కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు చైనా కంపెనీలపై, ముఖ్యంగా రుణ యాప్‌లతో లింకులున్న సంస్థలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరుపుతోంది. వీటిలో కొన్ని కేసుల్లో దర్యాప్తు తుది దశలో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీల్లో మోసాలేమైనా జరిగాయా అనే కోణంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కొన్నింటిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణ జరుపుతున్నట్లు వివరించారు.
అక్రమంగా రుణ యాప్‌లను నిర్వహిస్తున్న కంపెనీలపై, అసలైన లబ్ధిదారు వివరాలను దాచి పెట్టే వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఎల్రక్టానిక్స్ .. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ఆర్‌బీఐ మొదలైన వాటి నుంచి వచ్చిన ఫిర్యాదులపై సదరు సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారి చెప్పారు. కొన్ని కంపెనీల నిధుల మూలాలను కనుగొనడం కష్టమే అయినప్పటికీ, నిర్థిష్టంగా లబ్ధి పొందే యాజమాన్య సంస్థను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment