తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం | India bans burning cow dung near Taj Mahal | Sakshi
Sakshi News home page

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

Published Wed, Jan 14 2015 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

లక్నో: తాజ్‌మహల్ సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని ఆగ్రా డివిజినల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ మంగళవారం నిషేధించారు. చిన్న చిన్న పరిశ్రమల్లో బొగ్గు వాడకాన్ని నిషేధించడంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇటీవల ఓ అమెరికన్ జర్నల్ గాలిలోని కార్బన్ వల్లనే తాజ్‌మహల్ రంగు పసుపుగా మారుతోందని తన పరిశోధనలో పేర్కొనడంతోపిడకలపై నిషేధం విధిస్తున్నామని భట్నాగర్ చెప్పారు. దీనివల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వారికి ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement