పంజిమ్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొత్త విభాగాల్లోనూ ఆడిటింగ్‌ను పరిశీలిస్తోంది. నీడి అడుగున వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆడిటింగ్ చేయనున్నట్టు, మరిన్ని నివేదికలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు కాగ్ గిరీష్ చంద్ర ముర్ము చెప్పారు. జీ20 దేశాలతో కూడిన ఎస్‌ఐ20 మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాగ్ గిరీష్ చంద్ర మాట్లాడారు. డేటా ప్రామాణీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఆడిట్‌లను మరింత సులభంగా, వేగంగా చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలు, శాఖలతో సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్పారు.
‘‘కొంత వరకు డేటా ప్రామాణీకరణ పట్ల అంగీకారం కుదిరింది. గతేడాదే పదేళ్ల రికార్డును అధిగమించాం. ఆడిట్ నివేదికలను మరిన్ని విడుదల చేస్తాం. డేటా ప్రాసెసింగ్, నివేదిక రూపకల్పన మరింత వేగాన్ని అందుకుంటుంది. నివేదికల రూపకల్పనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను (డిజిటల్ ఆడిట్‌లు) వినియోగించుకుంటాం’’అని గిరీష్ చంద్ర తెలిపారు. కాగ్ ఈ ఏడాది నుంచే డిటజిటల్ ఆడిట్‌ల విడుదలను ప్రారంభించడం గమనార్హం. వివిధ శాఖల పరిధిలో నిధుల కేటాయింపులు, వినియోగం పద్దులపై కాగ్ ఆడిటింగ్ చేసి, పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముందు నివేదికలను ఉంచుంతుంది. షిప్పింగ్, నీటి అడుగు నుంచి వెలికితీసే ఆయిల్ అండ్ గ్యాస్ తదితర నూతన విభాగాల్లోనూ ఆడిట్ చేయాలన్నది తమ ఉద్దేశమ్యని గిరీష్ చంద్ర చెప్పారు. కాగా, బ్లూ ఎకానమీ (సముద్రం ఆధారిత) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఈ సమావేశం చర్చించింది.
Comments
Please login to add a commentAdd a comment