loan apps
-
లోన్‌యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి,కుత్బుల్లాపూర్: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన విద్యార్థి భానుప్రకాష్(22) పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం(సెప్టెంబర్6) వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్ మృతిపై గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భానుప్రకాష్ ఆరోరా కళాశాలలో పీజీ చదువుతున్నాడు. మొబైల్‌ఫోన్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ లభ్యమైంది. -
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్‌యాప్‌లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్‌యాప్‌ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్‌లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్‌యాప్స్‌లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్‌యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్‌ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపు
ఆర్థిక మోసాలను అణిచివేసేందుకు ప్రభుత్వం 379 అక్రమంగా రుణాలందించే వెబ్సైట్లను, 91 ఫిషింగ్ సైట్లను తొలగించినట్లు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అక్టోబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్యకాలంలో 379 అక్రమంగా రుణాలిస్తున్న వెబ్సైట్లను మూసివేసింది. 91 ఫిషింగ్ సైట్లను తొలగించింది. ప్రభుత్వ వెబ్సైట్లను ప్రతిపాదించే ‘.in’ డొమైన్ల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ)తో ఐ4సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జనవరి 31న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ‘రిపోర్ట్ సస్పెక్ట్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దాంతో అనుమానాస్పద వెబ్సైట్ యూఆర్ఎల్తో చేసిన సైబర్ క్రైమ్‌ను త్వరగా గుర్తించవచ్చు. వెంటనే సంబంధిత శాఖకు ఈ విషయాన్ని నివేదించవచ్చు. వీటిలో ఇప్పటివరకు 5,252 రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించడానికి ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను ఏర్పాటు చేశాం. దాని ద్వారా 7.6 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.2,400 కోట్లు ఆదా చేశాం’ అన్నారు.ఇదీ చదవండి: పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ ప్రత్యేక డూడుల్!2024 వార్షిక నివేదికలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సుమారు 36,000 ఆర్థిక మోసాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో వీటి సంఖ్య 9,000 ఉండడం గమనార్హం. 2024 వరకు ఇవి ఏకంగా 300 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక మోసాలను పరిష్కరించడంలో భాగంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఆర్బీఐ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. -
దారుణాలకు ఏఐ దన్ను!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్లో ఓ డాక్టర్‌కు ఉదయం నుంచి మీరు లోన్ కట్టాలంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాల్స్ వచ్చాయి. తరువాత వాయిస్ కాల్స్ చేసి విసిగించారు. చేసిన ప్రతీసారీ కొత్త నెంబరుతో వేధించడంతో ఏం చేయాలో పాలుపోక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. మీ మిత్రుడు లోన్ తీసుకున్నాడంటూ మరో పోలీసు అధికారికి పదే పదే ఫోన్లు చేసి విసిగించారు. ఇది కేవలం పోలీసులు, వైద్యులకే కాదు.. రాజకీయ నాయకులు, అధికారులు మొదలుకుని విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్నారు.⇒ ఇంతకాలం కాల్‌సెంటర్ల ద్వారా వేధించిన లోన్‌యాప్ యాజమాన్యాలు ఇప్పుడు రూటు మార్చాయి. తమ బాకీని ఎలాగైనా వసూలు చేసుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను సరికొత్త ఆయుధంగా వాడుతున్నాయి. ముందుగా లోన్ తీసుకునే వ్యక్తి నుంచి కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలా? అని అడుగుతారు. యాక్సెస్ పరి్మషన్ ఇవ్వకపోతే లోన్ రాదు. అవసరాల్లో ఉంటారు కాబట్టి అంతా కాంటాక్ట్ యాక్సెస్ పర్మిషన్ ఇస్తారు. ఇదే అదనుగా కాల్స్ చేసి విసిగించడంతోపాటు ఆటోమేటిక్ కాల్స్‌తో వేధింపులకు దిగుతున్నారు.ఉదయం, సాయంత్రం ఏఐ కాల్స్!⇒ ఒక వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న వందలు, వేల కాంటాక్ట్స్‌కి ఒకేసారి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా గ్రూప్ కాల్ వెళ్తుంది. సార్ మీ లోన్ పెండింగ్‌లో ఉంది. వెంటనే ఈ నెంబరుకు కాల్‌బ్యాక్ చేయండి అంటూ రికార్డెడ్ వాయిస్ వస్తుంది. ఉదయం, సాయంత్రం, లంచ్ సమయాల్లో ఏఐ కాల్స్ వస్తాయి. ప్రతీ పది నిమిషాలకు ఒకసారి కాల్స్ చేసి విసుగు తెíప్పిస్తాయి.కొత్త తలనొప్పులు..⇒ సాధారణంగా ఎవరైనా పోలీసు, వైద్యుడు, ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకుంటారు. అయితే సదరు వ్యక్తి పొరపాటున అప్పు తీసుకుని కట్టకపోతే.. అప్పుడు ఈ కాంటాక్ట్స్‌లో ఉన్న వారంతా బాధితులుగా మారుతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుంటే అప్పు వసూలు చేయవచ్చన్నది వారి వ్యూహం. ప్రజాజీవితంతో ముడిపడి పనిచేసే వీరు రోజంతా ఏదో పనిలో తలమునకలై ఉంటారు. పైగా నెంబర్లు మార్చి మార్చి చేయడంతో ఎత్తక తప్పనిసరి పరిస్థితి. తీరా ఎత్తితే.. అప్పు కట్టాలి అంటూ వేధింపులు, తిట్లు, దూషణలతో విసిగిస్తున్నారు. మొత్తానికి అకారణంగా వీరంతా వేధింపులకు గురవుతున్నారు. లోన్ యాప్ వేధింపుల నుంచి బయటపడండిలా..⇒ ఎంచుకున్న లోన్‌యాప్ రివ్యూలు ఆన్లైన్లో చదవాకే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ⇒ యాప్‌లో అనవసరమైన కాంటాక్ట్ ఎనేబుల్ పరి్మషన్స్ ఇవ్వరాదు. ⇒పదేపదే కాల్స్ వస్తే బ్లాక్ చేయాలి లేదా ట్రూకాలర్‌లో వాటిని స్పామ్ నంబర్లుగా రిపోర్టు చేయాలి. ⇒అయినా వేధింపులు ఆగకపోతే.. డయల్ 100కి కాల్ చేసి చెప్పాలి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి లేదా 1930కి కాల్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ⇒ httpr://cybercrime.gov.in ఈ లింక్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. -
అదో దా‘రుణ’ యాప్
సాక్షి, అమరావతి: లోన్ యాప్ మోసాలు ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వివిధ లోన్ యాప్‌లు అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అక్రమ మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ నిర్వాకం వెలుగుచూసింది. ఈ యాప్ సులభంగా రుణాలు ఇస్తామని సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది. లోన్ ఇచి్చన అనంతరం భారీ వడ్డీలు వేస్తూ ఖాతాదారులను వేధిస్తోంది. రుణాలు చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారాన్ని దురి్వనియోగం చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తోంది.వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో రుణాలు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లకు తమ ఏజెంట్లను పంపించి మరీ దాడులు చేయిస్తూ వారి ఆస్తులను రాయించుకుంటున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్యాప్పై గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా 1,062 కేసులు నమోదు కావడం గమనార్హం. నిషేధించినా సరే.. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలపై సైబర్ పోలీసులకు సవాల్‌గా మారింది. వాస్తవం ఏమిటంటే.. ఆ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే నిషేధించింది. ఆ సమాచారాన్ని గూగుల్‌తోపాటు ఇతర సెర్చ్ ఇంజన్ల యాజమాన్యాలకు కూడా సమాచారమిచి్చంది. అయినా సరే.. ఆ యాప్ స్మార్ట్ ఫోన్లలో ఎలా అందుబాటులో ఉంటోందన్నది అంతు చిక్కడం లేదు. గత నాలుగేళ్లలో మొత్తం 1,600 లోన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాటిలో అత్యధికం చైనా కేంద్రంగా నిర్వహిస్తున్న యాప్‌లే ఉండటం గమనార్హం. నిషేధించాం కాబట్టి ఇక ఆ యాప్‌లు మోసాలకు పాల్పడలేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కానీ ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలు కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.ఆ యాప్‌ను డిలీట్ చేయండి ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సైబర్ పోర్టల్ స్పందించింది. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్‌ను తాము నిషేధించినట్టు తెలిపింది. అయినా వివిధ గేట్‌వేల ద్వారా ఆ యాప్ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉంటున్నట్టు గుర్తించినట్టు పేర్కొంది. కాబట్టి.. మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో ఉన్న ఆ యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. తద్వారా ఆ యాప్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.నిషేధించినా సరే ఇతర మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటున్న యాప్‌లపై నేషనల్ సైబర్ పోర్టల్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే తగిన కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొంది. లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా మోసపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని నేషనల్ సైబర్ పోర్టల్ కోరింది. -
తుది దశకు చైనా రుణ యాప్‌లపై దర్యాప్తు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు చైనా కంపెనీలపై, ముఖ్యంగా రుణ యాప్‌లతో లింకులున్న సంస్థలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరుపుతోంది. వీటిలో కొన్ని కేసుల్లో దర్యాప్తు తుది దశలో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీల్లో మోసాలేమైనా జరిగాయా అనే కోణంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కొన్నింటిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అక్రమంగా రుణ యాప్‌లను నిర్వహిస్తున్న కంపెనీలపై, అసలైన లబ్ధిదారు వివరాలను దాచి పెట్టే వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఎల్రక్టానిక్స్ .. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ఆర్బీఐ మొదలైన వాటి నుంచి వచ్చిన ఫిర్యాదులపై సదరు సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారి చెప్పారు. కొన్ని కంపెనీల నిధుల మూలాలను కనుగొనడం కష్టమే అయినప్పటికీ, నిర్థిష్టంగా లబ్ధి పొందే యాజమాన్య సంస్థను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
ప్రకటనపై క్లిక్ చేస్తే ప్రాణాలు పోవచ్చు..!
సామాన్యులను అప్పుల ఊబిలోకి దింపి, వారిని పీడిస్తున్న అక్రమ రుణ యాప్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలోనే వాటి కట్టడికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదైనవి మినహా ఇతర అనధికార రుణ యాప్‌లను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని ఎప్పుడో నిర్ణయించింది. మొదట్లో చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలివ్వడం వల్ల డిజిటల్ రుణాల వైపు చాలామంది ఆకర్షితులవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ తరవాత మోసపూరిత రుణ యాప్‌లు రంగప్రవేశం చేసి అడిగిన వెంటనే రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని గుర్తించలేని కొందరు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ యాప్‌లకు సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా యాడ్లు వస్తున్నాయి. దాంతో కొందరు అక్రమ రుణయాప్‌లను గుడ్డిగానమ్మి మోసపోతున్నారు. తాజాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ ప్లాట్ఫామ్ల్లో నకిలీ రుణ యాప్‌లను ప్రచారం చేయకుండా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇండియా ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మోసపూరిత రుణ యాప్‌లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నకిలీ లోన్ యాప్‌ల ప్రకటనలను ప్రసారం చేయకుండా ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రకటనలు ప్రసారం చేసినందుకుగాను రుణయాప్‌లు కొంత డబ్బు ఆ కంపెనీలకు చెల్లిస్తాయి. నకిలీ రుణయాప్‌లకు సంబంధించి ప్రకటనలు వస్తున్నప్పుడు యూజర్ల ఇష్టానుసారంమేరకే వాటిని నిలిపేసేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే.. ‘ఆర్బీఐ వద్ద నమోదు చేసుకున్న రుణయాప్‌లు పరిమితంగా ఉండగా.. గుర్తింపు లేనివే అత్యధికంగా ఉన్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా భారీగా వడ్డీలను గుంజుతున్నాయి. రుణాన్ని తిరిగిచెల్లించినా చేయలేదని పేర్కొంటూ.. మరింత చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. ఇక చెల్లింపులు చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ అవమానిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లోన్‌యాప్‌ల దాష్టీకానికి రాష్ట్రంలో రెండేళ్లలో 10 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు.’ అని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది. -
ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..!
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులతో పాటు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు తమ వినియోగదారులకు క్రెడిట్, రుణాలు ఇవ్వడం, కార్డు బిల్లుల చెల్లింపులు వంటి ఎన్నో సదుపాయాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిన్ టెక్ కంపెనీ ఫోన్‌పే తన యూజర్ల కోసం కొత్తగా ‘క్రెడిట్’ ఆప్షన్ తెచ్చింది. ఈ విభాగంలో యూజర్లు ‘క్రెడిట్ బ్యూరో స్కోర్’ చెక్ చేసుకోవచ్చు. యూజర్ల క్రెడిట్ వాడకం, క్రెడిట్ ఏజ్, ఆన్ టైం పేమెంట్స్ తదితర వివరాలతో కూడిన నివేదికను క్రెడిట్ బ్యూరో స్కోర్ అందిస్తుంది. హోం పేజీలోని క్రెడిట్ సెక్షన్‌ను ఉపయోగించుకుని క్రెడిట్ లేదా రూపే కార్డుల లావాదేవీలు, రుణాల చెల్లింపులు, అదనపు భారం లేకుండా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదీ చదవండి: ‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..! ఫోన్‌పే సీఈఓ హేమంత్ గాలా స్పందిస్తూ ‘ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ సెక్షన్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాం. పలు సెగ్మెంట్లలో యూజర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడమే క్రెడిట్ సెక్షన్ లక్ష్యం. యూజర్ల క్రెడిట్ హెల్త్ నిర్వహణతోపాటు ఆర్థిక సాధికారత కల్పించేందుకు సంస్థ కృషిచేస్తోంది. భవిష్యత్తులో వినియోగదారులకు కన్జూమర్ లోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇందుకోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని ఆయన వివరించారు. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
ఫేస్బుక్ యాడ్స్‌లో ఫేక్ లోన్‌యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్‌లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్‌యాప్‌లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
RBI: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు అవసరాలకు అనుగునంగా నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తూంటాయి. వాటిని వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లు ఉంటారు. అయితే రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రికవరీ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలు ఫోన్ చేయకూడదనే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు (డీఎస్ఏ), డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు (డీఎంఏ), రికవరీ ఏజెంట్ల కోసం నియంత్రిత సంస్థలు ఈ నియామవళిని పాటించే విధంగా చూడాలని ఆర్బీఐ భావిస్తుంది. ఆర్బీఐ ప్రతిపాదించబోతున్న నిబంధనల ప్రకారం..రికవరీ ఏజెంట్లు కస్టమర్లను అభ్యర్థించడం, కాల్ చేసే గంటలు, కస్టమర్ సమాచారం గోప్యత, సంస్థలు ఇస్తున్న ఆఫర్లోని ఉత్పత్తుల నిబంధనలు, షరతులను స్పష్టంగా తెలియజేయాలి. బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియన్ సెంటర్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పట్టణ, రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. రికవరీ ఏజెంట్లు తమ రుణ సేకరణ ప్రయత్నాల్లో భాగంగా ఏ వ్యక్తిపై మానసికంగా, శారీరకంగా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ డ్రాఫ్ట్ నిబంధనల్లో పేర్కొంది. రుణగ్రహీత కుటుంబ సభ్యులు, రిఫరీలు, స్నేహితులను అవమానించడం లేదా వారి ఇంట్లోకి చొరబడడం, మొబైల్ లేదా సోషల్ మీడియా ద్వారా అనుచిత సందేశాలు పంపడం, అనామక కాల్లు చేయడాన్ని నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
ఫేక్ లోన్ యాప్‌లతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ రుణ యాప్‌లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్లైన్ రుణ యాప్ బజాజ్ ఫైనాన్స్ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది. ఫేక్ యాప్‌ల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్లైన్ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో రుణం తీసుకొనే ముందు యాప్‌ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఫేక్ రుణ యాప్‌ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి... ♦ వెరిఫై చేయని ఆన్లైన్ రుణ యాప్లనుప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. ♦ ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అఫిలియేషన్ లేకపోయినా అది మోసపూరిత ఆన్లైన్ లోన్ యాప్‌గా గుర్తించాలి. ♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్ ఉన్న యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ♦ రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్‌లు నకిలీవేనని తెలుసుకోవాలి. ♦ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలి. కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్‌లు - ఐవొరి లెండ్స్, క్యాష్ పార్క్, ఆన్లైన్ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్కాష్, లోన్బడ్డీ. -
‘సారీ అమ్మానాన్నా.. నావల్ల కావట్లేదు!’
క్రైమ్: స్నేహితుని కోసం ఆన్లైన్లో రుణం తీసుకుంటే.. వాడు నట్టేట ముంచాడు. రికవరీ యాప్స్ ఏజెంట్లు రాబంధువుల్లా అతనిపై పడి పీక్కుతినే యత్నం చేశారు. ఎటూ పాలుపోని స్థితిలో ఆ స్టూడెంట్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భయంతో తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరుతూ లేఖ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటక జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ కాలనీలో మంగళవారం జరిగింది. యెలహంకలోని ఒక ప్రైవేటు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆరో సెమిస్టర్ చదువుతున్న తేజస్ (22) కాలేజీ టాపర్. మహేష్ అనే స్నేహితుడికి డబ్బు అత్యవరం పడడం.. అతని బలవంతం మేరకు మూడు లోన్ యాప్స్ ద్వారా మనీ తీసుకున్నాడు. అయితే.. మహేష్ హ్యాండిచ్చాడు. ఏడాది నుంచి స్నేహితుడు EMI వాయిదాలు కట్టడం లేదు. రుణం తేజస్ పేరుమీద ఉండటంతో అప్పు ఇచ్చిన కంపెనీల రికవరీ ఏజెంట్లు తేజస్‌ను వేధించసాగారు. చివరకు.. జీవితం మీద విరక్తి చెందిన తేజస్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు డెత్‌నోట్ రాసి ఇంట్లో తల్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మనాన్న నేను చేస్తున్న దానికి నన్ను క్షమించండి, నాకు మరో దారి కనిపించడం లేదు. నా పేరు మీద ఉన్న అప్పు తీర్చడం నా వల్ల కాదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా, థాంక్యూ, గుడ్ బై ‘‘మా కుటుంబ సభ్యుల నగ్నఫోటోల్ని వైరల్ చేస్తామంటూ వాళ్లు బెదిరించారు. కొందరు స్నేహితులకు మా ఎడిటింగ్ ఫొటోల్ని షేర్ చేశారు. మా ఇంటి ద్గగర ఓ కెమెరాను ఉంచారు. ఆ విషయం మా దృష్టికి రావడంతో.. వేధింపుల గురించి తెలిసింది. 4,00,000 లోన్ నేను చెల్లిస్తానని.. చక్కగా చదువుకోమని నా కొడుక్కి ధైర్యం చెప్పా. అయితే చెల్లిస్తామని చెప్పినా.. రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగలేదు. ఇవాళ ఉదయం నా కొడుకు శవం ఇంటి దగ్గర ఉన్నప్పుడూ కూడా ఓ ఏజెంట్ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఇక్కడి నుంచి గప్‌చుప్‌గా వెళ్లిపోయాడు. ఇది లోన్ యాప్స్ చేసిన హత్యే. సమస్యలేమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి. మీలో మీరే మదనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి అంటూ యువతకు కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తున్నాడు తేజస్ తండ్రి గోపీనాథ్. ఘటనకు సంబంధించి సదరు లోన్ యాప్స్ మీద ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
లోన్ యాప్ నిర్వాహకులను పట్టుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు
-
డిజిటల్ రుణాల రంగానికి స్వీయ నియంత్రణ సంస్థ !
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ రుణాల యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో డిజిటల్ రుణాల యాప్‌లకు (డీఎల్ఏ) స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్వో) ఉండాలని రీసెర్చ్ సంస్థ చేజ్ ఇండియా ఒక నివేదికలో ప్రతిపాదించింది. సక్రమమైన డీఎల్ఏల వ్యాపార కార్యకలాపాలు, విధానాలకు చట్టబద్ధత లభించడంతో పాటు వాటికి తగిన నియంత్రణ విధానాలను నిర్దేశించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అలాగే, డీఎల్ఏలకు ప్రామాణికమైన నైతిక నియమావళిని కూడా నిర్దేశించాలని సూచించింది. పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో చేజ్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. దేశీయంగా డిజిటల్ రుణాల వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి తోడ్పడటంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన ప్రతిపాదనలతో దీన్ని తీర్చిదిద్దింది. రుణ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)ను రూపొందించాలని చేజ్ ఇండియా పేర్కొంది. డిజిటల్ రుణాల విభాగం ఎదుగుతున్నప్పటికీ పర్యవేక్షణ లేకుండా డీఎల్ఏలు పాటించే విధానాలు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కౌశల్ మహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాధ్యతాయుతంగా వ్యవహరించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు నవకల్పనలకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఇటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ అటు పరిశ్రమ వృద్ధి మధ్య సమతౌల్యత సాధించవచ్చని వివరించారు. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడి మృతి
తూర్పు గోదావరి: లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం భాస్కర్‌నగర్‌కు చెందిన ఎస్.హరికృష్ణ (18) లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాడు. రుణం చెల్లింపుల కోసం యాప్ నుంచి వేధింపులు అధికమవ్వడంతో గతంలో కడియం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో హరికృష్ణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కడియం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. -
ఫేక్ యాప్స్ ను ఏరిపారేస్తామంటున్న గూగుల్
-
గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..
చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని 2021లో అప్డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందినట్లు యాప్ డెవలపర్లు ధ్రువీకరించాలి. అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! ఈ రుణ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ 2022లో మరిన్ని నిబంధనలు చేర్చింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), బ్యాంకులకు ఫెసిలిటేటర్లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్లు మరికొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెవలపర్లు వారి భాగస్వామి NBFC, బ్యాంకుల పేర్లను, వాటికి తాము అధీకృత ఏజెంట్లనే విషయం తెలియజేసే వెబ్సైట్ల లైవ్ లింక్‌ను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. -
లోన్‌యాప్‌లు డౌన్లోడ్ చేయొద్దు.. కీలక సూచనలు.. మరిచారో అంతే!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న లోన్‌యాప్‌ల మాయాజాలంలో చిక్కుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్‌యాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ పలు సూచనలు చేసింది. లోన్‌యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఇవి మరవొద్దు ♦ లోన్‌యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న యాప్స్, కాంటాక్ట్ నంబర్లు, లొకేషన్, ఫొటోలు, మీ వ్యక్తిగత విషయాలన్నీ మీకు లోన్ ఇచ్చేవాళ్లకు వెళతాయని గుర్తించాలి. మీరు తీసుకున్న లోన్ తీర్చకపోతే తీవ్రంగా వేధిస్తారు. ♦ ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు యాక్సెస్ ఉండడంతో లోన్‌యాప్ ఏజెంట్లు మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ♦ లోన్‌యాప్‌ల నుంచి వేధింపులు శ్రుతి మించితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు www. cybercrime.gov.in వెబ్సైట్లో లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
లోన్ యాప్ సంస్థలకు కేంద్రం కళ్లెం
-
లోన్ యాప్‌లకు కళ్లెం..వేధింపుల కట్టడికి గూగుల్ చర్యలు
సాక్షి, అమరావతి : లోన్ యాప్ సంస్థల వేధింపులకు ఎట్టకేలకు కళ్లెం పడనుంది. భారీ వడ్డీలతో బెంబేలెత్తిస్తూ, రుణ గ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించే లోన్ యాప్ సంస్థల కట్టడికి గూగుల్ సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త విధానం మే 31 నుంచి అమలులోకి రానుంది. ఫొటోలు, వీడియోల మార్ఫింగులతో వేధింపులు చైనా కేంద్రంగా పనిచేస్తున్న లోన్ యాప్ సంస్థలు అత్యధిక వడ్డీలు, పారదర్శకతలేని విధానాలతో రుణ గ్రహీతలను వేధిస్తున్నాయి. ఎంతగా వాయిదాలు చెల్లిస్తున్నా వడ్డీ, అసలు కలిపి అప్పు కొండలా పెరుగుతుందే తప్ప తగ్గదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేస్తే రుణ గ్రహీతల మొబైల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బంధువులు, మిత్రులకు వాట్సాప్ చేస్తూ వేధిస్తున్నాయి. ఈ అవమాన భారంతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్ నిర్వాహకులకు అందుబాటులోకి తేవాలి. ఈమేరకు యాక్సెస్‌కు అనుమతిస్తేనే లోన్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. రుణం కావాలన్న ఆతృతలో వ్యక్తులు యాక్సెస్‌కు అనుమతిస్తున్నారు. దీన్నే ఆ సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం, ఆర్థిక శాఖలు లోన్‌యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించాయి. మనీలాండరింగ్‌కు, ఆర్థి క మోసాలకు పాల్పడుతున్న పలు లోన్ యాప్ కంపెనీలపై కేసులు పెట్టాయి. 2022లో 2 వేల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ఇవ్వొద్దని గూగుల్‌కు ఆదేశం వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా చేయడమే దీనికి పరిష్కారమని కేంద్ర హోం శాఖ భావించింది. వ్యక్తిగత సమాచారం కోరే లోన్ యాప్‌లకు ప్లే స్టోర్‌లో అవకాశం ఇవ్వద్దని గూగుల్‌కు కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ యాప్ సంస్థలతో పాటు గూగుల్‌పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేలి్చచెప్పింది. దాంతో గూగుల్ దిగి వచ్చింది. వ్యక్తిగత సమాచారం లోన్‌యాప్‌లకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. లోన్ యాప్ కంపెనీలకు గూగుల్ మార్గదర్శకాలు భారత్‌లో వ్యాపారం చేసే లోన్ యాప్ సంస్థలకు గూగుల్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు యాప్‌ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని చెప్పింది. భారత్‌లో నాన్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను పాటించాలని, ఈమేరకు డిక్లరేషన్ ఇచ్చే యాప్ సంస్థలనే గూగుల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం లోన్ యాప్‌లను మాడిఫై చేసి ఈ ఏడాది మే 31లోగా అప్లోడ్ చేయాలని చెప్పింది. వాటినే ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో దేశంలో లోన్ యాప్‌ల వేధింపులకు కళ్లెం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
చల్లపల్లి: లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన టైలర్ మహమ్మద్ ఇనాయతుల్లా (ఛన్నా) ఏకైక కుమారుడు మహమ్మద్ బాబ్జాన్ (31)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పదకొండు నెలల బాబు ఉన్నాడు. బాబ్జాన్ వృత్తి రీత్యా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల లోన్ యాప్‌ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించాలని నిత్యం లోన్ యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల బాబ్జాన్ తండ్రికి లోన్ యాప్ వారు ఫోన్ చేసినపుడు అప్పు ఉంటే చెల్లిస్తామని చెప్పారు. అయినప్పటికీ అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ.. నిత్యం వేధింపులు కొనసాగించారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాబ్ జాన్ సోమవారం రాత్రి విజయవాడలోని తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ.6వేలు అప్పు ఇచ్చి.. రూ.54వేలు కట్టించుకున్నారు.. అయినా..!
సాక్షి, ఖమ్మం: ఆన్లైన్ యాప్ లోన్ ఆగడాలకు ఖమ్మంలో ఓ యువకుడు బలయ్యాడు. యాప్ వారి వేధింపులకు భరించలేక పురుగుమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్‌సింగ్ కుమారుడు ఆకాశ్(24) నగరంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ యాప్ ద్వారా రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించినా....ఇంకా అప్పు ఉన్నావని, అప్పు చెల్లించకుంటే ‘నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాం’అంటూ వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆకాశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీఐ సర్వయ్య మాత్రం లోన్‌యాప్ వేధింపులనే ఫిర్యాదు తమకు అందలేదని, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం ఉందని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్