
బెంగళూరు: ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ ఇండియా’ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం.
లెనొవొ ఇండియా.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా నివేదికను ఉటంకిస్తూ.. 2017–18 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలోనూ శాంసంగ్, ఐబాల్ కంపెనీలను వెనక్కు నెట్టామని ప్రకటించింది. ఇక లెనొవొ ఇండియా ప్రధాన ప్రత్యర్థులైనా శాంసంగ్, ఐబాల్ మార్కెట్ వాటా వరుసగా 19.9 శాతంగా, 17.7 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment