సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం. ఇందుకోసం రాష్ట్ర విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తూ, అత్యాధునిక బోధన పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు అత్యాధునిక ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తున్నారు.
ఈ మహత్తర కార్యక్రమంపైనా పచ్చపత్రికలు విషం చిమ్ముతున్నాయి. ట్యాబ్‌లు పాడైపోయాయని, పాఠాలు అప్‌లోడ్ చేయలేదని, పిల్లలకు ఆ పాఠాలు సరిగా అర్థంకావడంలేదని మంగళవారం ఓ పచ్చ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలోని అంశాలు పూర్తిగా అవాస్తవాలేనని ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది.
♦ గత సంవత్సరంలో 8 వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పూర్తిగా పంపిణీ అయ్యాయి. వీటిలో 9 వ తరగతి పాఠాలు కూడా అప్పుడే అప్‌లోడ్ చేసి అందించారు.
♦ ట్యాబ్‌లో ఉన్న బైజూస్ కంటెంట్ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో ఉంది కనుక విద్యార్థులకు, టీచర్లకు అర్థం కాకపోవడం అనేది జరగదు. విద్యార్థులు ఆంగ్ల పదాలను సులువుగా ఉచ్చరించగలుగుతారు. సాంకేతిక పదాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. తద్వారా పై తరగతుల్లోకి వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా పాఠాలు అర్థం చేసుకోగలుగుతున్నారు.
♦ విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. దీనివల్ల అవాంఛనీయ సైట్లు, నాన్ అకడమిక్ అంశాలు ట్యాబుల్లో వచ్చే అవకాశమే లేదు.
♦ పగిలిపోయిన ట్యాబ్‌లను గ్రామ, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి ఇస్తున్నారు. స్క్రీన్లు పాడైపోయిన వాటికి త్వరలో నూతన స్క్రీన్ వేయించి పంపిణీ చేస్తారు.
♦ అన్ని ట్యాబ్‌లలో ఎస్‌డీ కార్డులు ఉన్నాయి. ఎస్‌డీ కార్డు లేకుండా ఏ విద్యారి్థకీ ట్యాబ్ పంపిణీ జరగలేదు.
♦ టీచర్లందరికీ మూడు దఫాలుగా బైజూస్ కంటెంట్, ట్యాబ్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
♦ ప్రతి వారం పిల్లలు ఎంత సమయం ట్యాబ్ మీద వెచ్చిస్తున్నారు? ఏయే అంశాలను నేర్చుకుంటున్నారు? వారి పజ్ఞానం ఏ మేరకు మెరుగుపడిందో టీచర్లు పరిశీలిస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు.
పిల్లలు త్వరగా నేర్చుకొనేలా ట్యాబ్‌లు
విద్యార్థులు పాఠాలను తరగతి గదిలోను, ఇళ్ల వద్ద కూడా అనువైన సమయంలో అభ్యసించేందుకు ప్రభుత్వం ఈ ట్యాబ్‌లు ఇస్తోంది. విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కలి్పంచేలా 8 నుంచి 10వ తరగతి వరకు అత్యుత్తమమైన బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను వీటిలో అప్‌లోడ్ చేసి అందిస్తోంది. ఈ పాఠాలు గ్రాఫులు, మ్యాపులతో పాటు త్వరగా అర్థమయ్యే రీతిలో వీడియోలతో పిల్లలను ఆకర్షించేలా, మరింత శ్రద్ధగా చదువుకొనేలా చేస్తున్నాయి. వారికి పాఠాలు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తోంది.
ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు వరుసగా వీటిని ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు వీటిని ఇచ్చారు. స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలు సరిగా అర్థంకాకపోయినా వాటిని ట్యాబ్‌ల ద్వారా ఇళ్ల వద్దే పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు గతంలోకంటే ఎంతో మెరుగయ్యాయని పలు పరిశీలనల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment