ఎయిర్‌పోర్టు బాగుంది.. తాజ్‌మహల్‌కు వెళ్తున్నా | Cancer victims Boy Giridhar | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు బాగుంది.. తాజ్‌మహల్‌కు వెళ్తున్నా

Published Sat, Jun 6 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ఎయిర్‌పోర్టు బాగుంది.. తాజ్‌మహల్‌కు వెళ్తున్నా

ఎయిర్‌పోర్టు బాగుంది.. తాజ్‌మహల్‌కు వెళ్తున్నా

* కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్
* ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో తీరుతున్న కోరిక

శంషాబాద్: ‘మా ఫ్రెండ్స్ చెప్పే వాళ్లు.. విమానాశ్రయం, తాజ్‌మహల్ ఎంతో బాగుంటాయని. ఈ రోజు విమానాశ్రయం చూశా.. చాలా బాగుంది’ అని కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నెల్లిమలకు చెందిన ఎం.వెంకటేశ్వర్లు, కాంతమ్మ దంపతుల కుమారుడు గిరిధర్. 8వ తరగతి చదువుతున్నాడు.

ఏడాదిగా జ్వరంతో బాధపడుతున్న అతడిని తల్లిదండ్రులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చూపించారు. బాలుడికి కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో ఇటీవలే నగరంలోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ బాలుడి కోరికలను తెలుసుకుని వాటిని తీర్చడానికి ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తల్లిదండ్రులతో కలసి తాజ్‌మహల్ చూడడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గిరిధర్ మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement