుచేసుకున్న వారికి కార్డులు అందనేలే దు. ఇస్తారా? లేదా? అనే విషయం కూ డా అయోమయంగా ఉంది. కొత్త ఓట ర్లకు మీసేవ కేంద్రాల ద్వారా ఓటరు గు ర్తింపు కార్డులను వెంటనే పంపిణీచేస్తామ ని చెబుతున్నా ఆచరణలో అమలుకావ డం లేదు. చాలామందికి ఈ కార్డులు ఎ క్కడ తీసుకోవాలన్న దానిపై అవగాహన లేదు. జిల్లాలో కొత్తగా నమోదైన రెండు ల లక్షల కార్డులను అందజేయాల్సి ఉం ది. ఇందుకు సంబంధించిన కార్డులు పం పినట్లు ఎన్నికల సంఘం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ఆమేరకు పంపిణీ జరగలేదు. ఓ వైపు కార్డులు రాకపోవడం.. వ చ్చిన వాటిని కూడా తీసుకెళ్లేందుకు ఓట ర్లు ఉత్సాహం చూపకపోవడం, మరోవై పు గుర్తింపు కార్డులు మీ-సేవ కేంద్రాల కు తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల పదులసంఖ్యలో నే కార్డులు అందజేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఆఖరి క్షణాల్లో గుర్తింపు కార్డుల కోసం ఓటర్లు మీ-సేవ కేంద్రాల వద్ద బారులుతీరే పరిస్థితి తప్పదు. ఇతర సేవల్లోనూ అంతే.. ధ్రువపత్రాల జారీలో దళారుల వ్యవస్థ దూరం చేయాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కా నీ క్షేత్రస్థాయిలో వాటి పనితీరు సక్రమం గా లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు. జిల్లాలో దాదాపు 248 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందు లో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. దేవరకద్ర మండలం మొత్తానికీ ఒకటే మీ సేవ కేంద్రం ఉంది. కొత్తకోటలో నాలుగు కేంద్రాలు ఉన్నా యి. షాద్‌నగర్‌లో ఇప్పటికే ఐదు కేంద్రాలుండగా మరో అయిదింటికి అనుమతిం చారు. బొంరాస్‌పేటలో రెండు ఇలా.. ప లు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే అధిక మొత్తంలో మీసేవ కేంద్రాల ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నారు. 15 నుంచి 20 కిలోమీట ర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ లు, మేజర్ గ్రామ పంచాయతీల్లో మా త్రం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే.. కేం ద్రాలున్న చోట మాత్రం ధ్రువీకరణ ప త్రాల అందజేయడంలో తీవ్ర జాప్యంనెలకొంది. లబ్ధిదారులు మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఆన్లైన్ సర్వర్‌డౌన్ సమస్యతో ప్రతిరోజు గంటల తరబడి మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోతున్నాయి. సర్వర్ డౌన్లోడ్ అవుతుందని కేంద్రం నిర్వాహకులు పలుమార్లు తిప్పుకుంటున్నారు. మరికొందరు ప్రింటర్ లేదని మళ్లీ రావాలనే సాకులను చెబుతూ లబ్ధిదారులను వేధిస్తున్నట్లు సమాచారం. ఆర్థికభారంతో పాటు పలుమార్లు కేంద్రం చుట్టూ తిప్పడంతో చాలా మంది విసిగిపోతున్నారు. -
నస్పూర్‌లో ఓటరుగా పవన్ కల్యాణ్!
శ్రీరాంపూర్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలవాలనుకుంటున్నారా? అయితే ఆదిలాబాద్ జిల్లా వెళ్లాల్సిందే. ఓటర్ల జాబితాల్లో కొత్తిమీరకు, కుక్కపిల్లకు, ఐశ్యర్య రాయ్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా సినీనటుడు పవన్ కల్యాణ్ పేరుతో శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పంచాయతీ ఓటరు జాబితాలో 'పవర్ స్టార్' ఫోటో ప్రచురితమైంది. పంచాయతీ పరిధిలోని నస్పూర్ కాలనీలో దేవి లచ్చయ్య ఓటరుగా ఉన్నాడు. ఆ జాబితాలో ఆయన ఫోటో ఉండాల్సిన స్థానంలో పవన్ ఫోటో ఉంది. మిగతా వివరాలన్నీ లచ్చయ్యవే. నస్పూర్ కార్యాలయంలో సిబ్బంది జాబితా పరిశీలిస్తుండగా ఈ విడ్డూరం వెలుగులోకి వచ్చింది. ఇక ఇటీవలే కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, సినీనటుడు రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇలాంటి విచిత్రాలు ఇటీవలి కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి. -
నూతన ఓటరుకు నిరాశ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దాంతో ఓటరుగా నమోదు చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఆతృతగా వెళ్లిన నూతన ఓటర్లకు నిరాశ మిగిలింది. కొంతమంది ఓటరు నమోదు ఫారాలతో, మరికొంతమంది ఆధారాలతో అక్కడకు వెళ్లి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో వారికి భంగపాటు ఎదురైంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటుహక్కు బదిలీ చేసుకునేవారు, ఓటర్ల నమోదులో తప్పులు దొర్లినవారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి బూత్ లెవల్ ఆఫీసర్లను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఆదివారాలపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత ఆదివారం మొక్కుబడిగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆదివారం కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఇబ్బందిపడిన ప్రజలు వచ్చే ఆదివారం జరగనున్న కార్యక్రమంపై పెదవి విరుస్తున్నారు. అప్పుడు కూడా తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం 2751 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల 5వేల 692 మంది ఓటర్లున్నట్లు ఇటీవల ప్రకటించిన ఓటర్ల ముసాయిదాలో లెక్కలు తేల్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ ఈడు యువత ఎక్కువగానే ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం ఓటు హక్కు పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే జిల్లాలోని బూత్ లెవల్ ఆఫీసర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ‘న్యూస్‌లైన్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒం‘గోలు’ తప్పింది: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియ లక్ష్యం తప్పినట్లయింది. గత ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే కనిపించాయి. దాని ప్రభావం తాజాగా జరిగిన కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 251 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో మూడొంతుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లున్నారు. ఒక వంతు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒంగోలు నగరంలో కొంతమేర బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నా, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలాల్లో ఎక్కువశాతం ఖాళీగానే ఉన్నాయి. పైగా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు, ఇతర ప్రాంతాలకు బదిలీ, తప్పు ఒప్పులకు సంబంధించిన ఫారాలు అందుబాటులో లేవు. దాంతో ఓటరుగా నమోదు చేయించుకునేందుకు వచ్చినవారు బూత్ లెవల్ ఆఫీసర్ల వద్ద ఉన్న ఫారాన్ని జిరాక్స్ తీసుకొని నింపాల్సిన దుస్థితి నెలకొంది. కందుకూరులో ఎక్కువ కేంద్రాలు ‘ఖాళీ’ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 220 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. వలేటివారిపాలెంలో 36 పోలింగ్ కేంద్రాలుంటే ఒక్కటి కూడా తెరుచుకోలేదు. లింగసముద్రం మండలంలో 35 పోలింగ్ కేంద్రాలుంటే మొత్తం మూతపడే ఉన్నాయి. గుడ్లూరులో 38 పోలింగ్ కేంద్రాలుంటే సగానికిపైగా తలుపులు తెరుచుకోలేదు. ఉలవపాడులో 40 పోలింగ్ కేంద్రాలకుగాను సగానికిపైగా ఖాళీగా కనిపించాయి. పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉండటానికి కారణం వాటి కోసం నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్లు తమ ఇళ్లవద్దనే కూర్చొని వచ్చిన వారికి నమోదు ప్రక్రియ చేపట్టి మమ అనిపించేశారు. కనిగిరిలో... కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓటర్ల నమోదుకు నలభై శాతం బూత్ లెవల్ ఆఫీసర్లు డుమ్మా కొట్టారు. కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో ఓటర్లు బూత్ లెవల్ ఆఫీసర్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది బూత్ లెవల్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండానే ఇళ్ల వద్ద, అంగన్వాడీ కేంద్రాల వద్ద కూర్చొని మొక్కుబడిగా ముగించేశారు. సంతనూతలపాడులో... సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 228 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే వీటిలో కూడా ఎక్కువ పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. సంతనూతలపాడులోని మండల అధికారుల నిర్వాకం ఓటర్లకు సమస్యలు తెచ్చి పెట్టాయి. బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల్లో ఎక్కువ మందిని అక్కడి మండల విద్యాశాఖాధికారి అక్షర విజయం సమావేశం కోసం కూర్చోపెట్టారు. తహసీల్దార్ కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. అద్దంకిలో... అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో 249 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదుకు అడ్డంకి ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది తమకు ఓటు హక్కు పొందే భాగ్యం లేదంటూ వారిని వారే నిందించుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు. చీరాలలో.. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే అక్కడ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలకు తాళాలు తెరుచుకోలేదు. ఓటర్ల నమోదుకు వచ్చినవారు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు వచ్చినవారు, ఇతర ప్రాంతాలకు ఓటు హక్కు బదిలీ చేయించుకోవాలనుకున్నవారు నిరాశతో వెనుదిరిగారు. మార్కాపురంలో... మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 216 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. అందుకు కారణం గతవారం జరిగిన నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు బూత్ లెవల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే. = దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. అక్కడ కూడా ఎక్కువ మంది బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేరు. = గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలున్నాయి. బేస్తవారపేట పోలింగ్ కేంద్రంలోని గరల్స్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని మిద్దెపై ఏర్పాటు చేయడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. = యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బూత్ లెవల్ ఆఫీసర్లు అయిన అంగన్వాడీ కార్యకర్తలు ఇళ్లవద్దనే ప్రక్రియ నిర్వహించారు. = కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కువమంది బూత్ లెవల్ ఆఫీసర్లు తమ విధులకు డుమ్మా కొట్టారు. ఫారాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. -
పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది (2012)లో 31,59,231 మంది ఓటర్లు ఉండగా, తాజా లెక్కల ప్రకారం 32,12,094 మందికి చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది 52,863 మంది ఓటర్లుగా చేరారు. ఓటరు కార్డుపై అవగాహన పెరగడం, వివిధ అవసరాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగం వంటి కారణాలతో ఎక్కువమంది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారు కూడా గణనీయంగా పెరిగారు. కాగా, గత ఏడాది లక్షమందికి పైగా కొత్త ఓటర్లుగా నమోదు కాగా, ఆ సంఖ్య ఈసారి 52 వేలకే పరిమితమైంది. హెదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకుగాను జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 2,47,461 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా చార్మినార్‌లో 1,61,884 మంది ఓటర్లున్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ స్టేషన్లున్న భవనాల్లో అందుబాటులో ఉంచినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.