సియోల్: ఉభయకొరియాల శిఖరాగ్ర సమావేశానికి తేదీ ఖరారైంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా రహస్య పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే పాన్‌మున్‌జోన్‌లో జరిగిన ఇరు దేశాల ఉన్నతాధికారుల భేటీలో ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న పాన్‌మున్‌జోన్‌లో ఏప్రిల్ 27వ తేదీన ‘2018 దక్షిణ–ఉత్తర సమావేశం’ జరిపేందుకు తమ నేతలు అంగీకరించారని రెండు దేశాల అధికారులు గురువారం ఉమ్మడి ప్రకటన వెలువరించారు. ఈ సమావేశంతో కొరియా యుద్ధం తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు దక్షిణ కొరియాలో అడుగుపెట్టనుండటం ఇదే ప్రథమం కానుంది. దీని తర్వాత మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చారిత్రక సమావేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment