సాక్షి, న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ను విమర్శించే బీజేపీ నేతల వరుస పెరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడంపై మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ భారతీయ సంస్కృతిపై ఓ మాయని మచ్చని అన్నారు. 'ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంపై చాలామంది తమ అసంతృప్తిని వెల్లడించారు. వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు.
ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది' అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ పరిపాలనకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక నగరాలతో జాబితా ప్రకటించారు. అందులో తాజ్‌మహల్‌కు చోటు ఇవ్వలేదు. దీనిపై పెద్ద దుమారం రేగింది.
తాజ్‌మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు వీడియో చూడండి
Comments
Please login to add a commentAdd a comment