దేశానికి పలువురు మహనీయులు అసమాన సేవలు అందించినా వారిని మరుగుపరిచేందుకు గాంధీ, నెహ్రూ కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి పలువురు నేతలు స్వాతంత్రోద్యమంలో విశేష సేవలందించినా గాంధీ, నెహ్రూ కుటుంబానికే పేరుదక్కేలా ప్రయత్నాలు సాగాయని అన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందన్నారు.