
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్‌హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు.
(Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు)
మరిన్ని వార్తలు, అప్‌డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్