న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈసీ సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే.. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
►పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్‌ను అనుమతిస్తారు. అయితే, ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది.
►వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వయోజనులు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉండేది.
చదవండి: (కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్)
►ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇకమీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించారు.
►ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్‌కి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. వీటన్నిటిని ఆమోదిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
చదవండి: (కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భారత మాజీ క్రికెటర్?)
Comments
Please login to add a commentAdd a comment