
త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సుప్రీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. సుప్రీత హోలీ పండుగ రోజును అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌ను తాను కూడా ప్రమోట్ చేశానని వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలపై కేసు కూడా నమోదు చేశారు. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూచౌదరి లాంటి వారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?)
అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా మరో వీడియోను విడుదల చేసింది. దయచేసి సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు.. అవన్నీ ఫేక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించింది.
సుప్రీత మాట్లాడుతూ..'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.' అంటూ వీడియోను రిలీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment