వెబ్‌డెస్క్:మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ట‍్యాబ్ S7 FE ఫీచర్లు లీక్ అయ్యాయి. సౌత్ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ ట్యాబ్ S7 FE , A7 Lite ట్యాబ్‌లను విడుదల చేస్తున్నట్లు మే నెలలో ప్రకటించింది. ఈ ట్యాబ్స్ రేపు ఇండియాకు చేరుకోబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ట్యాబ్‌లకు సంబంధించిన ఫీచర్లు పబ్లిక్ డొమైన్ లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..గెలాక్సీ Tab S7 FE ,గెలాక్సీ Tab A7 Lite ఫీచర్లు ఇలా ఉన్నాయి.
మిస్టిక్ స్పెషల్
మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ పింక్ కలర్స్ విడుదల కానున్న గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ఇ 12.4-అంగుళాల టీఎఫ్‌టీ (Thin Film Transistor) డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్, 750 జి ప్రాసెసర్, టాబ్లెట్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.దీనిని పెన్ (Ultra S-Pen) ఆపరేట్ చేసుకోవచ్చు.
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ విషయానికొస్తే భారత్ లో ఈ ట్యాబ్ ఖరీదు రూ. 14,999 కే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్పెసిఫేకషన్ పరంగా చూస్తే గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ 15: 9 యాస్పెక్ట్ రేషియో, 8.7-అంగుళాల WXGA + డిస్‌ప్లే తో వస్తుంది. మీడియాటెక్ హెలియో పి 22 టి ప్రాసెసర్ తో నడుస్తుంది. 3 జీబీ+ 32 జీబీతో పాటు 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌లను కలిగి ఉంది. గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్‌లో 8 మెగాపిక్సెల్ తో విడుదల కానుండగా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టాబ్లెట్ 5W100mAh బ్యాటరీని, 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కాగా, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ గ్రే,సిల్వర్ కలర్ లో అందుబాటులోకి రానుంది.
చదవండి : Samsung Galaxy M32: ధర రూ.20వేల లోపే, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?!
Comments
Please login to add a commentAdd a comment