ఆన్‌లైన్‌లో పొంచి ఉంటున్న హ్యాకర్లు
నెటిజన్‌ల నిర్లక్ష్యమే ఆ కేటుగాళ్లకు వరం
అవగాహన రాహిత్యమే అసలు ప్రమాదం
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివి..
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్‌సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్‌లైన్‌లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.
జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్‌లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్‌బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్‌లైన్‌లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.
అఆ ‘పాస్‌వర్డ్‌లు’ వద్దే వద్దు
ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్‌వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్‌నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్‌వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్‌ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.
‘ఎక్స్‌టెన్షన్’లను తొలగించండి
కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్‌టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.
‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి.
అదీకృత అప్‌డేట్స్ చేసుకోవాల్సిందే
ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్‌వేర్స్ అప్‌డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్‌డేట్స్‌ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.
లాగిన్ వివరాలు వేరుగా ఉండాలి
థర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్‌బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్‌వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి.
‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమే
ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్‌వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్‌వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు.
Comments
Please login to add a commentAdd a comment