Union govt
-
‘సుప్రీం’లో ఆప్ సర్కార్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
Farmer's Protest 2024 Latest Updates టియర్ గ్యాస్ షెల్ తగిలి యువరైతు మృతి ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ వదలటం షెల్ తగిలి 24 ఏళ్ల యువరైతు మృతి. శుభ్ కరణ్ సింగ్ అనే యువ రైతును ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ధృవీకరణ 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 కేంద్రం వాదనను తప్పుపట్టిన పంజాబ్ ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది సరిహద్దుల్లో రైతులు చేరడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న కేంద్రం వాదనను పంజాబ్ ప్రభుత్వం తప్పు పట్టింది హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిటం వల్ల 160 మంది రైతులు గాయపడ్డారు పంజాబ్ ప్రభుత్వం బాధ్యతతో శాంతిభద్రతలను నిర్వహిస్తోంది ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత రైతులను అడ్డుకుంటున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదులుతున్న పోలీసులు కొందరు రైతులకు స్వల్ప గాయాలు రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను చర్చలకు పిలిచిన వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ట్విట్టర్లో పోస్టు పెట్టిన అర్జున్ ముండా అయినా స్పందించని రైతులు శంభూ బార్డర్లో రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు #WATCH | Union Agriculture Minister Arjun Munda says, "...In the 5th round of meeting, we are ready to talk with farmers and discuss issues like MSP, stubble, FIR, and crop diversification. I appeal to them to maintain peace and we should find a solution through dialogue." pic.twitter.com/F17XwZs3Ur — ANI (@ANI) February 21, 2024 హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారు: పంజాబ్ డీజీపీ హర్యానా పోలీసులే కావాలని రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. మొత్తం 14 టియర్ గ్యాస్ గుళ్లను ఇందుకు వాడారు. రైతుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే సంఘటనలు లేకపోయినా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై మేం మా నిరసనను హర్యానా పోలీసులకు తెలియజేశాం శంభూ సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్.. ఉద్రిక్తత చర్చలకు రావాలన్న కేంద్రం పిలుపును రైతులు పట్టించుకోలేదు పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వైపునకు రైతులు కదిలారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను పేల్చారు. దీంతో అక్కడ రైతులంతా చెల్లా చెదురయ్యారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ ఛలో.. పునఃప్రారంభం ఢిల్లీ ఛలో యాత్రను రైతులు ప్రారంభించారు ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు సరిహద్దులో మానవహారంగా పోలీసులు మోహరించి ఉన్నారు ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీ, సాక్షి: రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని పట్టుబట్టాయి రైతు సంఘాలు. దీంతో చర్చలు విఫలమై.. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద రైతులను నిలువరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో, ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదే సమయంలో.. తొలి రోజు నాటి అనుభవాల దృష్ట్యా రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను చేధించేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు వద్ద 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది మోహరించినట్లు కేంద్రం హోం శాఖ నివేదిక రూపొందించింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్డీయే ఎంపీల ఘెరావ్ ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలుపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: మళ్లీ ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా? -
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్‌లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్‌లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది. అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి. #Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF — Suneel Veer (@sunilveer08) December 12, 2023 -
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు. ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు. -
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా.. ఇక నాలుగో ప్రయత్నంగా
ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండేళ్లుగా వాయిదా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్‌లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి. కారు జోరుకు బ్రేకులు.. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది. కానీ కోల్‌బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తే రానీ.. పోతే పోనీ.. సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. -
మార్పు కోసం మార్పా?
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు. ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్‌ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు. ఇక భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి. ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్ చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్ చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఏడాది జూన్‌లో న్యాయ కమిషన్ దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది. దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది. నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు. ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్ వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా? ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్ఎస్లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్ డిఫమేషన్ ను చేర్చడం. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్ చెప్పిన మాట నిజం! అభిషేక్ సింఘ్వీ వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎన్నికలు ముగిసే వరకూ ఆహార భద్రత !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్‌కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
-
హైదరాబాద్, చెన్నై మధ్య భారీగా తగ్గనున్న దూరం
-
అనాగరిక చర్య.. విచారకరం: కేటీఆర్
హైదరాబాద్: మణిపూర్ అఘాయిత్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరికమన్న ఆయన.. కేంద్రం మౌనంగా చూస్తోందంటూ మండిపడ్డారు. ‘‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి అన్ని పార్టీలు కలసి రావాలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ హింసపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చేస్తుందని చెప్పారు. దారుణమైన వేధింపులకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలకు అన్ని పార్టీలు మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: మణిపూర్ వీడియోపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
తెలంగాణకు 2,486 కోట్లు.. ఏపీకి 4,787 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది. రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్–20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
కాళేశ్వరానికి జాతీయహోదాపై తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా విషయమై పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన పంపలేదని కేంద్రమంత్రి ప్రకటించారని, వాస్తవానికి సీఎం కేసీఆర్‌తోపాటు గతంలో నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో తాను అనేకమార్లు ప్రధాని మోదీ, జలశక్తి శాఖ మంత్రికి ఈ విషయమై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి చేసిన ప్రకటన సభతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. గతంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచిన వినతిపత్రాలు, లేఖలను హరీశ్‌రావు శుక్రవారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచి్చందని, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ అనుమతులు కూడా లభించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై 2018లో టీఆర్ఎస్ ఎంపీలు వేసిన ప్రశ్నలకు నాటి జలశక్తి మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారన్నారు. అయితే ఈ ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్‌భద్ర, మధ్యప్రదేశ్‌లోని కెన్ బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ, కాళేశ్వరంపై తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేడబ్లు్యడీటీ–2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచి్చందని, అన్నిరకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించిందన్నారు. -
‘నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సుమారు 62 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ దేశంలో నగదు చలామని గతం కంటే రెట్టింపు అయ్యింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. దేశంలో అవినీతి పెరిగిందని సీబీడీఐ చెప్పింది. దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగింది. టెర్రరిజాన్ని అదుపులోకి తెస్తామన్నారు.. ఏం చేశారు?, కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని మందిపడ్డారు. -
నర్సింగ్ లో ఏపీ టాప్
-
సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా ప్రయోగిస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించే ప్రతిపక్షాలకు చెప్తున్నా.. ఔను తెలంగాణలో మాది కుటుంబ పాలనే. నూటికి నూరుపాళ్లు కుటుంబ పాలనే. రాష్ట్రంలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ పెద్ద కొడుకుగా కేసీఆర్ అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇది వసుదైక కుటుంబం...’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ జై తెలంగాణ అనడం లేదంటూ ఇటీవల కొందరు మాట్లాడుతున్నారని.. అసలు కేసీఆర్ జైతెలంగాణ అనకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగు బంధాన్ని తెంపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శనివారం శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. దీనికి సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చర్చలో బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రగతిని వివరించారు. కేటీఆర్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు కూడా దాటని పసిగుడ్డు తెలంగాణ.. ఇప్పుడు దేశానికే టార్చ్‌బేరర్. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సూచికగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి కాంతిరేఖ. ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణను ఉన్నత ఆలోచనలతో నిలిపిన కేసీఆర్, ఆ ఆలోచనలను అమలు చేసిన అధికారులు, ఉద్యోగులు కలిసి ప్రగతిని ప్రతి గడపకు చేర్చారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ పాడుకున్న తెలంగాణ పల్లెలు ఇప్పుడు నవ చరిత్రకు నాంది పలుకుతున్నాయని కీర్తించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఉత్తమ పంచాయతీలుగా 20 గ్రామాలు నిలిస్తే అందులో 19 తెలంగాణవి కావడమే దీనికి నిదర్శనం. వ్యవసాయ ఉత్పత్తుల్లో 26వ స్థానం నుంచి ఇప్పుడు పంజాబ్, హరియాణా తర్వాత దేశంలోనే మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకిందని నాబార్డు నివేదికే చెప్తోంది. 2015లో 68.17 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తయితే.. ఇప్పుడు 2.02 కోట్ల టన్నులు వస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు ఈ గణాంకాలు కనిపించటం లేదా? కొందరివి పసలేని విమర్శలు ప్రభుత్వ పథకాలు గొప్పగా ఉన్నా కొందరు వాటిపై పసలేని విమర్శలు చేస్తున్నారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి కూడా కీర్తిస్తే.. బడా వ్యక్తులకు దోచిపెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదెకరాలకు మించి భూమి ఉన్న వారి సంఖ్య కేవలం 3.1 శాతమే. రైతుబీమా కూడా పేద రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమం ఇలా ఉంటే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచేందుకు కేంద్రం ప్రయతి్నంచింది. వాటిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన 700 మంది రైతుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎల్ఐసీ వంటి సంస్థను దోస్త్‌కు దోచిపెట్టి క్రోనీ క్యాపిటలిజంను పెంచి పోషించారు. ప్రధాని కొందరు కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనుక మానవీయ కోణం ఉంది. కాళేశ్వరానికి ఖర్చు తప్పా..? కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను ప్రపంచమంతా పొగుడుతోంది. డిస్కవరీ చానల్ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందించి ప్రపంచం ముందుంచటం మనకు గర్వకారణం. కానీ అందులో అవినీతి అంటూ ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు లక్ష కోట్లను ప్రధాని ఖర్చు పెట్చొచ్చు. కానీ 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే తప్పా? రివర్స్ పంపింగ్‌కు కాళేశ్వరం కేరాఫ్‌గా నిలిస్తే.. పచ్చటి పంటలతో కళకళలాడుతూ ఇప్పుడు పాలమూరు రివర్స్ మైగ్రేషన్‌కు చిరునామాగా నిలుస్తోంది. దళిత బంధు లబ్ధిదారులతో సభ రాష్ట్రంలో దళిత బంధు పథకంతో ఎంత సంపద ఒనగూరిందో లెక్కలు తీసే బాధ్యతను సెస్‌కు అప్పగించాం. త్వరలో ఆ వివరాలు వస్తాయి. పథకం ప్రారంభించి త్వరలో రెండేళ్లు అవనున్న సందర్భంగా.. దాన్ని ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దళిత బంధు లబి్ధదారులతో భారీ సభ నిర్వహిస్తాం. జాతీయ స్థాయి ప్రముఖులు దీనికి హాజరవుతారు. ప్రధాని మాటలన్నీ డొల్లే.. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోదీ ఊదరగొట్టే మాటల్లో డొల్లతనమే తప్ప ఫలితాలు అంతంతే. కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్నది ‘డబుల్ ఇంపాక్ట్ సర్కార్’. మోదీ డబుల్ ఇంజన్‌తో ఏమాత్రం పొంతన ఉండదు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని గొప్పలు చెప్తున్నవారు చెప్పేవన్నీ ‘సబ్ బక్వాస్’. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అందించే కళ్లద్దాలు మేడిన్ తెలంగాణ. ఈ నిజాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదు. వారి కోసం అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరం పెట్టించాలి. ప్రజాసంక్షేమం విషయంలో కేసీఆర్‌కు కులమతాలతో సంబంధం లేదు. ఆయనకు పేదరికమే గీటురాయి. నల్గొండలో మేం ఫ్లోరైడ్ రక్కసి సమస్యను పరిష్కరించాం. కానీ కేంద్రం హర్‌ఘర్ జల్ అంటూ హడావుడి చేస్తోంది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వవచ్చు. కానీ గుండె గుండెలో విషం నింపొద్దు. రియల్ లీడర్‌గా తెలంగాణ చాక్లెట్ నుంచి రాకెట్ వరకు, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ వరకు, యాప్స్ నుంచి మ్యాప్స్ వరకు ఉత్పత్తి, అభివృద్ధి చేస్తూ తెలంగాణ రియల్ లీడర్‌గా ఎదిగింది. వరల్డ్ గ్రీన్ సిటీగా, హరితహారం ద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నం చేయడంవంటి తెలంగాణ విజయాలను ‘మన్‌కీబాత్’లో ప్రస్తావించేందుకు కూడా ప్రధాని మోదీకి నోరు రాలేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘జోడో’ అంటూ పక్క నుంచి వెళ్లిపోం మునుగోడు ఎన్నికప్పుడు వంద మంది ఎమ్మెల్యేలను బరిలో దింపారన్న విమర్శలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అవి ఎన్నికలు.. కచి్చతంగా పోరాడుతాం. ఎంత మందితోనైనా ప్రచారం చేయిస్తాం. జోడో యాత్ర అని నడుస్తూ ఎన్నిక జరిగే ప్రాంతం పక్కనుంచి వెళ్లిపోయే రకం కాదు..’’ అని పరోక్షంగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దీనిపై భట్టి విర్కమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టినది రాజకీయ యాత్ర కాదన్నారు. మనుషుల మధ్య వైషమ్యాలు పెంచి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో.. దేశాన్ని ఒక్కటి చేసే యాత్రే భారత్‌జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ.. తాను మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో జోడోయాత్ర చేయకుండా పక్క నుంచి వెళ్లిపోవటాన్ని ప్రస్తావించానని చెప్పారు. ఇక ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారని, బీజేపీలో చేరాక అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండున్నర గంటలు.. లెక్కలు, విమర్శలు.. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలు సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను వివరిస్తూ, ఆయా అంశాలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్‌లు, ఇతర పత్రాలను చూపిస్తూ ప్రసంగించారు. శుక్రవారం నాటి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకపోగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో మంత్రి కేటీఆర్ సమాధానం మాత్రం కేంద్రం తీరును విమర్శిస్తూనే సాగింది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో గత ఎనిమిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులతో బేరీజు వేసి విశ్లేíÙంచారు. అడపాదడపా కాంగ్రెస్ పాలనను ఉటంకిస్తూ కొన్ని విమర్శలు చేసినా.. కేటీఆర్ ప్రసంగం ఆసాంతం బీజేపీ, మోదీ ప్రభుత్వం లక్ష్యంగా సాగింది. – దేశ అభివృద్ధి గురించి ప్రధాని మోదీ చేస్తున్న ప్రసంగాలకు, వాస్తవాలకు పొంతనే లేదని.. దేశానికి గుజరాత్ మోడల్ అంటూ చేసిన ప్రచారం పూర్తి డొల్లేనని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరెంటు, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ అక్కడి బీజేపీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు, అక్కడి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. మోటార్లకు మీటర్ల బిగింపు గురించి ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో కేంద్రం రాసిన లేఖ ప్రతిని చూపారు. నోట్ల రద్దుకు మద్దతు తప్పే! గతంలో పెద్దనోట్ల రద్దుకు మేం మద్దతునివ్వడం సరికాదు. అలా చేసి ఉండాల్సింది కాదు. ఈ విషయంలో గతంలో ఎంఐఎం, ఇతర విపక్షాలు చెప్పిందే నిజమైంది. దేశమంటే అదానీ, ప్రధాని మాత్రమే కాదు. 140 కోట్ల మంది ప్రజలు. ఒకరు అమ్మేవారు, మరొకరు కొనేవారు. సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా వాడిన నీతి బాహ్య సర్కార్ బీజేపీది. తెలంగాణపై పగబట్టినట్టు సవతి తల్లి ప్రేమ చూపుతూ కేంద్రం ఆర్థిక పరమైన ఆంక్షలతో కుంగదీసే ప్రయత్నం చేస్తోంది. ఐటీఐఆర్‌ను రద్దు చేశాక కాకతీయ టెక్స్టైల్ పార్కు తదితరాలకు ఉత్తుత్తి మాటలే తప్ప ఇప్పటిదాకా ఇచ్చింది గుండుసున్నా. నా మాటలకు కట్టుబడి ఉన్నా. – కేటీఆర్ -
సవాల్ మీద సవాల్.. ఆ వర్గాలకు వరాలు ఏ స్థాయిలో..?
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది. కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్ బడ్జెట్‌కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. తరుముకొస్తున్న ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్‌కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి. -
స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అమల్లో ఏపీకి ఉత్తమ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమం కార్యక్రమం (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్ హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేశాయని తెలిపారు. చదవండి: (కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు) -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
అలాంటప్పుడు అక్కడ సర్కార్ ఎందుకు?: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం పంచాయితీకి సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు.. కేంద్రానికి ఉన్న అధికారాలకు కొనసాగింపు అని కేంద్రం నొక్కి చెప్పడంతో, అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని.. సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అధికారం, సేవలు.. పరిపాలనపై నియంత్రణ.. తదితర అంశాల్లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలోనే వైరం నడుస్తోంది. ఈ దరిమిలా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వరుసగా మూడోరోజు వాదనలు వింది. గురువారం విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఢిల్లీ దేశ రాజధాని అని, దానికంటూ ఓ ఏకైక హోదా ఉందని, అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు గనుక ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలోని ఓ తీర్పును ప్రస్తావించిన ఆయన.. ఢిల్లీ కాస్మోపాలిటన్ నగరమని, ఒక మినీ భారత్లాంటిదని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలోని అంశాలను ధర్మాసనం గౌరవిస్తుందని, కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విషయాలపై శాసనం చేసే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలపై పార్లమెంటుకు శాసనపరమైన నియంత్రణ ఉంటే, ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే.. ఢిల్లీ శాసన అధికారాలలో భాగంగా సేవలపై శాసన నియంత్రణను ఏవిధంగా ఉద్దేశించలేదో చెప్పాలని న్యాయస్థానం సొలిసిటర్ జనరల్‌ను కోరింది. ఒకానొక తరుణంలో ఎల్జీ విశిష్ట అధికారాల ప్రస్తావన సైతం లేవనెత్తింది బెంచ్. ఆ సమయంలోనే సోలిసిటర్ జనరల్.. కేంద్ర పాలిత ప్రాంతమనేది కేంద్రానికి(యూనియన్)కు కొనసాగింపని, ఆ ఉద్దేశం దాని పరిధిలోని పరిపాలన కేంద్రం పరిధిలోకి వస్తుందని సోలిసిటర్‌జనరల్ కోర్టుకు తెలిపింది. అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎందుకంటూ బెంచ్.. సోలిసిటర్ జనరల్‌ను నిలదీసింది. పరిపాలన కేంద్ర ప్రభుత్వానిదే అయితే, ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోలిసిటర్ జనరల్ స్పందించారు. క్రియాత్మక నియంత్రణ అనేది ఎన్నికైన ప్రభుత్వానిదని, కేంద్రం పరిపాలనా నియంత్రణతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. అందులో కేంద్ర, రాష్ట్ర సర్వీసులు ఉన్నాయని, కేంద్ర పాలిత ప్రాంతాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరుణంలో సమయం ముగియడంతో.. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 17కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఢిల్లీలో పాలన, ఇతర సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం.. అత్యున్నత న్యాయస్థానాన్ని గతంలో ఆశ్రయించింది. 2018లో.. ధర్మాసనం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వం సలహాలకు కట్టుబడి ఉంటారని, ఇద్దరూ ఒకరితో ఒకరు సామరస్యపూర్వకంగా పనిచేయాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే.. 2019 ఫిబ్రవరిలో మాత్రం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్న తీర్పులను వెల్లడించింది. పైగా ఆ ఇద్దరు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఆ తర్వాత రిటైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ అయ్యింది. -
కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్
-
వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్ రాజ్యమే
దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్ కంటే తెలంగాణలో కలెక్టర్ చాంబర్ అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. జల వివాదాలు తీర్చడం లేదు దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బిజీ బిజీగా కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్‌కు ఆయన పేరు పెడతామన్నారు. రెండు జిల్లాలకు వరాలు మహబూబాబాద్‌కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు.