న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు పునఃప్రారంభం అవుతుందనుకున్న తాజ్‌మహల్ సందర్శన వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాకిడితో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందుల్లో అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగ్రాలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లోని సందర్శనీయ స్థలాలు మూసివేశారు.
(చదవండి: కరోనా అంతానికిది ఆరంభం)
అనంతరం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనా సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. అయితే, పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రకారం నేటి నుంచి తాజ్‌మహల్‌కు సందర్శనకు అనుమతి ఇద్దామని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవని ఆగ్రా జిల్లా యంత్రాంగం చెప్పింది. కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా 24,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 600 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. కేసుల సంఖ్యలో భారత్ రష్యాను సమీపించింది.
(ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఉద్యోగిపై పులి దాడి)
Comments
Please login to add a commentAdd a comment