సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమం కార్యక్రమం (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్ హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేశాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment