
తాజ్‌మహల్ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆధునిక వింత ప్రతిష్ట మసకబారుతోంది. ఆమ్ల వర్షాల కారణంగా ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ పసుపు పచ్చగా మారుతోంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ముందుముందు గోధుమ, ఆకుపచ్చ వర్ణాల్లోకి తాజ్‌మహల్ మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశీయ, విదేశాల్లో నిపుణుల సాయం తీసుకుని తాజ్‌మహల్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది.
తాజ్‌మహల్ కీర్తి దిగజారేలా దాని రంగు మారుతోందంటూ పర్యావరణ న్యాయవాదిగా పేరొందిన ఎంసీ మెహతా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment