AP Govt To Distribute Another 6 Lakh Tabs For Students - Sakshi
Sakshi News home page

AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్‌లు

Published Mon, Jun 5 2023 3:19 AM | Last Updated on Mon, Jun 5 2023 9:12 AM

Another 6 lakh tabs for students - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యా­బ్‌­లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది.

ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యా­బ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.­25 వేల ఖరీదు చేసే బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది.  

సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం 
గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్‌ల నిర్వహణకు ప్ర­భుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్‌ల వినియో­గంలో తలెత్తే సాఫ్ట్‌వేర్‌ సమస్యలు పరిష్కరించేలా ఉపా­ధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది.

అయితే, హార్డ్‌వేర్‌ సమస్యలు వస్తే ట్యాబ్‌లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా పరిష్కరించేలా ప్రభు­త్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్‌­ను డిజిటల్‌ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరి­స్తే ఫోన్‌ నంబర్, ట్యాబ్‌ ఈఎంఐఈ నంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

అయితే, వివరాల నమోదు, ఆన్‌లైన్‌లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీ­దులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్‌గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్‌లను రాష్ట్రంలోని 145 శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు.  

ట్యాంపర్‌ చేస్తే ఐటీ సెల్‌కు అలర్ట్‌ 
ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్‌ల్లో కంటెంట్‌ ఇంటర్నెట్‌ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్‌ను నెట్‌(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్‌ ఐటీ సెల్‌కు చేరుతాయి.

విద్యార్థులు ట్యాబ్‌లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్‌ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్‌లను ట్యాంపరింగ్‌ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు.

విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్‌లోని కంటెంట్‌ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్‌గా ట్యాబ్‌ లాక్‌ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్‌తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్‌ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్‌ అథెంటికేషన్‌ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్‌ అధికారి అన్‌లాక్‌ చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement