
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ డ్రాగన్ కంట్రీకి భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. నిషేధం విధించిన వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 98 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.
చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంహెచ్‌ఏ (MHA).. ఆరు నెలల క్రితం 28 చైనీస్ లోన్ లెండింగ్ యాప్‌లపై నిఘా పెట్టింది. అయితే, ఈ-స్టోర్‌లలో 94 యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించింది. అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఈ చైనీస్ యాప్‌లపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ తరహా పలు చైనీస్ యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 2020 నుంచి టిక్ టాక్, షేర్‌ఇట్, వీ చాట్, హలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ఫ్లోరర్, ఎంఐ కమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్‌లతో సహా 200కి పైగా చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.
చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment