ransomware attacks
-
Cyberattacks: ఒకే సంస్ధపై సగటున వారానికి 1,738 సార్లు..!
ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల్లో పలు సంస్థలపై సైబర్‌దాడులు గణనీయంగా 29 శాతానికి పెరిగాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో సైబర్‌దాడులు అధికంగా జరిగాయి. యూఎస్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు సైబర్‌దాడులకు గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలపై రాన్సమ్వేర్ దాడుల సంఖ్య 93 శాతం పెరిగిందని చెక్ పాయింట్ పేర్కొంది. చెక్‌పాయింట్ తన 'సైబర్ ఎటాక్ ట్రెండ్స్: 2021 మిడ్-ఇయర్ రిపోర్ట్' ను గురువారం విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో భాగంగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య రంగం, క్లిష్టమైన మౌలిక సదుపాయాలతో సహా అన్ని రంగాల్లోని సంస్థలపై సైబర్‌దాడులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. టార్గెట్ భారత్ ..! యూఎస్‌లో17 శాతం మేర సగటున వారానికి 443 సార్లు సైబర్‌దాడులు జరిగాయి. ముఖ్యంగా యూరప్‌లో సైబర్‌దాడులు 27 శాతం పెరుగుదల ఉండగా, లాటిన్ అమెరికాలో వృద్ధి 19 శాతం నమోదైంది. చెక్‌పాయింట్ తన నివేదిక భారత్‌పై జరిగిన సైబర్‌దాడులు ఒక్కింతా విస్మయానికి గురిచేసేలా ఉంది. భారత్‌కు చెందిన ఒక సంస్థపై గత ఆరునెలల్లో సగటున వారానికి 1,738 సార్లు దాడులను ఎదుర్కొన్నట్లు చెక్‌పాయింట్ పేర్కొంది. భారత్‌లో విద్య, పరిశోధన, ప్రభుత్వ, సైనిక, భీమా, చట్టపరమైన, తయారీ రంగాలకు చెందిన, ఆరోగ్య రంగాలకు చెందిన సంస్థలపై గణనీయంగా సైబర్‌దాడులు జరిగినట్లు చెక్‌పాయింట్ వెల్లడించింది. హాకర్లకు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే సైబర్‌దాడులకు భారత్ కీలక లక్ష్యంగా నిలుస్తోందని చెక్‌పాయింట్ పేర్కొంది. మరింత భీకరమైన దాడులు..! ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్వేర్ దాడుల్లో కూడా గణనీయమైన పురోగతి ఉందని చెక్‌పాయింట్ తెలిపింది. పలు సంస్థల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి, ఆయా సంస్థలు హాకర్లు అడిగినంతా డబ్బు చెల్లించకపోతే బహిరంగంగా డేటాను విడుదల చేస్తామని బెదిరింపులకు రాన్సమ్ వేర్ పాల్పడుతుంది. ఈ ఏడాదిలో రాన్సమ్ వేర్ సోలార్ విండ్స్ సప్లై చెయిన్స్‌ను లక్ష్యంగా చేసుకొని భారీగా సైబర్‌దాడులను నిర్వహించాయి. రాన్సమ్వేర్ దాడులను మరింత పెంచడానికి హాకర్లు కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెక్‌పాయింట్ పేర్కొంది. భవిష్యత్తులో రాన్సమ్వేర్ దాడులు మరింత భీకరంగా ఉంటాయని చెక్‌పాయింట్ తన నివేదికలో తెలిపింది. -
రష్యా నుంచే ర్యాన్సమ్వేర్ దాడులు
వాషింగ్టన్: రష్యాకు చెందిన కొందరు నేరగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి సైబర్ దాడులతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ర్యాన్సమ్వేర్ దాడుల కారణంగా అమెరికాతోపాటు ఇతర దేశాల సంస్థలకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. రష్యా భూభాగం నుంచి ఈ దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా నుంచి ఏదైనా ర్యాన్సమ్వేర్ దాడి జరిగినప్పుడు, ఆ దాడికి ప్రభుత్వం కారణం కానప్పటికీ, బాధ్యులను గుర్తించి తగు సమాచారం తాము అందజేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను బైడెన్ ఈ సందర్భంగా కోరారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట పడనట్లయితే, తమ ప్రజలను, వ్యవస్థలను కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా బైడెన్ స్పష్టం చేశారు. అదే విధంగా, ఒకరి దేశానికి నష్టం కలిగించే పరిణామం మరొకరి దేశంలో సంభవిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాల అధ్యక్షులు ఇకపై ఎప్పటికప్పుడు పంచుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైందని వైట్‌హౌస్ పేర్కొంది. -
ప్రపంచ చరిత్రలో భారీ సైబర్ దాడి.. వందల కోట్లు డిమాండ్!
అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద సైబర్/రాన్సమ్వేర్ దాడి చోటు చేసుకుంది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేశారు. ఈ దాడి తర్వాత 70 మిలియన్ డాలర్లను వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 520 కోట్ల రూపాయలు. డార్క్ వెబ్సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తుంది. సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. ఈ సైబర్ దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి నుంచి వెనక్కి తగ్గాలంటే 70 మిలియన్ డాలర్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డీల్ కనుక ఒకే అయితే, సైబర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద సైబర్ దాడి అవుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలలో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్సమ్వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై వారు దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలో జెనీవాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడుల విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రస్తావించారు. ఇలాంటి దాడులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత రష్యా అధ్యక్షుడిపై ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ గ్యాంగ్స్ దూకుడుకు అమెరికా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో తాజాగా దాడి సంభవించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ గ్యాంగ్ ఇది వరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ.. ఈ సారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. -
‘వాన్నా క్రై’ ఉ.కొరియా పనే: అమెరికా
వాషింగ్టన్: ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల కంప్యూటర్లపై జరిగిన వాన్నాక్రై రాన్సమ్వేర్ దాడి వెనక ఉత్తర కొరియా పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది. యూఎస్ హోంల్యాండ్ భద్రతా సలహాదారు టామ్ బోసెర్ట్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో సోమవారం ఈ విషయం వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బహిర్గతంచేసే అవకాశాలున్నాయి. ‘వాన్నాక్రై దాడులు విస్తృతంగా వ్యాపించాయి. దొంగిలించిన సమాచారాన్ని తిరిగివ్వడానికి బిలియన్ల కొద్ది డాలర్లను డిమాండ్ చేశారు. ఇందులో ఉ.కొరియాకు ప్రత్యక్ష పాత్ర ఉంది. మేము ఈ ఆరోపణలు గుడ్డిగా చేయడంలేదు. పక్కా ఆధారాలున్నాయి’ అని టామ్ అన్నారు. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరిచేలా సైబర్ ముప్పును తగ్గించడం కోసం అమెరికా చొరవతీసుకుని ప్రపంచ దేశాలతో కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంగా ఉ.కొరియా హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. -
ఈ భారీ సైబర్ దాడి వెనుక నార్త్ కొరియా?
-
ఈ భారి సైబర్ దాడి వెనుక నార్త్ కొరియా?
వాషింగ్టన్ : ఇంటర్నెట్ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది వన్నాక్రై సైబర్ దాడి. ఐదు రోజుల కిందట జరిగిన ఈ దాడితో ప్రపంచమంతా వణికిపోయింది. రాన్సమ్ వేర్ వైరస్ ను ఉపయోగించి ఈ అనూహ్య దాడికి పాల్పడిందో ఎవరో కనుగోవడంలో ప్రస్తుతం సెక్యురిటీ సంస్థలన్నీ నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ భారీ సైబర్ అటాక్ వెనుక నార్త్ కొరియా ఉన్నట్టు సెక్యురిటీ రీసెర్చర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న రష్యా, అమెరికాల మధ్య తాజాగా మరో రాజకీయ యుద్ధం సృష్టించడానికి ఉత్తరకొరియా ఈ పన్నాగం పన్నినట్టు వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వన్నాక్రై సైబర్ అటాక్ ముప్పు కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికే 3,00,000 కంప్యూటర్లు హ్యాకైనట్టు టాప్ అమెరికా అధికారి చెప్పారు. బీభత్సం సృష్టించిన ఈ వన్నాక్రై సైబర్ దాడికి, విస్తృతంగా హ్యాకింగ్ కు ప్రయత్నించే ప్యోంగ్యాంగ్ కు సంబంధమున్నట్టు ఓ గూగుల్ రీసెర్చర్ కంప్యూటర్ కోడ్ ను పోస్టు చేశాడు. ఇతర రీసెర్చర్లు కూడా కచ్చితంగా ఈ కుట్ర వెనుక ఉన్నది నార్త్ కొరియానేనని చెబుతున్నారు. ఇజ్రాయిల్ కు చెందిన ఓ సెక్యురిటీ సంస్థ ఇంటెజర్ ల్యాబ్స్ కూడా నార్త్ కొరియాకే ఈ చర్యను ఆపాదించింది. ఇప్పటికే ఖండాతర క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను ఆందోళన పెడుతున్న ఈ దేశం ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అమెరికా-నార్త్ కొరియాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ దాడికి కారణం అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిన టూల్సేనని దాడికి వెలుగులోకి వచ్చిన రోజు అగ్రరాజ్యాన్ని తిట్టిపోశారు. కానీ రాన్సమ్ డేటా కలిగి ఉన్న టూల్ ను ఎన్ఎస్ఏ రూపొందించలేదని, ఇది గ్లోబల్ ఎటాకేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాప్ సైబర్, హోమ్ ల్యాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ టామ్ బాస్స్టర్ చెప్పారు.