Cybercrime
-
హద్దు మీరితే లోపలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, అధికారులైనా సరే.. ఎలాంటి హోదా ఉండదు. ప్రొటోకాల్ వర్తించదు. నేరం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. పోలీస్స్టేషన్లకు వచ్చి డాబూ దర్పం ప్రదర్శిస్తూ హడావుడి చేసేవాళ్లను సక్కగా తీసుకుపోయి బొక్కలో వేయండి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతినిధులకు పోలీసులు మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో..పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతిధులు సహా ఎవరైనా పోలీసులతో మర్యాదగా ప్రవర్తించడం అంతే ముఖ్యం.పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేవారి పట్ల మర్యాదగా ఉండాల్సిన పనిలేదు. ఈ మేరకు ఈ వేదిక నుంచే పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల సిబ్బందికి.. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా నేను ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఆ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎంతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచేశారు. కానీ గత ఏడాదిగా పైరవీలకు తావులేకుండా సమర్థత ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లు లేనందున రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసుల చేతుల్లోనే ఉంది. ప్రజా ప్రభుత్వంలో 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ అనే ఏడో గ్యారంటీని అమలు చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో 6 నెలల్లోనే శిక్ష‘గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారితో పాటు సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్, సైబర్ క్రైం నియంత్రణ కోసం బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులను డేటా అనాలసిస్ కోసం వాడుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. అదేవిధంగా నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి‘క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖ సిబ్బంది దాన్ని ఉల్లంఘించడం సరికాదు. పోలీసులు ఆందో ళనలు చేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత జఠిలం అవుతుంది. పోలీస్ సిబ్బంది తమ సమ స్యలేవైనా ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. అధికా రుల వద్ద పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తేవాలి. అక్కడా పరిష్కారం కాక పోతే నేను స్వయంగా పోలీసుల సమస్యలు పరిష్క రించే బాధ్యత తీసుకుంటా..’అని సీఎం తెలిపారు. అందరి కోసం పోలీస్: డిప్యూటీ సీఎం ప్రజా ప్రభుత్వంలో కొంతమంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ నగరంతో పా టు రాష్ట్రాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కో సం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉందని, డయల్ 100కు సమాచారం అందిన పది నిమిషాల్లోనే బాధి తుల వద్దకు చేరుకుంటున్నామని చెప్పారు. ఆకట్టుకున్న విన్యాసాలు..అబ్బురపర్చిన జాగిలాలు విజయోత్సవాల్లో భాగంగా ఆక్టోపస్ సిబ్బంది ప్రద ర్శించిన విన్యాసాలు అలరించాయి. పోలీస్ బ్యాండ్ బృందాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ జాగిలాలు తమ ప్రదర్శనతో అబ్బురపరిచాయి. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మేయర్ విజ యలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఐపీఎస్ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మానవీయ కోణంలోనే ట్రాన్స్జెండర్లకు బాధ్యతలు‘సమాజంలో నిరాదరణకు గురైన ట్రాన్స్జెండర్లను మానవీయ కోణంలో ఆదుకునేందుకే వారికి తాత్కాలిక విధానంలో ట్రాఫిక్ అసి స్టెంట్లుగా విధులు అప్పగిస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించే ట్రాన్స్జెండర్లను నేను గతంలో చూశా. అందుకే వారికి ట్రాఫిక్ విధులు అప్పగించి, నెలకు గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 50 మంది ట్రాన్స్జెండర్లకు నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతాం. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు ట్రాన్స్జెండర్లకు ఇస్తాం. అన్ని విధాలా అండగా ఉంటాం. ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని ట్రాన్స్జెండర్లు క్రమశిక్షణతో మెల గాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు.హోంగార్డులకు రోజుకు రూ.వెయ్యి⇒ వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంపు⇒ వచ్చే జనవరి నుంచి అమలుహోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా వారికి సీఎం రేవంత్‌రెడ్డి వరాలు ప్రకటించారు. ‘పోలీసు లతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకు భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా మీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాం. రోజువారీ భత్యాన్ని రూ.921 నుంచి రూ.1,000కి పెంచుతున్నాం.అలాగే వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోంగార్డులు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం కానీ పొందితే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి మెరుగైన వైద్య సహాయాన్ని కూడా హోంగార్డులకు అందిస్తాం. ఈ నిర్ణయాలన్నీ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు !
సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి కోసం కొందరు చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మీరు ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ. వేల నుంచి లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చని సైబర్ ముఠాల కేటుగాళ్లు అమాయకులకు గాలం వేస్తున్నారు. వారు చెప్పే మాయమాటలు నమ్మి తమ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్‌ను) కమీషన్ల కోసం ఇస్తున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరంలో భాగస్తులవుతారు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ఖాతాలపై నిఘాకొన్ని బ్యాంకు ఖాతాల్లో అప్పటివరకు రూ.వందల్లో లావాదేవీలు జరిగి..ఒక్కసారిగా లక్షల రూపాయలు క్రెడిట్, డెబిట్ అవుతున్నాయంటే అది కచ్చితంగా అనుమా నాస్పద ఖాతాగానే గుర్తించాలి. సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఎక్కడా తమ వివరాలు బయటకు పొక్కకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధితుల సొమ్మును అప్పనంగా కొట్టేసేందుకు, అమాయకులైన ప్రజల బ్యాంకు ఖాతాలనే వాడుకుంటున్నారు. ఇదే తరహా కేసులపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోకస్ పెంచింది. ఎక్కువ ఆర్థిక మోసాల్లో ఆరితేరిన వారు తమ అవసరాలు తీర్చుకునేందుకు కొందరికి కమీషన్లు ఆశచూపి ఇలా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి సాంకేతికతతో ఈ తరహా బ్యాంకు ఖాతాలపై నిఘా పెడుతున్న టెక్నికల్ టీంలు, నిందితుల పూర్తి వివరాలను వెలుగులోకి తెస్తున్నాయి. రాజస్తాన్‌లో చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లోనూ 27 మంది నిందితుల అరెస్టులో సాంకేతికత విశ్లేషణ బృందాలు కీలకంగా పనిచేశాయి.విదేశాల్లో ఉంటూ ఇక్కడి ఏజెంట్లతో...సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్న ముఠాలపైనా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా కొనసాగుతోంది. గత నెలలోనూ ఇదే తరహాలో ఓ ముఠాను గుర్తించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట ఒకరి నుంచి రూ.5.27 కోట్లు కొల్లగొట్టిన కేసులో టీజీ సీఎస్బీ దర్యాప్తులో మ్యూల్ బ్యాంక్ ఖాతాల గుట్టు రట్టయ్యింది. అల్మాస్గూడ వినాయకహిల్స్కు చెందిన కందుకూరి రవీందర్‌రెడ్డి, అత్తాపూర్ నలందనగర్కు చెందిన బండ్లమూడి రవి సైబర్ నేరగాళ్లకు కమీషన్ల బేసిస్‌లో బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్ చేస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. నెలకు రూ.5వేల వరకు ఆశజూపి వనస్థలిపురానికి చెందిన రమణమురళికృష్ణ, కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్‌కు చెందిన మాధవరావులతో కలిసి మొత్తం14 కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించినట్టు వెల్లడైంది. ఒక్కో అకౌంట్‌కు రూ.25 వేల చొప్పున సైబర్ నేరగాళ్ల నుంచి కమీషన్ పొందుతున్న ఈ దళారులు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నట్టు తేలింది.అత్యాశకు పోయితమ బ్యాంకు వివరాలను కమీషన్ల కోసం ఇస్తున్న వారిలో ఎక్కువ మంది తెలిసే ఈ ‘మ్యూల్’దందాలోకి దిగుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. టీజీ సీఎస్బీ అధికారులు రాజస్తాన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో గుర్తించిన వారే ఇందుకు నిదర్శనంగా వారు పేర్కొంటున్నారు. పట్టుబడిన 27 మందిలో ప్రైవేట్ కాంట్రాక్టర్, జిమ్ ట్రైనర్, హోటల్ వ్యాపారి, వస్త్ర వ్యాపారి, డేటాఎంట్రీ వర్కర్, అగర్బత్తీల వ్యాపారి, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యవసాయం చేసేవారు సైతం ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ తరహాలో తెలంగాణలోనూ మ్యూల్ బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇస్తున్న వారు పెరుగుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాల్లో వాడిన బ్యాంకు ఖాతాలు ఎవరివి అయితే వారికి కూడా నేరంలో భాగం ఉంటుందన్నది మరవొద్దని వారు హెచ్చరిస్తున్నారు. -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
‘స్మార్ట్’గా దోపిడీ
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.ఆన్లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్‌లు, అల్గారిథమ్ మానిప్యులేషన్లు, అక్రమ రుణ యాప్‌లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్‌లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్లైన్ టాస్క్‌ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతిమే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్లైన్లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.ఇక డిజిటల్ అరెస్ట్‌ల (వీడియో కాల్స్ స్కామ్‌లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్‌లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్‌ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్‌కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్‌లోని మైవాడ్డీ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ⇒ సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది. ⇒గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒ అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒ ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్‌కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా.. 2019 26,049 2020 2,57,777 2021 4,52,414 2022 9,66,790 2023 15,56,218 2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే) -
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. -
నకిలీల మకిలి వదిలిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ). సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేసేందుకు వాడుతున్న నకిలీ వెబ్సైట్లు, యాప్‌లకు సంబంధించిన యూఆర్ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయిస్తున్నారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు వాడుతున్న ఫేక్ కస్టమర్ నంబర్లను కూడా బ్లాక్ చేయిస్తున్నారు. ఒకే నకిలీ వెబ్సైట్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌ను వినియోగించి సైబర్ కేటుగాళ్లు మరోమారు మోసగించేందుకు అవ కాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేíÙస్తున్న టీఎస్‌సీఎస్‌బీ అధికారులు అందులోని అనుమానాస్పద వెబ్సైట్లు, యాప్‌లపై ఫోకస్ పెడుతున్నారు.శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తూ ఆయా సంబంధిత మాతృ కంపెనీలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అనుమానాస్పద యూఆర్ఎల్లను డౌన్ (డిలీట్) చేయిస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తు, విశ్లేషణ కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరో అందుబాటులోకి వచ్చిన తర్వాత నకిలీ వెబ్సైట్లు, యాప్‌ల మకిలి వదిలించే పని ముమ్మరంగా కొనసాగుతోందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా సిబ్బంది... సైబర్ మోసాలకు సంబంధించి పౌరుల నుంచి 1930 కాల్ సెంటర్‌కు లేదా సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్‌కు అందే ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ప్రధానంగా రెండు రకాల విధులను టీఎస్‌సీఎస్‌బీ నిర్వర్తిస్తోంది. బాధితులు పొగొట్టుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టకుండా బ్యాంకులకు వెంటనే సమాచారం ఇచ్చి ఆ సొమ్మును ఫ్రీజ్ చేయించడంతోపాటు కేసు దర్యాప్తు కొనసాగించడం ఒక ప్రధాన విధి. మరోవైపు సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు వినియోగించిన యాప్ లేదా వెబ్సైట్ వివరాల నుంచి అవి నిజమైనవా నకిలీవా కనిపెట్టి ఆ అనుమానాస్పద యూఆర్ఎల్ను డౌన్ చేయించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు సేకరించడం. ఇందుకోసం టీఎస్సీఎస్బీలో ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతోపాటు సెక్స్టార్షన్, సైబర్ బుల్లియింగ్‌కు గురైన బాధితుల ఫిర్యాదుల నుంచి సేకరించిన వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.టీఎస్సీఎస్బీలోని ప్రత్యేక సిబ్బంది ఓపెన్ సోర్స్ టూల్స్‌ను, ఇతర సాంకేతికతను వినియోగించి సదరు యూఆర్ఎల్ నకిలీదని గుర్తిస్తారు. ఆ తర్వాత ఆ ఫేక్ వెబ్‌సైట్‌గా గుర్తించిన యూఆర్ఎల్ యాక్టివ్‌గా ఉందా.. లేదా అన్నది విశ్లేíÙస్తారు. ఆ తర్వాత సదరు నకిలీ వెబ్సైట్ ఏ పేరుతో ఉంది..దాన్ని హోస్ట్ చేస్తున్న వర్చువల్ సర్వర్ ఐపీ అడ్రస్ గుర్తిస్తారు. హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరైతే వారికి టీఎస్‌సీఎస్‌బీ నుంచి అధికారికంగా లేఖ రాస్తారు. అదేవిధంగా ఆధారాలు పంపి..దాన్ని డౌన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా 2023లో జూన్ నుంచి డిసెంబర్ వరకు 1,457 ఫేక్ యూఆర్ఎల్లను డౌన్ చేయించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 817 యూఆర్ఎల్స్ను డౌన్ చేయించారు. ఇది నిరంతరం కొనసాగుతోందని, దీనివల్ల సైబర్ నేరగాళ్లు మళ్లీమళ్లీ మోసాలకు పాల్పడకుండా కట్టడి చేసేందుకు వీలుపడుతుందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు. -
క్లోన్డ్ వేలి ముద్రలతో దందా
సాక్షి, హైదరాబాద్: భూ దస్తావేజుల నుంచి లభించిన వివరాల ఆధారంగా క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)ను దుర్వినియోగం చేసి బ్యాంకు ఖాతాల నుంచి రూ.10 లక్షల మేర టోకరా వేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు లు రట్టు చేశారు. తొమ్మిది మంది నిందితులున్న ఈ గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపారు. డీసీపీ డి.కవిత, ఏసీపీ ఆర్జీ శివమారుతీలతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జైలు నుంచి వచ్చి.. స్నేహితులకు చెప్పి ఏపీలోని ప్రకాశం జిల్లా కంబంకు చెందిన ఎం. యువరాజు గతంలో వేలిముద్రల్ని క్లోన్ చేసి, వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో బ్యాంకు ఖాతాల్లోని నగదు కాజేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ఈ స్కామ్ ఎలా చేయాలో తన స్నేహితుడైన కంబం వాసి రఫీకి చెప్పాడు. ఇతడు అసా ధారణ్, ఉదయ్‌కిరణ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఓ రూమ్‌లో ఉంటున్నాడు. వీరంతా కలిసి ఆ దందా చేద్దామని నిర్ణయించుకున్నారు. క్లోన్డ్ వేలిముద్రలు చేయడానికి అవసరమైన నమూనాలు, ఆధార్ నంబర్లు యువరాజే ఇచ్చాడు. కంబం వాసి నరేంద్రకు అక్కడ మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో స్నేహం ఉంది. తరచూ ఆ సేవా కేంద్రంలో కూర్చునే ఇతగాడు అక్కడి కంప్యూటర్లో ఉన్న దాదాపు 2,500 భూ రిజిస్ట్రేషన్ పత్రాల సాఫ్ట్‌కాపీలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకుని యువరాజు, రఫీకి ఇచ్చాడు. అసాధారణ్ త్రయం క్లోన్డ్ వేలిముద్రలు తయారీకి అవసరమైన మిషన్, ఇతర సామగ్రిని ఆన్లైన్లో ఖరీదు చేసింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీతోపాటు వేలిముద్రల్నీ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. వీరు తమ వద్ద ఉన్న 2,500 దస్తావేజుల సాఫ్ట్‌కాపీల నుంచి ఆధార్ నంబర్లు, వేలిముద్రల్ని సంగ్రహించి క్లోన్డ్ వేలి ముద్రలు తయారు చేశారు. ఏఈపీఎస్ విధానంలో డబ్బు డ్రా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి మర్చంట్ ఐడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అనుసంధానించి ఉన్న బ్యాంకు ఖాతాదారుడు పరిమిత మొత్తాలు ఈ మర్చంట్స్ వద్దే డ్రా చేసుకుంటారు. ఇలా డ్రా చేయడానికి బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ తదితరాలు అవసరం లేదు. నిరుద్యోగికి ఎర వేసి మర్చంట్ ఐడీ వీరికి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి న కె.శ్రీను తారసపడ్డాడు. శ్రీను ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మర్చంట్ ఐడీ తీసుకునేలా అసాధారణ్ ప్రేరేపించాడు. శ్రీను తన పేరుపై ఐడీ, బయోమెట్రిక్ మిషన్ తీసుకుని అసాధారణ్‌కు ఇచ్చాడు. ఫినో పేమెంట్స్ వెబ్సైట్లో మర్చంట్ ఐడీని నమోదు చేసి, ఉపకరణం ద్వారా శ్రీను వేలిముద్రను తనిఖీ చేసి ఏఈపీఎస్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఖాతాదారు ఆధార్ నంబర్‌ను పొందుపరిచి, వేలిముద్ర రీడింగ్ చేస్తే నిర్ణీత మొత్తం అతడి ఖాతా నుంచి మర్చంట్ ఖాతాలోకి వస్తుంది. మర్చంట్ తన వద్ద ఉన్న మొత్తం నుంచి ఖాతాదారుడికి తక్షణం చెల్లించేస్తాడు. ఫినో పేమెంట్స్ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసాధారణ్ త్రయం తమ వద్ద ఉన్న ఆధార్ నంబర్లు, క్లోన్డ్ వేలిముద్రలు వినియోగించి రూ.10 లక్షల్ని మర్చంట్ ఖాతాలుగా యాడ్ చేసిన తరుణ్, శివకృష్ణలకు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. ఆపై ఏటీఎం కార్డులు వినియోగించి ఆ మొత్తాలు డ్రా చేసుకుని అంతా పంచుకుంటున్నారు. సహకరించిన ఎథికల్ హ్యాకర్ అసాధారణ్ త్రయానికి ఓ దశలో సాంకేతిక సమస్యలు రావడంతో తమ స్నేహితుడైన ఎథికల్ çహ్యాకర్ మహ్మద్ ఇయాజ్ సాయం తీసుకుంది. ఆ సమస్యను పరిష్కరించి వీరికి సహకరించిన హ్యాకర్ ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు డ్రా చేసుకుని వచ్చాడు. తాము శ్రీనుకు జారీ చేసిన మర్చంట్ ఐడీ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నట్లు బ్యాంకుల నుంచి ఫినో పేమెంట్స్ సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సంస్థ సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. ఇన్స్పెక్టర్ ఎస్.సీతారాములు నేతృత్వంలో ఎస్సై వై.యాదగిరితో కూడిన బృందం దర్యాప్తు చేసింది. రఫీ, యువరాజు, తరుణ్ మినహా మిగిలిన ఆరుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉపకరణాలు స్వా«దీనం చేసుకుంది. -
80 శాతం సైబర్ నేరాలు 10 జిల్లాల నుంచే..
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్‌లోని భరత్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, జార్ఖండ్‌లోని జామ్తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది. ప్రధానంగా భరత్పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్‌సీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు. -
కేటుగాళ్లతో ఖాకీల సెటిల్మెంట్లు
హైదరాబాద్: .. అదేంటి? కొట్టేసిన సొమ్మును సైబర్ నేరస్తులు తిరిగి రీ ఫండ్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు!! ‘రీ ఫండ్’ తెర వెనక అసలేం జరిగిందంటే.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాంకేతిక ఆధారాలతో సైబర్ నేరస్తుల ఏ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో గుర్తించారు. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి 2–3 రోజులు గాలించి నేరస్తుడిని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి కొట్టేసిన సొమ్మును రీ ఫండ్ చేస్తే వదిలేస్తామని నిందితుడితో సెటిల్మెంట్ చేశారు. దీంతో కేటుగాడు బాధితురాలి ఖాతాకు నగదును బదిలీ చేశాడు. అరెస్టు, కేసులు లేకుండా చేసినందుకు నిందితుడి నుంచి సదరు పోలీసులు డబ్బు వసూలు చేశారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందనే కోణంలో లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చి, కేసును విత్‌డ్రా చేయించారు. ‘లెక్క’ చెప్తేనే దర్యాప్తు.. సాధారణంగా కేసు నమోదు, రిమాండ్ రిపోర్టు, చార్జ్‌షీట్ దాఖలు వంటి అధికారం సివిల్ పోలీసులకు ఉంటుంది. కానీ, రాచకొండ సైబర్ క్రైమ్‌లో మాత్రం ఇతర విభాగానికి చెందిన పోలీసులదే హవా. ఏ కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలనే నిర్ణయం కూడా వీళ్లదే అంటే అతిశయోక్తి కాదు. ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న సైబర్ నేరస్తులను పట్టుకొచ్చేందుకూ సివిల్ పోలీసులు కాకుండా వీరే వెళ్లడం, సెటిల్మెంట్లు చేయడం పరిపాటిగా మారింది. మోసపోయామని ఠాణా మెట్లు ఎక్కే బాధితులతోనూ ‘లెక్క’ మాట్లాడుకున్న తర్వాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని, లేకపోతే నిందితులు దొరకడం లేదని 2–3 నెలల తర్వాత కేసులను క్లోజ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఒక్కచోటే తిష్ట.. సాధారణంగా పోలీసు విభాగంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. అయితే సైబర్ క్రైమ్‌లో మాత్రం ఐదేళ్లకు మించి కానిస్టేబుళ్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఐదుగురు కానిస్టేబుళ్లను ఇటీవల వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు అయితే కనీసం రిలీవ్ ఆర్డర్ కూడా చేతికి అందకముందే ‘పెద్దల’ అండదండలతో మళ్లీ అక్కడే పోస్టింగ్ తెచ్చుకోవటం వీరికే చెల్లింది. ‘కొన్ని నెలల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగిని సైబర్ నేరస్తుల వలలో చిక్కి... రూ.లక్షల్లో మోసపోయింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా సదరు బాధితురాలు ఠాణాకు వచ్చి తాను మోసపోయిన సొమ్ము తిరిగి ఖాతాలో జమైందని, కేసు ఉపసంహరించుకుంటానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే దగ్గరుండి మరీ లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చారు.’ ఏఆర్ టీంను రిటర్న్ చేయాలని నిర్ణయించాం – అనురాధ, డీసీపీ, రాచకొండ సైబర్ క్రైమ్ ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్‌లో నాతో సహా ఇద్దరు ఏసీపీలు కూడా కొత్తగా వచ్చారు. వారు సైబర్ క్రైమ్‌ల దర్యాప్తు, ఇతరత్రా అంశాలపై సాంకేతికంగా పట్టు సాధించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఏఆర్ టీంను వెనక్కి పంపించాలని నిర్ణయించాం. కొన్ని సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితురాలికి తెలియకుండా వారి కుటుంబ సభ్యులే సైబర్ మోసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఇలాంటి కేసులలో బాధితుల విజ్ఞప్తి మేరకు విత్‌డ్రా చేస్తున్నాం. -
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
మూడున్నరేళ్లు..రూ. 258 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్: రోజుకు రూ.20 లక్షలు.. వారానికి రూ.1.41 కోట్లు.. నెలకు రూ.6.06 కోట్లు... ఏడాదికి రూ.73.7 కోట్లు.. నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన మొత్తం సరాసరీ ఇది. 2020 జనవరి 1–2023 జూన్ 30 మధ్య నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.258 కోట్లు స్వాహా చేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసులు వెల్లడిస్తున్న గణాంకాలివి. పరువు, మర్యాద, సమయం లేకపోవడం... ఇలా అనేక కారణాల వల్ల పోలీసుల వరకు రాని కేసుల్లో నçష్టపోయింది దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దర్యాప్తు అత్యంత జటిలం.. చాలా మందిలో అత్యాశ, తేలిగ్గా వచ్చే డబ్బుపై మక్కువే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల దర్యాప్తు, నేరగాళ్లను పట్టుకోవడం, అభియోగపత్రాల దాఖలు అంత కష్టం. కోవిడ్ కాలంలో ఉత్తరాదికి చెందిన వారిలో అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. వీరిలో అత్యధికులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, పార్ట్ టైం ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, గిఫ్ట్‌లు, లాటరీ, కేబీసీ, ఓటీపీ, మాట్రిమోనియల్, ఆన్లైన్ సూడో పోలీసు, కేవైసీ అప్డేట్, కరెంట్ బిల్లులు చెల్లింపు, వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ ఫ్రాడ్స్, పార్ట్‌టైహ్ జాబ్స్.. ఇలా వివిధ పంథాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ లింకులు క్లిక్ చేస్తే ముప్పే.. రాజస్థాన్, బిహార్, యూపీ, ఢిల్లీ, ఝార్ఖండ్ సహా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల ప్రమేయం లేకుండానే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేసి ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారు. వీరికి నమ్మకం కలిగించేందుకు నలుగురైదుగురితో తాము ఇప్పుడే రూ.లక్షల లాభాలు ఆర్జించామని, ఆ మొత్తం డ్రా చేసినట్లు చాటింగ్ చేయిస్తున్నారు. ఇలా తమ వలలో పడిన వారికి ప్రత్యేక లింకులు పంపుతూ ఉచ్చులోకి దింపుతున్నారు. కొన్ని రకాల ప్రత్యేక లింకుల ద్వారా మాల్వేర్స్ పంపిస్తున్నారు. ఇలా వీరి సెల్‌ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు తమ అదీనంలోకి తీసుకుంటున్నారు. ఆపై నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ తస్కరించి అందినకాడికి దండుకుంటున్నారు. పట్టుకోవడం కష్టం.. రికవరీ అసాధ్యం.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సహా ఏ ఒక్కటీ తమ పేరుపై లేకుండా కథ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం, కాలయాపనతో కూడింది అవుతోంది. ఈలోపు వారి చేతుల్లోకి వెళ్లిన డబ్బు మరో చోటకు చేరడమో, ఖర్చు కావడమో జరిగిపోతోంది. ఫలితంగా నిందితులు దొరికినా రికవరీలు మాత్రం అసాధ్యమవుతున్నాయి. ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ సమయం పడుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు తదితరాలను విశ్లేíÙంచి, రిపోర్టు ఇవ్వడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద కాలయాపన జరుగుతోంది. ఫలితంగా అభియోగపత్రాల దాఖలు కు చాలా సమయం పడుతోంది. -
రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మేడ్ ఇన్ చైనా!
సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్‌లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. టాస్క్‌లకు రూపమిచ్చేది చైనాలో.. ఈ ఫ్రాడ్‌లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్‌లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్‌లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్‌లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్‌లు రూపొందిస్తున్నారు. చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి... ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను బాధితులు డౌన్లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు. రెండు యాప్‌ల ద్వారా దుబాయ్ నుంచి.. చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్‌లో ఉంటున్నారు. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్‌లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది. లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్‌లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్‌కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్‌లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్‌టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్‌లోని వాళ్లు చూడగలుగుతున్నారు. క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు... బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్‌లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్‌కు రూ.10 కమీషన్‌గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్‌లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్‌ను దుబాయ్‌లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్‌లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు. -
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్ క్రైమ్ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్‌క్రైమ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం టీ–హబ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా.. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు, వీ హబ్ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా
సాక్షి, హైదరాబాద్: టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో చిక్కుకున్న ఓ మహిళ దాదాపు రూ.10 లక్షలు నష్టపోయింది. ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఉత్తరాదికి చెందిన నలుగురి ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వారిని పట్టుకోగా.. వాళ్లంతా నిందితులుగా మారిన బాధితులని వెల్లడైంది. ప్రత్యేక ప్రోగ్రామింగ్‌తో వ్యవహారం... వివిధ రకాలైన సోషల్ మీడియా లింకుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎర వేస్తున్న నేరగాళ్లు తమ మోసాల కోసం ఆయా యాప్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు బాధితులు పెట్టిన పెట్టుబడికి 50 నుంచి 80 శాతం లాభాలు రావడంతో పాటు ఆ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ తర్వాత నుంచి లాభం వచ్చినట్లు యాప్‌లో కనిపించినా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతిసారీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుతూ పోవాల్సిందే. ఇన్వెస్ట్ చేయగానే నిర్ణీత కాలంలో ఆ మొత్తం రెట్టింపు అయినట్లు యాప్‌లో కనిపిస్తుందే తప్ప తీసుకునే అవకాశం ఉండదు. హఠాత్తుగా కనిపించకుండా పోతూ... ఇలా బాధితుడి నుంచి కొంత మొత్తం వచ్చిన తర్వాత యాప్‌లో పెట్టుబడి ఆగిపోతుంది. ఆపై హఠాత్తుగా ఆ యాప్‌లోని బాధితుడి ఖాతా ఇక ఓపెన్ కాకుండా అదృశ్యమైపోతుంది. రోజూ రూ.లక్షలు కాజేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. బాధితులను సంప్రదించి ఖాతాలుకావాలంటూ.. పావులుగా మార్చి ఈ మోసగాళ్లు తమ వలలో పడి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోయిన వారినే పావులుగా చేసుకుంటున్నారు. బాధితులతో సంప్రదింపులు జరుపుతూ పోగొట్టుకున్న డబ్బు వెనక్కురావాలంటే తమకు కొన్ని బ్యాంకు ఖాతాలు కావాలంటూ కోరుతున్నారు. ఒక్కోఖాతాను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. పోగొట్టుకున్న సొమ్ముల్లో ఎంతో కొంత వస్తుందని ఆశ పడిన బాధితులు ఇందుకు అంగీకరించి తమ కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల పేర్ల మీదా ఖాతాలు తెరుస్తున్నారు. అక్కడ నుంచే వీటిని ఆపరేట్ చేస్తూ.. ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌లను వాట్సాప్ ద్వారా బాధితులు సూత్రధారులకు పంపిస్తున్నారు. ఆపై వాళ్లు చెప్పే చిరునామాలకు లింకై ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించిన సిమ్‌కార్డులను కొరియర్ చేస్తున్నారు. వీటిని దగ్గర ఉంచుకుంటున్న సూత్రధారులు ఇక్కడ టార్గెట్ చేసిన వారితో నగదు ఈ ఖాతాల్లోనే వేయించుకుంటున్నారు. కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు చేపట్టినా బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నాటి బాధితుల వద్దకే వెళ్లి ఆగిపోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయని చెప్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్టిమెంట్స్ వద్దని స్పష్టం చేస్తున్నారు. -
Hyderabad: మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుకుకి ఇస్తారా?
హైదరాబాద్: కుమార్తెల పెళ్లిళ్ల కోసం వెబ్సైట్లో పోస్టు పెట్టిన ఓ వృద్ధ తండ్రిని సైబర్ నేరగాళ్లు మోసగించాడు. వివరాల్లోకి వెళ్తే..నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి వివాహం చేసేందుకు ఇటీవల వారి సామాజికవర్గానికి చెందిన ఓ వెబ్సైట్లో ఇద్దరి అమ్మాయిల వివరాలను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి పెద్ద కుమార్తె నచ్చిందని మాట కలిపాడు. మరుసటి రోజు మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుకుకి ఇస్తారా? ఒకటే చోట ఇద్దరూ కలసి ఉంటారంటూ నమ్మించారు. ఎట్టకేలకు ఒకటేసారి ఒకే కుటుంబానికి చెందిన వారి పెళ్లి సంబంధం రావడంతో ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. వారం రోజుల పాటు ఇరువైపులా కేవలం ఫోన్ల ద్వారానే మాటలు సాగాయి. ముందుగా సంప్రదించిన వ్యక్తి తన కుమారుడు అర్జెంటుగా యూఎస్‌కు వెళ్లాలి, త్వరగా పెళ్లి చేద్దామనే ప్రపోజల్ పెట్టాడు. ఇద్దరి అమ్మాయిలకు సంబంధించి ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని డబ్బు కావాలని కోరాడు. అతగాడి మాటలు నమ్మిన ఆ తండ్రి పలు దఫాలుగా రూ.26 లక్షలు ముట్టచెప్పారు. అడిగినంత ఇస్తూనే ఉన్నాడు కానీ..పెళ్లి చూపులకు ఇంటికి మాత్రం రావడం లేదు. వారి సామాజిక వర్గానికి చెందిన వెబ్సైట్లో ఎంకై ్వరీ చేయగా..మీరు చెప్పిన వివరాలతో మా వెబ్సైట్లో ఎవరూ లేరనే విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. తన ఇద్దరి కుమార్తెల భవిష్యత్‌ను కాపాడాలని, దోచుకున్న డబ్బును ఇప్పించాలంటూ ఆ వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. -
రెండేళ్లు.. బాధితులు 6 వేలు
హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్ఫోన్లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు. ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. రెండేళ్లు..6వేల మంది బాధితులు నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్‌లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్‌కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. -
మంగళగిరిలో ‘ఐపీజీ’ బాధితులు 700 మందికిపైనే!
మంగళగిరి: సైబర్ మోసగాళ్ల ఐపీజీ రెంట్ యాప్ ఉచ్చులో మంగళగిరికి చెందిన 700 మందికిపైగా చిక్కి విలవిల్లాడుతున్నారు. పెట్టుబడికి వారం రోజుల్లో రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపడంతో వీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు రెండురోజుల కిందట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు తిరిగి ఇచ్చిన యాప్ నిర్వాహకులు తరువాత క్రమంగా చెల్లింపులు నిలిపేశారు. నిదానంగా ముఖం చాటేసిన నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా యాప్‌లోను సమాధానం చెప్పకపోవడం, ఐపీజీ రెంట్ కామ్ యాప్‌ను సైతం మూసేయడంతో పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తొలుత కిషోర్‌కు అతడి స్నేహతుడు ఐపీజీ యాప్ లింక్ పంపారు. తన స్నేహితులు చాలామంది ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారని, మంచి ఆదాయం వస్తుందని అతడు చెప్పడంతో కిషోర్ ఆ యాప్‌లో నమోదు చేసుకున్నారు. మొదట రూ.800 పెట్టుబడి పెట్టగా వారానికి రూ.1,600 ఆదాయం వచ్చింది. రెండుమూడుసార్లు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో కిషోర్ తన స్నేహితులకు యాప్ లింక్ పంపి రెట్టింపు ఆదాయం గురించి చెప్పారు. కిషోర్ స్నేహితులు, బంధువులతోపాటు చైన్‌లింక్‌గా మారి ఒక్క మంగళగిరిలోనే 700 మందికిపైగా ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. రూ.800, రూ.1,200 నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు.. ఇలా శక్తిమేర పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలాఖరు కావడంతో యాప్ ఆఫర్ ప్రకటించిందని చెప్పి రూ.30 వేలు పెట్టుబడి పెట్టినవారికి అదనంగా ఆదాయంతోపాటు వారం రోజులకు వడ్డీ రూ.27 వేలు కలిపి రూ.80 వేలు వస్తాయని ఆశచూపారు. దీంతో పలువురు ఎక్కువ సొమ్ము యాప్‌లో పెట్టుబడి పెట్టారు. బాధితుల్లో అత్యధికంగా మహిళలున్నారు. వారం రోజుల తర్వాత మోసగాళ్లు యాప్‌ను మూసేయడంతో కిషోర్ ఆన్లైన్లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులతో కలిసి ఈ నెల 7వ తేదీన పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తమకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ బి.అంకమ్మరావు చెప్పారు. సైబర్ క్రైమ్ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్‌కు అప్పగించామని తెలిపారు. -
లోన్‌యాప్‌లు డౌన్లోడ్ చేయొద్దు.. కీలక సూచనలు.. మరిచారో అంతే!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న లోన్‌యాప్‌ల మాయాజాలంలో చిక్కుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్‌యాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ పలు సూచనలు చేసింది. లోన్‌యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఇవి మరవొద్దు ♦ లోన్‌యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న యాప్స్, కాంటాక్ట్ నంబర్లు, లొకేషన్, ఫొటోలు, మీ వ్యక్తిగత విషయాలన్నీ మీకు లోన్ ఇచ్చేవాళ్లకు వెళతాయని గుర్తించాలి. మీరు తీసుకున్న లోన్ తీర్చకపోతే తీవ్రంగా వేధిస్తారు. ♦ ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు యాక్సెస్ ఉండడంతో లోన్‌యాప్ ఏజెంట్లు మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ♦ లోన్‌యాప్‌ల నుంచి వేధింపులు శ్రుతి మించితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు www. cybercrime.gov.in వెబ్సైట్లో లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
నకిలీ కాల్ సెంటర్‌తో ఖాతాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా, కెనడా దేశవాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. పేట్బషీరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, నేరాలు చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. ఈమేరకు మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్‌లతో కలిసి మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ బుధవారం మీడియాకు వెల్లడించారు. లండన్‌లో పెడితే దొరికిపోతామని... హనుమకొండలోని కిషన్‌పురకు చెందిన బైరిక్ ప్రమోద్ రెడ్డి లండన్‌లో ఏ1 ఎక్స్‌ప్రెస్ సూపర్ మార్కెట్ నిర్వహించేవాడు. వ్యాపారం పెద్దగా సాగకపోవటం, అప్పులు మీద పడటంతో అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. లండన్‌లో ఉంటున్న స్నేహితులు వరంగల్‌కు చెందిన కుంచాల అజయ్ కుమార్, రామకృష్ణా రెడ్డి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రబీష్ కుమార్ ప్రసాద్ అలియాస్ రాహుల్, సర్బేష్ కుమార్ గుప్తా అలియాస్ ఆమెన్లకు విదేశీయులను మోసం చేసే పథకం గురించి చెప్పాడు. అయితే లండన్‌లో నకిలీ కాల్ సెంటర్ పెట్టి మోసాలు చేస్తే సులువుగా పట్టుబడతామని గ్రహించిన ముఠా.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించింది. ‘ఎనీ డెస్క్’ద్వారా కూడా.. నెల రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీఎస్ఎస్ అపార్ట్మెంట్లో ఈ ముఠా సభ్యులు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సాంకేతిక సేవలు అందిస్తామనే నెపంతో ఆస్ట్రేలియా, కెనడా దేశస్తులను టార్గెట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు చెందిన పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి కొనుగోలు చేశారు. టెలికాలర్లుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముకేష్ రజాక్ అలియాస్ మార్క్, కర్మా షీపాల్ అలియాస్ జాక్, ఎండీ ముస్తఫా అలియాస్ డానియల్, అన్మోల్ ప్రదాన్ అలియాస్ స్టీఫెన్, రాయ్ రిష్కాంత్ అలియాస్ ర్యాన్, ఐడీపీఎల్ బాలానగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ సామ్ మహ్మద్ హాజీ, బొల్లారంకు చెందిన గుంజి పవన్ కుమార్ అలియాస్ కెవిన్, నిర్మల్‌కు చెందిన సాయి వీర ప్రసాద్ అలియాస్ జేమ్స్, జీడిమెట్లకు చెందిన నయాకోటి బస్వరాజులను నియమించుకున్నాడు. వీరు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా విదేశీయులకు ఫోన్ చేసేవారు. మీరు వినియోగించే అమెజాన్ ప్రైమ్ యాప్ నకిలీదని, హ్యాక్ అయిందని, భద్రతా లోపాలున్నాయని చెప్పి నమ్మించేవారు. సాంకేతిక సేవలను అందించేందుకు కొంత రుసుము చెల్లించాలని చెప్పి మొబైల్‌కు లింక్‌లు పంపించి బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేవారు. గిఫ్ట్ కార్డుల రూపంలో ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాలకు సొమ్మును బదిలీ చేయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో బాధితుల సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి ఖాతా ఖాళీ చేసేవారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామకృష్ణా రెడ్డి, ఆకాశ్, వెస్లీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్లు, సీపీయూలు, హెడ్ సెట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు, సిమ్ కార్డులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది. కమిషన్‌కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. ఇక టెక్నికల్ టీమ్ వంతు.. టీఎస్పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ పని చేస్తుంటుంది. నెట్వర్క్ అడ్మిన్‌గా ఉండి, లీకేజ్ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్ ఈ టీమ్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్ టీమ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు గ్రూప్ –1 ప్రిలిమ్స్ పేపర్ లీక్‌లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్ఫోన్లు, వాట్సాప్ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్–1లో 10 మంది ఉద్యోగులు పాస్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన కమిషన్ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ జాబితాను టీఎస్పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న కమిషన్ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్.. శంకరలక్ష్మి కంప్యూటర్లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు. ఈ విధంగా లీకేజ్ వ్యవహారంలో సైబర్ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు. -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్‌లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ