new academic year
-
టోఫెల్ శిక్షణ ఎత్తివేత
సాక్షి, అమరావతి: పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం (2024–25) కేలండర్‌ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్క రోజు ముందైనా ఆ కేలండర్‌ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా బడులు తెరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పిరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకడమిక్ కేలండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. కేలండర్పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు కేలండర్ వైరల్ కావడం, అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఫార్మెటివ్ అసెస్మెంట్–1 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావడంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకడమిక్ కేలండర్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్– ప్రైమరీ/జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు. కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయండి: లోకేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అకడమిక్ కేలండర్ విడుదల సందర్భంగా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపర్చాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.ఆటలకు గంట కేటాయింపు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. కేలండర్లో పేర్కొన్న విధంగా ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు సమ్మెటివ్ అసెస్మెంట్–2 (ఎస్ఏ) వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు.అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు » ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. » అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. » అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా రెండు పిరియడ్స్‌ను సైన్స్ పిరియడ్స్‌కు కేటాయించాలి. » పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్లు బోధించాలి. » ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి. » ప్రాథమిక పాఠశాలల పిల్లలకు లాంగ్వేజ్ పిరియడ్స్‌లో మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయించాలి. వారానికి రెండు పిరియడ్స్‌ను గూగుల్ రీడ్ యాప్ ద్వారా వినడం, మాట్లాడడం కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహించాలి. -
సీబీఎస్ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. -
AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్‌లు
సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్‌ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్‌ల వినియోగంలో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది. అయితే, హార్డ్‌వేర్ సమస్యలు వస్తే ట్యాబ్‌లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్‌ను డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, వివరాల నమోదు, ఆన్లైన్లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీదులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్‌గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్‌లను రాష్ట్రంలోని 145 శాంసంగ్ సర్వీస్ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు. ట్యాంపర్ చేస్తే ఐటీ సెల్‌కు అలర్ట్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్‌ల్లో కంటెంట్ ఇంటర్నెట్ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్‌ను నెట్(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్ ఐటీ సెల్‌కు చేరుతాయి. విద్యార్థులు ట్యాబ్‌లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్‌ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్‌లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు. విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్‌లోని కంటెంట్ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్‌గా ట్యాబ్ లాక్ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్‌తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి అన్‌లాక్ చేస్తారు. -
పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’..
► వేసవి సెలవుల అనంతరం జూన్ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎక్కువ సంఖ్యలో పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే పూర్తికాక పోవడంతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ► పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నుంచే మొదలవ్వాల్సి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మేలో పుస్తకాల ముద్రణ పూర్తయినా, విద్యార్థులకు జూలై వరకూ అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ పెరగడంతో పాటు, ఇప్పటివరకు ముద్రణకు టెండర్లే ఖరారు కాకపోవడంతో స్కూళ్లు తెరిచినా కనీసం రెండు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరిగే అవకాశం కన్పించడం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 13 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ దిశగా కార్యాచరణ కన్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే స్కూళ్లు తెరిచినా, కనీసం రెండు నెలల వరకూ విద్యార్థి చేతికి పుస్తకం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. అరకొరగా నడిచినా పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తు తం తిరిగి గాడిలో పడుతున్న సమయంలో పాఠ్యపుస్తకాలు ఆలస్యం కానుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్య కమిషనర్ దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెండు భాషలతో పెరిగిన ముద్రణ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ 2భాషల్లో (బై లింగ్వల్) పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలను ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్ అసెస్మెంట్–1 (ఎస్ఏ–1) వరకు ఉన్న సిలబస్‌ను ఒక పుస్తకంలో, ఎస్ఏ–2లో ఉన్న సిలబస్‌తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచితంగా అందించే పుస్తకాలను 2.10 కోట్ల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో 1.40 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు రూ. 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడు రూ.120 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేటు ముద్రణాలయాల్లో వీటిని ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ కమిటీ సీనియస్‌గా భేటీ అయిన దాఖలాల్లేవు. కమిటీ భేటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలున్నాయి. పేపర్ అందించేందుకు తమిళనాడు పేపర్ మిల్స్, పంజాబ్‌కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్‌కు చెందిన మరో సంస్థ టెండర్లు వేసింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. పుస్తకాలు ఆలస్యంగా వస్తే బోధనతో పాటు విద్యార్థులు చదువుకోవడమూ కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ నెలాఖరు లక్ష్యంగా పెట్టుకున్నాం పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్లు ఈ నెల 16న తెరుస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎల్–1ను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ద్విభాష ముద్రణ కావడం వల్ల ఈసారి పుస్తకాల ముద్రణ ఎక్కువ సంఖ్యలో చేయాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా పుస్తకాలు ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. స్కూళ్ళు తెరిచే సమయానికి కొన్ని పుస్తకాలు అందించడంతో పాటు అన్ని పుస్తకాలను జూన్ నెలాఖరులోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – ఎస్ శ్రీనివాసచారి (డైరెక్టర్, ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్) సకాలంలో పుస్తకాలు ఇవ్వాలి : చెరుకు ప్రద్యుమ్నకుమార్ (ప్రభుత్వ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్) ఆంగ్ల భాషలో బోధన చేపడుతున్న నేపథ్యంలో ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందాలి. అప్పుడే వాళ్ళకు కొత్త విధానంపై కొంత అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన ప్రిపరేషన్ చేసుకునే వీలుంటుంది. పుస్తకాలు ఆలస్యమైతే సిలబస్ పూర్తి కోసం బోధనను పరుగులు పెట్టించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆలస్యంతో ఇబ్బంది పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యం ప్రతి ఏటా ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తిరిగి తీసుకుని, లైబ్రరీలో భద్రపరిచి, కొత్త వారికి ఇవ్వాలి. దీనివల్ల ఆలస్యం సమస్య తలెత్తదు. ప్రభుత్వ ఖజానాపై భారమూ తగ్గుతుంది. – మామిడోజు వీరాచారి (లోకల్ కేడర్ ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు) -
అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం: యూజీసీ
న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వహించాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనందున ఒకవేళ ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిలైనా, వేరే చోటికి మారినా వారు చెల్లించిన ఫీజులను పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
ఒత్తిడి లేకుండా బోధన.. పరీక్షల కుదింపు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది బోధనాభ్యసన కార్యక్రమాలు, పరీక్షల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియెట్‌లోనూ విద్యార్థులపై భారం లేకుండా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఏ మేరకు అభ్యసనం సాగించాలి, వారి సామర్థ్యాలను ఏ మేరకు పరిశీలన చేసి ఉత్తీర్ణతను నిర్ణయించాలి అనే వాటిపైనా ముందుగానే ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో అవుట్ కమ్ బేస్డ్ (అభ్యసన ఫలితాల ఆధారిత) సిలబస్‌ను రూపొందించినందున దానికి అనుగుణంగానే తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకొనే అంశాలు, ఇంటి దగ్గర అభ్యసనం చేయగలిగే అంశాలను వేరు చేసింది. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలను దీని ఆధారంగానే రూపొందించాలని ఎస్సెస్సీ బోర్డుకు సూచించింది. ‘ఇంటి దగ్గర విద్యార్థులు తమంతట తాము అభ్యసించగలిగే అంశాలు కేవలం వారి సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి మాత్రమే. తరగతి గదిలోని బోధనాంశాలపై మాత్రమే వారికి పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి’ అని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు) 180 పని దినాలు... 143 బోధనా దినాలు రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమై ఏప్రిల్ 30తో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను రూపొందించింది. మొత్తం 180 రోజుల పని దినాల్లో 143 రోజులు పాఠశాల బోధనా దినాలుగా, 37 రోజులు ఇంటివద్ద నేర్చుకునే పని దినాలుగా నిర్ణయించింది. పాఠశాలలు దాదాపు ఏడు నెలలపాటు మూతపడినందున 2020-21 విద్యా సంవత్సరానికి పని దినాల సర్దుబాటులో భాగంగా పలు సెలవులను కుదించారు. సంక్రాంతి సెలవులు, వేసవి సెలవుల్లో కొన్ని రోజులను పాఠశాల, ఇంటి పని దినాలుగా నిర్ణయించారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ సెలవుల్లో మినహాయించి తక్కిన సెలవు రోజుల్లో పాఠ్యబోధన కొనసాగనుంది. టీచర్ల సెలవుల విషయంలోనూ నియంత్రణ పెట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు) పరీక్షల కుదింపు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది. ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్‌లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు. నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా.. నెల మొత్తం పని దినాలు పాఠశాల పని దినాలు ఇంటివద్ద పని దినాలు నవంబర్ 29 25 4 డిసెంబర్ 31 25 6 జనవరి 31 23 8 ఫిబ్రవరి 28 24 4 మార్చి 31 25 6 ఏప్రిల్ 30 21 9 మొత్తం 180 143 37 -
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్‌లైన్‌ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది. -
కొత్త విద్యాసంవత్సరం ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఈసారి నిర్దేశిత పని దినాలు పూర్తికాకుండా విద్యా సంవత్సరం ముగుస్తోంది. కరోనా నేపథ్యంలో అకడమిక్ కార్యక్రమాలకు 220 పనిదినాలు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తి కానుంది. అంతేకాదు ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాకుండా తయారైంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో అన్ని సెలవులు పోగా కనీసంగా 220 పనిదినాలు పాఠశాలలు, కాలేజీలు పనిచేయాలి. ఆయా రోజుల్లోనే సిలబస్ పూర్తయ్యేలా ముందుగానే ఆయా విభాగాలు అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తాయి. అందుకు అను గుణంగా బోధన కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలు,ముఖ్యంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో శనివారాల్లో పని చేసేలా షెడ్యూల్ జారీ చేసి పనిదినాలను సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనాతో కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో ఈసారి నిర్దేశిత పని దినాలు లేకుండా ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. కానీ రాష్ట్రంలో కరోనా కారణంగా దాదాపు నెలన్నర రోజుల ముందుగానే పాఠశాలలు బంద్ అయ్యాయి. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వాటిని ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. అంటే అప్పటి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. పైగా వేసవి ఎండల కారణంగా ఇప్పుడు నిర్వహించాల్సినవి ఒంటి పూట బడులే. అవీ మూత పడ్డాయి. ఈనెల 14 తర్వాత మరో 9 రోజులు గడిస్తే విద్యా సంవత్సరమే పూర్తి కానుంది. అప్పటివరకు కూడా కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 220 పనిదినాల నిబంధనకు విఘాతం కలుగుతోంది. 40 రోజుల ముందుగానే విద్యా సంవత్సరాన్ని ముగించే పరిస్థితి వచ్చింది. వచ్చేది వేసవి కాబట్టి ఆ 40 రోజులు పాఠశాలలను నిర్వహిద్దామన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖలో స్పష్టత లేకుండా పోయింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘పరీక్షల్లేకున్నా పాస్’ఉత్తర్వుల్లో జాప్యం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 6వ తేదీలోగా పూర్తి కావాలి. కరోనా కారణంగా మార్చి 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.అకడమిక్ కేలండర్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు జరిగేలా లేవు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఈనెల 14 వరకు సెలవులను ప్రకటించింది. 15న పాఠశాలలు ప్రారంభ మైనా విద్యా సంవత్సరం ముగిసే 23వ తేదీలోగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమేటిక్‌గా పాస్ చేసి పైతరగతికి పంపించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. ఈ విషయంలో విద్యాశాఖలో కిందిస్థాయి అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకరే కావడంతో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నది కింది స్థాయి అధికారులకు తెలియని పరిస్థితి. అందుకే ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని ఓ ఉన్నతాధికారి చెప్పారు. జూన్ 1న బడులు ప్రారంభమయ్యేనా? ఇక కరోనా ప్రభావం ఈ నెలంతా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే జూన్ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి బడులు ప్రారంభం కావడం (కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం) కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు చక్కబడితే ఈ నెలాఖరులో మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశముంటుంది. లేదంటే మే నెలలోనే నిర్వహించాల్సి వస్తుంది. దాంతో ప్రాథమిక పాఠశాలలకు బోధించే టీచర్లంతా మే నెలలోనూ ఇన్విజిలేటర్లుగా పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు పరీక్షలు అయ్యాక సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాటిని సర్దుబాటు చేస్తూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
స్కూళ్ల అకడమిక్ కేలండర్ ఇదే!
మార్చి మొదటివారంలోనే టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం షురూ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల తర్వాత ఈ నెల 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, సెలవులకు సంబంధించిన సమగ్ర వివరాలతో విద్యాశాఖ బుధవారం అకడమిక్ కేలండర్‌ను ప్రకటించింది. పాఠశాలల్లో ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలలో చేపట్టాల్సిన కార్యాచరణను పంపించింది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లలో పాఠాలను బోధించాలి. పదోతరగతికి మాత్రం ఈ నెల 13న పాఠ్యాంశాల బోధన చేపట్టి వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలి. స్కూళ్ల పని వేళలు ఇలా.. ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు(7 గంటల 15 నిమిషాలు) పని చేయాలి ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు(ఏడు గంటలు) పని చేయాలి పరీక్షల షెడ్యూలు ఇదీ.. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1: పని దినాలు 39 రోజులు. జూలై 30వరకు బోధించి, పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యాలను రిజిస్టర్ చేయాలి ఫార్మేటివ్-2: 41 రోజుల పనిదినాలు. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు పని చేయాలి. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించి, సామర్థ్యాలను రికార్డు చేయాలి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 (త్రైమాసిక పరీక్షలు): అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను ఇవ్వాలి. ఫలితాలను నవంబర్ 7న ప్రకటించాలి. ఫలితాలను నవంబర్ 10 వరకు రికార్డు చేయాలి. 11న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి. ఎఫ్ఏ-3: అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు. 57 పని దినాలు. డిసెంబర్ 9లోగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేయాలి ఎఫ్ఏ-4: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వారికి 2017 ఫిబ్రవరి 20 వరకు. పదో తరగతి వారికి ఫిబ్రవరి 4 వరకు మొత్తంగా 52 రోజులు పని చేయాలి. విద్యార్థుల సామర్థ్యాలు రిజిస్టర్ చేయాలి. ఎస్ఏ-2: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు ఒకటి నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు. మార్చి 19న విద్యార్థులకు జవాబు పత్రాలు ఇవ్వాలి. ఫలితాలను రికార్డు చేయాలి. 20న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. - 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు: పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు. క్రీడలు.. ఆగస్టు 5లోగా పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండల/డివిజన్ స్థాయిలో, సెప్టెంబర్ 8 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులను సెప్టెంబర్/అక్టోబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు పంపించాలి.