
హైదరాబాద్: యూట్యూబర్లు, పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిసున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వాళ్ల సంపాదన, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఆరా తీసిన ఈడీ.. వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి
Comments
Please login to add a commentAdd a comment