ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని, మరి ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తాజ్ మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూటి ప్రశ్నలు వేశారు.