నిషేధించినా బురిడీ కొట్టిస్తున్న ‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ యాప్
ఆరు నెలల్లోనే 1,062 పైగా ఫిర్యాదులు
ఆ యాప్‌ను ఫోన్ల నుంచి తొలగించాలని నేషనల్ సైబర్ పోర్టల్ ప్రకటన
సాక్షి, అమరావతి: లోన్ యాప్ మోసాలు ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వివిధ లోన్ యాప్‌లు అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అక్రమ మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్ యాప్ నిర్వాకం వెలుగుచూసింది. ఈ యాప్ సులభంగా రుణాలు ఇస్తామని సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది. లోన్ ఇచి్చన అనంతరం భారీ వడ్డీలు వేస్తూ ఖాతాదారులను వేధిస్తోంది. రుణాలు చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారాన్ని దురి్వనియోగం చేస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది.
వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో రుణాలు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లకు తమ ఏజెంట్లను పంపించి మరీ దాడులు చేయిస్తూ వారి ఆస్తులను రాయించుకుంటున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్‌యాప్‌పై గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా 1,062 కేసులు నమోదు కావడం గమనార్హం.
నిషేధించినా సరే..
‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలపై సైబర్ పోలీసులకు సవాల్‌గా మారింది. వాస్తవం ఏమిటంటే.. ఆ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లోనే నిషేధించింది. ఆ సమాచారాన్ని గూగుల్‌తోపాటు ఇతర సెర్చ్ ఇంజన్ల యాజమాన్యాలకు కూడా సమాచారమిచి్చంది. అయినా సరే.. ఆ యాప్ స్మార్ట్ ఫోన్లలో ఎలా అందుబాటులో ఉంటోందన్నది అంతు చిక్కడం లేదు. గత నాలుగేళ్లలో మొత్తం 1,600 లోన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాటిలో అత్యధికం చైనా కేంద్రంగా నిర్వహిస్తున్న యాప్‌లే ఉండటం గమనార్హం. నిషేధించాం కాబట్టి ఇక ఆ యాప్‌లు మోసాలకు పాల్పడలేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కానీ ‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలు కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.
ఆ యాప్‌ను డిలీట్ చేయండి
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సైబర్ పోర్టల్ స్పందించింది. ‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్ యాప్‌ను తాము నిషేధించినట్టు తెలిపింది. అయినా వివిధ గేట్‌వేల ద్వారా ఆ యాప్ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంటున్నట్టు గుర్తించినట్టు పేర్కొంది. కాబట్టి.. మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ఆ యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. తద్వారా ఆ యాప్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
నిషేధించినా సరే ఇతర మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటున్న యాప్‌లపై నేషనల్ సైబర్ పోర్టల్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే తగిన కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొంది. లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా మోసపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని నేషనల్ సైబర్ పోర్టల్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment