
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న లోన్‌యాప్‌ల మాయాజాలంలో చిక్కుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్‌యాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ పలు సూచనలు చేసింది. లోన్‌యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరించారు.
ఇవి మరవొద్దు
♦ లోన్‌యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఫోన్‌లో ఉన్న యాప్స్, కాంటాక్ట్ నంబర్లు, లొకేషన్, ఫొటోలు, మీ వ్యక్తిగత విషయాలన్నీ మీకు లోన్ ఇచ్చేవాళ్లకు వెళతాయని గుర్తించాలి. మీరు తీసుకున్న లోన్ తీర్చకపోతే తీవ్రంగా వేధిస్తారు.
♦ ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు యాక్సెస్ ఉండడంతో లోన్‌యాప్ ఏజెంట్లు మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
♦ లోన్‌యాప్‌ల నుంచి వేధింపులు శ్రుతి మించితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు www. cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment