తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం
లక్నో: తాజ్మహల్ సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని ఆగ్రా డివిజినల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ మంగళవారం నిషేధించారు. చిన్న చిన్న పరిశ్రమల్లో బొగ్గు వాడకాన్ని నిషేధించడంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇటీవల ఓ అమెరికన్ జర్నల్ గాలిలోని కార్బన్ వల్లనే తాజ్మహల్ రంగు పసుపుగా మారుతోందని తన పరిశోధనలో పేర్కొనడంతోపిడకలపై నిషేధం విధిస్తున్నామని భట్నాగర్ చెప్పారు. దీనివల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వారికి ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామన్నారు.