సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ విద్యార్థులు వెనుకబడ్డారు. ఆంగ్లంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఐదో స్థానంలో, గణితంలో వెనకబడిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది.
విద్యార్థుల సామర్థ్యాన్ని, విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు జాతీయ విద్యా పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్టీ) దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహించింది. సర్వేలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో 32శాతం మాత్రమే ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. గణిత ప్రశ్నలకు 34 శాతం విద్యార్థులు మాత్రమే సమాధానం చెప్పారు. మూడో తరగతి విద్యార్థులపై సర్వే నిర్వహించగా 54శాతం గణిత ప్రశ్నలకు, 58 శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 44 శాతం గణిత ప్రశ్నలకు, 52శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నాస్ సర్వేలో రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ వెనుకబడి ఉంది.
ఢిల్లీకి చెందిన జానకి రాజన్ అనే ప్రొఫెసర్ నాస్ సర్వేపై స్పందిస్తూ...విద్యార్థులకు లెక్కలు కూడా రాకుండా విద్యాశాఖ మంత్రి బెస్ట్ ఎడుకేషన్ మినిస్టర్ గా అవార్డులు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంచాలకులు సౌమ‍్య గుప్తా స్పందిస్తూ.. నాస్ సర్వే ఫలితాలకు తాము ఆశ్యర్యం చెందలేదని, తమ సర్వేలో విద్యార్థులకు నేర్చుకునే నైపుణ్యం లేదని తేలిందని తెలిపారు. అయితే, లక్షకుపైగా విద్యార్థులకు చదివే నైపుణ్యం మెరుగుపడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment