వ్యాపార సంస్థలపై సైబర్ నేరగాళ్ల పంజా
హ్యాకింగ్ ద్వారావ్యాపారుల సర్వర్లలోకి చొరబాటు
డేటా చౌర్యంతో పాటు ర్యాన్సమ్ వేర్‌ఎటాక్స్ సైతం
రక్షణపై కీలక సూచనలు చేసినహైదరాబాద్ పోలీసులు
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు..వ్యాపారవేత్తలు, సంస్థలను కూడా తరచూ టార్గెట్ చేస్తున్నారు. వారి సర్వర్లలోకి చొరబడి విలువైన డేటాను తస్కరించడంతోపాటు ర్యాన్సమ్‌వేర్ ఎటాక్స్‌తో అందినకాడికి దోచుకుంటున్నారు.
బిజినెస్ ఈ–మెయిల్స్‌ను కాంప్రమైజ్ (బీఈసీ) చేయడం ద్వారా ఈ నేరాలకు బీజం పడుతోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులుచెబుతున్నారు. ఈ నేరాలను ఎలా కనిపెట్టాలనే అంశంపై కీలకసూచనలు చేస్తూ మంగళవారం బుక్‌లెట్‌ను విడుదల చేశారు. - సాక్షి, హైదరాబాద్
1. ఇటీవల పలువురికి సైబర్ నేరగాళ్ల నుంచి ఐవీఆర్‌ఎస్ కాల్స్ వస్తున్నాయి. ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నట్లు
చెప్తున్న సైబర్ నేరగాళ్లు.. అసాంఘికకార్యకలాపాల్లో మీ పేరుతో ఉన్ననంబర్ల వినియోగం జరిగిందని? కొన్నిగంటల్లోనే అన్ని నంబర్లు బ్లాక్ చేస్తున్నామని చెప్తున్నారు.
ఆయా సెల్‌ఫోన్ నంబర్లు,హ్యాండ్ సెట్‌లకు సంబంధించినఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నంబర్లను పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీల సూచనలతో బ్లాక్ చేస్తుంటారు. ఈ పని ట్రాయ్ చేయదు.. ఆయా సర్వీస్ ప్రొవైడర్లు చేస్తుంటారు.
2 కస్టమ్స్, కొరియర్ సంస్థల పేరుతోనూ ఫోన్లు వస్తున్నాయి. మీ పేరుతో వస్తున్న పార్శిల్‌లోనిషేధిత వస్తువులు, డ్రగ్స్ ఉన్నాయని.. వెంటనే నిర్ణీతమొత్తం చెల్లించకుంటే కేసుఅవుతుందని బెదిరిస్తున్నారు.
మీరు ఏ వస్తువునూ ఎక్కడకీపంపనప్పుడు భయపడాల్సిన పని లేదు. నిషేధిత వస్తువులు, డ్రగ్స్‌తో ముడిపడి ఉన్న కేసుల్లో జరిమానా చెల్లిస్తే బయటపడటం జరగదు. కస్టమ్స్ సహా ఏ ఏజెన్సీ కూడా ఇలా ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయదు.
3 మీ బంధువులు మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నారని, వారిని అరెస్టు చేస్తున్నామని ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీడియో కాల్ చేసి, ఆ మొత్తం చెల్లించే వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్తుంటారు.
దేశంలోని ఏ పోలీసు, ఏజెన్సీ డిజిటల్ అరెస్టు చేయదు. ఇప్పటివరకు అమలులోకి వచ్చిన, అమలులో ఉన్న ఏ చట్టంలోనూ దీని ప్రస్తావన లేదు. ఇలాంటి కాల్స్ వస్తే నమ్మొద్దు.
4బ్యాంకు అధికారులు, ఏజెంట్లుగా చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కేవైసీ అప్‌డేట్, రివార్డ్ పాయింట్స్ రీడీమ్ అంటూ వ్యక్తిగత వివరాలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తుంటారు.బ్యాంకులు, ఆర్థికసంస్థలు ఫోన్లు చేసి కేవైసీలు అడగవు. వ్యక్తిగతంగాసంబంధిత శాఖకు వచ్చి ఇవ్వమని చెప్తారు.
బీఈసీ సంకేతాలు ఏంటి?
» కొత్త ఈ–మెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ రావడం.
» బిజినెస్ ఈ–మెయిల్స్ పాస్‌వర్డ్స్ వ్యాపారులు,
» ఆయా సంస్థల ప్రమేయం లేకుండా మారిపోవడం.
» అనుమానిత సమయాలు, అనుమానాస్పద ప్రాంతాల నుంచి బిజినెస్ ఈ–మెయిల్స్‌లోకి లాగిన్ కావడానికి ప్రయత్నాలు జరగడం.
» గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీ డేటాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం.
ఈ–మెయిల్స్ కాంప్రమైజ్ అయినట్లు గుర్తించడం ఎలా?
సాధారణంగా బీఈసీ కోసం వాడే వైరస్‌తో ఈ–మెయిల్స్‌ను నేరగాళ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున(ఆడ్ అవర్స్) పంపిస్తూ ఉంటారు. ఆయా వేళల్లో అసాధారణ ఈ–మెయిల్ ఐడీలనుంచి మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే.
ఒకేసారి కొత్త ఈ–మెయిల్ ఐడీలకు భారీగా డేటా బదిలీ కావడం, సున్నిత అంశాలతో కూడిన ఫైల్స్ వేళకాని వేళల్లో అధికారిక మెయిల్ ద్వారా బయటకు వెళితే అనుమానించాలి.
పరిశీలించాల్సిన అంశాలు ఏంటి?
» ఒకేసారి హఠాత్తుగా పెద్ద సంఖ్యలో ఈ–మెయిల్స్ వస్తుంటే బీఈసీని అనుమానించాల్సిందే. ఆ ఈ–మెయిల్స్‌లోని ప్రతి అక్షరాన్నీ నిశితంగా పరిశీలించాలి.
» ‘వైర్ ట్రాన్స్‌ఫర్’, ’అర్జంట్ పేమెంట్’, ‘బ్యాంక్ అకౌంట్ చేంజ్డ్’తదితర పదాలతో వచ్చే ఈ–మెయిల్స్ విషయంలో మరింతఅప్రమత్తంగా ఉండాలి. వ్యాపారుల ఖాతాలకు బదులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు పంపే సైబర్ నేరగాళ్లు చేసేఈ నేరాలను అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్ అంటారు.
కంప్యూటర్లలో బీఈసీ జరిగితే ఏం చేయాలి?
» మాల్‌వేర్, వైరస్‌తో కూడిన ఈ–మెయిల్ ద్వారా బీఈసీ అయిన కంప్యూటర్‌ను ఇంటర్నల్ ల్యాన్ లేదా వీపీఎన్ నుంచి డిస్‌కనెక్ట్ చేయాలి.
» అనుమానాస్పద ఐడీ అడ్రస్‌లు, ఈ–మెయిల్ ఐడీలను తక్షణం బ్లాక్ చేయాలి. కాంప్రమైజ్ అయినట్లు అనుమానిస్తున్న ఈ–మెయిల్ ఖాతాలను డిజేబుల్ చేయాలి. యాక్సెస్‌కంట్రోల్స్‌ను పెంచడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాల కోసం సదరు కంప్యూటర్, ఈ–మెయిల్‌లోని ఆధారాలను భద్రపరచాలి.
Comments
Please login to add a commentAdd a comment