సాక్షి,విశాఖపట్నం : భారీ సైబర్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తూ వచ్చిన నిధుల్ని చైనా, తైవాన్‌లకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్ సెంటర్ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశాఖ పోలీసులకు అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి విశాఖ పోలీసులు సైబర్ నేరస్థుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల దందాపై సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు.
అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం. చైనాతో సంబంధాలు ఉన్న ఈ ముఠా గుట్టు రట్టు చేశాం. నిందితులు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును చైనా,తైవాన్లకు పంపుతున్నారు. నేరానికి పాల్పడ్డ నిందితుల్ని ఇప్పటి వరకూ ఏడుగురుని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు నుంచి పది ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది పర్సనల్ కంప్యూటర్లు,కార్,బైక్ స్వాధీనం చేసుకున్నాం.
వీటితో పాటు 800 అకౌంట్లు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment