Red fort
-
ఢిల్లీలో ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలు
-
తాజ్‌మహల్, చార్మినార్‌నూ కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు. ‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.భాగవత్ మాటా బీజేపీ వినదా?‘‘2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు. -
2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం
-
మోదీ జెండా వందనంలో.. తళుక్కుమన్న రాహుల్
-
ప్రధాని మోదీ కాన్వాయ్ విజువల్స్
-
Watch Live: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
-
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
ఎర్రకోట : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ (ఫొటోలు)
-
పంద్రాగస్టుకు ఎర్రకోటపై నారీశక్తి ప్రదర్శన
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. -
ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డే వేడుకలు
-
మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని నరేంద్ర మోదీ ధీమా.. ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ..ఇంకా ఇతర అప్డేట్స్
-
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్‌లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి
న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎగురవేశారు. అనంతరం ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అతిథులు అందరూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దీంతో ఆయన కుర్చీ ఖాళీగా కనిపించింది. వేడుకకు ఆయన హాజరుకాకపోయినా.. ఖర్గే తన ట్విట్టర్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓ వీడియో షేర్ చేశారు.అందులో.. గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. భారత దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, నర్సింహారావు, మన్మోహన్ సింగ్, అతల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగతి కోసం ఎంతో కొంత సహకరించారని, కానీ ఈ రోజుల్లో కొందరు మాత్రం గత కొన్నేళ్లలోనే దేశం ప్రగతి సాధించినట్లు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాలను వాడుతున్నారని, సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచారని, విపక్ష నోళ్లను మూయిస్తున్నారని, వాళ్ల మైక్‌లను లాగేసి సస్పెండ్ చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఇదిలా ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని కాంగ్రెస్ తెలిపింది. -
Independence Day 2023: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని
సాక్షి, బళ్లారి: నేడు ఢిల్లీలోని ఎర్రకోటపై జరగనున్న 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ సామాన్య మహిళకు అవకాశం దక్కింది. కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన పుష్పావతి సోమప్ప అనే మహిళ రాణిబెన్నూరు తాలూకా చిక్కకురువత్తి గ్రామ పంచాయతీలో నీరుగంటి(వాటర్‌ఉమెన్)గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. భర్త సోమప్ప గతంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో ఆ ఉద్యోగం భార్య పుష్పావతికి దక్కింది. పుష్పావతి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు బెంగళూరు కూడా చూడలేదన్నారు. ప్రస్తుతం విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు తనకు పిలుపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్‌ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
హస్తినకు ‘పొందూరు’ కళాకారులు
పొందూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ముగ్గురు ఖాదీ కార్మికులకు ప్రత్యేక ఆహ్వనం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు, నేత కార్మికులకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో పొందూరుకు చెందిన బల్ల భద్రయ్య–లక్ష్మి దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు అదృష్టం దక్కింది. గుర్తింపు లభించిందిలా.. పొందూరులోని చేనేతవాడకు చెందిన బల్ల భద్రయ్య 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో 15 ఏళ్లు ఫైన్ ఖాదీ పంచెలు (దోవత్) నేయడంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. నూరవ కౌంట్ (ఫైన్) చిలపను తయారు చేసి వస్త్రం నేసేందుకు సంప్రదాయంగా అవసరమైన దారాన్ని తీయడంలో జల్లేపల్లి సూర్యకాంతం మంచి నేర్పరితనం కనబరచడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. -
రికార్డులు బ్రేక్ చేసిన యమున.. ఎర్రకోటను తాకిన వరద నీరు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో యమునా నదిలో నీటి మట్టం ఆల్‌టైం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. వర్షాల వల్ల వరద నీరు కారణంగా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వీధులు నదులను తలపిస్తున్నాయి. తాజాగా ఈ వరద ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్ర కోటను కూడా తాకింది. దీంతో ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరద నీటితో నిండిపోయాయి. కనుచూపు మేర నీరు తప్ప రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది. ఇక, యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కాలేజీలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు. #WATCH | Flood water reaches the Red Fort in Delhi. Drone visuals show the extent of the situation there. pic.twitter.com/q2g4M7yDMP — ANI (@ANI) July 13, 2023 Delhi - The City of Lakes! 😍 Finally Someone’s Dream Comes True! 😅#delhiflood #DelhiRains pic.twitter.com/SDofWAiKS4 — Sumita Shrivastava (@Sumita327) July 13, 2023 #PunjabFloods Whenever we are in trouble, the real heroes of India are always there. BSF personnel are rescuing people trapped in the #DutyBeyondBorders#SecretsOfLordShiva #delhiflood #DelhiRains #delhi बिहार पुलिस #ZeeDigitalIndiaDialogue#ArrestPPMadhvan #Bharateeyans14July pic.twitter.com/kYMvxvJLPy — Roshni Bhatt (@RoshniBhatt17) July 13, 2023 #लालकिला और सलीमगढ़ फ़ोर्ट के बीच रिंग रोड पुराना हनुमान मंदिर इलाके में भर रहा है #Yamuna का पानी.... बताते हैं मुग़लकाल में यहीं से बहती थी यमुना...आज नदी अपने पुराने dhara तक पहुंचने की कोशिश कर रही है....#यमुनाफ्लूड्स #RedFort #delhiflood#yamunariver pic.twitter.com/79RSVM2hXX — Rajan Singh (@rajansi45) July 13, 2023 ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది! -
ఐటీ దాడుల్లేని అద్భుత భారతం.. ఇప్పుడందరి చూపూ 2024 వైపే
నెట్లో ట్రెండ్ అవుతున్న తండ్రీ కూతుళ్ల సంభాషణ.. పనిచేసుకుంటున్న తండ్రిని ఏడేళ్ల పాప... ‘ఏం చేస్తున్నావ్ నాన్నా...’ అని అడుగుతుంది. ‘ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నానమ్మా..’ అని సమాధానం చెప్పగా, ‘ఇన్కమ్ ట్యాక్స్ అంటే...’ ఆ పాప ప్రశ్న. కొద్దిగా ఆలోచించి, కాస్త నిట్టూర్చి. ఇలా అంటాడు. ‘... నిన్నూ, అన్నను పోషిస్తున్నట్టే రాజకీయనాయకులను, అధికారులను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా.. వాటికి డబ్బులు తీసిపెట్టడమే ఇన్కమ్ ట్యాక్స్..’ – ఈ జవాబులో నిజం కాస్తే ఉన్నా, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. సగటు మనిషి, ఉద్యోగిపై ప్రతినెలా, ప్రతి ఏడాదీ ‘ఐటీ దాడులు’ జరుగుతూనే ఉంటాయిగా... అందుకే. ► చరిత్ర చూస్తే సగటుమనిషి కడుపు మంట నుంచి విప్లవాలు, లేదా విప్లవాత్మక ఆలోచనలు పుట్టుకురావడం కనిపిస్తుంది. కానీ, సాక్షాత్తూ ఓ మంత్రి కడుపుమంట నుంచి కూడా విప్లవాత్మక ఆలోచనలు రావడం ముదావహం, ఆహ్వానించదగ్గ విషయం. మంత్రి మల్లారెడ్డి పన్నులు లేని, ఐటీ దాడుల్లేని భారతావనిని స్వప్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో అది సాధ్యమని మనలో ఆశలు కల్పిస్తున్నారు. ఆయన మాటలు చూడండి. ‘‘కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి 2024లో అధికారంలోకి వస్తది. ఎవరిపైనా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉండవు. మా పాలనలో ఎవరైనా, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛందంగా, తమకు ఇష్టమైతేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తాం..’ – వందల కొద్దీ ఐటీ అధికారులు రెండు మూడు రోజులపాటు దాడి చేసి, నానా ప్రశ్నలు వేసి, రక రకాల డాక్యుమెంట్లు అడిగి, కాస్తో కూస్తో దొరి కిన కరెన్సీని ఎక్కడిదని ప్రశ్నించిన ఫ్రస్టేషన్లో పుట్టిందే .. ‘బీఆర్ఎస్ నాయత్వంలో పన్నులు లేని భారతదేశం’ ఐడియా అని అందరూ అపోహ పడుతున్నా, వినడానికి ఎంత బావుందో... అని అందరూ ఆనందపడ్డారు. చాయ్ వాలా... మిల్క్వాలా ‘చాయ్‌వాలా’ మోదీ మన గొంతులో బలవంతంగా పోస్తున్న జీఎస్‘టీ’ కన్నా ‘మిల్క్వాలా’ మల్లారెడ్డి మాటలే మనకు ‘బూస్ట్’నిస్తాయి. ఇలా జనాన్ని ఆనంద పెట్టడంలో, ముఖ్యంగా కుర్రకారును ఉత్సాహపరచడంలో, మోటివేట్ చెయ్యడంలో మల్లారెడ్డికి పెట్టిందిపేరు. విజయానికి తానే మోడల్ నంటూ కుండ బద్దలు కొట్టేసి, 23 మూడేళ్ల వయస్సులో సైకిల్‌పై పాలమ్మిన తాను దేశంలోని టాప్ టెన్ ‘ఎడ్యుకేషనిస్టు’గా, మంత్రిగా ఎదగడంలో తన అవిర ళ కృషిని తరచూ యువతకు గుర్తుచేస్తుంటారు. బాగా ఎదగాలని మోటివేట్ చేస్తుంటారు. షార్ట్‌కట్స్ కూడా చెబుతుంటారు. పాతికేళ్ల వయస్సులో, అదికూడా ఎవరితో పడితే వాళ్లతో ప్రేమలో పడకూడదని ముఫ్పై ఏళ్లు దాటాకా ఆ పని చేయాలని సూచిస్తుంటారు. ప్రేమ, పెళ్లి అంటే ‘ఐశ్యర్యారాయ్ అమితాబ్ కొడుకును పట్టినట్టుగా, జాక్‌పాట్ కొట్టినట్టుగా...’ ఉండాలని అమ్మాయిలకు మార్గనిర్దేశనం చేస్తారీ ఎడ్యుకేషనిస్టు. అలాగే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా ఆర్థికంగా స్థిరపడాలో హీరో రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెబుతుంటారు. అలా రిచ్‌గా ఎలా రూపొందాలో తరచూ చెప్పే మంత్రిగారు, ఇప్పడు ఆ రిచ్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో యోచించి.. అలా కష్టపడి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకపోవడమే మార్గంగా ఊహించి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘ట్యాక్స్లెస్ కంట్రీ’గా ఇండియాను రూపొందించే పనిలో పడ్డారు. ఇక్కడ పన్ను బాధలేదు.. నిజానికి పన్ను బాధలేని దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు. మంత్రి గారి మాటలు నిజమైతే మనమూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు.. మచ్చుకు కొన్ని.. ► యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను మాటే లేదు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా విదేశాల వారూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలామంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ► దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచ్‌లు, కేసినోలతో అలరారే పనామా దేశం పన్ను రహిత స్వర్గంగా పేరుపొందింది. ఇక్కడి జనం ఆదాయ పన్ను కట్టే పనిలేదు. విదేశాల్లో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టనక్కర లేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం, అదీ స్వల్పస్థాయిలో పన్నులు కడితే చాలు. ► బహమాస్‌లోనూ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశమూ ఉంటుంది. ► గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్‌లో పదిశాతం, కువైట్‌లో 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ► మరో గల్ఫ్ దేశం ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాదు.. ఆస్తి పన్ను, స్థిరాస్తులపై పన్ను వంటివీ లేవు. ► ఆధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఆదాయ పన్ను లేదు. ► మొనాకో, సైమన్ ఐలాండ్స్, వనౌటు వంటి దేశాల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. వనౌటు దేశం అయితే డ్యూయల్ సిటిజన్ షిప్‌ను అధికారికంగానే అంగీకరిస్తుంది. ► యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన ఆండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అదీ గరిష్ఠంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులూ ఉండవు. ... మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, ఆ జెండా నుంచి గులాబీ రేకుల్లాగే... సగటు, వేతన జీవుల కళ్లల్లో, ఇంకా చెప్పాలంటే ధనిక, పేద తేడా లేకుండా అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి. కళ్ల ముందు పైన చెప్పిన పన్నులేని దేశాలు యూఏఈ, ఖతార్, కువైట్ ఇత్యాదులు అక్కడి ప్రజల ఆనందం కళ్లముందు కదలాడాయి. మల్లారెడ్డి హామీ ఇచ్చిన ‘ఐటీ దాడుల్లేని స్వప్నలోకం’ ఆవిష్కృతమైంది. ఇక ప్రతి బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారతాయా అని కామన్ మ్యాన్ ఆశగా చూడక్కర్లేదు. డోర్ బెల్ మోగితే ఐటీ పటాలమేమోనని రిచ్‌మ్యాన్ గాబరా పడక్కర్లేదు. మన డబ్బంతా మనకే.. ... ఇప్పుడందరి చూపూ 2024 వైపే, అందరి ఆశా ఒక్కటే.. బీఆర్ఎస్ ఎర్రకోట ఎక్కాలి.. మల్లారెడ్డి ఆర్థిక మంత్రి కావాలి.. అంతే. (క్లిక్ చేయండి: పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...) -
ఎర్రకోట వీరుడు
మాటలతో కోటలు కడుతూ, మనసు గెలవడం సులభమేమీ కాదు. కానీ, చారిత్రక ఎర్ర కోట బురుజుపై నుంచి ప్రసంగించినప్పుడల్లా ప్రధాని మోదీ తన మాటల మోళీతో సామాన్యుల్ని మెప్పిస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవ వేళ తాజాగా ప్రసంగిస్తూ శతవసంత భారతా వనికి గంభీర లక్ష్యం నిర్దేశించారు. 2047 కల్లా భారత్‌ను ‘అభివృద్ధి చెందిన దేశం’ చేయాలన్నారు. ‘దేశాభివృద్ధి, బానిసత్వ మూలాల్ని వదిలించుకోవడం, వారసత్వ వైభవ స్ఫురణ, సమైక్యత, బాధ్య తల నిర్వహణ’ అంటూ 5 ప్రతిజ్ఞల మహాసంకల్పమూ చెప్పారు. లక్ష్య సాధనకు స్పష్టమైన సర్కారీ ప్రణాళిక ఏమిటో చెప్పడం మాత్రం అలవాటుగానో, పొరపాటుగానో విస్మరించారు. పొరుగున పొంచి ఉన్న ముప్పు, అంతర్జాతీయ సమస్యల ప్రస్తావన చేయలేదు. రెండేళ్ళలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేయడం మర్చిపోలేదు. అవినీతి, బంధుప్రీతి, వంశపాలనపై పోరాడేందుకు ఆశీస్సులు కావాలని షరా మామూలుగా అభ్యర్థించడమూ ఆపలేదు. 2017లో కేదార్నాథ్ పర్యటనప్పుడే 2022 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తా మని ప్రధాని సంకల్పం చెప్పారు. ఇప్పుడదే లక్ష్యాన్ని కొత్త కాలావధితో ప్రవచించారు. ఏది, ఎన్నిసార్లు చెప్పినా స్వభావసిద్ధ నాటకీయ హావభావ విన్యాసాలతో సామాన్యుల్ని ఆకట్టుకొనేలా చెప్పడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. వరుసగా తొమ్మిదో ఏట చారిత్రక ఎర్రకోటపై జెండా ఎగరేసి, సందేశమిచ్చిన ఆయన ఈసారి సంప్రదాయంగా చేసే ప్రత్యేక పథకాల ప్రకటనల జోలికి పోలేదు. స్వచ్ఛతా అభియాన్, జాతీయ విద్యావిధానం, కరోనా టీకాల లాంటి అంశాల్లో ప్రభుత్వ పురోగతినే పునశ్చరణ చేశారు. ఇటీవలి తన అలవాటుకు భిన్నంగా టెలీప్రాంప్టర్ లేకుండా 82 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘జై జవాన్, జై కిసాన్’కు గతంలో వాజ్‌పేయి ‘జై విజ్ఞాన్’ను జోడిస్తే, తాజాగా మోదీ ‘జై అనుసంధాన్’(నూత్న పరిశోధన)ను చేర్చారు. కొన్నేళ్ళుగా మాటలు ఎర్రకోట దాటాయే కానీ, చేతలు సభా వేదికలైనా దాటట్లేదన్నది నిష్ఠుర సత్యం. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2017లోనే మాట ఇచ్చారు. విదేశాల్లోని నల్లధనం వెలికి తెచ్చి, ఇంటింటికీ రూ. 15 లక్షలు పంచడమే తరువాయని ఊరించారు. అమృతో త్సవం నాటికి అందరికీ ఇళ్ళు వచ్చేస్తాయని ఊహల్లో ఊరేగించారు. తీరా అన్నీ నీటి మీద రాతల య్యాయి. ఉచితాలన్నీ అనుచితాలంటూ, ప్రజాసంక్షేమ పథకాలపై ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న వారు కొత్తగా ఏవో ఒరగబెడతారనుకోలేం. కానీ ‘అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు... అలము కున్న ఈ దేశం ఎటు దిగజారు’ అంటూ దశాబ్దాల క్రితం కవి వ్యక్తం చేసిన ఆవేదననే నేటికీ వల్లె వేస్తుంటే, ఎవరిపైనో నెపం మోపుతుంటే ఏమనాలి? దేశంలో ఏ మంచి జరిగినా గత 8 ఏళ్ళ లోనే జరిగినట్టూ, ప్రతి చెడుకూ ఆ మునుపటి 67 ఏళ్ళే కారణమన్నట్టు ఎన్నాళ్ళు నమ్మబలుకుతారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేష ప్రగతికి దోహదపడిందంటూ ఎర్రకోటపై అనేక అంశాల్ని ప్రస్తావించారు. వాటిలో కొన్ని సత్యశోధనకు నిలవట్లేదు. ‘పర్యావరణంపై భారత కృషి ఫలితాలి స్తోంది. అడవుల విస్తీర్ణం, పులులు, ఆసియా సింహాల సంఖ్య పెరగడం ఆనందాన్నిస్తోంది’ అంటూ చెప్పుకున్న గొప్పల్లో నిజం కొంతే! దేశ భూభాగంలో మూడోవంతులో అడవులను విస్తరింపజేస్తా మన్న పాలకులు సాధించింది స్వల్పమే. అటవీ విస్తీర్ణం 24.6 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్క. 2002 – 2021 మధ్య భారత్‌లో చెట్ల విస్తీర్ణం 19 శాతం మేర తగ్గిందని నాసా, గూగుల్ వగైరాల సమాచారమంతా క్రోడీకరించే ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ మాట. పర్యావరణ విధానానికి వస్తే – బొగ్గు మీదే అతిగా ఆధారపడే మన దేశం అమెరికా, చైనాల తర్వాత అధిక కర్బన ఉద్గార దేశాల్లో ఒకటి. అలాగే, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత సంస్థలను ప్రోత్సహిస్తున్నామ న్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ప్రోత్సాహం బీజేపీ హయాంలో జరిగింది. కానీ, విదేశాల నుంచి భారీగా ఆయుధాల కొనుగోలులో ఇప్పటికీ మనం ముందున్నాం. 2017 – 2021 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం వాటా మనదే. దేశంలో పులులు, సింహాల సంఖ్య పెరిగిన మాట నిజమైనా, జాతీయ చిహ్నంలో సరికొత్త ఉగ్రనరసింహం దేనికి ప్రతీకంటే జవాబివ్వడం కష్టం. స్వాతంత్య్ర కాలపు ‘స్వదేశీ’, నేటికి ‘స్వావలంబన’ (ఆత్మనిర్భరత)గా రూపాంతరమైనా నేతన్న ఖద్దరును కాదని జెండాలు సైతం దిగుమతి చేసుకొనే దుఃస్థితి ఏమిటి? విదేశీ బొమ్మలు వద్దంటు న్నారని సంబరంగా చెబుతున్నవారు విదేశీ తయారీ జాతీయజెండాల వైపు మొగ్గడమేమిటి? అవినీతి, ఆశ్రితపక్షపాతం, ఆత్మనిర్భర భారత్ మోదీ ప్రసంగాల్లో నిత్యం దొర్లే మాటలు. నారీ శక్తి ప్రస్తావనా నిత్యం చేస్తున్నదే! ఆచరణలో చేసిందేమిటంటే ప్రశ్నార్థకమే! అవినీతిపై యుద్ధం మాటకొస్తే – 2015 మొదలు 2017, 2018, 2019... ఇలా ఏటా ఆ మాట మోదీ తన ప్రసంగంలో చెబుతూనే ఉన్నారు. ప్రసంగ పాఠాలే అందుకు సాక్ష్యం. ప్రతిపక్షపాలిత బెంగాల్లో బయటపడ్డ గుట్టలకొద్దీ నోట్లకట్టల్ని ఎవరూ సమర్థించరు కానీ, కాషాయ జెండా కప్పుకోగానే పచ్చి అవినీతి పరులు సైతం పరిశుద్ధులైపోతున్న ఉదాహరణలే అవినీతిపై పోరాటస్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి. సమై క్యతను ప్రవచిస్తున్న పార్టీలు భిన్నభాషలు, సంస్కృతులు, కులాలు, మతాలున్న దేశంలో రకరకాల ప్రాతిపదికన మనుషుల్ని విడదీస్తూ, మనసుల్ని ఎలా దగ్గరచేయగలవు? వాగాడంబరం కట్టిపెట్టి, ఆచరణలోకి దిగాలి. స్వతంత్ర భారత శతమాన లక్ష్యం చేరాలంటే అన్నిటికన్నా ఆ ప్రతిజ్ఞ ముఖ్యం! -
సుసంపన్న భారతం.. పాతికేళ్ల లక్ష్యం.. పంచ ప్రతిజ్ఞలతో సాకారం
న్యూఢిల్లీ: అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే కన్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని సోమవారం దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంకల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్ శతఘ్నుల ‘21 గన్ సెల్యూట్’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులర్పించారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు. దోచిందంతా కక్కిస్తాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్రం వాడుకుంటోందన్న విపక్షాల విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘ఒకవైపు దేశంలో కోట్లాది మందికి తలదాచుకునే నీడ లేదు. మరోవైపు కొందరు మాత్రం దాచుకోవడానికి ఎంతటి చోటూ చాలనంతగా అక్రమార్జనకు పాల్పడ్డ తీరును ప్రజలంతా ఇటీవల కళ్లారా చూశారు’ అంటూ విపక్ష నేతలు తదితరుల నివాసాలపై ఈడీ, ఐటీ దాడుల్లో భారీ నగదు బయట పడుతుండటాన్ని ప్రస్తావించారు. ‘అవినీతిని సంపూర్ణంగా ద్వేషిస్తే తప్ప ఇలాంటి ధోరణి మారదు. అవినీతిని, అవినీతిపరులను సమాజమంతా అసహ్యించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ‘గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీసి ప్రత్యక్ష పథకాల ద్వారా నగదు రూపేణా బదిలీ చేసి దేశాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాం. బ్యాంకులను దోచి దేశం వీడి పారిపోయిన వారిని వెనక్కు రప్పించే పనిలో ఉన్నాం. వారి ఆస్తులను ఇప్పటికే జప్తు చేశాం. దేశాన్ని దోచుకున్న వాళ్లనుంచి అంతకంతా కక్కించి తీరతాం. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. వాళ్లెంత పెద్దవాళ్లయినా సరే, తప్పించుకోలేరు’’ అని హెచ్చరించారు. ‘దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి బంధుప్రీతి తీరని హాని చేస్తోంది. దేశ ఉజ్వల భవిత కోసం దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. దీన్ని నా ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా భావిస్తా. రాజకీయాల్లో కూడా వారసత్వాలు దేశ సామర్థ్యాన్ని ఎంతగానో కుంగదీశాయి. వారసత్వ రాజకీయాలకు పాల్పడే వారికి కుటుంబ క్షేమమే పరమావధి. దేశ సంక్షేమం అసలే పట్టదు’’ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలను, వ్యవస్థలను పరిశుభ్రం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తనతో చేతులు కలపాలన్నారు. అలసత్వం అసలే వద్దు స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఎంతో సాధించేశామన్న అలసత్వానికి అస్సలు తావీయొద్దని ప్రధాని అన్నారు. ‘‘మన వ్యక్తిగత కలలను, ఆకాంక్షలను, సామాజిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వచ్చే పాతికేళ్ల కాలం సువర్ణావకాశం. స్వతంత్య్ర యోధుల కలలను సాకారం చేసేందుకు కంకణబద్ధులవుదాం. స్వాతంత్య్ర ఫలాలను, అధికార ప్రయోజనాలను చిట్టచివరి నిరుపేదకు కూడా సంపూర్ణంగా అందించాలన్న మహాత్ముని ఆకాంక్షను నెరవేర్చేందుకు నేను కట్టుబడ్డా’’ అని చెప్పారు. సమాఖ్య భావనకే పెద్దపీట బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘‘కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలనే సహకారాత్మక సమాఖ్య భావనను, ‘టీమిండియా’ స్ఫూర్తిని నేను సంపూర్ణంగా నమ్ముతానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా దాన్ని ఆచరణలో చూపించా’’నని చెప్పారు. దేశాన్ని కలసికట్టుగా అభివృద్ధి చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోటీపడదామని సూచించారు. త్వరలో 5జీ సేవలు ఇది టెక్నాలజీ దశాబ్ది. ఈ రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ సారథిగా ఎదుగుతున్నాం. 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరూరికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కామన్ సర్వీసెస్ సెంటర్లు అందనున్నాయి. కొత్త పారిశ్రామిక వృద్ధి విప్లవం మారుమూలల్లోంచే రానుంది. విద్య, వైద్య సేవల్లో డిజిటల్ మాధ్యమం విప్లవాత్మక మార్పులు తేనుంది. పరిశోధన, నవకల్పనలే అజెండాగా ‘జై అనుసంధాన్’కు సమయమిదే. ప్రపంచ డిజిటల్ పేమెంట్లలో 40 శాతం వాటా మనదే. యూపీఐల విస్తృతే అందుకు కారణం. మిషన్ హైడ్రోజన్, సౌర శక్తిని అందిపుచ్చుకోవడం తదితరాల ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధిద్దాం. క్రమశిక్షణ, జవాబుదారీతనమే విజయానికి మూలసూత్రాలు. సేంద్రియ సాగుకు జై కొడదాం. రక్షణరంగం సూపర్ మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత లక్ష్యాల సాధనకు రక్షణ బలగాలు ఎంతగానో పాటుపడుతున్నాయి. ఫలితంగా బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులను దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇందుకు మన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎలక్టాన్రిక్ వస్తువులు మొదలుకుని అత్యాధునిక క్షిపణుల దాకా తయారు చేసే హబ్‌గా భారత్ మారుతోంది. విదేశీ బొమ్మలొద్దని, దేశీయ ఆట బొమ్మలతోనే ఆడుకుంటామని తమ పిల్లలంటున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతుంటే విని పులకించిపోతున్నా. ఆ ఐదారేళ్ల చిన్నారులకు నా సెల్యూట్. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికిది తిరుగులేని సంకేతం. మహిళలే వృద్ధికి మూలం ప్రజాస్వామ్యాలన్నింటికీ మాతృక మన దేశమే. భిన్నత్వంలో ఏకత్వమే మన మూల బలం. అంతటి కీలకమైన ఐక్యతను సాధించాలంటే లింగ సమానత్వం అత్యంత కీలకం. మహిళలను అవమానించే ధోరణి మనలో అప్పుడప్పుడూ తొంగి చూస్తుండటం దురదృష్టకరం. ఈ జాఢ్యాన్ని మనలోంచి పూర్తిగా పారదోలుతామంటూ ప్రతినబూనుదాం. మాటల్లో గానీ, చేతల్లో గానీ మహిళల ఔన్నత్యాన్ని కించపరచొద్దు. కొడుకును, కూతురినీ సమానంగా చూడటం ద్వారా ఇందుకు ఇంట్లోనే పునాది పడాలి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. స్త్రీలను గౌరవించడం మన దేశ వృద్ధికి ముఖ్యమైన మూల స్తంభమని గుర్తుంచుకోవాలి. మెరిసిన ఎర్రకోట పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మువ్వన్నెల అలంకరణలతో ఎర్రకోట మెరిసిపోయింది. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కోట గోడలపై కనువిందు చేశాయి. కోట ప్రాంగణం, పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
76 వ ఇండిపెండెన్స్ డే: తొలిసారి మేడిన్ ఇండియా గన్
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్‌తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది. "మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. #WATCH | Made in India ATAGS howitzer firing as part of the 21 gun salute on the #IndependenceDay this year, at the Red Fort in Delhi. #IndiaAt75 (Source: DRDO) pic.twitter.com/UmBMPPO6a7 — ANI (@ANI) August 15, 2022 For the first time, MI-17 helicopters shower flowers at the Red Fort during Independence Day celebrations. #IDAY2022 #IndependenceDay2022 #स्वतंत्रतादिवस pic.twitter.com/j1eQjIoZAn — PIB India (@PIB_India) August 15, 2022 -
ఎర్రకోటలో రెపరెపలాడిన తిరంగా.. వేడుకల్లో ప్రధాని మోదీ(ఫొటోలు)
-
ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడింది
-
ప్రధాని హోదాలో తొమ్మిదో సారి మోదీ పతాకావిష్కరణ
-
ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ
Independence Day celebrations ఢిల్లీ అప్డేట్స్ ►వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ ►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి ►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి ►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి ►5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి ►మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోంది ►జై జైవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ ►ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్ లక్ష్యం ►డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ►వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ►సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ►ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. ►భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ► స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి. ► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి. ► ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ #WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho — ANI (@ANI) August 15, 2022 ►ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు. Delhi | PM Modi inspects the inter-services and police Guard of Honour at Red Fort pic.twitter.com/IxySt0G0r4 — ANI (@ANI) August 15, 2022 ► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు. ► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR — ANI (@ANI) August 15, 2022 ► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు. ► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి. ► 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్‌ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్‌ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
Azadi Ka Amrit Mahotsav: 10 వేల మందితో పహారా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం జరగనున్న భారత 75వ స్వాతంత్య్రదిన వేడుకలకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7 వేల మంది ఆహుతులు వస్తూ ఉంటే ఎర్ర కోట చుట్టుపక్కల 10 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. సోమవారం జాతీయ జెండాను ఆవిష్కృతం చేసేంతవరకు ఎర్రకోట చుట్టూ అయిదు కిలో మీటర్ల మేర ఎలాంటి పతంగులు ఎగరవేయకూడదని ఆంక్షలు విధించారు. డ్రోన్లతో కూడా నిరంతరం పహారా ఉంటుంది. ఎర్రకోట ప్రాంగణంలోకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కారు కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్‌కేసెస్, హ్యాండ్‌బ్యాగ్స్, కెమెరాలు, బైనాక్యులర్స్, గొడుగులు తీసుకురావడంపై నిషేధం విధించారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్ కెమెరాలను అమర్చారు. 400కి పైగా కైట్ కేచర్స్‌ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. -
ఎర్రకోటకు ఎగబాకిన టెర్రకోట!
బి.కొత్తకోట: టెర్రకోట కళాకృతులు అంటే కంటేవారిపల్లె గుర్తుకొస్తుంది. ఎలాంటి యంత్ర, అచ్చు పరికరాల ప్రమేయం లేకుండా, కేవలం చేతి వేళ్లతో 700 రకాల మట్టి కళాకృతులను తీర్చిదిద్దే స్థాయికి తెచ్చిన ఘనత అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య(77)దే. ముంబై–చెన్నై జాతీయ రహదారిపై ఉన్న కంటేవారిపల్లెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి, ఎంతో మంది ఉపాధి పొందడానికి మార్గదర్శి అయ్యాడాయన. శిక్షణతో వెలుగులోకి టెర్రకోట.. రిషివ్యాలీ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిగత వైద్యుడి కుమారుడు, క్రాఫ్ట్ టీచర్ విక్రం పర్చురే (బెంగళూరు) ఇక్కడికి రావడంతో టెర్రకోట కళ గురించి ప్రపంచానికి తెలిసింది. 1983లో ఆయన రిషివ్యాలీ పాఠశాలలో కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య, ఎ.వెంకటరమణ, డి.పెద్దవెంకటరమణకు చిత్రాలు గీసి ఇచ్చి వాటిలాగే మట్టిబొమ్మలు తయారు చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నెలకు రూ.400 వేతనం చెల్లించేవారు. కొన్నాళ్లకు కంటేవారిపల్లెలోని పూరిగుడిసెలో రామయ్య 1985లో సొంతంగా టెర్రకోట మట్టిబొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. దీనికి విక్రం పర్చురే సహకారం అందించారు. 2వేలకు పైగా గీసిన బొమ్మల చిత్రాలను అందించారు. ఈ నేపథ్యంలో రామయ్య తాను తయారుచేసిన బొమ్మలను రహదారిపై ఉంచి విక్రయాలు ప్రారంభించడంతో అందరి దృష్టి పడింది. రామయ్యతో ప్రారంభమైన టెర్రకోట కళ ఆయన వద్ద శిక్షణ పొందిన వారితో విస్తరించింది. సింగపూర్‌కు ఎగుమతి దేవుని గదిలో ఉంచే దీపాల నుంచి హోదా, దర్పాన్ని గుర్తుకు తేచ్చే విలాసవంతమైన బొమ్మల దాకా టెర్రకోట ఆకృతులు అధికంగా సింగపూర్‌కు ఎగుమతి అవుతాయి. 1986 నుంచి ప్రభుత్వ సౌజన్యంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రకోట మట్టి బొమ్మల ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా తయారీదారులకు ఆదాయం, ప్రాచుర్యం లభించింది. దీంతోపాటు ఇటీవలి కాలంలో మళ్లీ మట్టి పాత్రల్లో వంటలు చేయడం మొదలైంది. ప్రజలు మట్టికుండలు, వంటపాత్రలు, మట్టితో చేసిన వాటర్ బాటిళ్లు, టీ కప్పులు, ప్లేట్లు, పొయ్యిలు, మట్టి కొళాయి కుండలను అధికసంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. అందరికీ సీఎఫ్‌సీ కురబలకోట మండలం అంగళ్లులో టెర్రకోట కళాకారుల కోసం కేంద్రజౌళిశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కళాకారులు బొమ్మలు చేసుకునేందుకు వీలుగా పనిముట్లు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. తయారీ ఇలా.. అందరూ ఇష్టపడే టెర్రకోట బొమ్మల తయారీకి అవసరమైన నాణ్యమైన చెరువుమట్టి ఈ ప్రాంతంలోనే లభ్యం కావడం విశేషం. ముందుగా చెరువుమట్టిని నీటిలో నానబెట్టి జల్లెడపట్టిన ఇసుకను అందులో కలుపుతారు. ఒకరోజు తర్వాత మట్టిని కాలితో తొక్కుతారు. చక్రంమీద మట్టిపెట్టి ఆకృతులను తయారు చేస్తారు. మట్టితో సిద్ధం చేసిన ఆకృతులను పదిరోజులు నీడలో ఆరబెట్టాక ఒకరోజు ఎండలో ఉంచుతారు. మరుసటిరోజు బట్టీలో వాటిని పేర్చి 12 గంటలు కాల్చుతారు. బొమ్మలు ఎర్రరంగులో ఉండాలంటే కట్టెలతో, నల్లరంగులో ఉండాలంటే వరిపొట్టు, బొగ్గులతో కాల్చుతారు. బోధి వృక్ష బుద్ధుడికి అవార్డు కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఎ.నాగరాజు టెర్రకోట కళాకారుడు. బోధి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్న బుద్ధుడి బొమ్మను 2018లో మట్టితో తయారు చేశాడు. ఈయన సృజనకు మెచ్చిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ రూ.25వేలు, ప్రశంసాపత్రంతో సత్కరించింది. కష్టాల నుంచి గట్టెక్కించాయి.. నాన్న వారసత్వంగా కుమ్మరి వృత్తితో మట్టికుండలు తయారుచేసి పల్లెలు, సంతల్లో విక్రయిస్తే వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. విక్రం పర్చురే సహకారంతో వందల రకాల బొమ్మలు తయారు చేయడం నేర్చుకొన్నా. చాలామందికి శిక్షణ ఇచ్చా. సెంటు భూమిలేని నేనిప్పుడు 10 ఎకరాల భూమిని కొని బోరు వేయించి పంటలు సాగు చేస్తున్నా. సొంతింటిని నిర్మించుకొన్నా. మా కళను గుర్తించిన ప్రధాని పీవీ నరసింహారావు టెర్రకోట బొమ్మలు చూసి ఆశ్చర్యపోయారు. 1991లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ వేదికపై రూ. 1,116 ఇచ్చి సత్కరించారు. – ఎ.రామయ్య, టెర్రకోట కళాకారుడు -
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం
Secret Tunnel In Delhi: ఢిల్లీ శాసనసభ వద్ద రహస్యం సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగం శాసనసభ నుండి ఎర్రకోటను కలుపుతుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు. స్వాతంత్య్ర సమర యోధులను తరలించేందుకు అప్పట్లో బ్రిటీస్ పాలకులు దీన్ని వినియోగించేవారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ ప్రదేశం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉన్న దీన్ని పర్యాటకులు ,సందర్శకుల కోసం దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 1993లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎర్రకోట వరకు వెళ్లే సొరంగం ఉందని వార్తలు వినిపించాయి. దాని చరిత్రను వెతకడానికి ప్రయత్నించాను. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లభించలేదని గోయల్ తెలిపారు. అయితే ఆ సొరంగ ద్వారం ఇప్పుడు బయటపడిందని, మెట్రో ప్రాజెక్టులు, మురుగు నీటి వ్యవస్థల కారణంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత తవ్వే ఉద్దేశం లేదని అన్నారు. 1912లో కోల్‌కతా నుండి దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత, అక్కడ అసెంబ్లీని 1926లో కోర్టుగా మార్చారని, స్వాతంత్య సమర యోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగాన్నే వినియోగించేవారని చెప్పారు. ఉరిశిక్షలకు ఉపయోగించే గది ఉందని తెలుసు కానీ దాన్నేప్పుడూ తెరవలేదన్నారు. 75 వసంతాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వారికి నివాళిగా ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల మందిరంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఢిల్లీ శాసన సభకు చరిత్ర ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి ఈ గదిని పర్యాటకుల కోసం తెరచి ఉంచాలని భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే సంబంధిత పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. "It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters," said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69 — ANI (@ANI) September 2, 2021 -
మాట నిలబెట్టుకున్న ప్రధాని.. పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముందుగా తాను చెప్పినట్లుగానే.. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న ఎర్రకోటకు ఆథ్లెట్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ తన నివాసంలో ఒలింపిక్స్ అథ్లెట్స్ కి ఆతిథ్యం ఇచ్చారు. వారు చేసిన కృషిని అభినందించారు.. వారి విజయాలను ప్రశంసించారు. భారత అథ్లెట్స్ కి ఒలింపిక్స్ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా.. ఆ సమయంలో వారందరి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మోదీ తెలుసుకున్నారు. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో చెప్పిన ఆయన.. దాని ప్రకారమే నేడు సింధు తో కలిసి ప్రధాని ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గెలుచుకున్న బ్రాంజ్ మెడల్ తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది. @Pvsindhu1 getting treated to an ice-cream by PM Modi at 7LKM #Olympics2021 pic.twitter.com/CZX6c8X114 — Megha Prasad (@MeghaSPrasad) August 16, 2021 -
‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు. -
అందరి కృషితో లక్ష్యాలు అందుకోగలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ. ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ మధ్య మధ్యలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగర్వంగా చాటుతూ ప్రధాని ప్రసంగం సాగింది. 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ దేశ భద్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు. సంప్రదాయ కుర్తా, నీలం రంగు జాకెట్, కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ప్రధాని దాదాపుగా 90 నిముషాల సేపు ప్రసంగించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదానికి కొత్తగా సబ్కా ప్రయాస్ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు. భారత్ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. అందుకే రాబోయే 25 ఏళ్లు అమృత కాలంగా ప్రధాని అభివరి్ణంచారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మా గాం«దీ, సుభాష్ చంద్రబోసు, భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్. అంబేద్కర్ వంటి నేతలందరినీ ప్రధాని పేరు పేరునా స్మరించారు. యువత ఏదైనా చేయగలదు నేటి యువతరంపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. నేటి తరం ఏదైనా చేయగలదు, ప్రతీ లక్ష్యాన్ని సాధించగలదు అన్నారు. ‘‘నాకు ఈ దేశ యువతపై విశ్వాసం ఉంది. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తి నిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం’’ అని మోదీ అన్నారు. ‘‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం. అసంఖ్యాకమైన ఆయుధాలు మనదగ్గరున్నాయి. దేశభక్తి ప్రతీ చోటా పొంగిపొరలుతోంది. అందరూ కదిలి రండి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. దేశ భవితను సమున్నతంగా రెపరెపలాడించండి’’ అని మోదీ ఒక కవితతో తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు ► దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం. ► వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ► 2024 నాటికి గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం ► దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. నేటి యువత మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ► ఏడేళ్ల క్రితం భారత్ 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది. అదే ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించింది. ► కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తల కృషి అత్యంత గర్వకారణ. రెండు మేకిన్ ఇండియా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ► జమ్మూ కశీ్మర్లో నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి ► కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం ► అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ అనవసర జోక్యాలు తగ్గించాం. పన్నుల్లో సంస్కరణలు తీసుకువచ్చి వాణిజ్యాన్ని సులభతరం చేశాము. రూ.100 లక్షల కోట్లతో గతిశక్తి భారత్ ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు. సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కలి్పంచారు. కాషాయ రంగు తలపాగాతో ప్రధాని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో రంగురంగుల ఆకర్షణీయమైన తలపాగాలు ధరించే సంప్రదాయా న్ని ప్రధాని మోదీ కొనసాగించారు. ఆదివారం ఆయన ఎర్రటి చారలు కలిగిన కాషాయరంగు తలపాగాతో ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రసంగించారు. సంపద్రాయ కుర్తా, చుడిదార్‌తో పాటు బ్లూ జాకెట్, ఉత్తరీయం వేసుకున్నారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఇది సాధించడానికి కృషి చేస్తామని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రధాని చెప్పారు. -
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని
-
త్యాగధనులను దేశం స్మరించుకుంటోంది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ అన్నారు. ‘‘భారత అథ్లెట్లు నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. మన రణనినాదం కావాలి. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని’’ ప్రధాని మోదీ అన్నారు. ‘‘సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. పోషకాహారంతోపాటు వైద్యం కూడా అత్యంత కీలకమైంది. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రికి వైద్య వసతులతోపాటు ఆక్సిజన్ ప్లాంటుకు చర్యలు తీసుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్యవిద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ఓబీసీల్లో ఎవరు ఉండాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చాం. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చూడాలి. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందని’’ ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ వికాసానికి చర్యలు చేపట్టామని మోదీ అన్నారు. లద్ధాఖ్‌లో సింధూ సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్నెట్ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘ఫసల్ బీమా యోజనతో చిన్న రైతులకు మేలు జరుగుతోంది. కిసాన్ రైల్‌తో చిన్నకారు రైతులకు మేలు జరుగుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాం. 25 ఏళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. లద్దాఖ్ అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆన్లైన్ ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్నాం. డిజిటల్ విప్లవంతో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అవసరం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోంది. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల లోపు భూమి కలిగినవారే. చిన్న, సన్నకారు రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలి. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలి. దేశంలో కొత్త సంపద సృష్టికర్తల తరం ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలతో నవీన పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారని’’ ప్రధాని మోదీ అన్నారు. -
ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో 8వసారి ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు. సైనిక దళాల నుంచి గౌరవ వందనం ప్రధాని స్వీకరించారు. వైమానికదళ హెలికాఫ్టర్లు పూలవర్షం కురిపించాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోది జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. Delhi | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 75th Independence Day (Photo source: DD News) pic.twitter.com/n9sybFSV1f — ANI (@ANI) August 15, 2021 Delhi | Defence Minister Rajnath Singh, MoS Defence Ajay Bhatt and Defence Secretary Dr Ajay Kumar receive Prime Minister Narendra Modi at Red Fort pic.twitter.com/QvqinS7kmf — ANI (@ANI) August 15, 2021 Delhi | Prime Minister Narendra Modi inspects the guard of honour at Red Fort pic.twitter.com/Y2tMYsFQ62 — ANI (@ANI) August 15, 2021 Prime Minister Narendra Modi hoists the National Flag from the ramparts of Red Fort to celebrate the 75th Independence Day pic.twitter.com/0c3tZ6HQ3X — ANI (@ANI) August 15, 2021 -
శత్రు దుర్భేద్యంగా ఢిల్లీ
న్యూఢిల్లీ: డెభ్బై ఐదవ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ అంతటా అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో నిఘాను పెంచారు. ఎనిమిది నెలలుగా సాగు చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనూ గస్తీని ఎక్కువచేశారు. వేడుకలకు ప్రధానవేదిక అయిన, ప్రధాని మోదీ ప్రసంగించనున్న ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినల్స్ వద్ద పోలీసుల సంఖ్యను పెంచారు. జమ్మూ ఎయిర్‌పోర్టులోని వైమానిక స్థావరంపై ఉగ్ర డ్రోన్ దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ– డ్రోన్ వ్యవస్థతో బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్ర కుట్రలను భగ్నంచేసేందుకు యమునా తీరప్రాంతాలుసహా నగరంలోని ముఖ్యప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను అధికంచేశారు. కొత్తగా అద్దెకొచ్చిన వారిని, సిమ్‌కార్డులు, పాత కార్లు, బైక్‌లు అమ్మే డీలర్లను అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విచారిస్తున్నారు. 16వ తేదీ వరకు హాట్ ఎయిర్బెలూన్లుసహా మరే ఇతర ఎగిరే వస్తువులను ఢిల్లీ గగనతలంపైకి తేవడాన్ని నిషేధించారు. ఆదివారం ఉదయం ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగరేయనున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి వాయుసేనకు చెందిన ఎంఐ–17 1వీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించనున్నాయి. వేడుకల్లో రెండు ఎంఐ హెలికాప్టర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. హెల్త్‌వర్కర్ల వంటి కోవిడ్ వారియర్స్‌ను సత్కరించేందుకు దక్షిణం వైపు ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు. 1.5 కోట్ల మంది జాతీయ గీతం పాడారు.. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1.5 కోట్ల మంది భారతీయులు జాతీయ గీతం ఆలపిస్తూ వీడియోలు చిత్రీకరించి రాష్ట్రగాన్డాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేశారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో పాల్గొనాలని గత నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌కీబాత్ కార్యక్రమంలో కూడా పిలుపునిచ్చారు. దీంతో దేశవిదేశాల్లోని భారతీయులు జనగణమన ఆలపిస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. ఇందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారి వరకు పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
75వ స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట ముస్తాబైనది. రేపు(ఆదివారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ ప్రత్యేక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా హాజరుకానున్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రకోట ముఖ ద్వారం వద్ద.. షిప్పింగ్ కంటైనర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. 350 కెమెరాలతో పాటు రెండు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ సరిహద్దుల వెంబడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. -
ఎర్రకోట శత్రు దుర్భేద్యం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకోటను శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్లతో తాత్కాలిక రక్షణ గోడను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని దాటుకొని లోపలికి అడుగుపెట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. చాందినీ చౌక్ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఎర్రకోటలోకి ప్రవేశించలేని విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. చరిత్రాత్మక ఎర్రకోట వద్ద కంటైనర్లతో తాత్కాలికంగా భారీ గోడను సిద్ధం చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇవి ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు వేస్తున్నారు. గ్రాఫిటీ కళతో కనులకు ఇంపుగా తీర్చిదిద్దుతున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన డిమాండ్‌తో రైతులు నెలల తరబడి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలను వేదికగా మార్చుకొనే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినం సందర్భంగా ఎర్రకోట వద్ద రైతులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు అక్కడే మతపరమైన జెండా ఎగురవేయడం సంచలనం సృష్టించింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, ఎయిర్ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ గత నెలలో అప్పటి ఢిల్లీ కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 16వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రకోట వెనుక భాగంలోని విజయ్‌ఘాట్ వద్ద అనుమానాస్పదంగా ఎగురుతున్న ఓ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
Travel: వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట
రెడ్‌ఫోర్ట్... అనగానే స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించే ఢిల్లీలో ఉన్న ఎర్రకోట గుర్తుకు వస్తుంది. మన మెదడు అలా ట్యూన్ అయిపోయింది. కానీ ఆ ఎర్రకోట కట్టడానికి వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట ఆగ్రాలో ఉంది. మొఘల్ పాలకుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. యమునాతటి ఆగ్రా లాల్ఖిలాలోకి పర్యాటకులను అమర్‌సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో కట్టిన కోట ఇది. తాజ్‌మహల్, లాల్‌ఖిలా రెండూ యమునానది తీరాన ఉన్నాయి. ఈ కోటలోని అనేక ప్యాలెస్‌ల నుంచి తాజ్‌మహల్ కనిపిస్తుంది. తాజ్‌మహల్ దగ్గర యమునానది కొద్దిపాటి వంపు తిరుగుతుంది. ఆ వంపుకు అనుగుణంగానే ఈ కోట నిర్మాణం జరిగింది. షాజహాన్ నుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టడం, తాజ్‌మహల్ కనిపించేటట్లు ఖైదు చేయమన్న షాజహాన్ కోరిక కళ్లకు కడతాయి. షాజహాన్ పట్ల జాలిపడిన క్షణాలు గుర్తుకు వస్తాయి. అయితే షాజహాన్ అంత్యకాలంలో నివసించిన, మనం చెరసాల అని చెప్పుకున్న షా బుర్జ్‌ను చూస్తే... చిన్నప్పుడు అనవసరంగా జాలిపడ్డామేమో అనిపించకమానదు. షాజహాన్ జైలు జీవితం కోటలోని అందమైన ప్యాలెస్‌లోనే గడిచింది. గోడకు చెక్కిన తీగలు ఆగ్రాఫోర్ట్‌లో అందమైన కట్టడాలు, రాజ ప్రాసాదాలు లెక్కకు మించి ఉన్నాయి. పాలకులు సామాన్య ప్రజలకు దర్శనమిచ్చే దివానీ ఆమ్, మంత్రి వర్గ సమావేశాల హాలు దివానీ ఖాస్, రతన్‌సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్‌మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్‌టబ్ ప్రత్యేకం గా చూడాల్సినవి. తాజ్‌మహల్‌లో ఉన్నట్లే పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది. అలాగే పాలరాతి గోడల్లో చెక్కిన డిజైన్లలో అష్టభుజి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా... బ్లాక్ ప్రింటింగ్‌లో ఉండే ఒకదానితో ఒకటి అల్లుకున్నట్లుండే సన్నని లతలు తీగల డిజైన్లు గోడల మీద, పై కప్పు మీద కనిపిస్తాయి. ఇక్కడ ఒక పాలరాతి బల్లను చూపించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఈ కోటకు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నారని చెబుతారు గైడ్లు. అప్పటి వరకు కూర్చోవాలనే ఆలోచన లేని వాళ్లకు కూడా అప్పుడు కూర్చోవాలనిపిస్తుంది. ఆ బల్ల నుంచి ఫోర్ట్ వ్యూ బాగుంటుంది. కోట నుంచి తాజ్ ఆగ్రా ఎర్రకోటలో కనిపించే పాలరాతి నిర్మాణాల్లో ఎక్కువ భాగం షాజహాన్ కట్టించినవే. అప్పటి వరకు ఈ కోట ఎన్ని చేతులు మారినా ఎవరూ ముందున్న నిర్మాణాలను ధ్వంసం చేయలేదు. కానీ షాజహాన్ మాత్రం తాననుకున్న నిర్మాణాల కోసం పాత వాటిని కూల్చేశాడు. ఈ కోటలోపల ఉన్న ఆయుధాగారాన్ని అక్బర్ విజయాగారం అనవచ్చు. ఆగ్రా టూర్ అంటే ప్రధానంగా తాజ్‌మహల్ కోసమే అయి ఉంటుంది. ఆగ్రా కోసం కేటాయించుకున్న టైమ్‌లో తాజ్ మహల్ ను చూసేసి వెనక్కి రావడమే కాకుండా మరో రెండు–మూడు గంటలు కేటాయించుకోగలిగితే ఈ కోటను కూడా కవర్ చేయవచ్చు. తాజ్‌మహల్‌ను మరో కోణంలోనూ వీక్షించవచ్చు. లాల్‌ఖిలా ప్రధానద్వారం తాజ్‌మహల్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ రెడ్‌ఫోర్ట్ 16వ శతాబ్దం తొలిరోజుల్లోనే ఉంది. బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోదీని ఓడించి రెడ్‌ఫోర్ట్‌లో అడుగుపెట్టాడు. హుమయూన్ కిరీటధారణ ఇక్కడే జరిగింది. పదేళ్ల తర్వాత హుమయూన్ ఈ కోటను షేర్షా సూరికి వదులుకున్నాడు. మరో పదిహేనేళ్లకు తిరిగి స్వాధీనం చేసుకుని మరో ఏడాదికే మళ్లీ చేజార్చుకున్నాడు. అక్బర్ దాదాపుగా తన హయాం మొత్తం ఈ కోట నుంచే పరిపాలన చేశాడు. కోటకు మరమ్మతులు కూడా చేశాడు. జహంగీర్ పాలన కూడా ఇక్కడి నుంచే సాగింది. షాజహాన్ ఢిల్లీలో పెద్ద ఎర్రకోటను కట్టి రాజధానిని ఢిల్లీకి మార్చేవరకు అన్ని రికార్డుల్లోనూ లాల్‌ఖిలా అంటే ఆగ్రాలోని ఎర్ర కోట మాత్రమే. ఈ కోట మధ్యలో జాట్లు, చౌహాన్‌ల అధీనంలోకి కూడా వెళ్లింది. చివరగా మరాఠాల నుంచి 19వ శతాబ్దంలో బ్రిటిష్ వశమైంది. – వాకా మంజులారెడ్డి చదవండి: నాగార్జునసాగర్‌లో మొదలైన లాంచీ ప్రయాణం -
‘ఎర్రకోట’ ఎక్కిన యువకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకం కావడం.. రైతుల మాటున గుర్తు తెలియని శక్తులు దూరి ఎర్రకోటను అధిరోహించి.. బీభత్సం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తి అరెస్టయ్యాడు. ఎర్రకోట శిఖరంపై కూర్చున్న వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం కిందట ఒకరిని అదుపులోకి తీసుకోగా అతడి ద్వారా ప్రస్తుత యువకుడి ఆచూకీ లభించింది. ఎర్రకోట ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు విచారణ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో వారం కిందట మహీంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఎర్రకోట ఘటనలో పాల్గొన్న జస్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. దీంతో 29 ఏళ్ల జస్‌ప్రీత్‌సింగ్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సన్నీ అలియాస్ జస్‌ప్రీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా మహీంద్రసింగ్, జస్ప్రీత్ సింగ్ ఇద్దరూ ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ కార్ల ఏసీ మెకానిక్‌లు. జస్ప్రీత్ సింగ్ ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపైకి ఎక్కి ఒక రాడ్‌తో పలు సంజ్ఞలు చేశారని పోలీసులు వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ ఫుటేజీ ద్వారా దాదాపు 200 మంది అనుమానితుల ఫొటోలు విడుదల చేశారు. వారిలో జస్‌ప్రీత్‌సింగ్ ఒకరు. మొత్తం 160 మంది ఈ హింసకు సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారు. జస్‌ప్రీత్‌సింగ్‌ను విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. -
దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే రూ. లక్ష
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 రోజులపాటు ప్రశాంతంగా సాగిన అన్నదాతల నిరసన.. గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. అప్పటి వరకు రైతులకు మద్దతుగా నిలిచిన వారు వెనకంజ వేశారు. రైతు సంఘాల మధ్య కూడా చీలకలు వచ్చాయి. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో తలెత్తిన విధ్వంసానికి నటుడు, సింగర్ దీప్ సిద్ధునే ప్రధాన కారకుడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా) ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధుపై బుధవారం నాడు లక్ష రూపాయాల రివార్డును ప్రకటించారు. రైతు గణతంత్ర పరేడ్ నాడు దీప్ సిద్ధు ఎర్రకోటపై జెండా ఎగురవేయడమే కాక ఫేస్బుక్ లైవ్‌లో జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఉద్రిక్తతలు చేలరేగాయి. ఇక నాటి నుంచి ఆయన కన్పించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీప్ సిద్ధుతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు రివార్డు ప్రకటించారు. దీప్ సిద్ధు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. -
అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు. నోటీసులకు భయపడం ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్‌లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి. పోలీసులకు అమిత్ షా పరామర్శ జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. ఆ నాయకులు తమ పాస్‌పోర్ట్‌లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్‌స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్‌లు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు. -
‘బీజేపీ ప్లాన్ ప్రకారమే దారి మళ్లించింది’
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది. ‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్‌లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. (చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం) ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్ సిధు. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కి, దీప్ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. -
ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్ చీఫ్
‘ట్రాక్టర్ పరేడ్‌ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు. ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్ ఢిల్లీ డీసీపీ సందీప్ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
రణరంగమైన ఢిల్లీ.. ఎర్రకోట ముట్టడి
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని రణరంగంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం ఒక్కసారిగా రాజధానిలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట ప్రాకారాలపైకి ఎక్కిన వందలాది రైతులు కోట లోపలికి దూసుకెళ్లారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు. అనుమతించిన సమయానికన్నా రెండు గంటల ముందే ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన రైతులు అనూహ్యంగా ఢిల్లీలోకి చొచ్చుకురావడం ప్రారంభించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసివేస్తూ.. ‘రంగ్ దే బసంతి’, జై జవాన్ జై కిసాన్’అని నినదిస్తూ రాజధాని వీధుల్లో ట్రాక్టర్లు, బైక్‌లు, గుర్రాలపై కవాతు ప్రారంభించారు. పలు చోట్ల స్థానికులు వారిపై పూలు చల్లుతూ స్వాగతం పలకడం కనిపించింది. వాహనాలపై నిల్చుని పలువురు రైతులు ‘ఐసా దేశ్ హై మేరా’, ‘సారే జహా సే అచ్చా’తదితర దేశభక్తి పాటలకు నృత్యాలు చేశారు. అయితే, ఆ కాసేపటికే పరిస్థితి విషమించింది. వెనక్కు వెళ్లాలని, అనుమతించిన మార్గంలోనే పరేడ్ నిర్వహించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దాంతో, రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే క్రమంలో పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను చెదరగొట్టేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ముఖ్యంగా ఐటీఓ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ బారికేడ్లను ధ్వంసం చేస్తూ పోలీసులపైకి పలువురు రైతులు రాళ్లు, కర్రలతో దూసుకెళ్లారు. అక్కడే నిలిచి ఉన్న ఒక కారును, బస్సును ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఐటీఓ నుంచి వెనక్కు తరమడంతో ట్రాక్టర్లతో రైతులు పెద్ద ఎత్తున ఎర్ర కోటవైపు కదిలారు. ఎర్ర కోటలో సంప్రదాయంగా జెండా వందనం చేసే చోట మత జెండాను, రైతు సంఘాల జెండాను ఎగరేశారు. చింతామణి చౌక్ వద్ద ఆందోళనకారులు బారికేడ్లను, అక్కడ నిలిచి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్షరధామ్ ఆలయ సమీపంలో నిహంగ్(సంప్రదాయ పంజాబీ యోధులు)లు కత్తులతో పోలీసులపైకి దూసుకెళ్లారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చోటు చేసుకున్న విధ్వంసంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. తక్షణమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధానిలో అదనంగా పారా మిలటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ నిలిపేశారు. ఈ విధ్వంసంపై రైతు సంఘాల నేతలు స్పందించారు. తమ ఆందోళనలోకి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడ్డాయని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ప్రకటించింది. ఉదయమే మొదలైన బారికేడ్ల తొలగింపు సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి రైతులు మంగళవారం ఉదయం నిర్దేశించిన సమయం కన్నా ముందే ఢిల్లీలోకి చొచ్చుకెళ్లడం ప్రారంభించారు. రైతులు తమకు నిర్దేశించిన మార్గాన్ని కాకుండా ఎర్రకోట వైపు బయలుదేరారు. సింఘు సరిహద్దు నుంచి వస్తున్న ఆందోళనకారులను ముబారకా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇరుపక్షాల మధ్య గొడవ తరువాత పోలీసులు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఘాజీపూర్ సరిహద్దు నుంచి బయలుదేరిన రైతులను పాండవ్‌నగర్ సమీపంలోని నోయిడా టర్నింగ్ వద్ద పెద్ద ఎత్తున బ్యారికేడ్లు వేసి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ బ్యారికేడ్లపైకి ఎక్కిన నిహాంగ్‌లు కత్తులతో పోలీసులపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. నోయిడా టర్నింగ్ వద్ద ఆందోళనకారులను ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు కూడా పోలీసులపై రాళ్లు విసిరి, అడ్డుగా ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఏకంగా, పాండవ్ నగర్ పోలీసు పికెట్‌పైకి ట్రాక్టర్లను ఎక్కించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ఆ తర్వాత వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించి అక్కడినుంచి ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే ఎర్రకోటపై త్రివర్ణ పతాకం కాకుండా ఇతర జెండాలను ఎగురవేయడం సరికాదని పోలీసులు వారించినప్పటికీ వినకుండా, సిఖ్ మత జెండాను ఎగురవేశారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీదే తప్పు మరోవైపు ట్రాక్టర్ ర్యాలీలో చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ కోసం పోలీసులు నిర్దేశించిన మార్గాన్నే కవాతులో పాల్గొన్న 32 రైతు సంస్థలు అనుసరించాయని తెలిపారు. ఎర్రకోటలో జరిగిన ఘటనలకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కారణమని పంజాబ్‌కు చెందిన కిసాన్ బచావ్ మోర్చా నాయకుడు కృపా సింగ్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పుణెవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు, పంజాబ్‌లోని అమృత్సర్ దగ్గర్లోని వల్లాన్ గ్రామంలో ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. అన్నదాతల ముసుగులో తీవ్రవాదులు ఢిల్లీలో విధ్వంసంపై బీజేపీ స్పందించింది. ఇన్నాళ్లూ అన్నదాతల ముసుగులో ఉన్నవారంతా తీవ్రవాదులని తేలిందని వ్యాఖ్యానించింది. ‘అన్నదాతల పరువు తీయొద్దు. తీవ్ర వాదులను తీవ్రవాదులనే పిలవాలి’అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై సిగ్గుపడుతున్నానని, దీనికి బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు, రైతు నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘నేడు జరిగిన ఘటనలకు సిగ్గుపడుతున్నా. వీటికి బాధ్యత తీసుకుంటున్నా’ అన్నారు. ‘రైతు ఉద్యమానికి కొందరిని దూరం పెట్టాం, వారే ఈ దుశ్చర్యలకు బాధ్యులని తెలుస్తోంది’ అని వివరించారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసాన్ని వామపక్షాలు ఖండించాయి. పరిస్థితి రావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించాయి. ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి ఐటీఓ మీదుగా రైతుల బృందం ఇండియా గేట్ వైపు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచి్చంది. ఆందోళనకారుల్లో కొం దరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో, అక్కడే ఒక ట్రాక్టర్ బోల్తాపడి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక రైతు మృతి చెందాడు. అది ‘నిషాన్ సాహిబ్’ ఎర్ర కోటపై రైతు ఆందోళన కారులు ఎగరేసిన కాషాయ జెండా సాధారణంగా అన్ని గురుద్వారాల్లో కనిపించే ‘నిషాన్ సాహిబ్’అనే మత పతాకం. త్రికోణాకారంలో ఉండే ఈ జెండాను అత్యంత పవిత్రమైనదిగా సిక్కులు భావిస్తారు. దీనిపై రెండు వైపులా పదునున్న ఖడ్గం(ఖండా), చక్రం, రెండు కృపాణాలు ముద్రించి ఉంటాయి. ఎర్రకోటపై ఒక రైతు సంఘానికి చెందిన మరో జెండాను కూడా ఎగరేశారు. 86 మంది పోలీసులకు గాయాలు రైతులతో ఘర్షణల్లో 86 మంది పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసు విభాగం ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు పూర్తి సంయమనంతో వ్యవహరించారని పేర్కొంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద గాయపడినవారిలో శిక్షణలో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఉన్నారు. అక్కడే అదనపు డీసీపీ మంజీత్‌ను ట్రాక్టర్‌తో ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా, ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసుల్లో దాదాపు సగంమంది రైతుల దాడిలో గాయపడ్డారు. రైతులు నెట్టివేయడంతో వారిలో పలువురు ఎత్తైన గోడపై నుంచి కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘర్షణలకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ర్యాలీలో ఎప్పుడేం జరిగిందంటే... ఉదయం ► 7.009.30: బారికేడ్లను అడ్డుతొలగించుకుంటూ సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి వేల సంఖ్యలో ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, కార్లతో ఢిల్లీలోకి రైతుల ప్రవేశం ► 10.00: సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ వద్ద పోలీసులతో గొడవపడిన రైతులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు ► 10.30: అక్షరధామ్ ఇంటర్సెక్షన్ వద్ద పోలీసులు, రైతులగొడవ. రోడ్లపై ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన రైతులు ► 11.00: టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేసిన పోలీసులు, కత్తులతో దాడులు చేసేందుకు రైతుల ప్రయత్నం. సరై కాలే ఖాన్ వైపు రైతుల కదలిక మధ్యాహ్నం ► 12.00: ముకర్బా చౌక్ వద్ద పోలీసులతో రైతుల ఘర్షణ. ఐటీఓ సెక్షన్ చేరుకొని వాహనాలను, బస్సులను ధ్వంసం చేసిన రైతులు. పోలీసులపై దాడులు. పోలీసుల ప్రతిఘటన. ట్రాక్టర్లు బైకులతో పోలీసులను వెంబడించిన రైతులు. అడ్డుగా ఉన్న డీటీసీ బస్సులను ధ్వంసం చేస్తూ ఎర్రకోట వైపు పయనం. ఎర్రకోటపై రైతుసంఘాల జెండా, సిక్కు మత జెండాను ఎగరేశారు. ► 1.00: ట్రాక్టర్ తిరగబడి నవనీత్ సింగ్ అనే రైతు మృతి. అతన్ని కాల్చేశారని రైతుల ఆరోపణ. ప్రతియేటా ప్రధాని దేశ జెండాను ఎగురవేసే చోటు నుంచి సిక్కు జెండాను తీసేసేందుకు సైనికుల ప్రయత్నం. ► 2.30: ఐటీఓ ఇంటర్సెక్షన్, ఎర్రకోట వద్ద పోలీసులతో కొనసాగిన రైతుల ఘర్షణలు, రాళ్లదాడి. ► 3:00 తర్వాత: ఎర్రకోట నుంచి రైతులను పంపించివేసిన పోలీసులు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్ ► అర్ధరాత్రి వరకూ సింఘు, ఘాజీపూర్, టిక్రి, ముకర్బా చౌక్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత -
విషాదకరం...దురదృష్టకరం
మువ్వన్నెల జెండా రెపరెపలాడాల్సిన గణతంత్ర దినోత్సవంనాడు దేశ రాజధాని నగరం చవి చూసిన హింస కనీవినీ ఎరుగనిది, దురదృష్టకరమైనది. సాగు సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ గత రెండు నెల లుగా ఢిల్లీ నగరం వెలుపల బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులు కూడా వాంఛించని పరిణామం ఇది. ‘జై జవాన్... జై కిసాన్’ అన్న నినాదాలు ప్రతిధ్వనించాల్సిన రోజున జవాన్లు, కిసాన్ల మధ్య ఘర్ష ణలు చోటుచేసుకోవటం ఎంతో విషాదకరం. ఒకచోట ఆందోళనకారులు పోలీసులను లోతైన గొయ్యిలోకి నిర్దాక్షిణ్యంగా నెట్టడం, మరోచోట వారిపైకి ట్రాక్టర్లను శరవేగంతో పోనిచ్చి భయ భ్రాంతులకు గురిచేయటం లాంటి దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ర్యాలీలోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఖలీస్తానీ శక్తులు చొరబడే ప్రమాదం వున్నదని నాలుగురోజులక్రితం పోలీసులు తెలిపారు. కానీ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకుంటామన్న హామీపై షరతులతో అనుమతించారు. వాటి ప్రకారం పెరేడ్ ముగిశాకగానీ ర్యాలీ ఢిల్లీలో ప్రవేశించకూడదు. అంటే ఢిల్లీ వెలుపల ఏడు ప్రాంతాల్లో బైఠాయించిన ఉద్యమకారులు ఉదయం 11 గంటలకు మాత్రమే తమ తమ స్థానాల నుంచి బయ ల్దేరాలి. కానీ అందుకు భిన్నంగా 8 గంటల ప్రాంతంలోనే ర్యాలీలు ఎలా మొదలైనాయో, పోలీసులు ఎక్కడికక్కడ ఎందుకు నిలువరించలేకపోయారో అనూహ్యం. ముందనుకున్న విధంగా జరిగివుంటే అంతా ప్రశాంతంగా ముగిసిపోయేది. కానీ అది కాస్తా అదుపు తప్పి పోలీసులకూ, ఉద్యమకారులకూ మధ్య ఘర్షణలుగా పరిణమించింది. దాదాపు డజను చోట్ల నిర్దేశించిన మార్గాన్ని కాదని ఉద్యమకారుల్లో కొందరు బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు అంటుండగా... అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారని రైతుల ఆరోపణ. నిజానిజాల మాటెలావున్నా ఆందోళనకారులను నిలువరించటం పోలీసు బలగాలకు సాధ్యం కాలేదు. అనేకచోట్ల లాఠీచార్జిలు జరిగాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సివచ్చింది. వీటన్నిటినీ దాటుకుని ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశించి బురుజులెక్కి రైతు ఉద్యమ పతాకనూ, ఖల్సా జెండాను ఎగరేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వేగంగా ట్రాక్టర్ నడిపి బారికేడ్లను ఢీకొట్టి, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఒక యువకుడు మరణించగా, రాళ్లు రువ్విన ఘటనలు, ఇతరత్రా దౌర్జన్యాల్లో 86మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు సంయమనం పాటించకపోయివుంటే మరెన్ని దుర దృష్టకర ఘటనలు చోటుచేసుకుని వుండేవో ఊహించలేం. ముందు పోలీసులే రెచ్చగొట్టే చర్యలకు దిగారని కొందరు ఆందోళనకారులు చేస్తున్న వాదన సమంజసం కాదు. అదే నిజమైతే, తమలో ఎవరూ రెచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత ర్యాలీకి నాయకత్వంవహిస్తున్నవారిదే. కొన్ని రోజుల క్రితం ఉద్యమ నేతలు కూర్చున్న ప్రాంతంలోకి చొరబడి ఒక వ్యక్తి ఖలిస్తాన్ అనుకూల నినాదా లిచ్చినప్పుడు వారిలో కొందరు వెంటనే అతన్ని గుర్తించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కూడా అదే మాదిరి అప్రమత్తత పాటిస్తూ అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువుంది. హింసకు పాల్పడిన బృందాలకు నాయకత్వంవహించిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కెఎంఎస్‌సీ) నేతలు తమ కమిటీలో ఎప్పుడూలేరని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న 40కి పైగా రైతు ఉద్యమ సంస్థలకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నాయకులు అంటున్నారు. ఇలాంటివి జరిగే అవకాశమున్నదని అంచనా వేసుకుని ఎస్కేఎం నేతలు తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో వారు విఫలమయ్యారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుని, గణతంత్ర వ్యవస్థగా ప్రకటించుకున్నరోజైన జనవరి 26 జాతి యావత్తుకూ అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. దీన్ని పురస్కరించుకుని ఏటా అత్యంత ఘనంగా త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, విన్యాసాలు వుంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యత చాటేలా శకటాలను ప్రదర్శిస్తారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావలసివున్నా స్వదేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఆయన విరమించుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా యధావిధిగా వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవవందనం స్వీకరించారు. ప్రధాని మొదలుకొని మంత్రులు, అధికారులు, వివిధ పార్టీల నేతలుసహా 25,000మంది జనం ఈ పెరేడ్‌ను తిలకించారు. కానీ పెరేడ్ అనంతరం జరిగిన ఘటనలు ఈ వేడుకలను మసకబార్చాయి. సాధారణ దినాల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే ఎర్రకోట ప్రాంతానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల సందర్భాల్లో మరింత భద్రత వుంటుంది. అయినా కూడా ఇవి చోటుచేసుకోవటం నిఘా విభాగాల వైఫల్యమే. ఇంతవరకూ ఏ ఉద్యమమూ హింస, దౌర్జన్యాలతో విజయం సాధించిన ఉదంతాలు మన దేశంలో లేవు. స్వాతం త్రోద్యమం మొదలుకొని ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. గత నాలుగైదు నెలలుగా కేంద్రం తీసు కొచ్చిన సాగు బిల్లులపై గానీ, ఆ తర్వాత వాటిని చట్టాలుగా మార్చటంపైగానీ రైతులోకం ఆందోళన చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల రైతులు ఈ చట్టాలు రద్దు చేయాల్సిందేనని గత రెండు నెలలుగా ఢిల్లీ వెలుపల బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. అదెంతో క్రమశిక్షణతో, సంయమనంతో సాగటం అన్ని వర్గాల ప్రశంసలూ పొందుతోంది. కానీ గణ తంత్ర దినోత్సవంనాడు చోటుచేసుకున్న ఘటనలు ఆ ఉద్యమం ఇన్నాళ్లూ సాధించుకున్న ప్రతి ష్టనూ, విశ్వసనీయతనూ దెబ్బతీశాయి. దీనిపై ఉద్యమ నేతలు సమీక్షించుకోవాలి. ప్రభుత్వం సైతం అవసరమైతే మరొక మెట్టు దిగైనా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. -
అట్టుడుకుతున్న ఢిల్లీ.. అమిత్ షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే సమీక్షించేందుకు ఆ శాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. హోంశాఖ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చర్చించనున్నారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేయడంపై కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బారికేడ్లు, బస్సులు, కంటైనర్లను తోసుకుంటూ ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. హింసాత్మక చర్యలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను సైతం నిలుపుదల చేశారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా ) -
రణరంగంగా రాజధాని.. ఒకరు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం రణరంగంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వేలాదిగా ట్రాక్టర్లు దేశ రాజధాని వైపు తరలి రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసింది. తాజాగా మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 72వ గణతంత్ర దినోత్సవంరోజు (జనవరి 26, మంగళవారం) రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించడం మరింత ఆందోళనకు దారి తీసింది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు మృతి చెందారని రైతు ఉద్యమకారులు తెలిపారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్పూర్కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరోవైపు బారికేడ్లు, లాఠీచార్జ్, బాష్పవాయులను దాటుకొని రైతు ఆందోళనకారులు కొంతమంది ఎర్రకోట వైపు దూసుకొచ్చి రైతు జెండాను ఎగరవేశారు. దీంతో మరోసారి పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చెరేగింది. అయితే ఎర్రకోటలోజెండా ఎగురవేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ
-
కనీస వివాహ వయస్సు: త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనంతో పాటు.. కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహిళా సాధికారికతకై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. మహిళల ఆరోగ్యం, అభ్యున్నతికై పాటుపడుతున్నట్లు తెలిపారు. ‘‘దాదాపు 5 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేద మహిళలకు 5 కోట్లకు పైగా శానిటరీ ప్యాడ్లను కేవలం ఒక రూపాయికే అందించాం. మహిళా సాధికారికతకు పెద్దపీట వేశాం. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలు తీసుకువచ్చాం. నావికా దళం, వాయుసేనలో సముచిత స్థానం కల్పించాం. అదే విధంగా మన కూతుళ్ల కనీస వివాహ వయస్సు నిర్ధారణ గురించి అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాం. ఇందుకు సంబంధించిన నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.(‘భరత మాత’ విముక్తికై పోరాడిన ధీర వనితలు) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోవిడ్ ప్రొటోకాల్‌తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్‌తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
ఎర్రకోటలో మాస్కులతో మార్చ్
సాక్షి, న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో జరగనున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధం అవుతోంది. పంద్రాగస్టు నాడు చేసే సైనిక విన్యాసాలు, పరేడ్ కోసం అక్కడ త్రివిధ దళాలకు శిక్షణ జరుగుతోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ వేడుకలను ఎలా నిర్వహిస్తారన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ అయింది. ఇందులో ఎర్రకోటలో సైనిక దళాలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఫుల్ డ్రస్‌లో మార్చ్ చేస్తున్నారు. ఢిల్లీలో వర్షం పడుతున్నప్పటికీ ఈ రిహార్సల్స్ జరుగుతుండటం విశేషం. (ఆగస్టు 15కు ఖైదీల విడుదల లేనట్లే! ) మిగతా రాష్ట్రాల్లోని స్టేడియాల్లోనూ ఇలాంటి ఘటనలే సాక్షాత్కరిస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని మినీ స్టేడియం పరేడ్ గ్రౌండ్లోనూ సాయుధ దళాలు మాస్కులు ధరించి ఫుల్ డ్రెస్‌లో రిహార్సల్స్ చేస్తున్నారు. అన్ని చోట్లా కరోనా సోకకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఆగస్టు 15న ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించించి త్రివర్ణ రంగులున్న బెలూన్లను గాల్లోకి వదిలేస్తారు. ఆ వెంటనే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) #WATCH Full dress rehearsal at Red Fort today for 74th Independence Day celebrations pic.twitter.com/dNEXobRsue — ANI (@ANI) August 13, 2020 -
తాజ్ మహల్ మూసివేత
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. భారత్‌లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 130కి చేరింది. మూడు మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్న ఉద్ధేశంతో మార్చి 31 వరకు దేశంలోని పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామ శాలలు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం నుంచి తాజ్ మహల్ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది. (ఆఫీసుకు తాళం వేసిన పూరీ, ఛార్మి) ఈ మేరకు ‘కరోనా వ్యాప్తి దృష్ట్యా టిక్కెట్లు ద్వారా ప్రవేశించే అన్ని చారిత్రక కట్టడాలు, అన్ని స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను, ఎర్రకోట, తాజ్ మహాల్ మార్చి 31 వరకు మూసివేస్తున్నాం. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రకటించారు. వీటితోపాటు దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మహారాష్ట్రలోని షిరిడి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తాజ్ మహల్ మూతపడటం ఇది మూడోసారి. మొదటి సారి 971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో.. అలాగే 1978లో వరదల నేపథ్యంలో రెండో సారి కొన్ని రోజుల పాటు సందర్శనను నిలిపి వేశారు. (కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు) పాకిస్తాన్లో తొలి కరోనా మరణం కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్ -
పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
మోదీ మరో నినాదం : ఈజ్ ఆఫ్ లివింగ్
సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్ధేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. సులభతర వాణిజ్యమే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కాకుండా సులభతర జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) కూడా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోయేలా హైజంప్ చేయాల్సిన అవసరం నెలకొందని అన్నారు. రోజులు మారుతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం మారాలని పిలుపు ఇచ్చారు. సంపద సృష్టితోనే సమస్యలు దూరమవుతాయని స్పష్టం చేశారు. దేశ మౌలిక రంగంలో కోటి కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. -
ఎర్రకోటలో ప్రత్యేక యోగా కార్యక్రమం
-
గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్
-
గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి పలువురు మహనీయులు అసమాన సేవలు అందించినా వారిని మరుగుపరిచేందుకు గాంధీ, నెహ్రూ కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి పలువురు నేతలు స్వాతంత్రోద్యమంలో విశేష సేవలందించినా గాంధీ, నెహ్రూ కుటుంబానికే పేరుదక్కేలా ప్రయత్నాలు సాగాయని అన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబాస్ ఆజాద్ హింద్ సర్కార్ ప్రకటించిన 75 సంవత్సరాలయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ విలువైన సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. ఎందరో నేతల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వరాజాన్ని సురాజ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు గత నాలుగేళ్లుగా పలు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీని ధరించి పాల్గొనడం గమనార్హం. -
ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌చేశారు. ఎర్రకోట సమీపంలోని జామా మసీదు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్వేజ్(24), జంషీద్(19)లను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ కుష్వాహా తెలిపారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన వీరిద్దరి నుంచి రెండు .32 పిస్టల్స్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తమ రాకపోకలకు ఢిల్లీని కేంద్రంగా మాత్రమే వాడుతున్నారనీ, ఇక్కడ దాడులకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదని కుష్వాహా తెలిపారు. పర్వేజ్ యూపీలోని గజ్రోలా పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతుండగా, జంషిద్ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నాడు. పర్వేజ్ సోదరుడిని భద్రతాబలగాలు ఈ ఏడాది జనవరిలో షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చాయన్నారు. 2016, జూలైలో తన తమ్ముడు, హిజ్బుల్ ఉగ్రవాది ఫిర్దౌస్ను భద్రతాబలగాలు కాల్చిచంపడంతో పర్వేజ్ ఉగ్రబాట పట్టాడని పోలీసులు వెల్లడించారు. జంషిద్ ఆయుధాలను యూపీ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన మోదీ
-
సెప్టెంబర్ 25న ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికి ఇళ్లు, విద్యుత్, నీరు, వైద్యం, పారిశుద్ధ్యం తదితర వసతులు అందించే లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిలో విదేశాలను అధిగమించగల సానుకూల మార్పు కోసం అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని చరిత్రాత్మక ఎర్రకోట వద్ద జెండా వందనం చేసి, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మోదీ కాషాయ రంగు తలాపాగా ధరించి రావడం విశేషం. ప్రస్తుత ఎన్డీయే హయాంలో ఇదే ఆయనకు చివరి పంద్రాగస్టు ప్రసంగం కానుంది. తన ప్రసంగంలో.. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూనే.. మరోవైపు, ఎన్నికల ప్రసంగం తరహాలో విపక్షాలపై విమర్శనాస్త్రాలను కూడా మోదీ ఎక్కుపెట్టారు. పండిట్ దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే, గగనయాన్ పథకంలో భాగంగా 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపిస్తున్నామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన విధానాన్ని త్వరలో ఆవిష్కరించనున్నామని తెలిపారు. అత్యాచార కేసుల్లో విధించిన శిక్షలను బాగా ప్రచారం చేయాలని, తద్వారా అలాంటి దుష్ట ఆలోచనలున్నవారిలో భయాందోళనలు కలిగించవచ్చని ప్రధాని సూచించారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి చూపిన ‘ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్’ మార్గాన్ని అనుసరిస్తామని అన్నారు. ఇకపై మహిళలను కూడా త్రివిధ దళాల్లో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ప్రకటించారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే చట్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షాలే దానికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. దళితుల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, త్రివిధ దళాల అధిపతులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అభివృద్ధిపై.. అభివృద్ధిలో మనకన్నా ముందున్న దేశాలను భారత్ అధిగమిస్తే చూడాలనే ఆత్రుతతో ఉన్నా. చిన్నారుల్లో పోషకాహార లోపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వ ట్లేదు. పౌరులకు నాణ్యమైన, సౌఖ్యవంతమైన జీవితం, ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు తహతహలాడుతున్నా. నాలుగో తరం పారిశ్రామిక విప్లవాన్ని భారతే ముందుండి నడపాలని కోరుకుంటున్నా. ఆయుష్మాన్ భారత్‌పై.. 50 కోట్ల మంది భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజైన సెప్టెం బర్ 25న ప్రారంభిస్తాం. వ్యక్తి జబ్బున పడితే అతనొక్కడే కాదు కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ పథకంతో కొత్త ఆసుపత్రులు వస్తాయి. భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. అత్యాచారాలపై..: దేశం ఇలాంటి నీచ మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. సమన్యాయ పాలనే మనందరికీ శిరోధార్యం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అత్యాచార బాధితురాలి కన్నా సమాజమే లక్షల రెట్లు ఎక్కువ బాధపడాలి. ఉరిశిక్ష విధించిన రేప్ కేసులపై ప్రచారం చేస్తే అత్యాచారం చేయాలనుకునే ఆలోచన రాదు. రైతుల ఆదాయంపై..: సాగు ఎగుమతుల కొత్త విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం సాగుతోంది. పంటల కనీస మద్దతు ధరను సాగు వ్యయానికి 1.5 రెట్లు పెంచడం కీలక నిర్ణయం. రికార్డుస్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. మన ధాన్యాగారాలు నిండిపోయాయి. ► నకిలీ లబ్ధిదారులు, మధ్యవర్తులను తొలగించి, పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెంచడం ద్వారా నాలుగేళ్లలో 90 వేల కోట్లను ఆదాచేశాం. ► ఈ నాలుగేళ్లలో మేము ఢిల్లీని ఈశాన్య రాష్ట్రాలకు చేరువచేశాం. ప్రపంచదేశాల దృష్టిలో.. ‘‘అంతర్జాతీయ సమాజంలో నేడు భారత్ గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ఒకప్పుడు అనుమానంతో చూసిన వారే ఇప్పుడు మనవైపు ఆశతో చూస్తున్నారు. మనదేశంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత పాస్‌పోర్ట్ విలువ పెరగడం దేశ పౌరుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసింది. గతంలో ‘రెడ్‌టేప్’ గురించి మాట్లాడిన అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ‘రెడ్ కార్పెట్’ గురించి చర్చిస్తోంది. ఒకప్పుడు బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఆకర్షించే స్థాయికెళ్లింది. నిద్రాణ స్థితిలో ఉన్న ఏనుగు లాంటి మన ఆర్థిక వ్యవస్థ మేల్కొని పరుగులు పెడుతోంది. వచ్చే మూడు దశాబ్దాలపాటు ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి భారతే ఇంజిన్ కానుంది’’ అని మోదీ అన్నారు. మోదీ సుదీర్ఘ ప్రసంగం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి సుదీర్ఘంగా ప్రసంగించారు. గతేడాది ఆగస్టు 15 సందర్భంగా 57 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఈసారి 80 నిమిషాలకుపైగా మాట్లాడారు. 2016లో అయితే మోదీ ఏకంగా 96 నిమిషాల పాటు మాట్లాడారు. దీంతో దేశ చరిత్రలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2015 వరకూ ఆ రికార్డు నెహ్రూ (1947లో 72 నిమిషాలు) పేరిటే ఉండేది. పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రసంగం ఏనాడూ 50 నిమిషాలకు దాటలేదు. విద్యార్థుల ఉత్సాహం ఈ వేడుకల సందర్భంగా మోదీతో కరచాలనం చేసేందుకు స్కూలు పిల్లలు ఉత్సాహం చూపారు. ఎర్రకోటలో ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ ప్రజలు అభివాదం చేస్తూ బయలుదేరారు. ఇంతలో జాతీయ జెండా రంగులున్న దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన చిన్నారులను కలుసుకోవడం కోసం తన రక్షణ వలయం నుంచి బయటికొచ్చారు. చిన్నారుల తో కాసేపు ముచ్చటించారు. బాగా చదువుకోవాలని వారికి సూచించారు. సాక్షాత్తూ ప్రధాని దగ్గరకు రావడంతో చిన్నారులు ఆయనతో కరచాలనం కోసం పోటీపడ్డారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మోదీ నోట భారతి మాట ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రముఖ తమి ళ కవి సుబ్రమణ్య భారతి రాసిన మాటల్ని ప్రస్తావించారు. ‘దేశ స్వాతంత్య్రానికి కొన్నేళ్ల ముందు భారతి భారత్ భవిష్యత్ ఎలా ఉం టుందో ఊహించారు. అన్ని రకాల బంధనాల నుంచి మనిషి విముక్తి పొందడం ఎలాగో భారత్ ప్రపంచానికి దారి చూపిస్తుందని ఆయ న చెప్పారు’ అని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆధునిక తమిళ సాహిత్యంలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన సుబ్రమణ్య భారతి 1882లో తమిళనాడులోని ఎట్టయాపురంలో జన్మించారు. ఆయన 1921లో కన్నుమూశారు. చెత్త కుప్పగా ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా అధికారులు దేశ పరువును తీశారు. వేలాది మంది ప్రముఖులతో పాటు విదేశీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజల కోసం అధికారులు డస్ట్బిన్లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆహార పదార్థాలను తిన్న ప్రజలు వాటిని అక్కడే వదిలేసి వెళ్లడంతో ఎర్రకోట ప్రాంగణమంతా చెత్త కుప్పలా తయారైంది. జాతీయ జెండా రంగుల్లోని దుస్తుల్లో ఇక్కడికొచ్చిన స్కూలు విద్యార్థులకు అరటి పళ్లను, మంచినీటిని అందించారు. కానీ చెత్తను పడేసేందుకు చిన్న అట్టపెట్టలను మాత్రమే అందుబాటులో ఉంచారు. అవి త్వరగా నిండిపోవడంతో మరో మార్గంలేక అరటితొక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లను అక్కడే పడేశారు. కాషాయ రంగు తలపాగా ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా మోదీ ఈసారి కాషా య రంగు తలపాగా ధరించారు. ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన 2014లో ఎర్రకోట ప్రసంగం సందర్భంగా మోదీ.. కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జోధ్‌పురి బందేజ్ సఫా తలపాగాను ధరించారు. 2015లో ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, మరుసటి ఏడాది ఎరుపు–గులాబీ– పసుపు వర్ణాలున్న తలపాగాను ఎంచుకున్నారు. గతేడాది తెలుపు, పసుపుపచ్చ, ఎరుపు రంగులున్న తలపాగాను మోదీ ధరించారు. పంద్రాగస్టు వేడుకల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తున్న మోదీ. ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అమిత్ షా, రాహుల్ గాంధీ, నితిన్ గడ్కారీ తదితరులు. ఎర్రకోట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ‘స్వాట్’ మహిళా సిబ్బంది -
అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది
-
ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని
-
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
-
ఎర్రకోటలో ‘దుమ్ము’ దులిపారు..
న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎర్రకోటకు ఉన్న విశిష్టత గురించి అందరికి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ జెండా ఎగరేసేది ఇక్కడి నుంచే. అయితే పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అటువంటి అద్భుత కట్టడాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట మెఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోటని పరిరక్షించటానికి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) నడుం బిగించింది. అందులో భాగంగా ఎర్రకోట పరిధిలో దుమ్మును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కోటకు ముప్పుగా పరిణమించిన 22 లక్షల కేజీల దుమ్ము, ధూళిని ఏఎస్ఐ తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పక్రియను మొదలుపెట్టిన పురావస్తు శాఖ... గత వందేళ్ల నుంచి దాదాపు రెండు మీటర్ల మందంగా విస్తరించిన మట్టి పొరను తొలగించామని ఏఎస్ఐ డైరక్టర్ జనరల్ జె శర్మ తెలిపారు. నేలపై పేరుకుపోయిన దుమ్ము కట్టడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎర్రకోటకు వాస్తవ రూపాన్ని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోట లోపల మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఇక జాతీయ జెండా ఎగిరేది ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను 1830లో అప్పటి బ్రిటీష్ ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’ విలియం బెంటింక్ అమ్మేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. తమ అలవెన్సుల్లో విలియం కోత విధించారన్న కోపంతో అప్పట్లో బెంగాల్ ఆర్మీ ఈ వదంతును సష్టించింది. అది ఎంతగా ప్రచారం జరిగిందంటే భారత జాతీయవాదులు తాజ్ మహల్‌ను అమ్మవద్దంటూ ధర్నా చేశారు. బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ)కూడా ఆ వదంతిని నమ్మింది. ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటను ‘దాల్మియా భారత్ గ్రూప్’నకు కేంద్ర ప్రభుత్వం నిజంగా అమ్మేసిన ఎవరు నమ్మరు. ఐదేళ్లపాటు ఎర్రకోటను పరిరక్షించాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాల్మియా సంస్థకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే. చక్కెర, సిమ్మెంట్, విద్యుత్ వ్యాపారాలను చేసుకొనే దాల్మియా సంస్థకు ఓ అద్భుత చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం ఏమిటీ? దాని పట్ల ఆ సంస్థ ఆసక్తి చూపడం ఏమిటీ? అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి విస్తత ప్రచారం చేయడమే కాకుండా, కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన సంస్థకు చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఎందుకు ఉంటుంది? పోనీ బాబ్రీ విధ్వంసానికి ప్రతిఫలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ కట్టడాన్ని దాల్మియా సంస్థకు అప్పగిస్తుందా? మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్‌ను కూలగొట్టాలంటూ మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ నేతలు అదే షాజహాన్ 1639లో నిర్మించిన ఢిల్లీ కోటను ఎందుకు పరిరక్షించాలనుకుంటున్నారో అర్థం కాదు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు దత్తత పేరిట ఎర్రకోటను దాల్మియా సంస్థకు లీజుకు ఇచ్చింది. ఎర్రకోట ఎంట్రీ టిక్కెట్‌పై వచ్చిన డబ్బులను విధిగా ఎర్రకోట పరిరక్షణకే ఖర్చు పెట్టాలన్నది అందులో ఓ షరతు. నిర్మాణం దెబ్బతినకుండా మిగతా కోటలో ఎన్ని రెస్లారెంట్లనైనా, ఎన్ని హోటళ్లనైనా నడుపుకోవచ్చు. ఎంత రేటైన పెట్టుకోవచ్చు. ఖరీదైన పర్యాటకుల కోసం సకల కళలను పోషించవచ్చు. ఎంత సొమ్మయిన ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఎర్రకోట సందర్శనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి భారతీయులు ఒక్కరికి 35 రూపాయలు, విదేశీయులకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు భారతీయుల నుంచే 500 రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఎంట్రీకి రెండు స్నాక్స్ ఇస్తామంటూ ఆ స్నాక్‌ల బిల్లును కంపెనీ తన ఖాతాలో కూడా వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ద్వారా తాజ్ గ్రూప్ ఎంత సంపాదిస్తుందో, అంతకన్నా పదింతలు ఎర్రకోట ద్వారా సంపాదించవచ్చన్నది ఎవరైనా ఊహించవచ్చు. సమైక్య భారత్ చిహ్నంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. మహారాష్ట్ర మీదుగా అఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించిన మొఘల్ చక్రవర్తుల చరిత్రను చెరిపేసి ఆధునిక మహారాష్ట్రలో కొన్ని జిల్లాల విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను విస్తరించేందుకు 210 మీటర్ల విగ్రహాన్ని నిర్మిస్తున్న బీజేపీ పాలకులు....ఎర్రకోటను దాల్మియా స్వాధీనం చేసుకున్నాక శివాజీ రాజ్యానికి రాజధాని అయిన ‘రాయ్‌గఢ్’ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేస్తారా?! -
దాల్మియాకు ఎర్రకోట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు. ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్ సిమెంట్స్ గ్రూప్ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కాంగ్రెస్ మండిపాటు ప్రముఖ కట్టడం నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. -
ఎర్రకోట దత్తత.. ఆగ్రహజ్వాలలు
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక సంపద ఎర్రకోట చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ఎర్రకోటను ఐదేళ్లకు దాల్మియ గ్రూపు దత్తత తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. చారిత్రక సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. పార్లమెంట్, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టులను కూడా అభివృద్ధి పేరుతో లీజుకిస్తారా అని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశంలోని 93 వారసత్వ కట్టడాల అభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వారసత్వ స్థలం ఎర్రకోట అభివృద్ధి కాంట్రాక్ట్‌ను అడాప్ట్ హెరిటేజ్ సైట్ పథకం కింద ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, టూరిజం శాఖలతో దాల్మియా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున ఆ సంస్థ పర్యాటకశాఖకు చెల్లించనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై కేంద్ర టూరిజం శాఖ స్పందించింది. గత ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు రాష్ట్రపతి ఈ పథకాన్ని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే దాల్మిక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. కేవలం వారసత్వ కట్టడాల అభివృద్ధి కోసమే ఇందుకు శ్రీకారం చుట్టామని, ఇందులో ఎలాంటి లాభాపేక్షలేదని ట్వీట్లో పేర్కొన్నారు. -
ఎర్రకోటలో ‘మహాయజ్ఞం’ ప్రారంభం
న్యూఢిల్లీ: ఎర్రకోట మైదానం ఆదివారం యాగశాలగా మారింది. వారం రోజులపాటు సాగే ‘రాష్ట్రీయ రక్షా మహాయజ్ఞం’ను బీజేపీ ఎంపీ మహేశ్ గిరి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేశ సరిహద్దుల్లోని డోక్లాం, వాగా, పూంఛ్, సియాచిన్లతోపాటు, నాలుగు పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మట్టితో 108 హోమ గుండాలను నిర్మించారు. యజ్ఞం నిర్వహించే 1,100 మంది రుత్విక్కుల కోసం ఎర్రకోటలో తాత్కాలికంగా ‘వేదిక్ విలేజ్’ నిర్మించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడరాదనీ, దేశాభివృద్ధి, రక్షణ, భద్రతలను ఆకాంక్షించి నిర్వహిస్తున్న పూర్తి మతపరమైన కార్యక్రమమని ఎంపీ గిరి తెలిపారు. -
టార్గెట్ ‘లాల్ ఖిలా’... మమత సరికొత్త నినాదం!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ‘చలో ఢిల్లీ’ అంటూ పిలుపునిచ్చారు. ఇక తమ లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఇక తమ లక్ష్యం బెంగాల్ అంటూ బీజేపీ నినాదానికి ప్రతిగా ‘టార్గెట్ లాల్ ఖిలా’ పోరుకేకను ఆమె అందుకున్నారు. త్రిపురలో పాతికేళ్ల సీపీఎం పాలనకు బీజేపీ తెరదించిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్, ఒడిశా, కేరళలో విజయాలు సాధిస్తేనే.. కమలానికి సంపూర్ణ స్వర్ణయుగం వచ్చినట్టు అని పేర్కొన్నారు. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై మమత ఘటుగా స్పందించారు. సోమవారం పురాలియా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇక తమ తదుపరి టార్గెట్ బెంగాలేనని కొందరు అంటున్నారు. అలాగైతే మన లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే. ఢిల్లీ దిశగా సాగుదాం. ఛలో ఢిల్లీ అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాన్ని మేం నమ్ముతాం. బెంగాల్ దేశాన్నే కాదు భవిష్యత్తులో ప్రపంచాన్ని గెలుచుకోగలదు’ అని ఆమె పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ‘థర్డ్ ప్రంట్’ ప్రకటనపై మమతా బెనర్జీ చురుగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు ఆమె ఫోన్ చేసి.. మద్దతు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుచేసేందుకు మమత ఉత్సాహం చూపారు. -
భారత్‌పర్వ్‌లో ఆకట్టుకున్న ‘తెలంగాణ’
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన భారత్‌పర్వ్ లో తెలంగాణ సంస్కృతి, కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్క చోటుకి చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ఏటా 6 రోజుల పాటు భారత్‌పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణకు సంబంధించిన పేరిణీ శివతాండవం, ఒగ్గు రవి శిష్యబందం డోలు విన్యాసాలు, కళాకారుల సాంస్కతిక నత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్, ఏఆర్సీ వేదాంతం గిరి పాల్గొన్నారు. -
తాజ్‌మహల్‌పై వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం
-
ఎర్రకోటలో ఘనంగా దసరా వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎర్రకోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం ఎర్రకోటలో జరిగిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... దసరా అనే కాకుండా ఏ పండుగ అయినా కేవలం వినోదంగా చూడరాదని.. అందులోని పరమార్థాన్ని గ్రహించాలని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ... రాముడు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. మరోవైపు రాంలీలా మైదాన్‌లో జరిగిన దసరా వేడుకలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఇక దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమం జరిగింది. దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధించి చివరి రోజు రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ బొమ్మలను దహనం చేశారు. -
రైలు రద్దయిందని, డ్రాప్ చేస్తానని తీసుకెళ్లి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎర్రకోటకు సమీపంలోని పార్క్ వద్ద 23 ఏళ్ల మహిళపై ఓ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. లుధియానకు చెందిన ఓ మహిళ నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వచ్చింది. తిరిగి లుధియానాకు వెళ్లేందుకు సోమవారం రాత్రి ఓ రైలు టికెట్ తీసుకొంది. రైలు మంగళవారం తెల్లవారు జామున 4.30కు ఉండటంతో ఆమె అక్కడే రెండుగంటల వరకు ఓ వెయిటింగ్ హాల్లో రైలు కోసం కూర్చుంది. అయితే, అటువైపు వచ్చిన చున్ను కుమార్ అనే వ్యక్తి రైలు రద్దయిందని అబద్ధం చెప్పి, తాను బస్ స్టాండులో డ్రాప్ చేస్తానని, అక్కడి నుంచి బస్సులో వెళ్లొచ్చని నమ్మబలికించి తీసుకెళ్లాడు. సరిగ్గా ఎర్రకోటకు సమీపంలోని గోల్డెన్ జుబిలీ పార్క్ వద్దకు వెళ్లగానే బెదిరించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెట్టి పరారయ్యాడు. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు శాస్త్రి పార్క్ ప్రాంతానికి చెందిన అతడిని అరెస్టు చేశారు. -
ఎర్రకోట మీద జెండాను ఆవిష్కరించిన ప్రధాని
-
ఎర్రకోట పాకిస్థాన్దట!
బీజింగ్: అదొక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఆస్థానాలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను అందులో ప్రదర్శిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది చైనాలోని షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) అనే సంస్థ. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాకిస్థాన్ ప్రతినిధి మసూద్ ఖలీద్ ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఇంతలో ఓ ఛాయా చిత్రాన్ని ప్రదర్శిస్తూ దాన్ని లాహోర్‌లోని షాలిమార్ గార్డెన్స్‌గా పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉన్న భారత, పాక్ అధికార ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. ఎందుకంటే వారు లాహోర్ షాలిమార్ గార్డెన్స్‌గా చెబుతూ ప్రదర్శించిన ఛిత్రం మూడు రంగుల భారత జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తున్న ఎర్రకోట. వెంటనే ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులకు తెలిపి గుర్రుమన్నారు. దీంతో ఎస్సీవో అధికారులు జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. ఛాయ చిత్రాలను ప్రదర్శించే సమయంలో తాము మరొకసారి తనిఖీ చేసుకోవాల్సి ఉండాల్సిందని అన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో భారత్, పాక్ పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా, గురువారం రెండు దేశాల జాతీయ జెండాలను ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎగురవేయనున్నారు. ఆ సమయంలో ఇరు దేశాల ప్రతినిధులు డ్రమ్స్ మోగించి సందడి చేస్తారు. -
ఎర్రకోటలో గ్రెనేడ్!
న్యూఢిల్లీ : దేశంలో ఎంతో ప్రతిష్టాత్మక కట్టడమైన ఎర్రకోటలో శుక్రవారం ఉదయం గ్రెనేడ్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న భద్రతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దాన్ని తొలగించారు. ఎర్రకోటను శుభ్రం చేసే పనివారు ఎర్రకోటలోని సావన్ భడో ఉద్యానవనాన్ని శుభ్రపరుస్తుండగా వారికి అక్కడ గ్రెనేడ్ కనిపించింది. దీంతో వారు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు బాంబ్ స్క్వాడ్‌కు విషయం తెలిపారు. వారు వచ్చి తనిఖీ నిర్వహించి గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసి తొలగించారు. ఈ ఫిబ్రవరిలో కూడా ఎర్రకోటలో పోలీసులకు కొన్ని పేలుడు పదార్థాలు దొరికాయి. 2000 సంవత్సరం డిసెంబర్లో లష్కరే తోయిబా సంస్థ ఎర్రకోటపై దాడులు చేసింది. అప్పటి నుంచి దీని చుట్టూ కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థను ఏర్పరిచారు. -
ఎర్రకోటలో బాంబు.. రాజధానిలో కలకలం
దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటలో ఓ బాంబు బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రాజధానిలో ఎలర్ట్ ప్రకటించారు. సాధారణంగా రోజూ చేసే తనిఖీలలో భాగంగానే ఎర్రకోటలో భద్రతాదళాలు తనిఖీ చేస్తుండగా అక్కడున్న ఓ బావిలో ఈ బాంబు కనిపించింది. వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డులతో పాటు డీసీపీ నేతృత్వంలోని పోలీసు బృందం కూడా హుటాహుటిన అక్కడకు చేరుకుని భారీ మొత్తంలో ఆ ప్రాంతమంతా తనిఖీలు చేశారు. ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమోనని బాంబు స్క్వాడ్‌ను కూడా తీసుకొచ్చి ముమ్మరంగా గాలించారు. ముందుగా బావిలో ఉన్న గ్రెనేడ్‌ను బయటకు తీసి, దాన్ని నిర్వీర్యం చేసి పరీక్షల కోసం తీసుకెళ్లారు. అది ఏమైనా ప్రపంచయుద్ధ సమయం నాటిదా లేదా వేరే ఏమైనానా అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి ఎర్రకోట లోపల ఉన్న ఓ బావిని శుభ్రం చేస్తుండగా అందులో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన కొన్ని బాక్సులు కనిపించాయి. ఇప్పుడు కూడా అలాగే బాంబు బయటపడటంతో ఎన్ఎస్జీ బృందాలకు సైతం సమాచారం అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి వేడుకలు జరిగే ఎర్రకోటలో ఇంతలా బాంబులు, పేలుడు పదార్థాలు బయట పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎర్రకోటలో పేలుడు పదార్థాలు
న్యూఢిల్లీ: ఎర్రకోటలోని ఓ బావిలో మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు కనిపించడం కలకలం రేపింది. ఎర్రకోటలోని పబ్లికేషన్ భవనం వెనుక ఉన్న ఓ బావిని శనివారం సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఐదు మోర్టార్లు, 44 ఉపయోగించని, 87 ఉపయోగించిన బుల్లెట్లు దొరికాయి. వెంటనే పోలీసులకు, ఎన్ ఎస్జీకి సమాచారం అందించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాక ఎన్ ఎస్జీ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులతో అక్కడికి చేరుకున్నారు. అవి ప్రభుత్వానికి చెందినవే అయ్యుంటాయని భావిస్తున్నారు. -
ఢిల్లీలో ఎర్రకోట వద్ద కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద కలకలం రేగింది. సోమవారం ఉదయం ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఎన్ఎస్జీ బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలో దిగి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తోంది. ఎర్రకోటకు నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో జాతీయ భద్రత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ ఈ పేలుడు పదార్థాలను ఎవరు ఉంచారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ భారీగా భద్రత బలగాలను మోహరించారు. అణువణువూ క్షుణ్నంగా తనికీ చేస్తున్నారు. -
స్వరాజ్యం నుంచి సురాజ్యానికి!
ప్రభుత్వ మంత్రం ‘సంస్కరించు, ఆచరించు, మార్చు’ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రధాని మోదీ పాలనలో పారదర్శకత తీసుకొచ్చాం * ‘ప్రజాకర్షణ’ ఖర్చు దూరం పెట్టాం.. అసమానతలకు చోటు లేదు * ప్రగతికి సామాజిక న్యాయమే పునాది.. సేవల వేగం పెరిగింది * ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టగలిగాం సాక్షి, న్యూఢిల్లీ: ‘సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రజాకర్షణను పక్కనపెడుతూ.. సంస్కరించు, ఆచరించు, మార్చు అనే వ్యూహాన్ని అమలు చేయటానికి నేను ప్రయత్నిస్తున్నా. స్వీయ పాలన నుంచి సుపరిపాలనకు ప్రయాణం మొత్తం దేశ ప్రజల సంకల్పం.. దానికోసం త్యాగాలు అవసరం. గత (యూపీఏ) ప్రభుత్వం ఆరోపణల్లో కూరుకుపోయింది. నా ప్రభుత్వం చుట్టూ ఆకాంక్షలు అల్లుకున్నాయి. ఆశ అనేది ఆకాంక్షలను పెంచినపుడు.. మేం సురాజ్ (సుపరిపాలన)వైపు వేగంగా వెళ్లటానికి అది శక్తినిస్తుంది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు, గ్రామ ప్రతినిధి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను నిర్వర్తించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి 1.33 గంటల పాటు ప్రసంగించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన మోదీ.. బులెట్ ప్రూఫ్ అద్దాల కవచాన్ని కూడా వద్దని తిరస్కరించారు. ఎర్రకోటపై వరుసగా మూడోసారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ఆయన.. తన ప్రభుత్వ కృషి, సాధించిన విజయాలను, ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం సరళతరం చేయటం, పేదలు, రైతుల కోసం సంక్షేమ పథకాల గురించి వివరించటంపై దృష్టి పెట్టారు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ను 20 శాతం పెంచుతున్నామని, దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు రూ. 1 లక్ష వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. దేశంలో అనాదిగా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలైన కులతత్వం, అంటరానితనాల విషయంలో కఠిన, సున్నిత వైఖరి అవలంబించాలన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సామరస్యమే ప్రగతికి పునాది... ‘భారత్ అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం వెనుక లక్షలాది మహాపురుషుల త్యాగం ఉంది. మన దేశానికి చారిత్రక నాగరికత ఉంది. మన సంస్కృతికి ఎల్లలేవు. భారత్ వయసు 70 ఏళ్లు కాదు.. బానిసత్వం నుంచి స్వతంత్య్రం పొంది 70 ఏళ్లు అయ్యింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశాన్ని ఒక్కతాటిపై నిలిపారు. సామాజిక న్యాయం ప్రాతిపదికగా గల బలమైన సమాజం లేకుండా బలమైన దేశాన్ని నిర్మించజాలం. దేశ ప్రగతికి సామాజిక సామరస్యం కీలకం. బుద్ధదేవుడు, గాంధీ, రామానుజాచార్య,అంబేడ్కర్, మన పవిత్ర గ్రంథాలు, రుషులు, బోధకులు బలంగా చెప్పింది సామాజిక సమైక్యత గురించే. సమాజం విచ్ఛిన్నమైనపుడు సామ్రాజ్యం ముక్కలవుతుంది. సమాజం అంటగలిగే వారు, అంటరాని వారుగా; అగ్ర, అధమ(కులాలు(గా) చీలితే.. అటువంటి సమాజం మనజాలదు. సమాజంలో అందరూ ఒక్కటే. పెద్దవాళ్లు, పిల్లలు అందరూ ఒక్కటే. అసమానతనలను ఎట్టిపరిస్థితిల్లోను సహించేది లేదు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ఎవరైనా దేశ పౌరులే. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉంది.’’ చెప్పుకుంటూ పోతే వారం పడుతుంది... ‘ప్రభుత్వం ఏం చేస్తోందన్నదానిపై అన్ని విషయాలను చెప్పగలను. అందుకు నేను వారం రోజులపాటు ఇక్కడే నిలుచుని మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ రోజు ప్రభుత్వ విధానాల గురించి, ఉద్దేశాల గురించి మాట్లాడడం లేదు. సురాజ్యం గురించి మాట్లాడుతున్నానంటే అది సామన్యుల జీవితాన్ని మార్చడమే. * ఒక మంచి ఆస్పత్రికి వెళ్లడానికి ప్రజలకు చాలా కాలం పట్టే రోజులు ఉండేవి. కానీ ఈ రోజు వాటన్నింటిని మార్చేశాం. అన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అపాయింట్మెంట్లు పొందవచ్చు. ఈ విధానాన్ని ఇప్పటికి వరకు 40 పెద్ద ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నాం. ససామన్య ప్రజానీకం రైలు టిక్కెట్ పొందడానికి ప్రయాసపడేవారు. ఇప్పుడు.. ఒక సెకనులో 15 వేల టిక్కెట్లను పొందేలా పారదర్శకతను అమలు చేస్తున్నాం.పన్నుల వాపసుకు మూడు వారాలకంటే ఎక్కువ కావడం లేదు. * గతంలో పాస్‌పోర్ట్ పొందడానికి కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు కొన్ని వారాల్లోనే పొందొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా కింది స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నాం. లక్షల ఉద్యోగాలకు మధ్యవర్తుల అవసరం లేకుండా చేశాం. * మేం 70 కోట్ల మందిని ఆధార్, సామాజిక భదత్రా పథకాలకు అనుసంధానం చేశాం. గత 60 ఏళ్లలో 14 కోట్ల మంది వంట గ్యాస్ కనెక్షన్లు పొందారు. మా ప్రభుత్వం వచ్చిన 60 వారాల్ల్లో 4 కోట్ల మందికి కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 2 కోట్ల మరుగుదొడ్లతో సుమారు 70 వేల గ్రామాలు బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందాయి. బొగ్గు గనుల వేలంలో పారదర్శకత తీసుకొచ్చాం. * 2014లో 18 వేల గ్రామాలకు కరెంటు లేదు. మేం వచ్చిన తరువాత వెయ్యి రోజుల్లో ఆ గ్రామాలకు విద్యుత్‌ను అందివ్వాలనుకున్నాం. నిర్దేశించుకున్న సమయంలో సగం కూడా పూర్తవకుండానే 10 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించాం. రూ. 350 విలువచేసే ఎల్ఈడీ బల్బును కేవ రూ. 50కే అందిస్తున్నాం. 77 కోట్ల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు కూడా ఎల్ఈడీ బల్బులనే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యుత్‌ను ఆదా చేసి దేశానికి సహాయం చేయడంలో భాగస్వామ్యులు అవ్వండి. మహిళలు, యువతుల సంక్షేమం... ‘మహిళలు, యువతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముద్ర పథకం ద్వారా 3.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. * బేటీ బచావ్, బేటీ పడావ్, సుఖన్యా సమృద్ధి, ఉజ్వల్ యోజనా, ప్రసూతి సెలవుల సవరణ ద్వారా గర్భిణులకు 26 వారాల జీతంతో సెలవులను అందిస్తున్నాం. జన్ ధన్ యోజనా ద్వారా ఇప్పటి వరకు 21 కోట్ల మంది బ్యాంకు అకౌంట్ల పొందారు. * సులభ వ్యాపారం చేయడంలో భారత స్థానం మెరుగైంది. జీడీపీ వృద్ధిలో ఇతర దేశాలను భారత్ వెనక్కునెట్టింది. భారత సంస్కరణల్లో సుదీర్ఘకాలం నిలిచే జీఎస్టీ బిల్లూ ఇటీవలే ఆమోదం పొందింది. జీఎస్టీతో అన్ని పన్నులు ఏకం కానున్నాయి. సమరయోధులకు పెరిగిన పెన్షన్... 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్య్ర సమరయోధులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ. 25 వేల పెన్షన్‌ను రూ. 30 వేలు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. స్వతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆదివాసీ సమరయోధులకు దేశ వ్యాప్తంగా ప్రదర్శనశాల, స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మోదీ వెల్లడించారు. అలాగే.. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న పేదల వైద్య ఖర్చుల్లో రూ. లక్ష వరకు ప్రభుత్వం భరిస్తుందన్నారు. పేద ప్రజల విస్తరి భారం కానివ్వను... * ‘‘గత ప్రభుత్వ హయాంలోద్రవ్యోల్బణం 10% దాటింది. కానీ మా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ద్రల్యోల్బణం ఆరు శాతానికి మించకుండా ఉంది. ద్రవ్యోల్బణం వల్ల పేద ప్రజల ఆహార విస్తరి భారం కాకుండా శాయశక్తులా కృషి చేస్తా. ద్రవ్యోల్బణాన్ని ఇంకా 4 నుంచి 2 శాతానికి తగ్గించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. * పప్పుల ఉత్పాదకత తగ్గినా.. వాటి ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పప్పు ధాన్య రైతులకు సంబంధించి బోనస్‌ను, పథకాలను ప్రకటించాం. వారు 1.5 రెట్లు అధికంగా పప్పులు పండించారు. * ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేస్తే గత ప్రభుత్వ కాలంలో లాఠీచార్జ్ జరిగేది. ఇప్పుడు ఎరువుల కొరతలేదు. * రైతుల వ్యవసాయ పెట్టుబడిని తగ్గించడానికి 77 వేల పంపు సెట్లను ఇచ్చాం. అసంపూర్తిగా ఉన్న రూ. 7.5 లక్షల కోట్ల విలువైన 118 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. మరో రూ. 10 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని గుర్తించాం. * గతంలో ఒక యూనిట్ విద్యుత్ రూ. 10 ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో రూ. 1గా ఉంది. * ఖతర్‌తో గ్యాస్ దిగుమతి ఒప్పందం ద్వారా రూ. 20 వేల కోట్లు ఆదా కానుంది.’’ డేగ కళ్లతో నిఘా న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకల వేళ ఢిల్లీ శత్రుదుర్భేద్యంగా మారింది. ఎర్రకోట చుట్టుపక్కలా వేల మంది పోలీసులు, ఇతర భద్రతా విభాగాలు డేగ కళ్లతో పహారా నిర్వహించాయి. ఉదయం 7.20 గంటలకు ఎర్రకోట లాహోర్ గేట్ వద్ద ప్రధాని మోదీకి రక్షణ శాఖ మంత్రి పరీకర్ తదితరులు ఆహ్వానం పలికారు. గౌరవ వందనం స్వీకరించే ప్రాంతానికి చేరుకోగానే ఇంటర్ సర్వీసెస్ సిబ్బంది, పోలీసు గార్డులు సెల్యూట్ చేశారు. అనంతరం ఆర్మీ, నౌకాదళం, వాయుసేన అధికారులు, సిబ్బంది నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోట వేదికకు చేరుకుని ఉదయం 7.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలో భద్రతా బలగాలు 21 తుపాకులు పేల్చి వందనం సమర్పించాయి. తర్వాత ప్రధాని చిన్నారుల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. వేడుకలకు 40 వేలమంది హాజరయ్యారు. * బుల్లెట్ ప్రూఫ్ లేకుండానే.. మూడో ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేకుండానే ఎర్రకోటపై నుంచి ప్రసగించారు. * ఎర్రకోటపై నల్ల గాలిపటం.. మోదీ జాతీయ జెండా ఎగురవేయడానికి ఎర్రకోట వద్దకు రావడానికి కొద్దిసేపటి ముందు, ఎర్రకోటపై నల్లని గాలిపటం ఎగురుతూ కనిపించింది. భద్రతా సిబ్బంది వెంటనే గాలిపటాన్ని తొలగించారు. -
మోదీ సిక్సర్!
బాల్ ‘బౌండరీ’ దాటింది పాకిస్తాన్‌పై గురిచూసి కొట్టిన ప్రధాని సాక్షి, న్యూఢిల్లీ: దేశ విదేశాంగ విధానంలో సరికొత్త పంథాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెరలేపారు. సోమవారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేదికగా.. ఢిల్లీలోని ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రసంగంలో.. పాకిస్తాన్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జిల్జిత్లో ప్రజల అణచివేత అంశాన్ని ఆయన లేవనెత్తారు. ‘‘పొరుగున ఉన్న దేశానికి ఒక్కటే చెబుతున్నా.. ఒకరితో ఒకరు పోరాడడం కన్నా.. ఇద్దరి సమస్య అయిన పేదరికంపై కలసి పోరాడుదాం. అప్పుడే ఇద్దరం సుసంపన్నమవుతాం. పేదరికం నుంచి విముక్తి పొంద డం కంటే ప్రపంచంలో మరే పెద్ద స్వాతంత్య్రం లేదు. ఎర్రకోట బురుజుల మీద నుంచి నేను కొంతమందికి– బెలూచిస్తాన్, జిల్జిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ల ప్రజలకు– కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను. వారి సమస్యలపై దృష్టి సారించినందుకు నాకు వారు ఇటీవల కృతజ్ఞతలు తెలిపారు. ఇది 125 కోట్ల భారత ప్రజలకు దక్కిన అరుదైన గౌరవం’’ అని మోదీ పేర్కొన్నారు. ఇంతకాలం భారత విదేశాంగ విధానంలో.. పొరుగు దేశం, అందునా పాకిస్తాన్ అంతర్గత విషయాలను ప్రస్తావించటం లేనేలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటమూ వ్యూహాత్మక చర్చలకే పరిమితం. అన్నిటికీమించి ఒక ప్రధాని భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పాక్ నియంత్రణలోని భూభాగం గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ.. భారత్‌లో భాగంగా ఉన్న కశ్మీర్ విషయాన్ని.. అక్కడ అలజడుల అంశాలను పాక్ పదే పదే లేవనెత్తుతుండటం.. దానికి భారత్ అభ్యం తరం వ్యక్తం చేయటం జరిగేది. మోదీ పీవోకేలోని ప్రజల గురించి, పాక్‌లో బెలూచిస్తాన్ గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు.. భారత్ – పాక్ సంబంధాల్లో దీర్ఘకాలంగా కొనసాగతున్న ముసుగులో గుద్దులాటకు ముగింపు పలికాయని పరిశీలకులు భావిస్తున్నారు. పాక్‌పై ఆయుధంగా బెలూచిస్తాన్... అలాగే.. పాక్‌లోని బెలూచిస్తాన్ గురించి మోదీ ప్రస్తావించటం మరో వ్యూహాత్మక ఎత్తుగడగా పేర్కొంటున్నారు. పాక్‌లోని 4 రాష్ట్రాల్లో బెలూచిస్తాన్ ఒకటి. నైరుతి మూలన ఉన్న ఈ రాష్ట్రంలో బలూచ్ జాతి ప్రజలు దశాబ్దాలుగా పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. (అటు ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలో సరిహద్దుల ప్రాంతాల్లోనూ బలూచ్ ప్రజలు ఈ తరహా పోరాటాలు చేస్తున్నారు.) 1948 నుంచే బెలూచిస్తాన్‌లో మొదలైన ఈ అంతర్యుద్ధం.. గత దశాబ్దంలో ఉధృతరూపం దాల్చింది. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ మద్దతిచ్చి పెంచిపోషిస్తోందని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని భారత్ డిమాండ్ చేయగా.. పాక్ ఎన్నడూ ఆధారాలేవీ చూపలేకపోయింది. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో అలజడులను ప్రస్తావిస్తూ.. అక్కడ ప్రజల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ అంతర్జాతీయంగా నిందలు వేయటానికి పాక్ వాడుకుంటోంది. ఇప్పుడు మోదీ బెలూచిస్తాన్ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా.. పాక్‌ను అంతర్జాతీయ వేది కపై దోషిగా నిలబెట్టటానికి ఆ దేశంలో మాన వ హక్కుల అణచివేతను మరొక ఆయుధంగా వినియోగించుకునే వ్యూహానికి పదునుపెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మరొకవైపు చైనా కూడా కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. పాక్, చైనాలు రెండూ.. తాము ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాలను కలుపుకుంటూ ఎకానమిక్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న విషయ మూ విదితమే. ఈ నేపథ్యంలో ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల అణచివేత అంశాలను ప్రముఖం గా ప్రస్తావించటం ద్వారా.. ఆ రెండు దేశాల వ్యవహారాన్ని తాము తేలికగా తీసుకోవటం లేదని మోదీ పరోక్షంగా హెచ్చరించినట్లు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్కడ ఉగ్రవాదాన్ని కీర్తిస్తారు పొరుగుదేశం ఉగ్రవాదులను అమరవీరులుగా కొనియాడుతోందంటూ మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపైనా సునిశిత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పెషావర్‌లో ఒక స్కూల్‌పై ఉగ్రవాద దాడిలో (రెండేళ్ల కిందట) చిన్నారులు మరణించినపుడు.. మా పార్లమెంటులో కన్నీళ్లు ఉబికాయి. భారత చిన్నారులు కలతచెందారు. ఇది మన మానవత్వానికి ఉదాహరణ. కానీ అవతలివైపు చూడం డి.. అక్కడ ఉగ్రవాదాన్ని కీర్తిస్తారు’’ అంటూ ఇటీవల కశ్మీర్లో ఎన్కౌంటర్లో చనిపోయిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాం డర్ బుర్హాన్ వానిని పాక్ అమరవీరుడుగా కీర్తిస్తున్న విషయాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. భారత్ ఉగ్రవాదానికి, హింసకు తల వంచదన్నారు. ‘‘హింసామార్గం ఎవరికీ ఎన్న డూ ప్రయోజనం కలిగించలేదు. ఆ యువతకు నేను చెప్తున్నాను.. ఇంకా సమయం ఉంది.. వచ్చి ప్రధాన స్రవంతిలో కలవండి. మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను సాకారం చేయండి. శాం తియుత జీవనం గడపండి’’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు కశ్మీరీ యువతను ఉద్దేశించి చేసినవిగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇక పాక్‌పై ఎదురుదాడి వ్యూహం ఇప్పటివరకూ భారత్ తనలో భాగంగా ఉన్న కశ్మీర్ గురించే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి మాట్లాడటం అరుదు. వాస్తవానికి భారత్ – పాక్‌ల మధ్య కార్గిల్ వంటి తీవ్ర ఘర్షణల సమయంలో సైతం భారత్ అధీనరేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్)ను దాటలేదు. ఇందుకు కారణం.. ప్రాంతీయ సుస్థిరతకు భారత్ అధిక ప్రాధాన్యం ఇవ్వడమే. అయితే.. పాక్ అనునిత్యం భారత్‌లోని కశ్మీర్ గురించి అంతర్జాతీయంగా లేవనెత్తుతూ భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పీవోకే అంశాన్ని ప్రస్తావిస్తూ.. జిల్జిత్ తదితర ప్రాంతాల ప్రజల అణచివేతను ప్రస్తావించటం భారత వైఖరిలో స్పష్టమైన మార్పుకు తెరతీసినట్లయింది. కశ్మీర్ అంటే తమ భూభాగంలో ఉన్నదే కాదని.. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌నూ కలుపుకొని మాట్లాడతామని మోదీ స్పష్టం చేసినట్లయింది. దీంతో కశ్మీర్‌పై ఇప్పటివరకూ ఆత్మరక్షణ వైఖరిగా ఉన్నట్లు కనిపించే భారత విధానం.. ఎదురుదాడి వ్యూహానికి మారినట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎర్రకోటపై నల్ల గాలిపటం
ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయడానికి ఎర్రకోట వద్దకు రావడానికి కొద్దిసేపటి ముందు, ఎర్రకోటపై నల్లని గాలిపటం ఎగురుతూ కనిపించింది. ఇక్కడ ప్రధాని ప్రసగించనున్న దృష్ట్యా వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి, సీసీటీవీ కెమెరాలతో పరిశీలిస్తున్నా నల్ల గాలిపటం ఎగరడం గమనార్హం. వెంటనే భద్రతా సిబ్బంది గాలిపటాన్ని తొలగించారు. -
ఎర్రకోట లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ
-
స్వాతంత్ర్య వేడుకులకు ఎర్ర కోట రెడీ
-
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎర్రకోట!
-
ఢిల్లీలో మహాత్ముడు కాలుమోపి వందేళ్లు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ మొట్ట మొదటిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టి సరిగ్గా ఆదివారానికిత వందేళ్లు పూర్తయింది. దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారత్‌కు తిరిగి వచ్చిన గాంధీ ఏప్రిల్ 12న భార్య కస్తూర్బాతోపాటు కొంతమంది సన్నిహితులతో కలసి ఢిల్లీలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు గాంధీ దేశపర్యటన ప్రారంభించారు. దేశంలోని సాధారణ ప్రజల జీవన పరిస్థితులు పరిశీలించడంతో పాటు... రాజకీయపోరాటం ప్రారంభించడానికి ప్రజల సన్నద్ధతను అంచనావేయడమే ఆయన పర్యటన ముఖ్యోద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో రెండురోజులు గడిపిన మహాత్ముడు కుతుబ్‌మినార్, ఎర్రకోట, సెయింట్ స్టీఫెన్ కాలేజీతోపాటు సంగం థియేటర్‌ను సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి. -
ఎర్రకోటలో షాజహాన్ ‘కుమార్తెలు’
న్యూఢిల్లీ: ఈరోజు ఎర్రకోటను సందర్శించే వారికి మొఘల్ యువరాణులు జహాన్ ఆరా, రోషన్ ఆరాలను కలుసుకొనే అవకాశం లభించనుంది. సందర్శకులతో కనీసం ఒకగంట పాటు గడిపే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెలు తరాలకు చెందిన వీరగాథలను మీతో పంచుకోనున్నారు. దివాన్-ఇ-ఖాస్‌లో ఆకస్మికంగా మీ మధ్యకు వచ్చి గంటసేపు సందర్శకులతో ఉంటారు. అయితే వీరు నిజంగా షాజహాన్ కుమార్తెలు కారు. నగర పౌరులకు చరిత్ర, వారసత్వ సంపదపై అవగాహనకల్పించేందుకు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) ఈ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని (నవంబర్ 19-25) పురస్కరించుకొని ఇద్దరు కళాకారులను ఏఎస్ఐ ఎంపిక చేసింది. మధ్యాహ్నం 2.30-3.30గంటల సమయంలో మొఘల్ కాలంనాటి దుస్తులను ధరించి వచ్చే ఈ కళాకారులు సందర్శకుల వద్దకు వచ్చి చరిత్రను వల్లెవేస్తారు. షాజహాన్ పెద్దకుమార్తె జహాన్ ఆరా బేగం సమాధి దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. సోదరుడు ఔరంగజేబును సింహాసనం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన రోషన్ ఆరా బేగం షాజహాన్ రెండో కుమార్తె. వీరిద్దరి పాత్రలను కళాకారులు ఎర్రకోటలో శనివారం నాడు ప్రదర్శించనున్నారు. -
మీ ప్రధాన సేవకుడిని
స్వాతంత్య్ర దిన వేడుకల్లో నరేంద్రమోడీ ప్రకటన ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తాం.. సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం పేదలకు ‘జన ధన యోజన’ పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం ఎంపీల ద్వారా ‘ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పథకం’ అమలుచేస్తాం యువత నైపుణ్యాల కోసం ‘స్కిల్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం పరిశుభ్రమైన భారత్ కోసం అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకం తొలి ఏడాది పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణం మతం, కులం ప్రాతిపదికగా హింస ఇంకెన్నాళ్లు? పదేళ్ల పాటు వదిలేద్దాం ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే దాన్ని నాణ్యతకు మారుపేరుగా నిలపాలి పౌరులను సాధికారం చేయడానికి ‘డిజిటల్ ఇండియా’ను రూపొందిస్తాం ప్రభుత్వంలో శాఖల మధ్య అంతరాలనే గోడలు బద్దలుకొడుతున్నా పార్లమెంటులో సంఖ్యా బలంతో కాదు.. ఏకాభిప్రాయంతో నడిపిస్తాం జాతీయ పతాకావిష్కరణ అనంతరం మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం... - 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశ 68వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచే జాతినుద్దేశించి 65 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే.. తాను మాట్లాడే పోడియానికి బులెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని మోడీ తిరస్కరించటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి బులెట్ ప్రూఫ్ అద్దాల గది నుంచి ప్రసంగిస్తుండగా.. మోడీ తొలిసారి ఆ రక్షణ లేకుండా ప్రసంగించారు. రెండు నెలల కిందటే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ.. ఎర్రకోట నుంచి చేసిన తన తొలి ప్రసంగంలో.. దేశాభివృద్ధికి, ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తాను చేపట్టదలచుకున్న కార్యక్రమాలను, ఆలోచనలను వివరించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రణాళికా సంఘం రద్దు: అంతర్గతంగా, అంతర్జాతీయంగా మారిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను తీసుకువస్తాం. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యత గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. అతి త్వరలో ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పుతాం. కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరం. అది.. ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యాన్ని, యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సృజనాత్మకతతో పాటు.. తాజా ఆవిష్కరణలు, ఆలోచనలు, ఆశలను తీసుకొస్తుంది. పదేళ్ల పాటు హింసను వదిలేద్దాం: స్వాతంత్య్రం తరువాత కూడా మతం, కులం ప్రాతిపదికగా హింసను మనం చూస్తున్నాం. ఇలా ఎంత కాలం? ఇక గొడవలు, హత్యలు చాలు. దేశ ప్రగతి కోసం నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. హింసపై పదేళ్ల పాటు మారటోరియం ఉండాలి. కనీసం ఒక్కసారైనా. తద్వారా మనం ఈ రుగ్మతల నుంచి బయటపడతాం. మనం హింసా మార్గం వీడి.. సౌభ్రాతృత్వపు మార్గం అనుసరిస్తే.. అభివృద్ధి చెందుతాం. కొడుకులపైనా ఆంక్షలు పెట్టాలి... అత్యాచారాల సంఘటనలు తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు మన తలలు సిగ్గుతో వాలిపోతాయి. ప్రతి ఇంటిలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెలను చాలా ప్రశ్నలు అడుగుతారు. కానీ.. వారు వారి కొడుకులను ఇవే ప్రశ్నలు అడుగుతారా? అత్యాచారం చేసేవాళ్లు కూడా ఒకరికి కొడుకులే కదా? అతడికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుల మీద ఆంక్షలు పెడితే.. ఇక అత్యాచారాలకు పాల్పడేవాళ్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులు ఉండరు. సర్కారులో గోడలు బద్దలుకొడుతున్నా.. నేను ఢిల్లీకి బయటి నుంచి వచ్చాను. ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో లోపలి నుంచి చూశాను. నా వ్యాఖ్యలను రాజకీయ దృక్కోణం నుంచి చూడకూడదు. ప్రభుత్వంలో అంతర్గతంగా డజన్ల కొద్దీ ప్రభుత్వాలు చూసి దిగ్భ్రాం తికి లోనయ్యా. శాఖలను వారి వ్యక్తిగత సామంతరాజ్యాలుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఒకే విభాగంగా చేయడానికి నేను ఈ గోడలను బద్దలుకొట్టడం మొదలుపెట్టా. పరిశుభ్రమైన భారత్ కోసం పథకం... దేశాన్ని పరిశుభ్రంగా చేసే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2019 లో మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. సంసద్ ఆదర్శ గ్రామ యోజన... పార్లమెంటు సభ్యుల ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఎంపీలు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 2016 నాటికి దానిని ఆదర్శ గ్రామంగా రూపొందించాలి.’’ అది దేశ ఆర్థిక గతిని నిర్దేశించిన ‘సంఘం’ ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికాసంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించటం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది.. రాజకీయ మహామహులే. ఆ పదవిలో ఉన్న వారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్నందా, వి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధుదండావతే, మోహన్‌ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చివరి ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990 ల్లో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యత కనుమరుగైంది. ప్రధానమంత్రి జన ధన యోజన దేశంలోని కోట్లాది మందికి ఫోన్లు ఉన్నాయి కానీ బ్యాంకు ఖాతాల్లేవు. ఈ పరిస్థితి నుంచి మార్పు తేవాలి. ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పేరుతో పేద కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు, ఒక డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా వర్తింపు పథకాన్ని అమలు చేస్తాం. పేద ప్రజలు, ప్రత్యేకించి రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు వారికి బ్యాంకింగ్ సేవలు అందించాల్సిన అవసరముంది. ఆర్థికాభివృద్ధి పేదలకు ప్రయోజనం అందించటం ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ‘స్కిల్ ఇండియా’ కోసం ఉద్యమం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచే నైపుణ్యాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ‘స్కిల్ ఇండియా (నైపుణ్య భారత్)’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. యువత పరిశ్రమలను నెలకొల్పే స్ఫూర్తిని వెలికితీసి.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వివిధ వస్తువులను దేశంలోనే తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనేదాన్ని నాణ్యతకు మారుపేరుగా మార్చాలి. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టటానికి ప్రపంచవ్యాప్తంగా గల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించటానికి ‘భారత్ వచ్చి తయారు చేయండి’ అనే పిలుపునిస్తున్నాం. దేశాన్ని రైల్వే కలుపుతుందనేది ఒకప్పటి మాట. దేశ ప్రజలను కలిపే శక్తి ఐటీకి ఉందని నేను చెప్తున్నా. దేశం కోసం మా కల.. డిజిటల్ ఇండియా. పౌరులను సాధికారులను చేయడానికి సమాచార సేవలను సమయానికి, సమర్థవంతంగా అందించటానికి డిజిటల్ ఇండియాను రూపొందించే లక్ష్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. -
18 భాషల్లో మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన దైనశైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ .. శుక్రవారం నాడు ఎర్రకోటపై 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారంగా అయితే రెండు మూడు భాషల్లోనే దేశ ప్రజలకు అభినందనలు తెలియజేయటం ఇప్పటి వరకూ చూసి ఉంటాం. అయితే మోడీ మాత్రం 18 భాషల్లో దేశ ప్రజలకు అభినందనలు తెలిపి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్, మన జాతీయ భాష అయిన హిందీతో పాటు మరో పదహారు భాషల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు నమ్మకం కలిగించేలా పరిపాలన అందించడానికి కృషి చేస్తానని మోడీ హామీ ఇచ్చారు. యావత్ భారతావని వృద్ధి బాటలో పయనించాలని కోరుతూ.. ప్రతీ ఒక్క భారతీయుడు వర్ధిల్లాలని మోడీ తన ప్రసంగంలో ఆకాంక్షించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమేనని మోడీ అన్నారు. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీని ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్‌కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నానని మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేసిన ఆయన తన ప్రత్యేకత చాటారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఎటువంటి రక్షణ కవచం లేకుండా ఆయన ప్రసంగించడం విశేషం. మోడీ కంటే ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ కవచం వెనుక నుంచి ప్రసంగించారు. అయితే మోడీ ఇది లేకుండానే తన శైలిలో ప్రసంగించారు. కాషాయ రంగు తలపాగా, క్రీమ్ కలర్ పైజామా, తెలుపు రంగు లాల్చీ ధరించి గుజరాతీ సంప్రదాయ ఆహార్యంతో పాటు తన ప్రసంగంతోనూ మోడీ అందరినీ ఆకట్టుకున్నారు. తొలి పంద్రాగసట్టు ప్రసంగంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రసంగ పాఠాన్ని చదవకుండా ఆశువుగా ప్రసంగించారు. ఇక మోడీ తొలి పంద్రాగసట్టు ప్రసంగంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ఎర్రకోటలో కుర్చీల నిండా దుమ్ము, మరకలు
పరిశుభ్రతకు తాను పెద్దపీట వేస్తానని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. కార్యాలయాల్లో పరిశుభ్రతను పాటించడానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని, ఇది ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా అని ఎవరు అడిగినా పట్టించుకోనని ఆయన చెప్పారు. అయితే.. పరిశుభ్రతకు ఇంత ప్రాధాన్యం ఇచ్చే మోడీ ప్రసంగాన్ని వినడానికి, కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకు వేసిన కుర్చీలు మాత్రం అత్యంత ఘోరంగా ఉన్నాయి. శుక్రవారం నాడు ఎర్రకోట వద్ద మీడియా ప్రతినిధుల కోసం వేసిన దాదాపు 200 కుర్చీలకు ఆకుపచ్చ రంగు కవర్లు వేశారు. మోడీ ప్రసంగవేదికకు సరిగ్గా ఎదురుగానే ఇవి ఉన్నాయి. అయితే వాటి నిండా దుమ్ము దట్టంగా పేరుకుపోయి ఉంది. కొన్నింటిమీద అయితే పెయింటు, గ్రీజు మరకలు కూడా ఉన్నాయి. స్టీలు ఫ్రేముకు ఉన్న నట్లు, మేకులు అన్నీ తుప్పుపట్టి ఉన్నాయి. దాంతో మీడియా ప్రతినిధులు తమ కర్చీఫులతో దుమ్ము దులుపుకొని కూర్చున్నారు. కొంతమంది తమకు ఇచ్చిన ఆహ్వానపత్రాలను కూడా అందుకు ఉపయోగించారు. దానికి తోడు కుర్చీలు వేసిన ప్రాంతంలో మైదానం ఎగుడుదిగుడుగా ఉండటం, కొన్నిచోట్ల గోతులు కూడా ఉండటంతో కూర్చోవడమే మహా కష్టం అయ్యింది. పైగా కుర్చీలు జరపడానికి వీల్లేకుండా వాటన్నింటినీ ఓ సన్నటి స్టీలు వైరుతో కలిపి కట్టేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మోడీ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని పాత్రికేయులు కవర్ చేశారు. -
అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు
ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మన దేశానికే సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ''అత్యాచారాల గురించి విన్నప్పుడల్లా మన తలలు సిగ్గుతో వంచుకోవాలి. తల్లిదండ్రులను ఇక్కడో ప్రశ్న అడగదలచుకున్నా. మీ అమ్మాయి 10, 12 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమెకు ఎక్కడకు వెళ్తున్నావు, ఎప్పుడొస్తావు, వెళ్లగానే ఫోన్ చెయ్యి అని రకరకాలుగా చెబుతుంటాం, ప్రశ్నలు వేస్తాం. అదే మీ అబ్బాయి ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అలా అడిగారా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నవాళ్లంతో ఎవరో ఒకళ్ల పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు వాళ్లను కూడా ఇలాగే ప్రశ్నిస్తే అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి'' అని మోడీ అన్నారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు తమ అబ్బాయిలతో వాటిపై చర్చించాలని కూడా సూచించారు. -
నీకు దేశం ఏమి చేసిందని కాదు....
-
కమాన్.. మేకిన్ ఇండియా: మోడీ పిలుపు
దేశానికి ప్రధానమంత్రిగా కాదు.. ప్రధాన సేవకుడిగా మీ ముందుకు వచ్చానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారు. మన దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి లెక్కలేనంత మంది బలిదానాలు చేశారని, వాళ్ల జీవితం, యవ్వనమంతా జైళ్లలోనే గడిపేశారని అన్నారు. ఇలా ప్రాణాలు అర్పించిన, పోరాడిన అందరికీ శతకోటి వందనాలు అర్పించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. దేశం కోసం జీవితమంతా సాధన చేసే శ్రామికులను మనం అభినందించాలి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమే. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. ఈ దేశం పురాతన సాంస్కృతిక సంప్రదాయాల పునాదులపై నిలబడింది. ఇక్కడ వేదకాలంలో మనకు ఒకటే మంత్రం వినిపించేది. 'సంగచ్ఛత్వం సంగత్వం సంబో మనాఫి జానతాం ' మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ మూలమంత్రం ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్‌కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నాను. నాకు ఢిల్లీ అంటే ఏంటో తెలియదు. బయటనుంచి వచ్చాను. ఒక ఔట్‌సైడర్ ఢిల్లీ వచ్చి ఇన్సైడర్ వ్యూ చూశారు. నేను ఇక్కడ రాజకీయాలు చేయాలని రాలేదు. ఇక ప్రభుత్వం లోపల కూడా అనేక ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమతమ సొంత రాజ్యాలు నడిపిస్తున్నారు. ఒక శాఖ మరోశాఖతో కొట్టుకుంటోంది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు ఒకే ప్రభుత్వంలో రెండు శాఖలు కొట్టుకుంటున్నాయి. ఒకే దేశానికి చెందిన ప్రజలు ఇలా చేస్తే దేశం ఎలా ముందుకెళ్తుంది? ఇలాంటి గోడలను పడగొట్టడానికి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. మన దేశంలో పాప కొంచెం పెద్దదయ్యిందంటే చాలు.. బయటకెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, వెళ్లగానే ఫోన్ చెయ్యి అంటారు. అదే పిల్లాడిని అడుగుతున్నారా? ఎక్కడకు వెళ్తున్నావని, ఏం చేస్తున్నావని అడిగితే ఇన్ని అత్యాచారాలు జరిగేవా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా. వాళ్లమీద తల్లిదండ్రులు ముందునుంచి తగిన నియంత్రణలు పెడితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశంలో జరుగుతున్న అత్యాచారాలు చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నా. మన దేశంలో ఉన్న మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా.. వాళ్ల తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టద్దని అడిగితే ఇన్ని ప్రాణాలు పోవు కదా! హింసాత్మక మార్గంలోకి వెళ్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కొంత ఇచ్చారు. భుజాల మీద తుపాకులు పెట్టుకుని మీరు భూమాతను రక్తసిక్తం చేస్తారు. అదే భుజాల మీద నాగలి పెట్టుకుంటే అదే భూమాత పచ్చగా మారుతుంది. ఎందుకీ రక్తపాతం? అశోకుడు కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు. కానీ యుద్ధాలు వదిలి బుద్ధుడి మార్గం వైపు మళ్లారు. మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక ప్రభుత్వ కార్యాలయాలు సమయానికి తెరుచుకుంటాయని అంతా అన్నారు. కానీ దానివల్ల నాకు ఆనందం కాదు.. బాధ అనిపిస్తోంది. ఈ దేశంలో ప్రభుత్వాధికారులు సమయానికి ఆఫీసులకు వెళ్లడం అంటే పెద్ద వార్త అవుతుందా.. అవుతోందంటే మనమంతా బాధపడాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ల సామర్థ్యం చాలా ఎక్కువ ఉంది. చప్రాసీ నుంచి సెక్రటరీ వరకు అందరికీ శక్తి సామర్థ్యాలున్నాయి, వాటిని నేను మేల్కొలిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇదే మాట నేను 16 మే నాడు చెప్పలేను. కానీ ఈ మూడు నెలల అనుభవంతో ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. దౌర్భాగ్యం ఏమిటంటే, మనం ఎక్కడైనా ఎవరి వద్దకైనా ఏదైనా పనిమీద వెళ్తే, 'ఇందులో నాకేమొస్తుంది' అంటారు. ఏమీ రాదనిపిస్తే, నాకేమిస్తావని అడుగుతారు. ఇదే మన దేశదుస్థితికి కారణం. ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. వాటిలో అనేక పతకాలు వచ్చాయి. అయితే ఈ పతకాలు తెచ్చినవాళ్లలో 39 మంది అమ్మాయిలున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెబుదాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభివృద్ధి మాత్రమే మార్గం. సుపరిపాలన మాత్రమే మార్గం. ఈ రెండింటితోనే మనం ముందుకు వెళ్దాం. ప్రైవేటు ఉద్యోగులను అడిగితే ఉద్యోగం చేస్తున్నామంటారు. అదే ప్రభుత్వోద్యోగులైతే సేవ చేస్తున్నా అంటారు. ఈ భావాన్ని పునరుజ్జీవింపజేద్దాం. దేశ ప్రజలంతా ఒక్క అడుగు ముందుకు వేస్తే దేశం కోటీ 25 లక్షల అడుగులు ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి జనధన యోజన అనే కార్యక్రమంతో దేశవాసులను పేదరికం నుంచి బయటకు తీసుకు రావాలి. దేశంలో చాలామందికి మొబైల్ ఫోన్లున్నాయి గానీ బ్యాంకు ఖాతాలు లేవు. ఈ పథకం కింద డెబిట్ కార్డుతో పాటు ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయల జీవిత బీమా కూడా అందిస్తాం. ఏ కుటుంబంలోనైనా ఏమైనా జరిగితే వాళ్లకు ఈ లక్ష రూపాయలు అండగా ఉంటాయి. మన దేశంలో ఎక్కువ మంది యువకులున్నారు. దేశానికి నైపుణ్యం ఉన్న వాళ్ల అవసరం ఉంది. 'స్కిల్ ఇండియా'ను మనం రూపొందించుకోవాలి. అందరూ రండి .. దేశాన్ని తయారుచేసుకుందాం. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వీళ్లందరూ దేశ నిర్మాతలు. ప్రపంచంలో ఎక్కడైనా చదవండి. కానీ నిర్మాణం ఇక్కడ చేయండి. 'కమ్.. మేక్ ఇన్ ఇండియా'. మేడిన్ ఇండియా అనే బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగాలి. మన దేశంలో శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రపంచానికి చేసి చూపిద్దాం.. 'మేడిన్ ఇండియా'. ఏదైనా మనం విదేశాల నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవాలి? దిగుమతులు మానేసి.. ఎగుమతులు చేసే స్థితికి మనం రావాలి. ప్రతి ఒక్కళ్లూ మనం దిగుమతి చేసుకునే ఒక్కో వస్తువును సొంతంగా చేయడానికి ప్రయత్నించండి. రెండు విషయాల్లో మీరు రాజీ పడొద్దు. అందులో ఒక్కలోపం కూడా ఉండకూడదు. అలా ఉంటే విదేశాల నుంచి అవి తిరిగొస్తాయి. అలాగే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకూడదు. 'జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్'లా ఉండాలి. మన దేశాన్ని పాములు ఆడించుకునేవాళ్ల దేశమని అన్నారు. కానీ మన నైపుణ్యం గురించి వాళ్లకు తెలియదు. కంప్యూటర్లను మునివేళ్ల మీద ఆడించే సామర్థ్యం మనవాళ్లకు ఉంది. డిజిటల్ ఇండియాను రూపొందించాలి. దేశంలోని మారుమూల గ్రామంలో కూడా డిజిటల్ పాఠాలు చెప్పగలిగితే అప్పుడు ఉపయోగం ఉంటుంది. డాక్టర్లు చేరుకోలేని చోట టెలిమెడిసిన్ పనిచేస్తే.. దాని ఉపయోగం ఉంటుంది. మొబైల్ గవర్నెన్స్ మనం సాధించగలమా? పనులన్నింటినీ నడుచుకుంటూనే మొబైల్ గవర్నెన్స్ ద్వారా చేసుకోగలిగేలా ఉండాలి. మన దేశానికి పెట్రోలు దిగుమతులు తప్పనిసరి. కానీ వాటి తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నవి ఎలక్ట్రానిక్ పరికరాలే. వీటిని సొంతంగా చేసుకోగలిగితే దేశానికి బోలెడంత ఖర్చు మిగులుతుంది. ఒకప్పుడు రైళ్లు దేశాన్ని అనుసంధానం చేస్తాయని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఐటీ అలా అనుసంధానించాలి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు తదితరులు ముందు వరుసలో ఆశీనులయ్యారు. వెన్నునొప్పితో బాధపడుతున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వేడుకలకు హాజరయ్యారు. -
త్వరలో ఎర్రకోటలో ఏఎస్ఐ తవ్వకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం పురానా ఖిలాలో తవ్వకాలు జరుపుతున్న భారత పురావస్తు శాఖ త్వరలో ఎర్రకోటలో కూడా తవ్వకాలు జరపనుంది. అయితే పురానా ఖిలాలో తవ్వకాల పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటపై దృష్టి సారించనున్నారు. ఈ విషయమై పురావస్తు విభాగం ప్రధాన పర్యవేక్షణ అధికారి వసంత్‌కుమార్ స్వరంకర్ మాట్లాడుతూ... ‘రెండుచోట్ల ఒకేసారి తవ్వకాలు జరిపేందుకు తగినంత సిబ్బంది మాకు అందుబాటులో లేరు. అందుకే పురానా ఖిలాలో పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటలో తవ్వకాలు ప్రారంభిస్తాం. మొదట ఎర్రకోటలోని మెహతాబ్ బాగ్ ప్రాం తంలో మొదలుపెడతాం. ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామ్ సంగ్రహాలయ్, మొఘల్ గార్డెన్ వరకు విస్తరించి ఉంది. ఎర్రకోటలో ప్రధానంగా రెండు గార్డెన్లు ఉన్నాయి. ఒకటి మెహతాబ్ గార్డెన్ కాగా రెండోది హయత్ భక్ష్ గార్డెన్. వీటిని 1648లో నిర్మించారు. అయితే 1863లో బ్రిటిష్‌వారు భక్ష్ గార్డెన్‌ను ధ్వంసం చేశారు. ఈ ధ్వంసకాండ ఎర్రకోట బయట, లోపల కూడా సాగింది. ఆ తర్వాత కాలంలో ఈ గార్డెన్లను సరిదిద్దారు. ఇక మెహతాబ్ గార్డెన్‌ను షాజహాన్ హయాంలో నిర్మిం చారు. దీనిని కూడా బ్రిటిషర్లు ధ్వంసం చేశారు. ఈ గార్డెన్ ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఓ మైదానంలా ఉంది. అప్పట్లో దీనిని మూన్లైట్ గార్డెన్ అని కూడా పిలిచేవారు. ఈ గార్డెన్ మధ్యలో ఎర్రటి రాయితో లాల్ మహల్‌ను నిర్మించారు. అయితే ఈ గార్డెన్ నిర్మాణ నమూనాను గుర్తించేందుకే ఇక్కడ తవ్వకాలు నిర్వహించాలనుకుంటున్నాం. అంతేకాకుండా నీటి వనరులు, ఫౌంటెయిన్లు, కాలిబాటలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తాం. మొఘలుల కాలంలో జలవనరులు, కాలువల వంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. పైగా వాటి నిర్మాణశైలి ఇప్పటికీ అద్భుతమే. తవ్వకాల పనులు పూర్తయిన తర్వాత మెహతాబ్ గార్డెన్ మళ్లీ నిర్మించే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తామ’న్నారు. విద్యుత్ పొదుపునకు ఎల్ఈడీ లైట్లు... ఇదిలాఉండగా ఎర్రకోట అందాలను ధ్విగునీకృతం చేస్తూనే విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మే మాసాంతంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇటీవల పురానాఖిలాలో తవ్వకాలు ప్రారంభించిన పురావస్తుశాఖకు అక్కడ అనేక పురాతన, అరుదైన వస్తువులు దొరికాయి. వాటిని త్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఈ ప్రదర్శనను తొలిరోజు 10,000 మంది, రెండో రోజు 4,000 మంది చూసే అవకాశముందని భారత పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. -
ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!
న్యూఢిల్లీ: ఎర్రకోటపై మరోమారు దాడి చేసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నారు. ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తాజాగా ఎర్రకోటపై దాడి చేసేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. వఖాస్ అనే తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆ తీవ్రవాది నుంచి ఎర్రకోట ఫోటోగ్రాఫ్ లు, అందుకు సిద్ధం చేసిన ప్రణాళికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు వఖాస్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా జమ్మూలో కతువా ప్రాంతంలో శక్రవారం తీవ్రవాదుల దాడికి పూనుకున్నారు. రెండు చోట్ల చేసిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో సైనికుడు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆర్మీ బలగాలు ఎదురుదాడి చేసి ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చారు. -
సంకుచితత్వం పనికిరాదు: మన్మోహన్సింగ్
మోడీపై మన్మోహన్ వాగ్బాణాలు అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని తీరు మారాలంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు రాజకీయ స్థిరత్వం, ఐకమత్యంతోనే ప్రగతి తొమ్మిదేళ్ల పాలనలో మేమెంతో సాధించాం ఏడాదిలో 10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ సింధురక్షక్ ప్రమాదం జాతిని కలచివేసింది భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. న్యూఢిల్లీ: భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదని ప్రధాని మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు. చారిత్రక ఎర్రకోట నుంచి గురువారం చేసిన 67వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బీజేపీ ‘ప్రధాని అభ్యర్థి’ నరేంద్ర మోడీపై ఆయన పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఇకనైనా కట్టిపెట్టాలంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆర్థిక మందగమనం మరెంతో కాలం ఉండబోదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో యూపీఏ సంకీర్ణం సాధించిన విజయాలను అరగంటపాటు హిందీలో చేసిన ప్రసంగంలో ఏకరువు పెట్టారు. 81 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత పథకం త్వరలో పార్లమెంటు ఆమోదం పొందుతుందని ధీమా వెలిబుచ్చారు. వాయువేగంతో అభివృద్ధి సాధించనిదే పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి లక్ష్యాలను సాధించలేమన్నారు. ప్రధానిగా వరుసగా పదోసారి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో పలు అంశాలపై మన్మోహన్ వెలువరించిన అభిప్రాయాలు... సహనమే ఆభరణం: సంకుచిత భావజాలాలు, ఒంటెత్తు పోకడలు పెచ్చరిల్లకుండా తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. సహనశీలతను, భిన్న ఆలోచనా ధోరణులను గౌరవించడాన్ని మన దేశ సంసృ్కతీ సంప్రదాయాలు మనకు బోధించాయి. వాటిని బలోపేతం చేయాలి. ఈ దిశగా పాటుపడాల్సిందిగా పార్టీలకు, సమాజంలోని అన్ని వర్గాలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశం ప్రగతి పథంలో ముందుకు సాగి అజ్ఞానం, పేదరికం వంటి రుగ్మతలను రూపుమాపేందుకు రాజకీయ స్థిరత్వం, సామాజిక ఐకమత్యం తప్పనిసరి. పాక్! పద్ధతి మార్చుకో...: పొరుగు దేశాలన్నింటితోనూ మేం స్నేహమే కోరుతున్నాం. అయితే పాకిస్థాన్ వైపు నుంచి పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడాల్సిందే. అలాంటి కార్యకలాపాలను పాక్ అరికట్టినప్పుడే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడేందుకు ఆస్కారముంటుంది. నియంత్రణ రేఖ వద్ద ఇటీవల భారత జవాన్లను కాల్చి చంపిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం. పాలనలో ఎంతో సాధించాం: వచ్చే 12 నెలల్లో 10 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం. నూతన నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి రూ.10 వేల గ్రాంట్ అందజేస్తాం. త్వరలో మరిన్ని రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తాం. యూపీఏ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. వర్తక, వాణిజ్యాలకు అనువైన వాతావరణం కల్పించాం. పారదర్శకతకు పెద్దపీట వేసి, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కు చట్టం తెచ్చాం. ప్రగతి దిశగా పరుగులు: ఎనిమిది కొత్త విమానాశ్రయాలు, రెండు కొత్త నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లతో సహా పలు మౌలికాభివృద్ధి ప్రాజెక్టులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇవి దేశ ప్రగతికి తోడ్పడటమే గాక ఎంతోమందికి ఉపాధి కల్పించగలవు. అయితే దేశ విద్యా వ్యవస్థను సంస్కరించేందుకు మరెంతో చేయాల్సి ఉంది. అలాగే మన బాలలకు పరిశుభ్రమైన పౌష్టికాహారం అంది తీరాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ దిశగా మెరుగుపరచాలి. జలాంతర్గామి పేలుడు బాధాకరం: ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని నష్టపోవడం చాలా బాధాకరం. అందులోని 18 మంది వీర జవాన్లు దుర్మరణం పాలై ఉంటారన్న వార్త మనసును కలచివేస్తోంది. ఇటీవలి ఉత్తరాఖండ్ వరద విలయం జాతికి తీరని దుఃఖం మిగిల్చింది. మందగమనం ఎక్కువ కాలం ఉండదు: దేశ ఆర్థిక రంగంలో నెలకొన్న మందగమనం ఎక్కువ కాలం ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో మనం సగటున 7.9 శాతం సాధించిన ఆర్థిక వృద్ధిరేటే మన సామర్థ్యం ఏమిటో తెలియజేస్తోంది. 2012-13లో నమోదైన ఈ దశాబ్దిలోకెల్లా కనిష్ట వృద్ధి రేటు 5 శాతాన్ని మెరుగుపరుచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు సాధించగలమని ఆశిస్తున్నాం. ఆహార భద్రతతో 81 కోట్ల మందికి లబ్ధి: ఆహార భద్రత చట్టం కోసం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేశాం. ప్రస్తుతం ఆహార భద్రత బిల్లు పార్లమెంటు ముందు ఉంది. ఈ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నా. ఆహార భద్రత చట్టం వల్ల 75 శాతం గ్రామీణ జనాభా, సుమారు 50 శాతం పట్టణ జనాభాకు లబ్ధి చేకూరుతుంది. మన్మోహన్ నోట పీవీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో దివంగత ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావును మన్మోహన్ స్మరించుకున్నారు. దేశ ప్రగతిలో నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీల పాత్ర మరువలేనిదంటూ ఆయన ప్రశంసించారు. ప్రతి దశాబ్దానికి ఒకసారి చొప్పున దేశం భారీ విధాన మార్పులను చవిచూస్తూ వచ్చిందన్నారు. అయితే మాజీ ప్రధానులు లాల్‌బహదూర్ శాస్త్రి, వాజ్‌పేయిలను మన్మోహన్ ప్రస్తావించకపోవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. వారి సేవలను ఎలా విస్మరించగలిగారని విపక్ష నేత సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిర తర్వాత.. న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకునిప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ విధంగా పతాకావిష్కరణ చేయడం వరుసగా పదోసారి. తద్వారా నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబానికి వెలుపల ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ప్రధానిగా మన్మోహన్ నిలిచారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఎర్రకోటపై పదిసార్లకు మించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెహ్రూ వరుసగా 17 సార్లు పతాకావిష్కరణ చేయగా, ఇందిరకు ఈ గౌరవం 16 సార్లు దక్కింది. -
ఎర్రకోట పై జాతీయజెండా ఆవిష్కరించిన ప్రధాని
-
ఢిల్లీకి ‘ఉగ్ర’ ముప్పు
పంద్రాగస్టు నేపథ్యంలో దాడులకు లష్కరే కుట్ర ఎర్రకోట, ప్రధాన మార్కెట్లలో భారీ విధ్వంసానికి రెక్కీ తమ ఉగ్రవాదులు హస్తినలో దాడి చేస్తారని గత నెలలో సయీద్ ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. పంద్రాగస్టు నేపథ్యంలో ఢిల్లీ చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్లలో భారీ దాడులకు లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు సమాచారం. దీని కోసం రెక్కీలు కూడా చేసినట్లు నిఘా సంస్థ(ఐబీ) పసిగట్టింది. దీంతో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. పంద్రాగస్టు, ఆ తర్వాత రాఖీ తదితర పండుగలు రానున్న నేపథ్యంలో ఎర్రకోట, చాందినీ చౌక్, కన్నాట్‌ప్లేస్, ఢిల్లీ కంటోన్మెంట్లలో దాడులకు ముష్కరులు వారం కిందట రెక్కీ చేశారని ఐబీ నగర పోలీసులకు తెలిపింది. తమ ఉగ్రవాదులు హస్తినలో దాడులకు పాల్పడతారని లష్కరే తోయిబా నేత సయీద్ హఫీజ్ గత నెల పాక్‌లో ఓ ప్రసంగంలో హెచ్చరించినట్లు తెలిపింది. ‘ముంబై’ దాడుల ఉగ్రవాది కసబ్ ఉరికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. దీంతో పోలీసులు ప్రధాన మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్న ఎర్రకోటతోపాటు, పార్లమెంటు వద్ద నిఘాను పటిష్టం చేశారు. పంద్రాగస్టు, రాఖీ, కృష్ణ జన్మాష్టమి వంటి వేడుకల్లో మార్కెట్లు రద్దీగా ఉంటాయని కనుక ఉగ్రవాదులు దాడుల కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం. 2000లో ఎర్రకోటపై జరిగిన ఉగ్రదాడిని పునరావృతం చేయాలని సయీద్ పిలుపునిచ్చిన ట్లు తెలుస్తోంది. కాశ్మీర్, పాలస్తీనా, మయన్మార్‌లలో అణచివేతకు గురవుతున్నవారు ఈద్‌ను స్వేచ్ఛగా జరుపుకునే రోజు దగ్గర్లోనే ఉందని హఫీజ్ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యల వెనుక దాడుల హెచ్చరిక ఉందని నిఘా వర్గాల అనుమానం. సయీద్ లాహోర్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ప్రసంగింస్తూ.. కసబ్ ఉరికి ప్రతీకారం తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.