వాషింగ్టన్: ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల కంప్యూటర్లపై జరిగిన వాన్నాక్రై రాన్సమ్‌వేర్ దాడి వెనక ఉత్తర కొరియా పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది. యూఎస్ హోంల్యాండ్ భద్రతా సలహాదారు టామ్ బోసెర్ట్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో సోమవారం ఈ విషయం వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బహిర్గతంచేసే అవకాశాలున్నాయి. ‘వాన్నాక్రై దాడులు విస్తృతంగా వ్యాపించాయి.
దొంగిలించిన సమాచారాన్ని తిరిగివ్వడానికి బిలియన్ల కొద్ది డాలర్లను డిమాండ్ చేశారు. ఇందులో ఉ.కొరియాకు ప్రత్యక్ష పాత్ర ఉంది. మేము ఈ ఆరోపణలు గుడ్డిగా చేయడంలేదు. పక్కా ఆధారాలున్నాయి’ అని టామ్ అన్నారు. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరిచేలా సైబర్ ముప్పును తగ్గించడం కోసం అమెరికా చొరవతీసుకుని ప్రపంచ దేశాలతో కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంగా ఉ.కొరియా హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment