అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్‌ సంస్థలు | Accounting standards for banking, insurance sectors soon | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్‌ సంస్థలు

Published Tue, Jul 2 2024 6:30 AM | Last Updated on Tue, Jul 2 2024 8:03 AM

Accounting standards for banking, insurance sectors soon

ఐసీఏఐతో కలసి కేంద్ర సర్కారు చర్యలు

న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్‌ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్‌ గోవిల్‌ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్‌ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్‌ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్‌ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. 

దేశంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ (కార్పొరేట్‌ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌íÙప్‌ (ఎల్‌ఎల్‌పీలు)లకు అకౌంటింగ్‌ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్‌ ప్రమాణాల విషయంలో ఆర్‌బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్‌ఎల్‌పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement