
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఆర్‌టీ) ప్రకటించింది.
3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి.