taj mahal
-
మన ఢిల్లీ... మన హెరిటేజ్
ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్... ఆగ్రా రెడ్‌ఫోర్ట్... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్ మినార్... హుమయూన్ సమాధి... వీటికి 1993లో ఆ హోదా వచ్చింది. దేశ రాజస దర్పణం రెడ్‌ఫోర్ట్ మాత్రం... ఈ గౌరవాన్ని 2007లో అందుకుంది.ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించి ‘అరే హుజూర్ వాహ్ తాజ్ బోలియే’ అన్న ప్రకటనను మనదేశంలో దాదాపుగా అందరూ చూసి ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తాజ్‌మహల్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెడ్ఫోర్ట్కి తాజ్ మహల్‌కి ఓ దగ్గరి సంబంధం ఉంది. రెండింటి ఆర్కిటెక్ట్ ఒకరే... అతడే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంతటి సౌందర్యం తాజ్‌మహల్‌ది. ఉత్తరప్రదేశ్‌లో కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా పాతికేళ్ల కిందట తాజ్‌మహల్ గోడలు పసుపురంగులోకి మారాయి. ఆ సమయంలో తాజ్‌మహల్‌ని చూసిన వాళ్లు ఫొటోల్లోనే బాగుందనుకున్నారు. ఇప్పుడు అలాంటి అసంతృప్తి ఉండదు. మనదేశానికి అమెరికా అధ్యక్షుడు (తొలి దఫా అధ్యక్షుడుగా ఉన్న సమయం) డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సందర్భంగా తాజ్‌మహల్‌కి మెరుగులు దిద్దారు. ఇప్పుడు పాలరాయి తెల్లగా మెరుస్తోంది. 42 ఎకరాల్లో నిర్మించిన తాజ్‌మహల్ నిర్మాణం రెడ్‌ఫోర్ట్ నిర్మాణం కంటే ఎనిమిదేళ్లు ముందు మొదలైంది. రెడ్‌ఫోర్ట్ పూర్తయిన తర్వాత ఐదేళ్లకు పూర్తయింది. అంటే 1631– 1653 వరకు 22 ఏళ్లు కట్టారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ముందుకు నడిచే కొద్దీ తాజ్ మహల్‌ను తలెత్తి చూడాలి. తాజ్‌మహల్ నుంచి ఆగ్రాఫోర్ట్, షాజహాన్ ప్యాలెస్ చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక వైపు నుంచి బేస్మెంట్ కిందకు చూస్తే యమునా నది గంభీరంగా ప్రవహిస్తుంటుంది.హుమయూన్ సమాధి భార్య ప్రేమకు చిహ్నం హుమయూన్ కా మఖ్బారా... హుమయూన్సమాధి. మనదేశానికి పర్షియా ఉద్యానవనశైలిని మనకు పరిచయం చేసిన కట్టడం ఇది. మనదేశంలో మొఘల్ వాస్తుశైలిలో నిర్మితమైన తొలికట్టడం. తాజ్ మహల్, హుమయూన్స్ టూంబ్ రెండూ సమాధి నిర్మాణాలే. రెండూ ఆర్కిటెక్చర్ పరంగా గొప్ప కట్టడాలే. తాజ్ మహల్‌ని భార్య జ్ఞాపకార్థం భర్త కట్టించాడు. హుమయూన్ టూంబ్‌ను భర్త జ్ఞాపకార్థం భార్య కట్టించింది. ప్రేమ చిహ్నంగా గొప్ప ప్రమోషన్ రాలేదు, కానీ నిర్మాణపరంగా ఇది కూడా గొప్ప కట్టడమే. హుమయూన్ సమాధి ఢిల్లీ శివార్లలో నిజాముద్దీన్‌లో ఉంది. ఈ సమాధి పైన గుమ్మటం ఎత్తు 42.5 మీటర్లు. ఈ సమాధి మొత్తం నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న గట్టు మీద ఉంటుంది. దాని మీద ఆరు మీటర్లకు పైగా ఎత్తున్న భవనాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడం నిర్మాణం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. మొఘల్ ఉద్యానవన శైలి చార్బాగ్ శైలి ఇందులో కూడా కనిపిస్తుంది. ఈ గార్డెన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నీటి పంపులు, వాటర్ఫౌంటెయిన్లతో ఆధునిక సాంకేతికత కనిపిస్తుంది.హుమయూన్ సమాధి నిర్మాణం క్రీ.శ 1562లో మొదలైంది. ఈ సంగతి తెలియగానే వచ్చే సందేహం ఒక్కటే...∙హుమయూన్ మరణించింది క్రీ.శ 1556 జనవరి 20వ తేదీ. మరి సమాధి అప్పుడు కట్టలేదా అనే ప్రశ్న నిజమే. మరణించిన వెంటనే పురానాఖిలాలో ఖననం చేశారు. కొంతకాలానికి శవపేటికను పెకలించి పంజాబ్ లోని సిర్హింద్కు తీసుకెళ్లారు. రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత హుమయూన్ భార్య హమీదాబేగం (అక్బర్ తల్లి) భర్త జ్ఞాపకార్థం గొప్ప నిర్మాణం చేయాలనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న హుమయూన్ సమాధి. ఈ నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఢిల్లీకి ట్రైన్లో వెళ్లేటప్పుడు నగరంలోకి ప్రవేశించడానికి ముందే నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. సమాధి నిర్మాణం ఎత్తైన బేస్మెంట్ మీద ఉండడంతో ట్రైన్‌లోకి కనిపిస్తుంది.సలామ్ .. రెడ్ ఫోర్ట్మొఘలుల సామ్రాజ్య విస్తరణలో రెడ్ఫోర్ట్ది కీలకమైన స్థానం. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇందులో షాజహాన్ నివసించిన ప్యాలెస్, ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మసీదు, ఇతర ప్యాలెస్‌లు ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణాలే. ఇక్కడున్న దివానీ ఖాస్, దివానీ ఆమ్లు ఆగ్రాఫోర్ట్‌లో ఉన్న వాటికంటే భారీ నిర్మాణాలు. ఈ కోట ్రపాంగణం అంతా కలియదిరిగినప్పుడు ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనిని డిజైన్ చేశాడు. ఇందులో ఇండియన్ నిర్మాణశైలితోపాటు పర్షియన్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కట్టడానికి పదేళ్లు పట్టింది. రాజసాన్ని ప్రదర్శించే ఈ కోట 1648– 1857 వరకు మొఘలుల అధీనంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ స్వాధీనంలోకి వెళ్లింది. స్వాతంత్య్ర సాధనతో మన జాతీయపతాకం ఎగిరింది. అప్పటి నుంచి ఏటా పతాకావిష్కరణ సందర్భంగా టీవీలు, పత్రికల్లో దేశ ప్రజలకు దర్శనమిస్తోంది. నిర్వహణ భేష్!రెడ్‌ఫోర్ట్ నిర్వహణ బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తర్వాత కోట ్రపాంగణం టూరిస్ట్ ఫ్రెండ్లీగా మారింది. నిర్మాణాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చటి లాన్లను మెయింటెయిన్ చేయడంతో ఇక్కడ ఎండాకాలంలో కూడా టూరిస్టులు సౌకర్యంగా తిరుగగలుగుతున్నారు. టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా బాగున్నాయిప్పుడు. అనేక కాంప్లెక్స్‌లను మ్యూజియాలుగా మార్చడం మరొక మంచి పరిణామం. రెడ్‌ఫోర్ట్ టూర్‌ను ఆద్యంతం ఆస్వాదించే క్రమంలోనే ముంతాజ్ మ్యూజియం, ఇండియన్ ఆర్ట్ మ్యూజియం వంటి వాటిని కూడా కవర్ చేయవచ్చు. దిగుడుబావి ఉంది!రెడ్‌ఫోర్ట్ ఆవరణలో ఒక స్టెప్‌వెల్ ఉంది. రెడ్ఫోర్ట్ని ఓ పదేళ్ల కిందట చూసిన వాళ్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఈ సారి వెళ్లినప్పుడు మర్చిపోకుండా చూడాలి. అయితే ఈ బావిలోకి దిగడానికి ఏ మాత్రం వీల్లేదు. ఢిల్లీ నగరంలోని అగ్రసేన్‌కీ బావోలీ వంటి కొన్ని స్టెప్వెల్స్లోకి ఒకటి– రెండు అంతస్థుల వరకైనా అనుమతిస్తారు. కానీ ఈ రెడ్‌ఫోర్ట్ స్టెప్వెల్ని పూర్తిగా లాక్ చేసి పైన గ్రిల్ అమర్చారు. నేల మీద నుంచి వంగి చూడాల్సిందే.తొలి ఎర్రకోట ఆగ్రా ఫోర్ట్ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది. ఢిల్లీ ఎర్రకోట కంటే ముందుది. ఈ కోట యమునాతీరాన తాజ్ మహల్‌కు పక్కన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే తాజ్‌మహల్ అందంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ నుంచి ఈ కోట ఠీవిగా కనిపిస్తుంది. ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ అన్నవన్నీ ఉన్నాయి. వంద ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. దివానీ ఆమ్, దివానీ ఖాస్ వంటి పాలన భవనాలతోపాటు ప్యాలెస్‌లున్నాయి. షాజహాన్ అంత్యకాలంలో నివసించిన ప్యాలెస్ షా బుర్జ్ ఇక్కడే ఉంది. ఈ ప్యాలెస్ నుంచి తాజ్‌మహల్ వ్యూ అందంగా ఉంటుంది. షాజహాన్‌ను కొడుకు ఔరంగజేబు ఖైదు చేశాడని తెలిసినప్పుడు సానుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్యాలెస్‌ను చూస్తే రాజు జైల్లో ఉన్నా రాజరికపు సౌకర్యాలేమీ తగ్గవనే వాస్తవం తెలిసి వస్తుంది. అక్బర్ కట్టించిన ‘జహంగీర్ మహల్’ ఒక అద్భుతం. మధ్య ఆసియా నుంచి అక్కడ ప్రసిద్ధులైన వాస్తు శిల్పులను పిలిపించి, స్థానికంగా ఉన్న హిందూ వాస్తుశిల్పులలో నిపుణులను ఎంపిక చేసి అందరి సమష్టి కృషితో గొప్ప నిర్మాణం జరగాలని ఆదేశించాడట. ఆ మేరకే వాళ్లు దీనిని డిజైన్ చేశారట. మొఘలుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. కోట లోపల అక్బర్‌కు విజయం అందించిన ఆయుధాగారం ఉంది. రతన్‌సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్‌మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్‌టబ్‌లను చూడడం మరువకూడదు. ఈ ఎర్రకోటలోకి పర్యాటకులను అమర్‌సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది. టూర్ ఆపరేటర్లు తాజ్‌మహల్ కంటే ఈ కోటకు తీసుకువెళ్తారు. త్వరగా రాకపోతే తాజ్‌మహల్ చూడడానికి సమయం చాలదని తొందరపెడుతుంటారు. దాంతో పర్యాటకులు ప్రశాంతంగా ఆస్వాదించలేకపోతారు.కుతుబ్ మినార్కుతుబ్మినార్ ఐదు అంతస్థుల కట్టడం. ఢిల్లీ శివారులో మెహ్రౌలీలో ఉంది. దీని నిర్మాణం క్రీ.శ 1199 నుంచి 1220 వరకు అనేక దఫాలుగా జరిగింది. అనంగపాల్ తోమార్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, కుతుబుద్దీన్ ఐబక్ షంషుద్దీన్ ఇల్‌టుట్ మిష్ వరకు అనేక రాజవంశాల చరిత్రలో ఈ మినార్ది కేంద్రస్థానం. హుమయూన్‌కి అక్బర్‌కి మధ్య కాలంలో షేర్షా సూరి కూడా తన వంతుగా కొన్ని మెరుగులు దిద్దాడు. ఈ 62 మీటర్ల ఎత్తున్న ఈ మినార్‌కు 14వ తతాబ్దంలో ఫిరోజ్‌షా తుగ్లక్ పై అంతస్థును నిర్మించాడు. ఈ నిర్మాణం ఇండో ఇస్లామిక్ సమ్మేళనం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులో అరబిక్ భాషలో రాసిన ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. నిర్మాణంలో వలలాంటి అల్లికల నిర్మాణం పర్షియన్ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. తామర రేకులను పోలిన అంచులు హిందూ నిర్మాణాల శైలికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన ఇటుకలను ఆఫ్గనిస్థాన్ నుంచి తెప్పించారు. ఈ ్రపాంతాన్ని ఏలిన పాలకులందరూ ఈ నిర్మాణానికి ఏదో ఒక సొబగులద్ది చరిత్రలో తమ పేరు కూడా ఉండేటట్లు జాగ్రత్తపడ్డారు.ఐరన్ పిల్లర్ ప్రత్యేక ఆకర్షణకుతుబ్మినార్తోపాటు అనేక కట్టడాలున్నాయి. విశాలమైన ్రపాంగణంలో ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పడానికి వీల్లేని నిర్మాణాల అవశేషాలుంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ శిథిలాలకు రూపమిచ్చే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కుతుబ్‌మినార్ కట్టడం లాల్ కోట్ శిథిలాల మీద మొదలైందని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడున్న ఐరన్ పిల్లర్ మరో చారిత్రక గొప్పదనం. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. మనదేశంలో లోహశాస్త్రం ఎంత శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏయే లోహాలను ఎంతెంత నిష్పత్తిలో వాడారనే విషయంలో రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలు చేస్తుంటారు.టూర్ ప్యాకేజ్‌లిలా ఉంటాయి!∙ఢిల్లీకి విమానం లేదా రైల్లో వెళ్లిన తర్వాత లోకల్ టూర్ ప్యాకేజ్ తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఢిల్లీ డే టూర్ ప్యాకేజ్లుంటాయి.ఏసీ బస్సు లేదా విడిగా కారు మాట్లాడుకోవచ్చు. కారుకు రోజుకు ఏడు లేదా ఎనిమిది వేలుంటుంది. బస్సులో ఒకరికి వెయ్యి రూపాయలకు అటూఇటూగా ఉంటుంది. ∙ఢిల్లీకి వెళ్లడానికి ముందే నగరంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాతోపాటు సిటీ టూర్ మ్యాప్‌ను పరిశీలించాలి. ఏయే ప్రదేశాలను ఒక క్లస్టర్‌గా ప్లాన్ చేసుకోవచ్చనే అవగాహన వస్తుంది. అలాగే ఆయా ప్రదేశాలకు సెలవు దినాల వివరాలను కూడా ఆయా వెబ్సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలి.∙ఆహారం విషయానికి వస్తే చోలే–బటూరా, బటర్ చికెన్, జిలేబీ, రబ్రీ ఫాలూదాలను తప్పనిసరిగా రుచి చూడాలి. -
తాజ్‌మహల్‌లో తెలంగాణ రాళ్లు!
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్‌మహల్‌ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది. పర్చిన్కారీ పద్ధతిలో.. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్‌కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్‌లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్‌కారి కళ 16వ శతాబ్దంలో భారత్‌లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు. అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్‌మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు. పలుగురాయిలో భాగమే.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్జ్గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.మన రాళ్లే ఎందుకు?.. తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు. ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి. ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్నగర్లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం. నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే.. తాజ్మహల్లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య
ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ఆయోధ్య రామ మందిరం వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి వచ్చిoది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా ఆయోధ్య రికార్డులకు ఎక్కింది. ఈ 9 నెలల్లో ఆగ్రాను 12.51 కోట్ల మంది సందర్శించగా.. అయోధ్యను 13.55 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 22న ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమై అయోధ్య రామ మందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేరింది. విదేశీయులు 3,153 మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతోందని ట్రావెల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకుల్లో 70 శాతం మంది రామమందిరం, సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోని బాంబ్ స్క్వాడ్
ఆగ్రా: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం, బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్‌మహల్ వద్ద సోదాల అనంతరం.. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Uttar Pradesh | Taj Mahal in Agra received a bomb threat via email todayACP Taj Security Syed Areeb Ahmed says, "Tourism department received the email. Based on that, a case is being registered at Tajganj police station. Further investigation is being done..."(Pics: ACP Taj… pic.twitter.com/1lw3E34dOM— ANI (@ANI) December 3, 2024 -
తాజ్‌మహల్, చార్మినార్‌నూ కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు. ‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.భాగవత్ మాటా బీజేపీ వినదా?‘‘2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు. -
తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
ఆగ్రా: ప్రపంచ అద్భుతాలతో ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారా? కాదు.. కాదు.. ఇది నిజం.. ఇటీవలికాలంలో తాజ్ మహల్ మాయమైపోతోంది. ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది. దీనివెనకగల కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశరాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రావాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదయ్యింది. ఈ నేపధ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్‌ను కప్పేస్తోంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిపోయింది. ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ -
తాజ్‌మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్‌మహల్‌కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్‌గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్‌ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్‌ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్‌మహల్
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్‌ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్‌మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్‌కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.వారు తాజ్‌మహల్‌ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్‌మహల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్‌ను నిర్మించారు. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
నల్లరాతి తాజ్‌మహల్ ఎక్కడుంది? దేనికి చిహ్నం?
ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నల్లరాతి తాజ్‌మహల్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్‌పూర్‌ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది. ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌ను నిర్మించాడు. ఈ నల్లరాతి తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. -
ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం!
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్‌ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)న్ని అస్సలు మిస్సవ్వరు. తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఏర్పాటు చేయడం విశేషం. ఎన్ని రోజులు జరుగుతుందంటే.. ఈ ఏడాది తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం.సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈసారి ప్రత్యేకతలు... ఈ ఏడాది తాజ్ మహోత్సవ్‌లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్‌లో కనిపించనుంది. యమునా నది ఘాట్లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు.. తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్ మహోత్సవ్‌లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్, సబ్-క్లాసికల్ గానం, భోజ్‌పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్, తబలా, పఖావాజ్, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు. తాజ్ మహోత్సవ్‌లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, తదితర ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు. Glimpses of Taj Mahotsav: A Cultural Extravaganza in the Heart of Agra. Celebrating 33 years in 2024 Experience India's rich arts, crafts, music, cuisine. With 400 artisans showcasing woodwork, stone carving, mesmerizing performances, delicious food. 17th to 27th Feb, 2024. pic.twitter.com/TU4yAvWB9C — Taj Mahal (@TajMahal) February 15, 2024 (చదవండి: తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
Priyanka Jain- Shivakumar: తాజ్‌మహల్ ముందు ప్రియాంకకు ప్రపోజ్ చేసిన నటుడు (ఫోటోలు)
-
తాజ్ సందర్శకునికి గుండెపోటు.. సీపీఆర్ ఇచ్చి కాపాడిన కుమారుడు!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. అయితే వెంటనే స్పందించిన అతని కుమారుడు సీపీఆర్ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే ఒక వృద్ధుడు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు. అతను తాజ్‌మహల్ కాంప్లెక్స్ లో గుండెపోటుకు గురయ్యాడు. అతని కుమారుడు వెంటనే తండ్రికి సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని ఈ వీడియో తెలియజేస్తోంది. సీపీఆర్‌తో కోలుకున్న బాధితుడిని తక్షణం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండెపోటుకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య సహాయం అందేలోగా సీపీఆర్ చేయడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. బాధితుని శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్ సహాయ పడుతుంది. తద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. आगरा ➡ताजमहल के अंदर CPR देते का लाइव वीडियो वायरल ➡पर्यटक को सीपीआर देते का लाइव वीडियो हुआ वायरल ➡ताजमहल देखने आए पर्यटक को आया था हार्ट अटैक ➡काफी देर तक CPR देने के बाद पर्यटक की लौटी जान ➡ताजमहल परिसर के अंदर वीडियो प्लेटफार्म का मामला.#Agra pic.twitter.com/hRxTtDwXIu — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 15, 2023 -
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ అరుదైన ఘనత
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది. విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్‌బోర్డ్‌ను ఆవిష్కరించడంతో ఈ ఘనతను సాధించింది. 'మేఘ్ సంతూర్' పేరుతో 2250 చదరపు అడుగుల బిల్‌బోర్డ్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ బిల్ బోర్డ్ విజయవాడ నగర వాసుల్ని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దీంతో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు. -
డేంజర్ యమున.. తాజ్ మహల్‌ను తాకిన వరద
ఢిల్లీ: దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో.. యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్క్‌ను చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో.. ప్రపంచ వింత ‘తాజ్‌మహల్’ ను యమునా వరద తాకగా.. ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 కిందట.. ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 1978లో తాజ్‌మహల్‌ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. #WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023 వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్‌లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్‌లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్‌మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్‌మహల్ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తాజ్‌మహల్ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది. కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్‌లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు. A dog died due to heat and suffocation as his owners left him in their parked car to visit Taj Mahal. If you can’t treat your pets properly then don’t adopt them. https://t.co/4ZI7iMj6n1 — Rishi Bagree (@rishibagree) July 3, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే
గువాహటి: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహాన్‌కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు. అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే.. మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. NCERT తాజాగా మొఘలులపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము. కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చివేసి.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. నేటికి దీనిని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. Guwahati, Assam | Taj Mahal is not the symbol of Love. Shah Jahan built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: BJP leader Rupjyoti Kurmi (05.04) — ANI (@ANI) April 6, 2023 -
తాజ్‌మహల్‌ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్ గైడ్‌గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్‌మహల్‌కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్‌ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్‌మహల్‌కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
‘తాజ్‌మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్‌మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‌ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా కుమారి
జైపూర్: ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజ్ మహల్‌లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న ప్రాంతం.. తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని బుధవారం రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్ మహల్లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే తమ పూర్వీకులకు(జైపూర్ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు. -
Taj Mahal: వట్టి మాటకు గట్టి ప్రచారం!
తాజ్‌మహల్ నిర్మాణం వెనుక గొప్ప కళాచాతుర్యం ఉన్నట్లే కొన్ని పేలవమైన కల్పనలూ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూపమైన నిర్మాణం జరగకుండా తాజ్‌మహల్‌ను నిర్మించిన వారి చేతులను షాజహాన్ నరికించాడన్నది మనం వింటూ వస్తున్న ఒక కల్పన. గత డిసెంబరులో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌ను ప్రారంభించిన సందర్భంగా పారిశుధ్య కార్మికులపై పూలజల్లు కురిపించినప్పుడు... ‘నాటి రాజు షాజహాన్ కార్మికుల చేతులను నరికిస్తే.. నేటి రాజు నరేంద్ర మోదీ కార్మికులపై పూలవర్షం కురిపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అలా ఒక అవాస్తవానికి మళ్లీ పిలకలు బయల్దేరాయి. తాజ్‌మహల్ నిర్మాణం ఎలా సాగిందనేది చేతిరాతతో అరబిక్ లిపిలో పొందుపరిచి ఉన్న సమాచారం ఆధారంగా అర్థమౌతుందని యునెస్కో పేర్కొంది. తాజ్ గోపుర సమాధి, లోపలి వెలుపలి భాగాలను నిర్మించడానికి తాపీ పనివాళ్లను, రాళ్లు చెక్కేవారిని, మణులను పొదిగేవారిని, చిత్రకారులను, శిల్పకళా నిపుణులను ఆ కాలంలోనే షాజహన్ తన మొత్తం సామ్రాజ్యం నుండి, ఇంకా.. మధ్య ఆసియా, ఇరాన్ నుండి రప్పించారు. తాజ్ మహల్ ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలికి గొప్ప తార్కాణమని యునెస్కో కీర్తించింది. తాజ్ నిర్మాణ కార్మికులకు, కళాకారులకు ఇచ్చిన జీతభత్యాలు, నెలసరి వేతనాలలో షాజహాన్ గొప్ప ఉదారతను ప్రదర్శించినట్లు కూడా నాటి జమాఖర్చుల పుస్తకాలను బట్టి తెలుస్తోంది. ఉదా: రాళ్లను చెక్కే అటా ముహమ్మద్ అనే నిపుణుడికి నెలకు రూ.500 చెల్లించారు. ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా నుంచి వచ్చిన షాకీర్ ముహమ్మద్ అనే కట్టుబడి మేస్త్రి నెలకు రూ.400 అందుకున్నాడు. ముల్తాన్‌కు చెందిన తాపీ కార్మికుడు ముహమ్మద్ సజ్జాద్ నెలకు రూ. 590, లాహోర్ నుంచి వచ్చిన ముఖద్వార నిర్మాణ కార్మికుడు చిరంజీలాల్కు నెలకు రూ.800 ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన ఈ భారీ మొత్తాలను బట్టి వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో నిర్దిష్టమైన పనికి బాధ్యత వహించేవాళ్లనుకోవచ్చు. చెప్పి చేయించేవాళ్ల చేతులను కానీ, చెప్పింది చేసేవాళ్ల చేతులను కానీ షాజహాన్ నరికించారు అనడంలో ఆధారాల మాట అటుంచి, అసలు అర్థమే లేదు. (చదవండి: రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!) మేస్త్రీలు కాకుండా.. వాస్తుశిల్పులు, చేతిరాత నిపుణులు, నిర్వాహకులు కూడా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వాళ్ల గురించిన వివరాలూ రికార్డులలో ఉన్నాయి. ఇరాన్‌లోని షిరాజ్ ప్రాంతం నుంచి తన పెద్ద సోదరుడు అఫ్జల్‌ఖాన్‌తో కలిసి మొఘల్ ఆస్థానానికి వచ్చిన కాలిగ్రాఫర్ అమానత్ ఖాన్ ప్రత్యేక గౌరవ మర్యాదల్ని పొందారు. తాజ్ కుడ్యాలపై ఖురాన్ శాసనాలను అందంగా లిఖించే మహద్భాగ్యం అతడికి లభించింది. ముంతాజ్ సమాధిపై అతడు చెక్కిన అక్షర నగిషీలకు షాజహాన్ ముగ్ధుడై అతడికి ‘మాన్సాబ్’ అనే బిరుదును ప్రదానం చేశారు. భూమిపై హక్కులు సంక్రమింపజేసే అధికారిగా అది ప్రభువులిచ్చే బిరుదు. అమానత్ ఖాన్ తాజ్‌మహల్‌పై ఆరేళ్లు పనిచేశారు. సమాధి నగీషీ రాత 1638లో పూర్తయింది. ఆ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనిలో ఉన్నప్పుడే అతడి వ్యక్తిగత జీవితాన్ని విషాదం స్పృశించింది. లాహోర్‌లో ఉంటున్న అతడి సోదరుడు అఫ్జల్ ఖాన్ మరణించాడు. అమానత్ ఖాన్ తను సంపాదించినదంతా వెచ్చించి అఫ్జల్‌కు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. సోదరుడి మరణం తర్వాత కూడా అమానత్ తిరిగి ఇరాన్ వెళ్లలేదనీ, తాజ్‌మహల్ ప్రధాన వాస్తుశిల్పి, తన ఆప్తమిత్రుడు అయిన ఉస్తాద్ఖాన్ అభ్యర్థన మేరకు ఇక్కడే ఉండిపోయారనీ డబ్లు్య.ఇ. బెగ్లే అనే చరిత్రకారుడు రాశారు. (క్లిక్: పుష్కరం కిందే యుద్ధ బీజాలు) మొఘల్ చరిత్రలో అనేకమంది రూపకర్తలు, వాస్తుశిల్పులు ఎంతో ప్రాముఖ్యం పొందారు. వారిలో కొందరు తాజ్‌మహల్ నిర్మాణానికి పని చేశారు. ఇస్మాయిల్ అఫాండి టర్కీలోని ఒట్టోమన్ల కోసం గోపురాలను రూపొందించిన ఘనత కలవారు. ఖాజిమ్ఖాన్ లాహోర్‌కు చెందిన ఒక స్వర్ణకారుడు. తాజ్ సమాధి గోపురానికి కాంతులీనే తాపడం చేసినవారు. తాజ్‌మహల్ నిర్మాణంలో హస్తకళాకారులు, కార్మికులతో పాటు.. మేధాపరంగా వాస్తుశిల్పులు, సృజనశీలురు అందరూ కూడా షాజహాన్ అభిరుచికి, దార్శనికతకు తగ్గట్టుగా పని చేసి ఆయన నుంచి సత్కారాలు, బహుమానాలు పొందారే తప్ప చేతులు పోగొట్టుకోలేదు. ఎలాగో పుట్టి, ఎలాగో కొట్టుకు వస్తున్న వదంతి మాత్రమే అది. వదంతిని పునరావృతం చేయడం అంటే అజ్ఞానాన్నీ, చరిత్రపై అవగాహన లేమినీ ప్రదర్శించుకోవడమే. – ఎం.సలీమ్ బేగ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (జేకే) ముఖ్యాధికారి -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తాజ్‌మహల్ సందర్శించిన రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక గతేడాది ప్రియుడి గురించి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. డిన్నర్ డేట్లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. తాజాగా ఈ లవ్‌బర్డ్స్ ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “దే దే ప్యార్ దే” దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఓరి నీ ప్రేమ ‘తాజ్‌మహల్’ కాను!
తాజ్ మహల్.. దేశంలోనే ఓ అద్భుతమైన కట్టడం! మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు! ఒరిజనల్ తామ్మహల్ కట్టాడా? అని ఆశ్చర్యపోకండి. అచ్చం తాజ్‌మహల్ రేంజ్ ఆకృతిలో ఓ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే ఓ విద్యావేత్త తన భార్య మంజుషా చౌక్సేకు గిఫ్ట్‌గా అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని నిర్మించాడు. ఇందులో నాలుగు బెడ్ రూంలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ జంట ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్ అందానికి ముగ్దులైన ఈ జంట.. దాని ఆర్కిటెక్షర్‌ను, నిర్మాణ విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే ముందుగా ఆనంద్ ప్రకాష్ చౌక్సే.. తన ఇంటిని సుమారు 80 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని భావించారు. కానీ, 80 ఫీట్ల ఎత్తులో ఇంటిని కట్టడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో తక్కువ ఎత్తులో ఉన్నా తాజ్‌మహల్‌లో ఆకృతిలో తన ఇంటిని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అద్భుతమైన ఇంటిని నిర్మించడానికి ఇంజనీర్లకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని 3D ఇమేజ్ పద్దతిలో రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటిని నిర్మించిన ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే స్పందిస్తూ.. ‘మొత్తం 90 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉండగా.. ప్రధానమైన తాజ్‌మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉండగా.. రెండు బెడ్ రూంలతో రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇంటిలో వంటగది, లైబ్రరీ, ధ్యానంరూంలు కూడా ఉన్నాయి. అయితే ఇంటిని నిర్మించే ముందు ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శించాను’ అని తెలిపారు. -
Photo Feature: యాదాద్రి వైభవం.. తాజ్ పునఃప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. -
తల వెంట్రుకపై తాజ్‌మహల్
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు. సూక్ష్మకళలో ప్రావీణ్యత సాధించిన ఈ కళాకారుడు తల వెంట్రుకపై తాజ్‌మహల్ బొమ్మను ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయాచారి 5 రోజులు కష్టపడి మైక్రో ఆర్ట్ ద్వారా తల వెంట్రుకపై బంగారంతో తాజ్‌మహల్ ఆకారాన్ని రూపొందించాడు. బొమ్మ ఎత్తు 0.10 ఎంఎం, వెడల్పు 0.15 ఎంఎం ఉంది. -
తాజ్‌మహల్ నిర్మాణానికి పుల్లలెత్తింది ఈయనే..
ఇంగ్లాండ్‌లోని షెఫ్ఫిల్డ్ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్‌కు ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల నమూనాలను పుల్లలతో తయారు చేయడం అనేది హాబీ. ఒక మోడల్‌ను పూర్తి చేయడానికి పది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుంది. వీటికోసం ఇంట్లో ప్రత్యేకంగా షెల్ఫ్‌లను కూడా నిర్మించాడు. ‘ఈ మోడల్స్ అందంగా రావాలంటే క్రియేటివిటీ కంటే ఓపిక ఉండడం చాలా ముఖ్యం’ అంటాడు డెరిక్. ‘మరి ఈ వయసులో మీరు ఇంత ఓపిక...’ అని ఎవరైనా అడగబోతే శేషజీవితంలో తన జీవనోత్సాహానికి ఈ హాబీనే కారణం అంటాడు. మన తాజ్‌మహల్ తయారు చేయడానికి చాలా టైమ్ పట్టిందట. ‘ఇదొక పెద్ద ఛాలెంజ్’ అంటాడు డెరిక్. తెలిసిన విద్య ఊరకేపోవడం ఎందుకని పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. చదవండి: ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...! -
‘తాజ్‌మహల్.. రామ్‌మహల్‌గా మారనుంది’
లక్నో: ఆగ్రాలోని తాజ్‌మహల్ పేరు రామ్‌మహల్ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం అని, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్‌మహల్ పేరును త్వరలో రామ్‌మహల్‌గా లేదా కృష్ణమహల్‌గా మార్చుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను శివాజీ వారసుడితో పోల్చుతూ.. సమర్ గురువు రామ్‌దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్ నాథ్ బాబా యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్
ఆగ్రా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు నేడు(శనివారం) 10వ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ రోజుతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు.టాలీవుడ్ స్టార్ హీరోగా అల్లుఅర్జున్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏం మాత్రం టైం దొరికినా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు. శనివారం (నేడు) పదవ వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్ భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ కపుల్ అల్లుఅర్జున్- స్నేహ రెడ్డి దంపతులకు అటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి : శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా Happy 10th Anniversary to us Cutie . What a wonderful journey of ten years ... and many more to come ❤️ pic.twitter.com/d4g6X5at6A — Allu Arjun (@alluarjun) March 6, 2021 -
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
-
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
ఆగ్రా : ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పర్యాటకులను అక్కడినుంచి ఖాళీ చేయించి తాజామహల్‌ను మూసివేశారు. తాజామహల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు..తాజ్ మహల్లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని తెలిపాడు. దీంతో వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాజ్‌మహల్ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ ధృవీకరించారు. ఇది ఫేక్ కాల్ అని పేర్కొన్నారు. చదవండి : (రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై..రాజీకి షా ప్రయత్నాలు) (గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష ) Bomb Disposal Squad & other teams carried out extensive search at Taj Mahal premises. No such object has been found yet. Man who called up to give info (of bomb) will soon be traced. I'd like to assure you that there's 99% chances of it being hoax call: A Satish Ganesh, IG Agra pic.twitter.com/MfkmwBrBoA — ANI UP (@ANINewsUP) March 4, 2021 -
తాజ్ సందర్శనకు అనుమతి
లక్నో, ఆగ్రా: కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా చారిత్రక కట్టడం తాజ్‌మహల్ సందర్శనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అన్‌లాక్ 4.0లో ఆరునెలల తరువాత సోమవారం నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతించినట్టు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్ సంరక్షణ అధికారి అమర్నాథ్ గుప్తా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తాజ్‌మహల్‌ను మూసివేస్తామని, కోవిడ్-19 నిబంధనలను పర్యాటకులు తప్పనిసరిగా అనుసరించాలని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. అయితే, తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు టికెట్ ధర రూ.1,100 కాగా, స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్‌లో 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. పర్యాటకుల మధ్య దూరం, తనిఖీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది నిర్వహించనున్నారు. ఇక తాజ్‌మహల్‌లోనికి ఎలాంటి వస్తువులు అనుమతించరు.. అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రసిద్ధ ఆగ్రా కోటను సందర్శనకు కూడా సోమవారం నుంచి అనుమతించనున్నారు. (చదవండి: పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్) లాక్డౌన్ కారణంగా దేశంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 2.0లో చారిత్రక కట్టడాల సందర్శనకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. జులై 6 నుంచి తాజ్ మహల్‌కు పర్యాటకులను అనుమతిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేసింది. తాజ్‌మహల్ సందర్శన నిర్ణయాన్ని యోగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సందర్శకుల రాకతో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో తాజ్ సందర్శన వాయిదా పడింది. ఆరు నెలల తర్వాత తాజ్‌మహల్ తెరుచుకోనుండటంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు సైతం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల తర్వాత దుకాణాలు తెరిచామని, వ్యాపారం స్తబ్దుగా ఉన్నా తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులనైనా చూడగలుగుతామని సమీపంలో మార్బుల్ వస్తువులు దుకాణం యజమాని మునావ్వర్ అలీ (50) అన్నారు. -
తాజ్‌మహల్ పునఃప్రారంభం వాయిదా
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు పునఃప్రారంభం అవుతుందనుకున్న తాజ్‌మహల్ సందర్శన వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాకిడితో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందుల్లో అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగ్రాలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లోని సందర్శనీయ స్థలాలు మూసివేశారు. (చదవండి: కరోనా అంతానికిది ఆరంభం) అనంతరం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనా సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. అయితే, పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రకారం నేటి నుంచి తాజ్‌మహల్‌కు సందర్శనకు అనుమతి ఇద్దామని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవని ఆగ్రా జిల్లా యంత్రాంగం చెప్పింది. కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా 24,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 600 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. కేసుల సంఖ్యలో భారత్ రష్యాను సమీపించింది. (ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఉద్యోగిపై పులి దాడి) -
పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో విజృంభించిన వర్షం ధాటికి ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ పాక్షికంగా దెబ్బతింది. సమాధి, రెడ్ సాండ్ స్టోన్ దగ్గరి పాలరాతి రెయిలింగ్ ధ్వంసం అయిందని శనివారం ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ బసంత్ కుమార్ స్వరంకర్ తెలిపారు. సమాధి పైకప్పు కూడా చెల్లాచెదురైందని ఆయన వెల్లడించారు. ద్వారం కూడా విరిగిపోయిందని, తాజ్ మహల్ ప్రాంగణంలోని కొన్ని చెట్లు కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయి నేలకొరిగాయన్నారు. (తాజ్ మహల్ మూసివేత) కాగా గతంలోనూ తాజ్ మహల్ దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వాన వల్ల తాజ్ మహల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పిల్లర్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. (ప్రియురాలితో తాజ్‌మహల్ చూడాలనుకుని..) -
రంగోలి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్‌పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్‌ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్లో ప్రస్తావించారు. ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్) Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL — Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020 ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు. -
చుట్టాలు వస్తేకనీ..తాజ్‌ను పట్టించుకోని ప్రభుత్వం
-
‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు
-
తాజ్‌మహల్‌లో ఇవాంక సందడి
-
తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు
-
చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ..
ఆగ్రా: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్.. తొలుత సందర్శకుల పుస్తకంలో(విజిటర్ బుక్)లో సంతకం చేశారు. ‘‘తాజ్‌మహల్ అద్భుతం. అందమైన భారత సంస్కృతికి నిదర్శనం! థ్యాంక్యూ ఇండియా’’అని ఆయన రాశారు.ప్రపంచ వింతగా ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్ విశేషాలను గైడ్ వివరిస్తుండగా.. ట్రంప్ దంపతులు ఆసక్తిగా ఆలకించారు. సంధ్యాసమయంలో చేతిలో చెయ్యి వేసుకుని పచ్చటి లాన్లో నడుచుకుంటూ మహత్తర కట్టడాన్ని చేరుకున్నారు. ఫొటోలకు పోజులిస్తూ.. ‘ప్రేమచిహ్నం’ అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తాజ్‌మహల్ లోపలికి ప్రవేశించి.. షాజహాన్, ముంతాజ్ సమాధులను సందర్శించారు. ఇక ట్రంప్, మెలానియాది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. (చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) ఇక ట్రంప్ కుటుంబం తాజ్ మహల్ సందర్శన నేపథ్యంలో ఆగ్రా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన అనంతరం ట్రంప్ ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్‌పటేల్ ట్రంప్ కుటుంబానికి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
‘తాజ్’అందాలు వీక్షిస్తున్న ట్రంప్ దంపతులు
-
తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు
లక్నో: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్‌నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్... ‘ప్రేమచిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ట్రంప్ తాజ్‌మహల్ వద్ద సమయం గడపనున్నట్లు సమాచారం. కాగా అంతకు ముందు అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత పర్యటన తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయంటూ కీలక ప్రకటన చేశారు. -
ట్రంప్ పర్యటన : రంగంలోకి కొండముచ్చులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. (చదవండి : ట్రంప్ పర్యటన పుణ్యమా అని..) ఇక ట్రంప్ ఆగ్రాలో కూడా పర్యటిస్తుండడంతో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత ఏర్పాటు విషయంలో అధికారులు ఏమాత్రం రాజీ పడడంలేదు. ముఖ్యంగా కోతుల వల్ల అమెరికా అధ్యుక్షుడి పర్యటనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చని భావించిన అధికారులు.. కోతుల పని పట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు వాపోతున్నారు. దీంతో ట్రంప్ పర్యటనకు కోతుల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు ఐదు కొండముచ్చులను తాజ్‌మహాల్ సమీపంలో ఉంచారు. కొండముచ్చులను చూసి కోతులు భయపడతాయి. అవి ఉన్న సమీపానికి కోతులు రాలేవు. అందుకే అధికారులు కొండముచ్చులను రంగంలోకి దించారు. మొత్తానికి కొండముచ్చులు కూడా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా నిలిచాయన్నమాట. కాగా, రెండు రోజుల భారత్ పర్యటలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) ఇండియాకు రానున్నారు. హ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం మొటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహాల్‌కు వెళ్తారు. రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు.అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ట్రంప్ పర్యటన పుణ్యమా అని..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నీ రూ. కోట్లు పెట్టి మరమ్మతులు చేయించారు. అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి రూ.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది .రోడ్లను ఆదునీకరించడానికే రూ.30 కోట్లను ఖర్చు చేశారట. సోమవారం సాయంత్రం ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహాల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యం అక్కడి రోడ్లన్ని క్లీన్ చేయించారు. ట్రంప్ ప్రయాణించే రహదారి ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరించారు. ట్యాంకర్లలో నీళ్లను తెచ్చి రోడ్లన్నిశుభ్రం చేశారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న ప్రధాన మార్గాల్లో రోడ్లన్ని అద్దంలా మెరిసిపోతున్నాయి. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) ఇక ట్రంప్‌కు ఘన స్వాగతం గుజరాత్ ప్రభుత్వం కూడా భారీ ఏర్పాటు చేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడను నిర్మించారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మొటెరా స్టేడియాన్ని అలంకరించారు. ఇక ట్రంప్ ప్రయాణించే రహదారి వెంబడి విద్యార్థులలో సంప్రదాయ క్రీడ మల్లకంబను ప్రదర్శించనున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం దాదాపు రూ.85 కోట్లు చేస్తోంది. (చదవండి : ట్రంప్ విందు.. పసందు..!) ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 ► అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. ► గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. ► తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ► అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్‌లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. ► సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ► ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 25 ► రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ► ట్రంప్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ► అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ► మోదీ, ట్రంప్‌ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. ► అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. ► రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ప్రియురాలితో తాజ్‌మహల్ చూడాలనుకుని..
శంషాబాద్:భార్య టికెట్‌పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి తాజ్‌మహల్ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్కు చెందిన దౌల్సాబ్ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్ ఎయి ర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్లు బుక్ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్ఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం
న్యూఢిల్లీ: ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ చరిత్రపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్దే కొత్త వాదనకు తెరతీశారు. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో పేర్కొన్నారని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్‌మహల్‌గా మారిందని వివరించారు. ఇకనైనా మేల్కోకుంటే మన ఇళ్లు కూడా మసీదులుగా మారుతాయని, రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను తాకే వ్యక్తి చేతుల్ని నరికేసేలా చరిత్రను రాయాలని సూచించారు. -
‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్‌మహల్‌ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్‌మహల్‌గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
తాజ్ మహల్‌ను చూడాలనుకుంటే..ఇకపై
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ దర్శించాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న తాజ్‌మహల్ టికెట్ రేటును అధికారులు భారీగా పెంచేశారు. ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌కోసం టూరిస్టులు ఇకపై రూ. 250 (0.70డాలర్లు) చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పటివరకు చెల్లించే 16డాలర్లుకు బదులుగా ఇకపై 19డాలర్లు (సుమారు రూ.1,364) చెల్లించాలి. టూరిస్టులను పరిమితం చేసేందుకు ఈపెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి వెల్లడించారు. తాజ్‌మహల్ సందర్శకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్య. గతంలో ఈ సంఖ్య 70వేలుగా ఉంది. కాగా రోజుకు సగటున 10నుంచి 15వేల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారట. 2016లో సుమారు 6.5 మిలియన్ల మంది 17శతాబ్దానికి చెందిన ఈ ప్రేమమందిరాన్ని వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
‘నమాజ్ చేస్తే తప్పులేదు.. కానీ పూజలు చేయకూడదా’
ఆగ్రా : బజరంగ్ దళ్‌కు చెందిన మహిళా కార్యకర్తలు కొందరు తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా ఇతర రోజుల్లో నమాజ్ చేయకూడదంటూ సుప్రీం కోర్టుతో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎస్ఐ ఉత్తర్వులను పట్టింకుకోండా కొందరు ముస్లింలు తాజ్ వద్ద ఉన్న మసీదులో గత బుధవారం నమాజ్ చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ మహిళా కార్యకర్తలు కొందరు ఏఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా తాజ్ వద్ద హరతి కార్యక్రమం నిర్వహించి.. గంగా జలాన్ని చల్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఇక్కడ నమాజ్ చేసి తాజ్ పరిసరాలను అపవిత్రం చేశారు. అందుకనే మేం గంగా జలంతో దాన్ని శుద్ది చేశాం. ఇతరులు(ముస్లింలు) వచ్చి ఇక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు.. మేం తాజ్ మహల్లోకి పూజాద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పా అంటూ వారు ప్రశ్నించారు. వారికి(ముస్లింలకు) శుక్రవారం మాత్రమే తాజ్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతించారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు ఇక్కడ నమాజ్ చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మేం చేసింది తప్పని భావిస్తే ఎలాంటి చర్యలనై తీసుకోండి.. వాటిని ఎదుర్కొడానికి మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. నమాజ్ కోసం వెళ్లిన వారిన ఆపలేదు.. కానీ మమ్మల్ని మాత్రం ఎలా అడ్డగిస్తారంటూ ప్రశ్నించారు. -
తాజ్ ప్రాంగణంలో నమాజ్‌కు ఏఎస్ఐ నో
ఆగ్రా : తాజ్‌మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా మరే రోజూ నమాజ్ చేయరాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ముస్లింలను కోరింది. ఈ ఉత్తర్వులు పెనువివాదం రేపుతుండగా, సుప్రీం కోర్టు జులైలో ఇచ్చిన ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని ఏఎస్ఐ అధికారులు వివరణ ఇచ్చారు. శుక్రవారం తాజ్‌మహల్‌ను ప్రజా సందర్శనకు అనుమతించని క్రమంలో ఆ రోజు ప్రవేశ టికెట్ లేకుండానే స్ధానికులు ప్రార్ధన చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. తాజ్ మహల్ కాంప్లెక్స్‌లోని మసీదులో శుక్రవారం స్ధానికేతరులు నమాజ్ చేసుకోరాదని స్ధానిక అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. భద్రతా కారణాల రీత్యా స్ధానికేతరులెవరూ శుక్రవారం తాజ్ ప్రాంగణంలోని మసీదులో నమాజ్ చేయరాదని ఆగ్రా ఏడీఎం ఈ ఏడాది జనవరి 24న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. అయితే ఇతర రోజుల్లో నమాజ్‌లపై సుప్రీం కోర్టు ఎంతమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు నమాజ్‌కు ముందు ముస్లింలు తాజ్ ప్రాంగణంలోని స్నానం చేసే వుదు చెరువును ఏఎస్ఐ ఆదివారం మూసివేసింది. దశాబ్ధాలుగా తాజ్ మహల్ మసీదులో నమాజ్ చేస్తున్న ఇమాం సయ్యద్ సాధిక్ అలి ఏఎస్ఐ ఉత్తర్వుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఏ కారణం లేకుండానే నమాజ్‌ను నిలిపివేశారని తాజ్‌మహల్ మసీదు నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహిం హుసేన్ జైదీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని యూపీ, కేంద్ర ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. -
చేజారాక చేసేదేమీ ఉండదు
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై దూరదృష్టితో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. దాని పరిరక్షణ నిమిత్తం పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించాలని కోరింది. పరిస్థితి చేయి దాటాక తాజ్‌మహల్‌ను కాపాడుకునేందుకు మరో అవకాశం రాదని హెచ్చరించింది. తాజ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ, చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, యమునా నదిలో నీటి మట్టం పెరుగుదల తదితరాలను దార్శనిక పత్రం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ‘ఒకసారి తాజ్‌మహల్ చేజారితే, మరో అవకాశం లభించదు’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ చుట్టుపక్కల ఉన్న పచ్చదనం, నడుస్తున్న పరిశ్రమలు, హోటళ్ల సంఖ్య తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, లాయర్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు తాజ్ పరిరక్షణకు అగాఖాన్ ఫౌండేషన్, ఇంటాచ్ సంస్థల నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. -
తాజ్‌మహల్ పరిరక్షణపై సుప్రీంకోర్టు సీరియస్
-
తాజ్ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల మూసివేత. నో ప్లాస్టిక్ జోన్, యమున కరకట్టలపై నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం వంటి చర్యలతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే ప్రణాళికతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని పరిరక్షించడంలో యూపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై జులై 11న సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడిన క్రమంలో ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను కోర్టుకు నివేదించింది. తాజ్ మహల్ పరిసరాల్లో ప్యాకేజ్డ్ వాటర్‌ను నిషేధించాలని, ఆ ప్రాంతమంతటినీ ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించాలని యోచిస్తున్నామని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్‌కు యూపీ ప్రభుత్వం తెలిపింది. తాజ్ పరిసర ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేసి, టూరిజం హబ్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పాదచారులను ప్రోత్సహించేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణను చేపడతామని వెల్లడించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కాలక్రమేణా కాలుష్య కోరలతో తన ప్రాభవాన్ని కోల్పోతుండటంపై సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజ్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
తాజ్‌మహల్‌ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్‌మహల్‌ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్‌మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్‌ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్‌మహల్‌ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్‌పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్‌మహల్ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తాజ్ మహల్ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్ మహల్ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది. ‘మీరు ఇప్పటికైనా పద్దతి మార్చుకుని తాజ్‌మహల్ వద్ద నిర్వహణా లోపాలను సరిదిద్దండి. లేకపోతే దాన్ని కూల్చేయండి. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్‌మహల్ ఎంతో అందమైనది. సుందరమైనది. తాజ్ మహల్‌ను సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా భారతదేశానికి ఉన్న విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేయొచ్చు. దేశ సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్. అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదు.’ అని తాజ్‌పై పిటిషన్‌ను విచారించిన జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేగాక తాజ్ ట్రాపెజియమ్ జోన్(టీటీజెడ్) పరిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన పారిశ్రామిక వాడల నిర్మాణంపై టీటీజెడ్ చైర్మన్‌ను ప్రశ్నించింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో తాజ్ పరిరక్షణ చర్యలను సరిగా చేపట్టలేకపోతోందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘తాజ్’లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది. -
తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ‘తాజ్‌మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది, జనవరి 24న ఆగ్రా జిల్లా అదనపు కోర్టు.. ‘ఇకమీదట స్థానికులు మాత్రమే తాజ్‌మహల్ వద్ద ప్రార్ధనలు చేయాలి.. స్థానికేతరులకు తాజ్ వద్ద నమాజ్ చేసేందుకు అనుమతి లేదం’టూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగ్రా ఏడీఎమ్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజ్‌మహల్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేయరాదని స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది. నేటికి ప్రతి శుక్రవారం తాజ్‌మహల్ సందర్శనకు యాత్రికులను అనుమతించరు. ఆ రోజున స్థానిక ముస్లింలు తాజ్ వద్ద నమాజ్ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు విదేశీ టూరిస్టులు ఏడాది పాటు వస్తుంటారు. భద్రత దృష్ట్యా తాజ్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
‘తాజ్‌మహల్‌ను కూల్చేద్దాం రండి’... వైరల్
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకప్పుడు అది శివాలయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు తనకు చెప్పారన్న అజాం ఖాన్.. యోగి ఆ తాజ్‌మహల్‌ను కూల్చి మళ్లీ ఆలయం కట్టాలనుకుంటే తాను అందులో భాగస్వామిని అవుతానని వెల్లడించారు. యోగి తాజ్‌మహల్‌ను కూల్చుతానంటే.. తనతో పాటు మరో 10 నుంచి 20వేల మంది ముస్లింలను పలుగు, పారలతో తీసుకొస్తానని ఎస్పీ నేత తన ట్వీట్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తాజ్ మహల్ కూల్చివేతలో పాలు పంచుకుంటాం. అయితే తాజ్‌మహల్‌పై తొలిదెబ్బ యోగి వేస్తే.. రెండోదెబ్బ కచ్చితంగా నాది అవుతుంది. ప్రపంచ వింత తాజ్‌మహల్ బానిసత్వానికి సంకేతమంటూ’యోగి ఆదిత్యనాథ్‌ను కవ్వించే యత్నం చేశారు అజాం ఖాన్. గతంలో పలువురు బీజేపీ నేతలు అయోద్యలో రామాలయం నిర్మిస్తామని, అదే విధంగా తాజ్‌మహల్‌ను కూల్చేసి గతంలో ఉన్న శివాలయాన్ని అదే స్థానంలో కట్టిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది మార్చిలో హిందూ మహాసభ విడుదల చేసిన క్యాలెండర్లో తాజ్‌మహల్‌ను ‘తేజో మహాలయం శివ మందిరం’అని, కుతుబ్ మినార్ను ‘విష్ణు స్తంభం’అని, కాశీలోని జ్ఞాన్‌వ్యాపి మసీదును ‘విశ్వనాథ ఆలయం’అని ప్రచురించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరిన్ని ముస్లింల కట్టడాలు, నిర్మాణాలను హిందువుల ఆలయాలుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అజాంఖాన్ తాజాగా తాజ్‌మహల్‌పై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
-
ఇక దీన్ దయాల్ చికెన్....!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్‌ను మంగళవారం నాడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఈ పేరు మార్చే ప్రక్రియను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే చేపట్టింది. ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పట్టాలపైనే 1968, ఫిబ్రవరి 11వ తేదీన దీన్‌దయాల్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. ఆయన ఆరెస్సెస్ సభ్యుడే కాకుండా భారతీయ జన్ సంఘ్ సహ వ్యవస్థాపకులు. ఇలా పేర్లు మార్చడం పట్ల పలువురు ట్వీట్లు పేలుస్తున్నారు. చికిన్ ముఘ్లాయిని ఇక చికెన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అని, బెంగాల్ ముఘ్లాయి పరోటాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పరోటా అని పిలవాలని సూచిస్తున్నారు. దీన్ దయాల్ బిర్యానీ, దీన్ దయాల్ టిక్నా, దీన్ దయాల్ కుర్మా, దీన్ దయాల్ చికెన్ టిక్కా... అంటూ పేర్లు పెడుతున్నారు. మెఘల్ ఏ ఆజమ్ సినిమా పేరును కూడా మార్చాలని కోరుతున్నారు. ఇంతకు ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎవరని, ఆయన దేశానికి చేసిన సేవలేమిటో చెప్పండంటూ కొందరు నిలదీస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రీ ముఘల్‌సరాయ్‌లో పుట్టారని, ఆయన స్వాతంత్య్ర యోధుడని, ఆయన దేశానికి రెండో ప్రధాన మంత్రి అని, రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన తన రైల్వే శాఖకు రాజీనామా చేశారని, పెడితే అలాంటి గొప్పవ్యక్తి పేరు పెట్టాలని, ఆయన దీన్ దయాల్ లాగా రైలు పట్టాలపై చనిపోకపోవడమే ఆయన తప్పా? ట్విటర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏముందని, మౌలిక సౌకర్యాలను మెరగుపర్చాలని కొందరు సూచిస్తున్నారు. రైళ్లు సక్రమంగా వచ్చేలా, సవ్యంగా నడిచేలా చూడాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పలు పేర్లను మారుస్తున్నారు. ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే గోరఖ్‌పూర్‌లోని ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, అలీ నగర్‌ను ఆర్య నగర్‌గా, మియా బజార్‌ను మాయా బజార్‌గా, ఇస్లామ్పూర్ను ఈశ్వర్పూర్గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్‌ను తాను రామ్ మహల్ అని పేరు మార్చడానికి కూడా తాను వెనకాడనని యోగి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియాను హిందుస్థాన్‌గా మారుస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఔరంగాజేబ్ రోడ్డును అబ్దుల్ కలామ్ రోడ్డని, అక్బర్ ఫోర్ట్‌ను అజ్మీర్ ఫోర్ట్‌ని కూడా మార్చింది. పేర్లు మార్చినప్పటికీ ప్రజలు మాత్రం పాతపేర్లనే ఇప్పటికీ ఉచ్ఛరిస్తున్నారు. -
క్రికెటర్ బిడ్డకు తాజ్ మహల్ పేరు?
బెంగళూరు : దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కి భారత్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఏబీ తన బ్యాటింగ్‌తో భారత్‌లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. క్రీజులో అటు ఇటు జరుగుతూ ఏబీ కొట్టె షాట్స్‌కు భారత అభిమానులు ముగ్ధులయ్యారు. మరోవైపు ఏబీకి కూడా భారత్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆర్సీబీ తరుపున ఐపీఎల్ 11వ సీజన్ ఆడుతున్న ఏబీడీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీ తన వైవాహిక జీవితాన్ని కూడా భారత్ నుంచే ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ ఎదుట తన భార్య డెనియల్ డివిలియర్స్‌కి ‘‘నీతో నా జీవితాంతం జీవించాలని ఉంది, డెనియల్ నన్ను పెళ్లి చేసుకుంటావా’ ’ అని ప్రపోజ్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు కలిగే మూడో సంతానానికి ‘‘తాజ్’’ అని పేరు పెడుతానని చెప్పాడు. ఇండియాపై ఉన్న ప్రేమతో జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తన ప్రేమకు పునాది పడిన తాజ్ మహల్‌కు గుర్తుగా తన బిడ్డకు ‘‘తాజ్ డివిలియర్స్’’ అని నామకరణం చేస్తానని డివిలియర్స్ చెప్పాడు. ఇక డివిలియర్స్‌కు ఇద్దరు కుమారులున్నారు. ఏబీ డివిలియర్స్ జూనియర్ 2015లో జన్మించగా.. జాన్ రిచర్డ్ డివిలియర్స్ 2017 లో పుట్టాడు. అయితే మూడో సంతానానికి తాజ్ అనే పేరు మనసుకు దగ్గరగా ఉంటుందని తెలిపాడు. చూడండి : ఏబీ సెన్సేషనల్ క్యాచ్ -
తాజ్‌మహల్‌కు నిర్లక్ష్యం కాటు
కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటిచుక్కగా, ధవళకాంతుల దివ్య మందిరంగా ఎందరెం దరినో పరవశింపజేసే తాజ్‌మహల్... దాన్ని కాపాడి రక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారుల మనసుల్ని కాస్తయినా కదిలించలేకపోతున్నది. తాజ్ కళాకాంతులు క్షీణిస్తున్నాయని, అది క్రమేపీ పసుపు రంగుకు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఆ శాఖకు చీవాట్లు పెట్టింది. ఆ అపురూప కట్టడాన్ని పరిరక్షించడం చేతగాకపోతే ఆ బాధ్యతనుంచి తప్పుకోండని అధికారు లను మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణముంది. తాజ్‌మహల్‌కు ముప్పు ముంచుకొస్తున్నదని పర్యావరణవేత్తలు దాదాపు పాతికేళ్లనుంచి ఆందోళనపడుతు న్నారు. ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని రక్షించమని ప్రభుత్వాలను వేడుకుంటు న్నారు. అయినా ఫలితం శూన్యం. చివరకు వారు 1996లో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడినుంచి తరలించాలని, సమీపంలోని రిఫైన రీల నిర్వహణకు సహజవాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను గానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలను గానీ ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలా లేదు. నిరుడు ఒక హోటల్ నిర్మాణం కోసం తాజ్ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్ లోని మధురకూ, ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదల్చుకున్నా మని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్ దానికెంత ఆగ్రహం తెప్పించిందో అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూలకెళ్లినా తాజ్‌మహల్‌ను భారత్‌కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్మహల్దే. ఏడు ప్రపంచ వింతల్లో అదొకటి. అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు ఇక్కడి పాలకులకు మాత్రం దానిపై ఆసక్తిగానీ, అనురక్తిగానీ ఉండటం లేదు. బుధవారం సుప్రీంకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. తాజ్‌మహల్ రక్షణకు ఏం చేయా లన్న విషయంలో పురావస్తు శాఖను పక్కనబెట్టి అంతర్జాతీయ నిపుణుల సహాయసహకా రాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ శాఖ ఎంత ఘనంగా పనిచేస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కీటకాలు, శైవలాలు దాన్ని దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ధర్మాసనం విశ్వసించలేదు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచి పోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్‌పై పడుతున్నదని ఆ శాఖ చెప్పింది. నీరు నాచుపట్టడం నిజమే అయినా... అది ఎగిరొచ్చి తాజ్‌ను దెబ్బతీస్తుందా అని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 17 వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాలరాతి కట్టడం వాయు కాలు ష్యంతో వన్నె కోల్పోతున్నది. కాలుష్యం కాటుకు మనుషుల ప్రాణాలే రాలిపడుతున్నప్పుడు కట్టడాల గురించి చెప్పేదేముంది? గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమా ణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఆ పాలరాతి కట్టడం చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు నిరుడు వార్తలొచ్చాయి. అయితే ఇన్నేళ్లుగా జరి గిన విధ్వంసాన్ని అవి ఇప్పటికప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుంది. చారిత్రక కట్టడాలను శిథిల, నిర్జీవ రూపాలుగా చూడకూడదు. అవి కేవలం గత కాలపు కళా కౌశలానికి, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అప్పటి వాస్తు శాస్త్ర వైభవానికి మాత్రమే ప్రతీకలు కావు. అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిగా మాత్రమే వాటిని చూస్తే సరిపోదు. అవి మన వారసత్వ సంపద. వందల ఏళ్లనాటి చరిత్రకూ, సంస్కృతికీ సజీవ సాక్ష్యాలు. ఆనాటి విలువలకు నకళ్లు. ఇప్పటి మన అవసరాలతో, మనకుండే అభిప్రాయాలతో కాక వాటిని చరి త్రకు దర్పణాలుగా గుర్తించగలిగితే ఆ కట్టడాల గొప్పతనం అర్ధమవుతుంది. వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. మిగిలినవారి మాటెలా ఉన్నా... పురావస్తు శాఖలో పనిచేసేవారికి, ఆ శాఖను పర్యవేక్షించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష ఉండాలి. చారిత్రక కట్టడాలను తగు జాగ్రత్తలతో కాపాడి భవిష్య త్తరాలకు భద్రంగా అప్పజెప్పాలన్న స్పృహ ఉండాలి. మన పురావస్తు శాఖకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఏం ప్రయోజనం? ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన తాజ్ మహల్కే పురావస్తు శాఖ ఈ గతి పట్టించింది. ఇక ఇతర కట్టడాల పరిరక్షణ విషయం చెప్పేదే ముంది? యుమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులీయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దాన్లో కలుస్తున్నాయి. ఆ కర్మా గారాలు వదిలే పొగ తాజ్‌మహల్‌ను కమ్ముతోంది. దశాబ్దాలు గడుస్తున్నా వాటి దుష్ప్రభా వాన్ని కాస్తయినా నివారించడానికి ప్రయత్నించకపోవడం నేరం కాదా? కేంద్రంలో ఎవరున్నా తాజ్ పట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. రెండేళ్లక్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మై రాను ఐఎస్ ఉగ్రవాదులు ముట్టడించి, అందులోని కొత్త రాతియుగంనాటి అపురూప కళాఖం డాలను, అనంతరకాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారని విన్నప్పుడు ఎందరెంద రికో మనస్సు చివుక్కుమంది. మన నిర్లక్ష్యం ఇక్కడి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టి స్తున్నదని అర్ధమైతే వాటిపట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అందరికీ తెలుస్తుంది. -
తాజ్: ఏఎస్ఐ తీరుపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక తాజ్ మహల్ కట్టడాన్ని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) విఫలమైందని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌పై క్రిమి కీటకాలు ముసురుతున్నా దీన్ని నిరోధించేందుకు ఏఎస్ఐ సహా సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడింది. ఏఎస్ఐ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించింది. తాజ్ పరిరక్షణకు ఏఎస్ఐ అవసరమా, కాదా అనేది కేంద్రం నిర్ధారించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ నాద్‌కర్ణితో పేర్కొంది. తాజ్‌మహల్ సంరక్షణ కోసం అంతర్జాతీయ నిపుణుల నియామకంపై సుప్రీం కోర్టు చేసిన సూచనలను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని నాద్కర్ణి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యమునా నదిలో నీటి కొరత కారణంగానే క్రిమికీటకాల సమస్య తలెత్తిందని ఏఎస్ఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు.కాగా తాజ్‌మహల్ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ విజన్ డాక్యుమెంట్ ముసాయిదాను సమర్పించాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతిచిహ్నంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడం పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. -
రంగు మారుతున్న ఆధునిక వింత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆధునిక వింత ప్రతిష్ట మసకబారుతోంది. ఆమ్ల వర్షాల కారణంగా ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ పసుపు పచ్చగా మారుతోంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ముందుముందు గోధుమ, ఆకుపచ్చ వర్ణాల్లోకి తాజ్‌మహల్ మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశీయ, విదేశాల్లో నిపుణుల సాయం తీసుకుని తాజ్‌మహల్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. తాజ్‌మహల్ కీర్తి దిగజారేలా దాని రంగు మారుతోందంటూ పర్యావరణ న్యాయవాదిగా పేరొందిన ఎంసీ మెహతా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. -
తాజ్‌మహల్ రంగు మారుతోంది..
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలోని చారిత్రక తాజ్‌మహల్ రంగు మారిపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆందోళనం వ్యక్తం చేసింది. గతంలో పసుపువర్ణంలో మెరిసే ఈ కట్టడం క్రమంగా గోధుమ, ఆకుపచ్చ వర్ణంలోకి మారుతోందని పేర్కొంది. తాజ్‌మహల్‌కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం తక్షణమే భారత, విదేశీ నిపుణుల సాయం తీసుకోవాలని, ఆ తర్వాతే చారిత్రక కట్టడం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. ‘మన వద్ద చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు..మీ వద్ద ఆ నైపుణ్యం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు..లేదా దానిపై మీకు (ప్రభుత్వం) శ్రద్ధ కొరవడింద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. భారత్ వెలుపల విదేశీ నిపుణుల సలహాలు అవసరమైనా తక్షణమే తీసుకోవాలి..లేకుంటే తాజ్ మహల్‌కు మరింత నష్టం వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతోందని పిటిషనర్ ఎంసీ మెహతా సమర్పించిన ఫోటోలను చూపుతూ కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని ప్రశ్నించింది. తాజ్ మహల్ పర్యవేక్షణను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టాలని అన్నారు. అనంతరం ఈ అంశంపై విచారణను మే 9కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్‌మహల్‌ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణవేత్త మెహతా సుప్రీంలో పిటిసన్ దాఖలు చేశారు. -
కుప్పకూలిన తాజ్ ప్రవేశ ద్వారం పిల్లర్
సాక్షి, ఆగ్రా : ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్ ప్రవేశ ద్వారంలోని పిల్లర్ ధ్వంసమైంది. గురువారం ఉదయం కుండపోత వర్షంతో పాటు పెనుగాలుల ధాటికి కట్టడానికి దక్షిణ దిశగా ఉన్న ప్రవేశద్వారం పిల్లర్ కూలిందని అధికారులు తెలిపారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్ మహల్లోకి వీక్షకులను కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. మరోవైపు యూపీలో భారీ వర్షాలకు మధురలో ఓ ఇల్లు కూలడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న చిన్నారుల తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. లక్నో, కాన్పూర్, మధుర, కన్నౌజ్, ఫరక్కాబాద్, ఇటావా, మెయిన్‌పురి సహా యూపీలోని పలు ప్రాంతాల్లను వర్షాలు ముంచెత్తాయి. అకాల వర్షాలతో నంద్‌గావ్, బృందావన్, కోసికలాన్ తదితర ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. -
షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?
-
తాజ్‌మహల్ మాదే: షాజహాన్ విల్లు ఉందా ?
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్ అప్పట్లో వక్ఫ్‌నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. తాజ్ హక్కులపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, భారత పురావస్తు శాఖల మధ్య కేసు నడుస్తోంది. తాజ్ తమ పేరిట రిజిస్టర్ చేయాలని వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు జారీచేయగా దాన్ని సవాలుచేస్తూ భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంలో కేసు వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. 1658లో గృహనిర్బంధంలో ఉన్న షాజహాన్ తాజ్ హక్కుల్ని ఎలా రాసిచ్చారని వక్ఫ్ లాయర్‌ను ప్రశ్నించారు. -
‘తాజ్‌మహల్‌ను షాజహాన్ మాకు రాసిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడో వింత, ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను దాని నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చారని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సుప్రీంకోర్టులో పోరాడుతోంది. మంగళవారం సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్‌మహల్‌ను షాజహాన్ సున్నీ బోర్డుకు రాసిచ్చిన పత్రాలను చూపాలని కోరింది. పత్రాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. భార్య ముంతాజ్‌పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారు. 1658లో షాజహాన్ మరణించారు. తాజ్‌మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందని షాజహాన్ చేసిన డిక్లరేషన్ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజ్‌మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్‌మహల్‌తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. -
కోతులతో తాజ్‌మహల్‌కి ముప్పు!
ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు. ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. -
వేదికపై సింగర్ల గొడవ
-
మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్ మహోత్సవ్‌లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ మహోత్సవ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్ ముచ్చల్, ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్‌లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్‌మహల్‌ను, మొఘల్ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్ మహోత్సవ్ నిర్వహించే సంగతి తెలిసిందే. -
తాజ్‌ను దర్శించుకున్న ప్రధాని ట్రూడో!
-
తాజ్‌ను దర్శించుకున్న ట్రూడో!
సాక్షి, న్యూఢిల్లీ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ వద్ద సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం ఢిల్లీకి ట్రూడో చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జామా మసీదును ట్రూడో కుటుంబం సందర్శించే అవకాశముంది. 2012 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ప్రధాని మోదీ 2015 ఏప్రిల్‌లో కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు.. భారత్ రావాల్సిందిగా ట్రూడోను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్ధామ్ ఆలయాన్ని ట్రుడో సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
తాజ్ సందర్శకులపై ఫీజు మోత
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ సందర్శకులపై భారీగా ఫీజు భారం పడనుంది. ఎంట్రీ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.40 నుంచి రూ.50కి పెంచటంతోపాటు తాజ్‌మహల్ లోపల చూడాలనుకున్న వారి నుంచి ప్రత్యేకంగా రూ.200 వసూలు చేయనున్నారు. పెంచిన చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. రూ.50 ప్రవేశ టికెట్ మూడు గంటలపాటు మాత్రమే చెల్లుబాటవుతుందని ఆయన చెప్పారు. రూ.1,250 చెల్లించే విదేశీ పర్యాటకులు సులువుగా సందర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే టికెట్ ధరలు పెంచామని, ఆసక్తి ఉన్నవారే సందర్శనకు వచ్చే అవకాశముందన్నారు. దళారుల బెడద తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1632లో నిర్మించిన తాజ్‌మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ సమాధులున్నాయి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను యునెస్కో 1983లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. -
తాజ్‌మహల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఆగ్రా: గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు లేకపోవడంతో ముగిసిందనుకున్న తాజ్‌మహల్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్‌గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొగల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడని గతేడాది వ్యాఖ్యలు చేసిన కతియార్ తాజాగా ఆ అంశంపై మళ్లీ స్పందించారు. తాజ్‌మహల్‌ను తాజ్ మందిర్‌గా మారుస్తామని చెప్పారు. కాగా, తాజ్‌మహల్‌ను హిందువులే నిర్మించారని అందుకే తాజ్మందిర్ అని పేరు మారుస్తామని ఎంపీ కతియార్ పేర్కొన్నారు. మరోవైపు తాజ్మహోత్సవ్-2018పై వివాదం మొదలైంది. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రామ్‌లీల నాటకం ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజ్‌మహల్ ప్రతిష్టను యోగి సర్కార్ దెబ్బతీస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. భారత పర్యాటకులపై పరిమితి ఈనెల 20 నుంచి తాజ్‌మహల్‌ను రోజుకు కేవలం 40 వేల మంది భారత పర్యాటకులే సందర్శించనున్నారు. విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేదు. రోజుకు నిర్ణీత టోకన్లు ఇవ్వనున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తాజ్‌మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్ కట్టారు! -
తాజ్ పర్యాటకులపై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోజుకు 40 వేల మంది భారతీయ పర్యాటకులు మాత్రమే ఇకపై తాజ్‌ను వీక్షించనున్నారు. అయితే విదేశీ పర్యాటకుల సంఖ్యపై పరిమితి విధించలేదు. కేంద్ర పర్యాటక శాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఈనెల 20 నుంచి అమల్లోకి రానుంది. తాజ్‌మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది. చర్చల అనంతరం భారతీయ సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించాలని పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజ్‌ను వీక్షించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదరవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. ఎంట్రెన్స్ టిక్కెట్ ధరపైనా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నిర్ణయం ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అయితే ప్రతి ఒక్కరికీ టిక్కెట్ మాత్రం జారీ చేస్తారు. ఇలా రోజు 40 వేల టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. ముంతాజ్ సమాధిని దర్శించేందుకు మాత్రం ప్రత్యేకంగా రూ.100 టిక్కెట్ తీసుకోవాలి. -
జమునా దేవి ఆలయమే.. జామా మసీదు!?
సాక్షి, న్యూఢిల్లీ : మందిర్-మసీదు, తాజ్ మహల్ వివాదం మంటలు పుట్టిస్తున్న సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని జామా మసీదుపై అసలు జమునా దేవి ఆలయం అంటూ.. గురువారం అతిపెద్ద బాంబే పేల్చారు. ఒక్క జామ్ మసీదేకాకుండా.. దేశంలోని ఆరు వేల ప్రార్థనాలయాలను మొఘల్ రాజులు కూలగొట్టి.. మసీదులుగా మార్చారని మరో సంచలన ఆరోపణ చేశారు. దేశంలో మొఘలలు అడుగు పెట్టకముందు వరకూ జామా మసీదు, జమునా దేవి ఆలయంగా ఉండేదన్నారు. క్రీ.శ 17 శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆయన పేర్కొన్నారు. మొఘలుల కాలంలో దేశంలో ప్రఖ్యాంతిగాంచిన ఆరు వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని ఆయన తెలిపారు. తేజే మహాలయాన్ని తాజ్‌మహల్‌గా మార్చినట్టే.. జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారని వినయ్ కతియార్ చెప్పారు. రెండు నెలల కిందట ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన టూరిజం కరపత్రంలో తాజ్‌మహల్‌ను పక్కన పెట్టడంతో వివాదం మొదలైంది. అదే సమయంలో తాజ్ మహల్, తేజో మహాలయమంటూ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా మండుతున్న బాబ్రీ-రామజన్మభూమి కేసు విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి విచారణ వాయిదా వేసింది.