NCERT
-
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
మన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యమెంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) జరగనుంది. దీనికో సం రాష్ట్రంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్ళను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారు. ప్రతి మూడేళ్ళకోసారి ఈ పరీక్ష జరుగుతుంది. 2021లో జరిగిన న్యాస్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అయిదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు స్కోర్ కంటే కూడా రాష్ట్ర విద్యార్థుల స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించా రు. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. న్యాస్ను ప్ర తిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలుగా పరీక్షపై పాఠశాలల ప్రధానోపాధ్యా యులు దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఇప్పటికే మూడుసార్లు మోడల్ పరీక్షలు నిర్వహించారు. తాజా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. ఫరాఖ్‌కు నిర్వహణ బాధ్యతలు న్యాస్ పరీక్షను 2021 వరకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహించింది. ఈసారి నుంచి రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 పేరుతో ఎన్సీఈఆర్టీలోని స్వ తంత్ర సంస్థ ఫరాఖ్ (పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్) నిర్వహిస్తోంది. గ తంలో 3, 5, 8, 10 తరగతులకు న్యాస్ పరీక్ష ఉండేది. ఈసారి 3, 6, 9 తరగతులకు ఆ క్లాసు ల్లోని ప్రమాణాల మేర పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి 50 శాతం, ప్రైవేటు స్కూళ్ళ నుంచి మరో 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,500 పాఠశాలల నుంచి లక్ష మందిని పరీక్షకు ఎంపిక చేశారు. ఈసారి క్రిటికల్ థింకింగ్ కూడా.. న్యాస్ పరీక్ష విధానంలో ఈసారి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. ఈసారి అదనంగా విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)కు సంబంధించిన నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలు, భవిష్యత్‌లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. మల్టిపుల్ చాయిస్‌గా ఉండే ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మూడో తరగతికి 45 ప్రశ్నలు, గంటన్నర సమయం, ఆరో తరగతికి 51 ప్రశ్నలు, గంటన్నర, 9వ తరగతికి 60 ప్రశ్నలకు రెండు గంటల సమయం ఉంటుంది. మొత్తం మీద న్యాస్ పరీక్ష కఠినంగా ఉండే అవకాశం ఉందని టీచ ర్లు చెబుతున్నారు. ప్రశ్నలను అనేక విధాలుగా ఇస్తున్నారని, సెంట్రల్ సిలబస్‌తో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యార్థులు ఏ మేరకు జవాబిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు. -
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
న్యూఢిల్లీ: సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ స్పందించారు. ఆదివారం(జూన్16) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. చరిత్రను తెలియజేసే అంశాలను బోధిస్తామని, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్ తెలిపారు. ‘పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం. అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో పిల్లలకెందుకు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పుస్తకాల్లో చేర్చకూడదా.. కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా.. ఇటువంటి అంశాలనే సిలబస్‌లో చేర్చాం. చారిత్రక విషయాలతో పాటు సమకాలీన అంశాలను సిలబస్‌లో చేర్చడం మా బాధ్యత’అని సక్లానీ తెలిపారు. -
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
సీబీఎస్ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. -
మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో గణితంలో గాడితప్పుతున్నట్లు జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో 49 శాతం మంది కనీస సామర్థ్యాలు చూపలేకపోతున్నారని సర్వే పేర్కొంది. ప్రధాన రాష్ట్రాల్లో విద్యార్థుల మాతృ భాషల అభ్యసనతోపాటు గణితం సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను మదించి ఎన్సీఈఆర్టీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తెలంగాణలో 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించింది. బేసిక్స్ కూడా అంతంతే.. ఈ అధ్యయనం నివేదిక ప్రకారం... ప్రాథమిక విద్య చదువుతున్న వారిలో చాలా మంది బేసిక్స్‌లోనూ బాగా వెనుకబడ్డారు. టెన్త్ విద్యార్థుల్లో రెండంకెల లెక్కలకూ తడుముకొనే పరిస్థితి ఉంది. కరోనా కాలంలో విద్యార్థులు ఎల్రక్టానిక్ పరికరాలకు అతుక్కుపోవడం, స్వయం సామర్థ్యం పెంపు దెబ్బతినడానికి కారణమైంది. ఏ చిన్న లెక్కకైనా క్యాలిక్యులేటర్, ఆన్లైన్లో వెతుక్కొనే పద్ధతికి అలవాటయ్యారు. 8–10 తరగతుల విద్యార్థులు కాగితంపై లెక్కజేయడానికి అవసరమైన దానికన్నా రెండింతల సమయం తీసుకుంటున్నారు. మాతృభాషలో చదవలేని వారు 19 శాతం ఉన్నట్లు తేలింది. పట్టుమని పది పదాలు తప్పులు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన విద్యార్థులు 13 శాతం ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతమే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మూడో తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తోంది. రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో 43 శాతం మంది మూడో తరగతిలో ఉన్నారని సర్వేలో గుర్తించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి చర్యలు అనుసరిస్తాయనే విషయమై స్పష్టత ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. టీచర్ల కొరతా కారణమే ప్రభుత్వ పాఠశాలల్లో 18 సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనకన్నా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. పైగా ఈ పనులకే కచ్చితత్వం ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేథ్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు సరైన ప్రతిభ చూపే అవకాశం లేదు. దీనిపై విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, అధ్యక్షుడు, రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో భారత్
న్యూఢిల్లీ: అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సి.ఇసాక్ తెలిపారు. ‘ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఎందుకంటే భారత్ అనే పేరు చాలా పురాతనమైన పేరు. విష్ణుపురాణం వంటి 7 వేల ఏళ్ల నాటి పురాతన గ్రంథాల్లోనే భారత్ పేరును ప్రస్తావించా’ అని ఆయన వివరించారు. అయితే ప్యానల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు. అనంతరం ఈ మేరకు సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలను డొమైన్ నిపుణులు తదితరులకు ఎప్పటికప్పుడు తెలియపరిచి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. అందుకే ఈ అంశంపై ఇప్పుడే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది తొందరపాటు చర్య అవుతుంది’ అని అందులో పేర్కొంది. ‘ఇండియా’ కూటమికి భయపడే: విపక్షాలు కమిటీ సిఫార్సులను విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ‘చివరికి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్‌లో కూడా దేశ చరిత్రను బీజేపీ ఎలా వక్రీకరించాలని చూస్తోందో దీనిని బట్టి మరోసారి రుజువైంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ దృష్టిలో ఇండియా, భారత్ పేర్లు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ప్రధాని మోదీని విపరీతంగా భయపెడుతోందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ఎన్డీఏ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఇలా పేర్ల మారి్పడి పరంపర కొనసాగిస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆర్జేడీ తదితర పార్టీలు కమిటీ సిఫార్సులను తప్పుబట్టాయి. ‘‘విపక్షాలు తమ కూటమి పేరున ‘ఇండియా’ బదులు భారత్‌గా ఇప్పడు మార్చేస్తే మోదీ సర్కార్ వెంటనే దేశం పేరును ‘భారత్’కు బదులు జంబూదీ్వపం అనో మరేదైనా పేరో పెట్టే స్తారా ?’’ అని ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు. జీ20 శిఖరాగ్రంతో మొదలు భారత్ పేరు తొలుత ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రత్యక్షమవడం విదితమే. రాష్ట్రపతిని అప్పటిదాకా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా సంబోధిస్తుండగా కొత్తగా దానికి బదు లు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఆ ఆహ్వాన పత్రికల్లో మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సీటు ముందు ఉంచిన నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అనే రాసి ఉండటం తెల్సిందే. కమిటీ ఏం చెప్పిందంటే... ఎన్సీఈఆర్టీ ఉన్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ ఇసాక్ సంఘ్ పరివార్‌కు సన్నిహితుడు. దాని తాలూకు అతివాద సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షునిగా ఆయన పని చేశారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు కూడా. ఎన్సీఈఆర్టీకి కమిటీ చేసిన సిఫార్సులను ఆయన సవివరంగా పేర్కొన్నారు. అవేమిటంటే... ► బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించారు. వీలైనంత వరకూ భారత్ ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగునపడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి ఇకమీదట బోధించాలి. ► ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో హిందూ వైఫల్యాలను మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ మొగలులు తదితర సుల్తాన్లపై హిందూ రాజులు సాధించిన విజయాలను మాత్రం ప్రస్తావించలేదు. ► అందుకే మన చరిత్రలో పలు యుద్ధాల్లో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్య పుస్తకాల్లో మరింతగా చోటు కలి్పంచాలి. ► అన్ని పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఎన్‌కేఎస్)ను కొత్తగా ప్రవేశపెట్టాలి. ► కమిటీలో ఐసీహెచ్ఆర్ చైర్పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, వసంత్ షిందే, మమతా యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
6, 7, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణలు తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కరిక్యులమ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర విద్యార్థులు మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. సబ్జెక్టు పాఠ్యాంశాల వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో కొనసాగే ప్రైవేట్ స్కూళ్లు కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలనే అనుసరించాల్సి ఉంటుంది. గత ఏడాది 8వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచేనాటికి కొత్త పాఠ్యపుస్తకాలు రెడీ స్కూళ్లు తెరిచే నాటికల్లా కొత్త పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించేలా పాఠశాల విద్యాశాఖ ముద్రణ పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పాఠ్యపుస్తకాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. పేపర్, ముద్రణ నాణ్యమైన రీతిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అట్ట డిజైన్‌తోపాటు లోపలి చిత్రాలు, ఇతర అంశాలను కూడా సీఎం సూచనల మేరకు ముద్రిస్తున్నారు. మే చివరి వారానికల్లా పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తికానుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 404 టైటిళ్లలో 5.05 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని తరగతుల పుస్తకాలను రెండు సెమిస్టర్లుగా ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే సెమిస్టర్ 1 పుస్తకాలను జగనన్న విద్యాకానుక కిట్లలో అందచేస్తారు. తెలుగు, హిందీ, సోషల్ సబ్జెక్టులకు ఎస్సీఈఆర్టీ 2023–24 విద్యాసంవత్సరంలో 6, 7, 9వ తరగతుల విద్యార్థులకు కూడా ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది 6, 7వ తరగతుల్లో ఇంగ్లీషు, గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, హిందీ, సోషల్ సబ్జెక్టులకు మాత్రం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందిస్తారు. సబ్జెక్టు అంశాల్లో అత్యున్నత సామర్థ్యాలను సమకూర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడేలా సబ్జెక్టు అంశాల్లో మాత్రమే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఇతర చారిత్రక అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు వీలుగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన సోషల్ పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గత ఏడాది 8వ తరగతిలో ఇంగ్లీషు, మేథ్స్, సైన్సు, సోషల్ సబ్జెక్టుల పుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ప్రవేశపెట్టారు. 9వ తరగతి విద్యార్ధులకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నారు. మేథ్స్ సైన్సు, ఇంగ్లీషుతో పాటు సోషల్, హిందీ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పంపిణీ కానున్నాయి. 9వ తరగతి తెలుగు సబ్జెక్టులో ఎస్సీఈఆర్టీ సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. టెన్త్ విద్యార్థులకు 2024–25లో ఎన్సీఈఆర్టీ బుక్స్ పదో తరగతి విద్యార్థులకు 2023–24 విద్యాసంవత్సరానికి గతంలో మాదిరిగానే ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలనే అందించనున్నారు. గత ఏడాది ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అభ్యసించిన విద్యార్థులు ఈ ఏడాది 9వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలనే అభ్యసించనున్నారు. వీరు 2024–25లో సీబీఎస్ఈ విధానంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. అందుకు అనుగుణంగా 2024–25లో టెన్త్ విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు అమెజాన్ ద్వారా పంపిణీ! ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ప్రైవేట్ ప్రింటర్ల ద్వారా పుస్తకాల ముద్రణ చేపట్టిన విద్యాశాఖ వాటిని నేరుగా ఆయా స్కూళ్లకు అందించడంపై కసరత్తు చేస్తోంది. అమెజాన్ ద్వారా వీటిని పంపిణీ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.విద్యార్థులు/స్కూళ్ల యాజమాన్యాలు అమెజాన్‌లో పాఠ్యపుస్తకాల కోసం ఆర్డర్ ఇస్తే నేరుగా ప్రింటర్ల ద్వారా సరఫరా చేయటాన్ని పరిశీలిస్తున్నారు. దీనివల్ల పుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై బాదుడుకు తెర పడుతుందని భావిస్తోంది. -
కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు
సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పాఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్‌ను బాలలకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ వివరించింది. ఈ పుస్తకాలు ప్లే బుక్‌ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్ఈపీ మార్గదర్శకాలు ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్సీఈఆర్టీ పరిశీలిస్తోంది. -
పిల్లలపై కోవిడ్ ప్రతాపం.. 29% మంది విద్యార్థుల్లో లోపించిన ఏకాగ్రత
సాక్షి, అమరావతి: కరోనా క్రమంగా కనుమరుగైనా విద్యార్థులను మాత్రం మానసిక వేదనకు గురి చేస్తూనే ఉంది. వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పలు సూచనలు చేసింది. కోవిడ్ తరువాత విద్యార్థుల మానసిక స్థితిగతులపై మనోదర్పణ్ సర్వే నివేదికను ఎన్సీఈఆర్టీ ఇటీవల విడుదల చేసింది. 29 శాతం మంది విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించి చదువులపై దృష్టి కేంద్రీకృతం చేయడం లేదని సర్వేలో తేలింది. టీచర్లు, తల్లిదండ్రులు వీటిని అధిగమించేలా పిల్లలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతి చదివే 3.79 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 9,660 మంది విద్యార్థులను ప్రశ్నించి ఫలితాలు రూపొందించారు. సర్వే చేయడంతోపాటు మానసిక ఆందోళన, ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎన్సీఈఆర్టీ సూచించింది. సర్వేలో తేలిన సమస్యలు ►29 శాతం మంది విద్యార్థులలో ఏకాగ్రత లోపించగా 43 శాతం మందిని మానసిక ఆందోళన వెంటాడుతోంది. పాఠశాలలు తెరిచిన తరువాత పరిస్థితులు బాగున్నట్లు 73 శాతం మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ►దీర్ఘకాలం పాఠశాలలు మూతపడటం, ఆటపాటలకు దూరం కావడంతో పిల్లల శరీరాకృతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ శరీర ఆకృతిపై 55 శాతం మంది సంతృప్తితో ఉండగా 45 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ►బోధనాంశాలను గ్రహించడం, ప్రతి స్పందించడంలో మాధ్యమిక స్థాయిలో 43 శాతం మంది విద్యార్ధులు చురుగ్గా ఉండగా 57 శాతం మంది తక్కువ చొరవతో ఉన్నారని సర్వేలో తేలింది. సెకండరీ స్థాయిలో 46 శాతం మంది ప్రతిస్పందిస్తున్నట్లు వెల్లడైంది. ►ఆన్లైన్ అభ్యసనాలను అనుసరించడంలో 49 శాతం మంది నైపుణ్యాన్ని ప్రదర్శించగా 51 శాతం మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థంకాని అంశాలను టీచర్ల ద్వారా నివృత్తి చేసుకునేందుకు 28 శాతం మంది సందేహిస్తున్నారు. మాధ్యమిక స్థాయి నుంచి పైదశకు మారిన పిల్లలు చదువులపై పూర్తి ఆసక్తిని కనబర్చడం లేదు. చదువుల్లో అలసట, శక్తి హీనతకు గురవుతున్నట్లు 48 మంది పేర్కొన్నారు. సెకండరీలో 29 శాతం మంది, మాధ్యమికలో 25 శాతం మంది ఒంటరితనంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ.. ఏకాగ్రత లేమి: 29 శాతం చదువుల్లో వెనుకబడని వారు: 22 శాతం చదువు అలవాటు లేమి: 16 శాతం సమయ నిర్వహణ చేయలేనివారు: 14 శాతం చదువులకు ఆటంకాలున్న వారు: 12 శాతం చదివింది అర్థంకాని వారు: 7 శాతం చదువంటే ఆందోళనతో ఉన్న వారు: 50 శాతం పరీక్షలంటే భయపడేవారు: 31 శాతం ఆందోళన చెందని వారు: 15 శాతం భావోద్వేగాల పరిస్థితి ఇలా భావోద్వేగాల్లో తరచూ మార్పు: 43 శాతం తీవ్రమైన భావోద్వేగాలు లేనివారు: 27 శాతం తీవ్రమైన భావోద్వేగాలున్నవారు: 14 శాతం భయంతో ఉన్న వారు: 7 శాతం నిద్ర అలవాటులో మార్పులు మాధ్యమిక విద్యార్ధులు: 32 శాతం సెకండరీ విద్యార్ధులు: 43 శాతం రోజూ ఒకేమాదిరిగా ఉన్న వారు: మాధ్యమిక: 28 శాతం సెకండరీ: 24 శాతం ఏం చేయాలంటే.. ►విద్యార్థుల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, పెద్దలకు టీచర్లు దిశానిర్దేశం చేయాలి. విద్యార్థుల్లో ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి. ►మానసిక, భావోద్వేగ పరిస్థితులు నియంత్రించే అంశాలను పాఠ్యాంశాలకు అనుసంధానించాలి. భావోద్వేగాలను నియంత్రించేలా నైపుణ్యాలను పెంపొందించాలి. ►కుటుంబం పరిస్థితులు, ఆత్మన్యూనతతో ఒత్తిడికి గురయ్యే కౌమార దశ విద్యార్థుల్లో భయాలను టీచర్లు పోగొట్టాలి. తల్లిదండ్రులతో సంప్రదిస్తూ సున్నితంగా వ్యవహరించాలి. అవసరమైతే మానసిక నిపుణులతో చర్చించేలా సూచనలు చేయాలి. -
స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అమల్లో ఏపీకి ఉత్తమ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమం కార్యక్రమం (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్ హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేశాయని తెలిపారు. చదవండి: (కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు) -
Telangana: టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులపై వస్తున్న విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసి.. పరీక్ష విధానం కాస్త తేలికగా ఉండేలా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెన్‌్త’కు కఠిన పరీక్ష శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. చాయిస్ తగ్గించడం, వ్యాసరూప ప్రశ్నల విధానాన్ని కఠినం చేయడం, ఒకేరోజు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు నిర్వహించడంపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను ఈ కథనం వెలుగులోకి తెచ్చింది. పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఈ అంశాలను ఎత్తిచూపుతూ.. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమాలోచనలు జరిపారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రశ్నపత్రాలు, విధానంలో మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. అభ్యంతరాలను పరిశీలించి, పరీక్ష పేపర్లలో మార్పులు తెస్తూ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఆమోదించగానే ప్రశ్నపత్రాలను మార్చనున్నారు. చాయిస్ పెంపు.. ప్రశ్నల తగ్గింపు.. రెండేళ్ల కరోనా కాలం తర్వాత ఈసారి వందశాతం సిలబస్‌తో టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు ఉంటాయంటూ.. సంబంధించిన మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఆ పేపర్లను చూశాక విద్యార్థులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యపోయారు. రెండు, మూడు మార్కుల సూక్ష్మప్రశ్నలకు గతంలో ఉన్న చాయిస్ ఎత్తివేయడంతో.. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. ఇక వ్యాసరూప ప్రశ్నలను సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపులుగా ఇచ్చారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలని కోరుతారు. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోడల్ పేపర్లలో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ఇచ్చి.. ప్రతి గ్రూప్‌లో ఒకదానికి సమాధానం రాయాలని పేర్కొన్నారు. ఆ గ్రూపులోని రెండు ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ఈ ఆందోళనను ఎస్సీఈఆర్టీ అధికారులు పరిగణనలోనికి తీసుకున్నారు. సూక్ష్మప్రశ్నలకు ఎక్కువ చాయిస్ ఇవ్వడం మంచిదని.. వ్యాసరూప ప్రశ్నలనూ సెక్షన్ విధానంలో ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అంతేగాకుండా వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్–కెవిుస్ట్రీ/బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలనే డిమాండ్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది. మార్పులను పరిశీలిస్తున్నాం.. త్వరలో వెల్లడిస్తాం టెన్త్ ప్రశ్నపత్రాల విధానం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వివిధపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల నివేదిక వచ్చాక ఏతరహా మార్పులు చేయాలనేది నిర్ణయిస్తాం. ఇప్పటికే సంబంధిత విభాగం ప్రశ్నపత్రాల మార్పులపై నిశితంగా అధ్యయనం చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం అవసరమైన మార్పులు చేస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ -
TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీ ఈఆర్టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్ఎస్ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్సీఈఆర్టీ ద్వారా మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది. కానీ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. అలాగే 2022 డిసెంబర్ 30 నాడు స్పెషల్ రివిజన్ క్లాసుల పేరిట ఎస్సీఈఆర్టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఎవరివ్వాలి? జాయిఫుల్ లర్నింగ్‌కు, ఆర్టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీఈఆర్టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్ క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్సీఈఆర్టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు) - డాక్టర్ ఏరుకొండ నరసింహుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్‌గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్‌బుక్... ఇవిగాక స్పెషల్ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి. -
పకడ్బందీగా పాఠశాల విద్య
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేసే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో రూపకల్పన చేస్తున్న నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్)కు స్థానిక అంశాలు, పరిస్థితులను జోడించనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనుంది. పిల్లల్లో పునాది స్థాయి నుంచి విద్యాభ్యసన సామర్థ్యాలు పెంచడం ద్వారా పాఠశాల విద్య, ఆపై ఉన్నత విద్య పరిపుష్టం అవుతుందన్న ఉద్దేశంతో తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను స్పృశిస్తూ స్థానికుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో మేధావులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాలుగు వేల మంది నుంచి విద్యారంగ పురోగతిపై ఈ అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ ఆయా రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయిస్తోంది. అభిప్రాయ సేకరణ, నివేదికల రూపకల్పన వంటివన్నీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌సీఎఫ్‌కు నిర్దేశించిన అంశాలు.. పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య అనే నాలుగు విభాగాల పరిపుష్టం దిశగా నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందనుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎన్సీఈఆర్టీ గుర్తించి అన్ని రాష్ట్లాలకు వీటిని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ అంశాల్లో అభిప్రాయాలను స్వీకరించనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్సీఈఆర్టీలు, ఎన్సీఈఆర్టీ జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనున్నాయి. వీటి ఆధారంగా 25 ఫోకస్ గ్రూపుల ద్వారా పొజిషన్ పేపర్లను రూపొందించనుంది. ‘మైగవ్.ఐఎన్’ పోర్టల్‌తో పాటు సర్వే కోసం మొబైల్ యాప్‌ను ఏర్పాటుచేసింది. 12 మందితో స్టీరింగ్ కమిటీ ఇక కొత్త జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. సిలబస్, పాఠ్యపుస్తకాల రూపకల్పన, బోధనా పద్ధతులను రూపొందించి అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది. ప్రస్తుతం 2005లో రూపొందించిన నాలుగవ జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో విశ్వవ్యాప్తంగా విద్యారంగం.. దానికి ఆలంబనమైన రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో, సాంకేతిక పరిజ్ఞానంలో, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఈ మార్పులొచ్చాయి. దీంతో కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌కు కేంద్రం ఏర్పాట్లుచేసింది. రానున్న కాలంలో పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధికి అవకాశమున్నందున ఆ దిశగా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లోనే పిల్లల్లో పఠనం, లేఖనం, గణితం అంశాల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్నదే లక్ష్యం. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను స్థానిక అంశాలకు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం ద్వారానే ఈ లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టింది. దీని ప్రకారమే రాష్ట్రాల కార్యక్రమాలకు కేంద్రం నిధులు అందించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి. ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్సీఈఆర్టీ గుర్తించిన ముఖ్యాంశాలివే.. 5+3+3+4 విధానంలో పాఠ్య ప్రణాళిక, బోధనా విధానం ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషనల్ లిట్రసీ, అండ్ న్యూమరసీ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సెకండరీ తరగతుల్లో సబ్జెక్టు ఎంపిక చేసుకునే సౌలభ్యం కరికులమ్ కుదింపు, కోర్ ఎసెన్షియల్స్ 3, 5, 8 తరగతుల్లో బెంచ్‌మార్కు లెర్నింగ్ లెవెల్స్ వొకేషనల్ విద్య పునర్వ్యవస్థీకరణ బహుభాషా పరిజ్ఞానం 21వ శతాబ్దపు నైపుణ్యాలు.. ఐసీటీ తదితరాలు జీవ నైపుణ్యాలు, పౌరసత్వం, నైతికత, జాతీయ వారసత్వ సంపద, ప్రజా ఆస్తుల పరిరక్షణ, సేవా దృక్పథం సమ్మిళత విద్య– ఆర్ట్స్, క్రాఫ్ట్, టాయిస్, స్పోర్ట్స్– ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇండియన్ నాలెడ్జి సిస్టమ్ పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య అనుసంధానం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రిఫారŠమ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు స్కూల్ కమ్యూనిటీ రిలేషన్ వనరుల వ్యవస్థల బలోపేతం పాఠ్యపుస్తకాల డిజైన్, డెవలప్మెంట్ -
Nadu Nedu: ఏపీలో విద్య భేష్
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చాలా బాగున్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), ఇతర రాష్ట్రాల విద్యా రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో పాఠశాల విద్యలో అద్భుతమైన ఫలితాలు సుసాధ్యమని చెప్పారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్కుపై ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యా విభాగాల ప్రతినిధుల రెండు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలవుతున్న అమ్మ ఒడితో డ్రాపవుట్లు పూర్తిగా తగ్గి, చేరికలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా వేల కోట్ల ఖర్చుతో పాఠశాలల రూపురేఖలనే మార్చివేసేలా నాడు – నేడు కార్యక్రమాలు అమలు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సదుపాయాలు సమకూర్చడం గొప్ప విషయమని మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) ప్రతినిధులు చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేయడం, ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్ సంస్కరణలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్సీఈఆర్టీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి రాకముందే రాష్ట్రంలో పునాది విద్యను బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)లో దేశంలోనే ఏపీ ముందంజలో నిలిచిందన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి జ్ఞాపికలను అందించారు. -
టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ టీచర్లలో సబ్జెక్టులపై మంచి పట్టు, ఆయా అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. టీచింగ్ మెథడాలజీపై అవగాహన కూడా ఉంది. కానీ విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు..’ ప్రభుత్వ టీచర్ల పరిస్థితిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి–ఎన్సీఈఆర్టీ) విశ్లేషణ ఇది. దీనికి అనేక కారణాలున్నా అంతిమంగా పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో నెలకొనాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఒనగూరడం లేదని తేల్చింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యప్రణాళికలు, సిలబస్ తీరుతెన్నులు, టీచర్ల నైపుణ్యాలు, విద్యార్థుల్లో సామర్థ్యాలు తదితర అనేక అంశాలపై ఎన్సీఈఆర్టీ విశ్లేషించింది. బోధన కంటెంట్ సమన్వయంలో సమస్యలు ఎన్సీఈఆర్టీ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ కరిక్యులమ్ స్టడీస్ విభాగం టీచింగ్‌లో నాణ్యతను పరిశోధించడంలో భాగంగా సైన్సు టీచింగ్‌లో నాలెడ్జి, బోధనాపరమైన కంటెంట్‌ను సమన్వయం చేసుకోవడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తరగతి గది బోధనను పరిశీలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లోని 30 మంది టీచర్లను ఎంపిక చేసుకుంది. అందులో వచ్చిన ఫలితాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ మేరకు.. ► టీచర్లలో ఎక్కువమందికి టీచింగ్ మెథడ్స్‌పై మంచి అవగాహన ఉంది. బోధన విధానం, సబ్జెక్టుఅంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం పరచుకుని బోధించడంలో వారు విఫలమవుతున్నారు. ► పాఠ్యప్రణాళికలను రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తేవడం మధ్య చాలా అంతరం ఉంది. ► టీచర్లు బోధించాలనుకున్న అంశాలకు, బోధించిన అంశాలకు మధ్య చాలా తేడా ఉంటోంది. చాలామంది టీచర్లు తాము బోధించిన అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని భావించి అంతటితో సరిపెడుతున్నారు. (అమ్మాయిల ఐఐఠీవి.. ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు) ► బోధన సమయంలో విద్యార్థులు బోధన కాన్సెప్టులను ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారన్న అంశాలను టీచర్లు పట్టించుకోవడం లేదు. ► తరగతి గదుల్లో టీచర్లు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. యాక్టివిటీ ఆధారిత విద్యావిధానం అమలవుతున్నప్పటికీ ఆ కాన్సెప్టును టీచర్లు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనుసరించే మార్గం కూడా అలాంటిదే అన్న భావనతో మూసపద్ధతిలో వెళుతున్నారు. విద్యార్థులకు సరిపోయే విధంగానే తాము బోధిస్తున్నామని భావిస్తున్నారు తప్ప వారికి ఏమేరకు అవగాహన అవుతోందో గమనించడం లేదు. ► అన్ని స్కూళ్లలోను ఆంగ్లమాధ్యమ బోధనతో భాషా సమస్య ఏర్పడి విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇంటరాక్షన్ (పరస్పర సందేహ నివృత్తి)లో అంతరం బాగా పెరిగింది. ► టీచర్లు చాలా నైపుణ్యం కలవారే అయినా క్షేత్రస్థాయిలో ఒకింత గందరగోళం వల్ల విద్యార్థులకు, వారికి మధ్య అనుసంధానం ఏర్పడక వారు చెప్పదల్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ► దీనిపై సవాళ్లను ఎదుర్కొంటున్న టీచర్లు.. విద్యార్థుల్లో అనాసక్తి, వనరులలేమి, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, ఫలితాలకోసం అధికారుల నుంచి ఒత్తిడి వంటి కారణాలను చెబుతున్నారు. (APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..) ఏపీలో సమర్థంగా డీఈడీ అమలు ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ/డీఈఎల్ఈడీ)ని సమర్థంగా అమలు చేస్తున్నారని ఎన్సీఈఆర్టీ తన నివేదికలో పేర్కొంది. డీఈడీ ఫస్టియర్, సెకండియర్‌లో వేర్వేరుగా వివిధ కోర్సులను ఎన్సీటీఈ ప్రవేశపెట్టగా ఏపీ దాన్ని మరింత పటిష్టం చేసి అమలు చేయిస్తోంది. పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో మార్పులుచేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని జోడించింది. స్కూల్ కల్చర్, లీడర్షిప్ వంటి అంశాలను పొందుపరిచింది. ఎలిమెంటరీ స్థాయిలో కూడా బోధన విధానాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మాతృభాష బోధన, చైల్డ్‌హుడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ పేపర్లను ప్రవేశపెట్టారని ఎన్సీఈఆర్టీ వివరించింది. -
సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా నిర్ణయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు, విద్యాసంస్కరణలను ఆయన ప్రశంసించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. ( గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు ) ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు. -
ఒలంపియాడ్స్‌లో విజయం సాధించాలంటే.. (స్పాన్సర్డ్)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యకు ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఏర్పడింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ‘ఒలంపియాడ్స్’ అనే టాలెంట్ టెస్ట్‌లను నిర్వహిస్తుంటారు. ఒలంపియాడ్స్ పరీక్ష ద్వారా దేశ, అంతర్జాతీయ విద్యార్థులతో పోటీ పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒలంపియాడ్ టెస్ట్‌తో విద్యార్థి ప్రతిభను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు ఒలంపియాడ్ పరీక్షలు ప్రిపేర్ కావడానికి ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ సంస్థ అత్యుత్తమంగా శిక్షణ ఇస్తుంది. విస్తృతమైన సమాచారం, అవగాహనతో ఒలంపియాడ్ పరిక్షలో విజయం సాధించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ సంస్థ 2012లో ఏర్పడింది. ప్రస్తుతం 33,175 స్కూల్స్‌లో ఇండియన్ టాలెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కోటి మంది విద్యార్థులు తమ సంస్థను అనుసరిస్తున్నారని, ఇప్పటి వరకు 2లక్షల క్లాస్ టాపర్స్‌ను గుర్తించామని, ప్రతి సంవత్సరం 7వేల మందికి స్కాలర్షిప్స్ అందిస్తున్నట్లు సంస్థ నిర్వాహికులు తెలిపారు. తమ సంస్థ కమిటీలో అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీటీ ఉషా మేడమ్ ఉండడం సంతోషమని నిర్వాహకులు తెలిపారు. దేశంలో వివిధ విభాగాలలో ఒలంపియాడ్ టాలెంట్ పరీక్షలు ప్రతి సంవత్సరం జరుపుతుంటారు. దేశంలో ప్రతి సంవ్సతరం 8 విభాగాలలో ఒలంపియాడ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్(ఐఎస్ఓ), ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్(ఐఎమ్ఓ),ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ (ఈఐఓ), జనరల్ నాలెడ్జ్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ (జేకేఐఓ), ఇంటర్నేషనల్ కంప్యూటర్ ఒలంపియాడ్ (ఐసీఓ), ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ (ఐడీఓ), నేషనల్ ఎస్సే ఒలింపియాడ్ (ఎన్ఈఎస్ఓ), నేషనల్ సోషల్ స్టడీస్ ఒలింపియాడ్ (ఎన్ఎస్ఎస్ఓ) ఒలింపియాడ్ పరీక్షలలో రాణించాలంటే ఒలింపియాడ్ పరీక్షలలో రాణించడానికి విద్యార్థుల ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. విద్యార్థులను పరీక్షలో విజయం సాధించడానికి ప్రాక్టీస్ వర్క్ బుక్స్, ప్రీవియస్ పేపర్స్‌పై విశ్లేషణ ఉంటుందని ఒలంపియాడ్ టాలెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇంటి నుంచే ప్రిపెర్ అయ్యే విద్యార్థులకు ఆన్లైన్ వీక్లీ ఒలంపియాడ్ పరీక్షలు, క్రమం తప్పకుండా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ సంస్థతో విద్యార్థులకు ప్రయోజనాలు - లాజికల్ రిజనింగ్‌పై సంపూర్ణ అవగాహన - విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రణాళికమైన వ్యూహ రచన - పరీక్షపై భయం పోగొట్టి, ఒలంపియాడ్ పరీక్షలో గెలవగలననే నమ్మకం కల్పిండం - క్రమం తప్పపని రివిజన్, కాన్సెప్ట్స్ ఆధారిత బోధన ఒలింపియాడ్ పరీక్షలో (ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్) మొదటి జాతీయ ర్యాంక్ సాధించిన వారికి లక్ష రూపాయల, రెండవ ర్యాంకు సాధించిన పది మంది విద్యార్థులకు 10 ల్యాప్‌టాప్‌లను అందజేస్తారు. మరిన్ని వివరాలకు ఇండియన్ టాలెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. (Advertorial) -
ఆందోళన తొలగించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సూచించింది. కోవిడ్ ప్రభావంతో విద్యలో ముఖ్యంగా పాఠశాల విద్యలో పలు మార్పులు తప్పనిసరి అవుతున్నాయని తెలిపింది. పాఠశాలల పునఃప్రారంభానికి పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో చర్యలు ఎలా ఉండాలో నిర్దేశించింది. పాఠశాలలు తెరిచాక పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రుల కమిటీలతోపాటు సామాజిక భాగస్వామ్యం అవసరమని వివరించింది. ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని తాజాగా రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఎన్సీఈఆర్టీ సూచనలివే.. ► కోవిడ్ వల్ల పిల్లలు, తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని నివారించేందుకు ముందుగా వారిని సన్నద్ధులను చేయాలి. టీచర్లు వారికి అవసరమైన పద్ధతుల్లో కౌన్సెలింగ్ చేపట్టాలి. కోవిడ్ సమయంలో అభ్యసన ప్రక్రియల్లో పిల్లల్లో ఏర్పడిన అంతరాలను తగ్గించాలి. ► విద్యా సంవత్సరం ఆలస్యమైనందున ప్రత్యామ్నాయ క్యాలెండర్‌తోపాటు అందుకనుగుణమైన విద్యాభ్యసన పద్ధతులను అవలంబించాలి. ► పాఠశాలలు తెరిచినా, తెరవలేని పరిస్థితులున్నా రెండింటికీ అనుగుణంగా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలి. ► సిలబస్, బోధన, పాఠ్యపుస్తకాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాల్లో సరికొత్త విధానాలతో పునర్నిర్మాణం అవసరం. ► ఫలితాల ఆధారిత బోధనాభ్యసన ప్రక్రియ (అవుట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్) కోసం సమగ్ర ప్రణాళికలు ఉండాలి. ► ఇంటర్నెట్ ఆధారిత చానెల్, రేడియో, పాడ్‌కాస్ట్, ఐవీఆర్ఎస్, టీవీ, డీటీహెచ్ చానెళ్లను వినియోగించుకోవాలి. ► ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ), డైట్ తదితర విభాగాల వారిని, నోడల్ అధికారులను నియమించాలి. ► కోవిడ్ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు, ప్రధానోపాధ్యాయులలో ప్రత్యామ్నాయ ప్రణాళికలకు తగ్గట్టు సామర్థ్యాలను పెంపొందించాలి. ► స్కూళ్లకు విద్యార్థులు రాలేని పరిస్థితుల్లో చిన్న తరగతుల పిల్లలకు వలంటీర్లు, ఉపాధ్యాయులను నియమించి ఇళ్ల వద్దనే పరీక్షలు రాయించే ఏర్పాట్లుండాలి. ► ఇందుకోసం అన్ని సబ్జెక్టులకు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రశ్నపత్రాల రూపకల్పన అవసరం. ► ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), వివిధ ఆన్లైన్ విద్యావేదికలను వినియోగించుకుంటూ ఉపాధ్యాయులు తమంతట తాము నూతన విధానాలను అనుసరించేలా నవీకరించుకోవాలి. -
ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే చాలా విద్యాసంస్థలు ఆన్లైన్లో విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. అయితే ఆన్లైన్ విద్య అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. దేశంలో దాదాపు 27 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు కలిగి లేరని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్( ఎన్సీఈఆర్టీ) సర్వే తేల్చింది. ఈ సర్వేలో మొత్తం 34 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యయ విద్యాలయాలు, సీబీఎస్ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపల్లు ఉన్నారు. ప్రతీ ముగ్గురిలో ఓ విద్యార్థి ఆన్లైన్ విద్య తమకు కష్టంగా ఉందన్నారని వెల్లడించారు. అంతేకాకుండా కరెంట్ కొరత కూడా ఆన్లైన్ విద్యకు ఆటంకంగా మారినట్లు 28 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రభావవంతమైన విద్య కోసం సెల్ఫోన్లు, లాప్‌ట్యాప్ ఇతర వస్తువులను వాడటంలో విద్యార్థులకు అవగాహన లేకపోవటం, ఉపాధ్యాయులకు ఆన్లైన్ విద్యను భోదించే పద్దతులు తెలియకపోవటం కూడా ఇందుకు కారణంగా అభిప్రాయపడుతున్నారని సర్వే వెల్లడించింది. ( ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త.. ) దాదాపు 36 శాతం మంది విద్యార్థులు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలను వాడుతున్నారని, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్లు లాప్‌ట్యాప్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పేర్కొంది. ఆన్లైన్ విద్య కోసం టీవీలు, రేడియోలను అతి తక్కువగా వాడుతున్నారని వెల్లడించింది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఈ-పాఠ్య పుస్తకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపింది. ఆన్లైన్ విద్యలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధన అవసరం ఉన్నట్లు చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఓ గంటపాటు ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఒత్తిడి, విసుగు దూరమవుతుందన్నారని సర్వే వెల్లడించింది.