డిజిటల్ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల వినియోగదారుల్ని ఎస్‌బీఐ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఇన్‌స్టంట్ లోన్‌లు తీసుకునే యూజర్ల భద్రతా దృష్ట్యా మార్గదర్శకాలను జారీ చేసింది. లోన్ యాప్స్ పట్ల కస్టమర్‌లను హెచ్చరిస్తూ, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థలకు వ్యక్తిగత సమాచారం అందించడం మానుకోవాలని కోరింది. ఈ సందర్భంగా యాప్స్‌లో రుణాలు తీసుకునేవారికి పలు జాగ్రత్తలు చెప్పింది.
కస్టమర్లకు ఎస్‌బీఐ చెప్పిన జాగ్రత్తలివే
► ఇన్‌స్టంట్‌లోన్, లేదంటే లోన్ తీసుకునేందుకు ప్రయత్నించే ముందు సదరు ఫైనాన్స్ అందించే యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి వినియోగదారులకు హాని చేస్తాయా? లేదా అనేది డౌన్‌లోడ్ చేసుకునే ముందు చెక్ చేసుకోవాలి.
► అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు
► మీ డేటాను చౌర్యానికి పాల్పడుతున్న అనధికారిక యాప్స్ వినియోగించడం మానుకోవాలి.
► ఒకవేళ మీరు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేలా యాప్స్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలి.
► అనుమానాస్పద రీతిలో లోన్‌లు ఇచ్చే యాప్స్ నిర్వహణ సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
► నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సైబర్ క్రైమ్‌లను రిపోర్ట్ చేయాల్సిందిగా వినియోగదారులను కోరింది.
కాగా, గతంలో ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలు చేసే సమయంలో సైబర్ నేరస్తుల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉండేలా పలు సూచనలు చేసింది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్, పాస్ వర్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు
►బయోమెట్రిక్స్, ఇందులో ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్
►ఇమెయిల్ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)
►ఎస్‌ఎంఎస్ ఓటీపీ
►భద్రతా పరమైన ప్రశ్నల్ని జత చేయాలని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment