Tabs
-
ట్యాబ్ ఏది బాబూ?
సాక్షి, అమరావతి: డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో ట్యాబ్‌లతో లక్షల మంది పిల్లల మొహాల్లో సంతోషం తొణికిసలాడేది! అంతులేని సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహంతో ఉరకలు వేసేవారు! డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన, సకల సదుపాయాలతో సర్కారు స్కూళ్లు కళకళలాడేవి!! మరి ఈ ఏడాది ట్యాబ్‌లు ఎక్కడ? మాపై ఎందుకంత కక్ష? అని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. 9.52 లక్షల మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా అందించిన ట్యాబ్స్ పంపిణీని కూటమి సర్కారు ఈ ఏడాది నిలిపివేసింది. అదే జగన్ మామయ్య ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ట్యాబ్‌లు వచ్చేవని 8వ తరగతి పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ మామను ప్రతి విద్యార్థీ తలచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే తమకు ఠంఛన్‌గా అమ్మ ఒడి వచ్చేదని తల్లులు గుర్తు చేసుకోని రోజు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద కుటుంబాల తలరాతలను మార్చేవి చదువులేనని గట్టిగా నమ్మి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేశారు. ఏటా జూన్‌లో అమ్మ ఒడితో తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దిన సర్కారు స్కూళ్ల ప్రయాణం ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ స్థాయికి చేరుకుంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలతో గోరుముద్ద అందించి పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఐదేళ్లలో ఏకంగా దాదాపు రూ.73 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసి పిల్లల చదువులకు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ విద్యా రంగానికి బలమైన పునాది వేశారు. ఇప్పుడు వాటిని సమూలంగా పెకిలించే దిశగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. పేద విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ స్కూళ్లపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యా రంగ పథకాలను ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే అన్నింటినీ నిలిపివేసింది. ఆర్నెల్ల పాలనలో ఒక్కటైనా కొత్త పథకాన్ని అందించకపోగా గత సర్కారు అమలు చేసిన వాటిని కక్షపూరితంగా ఆపేసింది. ఇందుకు నాడు నేడు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఏఐ టెక్నాలజీ యాప్‌తో ట్యాబ్స్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా, ఇంటి వద్ద కూడా చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ట్యాబ్స్‌లో ‘డ్యులింగో’ యాప్ అప్లోడ్ చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది.సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ రద్దువైఎస్ జగన్ దేశమంతా ప్రశంసించే విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను అంచెలంచెలుగా అమలు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను గత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే కూటమి సర్కారు ఈ ఏడాది రద్దు చేసింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈ సదుపాయం లభించగా ఈ ఏడాది ఒక్కరికీ అవకాశం లేకుండా చేసింది. గతేడాది 16 లక్షల మంది టోఫెల్ పరీక్ష రాయగా కనీసం ఆ ఫలితాలను కూడా ప్రకటించలేదు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ బోధన 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించేందుకు గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే దాన్ని రద్దు చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.‘వందనం’ లేదు.. వంటా లేదు..!ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిస్పృహ చెందుతున్నారు. ఇక నాడు–నేడు పనులను మధ్యలో నిలిపి వేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులను పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో మధ్యాహ్నం రుచి, శుచితో పోషకాహారాన్ని అందించారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వంటలో మార్పుచేర్పులు చేశారు. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.7,244.6 కోట్లు ఖర్చు చేసింది. అటకెక్కిన సబ్జెక్టు టీచర్ల బోధనవిద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను వైఎస్ జగన్ అమల్లోకి తెస్తే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. గత ప్రభుత్వం దాదాపు 6 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి, 3–5 తరగతులను హైస్కూళ్లకు మార్చి నాణ్యమైన బోధన అందిస్తే ఈ విద్యా సంవత్సరంలో కూటమి సర్కారు సబ్జెక్టు టీచర్లను కేవలం ఉన్నత తరగతులకే పరిమితం చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందకుండా చేసింది.మండలానికి రెండు కాలేజీలు రద్దురాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించిన గత ప్రభుత్వం 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటై బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 504 హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇవి ఉండవని ఇటీవలే ప్రకటించింది.‘ఆణిముత్యాల’ ఆశలు ఆవిరి..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022–23లో టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించింది. ‘జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్’ అవార్డులతో వెన్నుతట్టి అభినందించింది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే దక్కాయి. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదివి ఉత్తమంగా రాణించిన 10 మంది నిరుపేద విద్యార్థులను గత ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. 2023–24లో కూడా ఇదే విధానం కొనసాగుతుందనే ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిన దాదాపు 32 వేల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ఫలితాలు సాధించారు. అయితే జూన్‌లో నిర్వహించాల్సిన సత్కారాన్ని కూటమి సర్కారు నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆరు నెలల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది.విద్యా సంస్కరణలువైఎస్ జగన్ చేపట్టిన చదువుల యజ్ఞంతో సర్కారు బడులు సమున్నతంగా మారాయి. 2019 నుంచి వివిధ విద్యా, సంక్షేమ పథకాలను అమలు చేశారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యాకానుక ఇవ్వడంతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం భారం లేకుండా పోయింది. బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఏటా సగటున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ‘మన బడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి. నాడు – నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధన ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద వారానికి 16 రకాల వంటకాలతో నాణ్యమైన పోషకాల భోజనం అందించారు. దేశంలో ఈ తరహా భోజనాన్ని పిల్లలకు అందించిన రాష్ట్రం మరొకటి లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. ఇక 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాగా 2023–24లో అది ఏకంగా 93 శాతానికి పెరిగింది. 2024 మార్చి పదో తరగతి పరీక్షల్లో 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో 2.25 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయగా 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’ గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుంచి రావడం గమనార్హం. టాపర్స్‌గా నిలిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి ఏపీలో విద్యా సంస్కరణల గురించి ప్రపంచానికి చాటి æచెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు, సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు తరలిపోయారు. -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్‌చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్‌చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్‌లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్‌చాట్. దీనితో ఆర్టిస్ట్‌లు, డెవలపర్లు స్నాప్‌చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
విద్యావ్యవస్థలో పేద ధనిక తారతమ్యం ఉండకూడదు: సీఎం జగన్
-
ట్యాబ్‌లు దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదు: టీచర్లు
-
పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వక్రబుద్ధితో లేనివి ఆపాదించి తప్పుడు రాతలు రాస్తున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి పిల్లలు ప్రగతి సాధిస్తుంటే వారి భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలను సహించబోమని హెచ్చరించారు. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే వార్తలు ప్రచురించడం దారుణమైన చర్య అని అన్నారు. మంత్రి గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లపై ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద పిల్లలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను మెరుగు పరుచుకుని, చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాబ్‌లు అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్ అమలు చేసినప్పుడు ఇదే పత్రిక వ్యతిరేక కథనాలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంపై కోపం ఉంటే మరో రకంగా చూపాలేగానీ, ఇలా పేద పిల్లలపై చూపడం దిగజారిన పాత్రికేయానికి నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్‌లు ఉపయోగించడంలేదా? ట్యాబ్‌లు ఇవ్వొద్దని ఏ తల్లిదండ్రులు కోరారో ఈనాడు చెప్పాలన్నారు. రామోజీరావు కొడుకు, మనవలు ట్యాబ్‌లు, కంప్యూటర్లు ఉపయోగించాలి గానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఓ వర్గం రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం పేద పిల్లలను బలిచేయాలనుకోవడం ఇదేం పాత్రికేయం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందని అన్నారు. ఈనాడు పనికిమాలిన పత్రికగా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవి బైజూస్ ట్యాబ్స్ కావు.. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు ఈనాడు పేర్కొన్నట్టు అవి బైజూస్ ట్యాబ్‌లు కావని మంత్రి చెప్పారు. కేవలం బైజూస్ కంటెంట్ ఉచితంగా అప్లోడ్ చేసి ఇచ్చామని, ఈనెల 21న ఇవ్వనున్న ట్యాబ్స్‌లోనూ ఇదే విధానం పాటించామని తెలిపారు. కంటెంట్ కోసం బైజూస్‌కి ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదని, అలాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ట్యాబ్‌ల ఖర్చంతా ప్రభుత్వమే భరించిందన్నారు. పిల్లలకిచ్చిన ట్యాబ్‌లలో ఎడ్యుకేషన్ కంటెంట్ కాకుండా మరేవీ రాకుండా లాకింగ్ సిస్టమ్ ఉందని, ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుందన్నారు. ఎక్కడైనా తప్పుగా వినియోగించినా ఆ సమాచారం తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 21న ట్యాబ్‌ల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4.35 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఐదేళ్ల వారంటీతో గత ఏడాదికంటే మెరుగైన పరిజ్ఞానంతో ఇంటర్మీడియట్ వరకు ఉపయోగపడేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు. విద్యపై అవగాహన లేని సెలబ్రిటీ పార్టీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, విద్యా పథకాలపై కనీస అవగాహన లేకుండా సెలబ్రిటీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని జనసేన నాయకులనుద్దేశించి మంత్రి బొత్స అన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలను ఏ ప్రాతిపదికన ప్రభుత్వం అందిస్తుందో కూడా వారికి తెలియడంలేదన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఎవరు రాస్తారో తెలుసుకోకుండా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారన్నారు. విద్యా కానుక ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదివితే అందరికీ (42 లక్షలు) అందిస్తామని, అమ్మ ఒడి తల్లుల అకౌంట్లో ఒక విద్యార్థికి మాత్రమే జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లల్లో ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ అమల్లోకి వచ్చిందని, ఈ విద్యార్థులు 2025 మార్చిలో సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారని వివరించారు. గత నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు దాదాపు రూ.60 వేల కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇందులో కేంద్రం ఇచ్చింది రూ.6 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఇది కూడా తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాము మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటామని, పేద విద్యార్థులకు ఏటా ట్యాబ్‌లు ఇస్తామని, విద్యా సంస్కరణలు అమలు చేస్తామని, విద్యార్థులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. -
పేదల చదువులపై పిచ్చి ప్రేలాపనలు
సాక్షి, అమరావతి: పేద పిల్లలు విద్యలో ఉన్నతంగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ట్యాబ్‌ల పైనా ‘ఈనాడు’ విషం చిమ్మింది. ఈ ట్యాబ్‌లు చాలా సురక్షితమైనవి. విద్యార్థుల మెదళ్లకు పదును పెట్టేలా పాఠ్యాంశాలు, విద్యా పరమైన కంటెంట్ మాత్రమే ఉంటుంది. దీనికి లాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇతరత్రా విధానాలతో తప్పుగా వినియోగించినా లాక్ అయిపోతుంది. ఇంత సురక్షితౖమెన, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న ట్యాబ్‌లపై ఈనాడు పత్రికలో తప్పుడు ఆరోపణలతో పసి మనసులను కలుషితం చేసేలా దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం రామోజీరావుకు మాత్రమే చెల్లింది. ‘జగన్ బర్త్‌డే బహుమతి..చెడగొడుతోంది మతి!’ అంటూ పేద పిల్లలకు ఏవోవో ఆపాదిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. మనసున్న ఏ మనిషీ ఇలా పసి మనసులపై విషం చిమ్మే ప్రయత్నం చేయరు. ఈ ఆధునిక యుగంలో అసలు ఏ సంస్థ అయినా, వ్యక్తులైనా విద్యార్థులకు అత్యాధునిక విద్యా పరికరాలను అందించవద్దని చెబుతారా? రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో ట్యాబ్‌లు, అత్యాధునిక పరికరాలు లేకుండానే విద్యా బోధన జరుగుతోందా? అక్కడి విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పెలా అవుతుంది? సమాజంలో పిల్లలందరూ ఉన్నత స్థితికి చేరాలని ఎవరైనా కోరుకుంటారు.. ఒక్క రామోజీ తప్ప. ఆయన తన వర్గం, చంద్రబాబు మాత్రమే బాగుండాలని, మిగతా అందరూ తక్కువ స్థాయిలో ఉండాలన్న యావలో ఉంటారు. మరీ ముఖ్యంగా పేదలు బాగు పడుతుంటే చూడలేని కళ్లు అవి. పేదలు పేదలుగానే ఉండాలని, వారికి మంచి చదువులు అందకూడదన్నది ఆయన దృక్పథం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్æ శిక్షణ అమలు చేసినప్పుడు కూడా ఈనాడు ఇదే విధమైన వ్యతిరేక కథనాలు అచ్చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై నిత్యం తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, దానికి మహర్దశ తీసుకువస్తోంది. ఇదే ఈనాడుకు కడుపుమంట. సంపన్నుల పిల్లలకు మాత్రమే వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తే అందే నాణ్యమైన విద్యను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నదనే ఏడుపు. అందుకే చీటికిమాటికి పేద పిల్లల విద్యపై తప్పుడు రాతలు రాస్తోంది. ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ వ్యవస్థ ► విద్యార్ధులు ట్యాబ్‌లను నిర్దేశిత పాఠ్యాంశాలకు తప్ప, విద్యేతర అంశాలకు వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ట్యాబ్‌లోనూ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ (ఎండీఎం) ను పొందుపరిచింది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన 5 యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. అంతేకాక నిర్వహణ, మరమ్మతుల విషయంలో కూడా విద్యాశాఖ స్పష్టమైన ఎస్ఓపీని నిర్దేశించుకుంది. ► ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాబ్‌ను రీసెట్ చేసి, మరో యాప్ డౌన్లోడ్ చేసేందుకు యత్నిస్తే ఇంటర్నెట్ కనెక్టయిన వెంటనే ఆ ట్యాబ్ లాక్ అయిపోతుంది. దీన్ని అన్‌లాక్ చేయాలంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. వారు కూడా గూగుల్ అథంటికేటర్తో వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్ చేయగలరు. ► ట్యాబ్స్ నిర్వహణలో మూడంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్యాబ్స్‌లో లోపాలు వస్తే సరిచేయడానికి ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు. హార్డ్‌వేర్ సమస్యలను సరిదిద్దేలా గ్రామ/వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు శిక్షణ ఇచ్చారు. లోపాలు ఉన్న ట్యాబ్‌ను విద్యార్థి లేదా తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేస్తే రసీదు ఇచ్చి మూడు రోజుల్లో వాటిని బాగుచేసి తిరిగి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబ్‌లపై పిచ్చి ప్రేలాపనలు రామోజీ తప్ప మరెవరూ చేయలేరు. పునశ్చరణ, మెరుగైన బోధన కోసం ట్యాబ్‌లు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా మలచడంతోపాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్‌లను ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకోసమే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు, పునశ్చరణకు, మెరుగైన బోధనలో భాగంగా వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇవి వారికి ఇంటర్ వరకు ఉపయోగపడతాయి. 2021–22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో 5.18 లక్షల ట్యాబ్‌లను గతేడాది డిసెంబర్ 21న ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది కూడా మరో 4.35 లక్షల ట్యాబ్‌లను ఈ నెలలో సరఫరా చేస్తోంది. గత ఏడాది ట్యాబ్‌ల పంపిణీ కోసం రూ.660 కోట్లను ఖర్చు చేసింది. పిల్లలు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ యాప్ డిక్షనరీ, సందేహాల నివృత్తికి మరో యాప్, ఏపీ ఈ–పాఠశాల యాప్‌లను ట్యాబుల్లో ఇన్స్టాల్ చేసి విద్యార్థులకు, టీచర్లకు ఇచ్చారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులు వారికి ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకునేందుకు డ్యులింగో యాప్‌ను అదనంగా చేర్చారు. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్‌ను అందించారు. ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ జాతీయ పరీక్షల్లో చాలామంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారికి ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు మెరిట్ స్కాలర్షిప్ లభిస్తోంది. విద్యార్థులు ఆన్లైన్లో చదువుకోవాలంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు నేర్చుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీనికోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కంటెంట్ తయారు చేసి ట్యాబ్స్‌లో అప్లోడ్ చేశారు. -
ఈనాడు ట్యాబ్ కథనంపై మంత్రి బొత్స ఫైర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ చదువులపై యెల్లో మీడియా అక్కసు ప్రదర్శించింది. ట్యాబ్‌ల వల్ల పిల్లలు తప్పుదోవ పడుతున్నారని.. చదువులు గాడి తప్పుతున్నాయంటూ కథనం ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పేద పిల్లల భవిష్యత్‌పై ఈ పిచ్చారాతలేంటని?.. ఈనాడు, ఆ పత్రిక అధినేత రామోజీరావుపై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు మంత్రి బొత్స. గురువారం విజయవాడలో మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో దురదృష్టకర వాతావరణం ఏర్పడింది. ట్యాబ్‌లపై ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్‌లు ఉపయోగించడం లేదా?. ట్యాబ్‌లు ఇవ్వొద్దని ఏ పేరెంట్స్ కోరారు?.. ఇవన్నింటికి ఈనాడు సమాధానం చెప్పాలి. రామోజీరావు కొడుకు, మనవడు ట్యాబ్‌లు కంప్యూటర్లు, ట్యాబ్‌లు ఉపయోగించాలి కానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా? అని ప్రశ్నించారు మంత్సి బొత్స. ఒక్క రూపాయి ఖర్చుకాలేదు అవి బైజూస్ ట్యాబ్‌లు కావు. కేవలం బైజూస్ కంటెంట్ అందులో అప్లోడ్ చేసి ఇచ్చాం. అదీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాం. ఈ కంటెంట్ కోసం బైజూస్‌కి ప్రభుత్వం ఒక్కరూపాయి చెల్లించలేదు. అలాంటప్పుడు అవినీతి జరిగింది అని ఎలా ఆరోపిస్తారు?. ట్యాబ్‌ల కోసం ఖర్చంతా ప్రభుత్వమే భరించింది. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన వాటా చాలా తక్కువే అని బొత్స చెప్పారు. వేరే కంటెంట్ రాదు ట్యాబ్‌ల్లో ఎడ్యుకేషన్ కంటెంట్ కాకుండా మరేవి రాకుండా లాకింగ్ సిస్టమ్ఉంది. ట్యాబ్ లు ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుంది ఎక్కడైనా గేమ్స్ ఆడాలని.. వీడియోలు చూడాలని ప్రయత్నించినా కూడా పేరెంట్స్‌కి సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశాం. కనీస అవగాహన లేదా? పేదవాడి పిల్లల భవిష్యత్తుపై ఇలా తప్పుడు వార్తలు రాసే బదులు ఈనాడు నుంచి ఉద్యోగం మానివేయడం మంచిదని రామోజీరావుకు పరోక్షంగా సూచించారు మంత్రి బొత్స. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దని హితవు పలికిన మంత్రి బొత్స.. ట్యాబ్ లే ఇవ్వొద్దని ఎలా రాస్తారని, పేదపిల్లలకు అన్యాయం చేయమంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన వార్తలు మళ్లీ రాయొద్దు. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దు. అసలు ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన, అధ్యయనం చేయకుండా తప్పుడు విమర్శలు ఎలా చేస్తారన్నారు. అమ్మ ఒడికి, విద్యా కానుకకి కూడా తేడా తెలియదని.. విమర్శలు చేసే ముందు కనీస అవగాహన అలవర్చుకోవాలని ఈనాడు-రామోజీలకు మంత్రి బొత్స చురకలటించారు . పాజిటివ్ఓటుతో అధికారంలోకి వస్తాం సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకీ మేలు చేసింది, వందకు 80 శాతం ప్రజలు ప్రభుత్వం వెంటే ఉంటారన్న నమ్మకం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పు పరిణామాలపైనా ఆయన స్పందించారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేశారుకాబట్టే చంద్రబాబు ఓడిపోయారు. జగన్ హయాంలో సంతృప్తికర పాలన సాగింది. విద్య, వైద్య రంగాలలో ఎంతో అభివృద్ది చేశాం. అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్నాం.. అదే చేస్తున్నాం. అందుకే పాజిటివ్ ఓటుతో మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారాయన ‘‘మంచి ఫలితాల కోసమే అభ్యర్ధులని మార్చాం. మా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గాజువాక, మంగళగిరిలలో బీసీలకే కదా ఇచ్చాం. టిక్కెట్ల కేటాయింపులో మా స్టైల్ మాది.. మా విధానం మాది. చంద్రబాబుకి కుప్పం సీటుపైనే గ్యారంటీ లేదు. అసలు చంద్రబాబు రెండు చోట్ల ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు?’’.. ►పదిహేను మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ చెప్పడం పెద్ద జోక్. మూడు నెలలు తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు. ఉగాది తర్వాత ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విషయం నేను ఆరు నెలల క్రితమే చెప్పా.. ►.. గత ప్రభుత్వంలో అంగన్వాడీల జీతాలు పెరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పెంచాం. సమస్యలు ఏమున్నా.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంగన్ వాడీలు ఆందోళన విరమించాలని కోరుకుంటున్నాం.. ►తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు.. అని మంత్రి బొత్స మీడియా సమావేశంలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు సిద్ధం
-
99శాతం బాగున్నాయి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబ్‌ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్‌ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్‌లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్‌లో ఎస్డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్‌ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. తల్లిదండ్రులపై భారం పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్లో 5,18,740 ట్యాబ్స్‌ను బైజూస్ కంటెంట్‌తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్‌లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఎస్డీ కార్డు మార్చినవి కొన్నే.. కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్‌లోని ఎస్డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులు ఎస్డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్‌ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ కల్పించారు. ఇకపై ట్యాబ్‌ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది. సక్రమంగా వినియోగించాలి.. విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్‌ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్‌గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ -
ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠశాలల ను విద్యాశాఖ ఐటీ బృందం స్వయంగా పరిశీలించి ట్యాబ్‌ల పనితీరును పరీక్షిస్తోంది. విద్యార్థులకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు అ న్ని పాఠశాలల్లోనూ ఈ బృందం అన్ని ట్యాబ్‌లను పరిశీలిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఐటీ నోడల్ ఆఫీ సర్ సీహెచ్ రమేశ్ కుమార్ నేతృత్వంలో బృందం ఈ ప్రక్రియను ప్రారంభించింది. మండలానికి ఇ ద్దరు ఐటీ నేపథ్యం ఉన్న ఉపాధ్యాయుల చొప్పున 1,360 మందితో పాటు జిల్లా నోడల్ ఆఫీసర్లు కూ డా ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలుత సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టనున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు వాటి వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ని ర్వహిస్తున్నారు. వాస్తవానికి ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ తప్ప ఇంటర్నెట్ కంటెంట్‌ను అప్లోడ్ చేసేందుకు, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా ట్యాబ్‌ల సాఫ్ట్వేర్ రూపొందించారు. సరైన అవగాహన లేక కొందరు విద్యార్థులు యాప్స్ డౌన్లోడ్ చేసేందుకు యత్నించడంతో అవి సాంకేతికంగా నిలిచిపోతున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందీ విద్యార్థులు గుర్తించలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిన్నింటికి పరిష్కారంగా విద్యాశాఖ ఐటీ బృందం ఇప్పుడు అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్ అథెంటికేటర్ సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్‌కు యత్నిస్తే హెచ్ఎంకు మెసేజ్ విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఎలాంటి మా ర్పులు చేసినా వెంటనే ఉన్నత స్థాయిలోని వారికి ఓటీపీ మెసేజ్ వచ్చేలా ఐటీ బృందం చర్యలు తీ సుకుంటోంది. అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్ అథెంటి కేటర్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నిస్తే వెంటనే సంబంధిత స్కూలు హెచ్ఎంకు, రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ సిబ్బందికి, మండల స్థాయిలో ఐటీ సహాయకులుగా పనిచేసే ఉపాధ్యాయులకు సైతం సమాచారం వెళ్తుంది. దీంతో ఏ పాఠశాలలో ఏ విద్యార్థి తప్పుచేశారో సులభంగా తెలిసిపోతుంది. ప్రసుత్తం ఉన్న ట్యాబ్‌లను సరైన రీతిలో విని యోగించకపోవడమే తప్ప.. వాటిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని స్టేట్ ఐటీ నోడల్ అధికారి రమేశ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఏర్పాట్లు చేశామ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సచి వాలయ డిజిటల్ అసిస్టెంట్‌కు ట్యాబ్‌ల వినియో గంపై శాస్త్రీయ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. -
పిల్లల ట్యాబ్‌లపై పచ్చ వైరస్ దాడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం. ఇందుకోసం రాష్ట్ర విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తూ, అత్యాధునిక బోధన పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు అత్యాధునిక ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమంపైనా పచ్చపత్రికలు విషం చిమ్ముతున్నాయి. ట్యాబ్‌లు పాడైపోయాయని, పాఠాలు అప్లోడ్ చేయలేదని, పిల్లలకు ఆ పాఠాలు సరిగా అర్థంకావడంలేదని మంగళవారం ఓ పచ్చ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలోని అంశాలు పూర్తిగా అవాస్తవాలేనని ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ♦ గత సంవత్సరంలో 8 వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పూర్తిగా పంపిణీ అయ్యాయి. వీటిలో 9 వ తరగతి పాఠాలు కూడా అప్పుడే అప్లోడ్ చేసి అందించారు. ♦ ట్యాబ్‌లో ఉన్న బైజూస్ కంటెంట్ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో ఉంది కనుక విద్యార్థులకు, టీచర్లకు అర్థం కాకపోవడం అనేది జరగదు. విద్యార్థులు ఆంగ్ల పదాలను సులువుగా ఉచ్చరించగలుగుతారు. సాంకేతిక పదాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. తద్వారా పై తరగతుల్లోకి వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా పాఠాలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ♦ విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీనివల్ల అవాంఛనీయ సైట్లు, నాన్ అకడమిక్ అంశాలు ట్యాబుల్లో వచ్చే అవకాశమే లేదు. ♦ పగిలిపోయిన ట్యాబ్‌లను గ్రామ, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి ఇస్తున్నారు. స్క్రీన్లు పాడైపోయిన వాటికి త్వరలో నూతన స్క్రీన్ వేయించి పంపిణీ చేస్తారు. ♦ అన్ని ట్యాబ్‌లలో ఎస్డీ కార్డులు ఉన్నాయి. ఎస్డీ కార్డు లేకుండా ఏ విద్యారి్థకీ ట్యాబ్ పంపిణీ జరగలేదు. ♦ టీచర్లందరికీ మూడు దఫాలుగా బైజూస్ కంటెంట్, ట్యాబ్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ♦ ప్రతి వారం పిల్లలు ఎంత సమయం ట్యాబ్ మీద వెచ్చిస్తున్నారు? ఏయే అంశాలను నేర్చుకుంటున్నారు? వారి పజ్ఞానం ఏ మేరకు మెరుగుపడిందో టీచర్లు పరిశీలిస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు. పిల్లలు త్వరగా నేర్చుకొనేలా ట్యాబ్‌లు విద్యార్థులు పాఠాలను తరగతి గదిలోను, ఇళ్ల వద్ద కూడా అనువైన సమయంలో అభ్యసించేందుకు ప్రభుత్వం ఈ ట్యాబ్‌లు ఇస్తోంది. విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కలి్పంచేలా 8 నుంచి 10వ తరగతి వరకు అత్యుత్తమమైన బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను వీటిలో అప్లోడ్ చేసి అందిస్తోంది. ఈ పాఠాలు గ్రాఫులు, మ్యాపులతో పాటు త్వరగా అర్థమయ్యే రీతిలో వీడియోలతో పిల్లలను ఆకర్షించేలా, మరింత శ్రద్ధగా చదువుకొనేలా చేస్తున్నాయి. వారికి పాఠాలు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తోంది. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు వరుసగా వీటిని ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు వీటిని ఇచ్చారు. స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలు సరిగా అర్థంకాకపోయినా వాటిని ట్యాబ్‌ల ద్వారా ఇళ్ల వద్దే పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు గతంలోకంటే ఎంతో మెరుగయ్యాయని పలు పరిశీలనల్లో తేలింది. -
ఆన్లైన్లో ‘అగ్రి’ సెన్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతుల జీవన స్థితిగతులు..సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయగణన (అగ్రికల్చర్ సెన్సెస్) ఇటీవల దేశవ్యాప్తంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూకమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం పది అంశాలపై మూడు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాగిత రహితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు వినియోగించి ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో ఏఈఓలు సర్వే చేస్తుండగా, మిగతా రాష్ట్రాల్లో మాన్యువల్‌గానే చేపడుతున్నారు. 2021–22 ప్రామాణికంగా 11వసారి దేశంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక ఆర్థిక విధాన రూపకల్పనకు కేంద్రం ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తోంది. 1979లో వ్యవసాయగణన మొదలుకాగా, చివరగా పదోసారి 2015–16లో చేపట్టారు. 11వ వ్యవసాయ గణన 2021–22లో జరగాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021–22 ప్రామాణిక సంవత్సరంగా ఈ నెల నుంచి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. మూడు దశల్లో... వానాకాలం, యాసంగిలో ఆయా రైతుల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఏటా వ్యవసాయశాఖ సర్వే చేస్తోంది. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మూడు విడతల్లో వ్యవసాయ గణన చేపట్టారు. ♦ మొదటి విడతలో రైతు పేరు, సామాజికస్థితి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం, పురుషులు, మహిళలు ఇలా అన్ని సేకరించి రెవెన్యూ గ్రామం వారీగా నమోదు చేస్తున్నారు. ♦ రెండో విడతలో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టీఆర్ఏఎస్ (ట్రైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్)తో పాటు అదనంగా మరికొంత సమాచారం సేకరిస్తారు. ♦ మూడో దశలో ఏడు శాతం గ్రామాల్లో సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ రాయితీలు తదితర వివరాలు సేకరిస్తారు. సాంకేతికతతో సర్వే... తాజాగా రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణనలో అధికారులు వందశాతం సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విధానంలో వ్యవసాయ కమతాలు, రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకానికి రైతుల నుంచి ఆధార్ కార్డులు, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పంటల సాగు తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచగా, వాటి ఆధారంగా వ్యవసాయగణనలో అదనపు సమాచారం తీసుకుంటున్నారు. ప్రణాళికకు వ్యవసాయ గణన కీలకం వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆర్థిక విధాన రూపకల్పనకు వ్యవసాయ గణన ఎంతో ఉపయోగకరం. నిరీ్ణత లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. – దశరథ్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రణాళికశాఖ అధికారి ఈ నెల 31లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ గణన చేయిస్తున్నాం. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు అనుగుణంగా ఈ పంటల వివరాల లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేస్తాం. – బి.వెంకటేష్, మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ అధికారి -
వరుసగా రెండో ఏడాదీ ఉచితంగా ట్యాబ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వారికి ఉచితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన ట్యాబ్‌లను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.750 కోట్ల వ్యయంతో ఐదు లక్షల ట్యాబ్‌లను కొనుగోలు చేసేందుకు ఈ–టెండర్‌ను ఆహ్వానించింది. టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించింది. ప్రివ్యూ అనంతరం పారదర్శకంగా తక్కువ కోట్ చేసిన వారిని ఎంపిక చేసి మళ్లీ రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించనుంది. ఇందులో తక్కువ కోట్ చేసిన వారికి ట్యాబ్‌ల సరఫరాను అప్పగించనుంది. గతేడాది ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో ప్రీలోడ్ చేయించి 8వ తరగతి విద్యార్థులకు అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ తరగతి విద్యార్థులకు ఐదు లక్షల ట్యాబ్‌లను ఉచితంగా అందించనుంది. ఆఫ్లైన్లోనూ వీడియో పాఠ్యాంశాలు 8వ తరగతి విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా నిర్వహించే అభ్యసనాన్ని పర్యవేక్షించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం విశేషం. ట్యాబ్‌కు ఒకసారి చార్జింగ్ పెడితే 10 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో వీడియో పాఠ్యాంశాలను అభ్యసించేలా ప్రీలోడెడ్ కంటెంట్‌తో ఈ ట్యాబ్‌లను అందిస్తారు. 3 ఏళ్ల పాటు వీటికి వారెంటీ ఉంటుంది. పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా పాఠాలు అందుకుంటారు. మధ్యలో ట్యాబ్‌ల్లో ఏదైనా సమస్య వచ్చినా సరఫరా చేసిన సంస్థ తిరిగి సరిచేసి ఇస్తుంది. పిల్లలను పక్కదారి పట్టించే ప్రమాదకర వెబ్సైట్లు ఓపెన్ కాకుండా ప్రత్యేకమైన లాకింగ్ వ్యవస్థను కూడా ట్యాబ్‌ల్లో ఏర్పాటు చేశారు. సిమ్ స్లాట్‌ను లాక్ చేయడంతో ఓపెన్ కాదు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే బైజూస్ యాప్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. గూగుల్ వంటివి ఓపెన్ అయినా వాటిలో కేవలం విద్యార్థులు అదనపు సబ్జెక్టు అంశాలను నేర్చుకోవడానికే అవకాశం ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులకు అవకాశం.. విద్యార్థులకు అందించే ఒక్కో ట్యాబ్ 8.7 అంగుళాల టచ్ స్క్రీన్, కనీసం 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ కలిగి ఉండాలని ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. సరఫరా చేసిన 30 రోజుల్లోగా ట్యాబ్‌లో లోపాలుంటే దాని స్థానంలో కొత్త ట్యాబ్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ట్యాబ్‌లో రిపేరు వస్తే ఏడు రోజుల్లోగా సరిచేసి ఇవ్వాలనే నిబంధన విధించింది. ట్యాబ్‌ల్లో లోపాలుంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏడు రోజుల్లోగా లోపాలను సరిచేసి ట్యాబ్‌లను అందించాలని టెండర్ డాక్యుమెంట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్యాబ్‌లన్నీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉండాలని.. ఇందులో ఎక్కడా రాజీపడేది లేదని పేర్కొంది. నిర్ధారించిన ప్రమాణాల మేరకు సరఫరా చేయకపోతే బ్లాక్‌లిస్ట్‌లో కూడా ఉంచనున్నట్లు తెలిపింది. -
డిజిటల్ విద్యపై అక్కసు
-
మళ్ళీ లైసెన్స్ రాజ్యమా?
ఎప్పుడో వదిలేసిన పాత విధానాలను ఇప్పుడు మళ్ళీ తెస్తే... కొత్త ఫలితాలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్తాయనే అనుకుంటున్నట్టు ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం గత వారం హఠాత్తుగా షరతులు పెట్టడాన్ని చూస్తే, మళ్ళీ 1970ల నాటి ప్రభుత్వ విధానాలు గుర్తొస్తున్నాయి. జాతీయ భద్రత కారణంగా చైనా, కొరియాల నుంచి ఈ దిగుమతులను నియంత్రించాలని ప్రభుత్వ భావన. లైసెన్సు తీసుకుంటేనే అనుమతిస్తా మని సర్కార్ చెబుతోంది. అయితే, వెల్లువెత్తిన విమర్శలు, వ్యక్తమైన ఆందోళనలతో ప్రస్తుతానికి మూడు నెలల పాటు నవంబర్ 1 దాకా ఈ షరతులను వాయిదా వేసింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ఈ నిబంధనలని పాలకుల మాట. కానీ, షరతులతో అది సాధ్యమవుతుందా? చైనాను లక్ష్యంగా చేసు కొని పెడుతున్న ఈ నిషేధం తీరా భారతీయులకే నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు ఏటా 6.25 శాతం వంతున పెరుగుతున్నాయి. 2022 – 23లో 533 కోట్ల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను దిగుమతి చేసుకున్నాం. అందులో 75 శాతం చైనావే. ఇప్పుడు పౌరుల డిజిటల్ భద్రత రీత్యా ఈ దిగుమతులపై షరతులు పెడుతున్నామంటున్నారు. ఆ సాకు చూపడానికి కారణం ఒకటే! జాతీయ భద్రత కారణమైతేనే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల్లో దిగుమతులపై షరతులు పెట్టే వీలుంటుంది. దేశీయ ఉత్పత్తులను కాపు కాసుకోవడం కారణమంటే రచ్చ తప్పదు. అయితే, ఎంత జాతీయ భద్రతను సాకుగా చూపినప్పటికీ, ఈ దిగుమతుల షరతులకు అవతలి వైపు నుంచి ట్యారిఫ్ల ప్రతిచర్యలు, దీర్ఘకాలిక వివాదాలు ఎలాగూ తప్పవు. పరిశ్రమతో ఎలాంటి సంప్రతింపులూ జరపకుండానే హడావిడి నిర్ణయం తీసుకొని, సుస్థిర వ్యవస్థను హఠాత్తుగా మార్చడంతో వచ్చిపడే ఇబ్బందులు సరేసరి. ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలోని కంపెనీలు ల్యాప్‌టాప్‌లను యథేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రానున్న కొత్త రూల్స్‌తో ప్రత్యేక లైసెన్స్ ఉంటే కానీ, దిగుమతి సాధ్యం కాదు. 2020లో కలర్ టీవీల దిగుమతి పైనా భారత్ ఇలాంటి షరతులే పెట్టడం గమనార్హం. అలాగే, మొబైల్‌ఫోన్లపైనా అధిక ట్యారిఫ్‌లు విధించింది. పలు స్మార్ట్‌ఫోన్ సంస్థలు భారత్‌లోనే విడిభాగా లను కూర్చి, తయారు చేస్తున్నాయి. కానీ, కంప్యూటర్ల సంగతలా కాదు. చైనా సంస్థ లెనోవా మినహా యాపిల్, డెల్, సామ్సంగ్, షియామీ తదితర ఉత్పత్తులన్నీ దిగుమతులే! కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ దెబ్బతో ఈ సంస్థల గంపగుత్త ఆర్డర్లపై దెబ్బ పడుతుంది. కలర్ టీవీల్లా కాక కంప్యూటర్లు విద్య, పరిశోధన, పౌరసేవల్లో కీలకం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకై ఈ మధ్యే రిలయన్స్ సంస్థ రూ. 20 వేల లోపలే లభించే జియోబుక్‌ను తెచ్చింది. అదీ చైనా తయారీయే! రిలయన్స్ ఇప్పుడిక పాలకుల నుంచి ప్రత్యేక లైసెన్స్ తెచ్చుకోకుంటే, దిగుమతి చేసుకోలేదు. షరతుల వార్తలతో ఈ వారం కంప్యూటర్ల అమ్మకాలు 25 శాతం పెరిగాయి. చివరకు కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటికే కోవిడ్ వల్ల సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, సెమీ కండక్టర్ సంక్షోభం సతమతం చేస్తున్నాయి. షియామీ, రియల్‌మి, వన్‌ప్లస్ లాంటి కొత్త ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయ ట్యాబ్ మార్కెట్ ఈ షరతులతో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, ఐటీ సేవల కేంద్రంగా పేరున్న దేశం కంప్యూటర్ల దిగుమతులపై షరతుల పాట పాడడం ఎలా చూసినా అనూహ్యమే! ప్రజలపై ప్రభావం చూపుతూ, దీర్ఘకాలిక ఆర్థిక పర్యవసానాలున్న నిర్ణయాలను తీసుకొనే ముందు పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తలతో సంప్రతింపులు జరిపివుంటే పాలకులు ఈ హఠాన్నిర్ణయం తీసుకొనేవారు కాదు. దేశీయ ఉత్పత్తి పెంచడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విశ్వసనీయ హార్డ్‌వేర్‌ను అందుబాటులో ఉంచడం మంచి లక్ష్యాలే. కానీ, వాటి కోసం పాత లైసెన్స్ రాజ్యానికి తిరోగమించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఫలానా చైనా ఉత్పత్తుల వల్ల భద్రతలో ముప్పుందని భావిస్తే, ఆ దేశ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తే సరి. అలాకాక మొత్తం వ్యవస్థను లైసెన్సుల అగచాట్లలోకి నెట్టాల్సిన పని లేదు. అనేక కష్టాలు భరించాకే లైసెన్స్ రాజ్యబంధనాల్ని వదిలించుకున్నామని విస్మరించలేం. సులభంగా లైసెన్సులు ఇస్తామంటున్నా, ఆశ్రితపక్షపాతం సహా సమస్యలు మామూలే! ఇవాళ మనది సేవల రంగంతో పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థ. అందులో కీలకమైన కంప్యూటర్ హార్డ్వేర్ల కొరతతో దీర్ఘకాలిక నష్టమే. దేశీయోత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని 2020లో ప్రారంభించిన కేంద్రం వివిధ రంగాలకు దాన్ని విస్తరించినా, ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఆశించినంత భాగస్వామ్యం రావట్లేదు. కేటాయింపులు రెట్టింపు చేసినా అదే పరిస్థితి. అలాగని, దిగుమతులపై షరతులు, లైసెన్స్ రాజ్యం పెడితే దేశీయ ఉత్పత్తి పెరుగుతుందనుకోవడం అవివేకం. ఆ సంగతి గత చరిత్ర నిరూపించింది. అపార ఇంజనీరింగ్ ప్రతిభ, తక్కువ వేతనానికే మెరుగైన సేవలు ఇస్తున్నా మనం అంతర్జాతీయ ఉత్పత్తి సేవల భాగస్వామ్యంలో ఎందుకని, ఎక్కడ వెనుకబడిపోయామో మథనం సాగాలి. ఆ విధాన లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి వెయ్యిలో 15 మందికే కంప్యూటర్ చేరిన దేశంలో షరతులతో ఆ లోటు పెరుగుతుందా, తరుగుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యపై సమగ్ర దృష్టి పెట్టాలి. సంబంధింత పక్షాలతో క్షుణ్ణంగా చర్చించాలి. అనివార్యమైతే తప్ప అనవసర షరతులతో నష్టమని గుర్తించాలి. లేదంటే భారత పురోగతి మరోసారి కుంటుపడుతుంది. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
AP: సర్కారు బడిలో ‘టోఫెల్’ ట్రైనింగ్
మనం ఏ కార్యక్రమం తలపెట్టినా పేద వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. వారి పట్ల సహృదయంతో పని చేయాలి. వారి జీవితాల్లో మార్పు తేవడం దేవుడి దృష్టిలో గొప్ప సేవ చేసినట్లే. ఇదొక సవాల్‌తో కూడుకున్న కార్యక్రమం. టోఫెల్ శిక్షణను కేవలం జూనియర్ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్ వన్, ప్లస్ టూ (ఇంటర్) వరకూ విస్తరించాలి. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులను చేపట్టిన నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్’ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఊమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఈటీఎస్ అసెస్మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రుయి ఫెరీరా, డేనియల్, యూఫిఎస్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ కపూర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కపిల్, వైస్ ప్రెసిడెంట్ డిజిటల్ సేల్స్ ఇండియా కే–12 రాజీవ్ రజ్దాన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పరిశీలించాలని ఈటీఎస్ బృందాన్ని ఆహ్వానించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌లు రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్ చేస్తున్నాం. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తాం. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతాం. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. 1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తాం. టెన్త్ విద్యార్థులు 2025లో సీబీఎస్ఈ పరీక్షలకు ఇంగ్లిష్ మీడియంలో హాజరవుతారు. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయి. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతాం. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం. వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం. కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఒప్పందంలో ముఖ్యాంశాలు.. ♦ టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. ♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. ♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. ♦ 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్ ప్రైమరీని నిర్వహిస్తారు. ♦ 6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష ఉంటుంది. ♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్ జూనియర్ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. ♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు. ♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. ♦ అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు మూడు రోజులపాటు పంపిస్తారు. ♦ ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్ –1, ప్లస్ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం విద్యలో నాణ్యత పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంతోనైనా విద్యార్థులు సులభంగా అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. నా తల్లిదండ్రులు ఫ్రాన్స్‌కు చెందినవారు కావడంతో ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు. నేను ఆంగ్ల భాష నేర్చుకుని అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందా. ఈటీఎస్ 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మాది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సంస్థ. 180 దేశాల్లో 9 వేల ప్రాంతాల్లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 52 మంది టీచర్లను అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపనుంది. వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం. – అలైన్ డౌమాస్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ -
8వ తరగతి విద్యార్థులకు, టీచర్స్ కు ట్యాబ్స్
-
AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్‌లు
సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్‌ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్‌ల వినియోగంలో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది. అయితే, హార్డ్‌వేర్ సమస్యలు వస్తే ట్యాబ్‌లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్‌ను డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, వివరాల నమోదు, ఆన్లైన్లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీదులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్‌గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్‌లను రాష్ట్రంలోని 145 శాంసంగ్ సర్వీస్ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు. ట్యాంపర్ చేస్తే ఐటీ సెల్‌కు అలర్ట్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్‌ల్లో కంటెంట్ ఇంటర్నెట్ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్‌ను నెట్(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్ ఐటీ సెల్‌కు చేరుతాయి. విద్యార్థులు ట్యాబ్‌లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్‌ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్‌లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు. విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్‌లోని కంటెంట్ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్‌గా ట్యాబ్ లాక్ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్‌తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి అన్‌లాక్ చేస్తారు. -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
హనుమాన్ గుడి లేని ఊరు.. పథకాలు అందని ఇల్లు లేదు
సిరిసిల్ల: రాష్ట్రంలో ‘హనుమాన్ గుడిలేని ఊరు, కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం నాలుగు వందల మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ నీళ్లు, గురుకులాల్లో విద్య, ఆసరా పెన్షన్... ఇలా ఏదో ఒక్క పథకంలో పక్కాగా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధిపొందుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు రానివారికి ‘రూ.3 లక్షల ఇల్లు’పథకంలో అవకాశం కల్పిస్తామని అన్నారు. స్థలం లేని వారికి స్థలం, ఇల్లు కట్టుకోడానికి నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అర్హులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మోదీకి ఇష్టం లేకున్నా.. మనమే నంబర్ వన్ తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేకున్నా.. దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ విభాగంలో రాజన్న సిరిసిల్ల నంబర్ వన్‌గా ఉందని, రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని కాలేజీ విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా రెండు వేల మందికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని పిల్లలకు మరో 3 వేల ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86 వేలు ఉంటుందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే పిల్లలు ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని, ప్రపంచంతో పోటీ పడేస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలి వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే తొలి వృద్ధాశ్రమాన్ని మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో ప్రారంభించారు. ఎస్టీ హాస్టల్ భవనాన్ని రూ.40 లక్షలతో ఆధునీకరించి వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్‌గా మార్చారు. 25 పడకలతో కూడిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి యోగా కేంద్రం, ఫిజియోథెరపీ, డాక్టర్ రూం, వ్యాయామ శాల, గేమ్స్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో మంత్రి కేటీఆర్ క్యారంబోర్డు ఆడారు. వారితో కలిసి భోజనం చేశారు. వృద్ధులతో చాలాసేపు ముచ్చటించారు. -
నిరంతర పరిశీలన: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో ఎలాంటి సమస్య తలెత్తినా వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలని, లేదా కొత్త ట్యాబును అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ట్యాబుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరుపై డేటా అనలిటిక్స్ ద్వారా నిరంతర పరిశీలన ఉండాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబుల పంపిణీ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ట్యాబుల (నిర్వహణ) మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్యాబుల వాడకం.. దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరు, తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఐఎఫ్పి ప్యానెల్స్ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని, 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఇవి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని, వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన కలిగేలా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లలందరికీ డిక్షనరీలు ఇవ్వాలి – పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలించండి. లేని పిల్లలు అందరికీ వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుకతో కలిపి ఇవ్వాలి. ఇందు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలి. – పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగు పడుతుంది. డీఎస్సీ–98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలి. – గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలి. ఫిబ్రవరి 1 నుంచి వారంలో మూడు రోజులు పిల్లలకు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ ఇవ్వాలి. అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ఇప్పటికే సరఫరా.. – ప్రత్యేక లేబుల్‌తో సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. – 22 వేలకుపైగా స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ పనులు నడుస్తున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. – ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు–నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యా శాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్కూలు పిల్లలకు ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా పిబ్రవరి 1వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ గ్లాసుడు చొప్పున ఇవ్వాలి. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. నాడు– నేడు కింద బాగు చేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలి. ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ (స్కూల్, టాయ్‌లెట్ నిర్వహణ నిధి) నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. – సీఎం వైఎస్ జగన్ -
CM YS Jagan Birthday: చిన్నారులకు ట్యాబ్స్ అందజేసిన సీఎం జగన్