G20
-
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
-
రానున్న దశాబ్దంలో భారత్‌దే హవా!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి.. మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్‌లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు. ‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశమంటే... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
ఏఐ విప్లవంలో పాల్గొనడం కాదు.. నేతృత్వం వహించాలి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్‌ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్‌లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్‌లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్‌హబ్‌ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
ఉజ్వల భవిత వైపు దిశానిర్దేశం
భారత్ జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించే నాటికి ప్రపంచం అనేక సమస్యలనెదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని భారత్ నేతృత్వంలోని జీ20 నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘వసుధైవ కుటుంబకం’...అంటే– ‘ఒకే భూమి–ఒకే కుటుంబం–ఒకే భవి ష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ... పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. బహుళ దేశాలు పాల్గొనే విధానం (మల్టీ లేటరలిజం) క్షీణించే తరుణంలో కోవిడ్–19 మహ మ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలూ, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలూ, వివాదాలూ, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది. ఈ నేపథ్యంలో జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారత దేశం ఆనాటి దుఃస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యా మ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుళ దేశాలు పాల్గొనే విధాన మూలాల నుంచి సంస్కరణలు తేవడం. ‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మ కత’ అనే నాలుగు పదాలు జీ20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జీ20 సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది. సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మ వంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదిక మీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జీ20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు –అవకాశాలపై మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది. ఇక ‘దక్షిణార్ధ గోళ దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు మల్టీలేటరలిజం నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్ధ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జీ20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జీ20కి భారత నాయకత్వం ప్రజా ధ్యక్షతగా రూపొందింది. కీలకమైన 2030 ఎజెండా మధ్యలో జీ20 కార్యాచరణ ప్రణాళికను సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమ తౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ–ఆధారిత విధానాన్ని భారత్ రూపొందించింది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డీపీఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యూపీఐ, డిజీలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జీ20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహ కారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కి పైగా దేశాల ‘డీపీఐ’లున్నాయి. మన భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపి కకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరు త్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రతిష్ఠాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జీ20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటూ, హరిత ఉదజని కోసం సమష్టి కృషీ... పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జీ20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. ఉత్తరార్ధ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం–సమా నత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించిన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల డాలర్ల స్థాయి నుంచి ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి 5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జీ20 అంగీకరించింది. న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. ‘భారత మహిళా రిజర్వేషన్ బిల్లు–2023’ ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటా యించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జీ20 ప్రతిబింబించింది. విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్ఠాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జీ20 ద్వారా 87 నిర్ణ యాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. మన జీ20 అధ్యక్షత సమయంలో భౌగోళిక–రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి–ప్రగతిపై వాటి ప్రభావం వగైరాల పైనా చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది మల్టీలేటరిజాన్ని పునరుజ్జీవింపజేసింది. దక్షిణార్ధ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది. ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది. అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి–శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. సమ్మిట్‌లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్‌లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్‌ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్‌లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
ఉగ్రవాదమే అసలైన సమస్య.. పీ20 మీటింగ్‌లో ప్రధాని మోదీ
ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు. పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్‌లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్‌తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది. రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు. ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగింత -
బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ♦ మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ♦ జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ♦ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ♦ వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ♦ జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ♦ వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ♦ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ♦ వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచ్చిన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం
న్యూఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగంలో భాగస్వామ్య దేశాలకు కృతఙ్ఞతలు తెలిపి బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రెసిడెన్సీ బాధ్యతలను అప్పగించారు. బైడెన్ తొలిసారి భారత్‌లో.. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు సమావేశాలు ముగిశాక వియత్నాం బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ మొట్టమొదటిసారి భారత్‌లో పర్యటించారు. జీ20 సమావేశాలు రెండోరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వియత్నాం బయల్దేరారు. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. #WATCH | G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit, earlier visuals. pic.twitter.com/gsAG0m5GwX — ANI (@ANI) September 10, 2023 వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. జీ20 సమావేశాలు ఒకపక్కన జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు తొలిరోజున మారిషస్, బంగ్లాదేశ్ దేశాలతో చర్చలు జరిపారు. రెండో రోజున యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఆదివారం రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని లంచ్ సమావేశం అది ముగిశాక కెనడా దేశాధినేతలతోనూ అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. PM to hold more than 15 bilaterals with world leaders on G20 sidelines Read @ANI Story | https://t.co/W7Ti3xFuAG#NarendraModi #Modi #G20 #G20India2023 #NewDelhi pic.twitter.com/Wwv3pnWfbU — ANI Digital (@ani_digital) September 8, 2023 జయహో భారత్.. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. సమేవేశాలు తొలిరోజునే ప్రధాని ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం భారత్ సాధించిన అపూర్వ విజయమనే చెప్పాలి. సమావేశాలు ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన 'వన్ ఎర్త్ నేషన్'పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది కూడా చదవండి: G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21 -
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం.. జీ20 సదస్సుకు ఫెషాలికా
పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కన్న షెఫాలికా పండా ఆ కలకు దూరమై పేదలకు దగ్గరైంది. మహాపట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగింది.తమ ఫౌండేషన్ తరఫున ఎంతోమందికి అండగా నిలబడింది.కష్టాలు, సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా స్త్రీ సాధికారతకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటార్షిప్’ కన్వీనర్‌గా స్త్రీ సాధికారతకు సంబంధించి విస్తృత స్థాయిలో పనిచేసే అవకాశం షెఫాలికా పండాకు లభించింది... కాలేజీ రోజుల్లో ‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’ కావాలని కలలు కనేది షెఫాలికా. అయితే ఒకానొక సంఘటనతో ఆమె కలల దారి మారింది. తమ బంధువు ఒకరు అనారోగ్యం పాలుకావడంతో, ఒడిషాలో సరిౖయెన వైద్య సదుపాయాలు లేకనోవడంతో దిల్లీకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి అసౌకర్యాల వరకు ఎన్నో సంఘటనలను దగ్గరగా చూసింది షెఫాలికా పండా.బ‘చదువుకున్న వారు, ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే ఒడిశాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే పేద ప్రజల పరిస్థితి ఏమిటి?’ అని ఆలోచించింది. ఆ ఆలోచనల ఫలితంగా సేవారంగంలోకి వచ్చిన షెఫాలికా ఎంతోమంది పేదలకు అండగా నిలబడింది. బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది.‘నాయకుల ఎదుగుదలకు సంబంధించి అనుభవం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత అనుభవం ఉంటే అంత బలం సమకూరుతుంది. సామాజిక సేవా రంగంలో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సమాజంలో సానుకూల మార్పు తేవాలనుకునేవారికి సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు దానిపై పని చేయడానికి చాలా ఓపిక కావాలి. సామాజిక సేవలో మా అత్తమ్మ ‘ఇలా పండా’ నాకు ఆదర్శం. ఎలాంటి ఆడంబరం లేకుండానే ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది. ఎండనకా, వాననకా తిరిగినా ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. సామాజిక సేవ తన ఆరోగ్య రహస్యంగా చెప్పుకునేది. ఆమె చురుకుదనం, సామాజిక సేవాదృక్పథాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అందులో నేను ఒకరిని’ అంటుంది షెఫాలికా. ‘అవసరం ఉన్న చోట మేముంటాం’ అనే నినాదంతో బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ట్రస్టీ, సీయివోగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది.‘మహిళలపై ప్రధానంగా దృష్టి పెట్టడానికి కారణం అసమానత, లింగ వివక్షత. మహిళల జీవితాలు మారాలంటే ఆమె పిల్లల జీవితాల్లో కూడా మార్పు రావాలని బలంగా నమ్ముతాను’ అంటుంది షెఫాలికా. అవకాశాలు దొరికేవారు, దొరకని వారు అని మహిళలకు సంబంధించి రెండు రకాల వర్గీకరణలున్నాయి. అవకాశాలు దొరికేవారు సులభంగానే విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకుంటారు. మరి దొరకని వారి పరిస్థితి ఏమిటి? సాంకేతిక, జీవన నైపుణ్యాలు, చదువు రూపంలో అలాంటి వారిని వెలుగులోకి తీసుకువచ్చి విజయపథంలోకి తీసుకువెళ్లడంపై, మహిళలకు సమాన అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై జీ20 సదస్సు దృష్టి పెడుతుంది. జీ20 ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారవేత్తలు కావాలనుకునేవారికి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో మేలు జరుగుతుంది. 30,000 మంది ఎంటర్ప్రెన్యూర్ల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడతాయి. – షెఫాలికా, కన్వీనర్, జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటర్షిప్ -
జీ-20 సమ్మిట్: చెహ్లం ఊరేగింపునకు మతం రంగు..
ఢిల్లీ: జీ-20 వేడుకలకు ముందు జరిగిన చెహ్లం ఊరేగింపునకు మతం రంగు పూస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పుకార్లు అవాస్తవాలని స్పష్టం చేశారు. జీ-20 వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా.. బుధవారం ఢిల్లీలో చెహ్లం ఊరేగింపు జరిగింది. దీనిపై ప్రపంచస్థాయి వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వీటిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెహ్లం ఊరేగింపులో కొన్ని మతపరమైన నినాదాలు వినిపించినట్లు, అభ్యంతకరమైన భాషను వాడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీ-20 వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారా..? అంటూ ప్రచారం కల్పిస్తూ పోస్టులు వెలువడ్డాయి. FALSE NEWS: Some social media handles are wrongly projecting videos of Chehlum procession,as communal protest before G-20 Summit.The Chehlum procession is traditional one and carried out with due permissions from the law enforcing agencies. Please do not Spread rumors.#DPUpdates — Delhi Police (@DelhiPolice) September 7, 2023 దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఢిల్లీ పోలీసులు..' అవన్నీ అవాస్తవాలు. చెహ్లం ఊరేగింపు, జీ-20 ముందు మతపరమైన ఊరేగింపు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చెహ్లం వేడుక సాంప్రదాయంగా, అనుమతుల మేరకు జరుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దు.' అని పేర్కొన్నారు. చెహ్లం పండగను ఢిల్లీలో షియా ముస్లింలు బుధవారం నిర్వహించారు. మొహర్రం పండుగ పూర్తి అయిన 40వ నాడు ఈ ఊరేగింపును చేపడతారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానానికి జ్ఞాపకార్థంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీ20 సదస్సు శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వాహనాలను ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి అనుమతించరు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ట్యాక్సీలు, ఆటోలకు ఇవే ఆంక్షలు వర్తిస్తాయి. ఇదీ చదవండి: జీ20: ఎందుకు.. ఏమిటి! -
అనధికారిక లాక్ డౌన్లోకి సెంట్రల్ ఢిల్లీ!
ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका। Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles. यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9 — Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023 సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ G20 డిన్నర్ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది. జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 ఇంకోవైపు కాంగ్రెస్ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న యూనియన్ స్టేట్స్పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है? भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है? स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक… — Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023 కొత్త భవనంలోనేనా? ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. So the news is indeed true. Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'. Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..? -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్‌లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్‌లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్‌కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్‌ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్‌కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్‌లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్‌గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్‌గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్‌లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్‌తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే!