carbon
-
రేపటి కోసం.. ఢిల్లీ, ముంబైలా కాదు రాజపాళ్యంలా..!
నా కోసం.. నా కుటుంబం.. అని ఆలోచనలో చేసే మనుషులు ఉన్న ఈ కాలంలో.. మన కోసం.. మన ఊరి కోసం.. రేపటి తరాల కోసం మంచి వాతావరణాన్ని అందించాలని ప్రతినబూనింది ఇక్కడో ఊరు. ఈ క్రమంలో ఆకట్టుకునే ప్రయత్నాలతో ముందుకు పోతోంది.రాజపాళ్యం.. తమిళనాడులో పశ్చిమ కనుమల్లో ఉండే ఓ పట్టణం. ఇక్కడ జనాభా రెండు లక్షలకు పైనే. మామిడి పండ్లకు, మరీ ముఖ్యంగా నాటు కుక్కలకు ఫేమస్ ఈ ప్రాంతం. అయితే ఈ మధ్య ‘2040 మిషన్’తో ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. అప్పటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి(zero carbon city) తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేస్తోంది.కార్బన్ న్యూట్రల్ బై 2040 కార్యక్రమం కోసం అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్పలితాలను ఇస్తున్నాయి. అక్కడి జనాలు సోలార్ ఎనర్జీకి క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. పవన్ విద్యుత్‌కు పెద్ద పీట వేసే ప్రయత్నాల్లో అక్కడి అధికార యంత్రాంగం ఇప్పటికే తలమునకలైంది. పునరుత్పాదక విద్యుత్ కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలని, అలాగే సీఎన్జీ బయో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.2021లో రాజపాళ్యం నుంచి 7 లక్షల టన్నుల కర్భన ఉద్గారాలు వెలువడ్డాయి. వాటిని జీరోకి తేవాలన్నదే మిషన్ 2040 ఉద్దేశం.పర్యావరణ ప్రయోజనాలుకార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయిగాలి నాణ్యత పెరుగుతుందిపచ్చదనం విస్తరిస్తుందిజల వనరులు సంరక్షణఆర్థిక ప్రయోజనాలుపునరుత్పాదకతో.. ఖర్చులు తగ్గుతాయిఉపాధి కల్పన, ఉద్యోగాలు దొరుకుతాయిRajapalayam leads small town India 🇮🇳 towards green future.The beautiful city of Rajapalayam in Tamil Nadu has developed a masterplan for a zero carbon city. It will inspire cities across India and the globe.Rajapalayam (200 000 inhabitants) plans to source enegy from solar,… pic.twitter.com/7yujcIimP5— Erik Solheim (@ErikSolheim) January 6, 2025సామాజిక లాభాలుప్రజారోగ్యంఆయుష్షు పెరిగే అవకాశంకమ్యూనిటీ ఎంగేజ్మెంట్అలాగే.. ప్రయాణాల కోసం సంప్రదాయ ఇంధనవనరుల మీద కాకుండా ఈ-బస్సులు, ఈ-వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు.. మొక్కల పెంపకంతో పాటు జలవనరులు కాలుష్యం బారినపడకుండా పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖరికి.. పండుగలకు, ఇతర కార్యాక్రమాలకు ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచుతూ వస్తున్నారు.కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం పచ్చటి ప్రకృతిని అందిద్దాం అనే నినాదానికి అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆధునీకరణలో భాగంగా తమ ఊరు ఏ ఢిల్లీ, ముంబైలాగో కాలుష్య నగరంగా మారాలని అక్కడి ప్రజలు ఆశించడం లేదు. రాజపాళ్యంలా ఉండి.. కాలుష్యరహిత ప్రాంతంగా దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.సవాళ్లుకాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారంసాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యే అవకాశంపూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు మరికొంత సమయంపారిశ్రామిక సహకారంపాటించడమే కాదు.. పర్యవేక్షణ కూడా సవాల్‌తో కూడున్నదే. కానీ, పచ్చటి భవిష్యత్తుతో దక్కే ఫలితం మాత్రం దీర్ఘకాలికమైంది. -
‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’
ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ మార్పులకు పరిష్కారం చూపవని ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ తెలిపారు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా వాతావరణ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. దీన్ని పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపవు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా ఇది పరిష్కారం కాదు. స్థానిక ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగ్లాదేశ్‌లో చాలా ఏళ్లుగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వాతావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దాంతో స్థానికులు వాతావరణానికి చేటు చేసే కార్యాలకు స్వతహాగా దూరంగా ఉంటున్నారు. ఈ మార్పునకు ఏదో గొప్ప సాంకేతిక తోడ్పడలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. భారత్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశం. అలాంటిది ఇక్కడి రైతులు చాలా ఏళ్లుగా తమకు తోచినంతలో నీటిని సమర్థంగా వాడుకుని పంటలు పండిస్తున్నారు. వనరులను సమర్థంగా వాడుకోవాలనే స్పృహ అందరిలోనూ ఉండాలి. అప్పుడే వాతావరణం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చు’ అని అమితావ్ ఘోష్ అన్నారు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’‘ఇరాక్ యుద్ధ సమయంలో యూఎస్ మిలిటరీ ఏటా 1.3 బిలియన్ గ్యాలన్ల చమురును వినియోగించింది. ఇది బంగ్లాదేశ్ వార్షిక వినియోగం కంటే ఎక్కువ. యుద్ధాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా చెలరేగులున్న వైరుధ్యం వల్ల వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అయినా ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా చర్చకు వస్తాయి’ అని అన్నారు. -
Chief Economic Adviser V Anantha Nageswaran: వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
స్వచ్ఛ ప్రపంచం కోసం ఏటా కావాలో...రూ.2.24 కోట్ల కోట్లు!
కర్బన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. ప్రస్తుతం ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన పెను సమస్యలు. పర్యావరణం పట్ల మనిషి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వాటిని ఎలాగైనా తగ్గించాలన్న ప్రతినలు, లక్ష్యాలు కాగితాలకే పరిమితమ వుతున్నాయి. భావితరాల భద్రత పట్ల మన జవాబుదారీతనాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా (నెట్ జీరో స్థాయికి) తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచీ ఏటా కనీసం 2.24 కోట్ల కోట్ల రూపాయలు (2.7 లక్షల కోట్ల డాలర్లు) వెచి్చంచాల్సి ఉంటుందట! అలాగైతేనే ఈ శతాబ్దాంతానికల్లా అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయట. కానీ ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉన్న చాలా దేశాలు తామే స్వయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాల సాధనకే అల్లంత దూరంలో ఉన్నాయనీ తాజా నివేదిక ఒకటి వాపోతోంది! ఈ పరిస్థితుల్లో వాటి నుంచి 2050 లక్ష్యాల పట్ల చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణను ఆశించడం అత్యాశేనని పర్యావరణవేత్త లు అంటున్నారు. మరోవైపు సముద్రాలకు ముప్పు కూడా నానాటికీ మరింతగా పెరిగిపోతోందని గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిస్తోంది. చేపల వేట విచ్చలవిడిగా సాగుతోందని, గత నాలుగేళ్లలో 8.5 శాతం దాకా పెరిగిందని అది పేర్కొంది! లక్ష్యాలు ఘనమే కానీ... ► కర్బన ఉద్గారాల కట్టడికి ప్రస్తుతం అన్ని దేశాలూ కలిపి ఏటా 1.9 లక్షల కోట్ల డాలర్లు వెచి్చంచాలన్నది లక్ష్యం. కానీ ఇదీ ఒక్క ఏడాది కూడా జరగడం లేదు. ► పలు కీలక సంపన్న దేశాలు ఈ విషయంలో చేస్తున్న గొప్ప ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ► అవి పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ► అవిలాగే దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2050 కల్లా ఏకంగా 2.5 డిగ్రీలు పెరగడం, మానవాళి మనుగడ పెను ప్రమాదంలో పడటం ఖాయమని స్వయంగా ఐక్యరాజ్యసమితే తాజాగా హెచ్చరించింది. సముద్రాలకు ’మహా’ ముప్పు మహా సముద్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటపై అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ తాజా నివేదిక తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది... ► 2018తో పోలిస్తే 2022 నాటికి సముద్రాల్లో చేపల వేట 8.5 శాతం పెరిగింది. ప్రత్యేక రక్షిత ప్రాంతాలైన సున్నిత సముద్ర జలాల్లోనైతే ఏకంగా 23.5 శాతం పెరిగింది. ► నిర్దిష్ట అంతర్జాతీయ సముద్ర జలా లను చేపల వేటను నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి గ్రీన్ పీస్ చేసిన కృషి ఫలించి ఎట్టకేలకు గత మార్చిలో ఒప్పందంగా రూపుదాల్చాయి. జూన్‌లో ఐరాస కూడా దానికి ఆమోదముద్ర వేసింది. ► కానీ ఏ దేశమూ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని నివేదిక వాపోతోంది. ► విచ్చలవిడిగా వేట దెబ్బకు అరుదైన సముద్ర జీవరాశులు దాదాపుగా అంతరించిపోతున్నాయి. ► ఉదాహరణకు పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా చేప జాతి గత మూడు దశాబ్దాల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా క్షీణించిపోయింది. ► ’30 బై 30’ లక్ష్య సాధనకు దేశాలన్నీ ఇప్పటికైనా నడుం బిగిస్తే మేలని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది. ► ప్రపంచంలోని భూ, జలవనరులను 2030 కల్లా కనీసం 30 శాతమన్నా సంపూర్ణంగా సురక్షితంగా తీర్చిదిద్ద డమే ‘30 బై 30’ లక్ష్యం. నెట్ జీరో అంటే.. ► కర్బన ఉద్గారాలను దాదాపుగా సున్నా స్థాయికి తగ్గించడం. ► కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహా సముద్రాలు, అడవుల వంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయన్నది సిద్ధాంతం. ► ఇందుకు ఉద్దేశించిన నిధుల్లో మూడొంతులు కీలకమైన ఇంధన, మౌలిక రంగాలపై వెచి్చంచాలన్నది లక్ష్యం. మిగతా లక్ష్యాలు ఏమిటంటే... ► రవాణా రంగాన్ని వీలైనంతగా విద్యుదీకరించడం. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘1.5 డిగ్రీ ఉష్ణోగ్రత లక్ష్య సాధన అత్యంత పెను సవాలేనని చెప్పాలి. ఈ దశాబ్దంలో మిగిలి ఉన్న ఆరేళ్లలో ఆ దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయతి్నస్తామన్న దానిపైనే ప్రపంచ భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుంది‘ – సైమన్ ఫ్లవర్స్ సీఈఓ, చీఫ్ స్ట్రాటజిస్ట్, వుడ్ మెకంజీ సంస్థ ‘లక్ష్యాల మాట ఎలా ఉన్నా చమురు, సహజ వాయువు పాత్ర అంతర్జాతీయ స్థాయి లో కనీసం మరి కొన్నేళ్ల పాటు కీలకంగానే ఉండనుంది‘ – ప్రకాశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్, వుడ్ మెకంజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్‌కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు. ‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్‌కర వివరించారు. బార్క్లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్‌కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్‌కర తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్బన్ మార్కెట్‌కు కేంద్రం మద్దతు ‘‘కార్బన్ మార్కెట్‌కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్లు కూడా కార్బన్ మార్కెట్లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్‌గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్‌ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
నల్లగా మారిన ఆకాశం.. వణికిపోతున్న అధ్యక్షుడు బైడెన్..
కెనడాని కార్చిచ్చు వణికిస్తోంది. చాలా రోజులుగా కొనసాగుతున్న దావానలంతో తమ దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనంతగా వాయు కాలుష్యం జరిగినట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కెనడా తూర్పూ, పశ్చిమ భాగాల్లో సంభవించిన కార్చిచ్చుతో రికార్డ్ స్థాయిలో 160 మిలియన్ టన్నుల కార్బన్ విడుదలైనట్లు పేర్కొంది. దీంతో అటు పక్కనే అమెరికా కూడా చిక్కుల్లో పడింది. యూఎస్ గగనతలాన్ని పొగలు కమ్మేశాయి. న్యూయార్క్, టొరెంటో నగరాల్లో ఆకాశం నల్లని దుప్పటి కప్పినట్లు తయారైంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చాలా రోజులుగా అడవుల్లో మంటలు చెలరేగాయి. బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, సస్కట్చేవాన్, తూర్పున అంటారియో, క్యూబెక్, నోవా స్కోటియాతో సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మే నెల నుంచే ఆదేశ అధికార యంత్రాంగం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం 490 ప్రదేశాల్లో మంటలు చెలరేగగా.. 255 ప్రదేశాల్లో నియంత్రించలేని స్థితిలో దావానలం వ్యాపించింది. మిన్నెసోటా, మిన్నియాపాలిస్లలో వాతావరణం నల్లగా మారిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి మిన్నెసోటాలో 23వ గాలి నాణ్యత హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశంలో గత జనవరి నుంచి 76,129 కిలోమీటర్లలో అటవీ సంపద కాలి బూడిదైంది. 1989 నాటి విపత్తు కంటే ఇదే అతి పెద్దది. అప్పట్లో 75,596 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించగా.. ప్రస్తుత కార్చిచ్చు ఆ రికార్డ్‌ను దాటిపోయింది. కెనడాలో విస్తరిస్తున్న కార్చిచ్చుతో అమెరికాలో వాతావరణం ఇబ్బందుల్లో పడింది. న్యూయార్క్ 413 వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)తో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. స్కేల్‌పై గరిష్ఠ ఏక్యూఐ 500 అయితే.. న్యూయార్క్ నగరంలో వాయు కాలుష్యం 400 దాటిందంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు.. -
వర్ధమాన దేశాలకు ‘అభివృద్ధి లక్ష్యాల’ నిధులు కావాలి
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్ అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) మరిన్ని వార్తలు, అప్డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు రూ.19,744 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్ , ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్ చెప్పారు. ఈ మిషన్ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైబ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్ సాకారమైతే ఇంధన రంగంలో భారత్ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది. -
మ్యాన్ మేడ్ స్టోన్: మనిషి చితికి చేరినా, వజ్రంగా మెరుస్తూ..
సైన్స్ వైఫల్యాలలో మనిషి మరణం ఒకటి. ఎన్నో వింతలు, విడ్డూరాలు చేయగలిగిన టెక్నాలజీ, మరణాన్ని జయించడంలో పదేపదే విఫలమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మార్చడంలో మాత్రం విజయవంతమైంది. మృతదేహాన్ని దహనం చేశాక మిగిలే బూడిదతో వజ్రాలను తయారుచేసి, ఆత్మీయులకు చిరకాల జ్ఞాపికలుగా అందిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే వంటి పలు దేశాల ప్రజలు మరణించిన తమవారిని చెక్కుచెదరని వజ్రాభరణాలుగా మార్చుకుంటున్నారు. వాటిని నిత్యం ధరిస్తూ మరణించిన ఆత్మీయులు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని లక్కీ డైమండ్స్, మెమోరియల్ డైమండ్స్ అని పిలుచుకుంటున్నారు. మనిషి శరీరంలోని ఘన మూలకాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. మనిషి శరీరం దహనమైపోయినా, అధిక పరిమాణంలో మిగిలే కార్బన్ తో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను కొన్నేళ్ల కిందటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానంతో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇలా ఆత్మీయుల చితాభస్మంతో వజ్రాలను తయారు చేసి, వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాయి. అయితే, ఇదంతా పెద్ద స్కామ్ అని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి డబ్బులు గుంజడానికే కంపెనీలు ఇలా మోసం చేస్తున్నాయని, డైమండ్ తయారీకి చితాభస్మం నుంచి 10% కార్బన్ మాత్రమే వాడుతున్నారని, మిగిలిన 90% సాధారణ స్టాక్ కార్బన్ వాడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయినా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ఇది విపరీతంగా విస్తరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అయిన వారిని కోల్పోయి, కనీసం కడసారి చూపులకైనా నోచుకోలేని స్థితిలో అల్లాడిపోయిన ఎందరికో ఈ విధానం ఊరటనిస్తోంది. తమవారు లేరనే విషాదం నుంచి కోలుకునేందుకు ప్రేమపూర్వక జ్ఞాపికగా మిగులుతోంది. స్నేహితుల్ని, ఆత్మీయుల్ని ఎంతో మంది ఈ వజ్రాలను తయారు చేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఈ మనిషి చితాభస్మంతో తయారైన వజ్రాలు (మ్యాన్ మేడ్ స్టోన్) మొదట 1980లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చినా, ఇటీవలి కాలంలోనే వీటికి ఆదరణ పెరుగుతోంది. -
జీరో స్థాయి ఉద్గారాల కోసం 10 ట్రిలియన్ డాలర్లు కావాలి..
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు ప్రకటించినట్టు.. 2070 నాటికి భారత్‌ను సున్నా కర్బన ఉద్గారాల దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు 10 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు (సుమారు రూ.770 లక్షల కోట్లు) అవసరమని జీఈ–ఈవై సంయుక్త అధ్యయన నివేదిక పేర్కొంది. గతేడాది కాప్–26 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఈ లక్ష్యాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సమీప భవిష్యత్తులో భారత్ బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడాల్సిన పరిస్థితే ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది. ఈ అవసరాల నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా.. బొగ్గు వినియోగానికి సంబంధించి పర్యావరణ అనుకూల సాంకేతికతపై దృష్టి సారించడంతోపాటు ప్రోత్సహించాలని సూచించింది. భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఇంధన రంగంలో దిగుమతులపై ఆధారపడడాన్ని అధిగమించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) మాదిరి దేశీయ ప్రోత్సాహకాలు అవసరమని సూచించింది. ‘‘గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలి. తయారీ వ్యయాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. కోల్ ఆధారిత విద్యుత్‌కు సంబంధించి కార్బన్ క్యాప్చర్ సాంకేతికతలను వినియోగించాలి. కార్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. శుద్ధ ఇంధన టెక్నాలజీలను అమలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’అని ఈ నివేదిక పేర్కొంది. -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
అదంతా నాన్సెన్స్: ఎలన్ మస్క్
Fewer Kids Environment Theory: స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాడు. పర్యావరణం బాగుండాలంటే.. తక్కువ సంతానం కలిగి ఉండాలంటూ వినిపించే వాదనను ఆయన తోసిపుచ్చాడు. ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే.. అది వాతావరణానికి హాని అని అంటుంటారు. అందుకే తక్కువ మంది కనమని సలహాలిస్తుంటారు. అదంతా నాన్సెన్స్. జనాభా ఎంత పెరిగినా.. పర్యావరణానికి వచ్చిన నష్టం ఏం ఉండదు’’ అని ఆయన ఆల్ఇన్ సమ్మిట్( All-In Summit)లో వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించారు. కనీసం మన సంఖ్యను కాపాడుకుందాం. అలాగని నాటకీయంగా జనాభాను పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు ఏడుగురు బిడ్డల తండ్రైన ఎలన్ మస్క్. ఉదాహరణకు.. జపాన్‌లో జనన రేటు చాలా తక్కువ. కానీ, నాగరికతను కొనసాగించాలంటే.. జనాభా అవసరం ఎంతైనా ఉంది. దానిని మనం తగ్గించలేం అంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్ పరిస్థితి ఇంతకు ముందు మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జపాన్ జనాభా తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్న ఆయన.. జనాభా రేటులో మార్పుతేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదని హెచ్చరించారు కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో.. పిల్లలను తక్కువగా కలిగి ఉండడం వల్ల కార్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక బిడ్డ తక్కువగా ఉంటే.. 58.6 మెట్రిక్ టన్నుల ఉద్గారం వెలువడకుండా ఉంటుందంటూ ఓ థియరీ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్, ప్రొ క్లైమాటిక్ పాలసీలతో ఆ ప్రభావాన్ని(కార్బన్ ఉద్గారాల వెలువడడం) తగ్గించొచ్చని ప్రత్యేకంగా ఓ నివేదిక వెల్లడైంది. "Some people think that having fewer kids is better for the environment. Environment's gonna be fine even if we doubled the population. Japan had lowest birth rate. Having kids is essential for maintaining civilization. We can't let civilization dwindle into nothing." — @elonmusk pic.twitter.com/i03zytLDTJ— Pranay Pathole (@PPathole) May 20, 2022 -
6 అంతస్తులు.. లేదంటే అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాల వల్లే..
జనాభా పెరుగుదల వలన గ్రామాల నుంచి వలస వచ్చే ప్రజలతో నగరాలు, పట్టణాలు కిక్కిరిసిపోతు న్నాయి. ఫలితంగా నివాస స్థలం విలువ బాగా పెరిగింది. గతంలో ఒక అంతస్తుతో నిర్మించిన ఇళ్లు, పురాతన వారసత్వ సంపద వంటి ఇళ్లను సైతం తొలగించి, ఆ స్థలాల్లోను, ఇతర ఖాళీ ప్రదేశాలు అన్నింటిలోనూ 20... అంతకన్నా ఎక్కువ ఎత్తయిన భవనాల (ఆకాశ హర్మ్యాల)ను నిర్మించే సంస్కృతి ఇప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది. ఫలితంగా ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. నివాస గృహాలకు గిరాకీ పెరగటం వల్ల ఆకాశ హర్మ్యాల నిర్మాణాన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఆకాశ హర్మ్యాలు మెరుగైన అభివృద్ధికి సంకేతంగా గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ వాటి వలన ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోవటం వంటి దుష్పరిణామాలను తక్కువగా బేరీజు వేస్తున్నాం. ఒక అంతస్తు లేక తక్కువ అంతస్తులు గల ఇళ్లలో నివాసం ఉండే మనుషుల తలసరి విద్యుత్ వినియోగం కన్నా.. ఆకాశ హర్మ్యాలలో నివసించే వారి తలసరి విద్యుత్ వినియోగం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ మేరకు తలసరి ఉద్గారాలు కూడా పెరిగిపోతాయనే వాస్తవాన్ని గమనించటం లేదు. ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ, ఐక్యరాజ సమితి ఎన్ని విధాల హెచ్చరించినప్పటికీ దాదాపు అన్ని దేశాలూ ఈ హెచ్చరికలను అసలు పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో అన్ని అవసరాలకూ వాడుతున్న మొత్తం ఇంధనంలో.. నివాస భవనాలకు 8 శాతం, నివాసేతర భవనాలకు 22 శాతం ఇంధనాన్ని వాడుతున్నాం. ఈ 30 శాతంలో.. ఆకాశ హర్మ్యాలకు 55 శాతం, ఇతర సాధారణ భవనాలకు మిగతా 45 శాతం ఇంధనం వాడుతున్నాం. ఇది కాకుండా.. ప్రపంచంలో అన్ని అవసరాలకూ వాడుతున్న మొత్తం ఇంధనంలో మరో 5 శాతం ఇంధనాన్ని భవన నిర్మాణ (ఆకాశ హర్మ్యాలు, సాధారణ భవనాలు సహా) పరిశ్రమ ఉపయోగిస్తోంది. 6 అంతస్తులు లేదా అంతకంటే తక్కువ ఎత్తులో నిర్మించే కార్యాలయ భవనాల కంటే ఇరవై లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగిన ఆకాశ హర్మ్యాలలో ఇంధన వినియోగం దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. చలి దేశాల్లోని గృహసముదాయాలకు వేడి నీటి సరఫరా సౌకర్యం ఉంటుంది. అయితే దీనికోసం వినియోగించే గ్యాస్ .. తక్కువ ఎత్తయిన భవనాల్లో కంటే ఆకాశ హర్మ్యాల్లో 40 శాతం పెరుగుతుంది. తక్కువ అంతస్తులతో కూడిన భవనాలతో పోల్చితే ఆకాశ హర్మ్యాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 60 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో వెల్లడైంది. మనలాంటి ఉష్ణమండల దేశాల్లో ఈ ఉద్గారాలలో ఎయిర్ కండిషనింగ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇటుకల గోడలకు బదులుగా చుట్టూ అద్దాలను బిగించిన (గ్లాస్ ఫెకేడ్) ఆకాశ హర్మ్యాలలో వార్షిక తలసరి ఇంధన వినియోగం 1300–1500 యూనిట్ల మేరకు ఉంటుందని అంచనా. పర్యావరణ అనుకూల భవనాలతో పోలిస్తే.. ఆకాశ హర్మ్యాలలో వార్షిక తలసరి ఇంధన వినియోగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. -ఎం. రాజ్‌రెడ్డి, పర్యావరణవేత్త చదవండి Pudami Sakshiga: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే! Pudami Sakshiga: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు? -
యాంటీబయాటిక్స్‌తో భూసారానికీ ముప్పు.. అదెలా అంటే!
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్కింగ్ అంటున్నారు. యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్‌ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి -
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ
Nitin Gadkari Said We All Must Be Aligned to Be Carbon Neutral Country by 2070: ఇటీవల COP-26 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నిబద్ధతకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అంతేకాదు 2070 నాటికి ఎటువంటి ఉద్గారాలు లేని లేదా కార్బన్-న్యూట్రల్ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ కృషి చేయాలన్నారు. ఐసీసీకి చెందిన ఏజీఎం అండ్ వార్షిక సెషన్లో భారత్ @ 75 ''ఎంపవరింగ్ ఇండియా: టుమారో ఫర్ టుమారో''పై మంత్రి ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు డిజిటలైజేషన్‌ను వంటి వాటితో దేశంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో మన ప్రభుత్వం రేపటిని నిర్మించే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్న మలుపులో మేము నిలబడి ఉన్నాం. ఇది మన నేటి కంటే చాలా శక్తివంతమైనది. ఆత్మనిర్భర్ ఈ వాతావరణాన్ని తట్టుకోగలదు." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం గ్రీన్ హైవే మిషన్ కింద జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకం గొప్ప సరికొత్త మార్పిడిగా అభివర్ణించారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ మేరకు కారిడార్‌లో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించడంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు. అంతేకాక భారతమాల ఫేజ్ 1, 2 కింద 65,000 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద సుమారు 35,000 కి.మీ హైవేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని, మొత్తం మూలధన వ్యయం ₹. 10 లక్షల కోట్లు అని వెల్లడించారు. పైగా 20 వేల కి.మీ.లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే 2025 నాటి కల్లా 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందంటూ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ
రోమ్: భూగోళంపై జీవజాలం మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి–20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్థీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్–19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరిగిన జి–20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్ డిక్లరేషన్’ జారీ చేశారు. అవేమిటంటే... ► బొగ్గును మండించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని అడ్డుకోవడానికి విదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రుణ సాయంనిలిపివేయాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. ఈ ఏడాది ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు ఇప్పటికే ఈ తరహా తీర్మానాలు చేసుకున్నాయి. అయితే, సొంత దేశాల్లో బొగ్గు వాడకం తగ్గించుకోవడంపై జి–20 నేతలు లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. ► వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి. ► కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి. ► 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40% మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్ ఆఖ రుకి 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి. ► కరోనాతో నిలిచిపోయిన అంతర్జాతీయ ప్రయాణాలను తగిన రీతిలో పునఃప్రారంభించాలి. ► కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, అంతర్జాతీయ సంస్థలకు, సైంటిస్టులకు కృతజ్ఞతలు. ► ఆహార భద్రతను సాధించాలి. ప్రజలందరికీ అవసరమైన పౌష్టికాహారం అందించాలి. ఈ విషయంలో ఎవరినీ విస్మరించడానికి వీల్లేదు. స్పెయిన్ ప్రధాని శాంచెజ్‌తో మోదీ భేటీ భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు. జి–20 భేటీకి హాజరైన నేతలు ఆదివారం రోమ్‌లోని ప్రముఖ ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరు తమ భుజాలపై నుంచి నాణేన్ని ఫౌంటెయిన్లోకి విసిరారు. ఫౌంటెయిన్‌లో పడేలా నాణెం విసిరిన వారు రోమ్కు మరోసారి వస్తారనే నమ్మిక ఉంది. భారత ప్రధాని మోదీతోపాటు నాణేన్ని విసిరిన వారిలో స్పెయిన్ ప్రధాని శాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్, జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్, ఇటలీ ప్రధాని ద్రాఘి ఉన్నారు. -
2050 నాటికి ఆ మొత్తం మంది ఉన్న ఊరుని వదలక తప్పదా?
బార్సిలోనా: వాతారవణంలోని మార్పులు కారణంగా 2050 కల్లా దాదాపుగా 200 మిలియన్ల మంది ప్రజలు తమ నివాసాలు వదిలి వలసలు వెళ్లతారని ప్రపంచ బ్యాంక్ నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా నీటి కొరత, సముద్ర మట్టాలు పెరగడం, పంట ఉత్తాదకత తగ్గడం. వంటి వాటితో మొదలై 2050 కల్లా అది తీవ్ర వలసలకు మారిపోవచ్చు మారిపోవచ్చు అని నివేదికలో హెచ్చరించింది. అభివృద్ధి ముసుగులో అత్యధిక పరిశ్రమలను నెలకొల్పి వాటి నుంచి విడుదలై ఉద్గారాలను శుద్ధి చేయకుండా గాల్లోకి వదిలి మానవుడు తన వినాశనానికి తానే శ్రీకారం చుడుతున్నాడంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఆరు దేశాలైన లాటిన్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, సహారా ఆఫ్రికా, తూర్పు యూరప్, పసిఫిక్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 216 మిలియన్ల మంది ప్రజలు తమ మాతృభూమిని వీడి పోవాల్సి వస్తుందని నివేదిక నొక్కి చెప్పింది. వలసలు ప్రేరేపించేలా... సహారా ఆఫ్రికాలో అత్యధిక శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం అందువల్ల దాదాపు 86 మిలియన్ల మంది ప్రజలు వలసి వెళ్లిపోక తప్పదని నివేదికలో తెలిపింది. నార్త్ ఆఫ్రికా, ఈశాన్య తునిషియా, వాయువ్య అల్గేరియా, మొరాకో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వరదలు, నీటి కొరత కారణంగా సుమారు 19 మిలియన్ల మంది వలసి పోయే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక రానురానూ భవిష్యత్తరాలలో వలసలను ప్రేరేపించే విధంగా వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వాతావరణ నిపుణుడు వివియనే వీ చెన్ నివేదికలో పేర్కొన్నారు. (చదవండి: క్వాడ్ సదస్సుకు అమెరికా ఆతిధ్యం) శరణార్థుల శిభిరాల కేంద్రంగా... అనుకూలమైన వాతావరణం ఉండి, కాలుష్యం తక్కువగా ఉన్నా కూడా తమ అభివృద్ధి కోసమో లేక ఉన్నత ఉద్యోగమనో...లేదా మరే ఇతర కారణాల వల్ల ఇప్పటికే సుమారు 44 మిలియన్ల మంది ప్రజలకు తమ సోంత గడ్డను విడిచి పట్టణాలు/ విదేశాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పర్యావరణ నిపుణురాలు డాక్టర్ కాంత కుమారి రిగౌడ్ మాట్టాడుతూ..."వలసలు మనకేమి కొంత కాదు. ప్రపంచంలో మనకు తెసిన ప్రతి నలుగురిలో ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. దీనికి అననూకూల వాతావరణం తోడైతే వలసలు అధికమై శరణార్థుల శిభిరాల కేంద్రాలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని" అన్నారు. కార్యాచరణ దిశగా అడుగులు పడాలి... ప్రపంచ దేశాలన్ని ఉద్గారాలను తగ్గించడానికి ముందుకొస్తేనే ఈ పరిస్థితి జయించగలమన్నారు. వాతావరణ అత్యవసర పరిస్థితి రావడానికి బాధ్యులైన దేశాల్లో ముందున్నది అమెరికానే అని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ప్రతి ఏటా కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్(కాప్ 25) వంటి సదస్సులు పెట్టి తీసకుంటున్న నిర్ణయాలు మాటల వరకే పరిమతమవుతున్నాయి తప్ప కార్యచరణ దిశగా తీసుకురావడానికీ ఏ దేశం ముందుకు రావటం లేదని నివేదికలో వ్యాఖ్యానించారు. కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణమైన దేశాల నుంచి ముందుకు వస్తేనే 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించే దిశగా అడుగులు వేయగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్ స్పీకర్ ఆగ్రహం) -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిమిషాల్లోనే వజ్రాల తయారీ!
సాక్షి, హైదరాబాద్: వజ్రాలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా..? కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపల విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగిన కర్బన పదార్థం కాస్తా ఘనీభవించినప్పుడు వజ్రమవుతుంది.. అంత పురాతనమైనవి, అతి తక్కువగా లభ్యమయ్యేవి కాబట్టే వాటికంత విలువ.. అయితే వీటిని నిమిషాల్లో తయారు చేస్తామంటున్నారు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. డైమండ్ అన్వెయిల్ సెల్ అనే ఓ పరికరం ద్వారా ఇది సాధ్యమేనని వారు చెబుతున్నారు. భూమి లోపలి ఒత్తిడి, ఉష్ణోగ్రతల పరిస్థితులను ఈ పరికరంలో కృత్రిమంగా సృష్టించవచ్చన్నారు. 640 ఆఫ్రికన్ ఏనుగులు ఒక మేజోడు కొనపై కాలు మోపితే ఎంత ఒత్తిడి ఏర్పడుతుందో అంత అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరం లోపల సృష్టించినప్పుడు దాంట్లో ఉన్న కర్బన అణువులు కాస్తా స్ఫటికాలు (వజ్రాలు) గా మారిపోయాయని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోడీ బ్రాడ్బై తెలిపారు. (చదవండి: పొలాల్లో ‘వజ్రాల పంట’) కేవలం ఒత్తిడిని సృష్టించడంతోనే వజ్రం తయారు కాలేదని, కర్బన అణువులపై షీర్ ఎఫెక్ట్ (మెలితిప్పడం, జారిపోవడం వంటివి) కూడా పడినప్పుడే స్ఫటికాలు ఏర్పడతాయని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలను ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు సాయంతో పరిశీలించామన్నారు. ఇవి సాధారణ వజ్రాలతోపాటు ఉల్కా శకలాల కారణంగా ఏర్పడ్డ వజ్రాల్లోని లక్షణాలు రెండూ కలిగి ఉన్నాయని బ్రాడ్బై వివరించారు. ఈ పరిశోధన వివరాలు స్మాల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కటోవీస్ దారిలోనే మాడ్రిడ్!
పారిస్ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై చరిత్రాత్మక ఒడంబడిక కుదిరినప్పటినుంచీ దాన్ని ఉల్లంఘించడమే ధ్యేయంగా పనిచేస్తున్న దేశాలకు ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులు తప్పనిసరి లాంఛనం. ఈనెల 2 నుంచి 15 వరకూ స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగిన కాప్–25 సదస్సు కూడా ఆ కోవలోనిదే. దాదాపు 200 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పారిస్ శిఖరాగ్ర సదస్సు ఆమోదించిన ఒడంబడిక 2030నాటికి అన్ని దేశాలూ 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని తగ్గించాలని నిర్దేశించింది. ఆ దిశగా ఏ దేశం ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకుంటున్నదో, ఆచరణలో అవి ఏవిధంగా సాగుతున్నాయో, సాఫల్యవైఫల్యాలేమిటో సమీక్షించడం కాప్ సదస్సుల ధ్యేయం. కానీ ఏడాది పొడవునా నిర్వా్యపక త్వంతో ఉండిపోయి, ఈ సదస్సులకు ప్రతి దేశమూ ముఖాలు వేలాడేసుకు వస్తున్నాయి. సాధించిం దేమీ లేక, చెప్పడానికేమీ మిగలక తదుపరి కాప్ సదస్సుకు చర్చలను వాయిదా వేసుకుని తిరుగు ముఖం పడుతున్నాయి. తమ చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ సదస్సులను అనుకున్న కంటే మరో రెండురోజులో, నాలుగురోజులో, వారంరోజులో పొడిగించడం, ఏదో జరుగు తోందన్న అభిప్రాయం ప్రపంచ పౌరుల్లో కలిగించడం దేశాలు అనుసరించే ఎత్తుగడ. వాస్తవానికి కాప్–25 సదస్సుకు తాము ఆతిథ్యమిస్తామని రెండేళ్లక్రితం చెప్పిన బ్రెజిల్ అక్కడ ప్రభుత్వం మారాక నిరుడు మాట మార్చింది. దాంతో ఆ వేదికను చిలీ రాజధాని శాంటియాగోకు మార్చవలసి వచ్చింది. అయితే ఉద్యమాలతో అట్టుడుకుతున్న చిలీ ఈ సదస్సును నిర్వహించే స్థితిలో లేకపోవడంతో అది కాస్తా మాడ్రిడ్‌కు మారింది. ఈసారి సదస్సు సమయానికి ఒక్క చిలీ మాత్రమే కాదు... వేరే దేశాలు కూడా వేర్వేరు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త సమ్మె సాగింది. బ్రిటన్ ఎన్నికల హడావుడి, ప్రభుత్వం ఏర్పాటు వగైరాల్లో బిజీగా ఉంది. ప్రపంచంలో అతి పెద్ద కాలుష్య కారక దేశంగా ముద్రపడిన చైనా హాంకాంగ్ ఉద్యమంతో ఊపిరాడకుండా ఉంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా ఇప్పటికే పారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంది. అమెజాన్ మహారణ్యాల్లో ఏడు శాతం వరకూ వాటావున్న బొలీవియాలో ప్రభుత్వం సైనిక తిరుగుబాటులో కుప్పకూలింది. ఇక ఆ అర ణ్యాలు 60 శాతం మేర ఉన్న బ్రెజిల్ దాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ధ్వంసం చేసింది. పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న వాదనంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సి స్టులు’ పన్నిన కుట్రగా జైర్ బోల్సొనారో నాయకత్వంలోని మితవాద ప్రభుత్వం అభివర్ణిస్తోంది. భూగోళం ఉనికికే పెనుముప్పు తీసుకురాగల కాలుష్యాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోవడమే కాప్ సదస్సుల వరస వైఫల్యానికి కారణం. పారిస్ ఒడంబడిక ఎంత చరిత్రాత్మకమైనది అయినా అందులోని అంశాలు అమలు చేయని దేశాలకు భారీ జరిమానా విధిం చడం, అభిశంసించడం వంటి నిబంధనలు లేకపోవడంతో ఆ లక్ష్యాలను సాధించడానికి ఏ దేశమూ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పర్యావరణం ప్రమాదంలో పడిందన్న విషయంలో అమెరికా, బ్రెజిల్ తప్ప అందరూ ఏకీభవిస్తున్నారు. నిజానికి పారిస్ ఒడంబడిక ఆ ప్రమాదాన్ని అవసరమైన స్థాయిలో పట్టించుకోలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ దేశాలు అనేక ఉత్పాతాలను చవిచూశాయి. మొన్న సెప్టెంబర్‌లో బహామస్ను చుట్టుముట్టిన పెనుతుపాను డోరియన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కేటగిరీ 5లో చేర్చిన ఈ తుపాను వల్ల 70మంది ప్రాణాలు కోల్పోగా, 340 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. అగ్రరాజ్యాల చర్యల పర్యవసానాలను చిన్న దేశాలు ఎలా భరించవలసి వస్తున్నదో చెప్పడానికి బహామస్ దేశమే ఉదాహరణ. ఇదొక్కటే కాదు... వనౌతు, తువాలు వంటి అతి చిన్న ద్వీపకల్ప దేశాలు కూడా తరచూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనే చిక్కు కుంటున్నాయి. ఇలాంటి చిన్న దేశాలను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత, శిలాజ ఇంధనాల్ని యథేచ్ఛగా వాడుతూ లాభాలు గడిస్తున్న అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఉంది. కానీ వీరిలో ఏ ఒక్కరూ ఆ సంగతిని గుర్తించడం లేదు. మాడ్రిడ్ సదస్సులో జరిగిన చర్చల తర్వాత ఈ దేశాలు నామమాత్రమైన సాయాన్ని విదిల్చి తమ బాధ్యత తీరినట్టు ప్రవర్తించాయి. పారిస్ ఒడంబడిక లక్ష్యాలు ఏమిటో, వాటిని సాధించడానికి ఏం చేయాలో ప్రతి దేశానికీ తెలుసు. అన్ని దేశాలూ ఒకే స్థాయిలో కాలుష్యానికి కారణం కావడం లేదు. అలాగే ఈ కాలుష్య పర్య వసానాలను అన్ని దేశాలూ సమాన స్థాయిలో చవి చూడటం లేదు. ఏ ఒక్క దేశమో పూనుకుని ఈ కాలుష్యాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. కనుక ప్రతి దేశమూ కాలుష్యంలో తన బాధ్యతను నిజాయితీతో గ్రహించి, దాని అదుపునకు గరిష్టంగా ఏం చేయగలనో నిర్ణయించుకోవాలి. అందరి లక్ష్యమూ కాలుష్యాన్ని అంతం చేయడమే అయినా, ఎవరెంత కారకులన్న దాన్నిబట్టి భారాన్ని పంచు కోవాలి. కానీ సంపన్న దేశాల వైఖరి వేరుగా ఉంది. అతిగా కాలుష్యాన్ని విడుస్తున్నా దానికి దీటైన చర్యలుండటం లేదు. కనుకనే అందరి మెడలూ వంచే విధంగా నిబంధనలుండాలి. ఆ నిబంధనల మాట అటుంచి కర్బన ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో విఫలమైన దేశాలు తప్పించుకోవడానికి పారిస్ ఒడంబడిక వీలు కల్పించింది. అందులోని ఆరో అధికరణ అటువంటిదే. కర్బన ఉద్గారాల అదుపులో విఫలమైన సంపన్న దేశం... వాగ్దానానికి మించి అదుపు చేసిన దేశాలనుంచి ఆ ‘అదనాన్ని’ కొనుగోలు చేయొచ్చునని చెప్పే ఈ అధికరణ పరిస్థితి మెరుగుదలకు ఏమైనా దోహదపడుతుందా? మొత్తానికి ఈ సదస్సు ఎప్పటిలాగే సమస్యల్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లోని గ్లాస్గోలో వాటిని పరిష్కరిస్తామని ఆశాభావం వెలిబుచ్చింది. కానీ నమ్మేదెవరు? నిర్ణయాత్మకంగా వ్యవహరిం చలేని ఇలాంటి సదస్సులు చివరకు నిరర్థకమవుతాయి తప్ప సాధించేదేమి ఉండదు. -
విషవాయువుకు కొత్త ఉపయోగం
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే పొగలో బోలెడంత కార్బన్డయాక్సైడ్ ఉంటుంది. భూతాపోన్నతి నేపథ్యంలో ఈ విషవాయువులను తొలగించేందుకు టెక్నాలజీలు ఉన్నా.. వ్యయప్రయాసల దృష్ట్యా అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిషిగన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గాలిలో నుంచి కార్బన్డయాక్సైడ్ తొలగింపును లాభసాటి చేయగల ఆవిష్కరణ ఒకటి చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సాలిక్ యాసిడ్‌గా మార్చడం ఇందులో కీలకమైన విషయం. ముడి ఖనిజం నుంచి కొన్ని అరుదైన మూలకాలను వెలికి తీసేందుకు ఈ ఆక్సాలిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తారు. సెల్ఫోన్లలో ఉపయోగించే ఈ మూలకాల ఉత్పత్తి చైనాలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిషిగన్ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ఆవిష్కరణ చేయడం విశేషం. సోడియం కార్బొనేట్ ద్వారా పంపినప్పుడు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే వాయువుల్లోని కార్బన్డయాక్సైడ్ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కవాత్ర తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, మిగిలిన అవశేషాల ద్వారా ఆక్సాలిక్ యాసిడ్‌ను తయారు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మరింత ఎక్కువ విష వాయువును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ పద్ధతి ఇప్పటికే ఉపయోగిస్తున్న దానికంటే పది రెట్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తుందని వివరించారు. -
కాలుష్యాలను భోంచేసే బ్యాక్టీరియా
కార్బన్డయాక్సైడ్ మొదలుకొని మనకు హాని కలిగించే అన్ని రకాల కాలుష్యాలనూ అనాయాసంగా పీల్చేసే సూక్ష్మజీవులను టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలిఫోర్నియా జలసంధి ప్రాంతంలో సముద్రపు అట్టడుగున జరిపిన పరిశోధనల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని డజన్ల కొత్తరకం సూక్ష్మజీవులను వీరు గుర్తించారు. వీటిల్లో కొన్ని పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లను ఆహారంగా తీసుకునేవి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం ఈ బ్యాక్టీరియా జన్యుపరంగా చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు నేరుగా వాతావరణంలోకి విడుదల కాకుండా ఈ సూక్ష్మజీవులు అడ్డుకుంటున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రెట్ బేకర్ అంటున్నారు. దాదాపు రెండు వేల మీటర్ల దిగువన 200 డిగ్రీ సెల్సియస్ వేడి వాతావరణంలో తాము జరిపిన అన్వేషణ ఫలితంగా దాదాపు 551 కొత్త జన్యుక్రమాలను గుర్తించడం వీలైందని, వీటిల్లో కనీసం 22 ఇప్పటి వరకూ ఎవరికీ తెలియనివని ఆయన వివరించారు. సూక్ష్మజీవుల్లో ఇప్పటివరకూ మనిషి గుర్తించింది కేవలం 0.1 శాతం మాత్రమేనని.. మిగిలిన వాటిని కూడా గుర్తిస్తే కాలుష్యం, ఇంధన సమస్యలకు బ్యాక్టీరియా ఆధారిత పరిష్కారాలు లభిస్తాయని శాస్త్రవేత్తల అంచనా. గయమాస్ బేసిన్లో గుర్తించిన కొత్త బ్యాక్టీరియాను సమర్థంగా వాడుకోగలిగితే వాతావరణంలోని కాలుష్యకారక వాయువుల సాంద్రతను