Corporate Affairs Ministry
-
అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ (కార్పొరేట్ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్íÙప్ (ఎల్ఎల్పీలు)లకు అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రమాణాల విషయంలో ఆర్బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్ఎల్పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
తుది దశకు చైనా రుణ యాప్‌లపై దర్యాప్తు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు చైనా కంపెనీలపై, ముఖ్యంగా రుణ యాప్‌లతో లింకులున్న సంస్థలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరుపుతోంది. వీటిలో కొన్ని కేసుల్లో దర్యాప్తు తుది దశలో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీల్లో మోసాలేమైనా జరిగాయా అనే కోణంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కొన్నింటిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అక్రమంగా రుణ యాప్‌లను నిర్వహిస్తున్న కంపెనీలపై, అసలైన లబ్ధిదారు వివరాలను దాచి పెట్టే వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఎల్రక్టానిక్స్ .. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ఆర్బీఐ మొదలైన వాటి నుంచి వచ్చిన ఫిర్యాదులపై సదరు సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారి చెప్పారు. కొన్ని కంపెనీల నిధుల మూలాలను కనుగొనడం కష్టమే అయినప్పటికీ, నిర్థిష్టంగా లబ్ధి పొందే యాజమాన్య సంస్థను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
భారత్‌లో 53 చైనా కంపెనీల వ్యాపార కేంద్రాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యాప్ ద్వారా రుణాలు ఇచ్చే విషయమై ఇవి ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని తెలిపింది. విదేశీ కంపెనీ (భారత్‌కు వెలుపల ఏర్పాటైనది) దేశంలో వ్యాపార కేంద్రాలు తెరుచుకోవచ్చు. కాకపోతే ఇందుకు సంబంధించి ఆర్బీఐ, ఇతర నియతంణ్ర సంస్థల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌లో అటువంటి కేంద్రం తెరిచిన 30 రోజుల్లోపు రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజి్రస్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై బదులిచ్చారు. చట్టం పరిధిలో షెల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 7,700 కంపెనీల మూత సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీపేస్)ను ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన తర్వాత నుంచి, దీని కింద 7,700 కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసినట్టు లోక్‌సభకు రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. స్వచ్చందంగా వ్యాపార కార్యకలాపాల నుంచి తప్పుకోవాలనుకునే కంపెనీలకు, దాన్ని వేగవంతంగా సాకారం చేసేందుకు ఈ ఏడాది మే 1 నుంచి సీపేస్‌ను కార్పొరేట్ శాఖ తీసుకొచి్చంది. దీంతో ఒక కంపెనీ స్వచ్చంద మూసివేతకు పట్టే సమయం 110 రోజులకు తగ్గిపోయింది. -
31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్ అయ్యాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఉమ్మడి నష్టం ఇలా.. టాటా గ్రూప్ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
చిన్న సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్!
చిన్న సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ అప్ క్యాపిటల్, టర్నోవర్ థ్రెషోల్డ్‌లను ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం సంస్థలపై నిర్వాహణ భారం తగ్గడంలో సహాయ పడనుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యాపార నిర్వహణను మరింత సౌలభ్యం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం సవరించిన నిబంధనల మేరకు చిన్న సంస్థల చెల్లింపు మూలధనం (paid up capital) థ్రెషోల్డ్ గతంలో రూ. 2 కోట్లకు మించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి రూ. 4 కోట్లకు పెంచింది. ►అదేవిధంగా, రూ. 20 కోట్ల టర్నోవర్ థ్రెషోల్డ్‌ను రూ.40 కోట్లకు మించకుండా సవరించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సవరణలతో చిన్న కంపెనీల జాబితాలో మరిన్ని ఎంటిటీలు(సంస్థలకు) చేరనున్నాయి. ►మంత్రిత్వ శాఖ ప్రకారం..ఇకపై చిన్న కంపెనీలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో భాగంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను సిద్ధం చేయాల్సిన పనిలేదు. వార్షిక రిటర్న్‌ను ఫైల్ చేసుకోవచ్చు. ►చిన్న సంస్థలకు జరిమానాలు తక్కువగా పడనున్నాయి. అటువంటి సంస్థల వార్షిక రాబడిపై కంపెనీ సెక్రటరీ లేదా కంపెనీ సెక్రటరీ లేని చోట కంపెనీ డైరెక్టర్ సంతకం చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కలగనున్నాయి. -
ఆఫీసుల వెరిఫికేషన్ నిబంధనలకు మార్పులు ..
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం సంస్థల రిజిస్టర్డ్ చిరునామాలను అధికారులు భౌతికంగా ధృవీకరించుకునే నిబంధనలను కేంద్రం సవరించింది. వీటి ప్రకారం ఈ అంశంలో ఇకపై అధికారులు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ప్రసక్తి ఉండదు. సాధారణంగా ఏదైనా సంస్థ సరైన రీతిలో వ్యాపారం నిర్వహించడం లేదని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి అనుమానం కలిగినప్పుడు సదరు కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాకు వెళ్లి భౌతికంగా వెరిఫికేషన్ చేయవచ్చు. తాజా మార్పుల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో కంపెనీ నమోదైన ప్రాంతంలో ఉండే ఇద్దరు స్వతంత్ర సాక్షులు ఉండాలి. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. అలాగే కార్యాలయం ఫొటోనూ తీసుకోవాలి. ప్రాంతం, ఫొటోలు సహా వివిధ వివరాలతో కూడిన నివేదికను సవివరంగా రూపొందించాలి. -
ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త !
న్యూఢిల్లీ: ‘నిధి’ కంపెనీలపట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. నిబంధనలు పాటించడంలో కనీసం 348 కంపెనీలు విఫలమైనట్లు తెలియజేసింది. వెరసి పెట్టుబడులు చేపట్టేముందు కంపెనీ పూర్వాపరాలు పరిశీలించమంటూ ఇన్వెస్టర్లకు సూచించింది. గత ఆరు నెలల్లో నిధి కంపెనీలపట్ల జాగ్రత్త వహించమంటూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ రెండోసారి హెచ్చరించడం గమనార్హం! భారీ సంఖ్యలోని నిధి కంపెనీలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడంలేదని ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టం 2013, నిధి నిబంధనలు 2014ను అమలు చేయడంలో వైఫల్యం పొందుతున్నట్లు వివరించింది. నిధి కంపెనీలు బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 406తోపాటు, సవరించిన నిధి నిబంధనల ప్రకారం ఎన్‌డీహెచ్–4 కోసం దరఖాస్తు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. 2021 ఆగస్ట్ 4వరకూ చూస్తే నిధి చట్టంకింద దరఖాస్తు చేసిన కంపెనీలలో 348వరకూ తగినస్థాయిలో నిబంధనలను అందుకోలేకపోయినట్లు వెల్లడించింది. చదవండి : జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది -
ఈ 12 తప్పిదాలను నేరంగా చూడరు
సాక్షి, న్యూఢిల్లీ: లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ చట్టం (ఎల్ఎల్పీ) 2008 కింద 12 ఉల్లంఘనలు/తప్పిదాలను నేరపూరితం కానివిగా కేంద్రం మార్పు చేయనుంది. అదే విధంగా నేర బాధ్యతలను కలిగిన ఒక నిబంధనను సైతం తొలగించనుంది. చట్టబద్ధంగా పనిచేసే ఎల్ఎల్పీ సంస్థలు మరింత సులభంగా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు ఈ మార్పులను తీసుకురానున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది. (పెట్రో ధరల మోత : రికార్డు హై) ‘నిజాయితీ, నైతికతతో పనిచేసే కార్పొరేట్ వ్యాపారస్తులను సంపద సృష్టికర్తలు, జాతి నిర్మాణ రూపకర్తలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ కసరత్తు అన్నది వ్యాపార చట్టాల నుంచి హానికారక ఉద్దేశాల్లేని దోషాల నేరపూరితాన్ని తొలగించడమే. ఎల్ఎల్పీ చట్టంలో ఈ నిబంధనలను గుర్తించే పని కొనసాగుతోంది. ఈ విధమైన చట్ట ఉల్లంఘనలు ప్రజా ప్రయోజనాలకు ఎటువంటి హాని కలిగించనివి అయి ఉండి, ప్రస్తుతం జరిమానా, శిక్షలతో నేరపూరితంగా చూస్తున్నవే ఉంటాయి’ అని కార్పొరేట్ శాఖ పేర్కొంది. (ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం) -
సులభతర వాణిజ్యానికి ఎలక్ట్రానిక్ ఫామ్..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి కొత్త ఎలక్ట్రానిక్ ఫాంను కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త కంపెనీలు నమోదు చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ ఫాం ఉపయోగపడుతుందని సంబంధిత శాఖ పేర్కొంది. ఎన్‌పీఐసీఇ+ పేరుతో పది సేవలను కార్పొరేట్ మంత్రిత్వశాఖ అందించనుంది. ఎలక్ట్రానిక్ ఫాంతో పాటు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ రిజిష్ట్రేషన్ నెంబర్లను అందించనున్నారు. ఈ ఫామ్‌లో పది సేవలను పొందుపర్చడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, వ్యాపారం చేయాలనుకునే వారికి మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలపాయి. దేశ వృద్ధి రేటు పెంచే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రానిక్ ఫాం నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతగొనో ఉపయోగపడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రామపడుతున్నారు. -
ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను ఉల్లంఘించేలా ఇండిగో విర్వహణ పాన్‌షాపు కన్నా అధ్వానంగా మారిందని, మరో ప్రమోటరు రాహుల్ భాటియా తాను లబ్ధి పొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ గంగ్వాల్ సెబీకి, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులోని ప్రస్తావించిన ఆరోపణలకు పేరాల వారీగా వివరణనివ్వాలంటూ కంపెనీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గంగ్వాల్ గ్రూప్‌నకు 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటాలు ఉన్నాయి. గంగ్వాల్ రిస్కులు లేకుండా జాగ్రత్తపడ్డారు: భాటియా గ్రూప్ గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ (ఐజీఈ) తాజాగా మరో ప్రకటన చేసింది. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉన్నప్పటికీ గంగ్వాల్ మాత్రం తనకు రిస్కులు తక్కువగా ఉండేలా చూసుకున్నారని పేర్కొంది. భాటియా, ఆయన తండ్రి కపిల్ భాటియా దాదాపు రూ. 1,100 కోట్ల దాకా సొంత పూచీకత్తునిచ్చారని, గంగ్వాల్ మాత్రం ఈక్విటీ రిస్కులు రూ. 15 కోట్లు కూడా మించకుండా జాగ్రత్తపడ్డారని ఐజీఈ పేర్కొంది. తన బాధ్యతలు సరిగ్గా పాటించని వ్యక్తి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. -
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై చర్యలకు నో
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని గ్రూప్ సంస్థలపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్ని చర్యలపై స్టే విధిస్తూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశాలిచ్చింది. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించి 90 రోజుల మారటోరియం విధించాలన్న అభ్యర్ధనను ఎన్సీఎల్టీ తోసిపుచ్చడంతో.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. 90 రోజుల మారటోరియంపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా గ్రూప్‌నకు అత్యధికంగా రుణాలిచ్చిన 5 ఆర్థిక సంస్థలకు ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ సూచించింది. ‘తదుపరి ఉత్తర్వులిచ్చే దాకా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని 348 అనుబంధ సంస్థలపై ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే విధించడమైనది’ అని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 13కి వాయిదా వేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణభారం దాదాపు రూ. 90,000 కోట్ల మేర ఉంది. రుణాలను చెల్లించని పక్షంలో రుణదాతలు కంపెనీపై దావాలు వేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్టీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. మారటోరియం విధించిన పక్షంలో కంపెనీని వేగంగా గట్టెక్కించడానికి తగు ప్రణాళికలను రూపొందించడానికి కొత్త బోర్డుకు అవసరమైన సమయం దొరుకుతుందని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ లాయర్ విన్నవించారు. అది జరగకపోతే కంపెనీ దేశవ్యాప్తంగా 70–80 దావాలు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిపారు. టర్మ్ రుణం, కార్పొరేట్ రుణం, డిబెంచర్లు మొదలైనవి వెంటనే చెల్లించాలంటూ రుణదాతల నుంచి ఒత్తిళ్లు రాకుండా అపీలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అలాగే, తమ వద్ద ఉన్న కంపెనీ నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల కింద సర్దుబాటు చేసుకోవడానికి కూడా వీల్లేదని పేర్కొంది. కంపెనీకి ఊరట.. ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులతో రుణదాతల ఒత్తిళ్ల నుంచి కొంత ఊరట లభించగలదని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగు పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు కొత్త బోర్డుకు అవకాశం లభిస్తుందని వివరించింది. మరోవైపు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ స్వాగతించింది. భారీ రుణాల చెల్లింపు కన్నా జీతాల చెల్లింపు, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ముఖ్యమని పేర్కొంది. -
దివాలా అస్త్రంతో రూ. 83,000 కోట్లు వసూలు
సాక్షి, న్యూఢిల్లీ : మొండిబకాయిలకు చెక్ పెట్టేలా కొత్తగా తీసుకువచ్చిన దివాలా చట్టం (ఐబీసీ) ప్రయోగిస్తే తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవలసి వస్తుందనే భయంతో పెద్దసంఖ్యలో కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2100 కంపెనీలు తమ బకాయిలను చెల్లించాయి. ఇప్పటివరకూ రూ 83,000 కోట్ల బకాయిలు పరిష్కారమయ్యాయి. 90 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే ఆయా రుణాలను ఎన్పీఏలుగా ప్రకటిస్తూ వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించేలా దివాలా చట్టానికి మార్పులు చేపట్టిన అనంతరం రుణ బకాయిలు పెద్ద ఎత్తున వసూలవుతున్నాయని ఈ గణాంకాలు వెల్లడించాయి. బకాయిలను చెల్లిస్తేనే ప్రమోటర్లను వారి సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనేలా చట్ట సవరణ చేయడంతో బడా కంపెనీలు సైతం బకాయిల చెల్లింపునకు ముందుకొస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకుండా వేలంలో పాల్గొంటే తిరిగి ప్రమోటర్లే వారి సంస్థలను భారీ డిస్కౌంట్‌తో దక్కించుకుంటారని ప్రభుత్వం వాదిస్తోంది. రుణ ఎగవేతదారులపై ఒత్తిడి పెంచడంతో బకాయిలు వసూలవుతున్నాయని, రుణాల జారీ..రుణ వితరణలో నూతన దివాలా చట్టం మెరుగైన మార్పులను తీసుకువచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
డొల్ల కంపెనీలకు ఐటీ షాక్..
న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ రద్దయిన డొల్ల కంపెనీల నుంచి కోట్ల కొద్దీ రూపాయల పన్ను బకాయిలను రాబట్టుకోవడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి పెట్టింది. ఇందుకోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఎన్సీఎల్టీ బెంచ్‌లలో ఇందుకు సంబం ధించిన పిటిషన్లు దాఖలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాల్ని ఏర్పాటు చేయాలంటూ ఐటీ విభాగాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. ఈ విషయంలో తోడ్పాటు అందించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. బ్లాక్‌మనీ, మోసపూరిత వ్యాపార కార్యకలాపాలపై కొరడా ఝళిపించే క్రమంలో 2.26 లక్షల పైచిలుకు డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం ఇటీవల రద్దు చేయటంతో న్యాయబద్ధంగా రావాల్సిన కోట్ల కొద్దీ రూపాయల పన్నుల బాకీల వసూళ్లు నిల్చిపోయాయని సీబీడీటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్
న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టం-2013లోని మరో 10 చాప్టర్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ బోర్డులో డెరైక్టర్ల నియామకం, వాళ్లకుండే అధికారాలు-అర్హతలు, బోర్డు సమావేశాలు, డివిడెండ్ల ప్రకటన-చెల్లింపు ఇతరత్రా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆరు దశాబ్దాలనాటి పాత చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త కంపెనీల చట్టం అమల్లోకి రానుంది. కంపెనీల ఏర్పాటు, సెక్యూరిటీల కేటాయింపు, వాటా మూలధనం, డిబెంచర్లు వంటివాటికి సంబంధించిన చాప్టర్లు కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన చాప్టర్లలో ఉన్నాయి. కాగా, 180కి పైగా సెక్షన్లకు సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు వెలువడగా, మొత్తం షెడ్యూళ్లన్నింటినీ ఇప్పటికే నోటిఫై చేయడం తెలిసిందే. ఈ కొత్త చట్టంలో మొత్తం 29 చాప్టర్లు, 7 షెడ్యూళ్లు, 470 సెక్షన్లు ఉన్నాయి. మిగతా నిబంధనలను ఎప్పటికల్లా నోటిఫై చేస్తారు, వాటికి కంపెనీలు పాటించేందుకు ఏదైనా అదనపు గడువు ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ ఇండియా ఎల్ఎల్పీకి చెందిన యోగేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టులో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కొత్త కంపెనీల చట్టానికి సబంధించిన ఉత్తర్వుల జారీకి ఈ నెల 20న ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది. కంపెనీ బోర్డుల్లో మహిళా వాణి... కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం ఇకపై చాలావరకూ కంపెనీలు తమ డెరైక్టర్ల బోర్డులో కనీసం ఒక మహిళకు స్థానం కల్పించాల్సిందే. అదేవిధంగా ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్ల నియామకం కూడా తప్పనిసరి. లిస్టెడ్ కంపెనీల్లో చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా తమతరఫున ఒక డెరైక్టర్ కోసం డిమాండ్ చేస్తే నియమించాల్సి వస్తుంది కూడా. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్అప్ షేర్ క్యాపిటల్ ఉన్న లిస్టెడ్, పబ్లిక్ సంస్థలన్నీ కూడా ఒక మహిళా డెరైక్టర్‌ను నియమించుకోవాలని కొత్త నిబంధనలు నిర్ధేశిస్తున్నాయి. కాగా, చిన్న షేర్ హోల్డర్ల తరఫున డెరైక్టర్‌ను నియమించాలంటే కనీసం 1,000 మంది లేదా మొత్తం చిన్న వాటాదార్లలో పదింట ఒకటో వంతు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. -
సీఏ విద్యార్థులకు టీవీ చానెల్
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థుల కోసం ద ఇన్స్టిట్యూట్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఒక టెలివిజన్ ఛానెల్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. దీంతో పాటు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను, క్లౌడ్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా సీఏ విద్యార్ధులకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అందించాలనుకుంటున్నామని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ కె. రఘు బుధవారం తెలిపారు. స్కామ్‌ల కట్టడికి పటిష్ట మార్గదర్శకాలు: ఐసీఏఐ కార్పొరేట్ కుంభకోణాలని కట్టడి చేసే దిశగా చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఇందుకోసం కార్పొరేట్ వ్యవహారాల శాఖతో కలిసి పనిచేస్తోందని రఘు తెలిపారు.