auditing
-
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఎనిమిదో స్థానంలో ‘సాక్షి’
సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఆడిటింగ్‌లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్ సహా) దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యులేషన్‌తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తున్నట్లు ఏబీసీ వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలుతాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్‌లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్ భాస్కర్ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్‌తో దైనిక్ జాగరణ్ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్‌తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్) నాలుగో స్థానంలో నిలిచింది. -
అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ (కార్పొరేట్ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్íÙప్ (ఎల్ఎల్పీలు)లకు అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రమాణాల విషయంలో ఆర్బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్ఎల్పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు. -
బిల్లులు లేకుండానే ఆడిట్లు పూర్తి.. ఆడిట్‌పై అనుమానాలు!
దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత ఐదేళ్ల కాలంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడిట్ ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అధికారులు, పాలక వర్గాలతో జతకట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీతిలాపాపం తలా పిడికెడుంశ్రీ అన్న చందంగా ఆడిట్ సమయంలో జీపీల వారీగా కమీషన్లు తీసుకొని బిల్లులు లేకుండానే ఆడిట్ పూర్తి చేశారనే ఆరోపణలకు ఇటీవల బయటపడుతున్న అక్రమాలు అద్దం పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఈ ఐదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ వచ్చాయి. వీటిని కొందరు సర్పంచ్‌లు సక్రమంగా ఖర్చు చేయకుండా దుర్వినియోగానికి పాల్పడి రూ.లక్షల నిధులు స్వాహా చేసినట్టు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ► నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జనవరి 5న మఠంపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను హుజూర్నగర్ ఆర్డీఓ స్వాధీనం చేసుకొని విచారణ నిర్వహించారు. 49 చెక్కుల ద్వారా రూ.74.84లక్షలను ఎంబీలు లేకుండా డ్రా చేశారని, వీటిని రికవరీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో రూ.లక్షల నిధులు దుర్వినియోగమైనట్టు అధికారులు విచారణలో గుర్తించారు. ► మేళ్లచెరువు గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు వార్డు మెంబర్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించాగా జనవరి 5న కోదాడ ఆర్డీఒ నేతృత్వంలోని బృందం జీపీ రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. దీంట్లో దాదాపు రూ.2కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. స్థానిక సర్పంచ్‌కు నోటీసులు జారీ చేసి 45 రోజుల్లో నిధులు రికవరీ చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదికి రూ.45 కోట్లు జిల్లాలో మొత్తం 475 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఒక్కో వ్యక్తికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రతినెలా రూ.335, కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.201.46 చొప్పున గ్రాంట్ వస్తుంది. ఇవీకాక ఉపాధి నిధులు, రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖలకు వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇచ్చే సీడీపీ నిధుల్లో 75 శాతం కోత విధించి వాటిని కూడా ప్రభుత్వం పంచాయతీలకే మళ్లిస్తోంది. దీంతో జీపీలకు ఏడాదికి రూ.45 కోట్ల నిధులు విడుదలవుతున్నాయి. ఆడిట్లో అభ్యంతరాలు కనబడలేదా..! పంచాయతీ పాలకవర్గం ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఖర్చు చేసిన ప్రతిపైసాకు బిల్లులు చూపించాలి. అయితే గత ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో చేసిన పనులకు 2019–20 నుంచి 2022–23 వరకు అంటే నాలుగేళ్ల ఆడిట్‌ను పూర్తి చేశారు. ఈ సమయంలో కొన్ని అభ్యంతరాలను గుర్తించిన తర్వాత బిల్లులు చూపడంతో క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతవరకు భాగానే ఉన్నా కొన్ని పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేసి నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. అయితే ఇక్కడే ఆడిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆడిట్ చేసిన సమయంలో ఉన్న బిల్లులు ఇప్పుడెందుకు లేవనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆడిట్ సమయంలో బిల్లులు లేకున్నా అధికారులు కమీషన్ల కోసం కళ్లు మూసుకున్నారా.. లేక దొంగ బిల్లులు కావడంతో ఇప్పుడు చూపడం లేదా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. పంచాయతీల్లో ఖర్చు చేసిన నిధులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆడిట్ సంస్థల్లో లోపాలు
న్యూఢిల్లీ: బిగ్–4 ఆడిటింగ్ కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఎంటెటీలలో ఆడిటింగ్ కార్యకలాపాల పరంగా లోపాలు ఉన్నట్టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) గుర్తించింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ, బీఎస్ఆర్ అండ్ కో ఎల్ఎల్పీ, ఎస్ఆర్బీసీ అండ్ కో ఎల్ఎల్పీ, ప్రైస్ వాటర్ హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ఎల్పీ సంస్థల్లో ఆడిట్ నాణ్యత తనిఖీలను ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించగా ఈ లోపాలు వెలుగు చూశాయి. ప్రైస్ వాటర్ హౌస్, డెలాయిట్, ఈవై, కేపీఎంజీలను బిగ్–4 ఆడిటింగ్ సంస్థలుగా చెబుతారు. సంస్థల నాణ్యత నియంత్రణలను ఎన్ఎఫ్ఆర్ఏ పరిశీలించింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించి వార్షిక స్టాట్యూటరీ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అధ్యయనం చేసింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ ఎల్ఎల్పీకి సంబంధించి ఆరు లోపాలను గుర్తించింది. బీఎస్ఆర్ అండ్ కోకు సంబంధించి కూడా ఆరు లోపాలు బయటపడ్డాయి. -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది. -
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
బైజూస్‌లో ఏం జరుగుతోంది? ఆడిటర్‌గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
కొత్త విభాగాల్లోకీ ఆడిట్ విస్తరణ
పంజిమ్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొత్త విభాగాల్లోనూ ఆడిటింగ్‌ను పరిశీలిస్తోంది. నీడి అడుగున వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆడిటింగ్ చేయనున్నట్టు, మరిన్ని నివేదికలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు కాగ్ గిరీష్ చంద్ర ముర్ము చెప్పారు. జీ20 దేశాలతో కూడిన ఎస్ఐ20 మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాగ్ గిరీష్ చంద్ర మాట్లాడారు. డేటా ప్రామాణీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఆడిట్లను మరింత సులభంగా, వేగంగా చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలు, శాఖలతో సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్పారు. ‘‘కొంత వరకు డేటా ప్రామాణీకరణ పట్ల అంగీకారం కుదిరింది. గతేడాదే పదేళ్ల రికార్డును అధిగమించాం. ఆడిట్ నివేదికలను మరిన్ని విడుదల చేస్తాం. డేటా ప్రాసెసింగ్, నివేదిక రూపకల్పన మరింత వేగాన్ని అందుకుంటుంది. నివేదికల రూపకల్పనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను (డిజిటల్ ఆడిట్లు) వినియోగించుకుంటాం’’అని గిరీష్ చంద్ర తెలిపారు. కాగ్ ఈ ఏడాది నుంచే డిటజిటల్ ఆడిట్ల విడుదలను ప్రారంభించడం గమనార్హం. వివిధ శాఖల పరిధిలో నిధుల కేటాయింపులు, వినియోగం పద్దులపై కాగ్ ఆడిటింగ్ చేసి, పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముందు నివేదికలను ఉంచుంతుంది. షిప్పింగ్, నీటి అడుగు నుంచి వెలికితీసే ఆయిల్ అండ్ గ్యాస్ తదితర నూతన విభాగాల్లోనూ ఆడిట్ చేయాలన్నది తమ ఉద్దేశమ్యని గిరీష్ చంద్ర చెప్పారు. కాగా, బ్లూ ఎకానమీ (సముద్రం ఆధారిత) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఈ సమావేశం చర్చించింది. -
అంతర్జాతీయ స్థాయిలో మన ఆడిటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్వాయిస్ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ.459.98 కోట్ల సొమ్మును చట్టవిరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, తదితరాల్లోకి మళ్లించినట్లు ఆడిటింగ్‌లో అధికారులు నిర్ధారించారు. తద్వారా చందాదారుల సొమ్మును తమ వ్యక్తిగత లబ్ధి కోసం రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజ వినియోగించుకున్నట్లు స్పష్టమైంది. తాజాగా ప్రతి చిట్ గ్రూపులో ఖాళీ చిట్లు, కంపెనీ పాడుకునే రెండో నెల చిట్ల లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. మార్గదర్శి మేనేజర్లు సమర్పించిన మినిట్స్‌ను విశ్లేషించిన ఆడిట్ అధికారులు ఈ మోసాలను గుర్తించారు. ఖాళీ చిట్లకు గానీ, ప్రతి చిట్ గ్రూపులో కంపెనీ పాడుకునే రెండో నెల చిట్కు సంబంధించి గానీ ఎటువంటి సొమ్ము (నెల వారీ చందా) చెల్లించలేదని వెల్లడైంది. ప్రతి చిట్ గ్రూపులో రెండో నెల చిట్ పాటను కంపెనీయే పాడుకునే అవకాశం ఉంది. అందుకోసం అందరి చందాదారుల మాదిరిగానే కంపెనీ కూడా చందా కట్టాలి. కానీ చందా కట్టకుండానే ఆ రెండో నెల చిట్‌ను పాడుకుని కంపెనీ జమ చేసుకుంటోంది. కంపెనీ తరఫున కట్టా ల్సి న ఎటువంటి చందాలు కట్టకుండానే ప్రతి నెలా ప్రతి గ్రూపు నుంచి 5 శాతం కమీషన్‌ను తీసుకుంటోంది. ఆధారాలతో సహా వెలుగుచూసిన అక్రమాలు.. గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మార్గదర్శి యూనిట్లలో ఈ మోసాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఐదు చిట్ గ్రూపులను విశ్లేషించగా వాటి ద్వారా రూ.1.18 కోట్లను చిట్ కమీషన్‌గా, రూ.1.73 కోట్లను రెండో నెల పాడుకున్న చిట్ సొమ్ముగా కంపెనీ జమ చేసుకుంది. కానీ పాడుకున్న రెండో నెల చిట్ చందా.. అలాగే ఆ గ్రూపులో తన పేరు (ఫోర్‌మెన్) మీద ఉంచుకున్న ఖాళీ చిట్లకు చెల్లించా ల్సి న చందా సొమ్ము రూ.6.98 కోట్లు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 12 చిట్ గ్రూపులను విశ్లేషించినప్పుడు ఫోర్‌మెన్ కమీషన్ రూ.60.50 లక్షలు, రెండో నెల పాడుకున్న చిట్ మొత్తం రూ.1.05 కోట్లను కంపెనీ ఖాతాలో వేసుకున్నారు. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రెండో నెల చిట్ చందాలు, కంపెనీ పేరు మీద ఉన్న ఖాళీ చిట్ల చందాల మొత్తం రూ.54.85 లక్షలు కట్టలేదని తేలింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 28 చిట్ గ్రూపులను పరిశీలించినప్పుడు వాటికి ఫోర్‌మెన్ కమీషన్ రూ.3.47 కోట్లు, రెండో నెల పాడుకున్న చిట్ల మొత్తం రూ.2.73 కోట్లను కంపెనీ తీసుకుంది. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రూ.2.88 కోట్ల చందా సొమ్మును కట్టలేదు. భారీగా ఉల్లంఘనలు.. నెల వారీగా చందాదారులతోపాటు కట్టా ల్సి న సొమ్మును కట్టకుండానే కమీషన్ తీసుకోవడం, ప్రతి గ్రూపులోనూ చందా కట్టకుండానే రెండో నెల చిట్‌ను పాడుకుని ఆ సొమ్మును తీసుకోవడం ద్వారా మార్గదర్శిలో చిట్లు వేసిన వారిని రామోజీరావు, ఆయన కోడలు శైలజ మోసం చేసినట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును పణంగా పెట్టి భారీగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఖాళీగా ఉన్న చిట్లకు సంబంధించి ఎటువంటి చందా చెల్లించకుండా మిగిలిన చందాదారులను మభ్యపెట్టినట్లు తేలింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సంబంధిత మార్గదర్శి బ్రాంచ్‌లను ఆదేశించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. -
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
ట్యాక్స్ ఆడిటింగ్.. సకాలంలో రిపోర్టు సమర్పించకపోతే భారీ పెనాల్టీలు, ఎంతంటే?
ఇప్పుడు ప్రపంచమంతటా వినబడే మాట ఆడిటింగ్. ప్రతి వ్యవహారాన్ని నిర్వహించిన తర్వాత చెక్ చేస్తున్నారు. తనిఖీ అనుకోండి .. సమీక్ష అనుకోండి.. శోధన అనుకోండి. ప్రతి చట్టంలోనూ ‘‘ఆడిటింగ్’’ చేయాలని చెబుతున్నారు. అలా ఆదాయపు చట్టంలో కూడా ఒక ఆడిట్ ఉంది. దాని పేరు ‘‘ట్యాక్స్ ఆడిట్’’. కొన్ని నిబంధనల ప్రకారం వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల అకౌంట్స్‌ను ఆడిట్ చేయించాలి. ఎందుకు చేయించాలి? అసెసీలు సరైన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నిర్వహిస్తున్నారా లేదా? సరిగ్గా అన్నీ క్లెయిమ్ చేస్తున్నారా లేదా? మోసపూరితమైన వ్యవహారాలు జరిగాయా? అనేది చూసేందుకు దీన్ని నిర్దేశించారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల ఆదాయపు అధికారులకు పని ఒత్తిడి తగ్గుతుంది. టైమ్ వృధా కాదు. ఈ ఆడిట్ ఎవరు చేస్తారు.. ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు మాత్రమే ఈ ఆడిట్ చేయాలి. తర్వాత వారు రిపోర్టును ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ రూపంలో ఇవ్వాలి. ఈ ఆడిట్ ఎవరు చేయించాలి.. ఒక వ్యాపారి అమ్మకాలు, టర్నోవరు, స్థూల వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి దాటితే ఆడిట్ చేయించాలి. వృత్తి నిపుణులైతే వారి వార్షిక వసూళ్లు రూ. 50 లక్షలు దాటితే ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులు రూ. 1 కోటి దాటినా, రెండు కోట్ల లోపల ఉంటే నిర్దేశించిన శాతం మేరకు ‘‘లాభ’’ శాతం ఆదాయంగా డిక్లేర్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ వర్తించదు. అంతే కాకుండా రూ. 10 కోట్ల లోపు టర్నోవరు ఉన్నవారికి వారి నగదు వ్యవహారాలు – వసూళ్లు – చెల్లింపులు టర్నోవరులో 5 శాతం దాటకపోతే వారికీ మినహాయింపు ఉంది. దీనర్థం ఏమిటంటే నగదు వ్యవహారాలను కట్టిపెట్టి అంతా బ్యాంకు ద్వారా చేయించడమే. ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ అంటే.. ఇది ఆడిట్ రిపోర్ట్ ప్రొఫార్మా. దీని ప్రకారం అన్ని విషయాలు తెలియజేయాలి. ఇందులో వంద పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అమ్మకాలు, ఆదాయాలు, అప్పులు, ఆస్తులు, చెల్లింపులు, ఖర్చులు ఇలా అన్నీ ఎంతో వివరంగా ఇవ్వాలి. పూర్తిగా ఇవ్వాలి. వివరణ, విశ్లేషణ ఉంటాయి. తప్పులు, ఒప్పులు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు.. ఒకటేమిటి అన్నింటినీ డేగకన్నుతో చూస్తారు. సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ.. ఈ ఆడిట్ రిపోర్టును సమర్పించడానికి గడువు తేదీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30. ఆడిట్ రిపోర్టుతో పాటు రిటర్నులు కూడా సమర్పించాలి. అన్నింటికీ గడువు తేదీ సెప్టెంబర్ 30. గత సంవత్సరంలో ఈ గడువుని పొడిగిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పొడిగించరండి! భారీ– భారీ పెనాల్టీలు వడ్డిస్తారు.. సకాలంలో ఆడిట్ రిపోర్టు సమర్పించకపోతే పెనాల్టీ వడ్డిస్తారు. రూ. 1,50,000 లేదా టర్నోవరు మీద 5 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం వడ్డిస్తారు. వడ్డించే ముందు మర్యాదపూర్వకంగా పిలిచి అన్ని వివరాలూ అడిగి, ఆలస్యానికి కారణం సమంజసమేనని అనిపిస్తే వడ్డించరు. లేదంటే వడ్డన తప్పదు. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిట్‌కు రంగం సిద్ధం
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్ అధికారి ఆధ్వర్యంలో ఆడిటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మాన్సాస్ కార్యాలయానికి అధికారులు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి హిమబిందు మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ఆడిట్ 2004-05 నుంచి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఆడిట్‌కి సంబంధించిన మొత్తం రికార్డులు అడిగామని.. ప్రస్తుతానికి కొన్ని హార్డ్‌కాపీలు మాత్రమే అందజేశారని తెలిపారు. పూర్తిస్థాయి రికార్డులు ఇస్తేగానీ ఆడిట్ చేయలేమని ఆమె తెలిపారు. మిగిలిన రికార్డ్స్ కోసం మాన్సాస్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్
-
కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్‌ను ఇకపై కాగ్ ద్వారా ఆడిట్ చేయాలని పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శక పాలన అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలకమండలి ఆగస్ట్ 28న నిర్ణయం తీసుకోగా, తాజాగా ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. టీటీడీలో ప్రతి సంవత్సరం అంతర్గత ఆడిటింగ్‌తో పాటు ప్రభుత్వం ద్వారా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ నిర్వహించే విధానం కొనసాగుతోంది. టీటీడీ ఆదాయ, వ్యయాలపై తరచూ ఆరోపణలు వస్తుండటం, సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తుండటంతో, ఇలాంటి దుష్ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఇది వరకే టీటీడీలో కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో పాలకమండలి కూడా ఈ అంశంపై తాజాగా జరిగిన సమావేశంలో చర్చించింది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు, విరాళాలు అందించే దాతలకు భరోసా కల్పించేలా కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. 2020–21 సంవత్సరం నుంచే ఈ ప్రక్రియని ప్రారంభించాలని, సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కోరిన మేరకు 2014–15 నుంచి 2019–20 వరకు కాగ్ ద్వారా ప్రత్యేకంగా ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ పాలక మండలి తీర్మానం చేసింది. ఇదే అంశాన్ని హైకోర్టుకి తెలియపర్చాలని అధికారులనూ ఆదేశించింది. అయితే, ఇది వరకే ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్న కారణంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీటీడీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ -
రిజిస్ట్రేషన్ శాఖలో వసూల్ రాజాలు
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలు, అవినీతిని వెలికి తీయాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ప్రతి నెలా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించాల్సిన అధికారులు జల్సాలు, మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి నెల్లూరు: జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో 9 కార్యాలయాలు, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భూముల విలువలను తారుమారు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆ శాఖ తేల్చిన ఆడిట్ రిపోర్టులే అద్దం పడుతున్నాయి. కొంత కాలంగా రెండు జిల్లాల పరిధిలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అయితే ఆడిట్ శాఖ సైతం అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటుంది. ♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్, సవరణ లీజు అగ్రిమెంట్, వీలునామా, జీపీఏ కమ్ సేల్, జనరల్ పవర్, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలకు సక్రమంగా స్టాంప్ డ్యూటీ చెల్లించారా? లేదా? అనే విషయాలను ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం నిగ్గు తేల్చుతోంది. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు తేలితే వెంటనే పెనాల్టీ వేసి, సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసు పంపిస్తోంది. ♦అయితే మార్కెట్ విలువ ప్రకారమే స్టాంప్ డ్యూటీ సక్రమంగా చెల్లించి ఉంటే జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ వద్ద అప్పీల్ చేసుకుని సరిచేసుకోవచ్చు. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపులో నిజంగా తేడా ఉంటే సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఓనర్‌కు పెనాల్టీ చెల్లించాలని నోటీసు అందిస్తారు. ♦రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం అధికారులు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉన్నాయని సాకు చూపుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో నిషేధిత భూములు జాబితాలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ భూములకు సైతం సబ్ రిజిస్ట్రార్లు కాసుల కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ♦నెలవారీగా అధికారులు నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లో ఆయా రిజిస్టేషన్లకు రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్‌లో జాప్యం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఆడిట్ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నల్ ఆడిటింగ్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చేయి తడిపిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిటింగ్ పూర్తి చేసి పెనాల్టీలు లేకుండా సరి చేసిన ఉదంతాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాల్లో మాత్రం ఆడిట్ చేయకుండా నెట్టుకొచ్చాడు. ఆ అధికారి తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆర్ఓ నెల్లూరులో గతేడాది నవంబర్ నుంచి ఆడిట్ జరగలేదు. దాదాపు 318 డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీలో తేడాలున్నట్లు నిర్ధారణ చేశారు. ♦నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెంలో గతేడాది డిసెంబర్ నుంచి ఆడిటింగ్ జరగలేదు. స్టౌన్‌హౌస్‌పేట రిజిస్ట్రార్ కార్యాలయంలో 136 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు నిర్ధారించారు. ♦ఉదయగిరి, వింజమూరు, అల్లూరు, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆడిట్ నిర్వహించలేదు. ♦గూడూరు జిల్లా పరిధిలో గూడూరు ఆర్ఓ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గతేడాది డిసెంబర్ నుంచి ఆడిట్ నిర్వహణ జరగలేదు. ఆ కార్యాలయంలో సుమారు 62 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ♦బుజబుజనెల్లూరు, ఇందుకూరుపేట, కోట, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జనవరి నుంచి ఆడిట్ నిర్వహణ చేయలేయకపోవడం గమనార్హం ♦ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా అధికారి ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను టీమ్‌గా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆడిటింగ్ నిర్వహణ చేయించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పాత తేదీలతో అధికారి సంతకాలు చేసేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆ ఎత్తుగడకు చెక్ పెట్టారు. రూ.3.23 కోట్ల రికవరీపై దృష్టి ఏదీ జిల్లాలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. ఇందులో అత్యధికంగా 648 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి సొమ్మును రికవరీ చేసినట్లు చెబున్నా.. సగం కూడా లేకపోవడం గమనార్హం. 648 డాక్యుమెంట్లకు సుమారు రూ.2.51 కోట్లు ఉంటే.. మిగిలిన 285 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.3.23 కోట్ల రికవరీ చేయాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి వసూళ్లు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆడిటింగ్ విభాగంపై చర్యలుంటాయి మా శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. వారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడిట్లో గుర్తించిన అక్రమాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్లు పైనే రికవరీ పెండింగ్ ఉంది. త్వరలోనే రికవరీ చేస్తాం. – అబ్రహం, డీఐజీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
పైపైన ఆడిటింగ్.. సంక్షోభానికి కారణం
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన జాయ్‌థామస్ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు కాని బకాయిలను (ఎన్పీఏలు) వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపించడం వెనుక బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు థామస్ అంగీకరించారు. అలాగే, పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ పుస్తకం రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్ల మేర ఒక్క హెచ్‌డీఐఎల్ ఖాతాకు (73 శాతం) నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన విషయాన్ని దాచడంలోనూ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు థామస్ పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంకుకు ముగ్గురు ఆడిటర్లు ఉండగా, వీరిలో ఎవరి పేరునూ థామస్ తన లేఖలో పేర్కొనలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదిక ప్రకారం.. లక్డావాల్ అండ్ కో, అశోక్ జయేష్ అండ్ అసోసియేట్స్, డీబీ కేట్కార్ అండ్ కో సంస్థలు స్టాట్యుటరీ ఆడిటర్లుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో థామస్ లేఖ కూడా భాగంగా ఉంది. థామస్‌తోపాటు, బ్యాంకు చైర్మన్ వర్యమ్‌సింగ్, హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ వాద్వాన్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 2008 నుంచి గోప్యంగానే.. బ్యాంకు వృద్ధి క్రమంలో ఉండడంతో ఆడిటర్లు సమయాభావం వల్ల కేవలం పెరిగిన అడ్వాన్స్‌లను (రుణాలు) చూశారే కానీ, మొత్తం బ్యాం కు ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాలను పరిశీలించలేదని థామస్ తన లేఖలో వివరించా రు. బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం తోనే భారీ రుణ ఖాతాల సమాచారాన్ని 2008 నుంచి ఆర్బీఐకి తెలియజేయకుండా గుట్టుగా ఉంచినట్టు థామస్ తెలిపారు. చెల్లింపుల్లో జా ప్యం ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా హెచ్‌డీఐఎల్ ఖాతాను స్టాండర్డ్‌గానే చూపించామన్నారు. రంగంలోకి ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి (ఐసీఏఐ) పీఎంసీ బ్యాంకు వ్యవహారంలో రంగంలోకి దిగింది. పీఎంసీ బ్యాంకులో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆడిటర్ల పాత్రను తేల్చేందుకు గాను ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి సమాచారం కో రింది. ఆర్బీఐ విజిలెన్స్ విభాగం, మహా రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కమిషనర్‌కు లేఖ రాసింది. తాము గుర్తించిన వివరాలు, ఆడిటర్ల పాత్ర అందులో ఏమైనా ఉందా అన్న వివరాలను తెలియజేయాలని కోరినట్టు ఏఐసీఏఐ తెలిపింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా బ్యాంకు స్టాట్యుటరీ ఆడిటర్ల నుంచి కోరినట్టు వెల్లడించింది. ఆడిటర్ల పాత్ర ఉన్నట్టు తేలితే ఐసీఏఐ తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పీడబ్ల్యూసీపై సెబీ నిషేధానికి శాట్ నో
న్యూఢిల్లీ: ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) ఇండియాకు ఊరట లభించింది. లిస్టెడ్ కంపెనీలకు ఆడిటింగ్ సేవలు అందించకుండా ఆ సంస్థ విభాగంపై సెబీ విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. ఆడిటింగ్ సంస్థను నిషేధించే అధికారం సెబీకి లేదని స్పష్టం చేసింది. కేవలం ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) మాత్రమే ఆడిటర్లపై చర్యలు తీసుకోగలదని పేర్కొంది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ఆధారంగా ఆర్థిక మోసాలను నిరూపించలేరని శాట్ అభిప్రాయపడింది. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకుండా సెబీ తీసుకున్న చర్యలు చెల్లుబాటు కావని పేర్కొంది. లిస్టెడ్ కంపెనీలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆడిటింగ్ సర్టిఫికెట్లు జారీ చేయకూడదంటూ పీడబ్ల్యూసీకి చెందిన సంస్థలపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ సెబీ 2018 జనవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2009 జనవరి 8న సత్యం కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయని, కొంత కాలంగా పుస్తకాల్లో రూ.5,004 కోట్ల మేర వాస్తవాలను దాచిపెట్టినట్టు ఆ సంస్థ చైర్మన్ రామలింగ రాజు స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో ఆడిటింగ్ కంపెనీ పాత్ర ఉందని సెబీ దర్యాప్తులో తేలింది. పీడబ్ల్యూసీ బెంగళూరుతోపాటు, ఆ సంస్థ భాగస్వాములు ఎస్ గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి ఐసీఏఐ ఆడిటింగ్ ప్రమాణాల మేరకు నడుచుకోలేదని సెబీ గుర్తించింది. సెబీ ఆదేశాలను పీడబ్ల్యూసీ శాట్‌లో సవాలు చేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణంలో రెండు అతిపెద్ద ఆడిటింగ్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్ (కేపీఎంజీ సంస్థ)ల పాత్రపై నియంత్రణ సంస్థలు, ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు జరుగుతున్న సమయంలో శాట్ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం గమనర్హాం. ఇతరుల అధికార పరిధిలోకి చొరబడరాదు భవిష్యత్తులో సెబీ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగానూ శాట్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇతర నియంత్రణ సంస్థలు లేదా ఐసీఏఐ వంటి పరిశ్రమ బాడీల అధికార పరిధిలోకి చొరబడరాదని స్పష్టం చేసింది. -
శారీ సుందరి
నరసింహం టూర్ నుంచి తిరిగొచ్చాడని తెలియగానే ఆ రాత్రి హుషారుగా బార్కి చేరుకుంది మిత్రబృందం. మందు సాక్షిగా తన టూర్ విశేషాలను మిత్రులతో పంచుకోవడం అతగాడి ఆనవాయితీ. నరసింహానికి ముప్పయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్గా ఉంటాడు. తన రూపంతో, మాట చాతుర్యంతో అమ్మాయిలను ఇట్టే పడేయగలనన్న గొప్ప ఆత్మవిశ్వాసం అతనిది. అయిదేళ్ళ క్రితం పెళ్ళయింది. రెండేళ్ళపాప కూడా ఉంది.ఒక ఆడిటింగ్ ఫర్మ్‌లో ఆడిటర్‌గా పనిచేస్తూన్న నరసింహం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు టూర్ వెళుతూంటాడు. వెళ్ళిన చోటల్లా ఓ కొత్త అనుభవం కోసం వెంపర్లాడుతుంటాడు.‘చీర్స్’ చెప్పుకుని మందుకు శ్రీకారం చుట్టారు మిత్రులు. నరసింహం వంక చూస్తూ, ‘‘కమాన్, బ్రో! స్టార్ట్ ద స్టోరీ’’ అన్నాడు ఓ మిత్రుడు. ‘‘నీ మౌనం మా కుతూహలాన్ని రెచ్చగొడుతోంది.ఆరంభించు, భయ్యా!’’ అన్నాడు ఇంకొకడు.‘‘మొదటిసారిగా కోల్కత్తా వెళ్ళొచ్చావు. బెంగాలీ భామల విశేషాలతో మా వీనులకు విందు చెయ్యి మామా!’’ తొందర చేశాడు మరో మిత్రుడు. కథ ఆరంభించే ముందు ఒకసారి కన్నులు మూసుకున్నాడు నరసింహం. కోల్కత్తా అనుభవం మదిలో సుళ్ళుతిరిగింది.. తమ క్లయింట్ కంపెనీ యాన్యువల్ ఆడిటింగ్ పని మీద కోల్కత్తా వెళ్ళాడు నరసింహం. ఆ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ పార్క్ స్ట్రీట్‌లో ఉంది. నరసింహానికి గొరియహాట్లోని కంపెనీ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటైంది. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు. సాయంత్రం గెస్ట్‌హౌస్‌కి చేరుకోగానే టిప్ టాప్‌గా తయారై వాహ్యాళికి తిరిగేవాడు నరసింహం. గొరియహాట్ నుంచి ఢకూరియా బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చేవాడు. ఆ వేళప్పుడు ఆ ఏరియా చాలా సందడిగా ఉంటుంది. మోడర్న్ దుస్తులలో సీతాకోకచిలుకల్లా తిరిగే భామలను ఆబగా చూసేవాడు అతను. వినూత్న బెంగాలీ అందాలనుకళ్ళతోనే జుర్రుకునేవాడు. ఒక సెలవురోజున సైట్ సీయింగ్ కోసం క్వీన్స్ వేలోని విక్టోరియా మెమోరియల్‌కి వెళ్ళాడు నరసింహం. 1921లో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మించిన పాలరాతి కట్టడం అది.మ్యూజియంగా రూపొందిన ఆ మెమోరియల్‌లో 25 గ్యాలరీలు ఉన్నాయి. వాటిలో రాయల్ గ్యాలరీ, జాతీయ నాయకుల గ్యాలరీ, తైలవర్ణచిత్రాల గ్యాలరీ, శిల్పకళాఖండాల గ్యాలరీ, ఆయుధాలు–కవచాల గ్యాలరీ, కోల్కత్తా గ్యాలరీ, సెంట్రల్ హాల్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి. దేశ, విదేశీ సందర్శకులతో మెమోరియల్ సందడిగా ఉంది. సెంట్రల్ హాల్లో ఓ బెంగాలీ యువతితో అతనికి పరిచయమైంది. ఫెయిర్ గా, స్లిమ్ గా, పొడవుగా ఉందామె. లైట్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడర్డ్ కుర్తీ, బ్లూ కలర్ లెగ్గింగ్స్‌లో మోడర్న్‌గా ఉంది.కబుర్లు చెప్పుకుంటూ గ్యాలరీలన్నీ తిరిగారు ఇద్దరూ. లంచ్ టైమ్‌లో గార్డెన్లో కూర్చుని తినుబండారాలను షేర్ చేసుకున్నారు. ఆమె కలుపుగోలుతనం అతనికి బాగా నచ్చింది. సందు దొరికినపుడల్లా అతను తన అందాన్ని పొగుడుతూండడం ఆమెకు నచ్చింది. సాయంత్రం మ్యూజియం నుంచి బయటపడ్డాక, ‘‘అయాం టైర్డ్. పక్కవీధిలో కాఫీ షాపు ఉంది. అక్కడ కాఫీ బాగుంటుంది. మీకు ఇబ్బంది కాకపోతే నాకు కంపెనీ ఇవ్వగలరా?’’ అడిగిందామె. రొట్టె విరిగి నేతిలోపడ్డట్టయింది అతనికి. ‘కాఫీ కఫే’ ఓపెన్–ఎయిర్ రెస్టారెంట్. జనం బాగానే ఉన్నారు. ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు నరసింహం, ఆ యువతీను. ఆమె పేరు జ్యోత్స్న అని తెలియగానే, ‘‘మీ పేరూ మీ అంత అందంగా ఉంది!’’ కాంప్లిమెంట్ ఇచ్చాడతను. నవ్వేసిందామె. ఆమె చనువుగా మెలగడంతో, సులభంగానే తన వలలో పడుతుందన్న ఆశ కలిగింది అతనిలో. కాఫీలు రాగానే, కప్పు అందుకోబోయాడు నరసింహం. ఆమె వారించి, తన హ్యాండ్ బ్యాగులోంచి చిన్నగుళికలు ఏవో తీసి అతని కాఫీలో కలిపింది. ‘‘నేనేదో మత్తుమందుకలుపుతున్నాననుకునిభయపడిపోకండి. హెర్బల్ గుళికలివి. కాఫీ, టీలలో వేసుకుంటే కఫీన్, నికోటిన్ల ప్రభావం మన ఆరోగ్యంపైన పడదు’’ అంది చిరునవ్వుతో. నరసింహం కప్పు నోటి దగ్గర పెట్టుకుంటూండగా వెనుక నుంచి ఎవరిదో చేయి తగిలి కప్పు కింద పడిపోయింది. కాఫీ అతని దుస్తులపైన ఒలికింది.ఒక యువతి అతని ఎదుటకు వచ్చి, ‘‘ఓహ్, అయాం సారీ! చూసుకోలేదు’’ అంటూ అతనికిక్షమాపణలు చెప్పుకుంది. ఇంచుమించు జ్యోత్స్న వయసే ఉంటుంది ఆమెకు. సాధారణమైన అందం. నీలాల కన్నులు ఆమె ప్రత్యేక ఆకర్షణ. లేత ఆకుపచ్చరంగు బెంగాలీ కాటన్ శారీ, అదే రంగుబ్లౌజులో నిండుగా ఉంది.ఆమెను చూడగానే కూల్ అయిపోయాడు నరసింహం. ‘‘ఇట్సాల్రైట్. డోంట్ వర్రీ,’’ అన్నాడు. కాఫీ ఒలికిన షర్టును వాష్ చేసుకు వస్తానంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు.జ్యోత్స్న తనవంక తీక్షణంగా చూస్తూంటే, పెదవులు విడీవిడనట్లుగా నవ్వుకుంది ఆ యువతి. షర్ట్ వాష్ చేసుకుంటూంటే, ‘‘అయాం రియల్లీ సారీ!’’ అన్న పలుకులు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు నరసింహం.ఆశారీ గాళ్!‘‘పరవాలేదులెండి. మీరు కావాలని చేయలేదుకదా!’’ అన్నాడు.‘లేదు, నేను కావాలనే చేశాను!’’ అని ఆమె అనడంతో తెల్లబోయి చూశాడు.‘‘ఇది మెన్స్ వాష్‌రూమ్. అలా పక్కకు వచ్చారంటేఎందుకలాచశానో చెబుతాను’’ అందామె తాపీగా.విస్తుపాటుతో ఆమెను అనుసరించాడతను. జ్యోత్స్నలాగే చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతోందామె. ఆమె చెబుతూన్నది నోరు వెళ్ళబెట్టి ఆలకించాడు‘‘జ్యోత్స్న ఓ చీట్. తన అందచందాలతో పురుషులను ట్రాప్ చేస్తుంది. కాఫీ షాపుకు తీసుకొచ్చి, వారి కాఫీలో డ్రగ్స్ కలుపుతుంది. వాటి ప్రభావంతో ఆమె చెప్పినట్టు చేస్తారంతా. కాఫీ తాగాక, తనఫ్రెండ్నికలవాలంటూ హోటల్ మన్మథకు తీసుకువెళుతుంది. అప్పటికి మత్తు పూర్తిగా తలకెక్కిన ఆ వ్యక్తిని నిలువుదోపిడీ చేసి అదృశ్యమైపోతుంది. తెలివి వచ్చాక ఆ మందు ప్రభావం వల్ల జరిగిందేమీఅతనికి గుర్తుండదు’’ నమ్మలేనట్టుగా చూశాడు నరసింహం. ‘‘ఆమధ్య ఓసారి నా కజిన్ బ్రదర్ ఆమె ట్రాప్‌లో పడి మోసపోయాడు. సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోయాము’’ అందామె. ‘‘ఇతరులు కూడా ఆమె ఉచ్చులో తగులుకోకూడదనే వీలైనపుడల్లా వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను నేను. నా మాటలు నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం!’’ ఆ షాక్ నుంచి అతను తేరుకునే లోపునే అక్కడి నుంచి నిష్క్రమించిందామె. నరసింహం తిరిగి రాగానే జ్యోత్స్న మళ్లీ కాఫీకి ఆర్డర్ చేసింది. అతను వద్దంటూంటే, ‘‘మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేశాను నేను. ఇప్పుడు మీరు తాగకుండా వెళ్ళిపోతే నాకు ఎలాగో ఉంటుంది’’ అంది.కాఫీ రాగానే మళ్ళీ గుళికలు తీసిఅందులో వేసిందామె. ఆమెను కబుర్లలో పెట్టి, కప్పు నోటి వద్ద పెట్టుకుని త్రాగుతున్నట్టు నటించాడు అతను. ఉన్నట్టుండి టేబుల్ కింద నుంచి ఆమె కాలిని త్రొక్కడంతో చటుక్కున వంగిందామె. అదేక్షణంలో టేబుల్ పక్కనున్న పూలకుండీలో కాఫీని ఒలకబోసేశాడు.‘‘నా కాలు తగిలినట్టుంది. సారీ!’’ అన్నాడు. మందహాసం చేసిందామె.కాసేపటి తరువాత బయటకు నడచారు ఇద్దరూ. ‘చేరువలోనే కొంచెంఅర్జెంట్ పని ఉంది’’ అన్నాడు. బలవంత పెట్టినా ప్రయోజనం లేకపోవడంతో, ‘‘ఓకే. రేపు సాయంత్రం మళ్ళీ ఇదే కాఫీ షాపులో కలుద్దాం. అప్పుడు మీరు తప్పక నా స్నేహితురాలిని కలవాలి!’’అందామె. ‘‘ఓకే, ష్యూర్!’’ అంటూ, ఖాళీగా వెళుతున్న టాక్సీని ఆపి ఎక్కేశాడు అతను.మర్నాడే కాదు, మరో రెండురోజుల వరకు ఆ కెఫే ఛాయలకే వెళ్లలేదు నరసింహం. అతని మనసు మాత్రం తనకు హెల్ప్ చేసిన ‘శారీ సుందరి’ చుట్టూనే తిరుగుతోంది. ఆమె పేరు అడగలేదు. ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. ఆమెను మళ్లీ చూడాలన్న కోరిక బలమయింది అతనిలో. ఆ కాఫీ షాపుకువస్తుంటానని చెప్పిందామె. మూడోరోజున అక్కడికి వెళ్ళాడు నరసింహం. ఆ శారీ సుందరి కోసం చూస్తూంటే కెఫే బయటే ఎదురైందామె. బ్రౌన్ కలర్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంది.అతన్నివెంటనే గుర్తుపట్టలేదామె. మూడురోజుల కిందటి సంఘటనను గుర్తుచేసి, ‘థాంక్స్’ చెప్పడానికి వచ్చానన్నాడు. తన మాట చాతుర్యంతో కాసేపటికే ఆమెను దోస్త్‌ని చేసేసుకున్నాడు. తన పేరు దేవయాని అనీ, స్వగ్రామం మిడ్నాపూర్ అనీ, ఉద్యోగరీత్యా తాను కోల్‌కతా వచ్చిందనీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందనీ, చౌరంఘీలేన్లో ఓ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటోందనీ చెప్పిందామె. వస్త్రధారణలో పొందిక, మనిషిలో సిగ్గరితనమూ అతన్ని ఆకట్టుకున్నాయి. చీరలో సెక్సీగా అనిపించింది. మచ్చిక చేసుకుని, కోల్‌కతా వదిలే లోపున ఆమెను పక్కలోకి లాగాలని నిశ్చయించుకున్నాడు. ఆమెకు అతని పైన సదాభిప్రాయం కలగడంతో, రోజూ సాయంత్రపు వేళ కలుసుకునేవారు ఇద్దరూ. ట్రామ్ లో తిరిగేవారు. ఐస్‌క్రీమ్ పార్లర్స్ కి వెళ్ళేవారు. ఈడెన్ గార్డెన్స్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు.రాత్రి ఎనిమిది గంటలకల్లా ఆమెను హాస్టల్ సమీపంలో దిగబెట్టేవాడు అతను.ఇక రెండు రోజుల్లో కోల్‌కతా వదిలి వెళతాడనగా, తమ స్నేహానికి గుర్తుగా చిన్న పార్టీ ఏర్పాటు చేశానంటూ, ఆ సాయంత్రం దేవయానిని తాను ఉండే గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్ళాడు నరసింహం. కాక్ టెయిలూ, డిన్నరూ పూర్తయ్యేసరికి రాత్రి పదయిపోయింది. దేవయాని వాచ్ చూసుకుని కంగారుపడుతూ, ‘‘ఓ మై గాడ్! ఎనిమిది దాటితే హాస్టల్ డోర్ లాక్ చేసేస్తారు. ముందుగా లేట్ పర్మిషన్ తీసుకున్నవారినే లోపలికి ఎలవ్ చేస్తారు’’ అంది.‘‘డోంట్ వర్రీ. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. తెల్లవారాక వెళ్ళొచ్చును. రాత్రి ఎవరో ఫ్రెండ్‌ది బర్త్ డే పార్టీ బాగా లేటయిందనీ, అందుకే రాలేకపోయావనీ చెబుదువుగాని’’ అన్నాడతను. రాత్రి పదకొండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. తరువాత పడుకునేందుకు లేచారు. హఠాత్తుగా ఆమెను కౌగిలించుకుని, పెదవుల మీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు నరసింహం. ఆమె తెల్లబోయి, ప్రతిఘటించబోయింది. కానీ కౌగిలింతలోని పులకింత, ముద్దులోని మాధుర్యం మత్తుకు గురిచేయడంతో అది వ్యర్థప్రయత్నమే అయింది. మర్నాటి ఉదయం నరసింహానికి మెలకువ వచ్చేసరికి తొమ్మిది దాటిపోయింది. గదిలో దేవయాని కనిపించలేదు. వాష్ రూమ్‌కి వెళ్ళిందనుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి వాష్‌రూమ్‌కి వెళ్ళి చూశాడు. ఖాళీగా ఉందది. విస్తుపోతూ సూట్ అంతా వెదికినా ఆమె జాడ లేదు. మార్నింగ్ వాక్‌కి వెళ్ళిందేమోననుకుంటే, టీపాయ్ మీద ఉంచిన ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించలేదు. ఎవరి కంటా పడకూడదని తెల్లవారకుండానే వెళ్ళిపోయివుంటుందనీ, తన నిద్ర పాడుచేయడం ఇష్టంలేక లేపలేదనీ అనుకున్నాడు. హఠాత్తుగా నరసింహం చూపులు కార్నర్ టేబుల్ పైన పడ్డాయి. దాని మీద ఉండవలసిన అతని ల్యాప్ టాప్ కనిపించలేదు! బెడ్ సైడ్ ర్యాక్ మీద పెట్టిన సెల్‌ఫోను, టైటాన్ వాచ్ కూడా కనిపించలేదు. ఏదో అనుమానం పొడసూపడంతో గబగబా టేబుల్ సొరుగు తెరచి చూశాడు. అందులో పెట్టిన మనీపర్స్, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులూ, ఐడీ కార్డూ మాయమయ్యాయి. పర్సులో పదివేలు ఉన్నాయి. గుండె ఝల్లుమంది.వెంటనే గెస్ట్ హౌస్ వాచ్‌మన్‌కి ఇంటర్కమ్లో ఫోన్ చేసి, దేవయాని గురించి వాకబు చేశాడు. తెల్లవారు జామునే ఆమె వెళ్ళిపోయిందనీ, చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉందనీ చెప్పాడతను. అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదు నరసింహానికి. మెదడు మొద్దుబారిపోవడంతో తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు.అదిగో, అప్పుడే పడింది అతని చూపు – టీపాయ్ క్రింద రెపరెపలాడుతున్న కాగితం మీద. చటుక్కున దాన్ని తీసి చూసాడు. అది ‘శారీ సుందరి’ దేవయాని ఆంగ్లంలో రాసిపెట్టిన ఉత్తరం –‘హే, బ్లడీ ఫ్లర్ట్! ఈ పాటికి గేమ్ అర్థమయివుంటుందనుకుంటాను నీకు, నీ ల్యాప్ టాప్, ఫోన్, మనీ,డెబిట్–క్రెడిట్ కార్డ్స్, వాచ్ నాతో తీసుకుపోతున్నాను – రాత్రి నీతో పొందిన అనుభవానికి జ్ఞాపికలుగా!... బై ద బై, ఆ కాఫీ గాళ్ గురించి నేను చెప్పినవేవీ నిజాలు కావు. ఆమె నీ కాఫీలో వేసిన గుళికలు హెల్త్పిల్సే. డ్రగ్ కాదు. ఆమె అప్పుడప్పుడు స్నేహితులతో ఆ కెఫేకి వస్తుంటుంది. కాఫీలో తులసి గుళికలను కలుపుకుని తాగుతుంటారు వాళ్ళు. ఆ విషయం చాలాసార్లు గమనించాను నేను.నీ వాలకం కనిపెట్టి, ఆమె అలవాటును నాకు ఎడ్వాంటేజ్ గా మార్చుకోవాలనుకున్నాను. నీ కాఫీని ఒలకబోసి డ్రామా ఆడాను. ఆమె గురించి చెడుగా చెప్పాను. నేను ఊహించినట్టే, నన్ను నమ్మి, నావెంట పడ్డావునువ్వు. నా గురించి నీకు చెప్పిన వివరాలు కూడా నిజం కాదు. నా రెసిడెన్స్ కూడా! ఆడవాళ్లను చూసి చొంగకార్చుకుంటూ వారిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకునే నీలాంటి విమనైజర్స్ని బకరాలను చేసి బుద్ధిచెప్పడం నా హాబీ!...నా కోసం వెదకడానికి ప్రయత్నించకు, నీ పరువే పోతుంది. బై, ఫర్ ఎవర్!’కంపెనీ వాళ్ళకు ఏదో చెప్పి, వారి సాయంతో తిరిగివచ్చాడతను. నరసింహం చెప్పడం ముగించగానే మిత్రుల మధ్య భయంకర నిశ్శబ్దం అలముకుంది. ‘‘దెబ్బతో తాగిందంతా దిగిపోయింది, భయ్యా!’’ అన్నాడు ఓ మిత్రుడు, నిశ్శబ్దాన్ని చీల్చుతూ.‘‘కోల్‌కతా వెళ్ళొచ్చి కత్తిలాంటి కథ చెబుతావనుకుంటే సుత్తిదెబ్బలు తినొచ్చావేంట్రా, మామా!’’ అన్నాడు మరో మిత్రుడు.‘‘పద, బ్రో! కోల్‌కతా వెళదాం. ఆ మాయలాడిని వెదికి పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం’’ కోపంతో ఊగిపోయాడు ఇంకొకడు.తల అడ్డుగా తిప్పాడు నరసింహం. ‘‘లేదురా. ఆమె చేసింది కరెక్టేననిపిస్తోంది నాకు. విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలూ పెట్టుకుని ఎంగిలి కూటికి ఎగబడటం తప్పే! ఆ అనుభవం నాకళ్ళు తెరిపించింది. ఇక మీదట పరాయి స్త్రీ జోలికి పోకూడదని తీర్మానించుకున్నాను’’ అంటూన్న మిత్రుడి వంక నోళ్ళు వెళ్ళబెట్టి చూశారంతా. - తిరుమలశ్రీ -
‘ఫిల్లింగ్’ అక్రమాలకు ఇక చెల్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటివృథాను, ట్యాంకర్ల అక్రమాలను నిరోధించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. నూతన సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ట్యాంకర్లలో నీటిని నింపే ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పాస్ వాటర్ స్కాడా అనే సంస్థ రూపొందించిన ట్యాంకర్ వాటర్ డిస్పెన్సర్ (ట్యాంకర్ ఏటీఎం) యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జలమం డలి పరిధిలోని వెయ్యి ట్యాంకర్లకు నీటిని ఫిల్లింగ్ చేసేందుకు 56 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో రోజువారీగా సుమారు వెయ్యి ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. ప్రతీ ట్యాంకర్ ఒక ట్రిప్పునకు ఐదువేల లీటర్ల చొప్పున నిత్యం 5 ట్రిప్పుల మేర నీటిని సరఫరా చేస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారులతోపాటు నీటి సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాలు, కలుషిత జలాల సమస్య ఉన్న ప్రాం తాలకు ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. గృహ అవసరాలకు రూ.500, వాణిజ్య అవసరాలకు రూ.850 చొప్పున జలమండలి వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తోంది. కొందరు ట్యాం కర్ యజమానులు ఫిల్లింగ్ కేంద్రాల్లో ఒక ట్రిప్పు నకు డబ్బులు చెల్లించి రెండు అంతకంటే అదనపు ట్రిప్పుల మేర నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. ట్యాంకర్ వాటర్ ఏటీఎం ద్వారా ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని, తాగునీటి వృథాను అరికట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. ట్యాంకర్ ఏటీఎం పనిచేస్తుందిలా.. ట్యాంకర్ ఏటీఎం యంత్రం వినియోగం ఏటీఎం తరహాలోనే ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ.2.5 లక్షలు. ట్యాంకర్ యజమానికి జారీ చేసే కార్డును ఈ యంత్రంపై తాకడం ద్వారా ఇది పనిచేస్తుంది. ముందుగా కార్డులో రీచార్జ్ చేసిన మొత్తం నుంచి ట్యాంకర్లో తరలించే నీటికి సం బంధించి ట్రిప్పులవారీగా నిర్ణీత మొత్తం కోత పడుతుంది. ఇక ఫిల్లింగ్ కేంద్రంలో నీటిని నింపుకునేందుకు ప్రతీసారి విధిగా ఈ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. కార్డును తాకిన తరవాత నిర్ణీత పాస్‌వర్డ్‌ను సైతం ఈ యంత్రంలో టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు ట్యాంకర్లో నిర్ణీత మొత్తంలో నీటిని నింపేందుకు ఆస్కారముంటుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడడమే కాకుండా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షకుల అవసరం కూడా ఉండదని జలమండలి అధికారులు చెబుతున్నారు. నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జల వనరుల నుంచి జలమండలి మహానగరానికి తాగునీటిని తరలిస్తోంది. ప్రతీ వెయ్యి లీటర్ల నీటిశుద్ధికి రూ.45 ఖర్చు చేస్తున్నప్పటికీ వినియోగదారులకు రూ.10కే సరఫరా చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నగరంలోని ప్రతీ వ్యక్తీకి నిత్యం 135 లీటర్ల తాగునీటిని(లీటర్ పర్ క్యాపిటా డైలీ) సరఫరా చేస్తున్నాం. ట్యాం కర్ల అక్రమాలతో తాగునీరు వృథా కాకుండా కాపాడటంతోపాటు వినియోగదారులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నాం. నీటి వృథా, చౌర్యాన్ని నిరోధించేందుకు ఈ వాటర్ డిస్పెన్సర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. –ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఆ సమయంలో మొబైల్ ఫోన్లు బ్యాన్
న్యూఢిల్లీ : ఇటీవల వాట్సాప్ లీక్ కేసు కంపెనీలను ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, వాట్సాప్ లీక్ కేసు వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ లీక్‌ల్లో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న వారందర్ని సెబీ విచారిస్తోంది. తాజాగా కంపెనీలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. కంపెనీ ఆడిట్ సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లను కంపెనీలు అనుమతించకూడదని నిర్ణయించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. లీకేజీలను నివారించడానికి, ఆడిట్ కమిటీ సమావేశాలను నిర్భందపూర్వక వాతావరణంలో, బడ్జెట్‌ను రూపొందించిన మాదిరిగా నిర్వహించాలనుకుంటున్నట్టు తెలిపాయి. అధికారికంగా కంపెనీలు తమ ఫలితాలను వెలువరించకముందే, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా, సోషల్ మీడియా చాట్‌రూంల ద్వారా కొన్ని బ్లూచిప్ కంపెనీలు, లిస్ట్ అయిన కంపెనీల సున్నితమైన సమాచారం లీక్ అయింది. ఈ కేసుపై సెబీ తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతోంది. 30 మందికి పైగా మార్కెట్ విశ్లేషకులు, డీలర్లకు సంబంధించిన ప్రాంతాల్లో సెబీ తనిఖీలు కూడా చేసింది. సమాచారం లీక్ అయిన కంపెనీల్లో సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, మహింద్రా హాలిడే, రిసోర్ట్స్‌లు ఉన్నాయి. వాట్సప్‌లో సమాచారం లీకేజి కేసులో సెబీ తొలిసారిగా యాక్సిస్ బ్యాంక్‌ను సైతం ఆదేశించింది. ఇందుకు సంబంధించి టెక్నాలజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, అలాగే అంతర్గతంగా విచారణ జరుపాలని సెబీ సూచించింది. -
ఆర్బీఐ ఆడిటింగ్ సరిగా లేదు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం జరగడానికి ఆర్బీఐ ఆడిటింగ్ తీరు సరిగా లేకపోవడం కూడా కారణమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి తప్పుబట్టారు. స్కామ్ జరిగిన సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ జరగలేదన్నారు. మరింత పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు. ‘‘రిస్క్‌ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి. కానీ, స్కామ్‌లు జరుగుతున్న సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్‌ను ఎలా కొలుస్తారు. స్కామ్‌లు ఎందుకు బయటకు రావడం లేదు’’అని చౌదరి అన్నారు. ఆర్బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు. నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్‌బీకే స్కామ్‌లు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అనుసరించాలని సూచించారు. ఐసీఏఐకి వివరాలివ్వండి... స్కామ్ వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ)కి కూడా ఇవ్వాలని పీఎన్బీ, దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ స్కామ్‌కు దారితీసిన వ్యవస్థాగత లోటుపాట్లను అధ్యయనం చేయడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోతగిన చర్యలను సూచించేందుకు ఐసీఏఐ.. పది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. -
అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్ ప్రారంభం
అనంతపురం అర్బన్ : ప్రజలు తమ సమస్యలపై ‘మీ కోసం’, జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కలెక్టరేట్లోని రెవెన్యూ భవ¯ŒSలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆడిటింగ్ చేపట్టారు. ‘మీ కోసం’ కార్యక్రమంలో సమస్యలపై ఇస్తున్న అర్జీలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదేపదే తిరుగుతున్నారనే అంశంపై సాక్షిలో ఈ నెల 4న ‘‘ఎవరి కోసం’’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. మీ కోసం అర్జీలపై ఆడిటింగ్‌కు ఆదేశించారు. అనంతపురం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీల పరిస్థితిపై జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం కలెక్టరేట్ సూపరింటెండెంట్లుతో విచారణ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు సాగుతుందన్నారు. రోజుకో డివిజ¯ŒSకి సంబంధించి అర్జీల ఆడిటింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్య పరిష్కరించినట్లు చూపుతున్న అర్జీలపై సంబంధిత అర్జీదారునితో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నామన్నారు. దీని తరువాత ఇతర శాఖలకు సంబంధించిన అర్జీల విచారణ ఉంటుందన్నారు. -
స్థానిక సంస్థల ఆడిటింగ్ లో లోపాలు
ప్రజా పద్దుల సంఘం భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఆడిటింగ్‌లో లోపాలున్నాయని, వాటిని తమ పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) నిర్ణయించింది. తెలంగాణ పీఏసీ చైర్‌పర్సన్‌గా జె.గీతారెడ్డి ఎన్నికైన తర్వాత తొలి సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్లో శనివారం జరిగింది. గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. గీతారెడ్డిని అభినందించారు. స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానం, రెవెన్యూ విభాగాన్ని 1971 నుంచి పీఏసీ సమీక్షించకపోవడంపై చర్చించారు. నగర, పట్టణ పాలక సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానంలో చాలా లోపాలున్నాయన్నారు. వీటిని పీఏసీ పరిధిలోకి తీసుకురావాలని, సమగ్ర సమాచారంతో చర్చించాలని నిర్ణయించారు. దీంతో పాటు రెవెన్యూ విభాగంపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. మిగిలిన అన్ని విభాగాలు కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మే 9న పీఏసీ తదుపరి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, గువ్వల బాలరాజు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్, భానుప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.