Subhash Chandra Bose
-
సుభాష్ చంద్రబోసు నివాళి అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్
-
నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా ఎంపీలు బోస్, అవినాష్‌రెడ్డి
సాక్షి, కోనసీమ జిల్లా: నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్‌సభ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. -
నేతాజీ అస్తికలు తెప్పించండి: ప్రధానికి బోస్ కుమార్తె లేఖ
కోల్‌కతా: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని అతని కుమార్తె అనితా బోస్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్థంతి అని, ఈ సందర్భంగా ఆయన అస్తికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నానంటూ ఆమె ప్రధానికి లేఖ రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకైక కుమార్తె అనితా బోస్ ప్రధానికి రాసిన లేఖలో తన తండ్రి అస్తికలను భారతదేశానికి తీసుకువచ్చి, తమకు అందించాలని వాటితో తాను తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించే సమయం ఇది. అతని అస్తికలను భారతదేశానికి తీసుకురావాలి. నేను నా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఇది నా తండ్రి చివరి కోరిక. అందుకే నేను ఈ లేఖ రాస్తున్నాను. నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను బయటపెట్టడానికి ప్రధాని చేసిన ప్రయత్నాన్ని మేమంతా మెచ్చుకుంటున్నాం.నేతాజీ 1945, ఆగస్టు 18న మరణించారని, ఆయన అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉంచారని దర్యాప్తు నివేదికల్లో వెల్లడయ్యింది. నేతాజీ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ఆగస్టు 18న నేతాజీ వర్థంతి. ఆరోజు నాటికి ఆయన అస్తికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలి. నేతాజీ అస్తికలను ఇంకా జపాన్‌లో ఉంచడం అవమానకరం’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.మీడియాతో నేతాజీ మనుమడు చంద్రకుమార్ బోస్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. నేతాజీ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని, స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్న నేతాజీ అస్తికలను మన దేశంలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం నేతాజీ కుమార్తె అనితా బోస్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారని చంద్ర కుమార్ బోస్ తెలిపారు.కాగా రెంకోజీ టెంపుల్ అథారిటీ నేతాజీ అస్తికలను భారత ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1945, ఆగష్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారు. అయితే దీనిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2017లో ఆర్టీఐ (సమాచార హక్కు)కింద నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించింది. -
నేతాజీ జయంతి.. స్వాతంత్ర్య సమరయోధుడికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ శుభాష్ చంద్రబోస్ 127వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులు ఆర్పించారు. నేతాజీ దేశ సేవను, ధైర్య సాహసాలను సీఎం జగన్ ప్రశంసించారు. స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని అన్నారు. .నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. చదవండి: CM Jagan: వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/Qoztfg3awD— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2024 -
భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ప్రజల్లో తిరుగే ప్రజాప్రతినిధులు ఏది మాట్లాడినా కొన్ని నిమిషాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వ్యక్తులు దేశంలోని కీలక వ్యక్తులు గురించి మాట్లాడేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే, తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు కాదని ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వివరాల ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ భారత్‌కు తొలి ప్రధాని కాదని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు, మన తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బ్రిటిషర్లలో సుభాష్ చంద్రబోస్ భయం రేకెత్తించడంతోనే వారు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారని అన్నారు. అలాగే, మనం నిరాహార దీక్షలతో స్వాతంత్ర్యం పొందలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపడం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. బ్రిటిష్ వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం కలిగించడం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని బాబాసాహెబ్ ఓ పుస్తకంలో రాశారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటన చేసిన సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. ఇదే సయమంలో మాజీ కేంద్ర రైల్వే, టెక్స్టైల్స్ మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు దేశం విడిచివెళ్లారని ఆయన కామెంట్స్ చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 'Not Nehru, but Subhas Chandra Bose is the first PM of the country': Karnataka BJP MLA Basangouda Patil Yatnal pic.twitter.com/N8Ck6uZTcW — The Jaipur Dialogues (@JaipurDialogues) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన.. కర్నాటకలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆయన ఇటీవల జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. -
'బెంగాల్ విభజనను సమర్థించింది ఎవరో..?' ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
ఢిల్లీ:నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశ చరిత్రపై మాట్లాడుతూ ధోవల్ వంచకుల పక్షాన చేరిపోయాడని సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. బెంగాల్ విభజనకు మద్ధతు తెలిపిన వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు. జనసంఘ్ తదనంతరం బీజేపీగా అవతరించింది. ధోవల్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్..నేతాజీ గాంధీపై ఛాలెంజ్ చేశారా? బోస్ వామపక్షవాదా? లౌకికవాదా? అని ప్రశ్నలు సందిస్తూ బోస్ ఉంటే దేశం విడిపోకుండా ఉండేదా? ఎవరు చెప్పగలరు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నేతాజీ అన్నయ్య శరత్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బెంగాల్ విభజనను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమర్థించారని అన్నారు. నెహ్రూ, బోస్ జీవితాలపై రుద్రాంక్షు ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ధోవల్‌కు పంపిస్తానని జైరాం రమేశ్ అన్నారు. ఆ విధంగానైనా ధోవల్ సరైన చరిత్రను తెలుసుకుంటారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అజిత్ ధోవల్ మాట్లాడారు. బోస్ ధైర్య సాహసాల గురించి చెప్పే క్రమంలో.. నేతాజీ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి. Mr. Ajit Doval who doesn’t speak much has now joined the tribe of Distorians. 1. Did Netaji challenge Gandhi? Of course he did. 2. Was Netaji a leftist? Of course he was. 3. Was Netaji secular? Of course staunchly and stoutly so. 4. Would Partition not have happened if… pic.twitter.com/Uo8BZCQ51f — Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2023 ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే మనదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్జీ) అజిత్ ధోవల్ చెప్పారు. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(అసోచామ్) శనివారం ఢిల్లీలో నిర్వహించిన మొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ‘బోస్ నాయకత్వ సామర్థ్యాలు అసాధారణమైనవి. ఆయన దేశాన్ని కుల, మత, జాతి విభజనలకు అతీతమైన ఒక వాస్తవంగా గుర్తించారు. ఐక్య భారతం కోసం ఆయన కలలుగన్నారు. ఆయన ప్రసిద్ధ నినాదం కదమ్ కదమ్ బధాయే జా’అన్ని వర్గాల ప్రజలను కదిలించింది. ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన మహ్మద్ అలీ జిన్నా సైతం చంద్రబోస్ ఒక్కరినే నాయకుడిగా గుర్తిస్తానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి బోస్ జీవించి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు’అని దోవల్ పేర్కొన్నారు. నేతాజీ తన జీవితంలోని వివిధ క్లిష్టమైన దశల్లో సాహసోపేతంగా వ్యవహరించారు. అప్పట్లో తిరుగులేని నేతగా ఉన్న గాంధీని సైతం నమ్మిన సిద్ధాంతం కోసం ఎదిరించిన ధైర్యం ఆయన సొంతం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్లీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు’అని ఎన్ఎస్జీ అప్పటి పరిణామాలను గుర్తు చేశారు. ప్రజల సామర్థ్యాలపై నేతాజీకి అపారమైన నమ్మకం ఉండేదన్నారు. దేశాభివృద్ధిపై ధోవల్ మాట్లాడుతూ.. ‘మన దేశానికున్న అతిపెద్ద బలం మానవ వనరులు...చురుకైన నిబద్ధత కలిగిన శ్రామికశక్తి. క్లిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, మన శ్రామిక శక్తిని అంతర్జాతీయంగా పోటీ పడేలా నైపుణ్యాలను పెంపొందించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి’అని అన్నారు. -
ఆ ఊరే ఓ సైన్యం!
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా ఇప్పటికే 25 మంది సైన్యంలో అడుగుపెట్టారు. మరికొందరు అదే బాటలో సిద్ధమవుతున్నారు. ఆటల్లో ముందుండే తాడ్వాయి యువత దేశ సేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో యువతకు దేశభక్తి ఎక్కువ. దేశ సేవ కోసం వారు త్రివిధ దళాల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఆర్మీలో చాలా మంది చేరారు. సెలవుల్లో వచ్చినపుడల్లా గ్రామానికి చెందిన యువతకు సైన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యువత సైన్యంలో చేరడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి అనే సైనికుడు రెండేళ్ల నాడు చనిపోయాడు. ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపే యువతను గ్రామానికి చెందిన సైనికులు ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో.. తాడ్వాయి గ్రామానికి చెందిన యువకులు త్రివిధ దళాల్లో వివిధ స్థాయిల్లో పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రక్షణలో తమవంతు పాత్ర పోశిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వారు పనిచేస్తున్నారు. అంతేగాక గ్రామానికి చెందిన పలువురు పోలీసు శాఖలోనూ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామం నడిబొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం తాడ్వాయికి చెందిన సైనికులంతా కలిసి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిని నింపారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. యువతను ప్రోత్సహించేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాడ్వాయికి చెందిన విద్యార్థులు, యువకులు ఆటల్లో ఎంతో పేరు గడించారు. వారిలో చాలా మంది ఆర్మీలో, పోలీసు శాఖలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. గర్వంగా ఉంది.. నా కొడుకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తుండడం గర్వంగా అనిపిస్తుంది. మా గ్రామంలో యువకులు ఒకరిని నుంచి ఒకరు దేశ సేవకు అంకితమవుతున్నారు. నా కొడుకు సైన్యంలో చేరాలనుకున్నపుడు ప్రోత్సహించి పంపించాను. –తానయ్యోల బాపురావు, సైనికుడి తండ్రి, తాడ్వాయి నేను పోలీసు కావాలనుకున్నా.. నాకు పోలీసు అవ్వాలని ఉండే. నేను కాలేకపోయా ను. నా కొడుకు సైన్యంలో చేరాడు. నా కోరిక నా కొడుకు రూపంలో తీరింది. దేశ సేవ కోసం సై న్యంలో చేరడాన్ని గొప్పగా ఫీలవుతాను. చాలా మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. – ఆకిటి రాజిరెడ్డి, సైనికుడి తండ్రి, తాడ్వాయి మా గ్రామానికే గర్వకారణం మా గ్రామం నుంచి 25 మంది సైన్యంలో పనిచేస్తుండడం మాకెంతో గర్వంగా ఉంది. సై న్యంలో పనిచేస్తూనే గ్రామంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వారిని చూసి గ్రామం గర్వంగా ఫీలవుతుంది. వాళ్ల దారిలో చాలా మంది నడవడానికి ముందుకు వస్తున్నారు. –సంజీవులు, సర్పంచ్, తాడ్వాయి -
ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎన్.రెడ్డప్ప తెలిపారు. వారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు: ఎంపీ తలారి రంగయ్య అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ అది క్లోజ్డ్ చాప్టర్ కాదు.. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వమని అడుగుతూనే ఉంటాం. విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదు. అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్ కి వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే..: సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది. బడ్జెట్లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం. ప్రత్యేక హోదా కోరిక నెరవేర్చకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడం వంటివి బాధపెట్టాయి. దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు. అమరావతిలోని ఎయిమ్స్ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు.. మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదు. అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లే పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలి. ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందని ఎంపీ అన్నారు. ప్రత్యేక హోదా రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు: రెడ్డప్ప ఎంపీ ఎన్. రెడ్డప్ప మాట్లాడుతూ, బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కానీ దేశవ్యాప్తంగా తనకు మనుగడ లేకుండా చేసుకుంది. అనేక సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారు. ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. కచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటాం. రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే... ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఎంతో అనుభవం ఉందన్న చంద్రబాబు కనీసం కుప్పానికి మంచినీళ్లు కూడా తీసుకురాలేకపోయాడు. కుప్పంలో లోకేశ్‌కు కనీసం వెయ్యి మంది కూడా రావడం లేదు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయ్యింది లోకేష్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీఎం జగన్ ప్రభంజనం ఉంటుందని రెడ్డప్ప అన్నారు. చదవండి: థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. మా కల నెరవేరుస్తున్నారు’ -
Subhash Chandra Bose: ఉర్రూతలూగించిన నేత!
క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి ఉన్న సేవాతత్పరుడు సుభాష్ చంద్రబోస్ మరణించి 78 ఏళ్లవుతోంది. అయినా ఆయన మరణానికి కారణమని చెబుతున్న విమాన ప్రమాద కారణం నేటికీ జవాబులేని ప్రశ్నగా నిలిచి పోయింది. ప్రభావతీ దేవి, జానకీ నాథ్ బోస్ దంపతుల సంతానంలో తొమ్మిదోవాడుగా సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. ఐసీఎస్‌లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరణ పొందారు. ఉప్పు సత్యా గ్రహం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి అనేక జైళ్లలో తిప్పి, చివరికి దేశ బహిష్కరణ శిక్ష వేసింది. 1933లో ‘ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకాన్ని రాశారు. తండ్రి మరణంతో భారత్‌కు తిరిగి రాగా, ఆరోగ్యం క్షీణిస్తే, చికిత్స కోసం ప్రజలు చందాలువేసి మరీ వియన్నా పంపారు. అప్పుడే యూరప్ పర్యటించారు. ఆ రోజుల్లోనే ముస్సోలినీ, హిట్లర్, రోమరోల వంటివారిని కలిశారు. నెహ్రూ అధ్యక్షతన లక్నోలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలో దిగగానే ఆయనను ఖైదు చేసి ఎరవాడ జైలుకు పంపారు. 1937లో విడుదల కాగానే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు! ఆది ఆయన పట్ల అసూయాపరులను పెంచింది. రెండవ పర్యాయం మళ్ళీ పోటీజేసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గెలుపు కోసం ప్రయత్నించకుండానే పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అయితే గాంధీజీకి ఆయన అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. దీంతో బోస్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. వారపత్రిక కూడా వెలువరించడం మొదలు పెట్టి మరోసారి దేశమంతా పర్యటించారు. 1942 జనవరి 26న పులి బొమ్మతో రూపొందించిన జండా ఎగరేసి, బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. 1941 ఫిబ్ర వరి 27న ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు. మహిళలకు రంగూన్లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. చలో ఢిల్లీ నినాదం ఇచ్చి ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి ఇంఫాల్, అండమాన్, నికోబార్‌లో స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించి సాగిపోయారు. ఇంతలో జపాన్ మీద అణుబాంబు పడ్డది. జపాన్ అతలాకుతలమై పోయింది. బోస్ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అనిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. (క్లిక్ చేయండి: ‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’) – నందిరాజు రాధాకృష్ణ (జనవరి 23 నేతాజీ జయంతి) -
Parakram Diwas: నేతాజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు. 'పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. On Parakram Diwas, we pay homage to one of the greatest sons of Bharat Mata, Netaji Subhas Chandra Bose. Netaji epitomises exceptional courage and patriotism. Under his leadership, millions joined the struggle for India's freedom. Indians will remain forever indebted to him. — President of India (@rashtrapatibhvn) January 23, 2023 'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India. — Narendra Modi (@narendramodi) January 23, 2023 చదవండి: వారణాసిలో సీఎన్జీ బోట్లు -
బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?
హిట్లర్ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్ లైన్స్ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించిన వాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్ వేసుకుని హిట్లర్ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చు కోవడం’ అనే డీల్ కోసం వెళ్లాడు. హిట్లర్ కూడా బ్రిటన్ పై పోరాడు తున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్ సైన్యం నేతాజీకి హెల్ప్ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు అనుకుని వెళ్లాడు. హిట్లర్ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్ లోపల ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్ అంటే లీడర్ అని. నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్.. నేతాజీ వెనక్కు వెళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్!’’ అన్నాడు. హిట్లర్ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్ హింద్’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. నిజమైనా.. కాకున్నా.. .. బోస్ దూకుడు అలాంటిదే. బోస్ ఆత్మస్థర్యం అలాంటిదే. దేశంలోని బ్రిటిష్ వాళ్లనే అతడు లెక్క చెయ్యలేదు. నచ్చనప్పుడు గాంధీజీ మాట కూడా వినలేదు. యూరప్ అంతా తిరిగినవాడికి జర్మనీ ఏంటి? జర్మనీలోని హిట్లర్ ఏంటి? ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అని బోస్ హిట్లర్‌తో అని ఉండేందుకైతే అవకాశం లేకపోలేదు. బోస్పై ప్రామాణికమైన పుస్తకాలు అనేకం వచ్చాయి. వాటిల్లో ‘నేతాజీ ఇన్ యూరప్’ పుస్తకం ఒకటి. అందులో ఈ సందర్భం (బోస్ భుజాలపై హిట్లర్ చెయ్యేసిన సందర్భం) గురించి లేదు. అలాగే బోస్ పై వచ్చిన మరికొన్ని పాపులర్ పుస్తకాలు.. ది స్ప్రింగింగ్ టైగర్, ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్ అప్, ది ఇండియన్ పిలిగ్రిమ్, బోసే స్వయంగా రాసిన ‘లెటర్స్ టు ఎమిలీ షెంకెల్’, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇన్కన్వీయంట్ నేషనలిస్ట్, హిస్ మెజెస్టీస్ అపోనెంట్.. వీటిల్లో ఎక్కడా ఆ ఘటనపై చిన్న ప్రస్తావన కూడా లేదు. చరిత్రలో కొన్ని మిస్ అవుతాయి. చరిత్ర రచనలో అవి ఊహా వాస్తవాలుగా ప్రత్యక్షం అవుతాయి. ఇదీ అలాంటిదే అయినా కావచ్చు. (చదవండి: స్ఫూర్తి యోధులు లాల్ బాల్ పాల్... సమర యోధులు రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య) -
‘జై హింద్’ నినాదకర్త మనోడే!
‘జై హింద్’ నినాదాన్ని ప్రతిపాదించింది హైదరాబాద్ నివాసి సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని అని విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. 1911 ఏప్రిల్ 11న ఫఖ్రుల్ హాజియా బేగం, అమీర్ హసన్ దంపతులకు జన్మించారు ఆబిద్. ఆయన తల్లి స్వాతంత్య్ర సమర యోధురాలు కావడంతో ఆమె బాటలో నడుస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టారు. మహాత్ముని పిలుపు మేరకు చదువుకు స్వస్తి పలికి 1931లో సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తరువాత నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ తలపెట్టిన విప్లవకారులతో పనిచేసి కారాగార శిక్షకు గురైనారు. ‘గాంధీ–ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ... ఇంజినీరింగ్ కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ సుభాష్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి రెండేళ్ళ పాటు బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అనేక దేశాలు తిరిగి వచ్చారు. జర్మనీలో ఉన్న సమయంలో సైనికులు పరస్పరం పలకరించుకోవడానికి ‘నమస్తే’, ‘సలాం అలైకువ్‌ు’ ఇత్యాది మాటలు వాడేవారు. వీటికి బదులుగా దేశభక్తిని చాటే ఏదైనా ఒక నినాదాన్ని సూచించమని నేతాజీ ఆబిద్ హసన్‌ను కోరగా ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. నాటి నుండి జైహింద్ భారత విప్లవ నినాదంగా మారింది. జైహింద్ నినాదానికి నేతాజీనే రూపకల్పన చేశారని చాలా మంది భావిస్తారు. ఆబిద్ హసన్ ప్రతిపాదించిన ఈ నినాదం నేతాజీ కారణంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. ఆబిద్ హసన్ 1984లో 73 సంవత్సరాల వయస్సులో స్వస్థలమైన హైదరాబాదులోనే తుది శ్వాస విడిచారు. – షేక్ అబ్దుల్ హకీం జానీ, తెనాలి (భారత స్వాతంత్య్రఅమృతోత్సవాల సందర్భంగా...) -
ప్రధాని మోదీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారని తెలిపారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి ‘పరాక్రమ్ దివస్’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. -
కంగన ఎఫెక్ట్: గాంధీజీపై నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ మా నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానం’’ అన్నారు. ఉన్నట్లుండి నేతాజీ కుమార్తె.. తన తండ్రి గురించి, గాంధీజీ గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ వివరాలు.. స్వాతంత్య్రం గురించి వివాదం రాజేసి.. అది సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగన. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకున్న గాంధీజీ, నేతాజీకి మధ్య సిద్ధాంతపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. (చదవండి: మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?) ఈ క్రమంలో తాజాగా కంగన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కంగన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు, గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. మరోవైపు మా నాన్నకు గాంధీ గారంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు. ‘‘వారిద్దరు గొప్ప నాయకులు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేం. వారిద్దరిది గొప్ప కలయిక. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది అంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసు’’ అన్నారు అనితా బోస్. (చదవండి: మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్) ‘‘అలానే కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం వ్యర్థం. గాంధీజీ మా నాన్నతో సహా ఎందరికో ప్రేరణగా నిలిచారు. స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం’’ అంటూ పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్. చదవండి: బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్! -
బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్!
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని రక్షించడం కోసం, పరాయి పాలకుల చేతిలో నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించడం కోసం వేలాది మంది దశాబ్దాల పాటు పోరాడారు. ఆ పోరాటంలో భరతమాత ముద్దుబిడ్డల పోరాటఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ ఆ ముద్దుబిడ్డల పేర్లతో మన దేశంలో అనేక గ్రామాలు, వీథులు, ఊర్లు, జిల్లాలు కొత్తగా నామకరణం చేసుకున్నాయి. ఆ కొత్త పేర్లన్నీ భరతమాత పుత్రులవే. మరి భారత దాస్య విముక్తి పోరాటంలో పాలుపంచుకున్న పుత్రికల పేర్లు మన దేశ ముఖచిత్రంలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఇండియన్ రైల్వేస్ మాత్రం తమ వంతుగా బేలాబోస్‌ను గౌరవించింది. ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్‌కు ‘బేలా నగర్’ అని పేరు పెట్టింది. ఈ రైల్వేస్టేషన్ వెస్ట్‌బెంగాల్, హౌరా జిల్లాలో కోల్‌కతా నగరం సబర్బన్‌లో ఉంది. నాటి శరణార్థి శిబిరం! బేలాబోస్ శరణార్థుల కోసం కోల్‌కతా శివార్లలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ఆ ప్రదేశానికి అభయ్‌నగర్ అని పేరు పెట్టింది. ఆ అభయ్ నగర్ స్టేషన్‌నే రైల్వే శాఖ బేలానగర్గా గౌరవించింది. కోల్‌కతా వెళ్లినప్పుడు తప్పక చూడాల్సిన ప్రదేశం బేలానగర్. (చదవండి: మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!) బేలా బోస్ ఎవరు? బేలాబోస్ తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి అన్న. బేలా మీద ఆమె చెల్లెలు ఇలాబోస్ మీద నేతాజీ ప్రభావం ఎక్కువగా ఉండేది. అక్కాచెల్లెళ్లిద్దరూ జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఝాన్సీరాణి బ్రిగేడ్‌లో బాధ్యతలు చేపట్టింది బేలా. ఐఎన్ఐ రహస్య నిఘా విభాగంలో కూడా విజయవంతమైన సేవలందించింది. జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ల కోసం డబ్బు అవసరమైనప్పుడు తన పెళ్లి ఆభరణాలను అమ్మి డబ్బు సమకూర్చింది. భారత్– సింగపూర్ల మధ్య అత్యంత పకడ్బందీగా రహస్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించిందామె. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె కుటుంబానికి పరిమితమైంది. దేశవిభజన తర్వాత శరణార్థుల కోసం ఆమె బెంగాల్లో ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. శరణార్థులకు ప్రభుత్వం పునరావాసం కల్పించే వరకు వారికి బేలాబోస్ ఆశ్రయమిచ్చింది. (చదవండి: మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్) -
నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాబోయే శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకొనేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ అంశాల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం జరగ్గా, తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్‌గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రకటించగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ్ నాయక్ దివస్‌గా ఖరారు చేశారు. ఈ మేరకు వేడుకలు సైతం ప్రారంభించారు. అయితే, నెహ్రూ–గాంధీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చడానికి నేతాజీ వారసత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నేతాజీ పేరును బీజేపీ వాడుకుంటోందని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. నేతాజీ వారసత్వం కోసం పోటీ బీజేపీకి సంబంధించి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషర్లపై పోరాడేందుకు ఇండియన్ నేషనల్ ఆర్మీని(ఐఎన్ఏ) ఏర్పాటు చేసిన ఒక యోధుడు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మాత్రం నేతాజీ బెంగాల్‌కు చెందిన ఒక గొప్ప హీరో, తమ ప్రాంతానికి పేరుతెచ్చిన నాయకుడు. అందుకే సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నేతాజీ వారసత్వం విషయంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను మొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ డీక్లాసిఫై చేయించారని బీజేపీ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే నేతాజీ జన్మదినాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు బీజేపీ ముందుకొచ్చిందని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేస్తున్నారు. -
అది ప్రపంచ రికార్డే..!
సాక్షి, కాకినాడ: ఉగాదికి ‘అందరికి ఇళ్లు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చిందిలేదన్నారు. 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. తప్పనిసరి అయితే తప్ప.. అసైన్డ్ భూములను తీసుకోవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. స్వచ్ఛందం గా భూములు ఇచ్చేవారికి పరిహారం ఇచ్చి భూ సేకరణ చేస్తున్నామని వివరించారు. గోదావరి డెల్టాకు రబీకి కావాల్సిన నీరు ఉందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన పైపుల వల్ల నీరు దిగువకు తక్కువగా వస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు. జిల్లాలో ఇసుక సమస్యను తీర్చేందుకు అనుమతులు ఉన్న రీచ్ లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 3.50 లక్షల మంది లబ్ధిదారులు గుర్తింపు.. అందరికి ఇళ్లు పథకంలో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 7,700 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ భూసేకరణ జరపలేదని పేర్కొన్నారు. విద్య, వైద్య, దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములను సేకరించలేదని వివరించారు. అసైన్డ్ భూములను రైతుల అంగీకారంతోనే అవార్డు ప్రకటించామని చెప్పారు. అది వాస్తవం కాదు.. తెలుగు యునివర్సిటీలో 10 మంది విద్యార్థులు, 14 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఆ యూనివర్శిటీకి 25 ఎకరాల భూమి అవసరం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నామన్నారు. యునివర్శిటీకి నన్నయ్య యునివర్శిటీలో 5 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. యునివర్సిటీ భూములపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తున్నామనేది వాస్తవం కాదని.. మీడియా ఇలాంటి వార్తలు రాసేటపుడు అధికారుల నుండి వివరణ తీసుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోరారు. -
మాజీ మహిళా ఎంపీ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ క్రిష్ణబోస్(89) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘‘వయో సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. రెండోసారి స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించాం. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు’’అని క్రిష్టబోస్ తనయుడు సుమాంత్రా బోస్ తెలిపారు. కాగా 1930లో జన్మించిన క్రిష్ణబోస్.. కోల్‌కతాలోని సిటీ కాలేజీలో దాదాపు నలభై ఏళ్లపాటు లెక్చరర్‌గా పనిచేశారు. అదే కాలేజీలో ఎనిమిదేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువు శిశిర్ కుమార్ బోస్‌ను వివాహం చేసుకున్న ఆమె... 1996లో తొలిసారిగా లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాధవ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. క్రిష్ణబోస్‌కు కుమారులు సుగతా బోస్, సుమంత్రా బోస్, కూతురు షర్మిల ఉన్నారు. కాగా అభిమానులు సందర్శనార్థం క్రిష్ణబోస్ భౌతిక కాయాన్ని తొలుత శరత్‌రోడ్డులోని ఆమె నివాసానికి తరలించారు. అక్కడి నుంచి నేతాజీ భవన్‌కు పార్థివదేహాన్ని తీసుకువెళ్లిన తర్వాత.. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీ భవన్లో క్రిష్ణబోస్‌కు నివాళులు అర్పించనున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున క్రిష్ణబోస్ నివాసానికి చేరుకుంటున్నారు. -
యువతకు స్ఫూర్తిప్రదాత నేతాజీ
నాంపల్లి: యువతరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’ముగింపు వేడుకలు, యువజన అవార్డుల ప్రదానోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాట్లాడుతూ...నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో పనిచేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్ప మహనీయుడు నేతాజీ అని కీర్తించారు. యువజన అవార్డులు గెలుపొందిన వారికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశా రు. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా ఫ్రెండ్స్ యూత్ క్లబ్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రూ.1లక్ష చెక్కుతో పాటుగా రాష్ట్రస్థాయి యువజన పురస్కారాన్ని అందజేశారు. -
ఆనాడు డైరీలో రాసుకున్నారు: మోదీ
న్యూఢిల్లీ: వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర్యానికై ఉద్యమించిన నేతాజీకి భారతావని ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయుల క్షేమం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు... ‘‘జనవరి 23, జనవరి 1897న జానకీనాథ్ బోస్... ‘ మధ్యాహ్నం కుమారుడు జన్మించాడు’ అని డైరీలో రాసుకున్నారు. ఆ కుమారుడు గొప్ప పోరాట యోధుడిగా నిలిచాడు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తన జీవితాన్ని అర్పించాడు. ఆయనను స్మరించుకోవడం మనకు గర్వకారణం’’ అని మోదీ ట్వీట్ చేశారు. కాగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు నేతాజీకి ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. అదే విధంగా బాలాసాహెబ్ ఠాక్రేకు సైతం మోదీ నివాళులు అర్పించారు. ఠాక్రే జయంతి సందర్భంగా.. ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతీయ విలువలకు నిదర్శనంగా నిలిచిన ఆయన.. లక్షలాది మందికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. On 23rd January 1897, Janakinath Bose wrote in his diary, “A son was born at midday.” This son became a valorous freedom fighter and thinker who devoted his life towards one great cause- India’s freedom. I refer to Netaji Bose, who we proudly remember on his Jayanti today. pic.twitter.com/wp3UjudKJ4 — Narendra Modi (@narendramodi) January 23, 2020 నేతాజీకి సీఎం జగన్ నివాళులు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. భారత్ కోసం ఆయన చూపిన తిరుగులేని పోరాటతత్వం, అసమాన దేశభక్తి.. దేశం స్వాతంత్ర్యం పొందడానికి దోహదం చేసిందని సీఎం జగన్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు నేతాజీ స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నట్టు సీఎంవో ట్విటర్లో తెలిపింది. యువతకు స్పూర్తి: విజయసాయిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆయనను స్మరించుకున్నారు. నేతాజీ స్పూర్తితో ఎంతో మంది యువత నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అటువంటి గొప్ప పోరాటయోధుడికి నివాళులు అర్పిస్తున్నా అని ట్వీట్ చేశారు. My humble tributes to one of the greatest heroes of our freedom struggle, Netaji Subhas Chandra Bose, on his birth anniversary. Netaji was an inspiration to thousands of Indian youth to join the struggle for independence. pic.twitter.com/7BtxyDELdO — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2020 -
స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం..
అమరావతి: రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు వచ్చే ఉగాదికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాల పంపణీపై గురువారం మంత్రులు సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాధ రాజు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. జిల్లాల వారిగా స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సుమారు 26 లక్షల 75 వేల 284 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు 11వేల 140 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. త్వరలో జిల్లాల వారిగా పర్యటించి ఇళ్లు నిర్మించడానికి అనుకూలమైన భూమిని గుర్తిస్తామన్నారు. -
రాజీనామా చేస్తేగానీ నేను గుర్తుకు రాలేదా..
చిత్తూరు ,పలమనేరు : ఇప్పుడొచ్చి ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని... రెండు రోజుల్లో తన వర్గీయులతో, కార్యకర్తలతో సమావేశమై వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని మంత్రి అమరనాథరెడ్డికి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెప్పారు. టీడీపీలో తనకు సముచిత స్థానం లేదంటూ రెండు రోజుల క్రితం ఆయన ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కోశాధికారి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయానికల్లా మంత్రి అమరనాథరెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలు బోస్ స్వగృహానికి వెళ్లారు. ఆయన్ను తిరిగి పార్టీలోకి రావాలని బుజ్జగింపులు జరిపారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ ‘మీరంతా మా ఇంటికి వచ్చినందుకు సంతోషం.. అయితే నేను ఓ నిర్ణయం తీసుకున్నా.. దానికే కట్టుబడి ఉంటా..’ అని తేల్చి చెప్పారు. పార్టీలో తనకు గానీ తనను నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదని ముఖ్యమంత్రితో విన్నవించేందుకు చాలాసార్లు ప్రయత్నించానన్నారు. అయితే ఆయన అపాయింట్మెంటు కూడా ఇవ్వనప్పుడు ఆ పార్టీలో తనకు ఏ స్థానం ఉందో అర్థమైందన్నారు. ‘ఇన్నాళ్లు మీకంతా గుర్తుకురాని నేను.. ఇప్పుడు మాత్రం గుర్తుకొచ్చానా ?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రితో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తాం’ అని మంత్రి చెప్పారు. ‘అదంతా కాదు.. నన్ను నమ్ముకున్న వారు ఏ దారిలో వెళ్లమంటే ఆ దారిలో పోతాను గానీ మళ్లీ యూటర్న్ తీసుకోవడం కుదరదు’ అని బోస్ తేల్చి చెప్పారు. -
బలమైన భారత్ కోసం...
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు. అలాగే జలియన్ వాలాబాగ్ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ఘనమైన భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించి నాలుగు మ్యూజియాలను ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. శక్తిమంతమైన భారత్‌ను నిర్మించాలన్న బోస్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ మ్యూజియాన్ని సందర్శించే యువత నేతాజీ జీవితం నుంచి మరింతగా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా. ఎర్రకోటలోని ఈ గోడల్లో చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. వలసపాలకులు ఇక్కడే కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్బ„Š సింగ్ ధిల్లాన్, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్‌లను విచారించారు’ అని ట్విట్టర్లో తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైని కుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు. -
ఆ ఒక్క కుటుంబం కోసం..
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కుటుంబాన్ని కీర్తించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్‌చంద్ర బోస్ లాంటి మహానుభావుల త్యాగాల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. ఈ దిగ్గజాలు పోషించిన చారిత్రక పాత్రను భారతీయులంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుభాష్‌చంద్ర బోస్ అనుచరుల్లో ఒకరైన లాల్టిరామ్ బహూకరించిన టోపీ ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు. వాళ్ల మార్గదర్శనం ఉండి ఉంటే... స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ వ్యవస్థ ఆధారంగానే మన విధానాల్ని రూపొందించారని, బ్రిటిషర్ల దృక్కోణంలోనే ఆలోచించారని మోదీ పేర్కొన్నారు. అందుకే విద్య, ఇతర రంగాలకు సంబంధించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు. ‘భారతదేశ చరిత్ర, విలువల పట్ల నేతాజీ ఎంతో గర్వించేవారు. ఇతర దేశాల కోణంలో అన్నింటిని చూడొద్దని ఆయన బోధించారు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనలో భారత దేశ దుస్థితి పట్ల కలతచెందారు. జాతీయవాదమే ఆయన సిద్ధాంతం. అదే శ్వాసగా బతికారు. వలస పాలన, అసమానత్వంపై పోరాటంలో భాగం గా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బోస్ స్ఫూర్తిగా నిలిచారు. సుభాష్‌చంద్ర బోస్, సర్దార్ పటేల్ లాంటి మహానుభావులు మార్గదర్శనం లభించినట్లయితే పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉండేవి. ఒక కుటుంబాన్ని కీర్తించేందుకు, ఎందరో గొప్ప నాయకుల సేవల్ని విస్మరించడం విచారకరం’ అని మోదీ అన్నారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు. పోలీసు స్మారకానికి ఇన్నేళ్లా?.. విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం స్మారకం ఏర్పాటుచేయడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మోదీ ఆరోపించారు. జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. ‘దేశానికి అంకితం చేస్తున్న ఈ స్మారకం పట్ల గర్విస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇన్నాళ్లూ ఇలాంటి స్మారకాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నిస్తున్నా. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ స్మారక నిర్మాణ పనులకు కొన్ని న్యాయపర అడ్డంకులు తలెత్తిన సంగతిని అంగీకరిస్తున్నా. కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్మారకం ఎప్పుడో పూర్తయ్యేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఖమ్మం గ్రానైట్‌తో స్మారకం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆవిష్కరించి న జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ఖమ్మం గ్రానైట్‌తో తయారుచేయడం విశేషం. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 31 అడుగుల పొడ వు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ రాయి తో ఈ స్మారక చిహ్నన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాధారంలోని గాయత్రి గ్రానైట్స్ క్వారీ నుం చి ఈ రాయిని వెలికితీసి ఢిల్లీకి తరలించారు. ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ గ్రానైట్‌పై ముం దువైపు స్మారక చిçహ్నాన్ని చెక్కారు. ఈ కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్ యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నిఖిల్‌లను హోం శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్
-
గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి పలువురు మహనీయులు అసమాన సేవలు అందించినా వారిని మరుగుపరిచేందుకు గాంధీ, నెహ్రూ కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి పలువురు నేతలు స్వాతంత్రోద్యమంలో విశేష సేవలందించినా గాంధీ, నెహ్రూ కుటుంబానికే పేరుదక్కేలా ప్రయత్నాలు సాగాయని అన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబాస్ ఆజాద్ హింద్ సర్కార్ ప్రకటించిన 75 సంవత్సరాలయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ విలువైన సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. ఎందరో నేతల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వరాజాన్ని సురాజ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు గత నాలుగేళ్లుగా పలు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీని ధరించి పాల్గొనడం గమనార్హం. -
చార్లీ చాప్లినా.. ఆయనెవరు?
హాలీవుడ్ దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ తనను కలవాలని అనుకున్నప్పుడు మహాత్మా గాంధీ అడిగిన ప్రశ్న ఇదే.. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన చార్లీ చాప్లిన్ గురించి నిజంగానే గాంధీజీకి తెలియదట. దాంతో అతని సహచరులు.. చాప్లిన్ ప్రఖ్యాత నటుడని.. పీడిత ప్రజల బాధలను తన చిత్రాల ద్వారా తెలియజెప్పుతుంటారని చెప్పినప్పుడు ఆయన్ను కలవడానికి అంగీకరించారు. 1931, సెప్టెంబర్ 22న లండన్‌లో వారిరువురూ కలిశారు. దానికి సంబంధించిన చిత్రమే ఇదీ. అయితే.. వారి సమావేశం ఫొటోలో కనిపిస్తున్నంత ఆహ్లాదంగా ఏమీ జరగలేదు. ఓ విషయంపై వాగ్వాదంతో వారి మీటింగ్ ముగిసింది. యాంత్రీకరణ సమస్త మానవాళి మనుగడకు, అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని చాప్లిన్ వాదిస్తే.. మెషినరీకి బదులు మానవ వనరుల వినియోగమే కరెక్టని.. ఉపాధి కల్పించినట్టూ అవుతుందని గాంధీజీ వాదించారు. ఇద్దరూ దిగ్గజాలే.. ఇద్దరూ వారివారి వాదనకు కట్టుబడ్డారు. దీంతో వారి సమావేశం అలా వాదోపవాదాల మధ్య ముగిసిందట.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర వివరాలు, ఫొటోలను ‘రోలీ బుక్స్’పబ్లిషర్ ప్రమోద్ కపూర్ తన పుస్తకంnn ‘గాంధీ–యాన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’లో పొందుపరిచారు. వీటిల్లో సలాడ్లు తినాలంటూ గాంధీజీ సుభాష్ చంద్రబోస్‌కు పంపించిన శాకాహార డైట్ ప్లాన్ కూడా ఉంది. ఇందులో ఏ కాయగూరను ఎలా తినాలి.. ఉల్లి, వెల్లుల్లి ఉపయోగాలను మహాత్ముడు విపులంగా వివరించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
'డీఎన్ఏ పరీక్షతో అన్ని అనుమానాలు పోతాయ్'
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్ఏ పరీక్ష చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) మరణంపై ఉన్న అనుమానాలన్నింటికి స్వస్తి పలకవచ్చని ఆయన కూతురు అనితా బోస్ అన్నారు. బోస్‌ను ఖననం చేసిన అవశేషాలు మిగిలి ఉంటాయని వాటి డీఎన్ఏను పరీక్షిస్తే అసలు విషయం తేలిపోతుందని అభిప్రాయపడ్డారు. 'లేయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సి ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్' అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాల పరంపరను పేర్కొంటూ వస్తున్న ఈ కొత్త పుస్తకాన్ని ఆశీష్ రే రాశారు. సుభాష్ చంద్రబోస్ అవశేషాలను 1945 సెప్టెంబర్ నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరుస్తూ వస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా నేతాజీ 121వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. -
బోసూ.. ఏదీ నీ ప్లేసు
జిల్లా టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రి అమరనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో ఇవి బహిర్గతమయ్యే స్థాయికి చేరాయి. మొదటి నుంచి అష్టకష్టాలకోర్చి టీడీపీకి జవసత్వాలు నింపినా.. పార్టీలు మారిన వారికే ప్రాధాన్యం దక్కుతుండడంపై బోస్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా మంత్రి నిర్వహించిన బహిరంగ సభకు బోస్ డుమ్మా కొట్టడంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. పలమనేరు: కష్టకాలంలో క్యాడర్‌ను కాపాడుకుని పార్టీని బలోపేతం చేసిన పలమనేరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి సుభాష్‌చంద్ర బోస్ మంత్రి అమనాథరెడ్డి తీరుపై అంతర్మథంలో పడ్డారా..? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పలమనేరులో శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి, ఆపై జరిగిన ర్యాలీ, బహిరంగ సభకు స్థానిక నేత బోస్ హాజరు కాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం ముగ్గురు మంత్రులు హాజరైన జిల్లా సమన్వయ కమిటీలోనూ చర్చించినట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న వ్యక్తికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బోస్‌ను కుంగదీసినట్టు సమాచారం. దీంతో ఆయన అనుచరులు మంత్రి తీరుపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో బోస్ పరిస్థితి పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఉందంటూ ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో తెలియడం లేదని అంటున్నారు. అమర్ రాక.. బోస్‌కు కాక గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అప్పటినుంచే బోస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో అమర్నాథరెడ్డిపై తృటిలో ఓటమిపాలైన బోస్ వచ్చే ఎన్నికల్లోనైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమర్ పార్టీ ఫిరాయించడంతో బోస్ డైలామోలో పడ్డారు. అయితే చంద్రబాబు తనకు అన్యాయం చేయరనుక్ను బోస్ సీఎం మాట ప్రకారం మంత్రితో ఇన్నాళ్లూ కలసిమెలసి ఉండేవారు. అయితే బోస్‌కు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిపోవడం మొదటి దెబ్బ. అనంతరం బోస్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో నమ్ముకున్న పార్టీ ఇలా చేసేందేమిటనే ప్రశ్న ఆయన్ను వేధించింది. ఫలితంగా పార్టీకి కాస్త దూరంగానే గడిపారు. దీంతో పార్టీని సైతం వీడతారనే ఊహాగానాలు అప్పట్లో మొదలయ్యాయి. ఈ విషయం కాస్తా అధిష్టానానికి తెలసి ఆయన్ని ప్రసన్నం చేసేందుకు రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన కోశాధికారి పదవిని కట్టబెట్టారు. అప్పటికే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవిని పొందిన అమర్ మెల్లమెల్లగా తనప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రభుత్వ పథకాలను మంత్రి మనుషులకు ఇవ్వడం, బోస్ వర్గాన్ని పక్కన పెట్టడం మళ్లీ వర్గపోరుకు ఆజ్యం పోసింది. పట్టణంలో రెండు పార్టీ కార్యాలయాలు, కొన్ని కార్యక్రమాలకు బోస్ వెళ్లకపోవడం తదితర పరిణామాలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో బోస్ గత మూడునెలలుగా పార్టీలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. అసలు రహస్యం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టేనా? అంసతృప్తితో ఉన్న బోస్‌కు అధిష్టానం రాష్ట్ర కోశాధికారి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో పలమనేరు టిక్కెట్టు కూడా ఇస్తామని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రెండోసారి పార్టీలో చేరినప్పటి నుంచి అభివృద్ధి చేసి ఇక్కడే బరిలో ఉంటానని తరచూ సభలు, సమావేశాల్లో బోస్ సమక్షంలోనే అమర్నాథరెడ్డి ప్రస్తావించేవారు. ఆ మాటలు బోస్‌కు తెగ ఇబ్బందికరంగా మారాయి. గత కొన్నాళ్లుగా పుంగనూరుకు మంత్రి, పలమనేరుకు బోస్ అభ్యర్థులనే మాటలు స్థానికంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చూపెట్టాలనే మంత్రి మొన్న జరిగిన బహిరంగసభను, ర్యాలీని ఏర్పాటు చేసినట్టు బోస్ అనుచరుల వాదన. ఈ విషయం ముందుగానే గ్రహించిన బోస్ అందుకే మంత్రి సభకు డుమ్మాకొట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 93 వేల ఓట్లను సాధించిన బోస్‌కు పార్టీలో గుర్తింపు తగ్గడాన్ని ఆయన, అతని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాలతో బోస్ త్వరలోనే కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. ఈ టాపిక్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
కెప్టెన్‌గా తొలి మహిళ
స్ఫూర్తి లక్ష్మీ సెహగల్ కెప్టెన్ లక్ష్మి... లక్ష్మీ సెహగల్... పేర్లు వినే ఉంటాం. ఆమె భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ధీరవనితల్లో ఒకరు. ఆమె పుట్టింది కేరళలోని మలబార్లో. తండ్రి స్వామినాథన్, తల్లి అమ్ముకుట్టి. ఆమె డాక్టర్ కావాలనే కోరికతో ఎంబిబిఎస్ చదివారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌లో కస్తూర్బా గాంధీ ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించారు. సింగపూర్ వెళ్లడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుల పరిచయడం, సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలు వినడంతో ఆమె జాతీయో ద్యమం పట్ల ప్రభావిత మయ్యారు. సింగ పూర్లో ఆమె ఆసుపత్రి స్థాపించి భారతదేశం నుంచి సింగపూర్‌కి వలస వెళ్లి కూలి పనులు చేసుకుం టున్న కుటుంబాలకు వైద్యం చేశారు. సుభాష్ చంద్రబోస్ సైన్యంలోకి మహిళలను ఆహ్వానిం చినప్పుడు లక్ష్మి ముందుకొచ్చారు. అలా భారతీయ ఆర్మీలో పేరు నమోదు చేసుకున్న తొలి మహిళ ఆమె. లక్ష్మి స్వామినాథన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ రెజిమెంట్ ఏర్పాటైంది. ఝాన్సి రెజిమెంట్‌కు రాణి అని, కెప్టెన్ లక్ష్మి అని ఆమె గుర్తింపు పొందారు. ప్రేమ్ కుమార్ సెహగల్‌ను వివాహం చేసుకోవడంతో కెప్టెన్ లక్ష్మి సెహగల్ అయ్యారు. కాన్పూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఆ పదవికి పోటీ చేసిన తొలి మహిళ లక్ష్మీసెహగల్. 2012లో వార్ధక్యం కారణంగా అనారోగ్యంతో మరణించారు. మరణానంతర క్రతువుల మీద ఆమెకు నమ్మకం లేదు. అందుకే తన దేహాన్ని కాన్పూర్‌లోని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వవలసిందిగా ముందుగానే సూచించారామె. కెప్టెన్ లక్ష్మి గౌరవార్థం కాన్పూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరుపెట్టారు. సుభాష్ చంద్రబోస్‌తో... -
బాస్
-
సంజీవయ్య పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు
-
విమాన ప్రమాదంలో నేతాజీ మృతి.
-
విమాన ప్రమాదంలో నేతాజీ మృతి
-
విమాన ప్రమాదంలో నేతాజీ మృతి
వెలుగులోకి 60 ఏళ్ల నాటి జపాన్ ప్రభుత్వ నివేదిక లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక శుక్రవారం వెలుగుచూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాల్ని ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్సైట్ Bosefiles.info ఈ వివరాల్ని బయటపెట్టింది. 1956లో ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించారని తెలిపింది. తైవాన్‌లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ... తైపీ ఆస్పత్రిలో అదే రోజు సాయంత్రం మరణించారని వెల్లడించింది. ‘విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెటల్ విరగడంతో ఇంజిన్ ఆగిపోయింది. దాంతో విమానం అదుపుతప్పి ... కింద ఉన్న కంకర రాళ్లపై పడింది. క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. మంటలు అంటుకోవడంతో బోస్ కిందకు దూకేశారు. కల్నల్ రెహమాన్, ఇతర ప్రయాణికులు నేతాజీ బట్టలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్‌మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చగా... రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు’ అని విచారణ నివేదికలో పేర్కొన్నారు. -
‘నెహ్రూ, పటేల్‌లను ఉరితీశారు’
న్యూఢిల్లీ : ‘సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూ, భగత్ సింగ్, రాజ్‌గురు.. సబీ ఫాంసీ పర్ చఢె(అందర్నీ ఉరి తీశారు)’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బహిర్గతమవడంతో వివాదమైంది. వివాదం రేగడంతో వివరణ ఇచ్చారు. ‘ఈ వార్త విని నవ్వుకున్నాను. స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన వారిని గౌరవిస్తూ మాట్లాడాను. గాంధీ, నెహ్రూ, నేతాజీలాంటి నేతలపేర్లను ప్రస్తావించాను. అక్కడితో ఆ వాక్యం పూర్తి చేసి, తర్వాత బ్రిటిష్ వారు ఉరితీసిన వీరుల పేర్లు చెప్పాను. కానీ ఈ రెంటినీ కలిపి చెప్పాననుకుంటున్నారు’ అని అన్నారు. -
బోస్ కాలంలో రానా
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. కమర్షియల్ హీరో ఇమేజ్ కోసం పాకులాడకుండా.. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో డిఫరెంట్ సినిమాకు అంగకీరించాడు. ప్రస్తుతం ఇండియాస్ బిగెస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న బాహుబలి పార్ట్ 2లో నటిస్తున్న ఈ మ్యాన్లీ హంక్, ఆ సినిమాతో పాటు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరోసారి ప్రయోగానికే రెడీ అవుతున్నాడు రానా. 1940లలో జరిగే కథతో తెరకెక్కనున్న సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో భారత స్వతంత్ర సమరయోథుడు సుభాష్ చంద్రబోస్ పాత్రతోనూ రానాకు కొన్ని కీలక సన్నివేశాలను ఉండనున్నాయట. సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటులు నాజర్, కరుణలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
నేతాజీకి భారతరత్న ప్రతిపాదించిన పీవీ
న్యూఢిల్లీ : ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతర భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రతిపాదించారు. ఈ విషయం.. నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉంచిన పత్రాల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా బహిర్గతం చేసిన వాటిలో ఉంది. మరణానంతర పురస్కారం ఇవ్వాలని పీవీ ప్రతిపాదించటాన్ని బట్టి.. నేతాజీ మరణించినట్లు అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తోంది. 1991 అక్టోబర్ 10న అప్పటి ప్రధాని అయిన పీవీ.. నాటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్‌కు రాసిన లేఖలో నేతాజీకి మరణానంతర భారత రత్న పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ అవార్డును నేతాజీ జన్మదినమైన జనవరి 23న ప్రకటించవచ్చంటూ 1992 జనవరి 19వ తేదీతో పీవీ మరో లేఖను కూడా నాటి రాష్ట్రపతికి రాశారు. అయితే.. దీనికి సంబంధించి అదే ఏడాది జనవరి 22న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేయగా.. నేతాజీ కుటుంబం ఆ పురస్కారాన్ని స్వీకరించేందుకు తిరస్కరించినట్లు ఒక ఫైల్ చెప్తోంది. అయితే.. పురస్కారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేకపోవటంతో దానిని హోంమంత్రిత్వ శాఖ వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు ఆ పత్రాలు వివరిస్తున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.కె.సిన్హా శుక్రవారం నేతాజీకి సంబంధించిన మరో 25 పత్రాలను బహిర్గతం చేశారు. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష!
లండన్: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలకు డీఎన్ఏ టెస్టు జరపాలని.. సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో జరిగిన పరిణామాలపై పరిశోధనలు చేస్తున్న బోస్‌ఫైల్స్.కామ్ అనే వెబ్సైట్ డిమాండ్ చేసింది. 1945, ఆగస్టు 18నలో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందారని.. అంత్యక్రియల తర్వాత ఆయన అస్థికలను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ఇటీవలే భారత ప్రభుత్వం విడుదల చేసిన రహస్యాల్లో వెల్లడైంది. అయితే దీన్ని విభేదిస్తున్నవాళ్లూ ఉండటంతో.. నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష జరిపితే అంతా తేలిపోతుందని బోస్‌ఫైల్స్.కామ్ కోరింది. 1995లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే.. డీఎన్ఏ పరీక్ష కోసం భారత ప్రభుత్వం అనుమతివ్వాలంటూ.. ఈ వెబ్సైట్ సృష్టికర్త నేతాజీ మునిమనవడు ఆశిశ్ రాయ్ రాసిన లేఖను కూడా ఈ వెబ్సైట్ పోస్టు చేసింది. -
నేతాజీ దుబాసీ జపాన్‌లో ఉన్నారు!
లండన్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 1945లో ఒక విమాన ప్రమాదం సందర్భంగా తైపీలోని ఒక సైనిక ఆస్పత్రిలో చనిపోయారని.. ఆ సమయంలో బోస్ దుబాసీగా పనిచేసిన జపాన్ దుబాసీ ఒకరు నిర్ధారించారని.. ఆ దుబాసీ ఇంకా జీవించే ఉన్నారని బోస్‌ఫైల్స్.ఇన్ఫో వెబ్సైట్ పేర్కొంది. ఆ వెబ్సైట్ తాజాగా విడుదల చేసిన పత్రాల ప్రకారం.. 1943 నుంచి 1945 వరకూ బోస్ వద్ద దుబాసీగా పనిచేసిన కజునొరి కనుజుకా(98) ఇంకా జీవించే ఉన్నారు. బోస్ చివరి రోజులను, విమానం కూలిన ఫలితంగా సంభవించిన బోస్ మరణాన్ని తన డైరీలో నమోదు చేశారు. -
నేతాజీ బంగారు పన్ను ఎక్కడ?
లండన్: సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో జరిగిన ఘటనలను క్రోడీకరిస్తున్న యూకే వెబ్సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేతాజీకి బంగారు పూత పన్ను ఉండేదని.. టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో నేతాజీ అస్థికలతోపాటుగా ఉండాలని తెలిపింది. విమాన ప్రమాదం జరిగినపుడు నేతాజీతోపాటుగా ఉన్న కల్నల్ రెహ్మాన్.. నేతాజీ చితాభస్మం, అస్థికలతోపాటు ఈ పన్నునూ కుండలో వేసినట్లు తన కొడుక్కి చెప్పారని పేర్కొంది. -
నెహ్రూ లేఖపై మళ్లీ రాజుకున్న వివాదం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1945, డిసెంబర్ 26వ తేదీన రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న ఓ లేఖపై మళ్లీ వివాదం రాజుకుంది. అందులో బోస్‌ను బ్రిటిష్ యుద్ధ నేరస్థుడిగా నెహ్రూ పేర్కొనడం పట్ల రభస జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద ఫైళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం బయటపెట్టిన నేపథ్యంలో మళ్లీ నెహ్రూ వివాదాస్పద లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ పూర్తిగా నకిలీదని, ఎవరో దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని, వారందరిని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత బ్రిటన్ రూపొందించిన ‘యుద్ధ నేరస్థుల’ జాబితాలో సుభాష్ చంద్ర బోస్ పేరు లేదనే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ 2001లో భారత్‌కు స్పష్టం చేసిన విషయం తెల్సిందేనని శర్మ వ్యాఖ్యానించారు. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించి విడుదల చేసిన వంద ఫైళ్లలో నెహ్రూ రాసినట్టుగా ప్రచారం అవుతున్న లేఖ, లేకపోవడం గమనార్హం అని చెప్పారు. అయినా ఈ దశలో మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఫైళ్లను బయటపెట్టిందని విమర్శించారు. బోస్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్వాతంత్య్ర యోధుడిగానే గుర్తిస్తుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. వాస్తవానికి బీజేపీకిగానీ, దాని సంఘ్ పరివార్కుగానీ భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘డియర్ మిస్టర్ అట్లీ, మీ యుద్ధ నేరస్థుడు, సుభాష్ చంద్ర బోస్ రష్యా దేశంలోకి ప్రవేశించేందుకు స్టాలిన్ అనుమతించారనే విషయం నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. బ్రిటిష్, అమెరికన్లకు మిత్ర దేశాంగా ఉంటున్న రష్యా, బోస్‌ను తమ దేశంలోకి అనుమతించడం రష్యన్ల విశ్వాసాలను దెబ్బతీయడమేకాదు, మోసం చేయడం కూడా....ఇట్లు జవహర్లాల్ నెహ్రూ’ అని నెహ్రూ లేఖ రాసినట్లు ప్రచారం జరగుతోంది. -
నేతాజీ రహస్య ఫైళ్లు విడుదల చేసిన మోదీ
-
మిస్సింగ్‌కు ముందు ఏమైంది?
లండన్: విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్‌కు ముందు రోజుల్లో ఏం జరిగిందనే వివరాలను ఆయన మనవడు, జర్నలిస్ట్ ఆశిష్ రే బహిర్గతం చేస్తున్నారు. లండన్ నుంచి నిర్వహించే వెబ్సైట్ ‘బోస్‌ఫైల్స్‌డాట్‌ఇన్ఫో’లో వీటిని డాక్యుమెంట్ల సహితంగా పొందుపరుస్తున్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ముందురోజు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లింది వీటిలో ఉన్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం.. నేతాజీ ఆగస్టు 17న బ్యాంకాక్ నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి సైగన్ చేరుకున్నారు. జపాన్‌కు చెందిన ఆ విమానంలో ఎక్కువ మందికి చోటులేదని, కల్నల్ రెహ్మన్, నేతాజీ మాత్రమేఅందులో ప్రయాణించారని ఆ దేశ సాక్షులు చెబుతున్నారు. విమానం సైగన్ నుంచి హైటో, తైపీ, డెరైన్ మీదుగా టోక్యో చేరాల్సి ఉంది. జపాన్ ఆర్మీలోని రష్యా వ్యవహారాల నిష్ణాతుడు జనరల్ షీడీ కూడా ఆ విమానంలో ఉన్నారు. అప్పటి సోవియట్ సరిహద్దులోని చైనా ప్రాంతం మంచూరియాకు వెళుతున్నారు. ఆయనతో పాటు నేతాజీ కూడా వెళ్లాలని నిర్ణయించారని బోస్‌కు జపనీస్ దుబాసీ నెగిషీ.. విచారణ కమిటీకి తెలిపారు. దీన్ని బట్టి మంచూరియాలోని డెరైన్‌కు వెళ్లడానికి నేతాజీ అంగీకరించి ఉంటారని తెలుస్తోంది. అయితే సైగన్లో బయలుదేరడం ఆలస్యం కావడంతో అనుకున్న ప్రకారం కాకుండా మధ్యలో విమానం ఆగినట్లు వెబ్సైట్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. -
'1945, ఆ తర్వాత బోస్ రష్యా వెళ్లారా?'!
లండన్: భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో పర్యటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో నేతాజీ విషయమై భారత్-రష్యా మధ్య కొనసాగిన లేఖలను బోస్ మనవడు ఆశిష్ రాయ్ లండన్‌లో విడుదల చేశారు. నేతాజీకి సంబంధించి భారత ప్రభుత్వం వర్గీకరించిన పత్రాల్లో ఈ లేఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. 1954లో నేతాజీ ఎక్కడున్నాడనే విషయమై 1991లో, 1995లో భారత్-రష్యా ప్రభుత్వాల మధ్య కొనసాగిన సంప్రదింపుల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. రికార్డుల ప్రకారం చూసుకుంటే 1945లోనే సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే 1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన రష్యాలోకి ప్రవేశించారా? అంటూ భారత్ ప్రభుత్వం ఆ దేశాన్ని ఆరాతీసింది. నేతాజీ రష్యాకు ఎప్పుడైనా వచ్చారా, అక్కడ నివసించారా అన్న విషయాలు తెలియజేయాలని కోరుతూ రష్యా ఫెడరేషన్‌కు 1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి 1992 జనవరిలో రష్యా ప్రత్యుత్తరమిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ తమ దేశంలో కొన్నిరోజులు ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది. 1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్ కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది. రెండు ప్రభుత్వాల మధ్య కొనసాగిన ఈ లేఖలు కొందరు అనుకుంటున్నట్టు నేతాజీ ముందే నిష్క్రమించలేదని స్పష్టం చేస్తున్నాయని ఆశిష్ రాయ్ పేర్కొన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే భారత్‌లో ఈ వాదనను చాలామంది విశ్వసించడం లేదు. ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతాజీ అదృశ్యంపై మిస్టరీని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార రహస్య పత్రాల వర్గీకరణ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. -
కొంత జీవితం, కొన్ని అభిప్రాయాలు
రైతు సోదరుల ఆత్మహత్యలతో తెలుగు గడ్డ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో- రైతాంగ సంస్కరణ ఎలా ఉండాలి? రాజకీయ నేతలు ఏ విధమైన అంశాలపై దృష్టి పెట్టాలి? అనే దృక్కోణాన్ని స్వాతంత్య్ర సిద్ధి లభించిన తొలినాళ్లలోనే విజయరాజ కుమార్ సమర్థవంతంగా చేసిన ప్రయత్నాలని అక్షరీకరించిన పుస్తకం ఇది. 1939లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ బ్లాక్‌లో ఆంధ్ర ప్రాంతం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి, అటుపై ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీకి రాష్ర్ట ఆర్గనైజర్‌గా పనిచేసిన నాయకుడు విజయరాజ కుమార్. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయగా ఆమెపై స్వతంత్ర అభ్యర్థిగా ప్రఖ్యాత గణిత శాస్త్త్రజ్ఞ్రురాలు శకుంతల నిలబడి విజయరాజ సహాయం కోరారు అన్న విషయం ఈ పుస్తకంలో తెలుస్తుంది. నలభై రెండేళ్ల క్రితమే ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంగా ఇందిరాగాంధీకి ఆయన రాసిన బహిరంగ లేఖ నాటి ‘తెలంగాణా’ పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి సంచలనం సృష్టించింది. అందులో కొంత భాగం పుస్తకంలో అందించారు. కావటానికి ఇది విజయరాజ కుమార్ జీవిత చిత్రణే అయినప్పటికీ చదువుతుంటే ‘వర్తమానాన్ని’ తడుముతున్నట్టుగా అనిపిస్తుంది. విజయరాజ మొదటి రచనే సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ‘విప్లవాధ్యక్షుడు’. దానికి సంబంధించిన ఉపోద్ఘాతం, ఇప్పటి బెంగాల్ ప్రభుత్వం బోస్ మరణంపై వివరాల్ని బయటపెట్టే కసరత్తును స్ఫురింపజేస్తుంది. పాల్ఖీవాలా ఆంగ్ల రచనని ‘కొలబద్దకు గురి చేయబడిన న్యాయ విధానం’ అని విజయరాజ చేసిన అనువాద గ్రంథ పరిచయం- భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నాయవాదుల ఎంపిక (కొలీజియమ్ వ్యవస్థ)పై ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తుంది. ఇప్పటికైనా ఆయన అభిప్రాయాలను పుస్తకంగా వెలికి తీసుకొచ్చిన ఆయన తమ్ముడు నరిశెట్టి ఇన్నయ్యను తప్పక అభినందించాలి. (రైతు రాజకీయంలో విజయరాజ కుమార్ నరిశెట్టి; రచన: నరిశెట్టి ఇన్నయ్య; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, ఫోన్: 9866115655; ఇన్నయ్య మెయిల్ : innaiah@gmail.com) వర్చస్వి -
బోస్ వివాదం..చరిత్ర ఏం చెబుతోంది?
సుభాష్ చంద్రబోస్.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రధాన స్రవంతికి భిన్నమైన సాయుధ బాటలో మొక్కవోని దీక్షతో పోరాడిన ధీరుడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తుపాకులతో, యుద్ధట్యాంకులతో కదం తొక్కే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) వరకు సాగిన ఆయన ఉద్యమ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరమే. గాంధీ, నెహ్రూలతో బోస్ విభేదాల దగ్గర్నుంచి.. ఆయన అదృశ్యం, మరణం వరకూ అన్నీ జవాబుల్లేని ప్రశ్నలుగా, అనుమానాలుగా మిగిలిపోయాయి. మిస్టరీకి నేతాజీ సంకేతంగా మారిపోయాడు. సాయుధ సంఘర్షణతో చరిత్ర సృష్టించిన బోస్‌ను అదే చరిత్ర ఎప్పటికప్పుడు పునరుజ్జీవితుడిని చేస్తోంది. నేతాజీ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మేవాళ్లు కొందరైతే, ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గుమ్నానీ బాబా పేరుతో జీవించాడని చెప్పేవాళ్లు కొందరు. నేతాజీకి పేరు రాకుండా నెహ్రూ వాస్తవాలను కప్పిపుచ్చారని అనుమానించేవాళ్లు మరికొందరు. ఈ అనుమానాలను తొలగించేందుకు నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద రహస్య ఫైళ్లను బయటపెట్టాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అయితే వీటిని బహిర్గతం చేస్తే నేతాజీ చరిత్రతో ముడిపడిన దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం చెబుతోంది. ఏదైతేనేం.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ నెల 16న తమ వద్దగల 64 ‘నేతాజీ’ రహస్య ఫైళ్లను బహిర్గతం చేసింది. నేతాజీ 1945 తర్వాత జీవించే ఉన్నట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారని, వారిపై నెహ్రూ ప్రభుత్వం చాలా ఏళ్లపాటు నిఘా పెట్టిందని ఆ ఫైళ్లలో ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు గాంధీ, నెహ్రూలతో బోస్ సైద్ధాంతిక విభేదాలేంటి? వారిద్దరు నేతాజీ తమకు పోటీ అని భావించారా? రెండో ప్రపంచ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలతో గాంధీ, నెహ్రూ, బోస్‌ల సంబంధాలు, వైరుధ్యాలు ఎలా ప్రభావితమయ్యాయి? స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ నేతాజీ మిస్టరీని విప్పకపోవడానికి ఆయనతో ఉన్న విభేదాలే కారణమన్న ఆరోపణల్లో నిజమెంత? నేతాజీ కుటుంబ సభ్యులపై స్వతంత్ర భారత ప్రభుత్వ నిఘా వెనుక దురుద్దేశాలున్నాయన్న అనుమానాల్లో బలమెంత? ఇలాంటి మరెన్నో అంశాలపై ఈ వారం ఫోకస్.. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో నిజంగా మరణించారా అన్న చర్చ 1945 నుంచి ఇప్పటివరకూ మధ్య మధ్య తలెత్తుతూనే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ చర్చ మరింత ఉధృతితో ముందుకొచ్చింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం, గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని ప్రజల మనోఫలకం మీంచి పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు ఈ చర్చకు సరికొత్త రూపును, ఊపును ఇచ్చాయి. బోస్ దగ్గరి బంధువులు కొందరు గట్టిగా గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న బోస్ తాలూకు రహస్య పత్రాలను బయట పెట్టాలన్న డిమాండ్ అలా ఉండగా, పశ్చిమబెంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రహస్య పత్రాలను బయట పెట్టింది. నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ బంధువులపై, ఆయన నాయకత్వం వహించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులపైన నిఘా ఉంచిన సంగతిని అవి వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పత్రాలలో ఏముందో వాటిని బయట పెడితే తప్ప తెలియదు. ఎన్నికల ముందు వీటి వెల్లడికి హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడంత ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినవచ్చన్న వాదాన్ని సన్న సన్నగా వినిపిస్తోంది. బోస్ మరణం లేదా అంతర్ధానం గురించి నడుస్తున్న చర్చ మొత్తంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అది, నెహ్రూకు గురి పెట్టడం! నెహ్రూ, బోస్‌ల మధ్య బద్ధ శత్రుత్వం ఉండేదనీ, అధికారానికి తనతో బోస్ పోటీ పడతాడనే భయంతో నెహ్రూ ఆయన అడ్డు తొలగించుకునేందుకు కుట్ర చేశాడనే భావనను కలిగించే దిశగా చర్చ సాగుతోంది. నెహ్రూ కన్నా ఎక్కువ ప్రజాదరణ బోస్‌కే ఉండేదనీ, బోస్ సజీవంగా దేశానికి తిరిగి వచ్చి ఉంటే నెహ్రూ అధికారపీఠం కదిలిపోయి ఉండేదనీ బోస్ బంధువులు కొందరు నొక్కి చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ బోస్ తాలూకు రహస్య పత్రాలను బయటపెట్టడం వెనుక బెంగాల్ ఆత్మగౌరవ కోణాన్ని ఒడుపుగా వాడుకోవాలన్న ఆలోచన ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే, బోస్‌ను నెహ్రూ తన అధికారానికి పోటీగా నిజంగానే భావించాడా; ఆయన కుట్రదారేనా అన్నది కచ్చితంగా తేల్చి చెప్పగల ఆధారాలు ఏవీ ఇంతవరకు మన ఎదురుగా లేవు. ఈ పరిస్థితిలో చర్చ మొత్తం కొన్ని కాంగ్రెసేతర పక్షాల రాజకీయ లక్ష్యాలూ, బోస్ బంధువుల భావోద్వేగ స్పందనల కలగలుపుగా మారి వాస్తవాలకు పూర్తిగా దూరమై ఊకదంపుడు చర్చగా పరిణమించే ప్రమాదం సహజంగానే ఉంటుంది. కనుక అటో ఇటో ఒరిగిపోవడం కాకుండా అసలు చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుని ఎవరికి వారు ఒక అభిప్రాయానికి రావడం ఒక మార్గం. రాజమోహన్ గాంధీ రాసిన గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ ఆధారంగా ఆ చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూద్దాం. అంతర్జాతీయ దృక్కోణాలు ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే జాతీయరాజకీయాల నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి. గాంధీ, నెహ్రూ, రాజగోపాలాచారి, బోస్ తదితరులకు తమవైన అంతర్జాతీయ దృక్కోణాలున్నాయి. గాంధీది బ్రిటిష్ పట్ల మిత్ర వైరుధ్యమైతే, బోస్‌ది శత్రు వైరుధ్యమని చెప్పుకున్నాం. నెహ్రూ సోవియట్ యూనియన్ను అభిమానించేవాడు. 1938-42 మధ్య కాలంలో యూరప్‌లో సంభవించిన కల్ల్లోలం భారత్‌ను, తదనుగుణంగా జాతీయ నాయకుల అంతర్జాతీయ దృక్కోణాలను కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు కలగలిసి పోయిన సందర్భమది. 1938లో జర్మనీ (హిట్లర్), ఇటలీ (ముసోలినీ), బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన మ్యూనిక్ ఒప్పందం చెకొస్లవేకియా విషయంలో హిట్లర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమిచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు తమ ఆత్మగౌరవాన్ని హిట్లర్‌కు తాకట్టు పెట్టిన ఒప్పందంగా దానిని గర్హించిన గాంధీ; చెక్, యూదు జాతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మద్దతు తెలిపాడు. ఇందుకు భిన్నంగా బోస్‌ను జర్మనీ తెగువా, ఇటలీ ఆత్మవిశ్వాసం ఆకట్టుకున్నాయి. బ్రిటిష్-కాంగ్రెస్ పొత్తును, కాంగ్రెస్ మంత్రివర్గాలను అంతమొందించి సామూహిక శాసనోల్లంఘన చేపట్టడానికి ఇదొక అవకాశంగా కనిపించింది. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నది అందుకే. ఆయనకు భిన్నంగా నెహ్రూ అన్ని రకాల ఫాసిస్ట్ శక్తులనూ వ్యతిరేకించే వైఖరి తీసుకున్నాడు. బోస్ జర్మన్ సంబంధాలు ఇదే సమయంలో బోస్ కలకత్తాలోని జర్మన్ కాన్సూల్తో సంబంధం పెట్టుకుని ఏవో ఏర్పాట్లలో ఉన్నట్టు కేంద్ర గూఢచారి విభాగం వద్ద ఉన్న సమాచారాన్ని బొంబాయిలో న్యాయశాఖమంత్రిగా ఉన్న కె.ఎం. మున్షీ సంగ్రహించి గాంధీకి ఇచ్చాడు. ఇటలీ నియంత ముస్సోలినీ పట్ల కూడా బోస్ ప్రశంసాభావంతో ఉన్నట్టు అప్పటికే ఆధారాలు కనిపించాయి. గాంధీకి ఇవి సహజంగానే కలవరం కలిగించాయి. హిట్లర్ కారణంగా యూరప్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు ఆవరించడం, జర్మనీ-రష్యాల మధ్య సంధి జరగడం, హిట్లర్ సేనలు పోలండ్‌లో అడుగుపెట్టడంతో జర్మనీతో బ్రిటన్ యుద్ధానికి దిగడం, భారతీయులు వేల సంఖ్యలో యుద్ధంలో చేరడం, 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్‌పై దాడి చేయగానే భారత్‌లోని కమ్యూనిస్టులు కూడా బ్రిటన్‌కు మద్దతు ఇవ్వడం వగైరా పరిణామాలు వరసగా జరిగిపోయాయి. జపాన్ విస్తరణ దాహం ఇదే సమయంలో జర్మనీకి మిత్ర రాజ్యంగా ఉన్న జపాన్, ఆసియా అంతటా కమ్ముకోవడం ప్రారం భించింది. చైనాపై దాడి చేసి, ఆ తర్వాత భారత్ లోకి కూడా చొచ్చుకు వస్తున్నట్లు కనిపించింది. 1939-44 మధ్య కాలంలో జపాన్ విస్తరణ దాహం మనదేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ సదస్సుల్లో తరచు ఇది చర్చలోకి రావడం, జపాన్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయ డం, జపాన్ను అహింసాయుతంగా ఎదుర్కోవాలని గాంధీ నొక్కి చెప్పడం జరుగుతూ వచ్చాయి. 1942లో బ్రిటిష్ స్థావరమైన సిం గపూర్‌ను, రంగూన్ను జపాన్ చేజిక్కించుకుని భారత్ గుమ్మంలోకి అడుగుపెట్టింది. బోస్ మద్దతుదారులు జపాన్ సేనలకు సహకరిస్తారన్న వదం తి గాంధీ చెవిన పడింది. జపాన్‌కు వ్యతిరేకంగా అహింసాయుత ప్రతిఘ టనను గాంధీ నొక్కిచెబితే; గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించాలన్న వైఖరిని నెహ్రూ, కమ్యూనిస్టులు తీసుకున్నారు. తూర్పు బెంగాల్ మొదలైన చోట్ల భూదహన విధానంతో జపాన్ సేనలన్నీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. బోస్‌కు పెరిగిన మద్దతు అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ విఫలమై కాంగ్రెస్‌లో.. దేశంలో ఆయన దాదాపు ఒంటరైన సందర్భం ఇది. ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతి రేకత తారస్థాయికి చేరగా, జపాన్ చేతిలో పాశ్చా త్యశక్తులు చిత్తుగా ఓడిపో తుండటం ఆ దేశంపట్ల వారిలో అనుకూలభావా న్నీ అదే స్థాయిలో పెంచిం ది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బం ధం నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘాన్ మీ దుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్‌లో ఎక్కువ మంది నాయకులు బోస్ వైపు తిరిగారు. జర్మనీ నుంచి ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతు న్నట్లు వార్త వచ్చింది. బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత్-బర్మా సరిహద్దుల్లో వీరోచిత పోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా క్విట్ ఇండియా నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్లీ జనం ఆయన వైపు మళ్లడం ప్రారంభించారు. గాంధీ-బోస్ సుభాష్ చంద్రబోస్ ది పాతికేళ్ల (1920-1945) రాజకీయ జీవితం. ఇందులో పద్దెనిమిదేళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, కృపలానీ, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి ఎందరో నాయకుల్లానే ఆయన కూడా మొదట్లో గాంధీ ప్రభావితుడే. సహాయ నిరాకరణ సందర్భంలో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టాడు. గాంధీ ఆయనకు అప్పగించిన పని, మరో బెంగాల్ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్ దాస్‌కు కుడిభుజంగా ఉండడం. అయితే, గాంధీ అనుకూలుర శిబిరంలో బోస్ ఎప్పుడూ లేడు. 1923లో, మార్పునకు వ్యతిరేకులు (నో-చేంజర్స్), మార్పుకు అనుకూలురు (ప్రో-చేంజర్స్)గా కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, గాంధీ మొగ్గు ఉన్న నో-చేంజర్స్ శిబిరంలో కాక, ప్రొ-చేంజర్స్ శిబిరంలో చేరి చట్టసభల్లో ప్రవేశాన్ని బోస్ సమర్ధించాడు. బ్రిటిష్ పట్ల వైఖరిలో కూడా గాంధీ-బోస్‌ల మధ్య విభేదాలున్నాయి. బ్రిటిష్‌తో గాంధీది మిత్ర వైరుధ్యమైతే బోస్ ది శత్రువైరుధ్యం. కాంగ్రెస్ చర్చల్లో, తీర్మానాల్లో గాంధీ కనబరిచే బ్రిటిష్ అనుకూల వైఖరులను బోస్ అడుగడుగునా అడ్డుకునేవాడు. అలాగే హింస-అహింసల విషయంలో కూడా అభిప్రాయ భేదాలుండేవి. 1930లో వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు కింద బాంబు పేలినప్పుడు దానిని ఖండించాలని గాంధీ ప్రతిపాదించగా బోస్ వ్యతిరేకించాడు. 1933లో శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ప్రముఖనేతలందరూ జైళ్లకెళ్లినప్పుడు, సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్‌తో కలసి ఆస్ట్రియాలో ఉన్న బోస్, గాంధీ నాయకత్వం విఫలమైందంటూ అక్కడి నుంచే ప్రకటన చేశాడు. అయితే, తనతో భావజాల విభేదాలున్న నెహ్రూతో అనుసరించినట్టే బోస్‌తో కూడా గాంధీ సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూ ఆయన కాంగ్రెస్ గొడుగు కింద కొనసాగేలా వీలైనంతవరకు జాగ్రత్తపడేవాడు. 1936లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లక్నో కాంగ్రెస్ సందర్భంలో వర్కింగ్ కమిటీ ఎంపిక బాధ్యతను తనకు అప్పగించినప్పుడు కొందరు సోషలిస్టు నాయకులతో పాటు బోస్ పేరును కూడా గాంధీ చేర్చాడు. 1938లో నెహ్రూ స్థానంలో ఎవరిని అధ్యక్షుని చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, పటేల్ గట్టిగా వ్యతిరేకించినా సరే బోస్‌నే చేసి తీరాలని గాంధీ పట్టుబట్టి నెగ్గించుకున్నాడు. అయితే, ఇంతకుముందు నెహ్రూ వరసగా రెండు విడతలు అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, తనకు కూడా మరో విడత అవకాశమివ్వాలని బోస్ అన్నప్పుడు గాంధీ వ్యతిరేకించి, మొదట ఆజాద్‌ను; ఆయన తప్పుకోవడంతో భోగరాజు పట్టాభి సీతారామయ్యను ముందుకు తెచ్చాడు. ఆ ఎన్నికలో బోస్ నెగ్గినప్పుడు ఖిన్నుడైన గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. గాంధీ ఆ తర్వాత పటేల్, రాజగోపాలాచారి తదితరులను ప్రయోగించి బోస్ రాజీనామా చేసే పరిస్థితిని కల్పించాడు. బోస్ కాంగ్రెస్ జీవితానికి దానితో తెరపడింది. 1939లో బోస్‌కు గాంధీ ఉత్తరం రాస్తూ, ఇప్పుడు నా నుంచి నువ్వు దూరమైనా; నేను చేసింది న్యాయమూ, నా ప్రేమ స్వచ్ఛమూ అయితే ఎప్పటికైనా మళ్లీ నా దగ్గరికి వస్తావు అన్నాడు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. పటేల్-బోస్ మితవాదులుగా పటేల్, రాజగోపాలా చారిల మధ్య భావసారూప్యత ఉండేది. ఇద్దరూ నెహ్రూ, బోస్‌ల సోషలిజాన్ని, రాడికలిజాన్ని వ్యతిరేకించేవారు. ఆపైన బోస్ నిలకడలేని మనిషన్న అభిప్రాయం పటేల్‌కు ఉండేది. పటేల్, రాజగోపాలాచారి మొదట్లో నో-ఛేంజర్స్ శిబిరంలో ఉంటే; ప్రో-ఛేంజర్స్ శిబిరంలో మోతీలాల్, చిత్తరంజన్ దాస్, బోస్లతోపాటు పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఉండేవాడు. బోస్‌తో ఆస్ట్రియాలో ఉన్నప్పుడే విఠల్ భాయ్ కన్ను మూశాడు. తన అన్నను బోస్ తప్పుదారి పట్టించాడన్న కోపం పటేల్‌కు ఉండేది. బోస్‌ను కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలన్న గాంధీ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించినా గాంధీ పట్టుబట్టడంతో ఎప్పటిలా శిరసావహించాడు. నెహ్రూ-బోస్ బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్‌తో ఆయన విభేదాలు ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని సందర్భాలలో, ఇద్దరం తెగతెంపులు చేసుకుందామా అనే వరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్‌ల మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్‌లో రాడికల్స్‌గా గుర్తింపు పొంది, ఆ వర్గానికి నాయకత్వం వహించారు. ఇద్దరూ కూడబలుక్కుని గాంధీకి నచ్చని తీర్మానాలు తెచ్చి నెగ్గించుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నియమించిన మోతీలాల్ నెహ్రూ కమిటీ అధినివేశ ప్రతిపత్తిని కోరాలని సూచించినప్పుడు 1927లో మద్రాస్ కాంగ్రెస్‌లో దానిని తోసిపుచ్చి, సంపూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్ చేస్తూ వీరు తెచ్చిన తీర్మానం ఒక ఉదాహరణ. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్‌ను వీరిద్దరూ కలసి తమ రాడికల్ భావాలతో ఒక ఊపు ఊపారు. అప్పుడు కూడా అధినివేశ ప్రతిపత్తికి బదులు సంపూర్ణ స్వరాజ్యానికి ఇద్దరూ పట్టుబట్టారు. గాంధీ మెట్టు దిగి రాజీకి వచ్చాడు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా బ్రిటిష్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని బోస్ సవరణ ప్రతిపాదిస్తే నెహ్రూ దానిని సమర్ధించాడు. గాంధీ అస్పృశ్యతా నివారణపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టడాన్నీ ఇద్దరూ వ్యతిరేకించారు. అలాగే బ్రిటిష్ పట్ల గాంధీ సామరస్య వైఖరిని వ్యతిరేకించడంలోనూ ఇద్దరిదీ ఏకీభావమే. అయితే ఇద్దరిలోనూ కొన్ని తేడాలూ ఉన్నాయి. గాంధీతో నెహ్రూ ఒక్కోసారి తెగతెంపుల వరకూ వెళ్లినా వెనక్కి తగ్గేవాడు. ఆయన మౌలికంగా కాంగ్రెస్, గాంధీల మనిషి. ఆ రెండు గొడుగుల అంచుల్లో వేళ్లాడేవాడే కానీ పూర్తిగా బయటికి వచ్చేవాడు కాదు. బోస్‌కు కాంగ్రెస్, గాంధీల పట్ల అంత నిబద్ధతలేదు. నెహ్రూ కాంగ్రెస్ గుంపులో ఉంటూనే కొన్ని సందర్భాలలో అలీనతను పాటించేవాడు. బోస్ పూర్తిగా ఒక వైపు ఒరిగిపోయేవాడు. 1923లోనే కాంగ్రెస్ ప్రో-చేంజర్స్‌గా, నో-చేంజర్స్‌గా చీలిపోయి, తన తండ్రి ప్రో-చేంజర్స్ శిబిరంలో చేరినా నెహ్రూ రెండు శిబిరాలకూ దూరంగా ఉండడం ఆయన అలీనతకు ఒక చిత్రమైన ఉదాహరణ. బోస్ రెండోసారి అధ్యక్షుడైనప్పుడు ఆయనతో అర్ధాంతరంగా రాజీనామా చేయించే ప్రయత్నాలలోనూ నెహ్రూ అలీనంగానే ఉండిపోయాడు. ఇంతకు ముందు పలు సందర్భాలలో తనూ, బోస్ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నా; కాంగ్రెస్‌లో బోస్ ఒంటరి అయ్యే క్లిష్టపరిస్థితిలో మాత్రం ఆయన నోరు తెరిచి మద్దతు అడిగినా నెహ్రూ ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయాడు. అయితే, నెహ్రూ గతంలోనూ అలా అలీనంగా ఉండిపోయిన సందర్భాలున్నాయి కనుక, బోస్ అడ్డు తొలగించుకోడానికే మద్దతు ఇవ్వలేదని చటుక్కున నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మొత్తం మీద నెహ్రూ-బోస్ సంబంధాలను పరిశీలిస్తే వారు విరోధించుకుని వీధికెక్కిన ఉదంతాలు లేవనే చెప్పవచ్చు. అప్పటికి పద్దెనిమిదేళ్లుగా బోస్ తనతో మాటిమాటికీ విభేదిస్తున్నా, తన నాయకత్వం విఫలమైందని ప్రకటించినా ఆయనతో సర్దుబాటు చేసుకుంటూ పోవడమే కాక; పట్టుబట్టి ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసిన గాంధీ- రెండో విడత ఆయన అధ్యక్షుడైనప్పుడు దింపేవరకూ ఎందుకు నిద్రపోలేదు? అలాగే, తనున్న క్లిష్టపరిస్థితిలో బోస్ నోరు తెరిచి మద్దతు కోరినా నెహ్రూ ఎందుకు ఇవ్వలేదు? ఇవీ ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు. హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా, పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్ యుద్ధపాటవం అనేక రెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్ మరణించడం, అణు బాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయ పరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు తిరిగి తేటపడటం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా. ఎవరు ఎంత బాధ్యులు? జాతీయరంగస్థలి నుంచి బోస్ నిష్ర్కమణ రెండు అంచెలలో జరిగింది. మొదటిది, కాంగ్రెస్ నుంచి. రెండోది, మరణం లేదా అంతర్ధానం రూపంలో. ఎవరు బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్ర్కమ ణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవు తారు. అదే, ఆయన మరణం లేదా, అంత ర్ధానానికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయ శక్తులు తప్పనిసరిగా అడుగు పెడతాయి. జర్మనీ, జపాన్‌లతో తలపడుతున్న బ్రిటిష్‌కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్ కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే. రహస్య పత్రాలు బయటపెడితే కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినవచ్చని ఇప్పటి కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ మరణం, లేదా అంతర్ధానం వెనుక అంత ర్జాతీయశక్తుల పాత్ర గురించిన అనుమానాన్ని బలోపేతం చేసేదే. కాంగ్రెస్ నుంచి బోస్ నిష్ర్కమణకు గాంధీ, నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న నిర్ధారణకు అవకాశం లేకుండా భావజాలపరమైన వ్యత్యా సాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్- నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేక శక్తుల మధ్య స్పర్థ. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన అవకాశాన్ని బోస్‌కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్‌కు నెహ్రూ మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోవడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ముద్దాయిలుగా పరిగణించాల్సి వచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్‌తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని చెప్పుకున్నాం. ఐతే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభులపై నిఘా ఎందుకు కొనసాగించాయన్న ప్రశ్న వస్త్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే అదేమంత విశేషం అనిపించదు. సంఘ్ పరివార్ వర్గాలు, వామపక్ష తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాల వారిపై నిఘా ఎప్పుడూ ఉంటూనేఉంది. బోస్ మరణం, లేదా అంత ర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు కేంద్రం వద్ద ఉన్న రహస్య పత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం నెహ్రూ ఎందుకు బయట పెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా నిర్ధారిం చాలంటే, ప్రస్త్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని రహస్య పత్రాలనూ బయటపెట్టాలి! బోస్ ప్రతిష్టను మసకబార్చారనీ, స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్రను తక్కువ చేశారనే ఆరోపణలు, అనుమానాలు సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయ ప్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలు గానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహస ప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్‌కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్‌ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయ తీరం చేర్చింది. ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్య పత్రాలు కూడా వెల్లడై, అన్ని విధాలా నెహ్రూనే విలన్‌గా స్థాపించిన పక్షంలో, అప్పుడది వేరే కథ! - భాస్కరం కల్లూరి, మొబైల్: 9703445985 -
నేతాజీ ప్రేమ పెళ్లి చేసుకున్నారా?
నేతాజీగా ప్రసిద్ధి చెందిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్య్ర సాధనకై గాంధీజీ వంటి నాయకులు అహింసావాదాన్ని ఎంచుకుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు. ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే అతికొద్దిమందిలో ఈయన అగ్రగణ్యులు. నేతాజీ మరణం నేటికీ ఓ మిస్టరీనే. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా వాదప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. బోస్‌కు చెందిన కొన్ని రహస్య పత్రాలను తాజాగా బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడంతో దేశమంతా మరోమారు ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలు తెలుసుకుందాం..! బాల్యం.. సుభాష్ చంద్రబోస్ 1897లో నాటి బెంగాల్ ప్రావిన్సులోని కటక్‌లో (ఒడిశా) జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ పేరొందిన లాయరు. కరడుగట్టిన జాతీయవాది. ఈయన బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారు. తల్లి ప్రభావతి. సంపన్న కుటుంబంలో జన్మించిన బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలు, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజి, ఫిట్జ్ విలియం కాలేజి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలలో సాగింది. 1920లో భారత సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. ఆంగ్లంలో అత్యధిక మార్కులు పొందారు. అయితే, 1921లో భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం సివిల్ సర్వీసు నుంచి వైదొలిగారు. ప్రేమ.. పెళ్లి.. బోస్ ఐరోపాలో ఉండే సమయంలో ఆస్ట్రియా దేశస్తురాలైన ఎమిలీ షెంకెల్ను ప్రేమించారు. ఈమెనే 1937 డిసెంబర్ 26న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 1942లో అనిత జన్మించింది. బోస్ తన భార్యకు రాసిన ఎన్నో ఉత్తరాలను ‘లెటర్స్ టూ ఎమిలీ షెంకెల్’ పేరుతో సంకలనంగా అతని మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్, సుగతా బోస్ ప్రచురించారు. కాంగ్రెస్‌లో.. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించిన బోస్‌ను సహాయ నిరాకరణ సమయంలో గాంధీజీ కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలిసి బెంగాల్ ఉద్యమం నిర్వహించారు బోస్. ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నిక గాంధీకి రుచించలేదు. బోస్ ప్రత్యర్థి పట్టాభి రామయ్య పరాజయాన్ని గాంధీజీ తన పరాజయంగా భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన సంక్షోభం కారణంగా బోస్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. స్వాతంత్య్ర ప్రణాళిక.. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరాక స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ లాంటి నేతలు భావించేవారు. అయితే, బోస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉండేవి. రెండో ప్రపంచయుద్ధంలో తలమునకలై ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి అదే సరైన సమయమని బోస్ నమ్మేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం కనీసం రెండేళ్లపాటు సోషలిస్టు నియంత్రణలో ఉండాలని ఆయన కోరుకున్నారు. స్వతంత్ర సాధన కోసం బోస్ ఎందరో బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు బోస్‌ను కలిసేందుకు ఇష్టపడలేదు. తర్వాతికాలంలో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించడం గమనార్హం. అజ్ఞాతంలోకి.. కాంగ్రెసును సంప్రదించకుండా భారత్‌ను బ్రిటిష్ వారు యుద్ధంలోకి దింపడం బోస్‌కు మింగుడుపడలేదు. వెంటనే ఆయన నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం, తరువాత విడుదల చేసి ఇంటి చుట్టూ నిఘా ఉంచింది. తనను దేశం దాటి బయటకు వెళ్లనీయకుండా కుట్ర జరుగుతుందని గ్రహించిన బోస్.. మారువేషంలో దేశం దాటారు. బ్రిటిష్ వారికి శత్రువులైన జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలతో చేయి కలపాలని, తద్వారా స్వాతంత్య్రం సాధించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. అనుమానాస్పద మరణం.. అధికారిక ప్రకటన ఆధారంగా బోస్ 1945, ఆగస్టు 18న మరణించారు. తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారని చెబుతారు. అయితే, ఆయన శవం మాత్రం దొరకలేదు. దీంతో ఆయన బతికే ఉన్నారన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ బందీగా ఉండగా సైబీరియాలో బోస్ మరణించారనే కథనంపై భారత ప్రభుత్వం విచారణకు చాలా కమిటీలను నియమించింది. సన్యాసిగా..? 1985లో అయోధ్య సమీపంలోని ఫైజాబాదులో సంచరించిన భగవాన్జీ అనే సన్యాసే బోస్ అని చాలామంది నమ్మేవారు. ‘మారువేషంలో ఉన్న బోస్‌ని’ అని కనీసం నాలుగు సార్లు ఆయన చెప్పుకొన్నారు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ పరిశీలించింది. అందులో స్పష్టమైన ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈ వాదనను కమిటీ కొట్టివేసింది. తర్వాతి కాలంలో పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో కమిటీ నిర్ణయం తప్పని తేలడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. -
నేతాజీపై నిఘా... నిజం కాదు!
సురయ్యా హసన్ బోస్... అరవింద్‌బోస్ భార్య. పేరు చివరిలో బోస్ అనే పదం చెప్పకనే చెబుతోంది... అరవింద్‌బోస్ సుభాష్‌చంద్రబోస్ బంధువని. అవును... అరవింద్‌బోస్... సుభాష్ చంద్రబోస్‌కి స్వయాన మేనల్లుడు. సురయ్యా హసన్‌కి బోసు కుటుంబంతో ఆ ఒక్క బంధమే కాదు... ఆమె పినతండ్రి యాబిద్ హుస్సేన్ సఫ్రానీ చంద్రబోస్‌కి పర్సనల్ సెక్రటరీ. అరవింద్‌బోస్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్న సురయ్యా వస్త్ర కుటీర పరిశ్రమ స్థాపకురాలుగా సుపరిచితురాలు. నేతాజీ మరణానంతరం ఆయన కుటుంబంపై దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రు నిఘా పెట్టించారనే వార్తల సందర్భంగా సురయ్యా హసన్బోస్ని పలకరిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు... ...::: భువనేశ్వరి మీరు మొదటిసారి అరవింద్‌బోస్‌ని ఎప్పుడు కలిశారు? నేను ఢిల్లీలో ‘హాండ్లూమ్ హాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఆయన్ని మొదటిసారి కలిశాను. స్నేహం ప్రేమగా మారింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనేనా? అవును. మా నాన్నగారు సయ్యద్ భద్రు హుస్సేన్. గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రచారం చేస్తుండేవారు. హైదరాబాద్ యాబిడ్స్‌లో మొదటి వస్త్ర కుటీర పరిశ్రమను స్థాపించిన వ్యక్తి. నేను ఒక్కగానొక్క అమ్మాయిని. ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక నాన్నగారి పరిశ్రమలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా నాలుగేళ్లు పనిచేశాను. ఇంతలో ఢిల్లీలో ఉన్న కంపెనీలో ఉద్యోగ అవకాశం వస్తే అక్కడికి వెళ్లి పనిచేశాను. మీ చిన్నాన్న యాబిద్ హుస్సేన్ సఫ్రానీ చంద్రబోస్‌గారి పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు రైట్‌హ్యాండ్ అంటారు? మీకు తెలిసిన వివరాలు చిన్నాన్నంటే బోస్‌గారికి చాలా నమ్మకం. బోస్‌గారి గొప్పతనం గురించి తప్ప బయటవారి దగ్గర, మా దగ్గర కూడా ఎలాంటి రహస్య విషయాలు చెప్పేవారు కాదు. నా భర్త అరవింద్బోస్కి చిన్నాన్న అంటే చాలా అభిమానం. అలా నాతో ఏర్పడ్డ పరిచయమే పెళ్లి వరకూ తీసుకెళ్లింది. మీ అత్తవారింటి గురించి చెప్పండి వాళ్లు బెంగాళీలు. సంప్రదాయ హిందూ కుటుంబం. కోడలిగా ఒక ముస్లిం అమ్మాయి ఇంట్లో అడుగుపెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నాను. కానీ అరవింద్ కుటుంబమంతా ఆయనకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఆహ్వానించారు. అరవింద్‌బోస్ ఏం చేస్తుండేవారు? మా పెళ్లయ్యేనాటికే ఆయన కలకత్తాలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయనికి మేనమామ చంద్రబోస్ అంటే ప్రాణం. ఆయన బాటలోనే నడిచేవారు. ఆయన ఎమ్ఎ చదివారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వార్తాపత్రికలు చదివి...వాటిలోని ముఖ్యాంశాలను యువతకు బోధించేవారు. నెహ్రు కుటుంబానికి, చంద్రబోస్ కుటుంబానికి సంబంధాలు ఎలా ఉండేవంటారు? చాలా మంచి సంబంధాలు ఉండేవి. మా నాన్నగారి తరపునైనా, బోసుగారి కుటుంబమైనా అందరం గాంధీ అడుగుజాడల్లో నడిచినవాళ్లమే. బోసుగారి కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి రాకపోకలు ఉండేవి. ఇరు కుటుంబాల ఆలోచనలు హుందాగా ఉండేవి. చిన్నాన్న నెహ్రుగారి నాయకత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో పనిచేసినపుడు ఆ ఇద్దరి కుటుంబాల అనుబంధం గురించి చెబుతుండేవారు. మీరు తిరిగి హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చేశారు? మాకు పిల్లలు లేరు. పెళ్లయిన పదేళ్లకే నా భర్త అరవింద్‌బోస్ గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలోనే మా చిన్నాన్న తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి నన్ను తీసుకుని హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇక్కడ టోలిచౌకిలో పదెకరాల పొలం కొనిచ్చారు. ఈ పొలంలో 1985లో కుటీర పరిశ్రమ స్థాపించాను. నా ఇల్లు కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. నిజాం కాలంనాటి వస్త్ర తయారీ, హస్తకళలకు నెలవుగా మారిన మా పరిశ్రమలో భర్తను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి లభిస్తుంది. చిన్నాన్న పేరుతో ‘సఫ్రానీ మెమోరియల్ స్కూల్’ని కూడా స్థాపించాను. ఒకపక్క కుటీర పరిశ్రమ, మరోపక్క స్కూలు పనుల్లో నాకు 88 ఏళ్ల వయసొచ్చిందన్న విషయమే తెలియలేదు. మీ భర్త చనిపోయాక... మీ అత్తింటివారితో సంబంధాలు కొనసాగుతున్నాయా? అందరూ టచ్‌లోనే ఉంటారు. నా చిన్నాడబడుచు తన చివరి రోజుల్లో కూడా నాతోనే గడిపింది. ఏడాదికి ఒకటిరెండుసార్లు తప్పనిసరిగా కలకత్తా వెళ్లొస్తుంటాను. నెహ్రు హయాంలో 1948 నుండి 1968 వరకూ నేతాజీ కుటుంబంపై నిఘా ఉంచిన వార్తల గురించి విన్నారా? మన దేశంలో ఇలాంటి వార్తలు పుట్టడం, తర్వాత మెల్లగా మరుగున పడిపోవడం జరుగుతూనే ఉంటాయి. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని నా అభిప్రాయం. లేదంటే ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి వార్తలు బయటకి రావడమేంటి! నేతాజీ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి మధ్య చాలా మంచి సంబంధాలుండేవి. నిఘా విషయం నిజమైతే మొదట ఇబ్బంది పడాల్సిన వ్యక్తి మా చిన్నాన్న సఫ్రానీ. ఎందుకంటే ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. జర్మనీ నుంచి సింగపూర్‌కి వెళ్లిన సబ్‌మెరైన్‌లో నేతాజీతోపాటు ప్రయాణించిన వ్యక్తి ఆయన. ఆయన అడుగుజాడలన్నీ ఎరిగిన మనిషి. నా భర్త అరవింద్‌బోస్ కుటుంబంపై కూడా నిఘా ఉండాలి కదా! నాకున్న అనుభవం మేరకు ఇలాంటి సంఘటనలేవీ జరగలేదు. మా రెండు కుటుంబాల సంగతి పక్కన పెడితే మిగతా బంధువులతో కూడా మాకు పరిచయాలు బాగానే ఉండేవి. మా మధ్యన ఇలాంటి విషయాలెప్పుడూ చర్చకు రాలేదు. నేతాజీలాంటి గొప్పవ్యక్తిని మనం గుర్తుచేసుకునే విధానం ఇది కాదు. ఏదో ఒక ఆసక్తికరమైన వార్తలరూపంలో తప్ప మంచి సందర్భంలో ఆ మహనీయున్ని తలుచుకోలేకపోతున్నందుకు విచారంగా ఉంది. - సురయ్యా -
నేతాజీ కుటుంబంపై 20 ఏళ్ల నిఘా
-
అప్పుడే మరణించి ఉంటే నిఘా ఎందుకు?
నేతాజీ అదృశ్యంపై ఆయన బంధువు ముంబై: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో మరణించడం నిజమైతే ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నేతాజీ తమ్ముడి కుమారుడు అర్ధేందు బోస్ ప్రశ్నించారు. ఈ లెక్కన ఆ తర్వాత కూడా నేతాజీ జీవించే ఉన్నారని అర్థమవుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని అన్నారు. అర్ధేందు..నేతాజీ తమ్ముడు శైలేశ్ చంద్ర కుమారుడు. నేతాజీ ప్రతిష్టను మసకబార్చేందుకు నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రయత్నించిందని ఆయన సోమవారం ఆరోపించారు. 1947 తర్వాత నేతాజీ పేరుప్రతిష్టలను, జ్ఞాపకాలను తుడిచివేయడానికి యత్నించిందని.. అందువల్లే దేశ చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించిగానీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించిగానీ పెద్దగా ఉండకుండా చూసుకున్నారని విమర్శించారు. తమ కుటుంబంపై నిఘా పెట్టినట్లుగా తన తండ్రి కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. కాగా జనసంఘ్ నేత దీనదయాళ్ ఉపాధ్యాయ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని సోమవారం ఎన్డీయే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు. -
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
-
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు? ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. - ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది. అప్పటి నుంచీ ఆయన ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది. భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్‌తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు. నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్‌కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్‌కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్‌లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు. యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు. నాడు బ్రిటిష్‌వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది. బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్‌కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్‌లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు. బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్‌కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది. స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్‌కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్‌ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. -
ఆ నేతాజీ కోసం ఓ నేతాజీ
‘సాయుధ సంగ్రామమే న్యాయమని... స్వతంత్ర భరతావని మన స్వర్గమని... ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని... హిందు ఫౌజు జైహిందని నడిచాడు... గగనశిగలకెగసి కనుమరుగై పోయాడు...’ ఇది నేతాజీ జీవిత సారాన్ని నాలుగు మాటలలో అందంగా నింపిన సజీవ సాహిత్యం. జాలాది కలం నుండి జాలువారి తెలుగు జాతి మొత్తాన్ని ఉర్రూతలూగించిన ప్రసిద్ధ సినీ గేయం. భారతావని దాస్య శృంఖలాలను తెంచడానికి నేతాజీ ఎన్నుకున్న సాయుధ సంగ్రామాన్ని గుర్తుకు తెస్తూనే... చివరలో ఆయన అంతర్ధానమైపోయిన విషయాన్ని ఆయన మరణం ఓ మిస్టరీ అన్న భావంతో కవి నర్మగర్భంగా వినిపిస్తాడు. జాతి యావత్తు ఆరాధనా భావంతో చూసే అతికొద్దిమంది నేతలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉంటారు. భారత జాతిని జాగృతం చేస్తూ జీవించిన ఆ సమరయోధుని మరణం ఇప్పటికీ అంతు తెలియని రహస్యంగా మిగిలిపోయింది. నేతాజీ డెత్ మిస్టరీని ప్రశ్నించిన వారు ఉన్నప్పటికీ, ఇక లాభం లేదనుకుని మౌనం దాల్చిన వారే ఎక్కువమంది. గత ప్రభుత్వాలు కూడా ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాలు ముమ్మరం చేయకుండా, నేతాజీ మరణించాడని నమ్మబలుకుతూ కథను కంచికి పంపేశాయన అభిప్రాయం ఉంది. అయితే దానిని అంగీకరించని కొంత మంది ఆయన డెత్ మిస్టరీ వీడాలని ఇప్పటికీ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే అనంతపురం జిల్లా వాసి నిమ్మల నేతాజీ. యాదృచ్చికంగా నేతాజీ పేరు కలిగి ఉన్న ఈయన గత పన్నెండేళ్లగా సుభాష్ చంద్రబోస్ మరణం ఎలా సంభవించిందో ప్రభుత్వం చేత చెప్పించడానికి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీకైతే ఏకంగా ఘాటైన లేఖాస్త్రమే సంధించారు. మిస్టరీ వీడాలి మా సొంతూరు అనంతపురం. చదువైపోగానే బీజేపిలో చేరాను. అనంత బీజేపి వ్యవస్థాపనలో నా భాగస్వామ్యమూ ఉంది. ఇక దేశ రాజకీయాల గురించి నాకు నిశ్చిత అభిప్రాయాలే ఉన్నాయి. ఒకరిద్దరు మినహా చాలామంది రాజకీయ వేత్తలు ప్రజలకు దూరంగా బతికారంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు తెలియాల్సిన చాలా విషయాలు రహస్యంగా ఉండిపోయాయని నా భావన. భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్చంద్రబోస్నే తీసుకుంటే ఆయన పోరాట పటిమ నిరుపమానం. దేశభక్తి అనన్యసామాన్యం. అంతటి వ్యక్తి చివరి రోజుల గురించి దేశచరిత్రలో సరైన సమాచారం లేకపోవడం పాలకుల బాధ్యతారాహిత్యం అని నా అభిప్రాయం. నేతాజీ 1945 ఆగష్టు 17న చివరిసారి బ్యాంకాక్ విమానాశ్రయం వద్ద కనిపించారని, మరుసటి రోజు ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారని లోకసభ సచివాలయం వారు ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఇలా నిర్థారణ కాని చరిత్ర నిర్మాణంతో పెద్దలే ప్రజలను తప్పుదోవ పట్టించారు. అందుకే నేను 2003లో ‘విశ్వమానవ ప్రజా చైతన్య సమితి’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా నేతాజీ మరణ రహస్యంపై కచ్చితమైన వివరాలను వెల్లడించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నా. అలాగే దేశమంతటా తిరుగుతూ సామాన్యునికి అండగా ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలో ప్రచారం చేస్తున్నా. సత్యాల ఆధారంగా చరిత్ర లిఖించబడాలని, భారతదేశ పునర్నిర్మాణం జరగాలనీ నా ఆకాంక్ష. -
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని...
రేపు నేతాజీ జయంతి కోల్‌కతా వీధులన్నీ - ‘‘అదిగో... మన అమ్మాయి వచ్చేస్తుంది’ అని మేలుకుంటాయి. చేతులన్నీ హారతి పళ్లేలవుతాయి. దారులన్నీ స్వాగత తోరణాలవుతాయి. ఆ వచ్చేది ఎవరో కాదు... నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితాబోస్. ఈ ప్రొఫెసరమ్మ కోల్‌కతా వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కవారితో మాట్లాడుతున్నట్లుగానో, పుస్తక పఠనంలో లీనమైపోయినట్లుగానో కనిపించరు. చెప్పాలంటే, ఆమె వీధులతో ‘మౌన సంభాషణ’ చేస్తూ ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తారు. అల్లంత దూరాన... అంతెత్తులో గంభీరంగా నేతాజీ విగ్రహం. అది చూస్తున్నప్పుడు ఆయన కూతురు కళ్లలో కనిపించే ‘మెరుపు’ను పట్టుకోగలిగితే ఆమె అణువణువూ తండ్రి నామస్మరణతో ఎంత గర్వంగా ఎగిసిపడుతుందో అర్థమవుతుంది. బాల్యం నుంచి ఇప్పటి వరకు తన తండ్రి గురించి ఆమె ఎన్నెన్నో వీరగాథలు విని ఉంది. వాటిలో పూర్తి నిజాలు ఉండి ఉండొచ్చు. వీరాభిమానం నుంచి పుట్టిన ‘కల్పన’లు ఉండి ఉండొచ్చు. అయితే తన తండ్రి ‘చారిత్రక పురుషుడు’ అనేదాంట్లో మాత్రం మరో మాటకు తావులేదనే విషయం అనితాబోస్కు అర్థమైంది. ఇండియాలో ఉన్న నేతాజీ బంధువుల మాటల్లో ‘నాన్న’ జాడను వెదుక్కుంది ఆమె. ఆమె మోములో ‘నేతాజీ’ని చూసుకొని మురిసిపోయేవారు బంధువులు. స్వాతంత్య్రానికి పూర్వం నాటి నలుపు, తెలుపు ఛాయాచిత్రాలతో, ఇప్పటి ‘ప్రెసిడెన్సీ కాలేజీ’ విజువల్‌తో సుభాష్ చంద్రబోస్ కుటుంబ నేపథ్యం, చదువు పరిచయం అవుతుంది. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టారు సుభాష్ చంద్రబోస్. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. సుఖాలు, సౌకర్యాలు క్యూ కట్టి నిల్చొంటాయి. చదువు విషయానికి వస్తే పుంభావ సరస్వతి. ఇండియన్ సివిల్ సర్వీస్‌లో నాలుగవ ర్యాంకు. ఎటు చూసినా భద్రజీవితమే! ‘‘ఆయనకేం తక్కువ’’ అని అనుకోవడానికి పెద్ద జాబితానే ఉంది. వీటన్నిటినీ కాదనుకొని సుభాష్ స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు. నేతాజీ అయ్యారు. బ్రిటిష్ వాడి జాత్యహంకారంపై ఒంటి కాలి మీద లేచారు. అనేకానేకసార్లు కారాగారం పాలయ్యారు. అనారోగ్యానికి గురయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవికి ఎన్నికైన బోస్ ఆ తరువాత కాలంలో కాంగ్రెస్‌ను వీడారు. ‘ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ఫ్రీ. అవర్ స్ట్రగుల్ ఈజ్... నో డౌట్ ఏ నాన్వ యొలెన్స్ స్ట్రగుల్...’ ఈ దృశ్యంలో బోస్ కంచుకంఠాన్ని మళీ మళ్లీ వినాలనిపిస్తుంది. భారత స్వాతంత్య్రానికి ‘నాన్వయొలెన్స్ స్ట్రగుల్’ మాత్రమే సరిపోదని ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ను స్థాపించారు. ప్రతి మనిషీ ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలన్నారు. ‘ఫాసిస్ట్ డిసిప్లేన్’ ‘సోషలిస్ట్ ఐడియాలజీ’తో ముందుకు వెళ్లాలనే బోస్ ఆలోచనను చాలామంది విభేదించినా... అంతకంటే చాలామంది ఆయన్ను ఆరాధించడానికి ప్రొఫెసర్ అంటోని పెలింక తన ఇంటర్వ్యూలో ఉపయోగించిన ‘మాగ్నటిక్ పర్సన్’ అనే విశేషం కారణం కావచ్చు. ‘డెమోక్రసీ ఇండియా స్టైల్’ గ్రంథకర్తగా పెలింక ప్రసిద్ధుడు. చరిత్రకారుడు సుగతబోస్ నేతాజీకి సమీప బంధువు కూడా. స్వాతంత్య్ర సమర బాటలో నేతాజీ చేసిన ప్రయాణాల గూర్చి, ఎదురైన ప్రమాదాల గూర్చి తన ఇంటర్వ్యూలో చెప్పారు. నేతాజీని ఉద్దేశించి సుగతబోస్ ‘ ఏ మ్యాన్ విత్ అన్లిమిటెడ్ కరేజ్’ అని ఎందుకన్నారో ఆయన చెప్పిన విషయాల్లోనే తెలిసిపోతుంది. నేతాజీ సెక్రటరీ భార్య ఇంటర్వ్యూతో పాటు ప్రొఫెసర్ క్రిష్ణబోస్, జస్టిస్ యం.కె.ముఖర్జీ... మొదలైన వారి ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీకి బలాన్ని ఇచ్చాయి. ఒక దృశ్యంలో: అనితాబోస్, కెప్టెన్ లక్ష్మీ సెహెగెల్ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ‘మై డాటర్!’ అని అనితను అక్కున చేర్చుకుంటారు లక్ష్మీ. ఇద్దరి కళ్లలో నీళ్లు ప్రేక్షకులకు సైతం భావోద్వేగపూరిత కన్నీళ్లను తె ప్పిస్తాయి. గత దృశ్యాల నుంచి వర్తమానానికి, ఇక్కడి నుంచి మళ్లీ గతానికి వెళ్లే దృశ్యాల సమాహారంగా ఈ డాక్యుమెంటరీ కనిపిస్తుంది. సందర్భానుసారంగా ఉపయోగించుకున్న ఆనాటి బ్రిటీష్ రాజ్‌కు సంబంధించిన నలుపు తెలుపు దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ డాక్యుమెంటరీకీ కాలం లేదు. ఇది గతానిది. వర్తమానానిది. రేపటి భవిష్యత్‌ది! ఒక మాట: నేతాజీకి సంబంధించిన విషాదమేమిటంటే, మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి జరిగినంత చర్చ ఆయన రాజకీయాభిప్రాయాల గురించి, సైద్ధాంతిక దృక్పథం గురించి జరగలేదు. ఒకవేళ జరిగినా...అది ప్రధాన స్రవంతి మీడియాకు దూరంగా ఉంది. ‘ఫలానాచోట... నేతాజీ స్వామీజీగా అవతరించాడు’లాంటి టాపిక్లపై జరిగే చర్చ కంటే ఆ యోధానుయోధుడి పొలిటికల్ కెరీర్, పబ్లిక్ లైఫ్ గురించి తెలుసు కోవాల్సిన విషయాలు, చర్చించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెరైక్టర్: తిల్మన్ రెమ్మే కె మెరా: బ్రెమెర్ జాన్ హిన్రిచ్ -
ఏజెన్సీలో ‘దళ’జడి
జంగారెడ్డిగూడెం :పశ్చిమ ఏజెన్సీలో అన్నల అలజడి రేగింది. సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి మంగళవారం వేకువజామున 11 మందిని వలపన్ని పట్టుకున్నాయి. అనంతరం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 13 మందిని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వారంతా గతంలో రాయల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ)లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ రెండుగా చీలిపోయింది. అలా విడిపోయిన ఒక వర్గం గాదె దివాకర్ నాయకత్వంలో పనిచేస్తుండగా, మరో వర్గం సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంగా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టి.సుధాకర్ నాయకత్వంలో గాదె దివాకర్‌కు సంబంధించిన వర్గం పనిచేస్తోంది. విడిపోయిన చంద్రన్న వర్గంలో మోకల మురళీకృష్ణ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. చంద్రన్న వర్గం సాయుధ దళం ఏర్పాటుకు పూనుకుంది. కొంతమంది గిరిజన యువకులను ఎంపిక చేసుకుని ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను ఉపయోగించడంలో ఏడాదిన్నర కాలంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మంగళవారం వేకువజామున 11 మంది వ్యక్తులు ఆయుధాలు తీసుకుని టాటా ఏస్ వాహనంలో ఈ ప్రాంతానికి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సాయుధ బలగాలతోపాటు జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, లక్కవరం స్టేషన్లకు చెందిన పోలీసులు జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద మాటువేసి అత్యంత చాకచక్యంగా 11 మంది దళ సభ్యులను అరెస్ట్ చేశారు. వారిలో దళ కమాండర్ కుంజా రవి, డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) జిల్లా కార్యదర్శి మోకల మురళీకృష్ణతోపాటు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, కరకాల రాము అలియాస్ రామన్న, మహమ్మద్ అబ్దుల్ రషీద్, అమరాజు గట్టయ్య, పాయం వెంకటేష్ అలియాస్ మురళి, బడపటి వీరన్న, తుంగా జాన్ అలియాస్ నాగన్న, కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న ఉన్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారిని విచారించారు. అనంతరం బుట్టాయగూడెం మండలం తూర్పురేగులకుంటలో నివాసం ఉంటున్న కైకాల సూర్యనారాయణను, తలారి ప్రకాష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో కలిపి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. దళ సభ్యుల నుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం జరక్కుండా పోలీస్ ఆపరేషన్ ఆయుధాలతో దళాలు ప్రయాణం చేస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శించారు. సాయుధులైన వారిని అరెస్ట్ చేసే సమయంలో సాధారణంగా ప్రతిఘటన ఎదురవుతుంది. పోలీసులు పక్కా వ్యూహంతో ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా మొత్తం 13 మంది దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సాయుధ దళసభ్యులను పట్టుకునే విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యేవి. ఈ దశలో ఎదురు కాల్పులు జరిగి ప్రాణ నష్టం సంభవించేది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీసులు దళ సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కన వారిలో న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న మోకల మురళీకృష్ణ ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని పందిపంపు గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికయ్యారు. ఈయన గతంలో రాజస్థాన్‌లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కోవర్టు పనేనా? చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులు పట్టుబడటం వెనుక కోవర్టుల హస్తముందని పలువురు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను వినియోగించడంపై శిక్షణ పొంది టాటా ఏస్ వాహనంలో దళ సభ్యులు జీలుగుమిల్లి మీదుగా వస్తున్నారనే కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం కోవర్టులకే సాధ్యమవుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ దళం సాగిస్తున్న కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా వేశామని, పక్కా సమాచారంతో దాడి చేసి దళ సభ్యులను వలపన్ని పట్టుకున్నామని చెబుతున్నారు. ‘దళ సభ్యుల అరెస్ట్ అక్రమం’ ఏలూరు(బిర్లాభవన్ సెంటర్) : సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వస్తుంటే అరెస్ట్ చేశారన్నారు. వారితోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దీనిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక నిఘా : ఎస్పీ జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దళ సభ్యుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జి.రఘురామ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాలంగా సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళాలను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. వారంతా కాంట్రాక్టర్లు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళ సభ్యులు టాటా ఏస్ వాహనంలో వస్తున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు వారిని అత్యంత చాకచక్యం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పట్టుకున్నారన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి అవార్డులు, రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో కొత్తగా కుకునూరు, వేలేరుపాడు మండలాలు కలిసిన దృష్ట్యా మావోయిస్టుల కదలికలపైనా గట్టి నిఘా పెట్టామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడితే అటువంటి వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ రమేష్ పాల్గొన్నారు. -
దేశంలో భగ్గుమన్న విభేదాలు
పలమనేరు పార్టీ ఇన్చార్జ్పై అధిష్టానానికి ఫిర్యాదు బోస్ ఓటమిపై లోకేష్‌కు వివరాలు నాలుగు నెలలుగా అంతర్గత కుమ్ములాటలు పలమనేరు: పలమనేరు తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్‌చంద్రబోస్‌పై అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (ఆర్ఎస్ఆర్) రెండ్రోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు దఫాలు పలమనేరుకు వచ్చిన మంత్రి బొజ్జల కార్యక్రమాలకు సైతం శ్రీనివాసులురెడ్డి వర్గం హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమాల్లో తనను అసలు పట్టించుకోవడం లేదని ఆయన తన ఆవేదనను జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకే మంత్రి పలమనేరుకు వచ్చినట్టు కూడా తెలిసింది. అయిన్పటికీ కొలిక్కి రాకపోవడంతో జిల్లా నాయకులు సైతం ఈ విషయం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరనాథరెడ్డిపై టీడీపీ నుంచి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఓటమి కారణాలు తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించింది. బెరైడ్డిపల్లెలో సమావేశం జరిగినపుడు బోస్ ఓ జాబితాను చదివి వీరందరూ తమ వద్ద డబ్బు తీసుకుని పార్టీ కోసం పనిచేయలేదని ద్వితీయ శ్రేణి నాయకులనుద్దేశించి బహిరంగంగానే చెప్పారు. మనస్తాపం చెందిన శ్రీనివాసులురెడ్డి వర్గం అప్పటి నుంచి పార్టీ ఇన్చార్జ్ బోస్‌తో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పలు పార్టీ కార్యక్రమాలకు శ్రీనివాసులురెడ్డిని బోస్ ఆహ్వానించకపోవడం వీరిద్దరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అధిష్టానానికి ఫిర్యాదు బోస్ ఓటమికి గల కారణాలను వదిలిపెట్టి కేవలం తమపైన నిందలేయడం సమంజసం కాదంటూ పార్టీ బెరైడ్డిపల్లె మండలాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కెళ్లి లోకేష్‌ను కలిశారు. అభ్యర్థి ఓటమికి గల వాస్తవ కారణాలను ఆయనకు వివరించినట్టు తెలిసింది. నాలుగు పేజీల నివేదికను సైతం ఆయన సీఎంకు అందజేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ విషయంపై చర్చ సాగాలనే ఈ తతంగమంతా జరిగినట్టు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తుల విషయంపై అధికారులకు ఫిర్యాదు పలమనేరులోని బోస్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.కోట్లాది విలువైన భవనం సైతం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిందేననే విషయమై శ్రీనివాసులురెడ్డి వర్గం ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కలెక్టర్ ఉత్తర్వుల కాపీ తదితరాలను ఆ ఫిర్యాదులో జత పరిచి తగు చర్యలు తీసుకోవాలంటూ పేర్కొనట్టు సమాచారం. ఈ భవనాన్ని రక్షించుకోవాలనే ప్రయత్నంలోనే బోస్ పార్టీ కార్యాలయాన్ని ఆ భవనంలోకి మార్చినట్టు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఏదేమైనా అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు భవిష్యత్తులో ఎంతవరకు వెళ్తాయోననే ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
వాజపేయికి భారతరత్న?
-
వాజపేయికి భారతరత్న?
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. సంప్రదాయానికి భిన్నంగా ఒకేసారి ఐదుగురికి అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేయాలని కూడా ఎన్డీఏ సంకీర్ణ సర్కారు భావిస్తోంది. తొలిసారిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయబోతున్న నరేంద్ర మోడీ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు పతకాలు తయారు చేయాలని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మింట్ సంస్థను కేంద్ర హెంమంత్రిత్వ శాఖ ఆదేశించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్‌చంద్రబోస్, మదన్ మోహన్ మాలవ్య, హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌లతో పాటు వాజపేయికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాయుధ పోరాటంతో స్వాతంత్ర్య సమరం సాగించిన సుభాష్‌చంద్రబోస్ కు మరణాంతరం 1992లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అయితే దీనిపై వివాదం రేగడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కలేదు. కాగా యూపీఏ ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రేవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రదానం చేసింది. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
అదే కత్తితో పొడుచుకున్న నిందితుడు కామారెడ్డి: ప్రేమోన్మాదంతో ఓ విద్యార్థి తరగతి గదిలోనే అందరూ చూస్తుండగా తోటి విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహ, మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్‌రెడ్డి కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్ నుంచి ఒకే చోట చదువుతున్న వీరి మధ్య స్నేహం ఉండేది. కానీ, ఇటీవల తనతో కాకుండా ఇతరులతో స్నేహంగా ఉండడాన్ని సాయికిరణ్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడు బుధవారం ఉదయం వెంట తెచ్చుకున్న కత్తితో తరగతి గదిలోనే స్నేహను కత్తితో పొడవగా ఆమె గాయపడింది. మిగతా విద్యార్థులు పట్టుకునేలోగా అదే కత్తితో తన కడుపులో పొడుచుకున్నాడు. కళాశాల అధ్యాపకులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని స్నేహను, సాయికిరణ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. సాయికిరణ్ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. స్నేహ నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, నిందితునిపై 307, 309, 354, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రూరల్ సీఐ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. -
సుభాష్ చంద్రబోస్ కారు కనిపించింది!!
-
సుభాష్ చంద్రబోస్ కారు కనిపించింది!!
భారత స్వతంత్ర సేనాని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారు జార్ఖండ్‌లో కనిపించింది. దాదాపు 90 ఏళ్లనాటి ఈ బేబీ ఆస్టిన్ కారులోనే సుభాష్ చంద్రబోస్ 1930 నుంచి 1941 వరకు జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఇప్పుడది ధన్‌బాద్‌లోని బరారీ కోక్ ప్లాంటు గోడౌన్లో కనిపించింది. వెంటనే ఈ కారును తమకు అప్పగించాలని భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ సీఎండీ తపస్ కుమార్ లాహిరి ఆ జనరల్ మేనేజర్‌ను కోరారు. తర్వాత ఆ కారును కోల్ మేనేజర్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అనంతరం బీసీసీఎల్ సంస్థ ఈ కారు గురించి కోల్‌కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోకు తెలిపింది. ఈ కారును సుభాష్ చంద్రబోస్ మేనమామ అశోక్ బోస్ ఉపయోగించేవారని సమాచారం. -
చీలి చీలి చివరికిలా..
కాంగ్రెస్ చరిత్ర సమస్తం పీలికల పరాయణత్వం దేశంలో శతాబ్దికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరే పార్టీలోనూ లేనన్ని చీలికలకు గురైంది. స్వాతంత్య్రానికి ముందే రెండుసార్లు చీలిన కాంగ్రెస్.. స్వాతంత్య్రం వచ్చాక పదుల సంఖ్యలో చీలికల పాలైంది. చీలికలు పీలికలై, అంతర్గత కీచులాటలతో సతమతమవుతున్నా, సంకీర్ణయుగంలోనూ ఉనికి నిలుపుకొని అధికారాన్ని చేజిక్కించుకోగలగడమే కాంగ్రెస్ ప్రత్యేకత. ఏఓ హ్యూమ్ 1885లో ప్రారంభించిన కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ వంటివారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు. కాంగ్రెస్ నుంచి చీలిపోయి ఏర్పడిన కొన్ని పార్టీలు కొంతకాలం మనుగడ సాగించినా, తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మరికొన్ని ఉనికిలోనే లేకుండా పోయాయి. కొన్ని తమ ప్రాంతాల్లో బలమైన శక్తులుగా ఎదిగాయి. కాంగ్రెస్ చీలికలపై విహంగ వీక్షణం... పన్యాల జగన్నాథదాసు స్వరాజ్ పార్టీ (1923): బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్, తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన వర్గం స్వరాజ్ పార్టీగా తెరపైకి వచ్చింది. ప్రధానంగా బెంగాల్‌కే పరిమితమైన ఈ పార్టీ పుష్కరకాలం అతికష్టంపై మనుగడ సాగించింది. ఇందులోని నేతలంతా 1935లో తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (1939): సుభాష్‌చంద్ర బోస్, శీల్‌భద్ర యాగీ, శార్దూల్‌సింగ్ కవీశ్వర్ల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ప్రస్తుతం ఈ పార్టీ వామపక్ష కూటమిలో కొనసాగుతోంది. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (1951): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జీవత్రామ్ కృపలానీ నాయకత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మైసూరు, మద్రాసు, వింధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో పనిచేసేది. మరుసటి ఏడాదే ఇది సోషలిస్టు పార్టీతో విలీనమై, ప్రజా సోషలిస్టు పార్టీగా తెరపైకి వచ్చింది. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు శివకుమార్ శర్మ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని గత ఏడాది ఫిబ్రవరి 21న పునఃప్రారంభించారు. హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ (1951): టంగుటూరి ప్రకాశం, ఎన్జీ రంగాల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ఎక్కువకాలం మనుగడ కొనసాగించకుండానే కృపలానీ నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనమైపోయింది. ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (1956): సి.రాజగోపాలాచారి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మద్రాసు రాష్ట్రంలో బలంగానే ప్రభావం చూపినా, 1959లో స్వతంత్ర పార్టీలో విలీనమైపోయింది. కేరళ కాంగ్రెస్ (1964): కేరళ నాయకుడు కె.ఎం.జార్జి నేతృత్వంలో చీలిపోయిన కాంగ్రెస్ నేతలు కేరళ కాంగ్రెస్‌ను స్థాపించారు. తర్వాతి కాలంలో ఇందులోనూ చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (జాకబ్), కేరళ కాంగ్రెస్ (థామస్) ఉనికిలో ఉన్నాయి. ఒరిస్సా జన కాంగ్రెస్ (1966): ఒరిస్సా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ స్వతంత్ర పార్టీతో కలసి 1967లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1977లో జనతా పార్టీలో విలీనమై ఉనికి కోల్పోయింది. భారతీయ క్రాంతిదళ్ (1967): అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ ఈ పార్టీని స్థాపించారు. దీనిని 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు. బంగ్లా కాంగ్రెస్ (1967): బెంగాలీ నేత అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్ రెండుసార్లు సీపీఎంతో కలసి రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంది. అజయ్ ముఖర్జీనే రెండుసార్లూ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కారణంగా పార్టీ బలం క్షీణించడంతో తిరిగి కాంగ్రెస్‌లోనే పార్టీని విలీనం చేశారు. మణిపూర్ పీపుల్స్ పార్టీ (1969): మహమ్మద్ అలీముద్దీన్ నేతృత్వంలో విడిపోయిన వర్గం స్థాపించిన ఈ పార్టీ నేటికీ మనుగడ సాగిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) (1969): కాంగ్రెస్‌లో ‘సిండికేట్’గా పేరుమోసిన కామరాజ్, మొరార్జీ దేశాయ్ తదితరులు ఈ పార్టీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది జనతా పార్టీలో విలీనమైపోయింది. ఉత్కళ్ కాంగ్రెస్ (1969): ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు బిజూ పట్నాయక్ ఈ పార్టీని స్థాపించారు. 1969 ఎన్నికల్లో ఉత్కళ్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్థానం తెలంగాణ ప్రజా సమితి (1969): తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ, 1971లో తిరిగి కాంగ్రెస్‌లో విలీనమైంది. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ (1977): మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ 1977 సాధారణ ఎన్నికల ముందు ప్రారంభించిన ఈ పార్టీ, ఎన్నికల తర్వాత జనతా పార్టీలో విలీనమైపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి) (1978): కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె కాంగ్రెస్ (ఐ) ప్రారంభించగా, బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో మిగిలిన పార్టీని ఎన్నికల కమిషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి)గా గుర్తించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (అర్స్) (1979): కర్ణాటక మాజీ సీఎం దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్రకు చెందిన నేతలు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత అర్స్ జనతా పార్టీలో చేరిపోగా, యశ్వంత్‌రావు చవాన్, బ్రహ్మానందరెడ్డి తదితరులు కాంగ్రెస్ (ఐ)లో చేరిపోయారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలో అర్స్ పార్టీ నుంచి చీలిపోయిన వర్గం కేరళలో కాంగ్రెస్ (ఏ) పేరిట వేరు కుంపటి పెట్టుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్) (1981): మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శరద్ పవార్ అప్పట్లో అర్స్ వర్గంలో పలువురు నేతలు చెదిరిపోగా మిగిలిన పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ పేరును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్)గా మార్చారు. కేరళలో ఈ పార్టీ కొన ఊపిరితో మనుగడ సాగిస్తోంది. కె.రామచంద్రన్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పార్టీ 2007లో ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్) (1981): అర్స్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జగ్జీవన్‌రామ్ మరోసారి చీలిక పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్‌కు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ 1986లో జగ్జీవన్ మరణించేంత వరకు కొనసాగింది. వేరుకుంపట్ల పరంపర... మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ హత్య సంఘటనల అనంతరం కాంగ్రెస్‌లో లెక్కకు మిక్కిలిగా చీలికలు ఏర్పడ్డాయి. అస్సాం మాజీ సీఎం శరత్చంద్ర సిన్హా నాయకత్వంలో 1984లో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు), 1986లో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్, 1988లో శివాజీ గణేశన్ నేతృత్వంలో తమిళ మున్నేట్ర మున్నని పార్టీలు ఏర్పడ్డాయి. ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్, నట్వర్సింగ్ల నాయకత్వంలో 1994లో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), బంగారప్ప నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాయి. కర్ణాటక కాంగ్రెస్‌ను అనతికాలంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేసిన బంగారప్ప, 1996లో కర్ణాటక వికాస్ పార్టీని ఏర్పాటు చేసి, దాన్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1996లో గెగాంగ్ అపాంగ్ నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్, జీకే మూపనార్ నేతృత్వంలో తమిళ మానిల కాంగ్రెస్, మాధవరావు సింధియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. ఇవన్నీ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మమతా బెనర్జీ నాయకత్వంలో 1997లో ఏర్పడిన తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉంది. 1998లో ఫ్రాన్సిస్ డిసౌజా నేతృత్వంలో గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ, ముకుట్ మిఠి నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్ (మిఠి), శీష్రామ్ ఓలా నేతృత్వంలో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్), సురేశ్ కల్మాడీ నాయకత్వంలో మహారాష్ట్ర వికాస్ అఘాడి ఏర్పడ్డాయి. 1999లో బీహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రా ఆధ్వర్యంలో భారతీయ జన కాంగ్రెస్, శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ల నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రారంభమయ్యాయి. వీటిలో ప్రస్తుతం ఎన్సీపీ మాత్రమే ఉంది. 2000లో ఫ్రాన్సిస్కో సర్దిన్హా నేతృత్వంలో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. 2001లో ప్రస్తుత కేంద్ర మంత్రి చిదంబరం నాయకత్వంలో కాంగ్రెస్ జననాయక పెరవై, కుమారి అనంతన్ నేతృత్వంలో తొండర్ కాంగ్రెస్, పి.కణ్ణన్ నేతృత్వంలో పాండిచ్చేరి మక్కల్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. 2002లో జాంబవంతరావు ధోలే నాయకత్వంలో ఏర్పడిన విదర్భ జనతా కాంగ్రెస్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2003లో అరుణాచల్ నేత కమెంగ్ డోలో నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ (డోలో) బీజేపీలో విలీనమైంది. 2005లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ పేరిట పి.కణ్ణన్ మరోసారి చీలిక పార్టీ పెట్టి, దానిని తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. 2005లో కేరళ నాయకుడు కె.కరుణాకరన్ డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ ప్రారంభించారు. దీనిని ఎన్సీపీలో విలీనం చేయగా, కరుణాకరన్, ఆయన కుమారుడు మురళీధరన్ మాత్రం కాంగ్రెస్‌లో చేరారు. 2007లో అత్యధికంగా చీలిక పార్టీలు ఏర్పడ్డాయి. భజన్‌లాల్ నేతృత్వంలో హర్యానా జనహిత కాంగ్రెస్ (బీఎల్), ఏకే ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ (ఏ), సుఖ్రామ్ నేతృత్వంలో హిమాచల్ వికాస్ కాంగ్రెస్, బన్సీలాల్ నేతృత్వంలో హర్యానా వికాస్ పార్టీ, వాహెంగ్‌బామ్ నిపాంచా సింగ్ నేతృత్వంలో మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, వి.రామమూర్తి నేతృత్వంలో తమిళగ రాజీవ్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. బెంగాలీ నేత సోమేంద్రనాథ్ మిత్రా నేతృత్వంలో 2009లో ఏర్పడిన ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్ అనతికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగింది. పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి 2011లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. -
జగన్‌తోనే ఆరోగ్యశ్రీ సాధ్యం
నాగాయలంక(చల్లపల్లి), న్యూస్‌లైన్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 259 వ్యాధులను తొలగించారని, అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలంటే పార్టీ అధినేత ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. నాగాయలంక వినాయక గుడి సెంటర్లో వైఎస్సార్ స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో గాంధీ వర్థంతి, వైఎస్.రాజశేఖరరెడ్డి సంస్మరణార్థం గురువారం మహారక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధిపొందిందన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు తిరిగి కొనసాగించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడం తప్పదని చెప్పారు. అధ్యక్షత వహించిన జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు మరికొంతమంది పార్టీనాయకులు ముందుకు రావాలని కోరారు. కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, మచిలీపట్నం పార్లమెంటు క న్వీనర్ డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్, నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని, జగన్ వంటి సత్తాగల నేతను ఎన్నుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. యాసంను రెడ్‌క్రాస్ కార్యదర్శి బాపిరాజు, అవనిగడ్డకు చెందిన అన్నపరెడ్డి పెద్దబ్బాయ్ గజమాలతో సత్కరించగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ యాసం మెమొం టోలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలు మాదివాడ రాము, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, గుడివాక శివరావ్, విశ్వనాధపల్లి సత్యనారాయణ, దాసి దేవదర్శనం, అరజా నరేంద్రకుమార్, పరిశె మాధవరావు, చండ్ర వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావ్, చెన్ను రంగారావు, గాజుల మురళీకృష్ణ, పొన్నూరు నాంచారయ్య, కోసూరు గోపీచంద్, మునిపల్లి భాస్కరరావు, దిడ్ల ప్రసాద్, ఒడుగు నరేంద్ర, యలవర్తి శ్రీరామ్మూర్తి, యలవర్తి ప్రకృతి రాజబాబు, మురాల శ్రీనివాసరావు, లుక్కా శ్రీనివాసరావు, సనకా శేషుబాబు, ఒడుగు నాగబాబు, సినీ నటుడు వెంకట్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సమైక్యం కోసమే.... మచిలీపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కట్టుబడి ఉందని పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తరుణంలోనే ఎంపీగా ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంటులో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించి తాను సమైక్యవాదినేనని చాటి చెప్పారన్నారు. రాష్ట్ర విభజన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ సీపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. -
నేతాజీది రాజీలేని పోరాటం
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం తెల్లవారితో సుభాష్ చంద్రబోస్ రాజీలేని పోరాటం చేశారని వక్తలు కొనియాడారు. - న్యూస్‌లైన్, నల్లగొండ టుటౌన్ నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: బ్రిటిష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి భరతజాతి విముక్తి కోసం నేతాజీ సుభాష్ చం ద్రబోస్ రాజీలేని పోరాటం సాగించారని, ఆ మహానీయుడిని మనందరం ఎల్లప్పుడు స్మరిం చుకోవాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ ప్రసంగించారు. సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి సభాష్ చంద్రబోస్ చేసిన పో రాటం మరువలేనిదన్నారు. అతని రక్తంలోనే తిరుగుబాటు తనం ఉందని, ఏ పని చేసినా ఎక్కడా రాజీ పడలేదన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేశారని కొనియాడారు. ఇప్పటి రాజకీయ నాయకులు కూడా నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసి ప్రజల్లో మార్పు తేవాలని కోరారు. దేశంకోసం పని చేసిన జాతీయ నాయకులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రస్తుత సమాజంలో విలువలు క్షీణిస్తున్నాయని, వాటిని కాపాడుకోవడానికి మరో సామాజిక విప్లవం రావాలన్నారు. ఆర్ఓ అంజయ్య మాట్లాడుతూ యు వత సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకొని చెడును పారదోలేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. అదే విధంగా పలువురు అనాథాశ్రమ నిర్వాహకులను మొమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి కార్యదర్శి కర్నాటి విజయ్‌కుమార్, 12వ బెటాలియన్ కమాండెంట్ బాపూజీరావు, డీఎస్పీ రామ్మోహన్రావు, జి. మోహన్‌రావు, వక్త రాాజారెడ్డి, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, కూతురు లక్ష్మారెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రయోజనం కోసమే విభజన
కాకినాడ, న్యూస్‌లైన్ : ముగింపు దశలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధా న్య మిచ్చి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుం దని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమైక్య శంఖారావం ప్రచార పోస్టర్ ను గురువారం కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకే జగన్ మోహన్‌రెడ్డి యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం మూడింట రెండు వంతుల మెజార్టీతోనే ఇటువంటి నిర్ణయాలు జరిగేలా చట్ట సవరణలు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు. వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు జగన్మోహన్రెడ్డి అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకా రం రూ. 40 వేల కోట్ల వార్షిక ఆదాయం మాత్రమే ఉంటుందని, ఈ సొమ్ము జీతాలకు కూడా చాలని పరిస్థితుల్లో రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదని ప్రశ్నించారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే నీటి సమస్యలతో పాటు రైతులు, ప్రజలు, ఇతర వర్గాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రజల కు వివరించేందుకే జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేపట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, నగర యువజన విభాగం కన్వీనర్ కిశోర్ పాల్గొన్నారు. ఎస్ఈజెడ్కు భూములు కేటాయించింది చంద్రబాబే : రావూరి పిఠాపురం, న్యూస్‌లైన్ : కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)కు భూములు కేటాయించింది టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరావు అన్నారు. పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2002లో ఎస్ఈజెడ్కు 10 వేల ఎకరాల భూములు కేటాయించిన సంగతి టీడీపీ నేతలు మరచి వైఎస్సార్ కేటాయించారనడం విడ్డూరంగా ఉందన్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు నిధులు కేటాయిం చాలని అసెంబ్లీలో నిలదీశారన్నారు. అనంతరం 2009లో మఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారన్నారు. జగన్‌ను విమర్శించే అర్హత యనమలకు లేదు : పీకేరావు అంబాజీపేట, న్యూస్‌లైన్ : రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు అన్నారు. అంబాజీపేటలో గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యనమల తీరును దుయ్యబట్టారు. న్యాయబద్ధంగా జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ యనమల మాట్లాడుతున్న తీరు న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా ఉందన్నారు. రామచంద్రపురం ఉప ఎన్నికల్లో యనమల కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావును వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పి.గన్నవరం మండల యూత్ కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
నందిపాడ్ (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: నందిపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో ఇంట్లో సీలింగు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు భార్యాభర్త మృతిచెందడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడుచర్ల మండలం రామాపురానికి చెందిన ఆవుల బంగారయ్య(25), తిరుపతమ్మ(22)లకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రి తం నందిపాడు గ్రామానికి వచ్చి గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంగారయ్య తల్లి గురువమ్మ అదే గ్రామంలో వేరేచోట గుడిసె వేసుకుని నివాసముం టోంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు కుమారుడి ఇంట్లో గడిపిన గురవమ్మ ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున ఆమె కుమారుడి ఇంటికి రాగా తలుపు బయట వైపు గడియ వేసి ఉంది. గడియ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కోడలు తిరుపతమ్మ మంచంలో రక్తపు మడుగులో పడి ఉండగా, కుమారుడు బంగారయ్య సీలింగు ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని రెండు చేతులు చున్నీతో కట్టి ఉన్నాయి. దీంతో ఆమె ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, ప్రొబేషనరి డీఎస్పీ విజయభాస్కర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రాహుల్దేవ్లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతులిద్దరూ నిరుపేదలు కావడం, వారి వద్ద విలువైన వస్తువులు, డబ్బు లేకపోవడంతో ఇతరులు హత్య చేసే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్త గొడవపడిన సందర్భంలో తిరుపతమ్మ తలపై గురవయ్య రోకలిబండతో కొట్టడంతో చనిపోయి ఉండొచ్చని, దిక్కుతోచని స్థితిలో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్ సైతం ఇంట్లోకి వెళ్లి మృతుడి చుట్టూ తిరిగి, ఇంట్లో ఉన్న బావి వద్దకు వెళ్లింది. తిరిగి మృతుడి వద్దకు వెళ్లడంతో పోలీసుల అనుమానం బలపడింది. గురువమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. -
పీఆర్సీతో సంఘాల చర్చలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చర్చలను గురువారం ముగించింది. ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, డిమాండ్ల మీద రెండు నెలలకుపైగా ఒక్కో సంఘంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు. వేతన సవరణ సిఫార్సుల నిర్ధారణలో ఉద్యోగ సంఘాలతో చర్చలది ముఖ్యపాత్ర. చర్చల ప్రక్రియ ముగింపుతో పీఆర్సీ పనిలో ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. ఇక నివేదిక రూపకల్పన మీద పీఆర్సీ కసరత్తు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. నివేదికను త్వరగా తెప్పించుకొని కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. డిసెంబర్ రెండో వారానికి నివేదిక తయారు చేయడం వీలవుతుందని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే త్వరలోనే ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. నివేదిక సమర్పించడానికి మార్చి రెండోవారం వరకు పీఆర్సీకి గడువు ఉంది. త్వరలో ఐఆర్..?: పీఆర్సీ అమలు కంటే ముందు మధ్యంతర భృతి(ఐఆర్) కోసం పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. 50 శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 25-35 శాతం మధ్య నిర్ణయమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. సంతృప్తికర స్థాయిలో ఐఆర్ ప్రకటిస్తే, పీఆర్సీ అమల్లో మెరుగైన ఫిట్మెంట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. 75% ఫిట్మెంట్తో చెల్లించాలి: సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు 75 శాతం ఫిట్మెంట్తో వేతనాలు చెల్లించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 63 శాతం డీఏ చెల్లించాలని పీఆర్సీని కోరారు. సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు గురువారం పీఆర్సీ చైర్మన్‌ను కలిసి తమ ప్రతిపాదనలపై వివర ణ ఇచ్చారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ. 16 వేలుగా నిర్ధారించాలని పీఆర్సీని కోరినట్టు సమాఖ్య నేతలు మురళీకృష్ణ, నరేందర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో 5 రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పొడిగించాలని, నగర ఉద్యోగులకు సిటీ అలవెన్స్‌ను రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ రూ. 25 లక్షల గృహ రుణాలు అందజేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, 45శాతం మధ్యంతర భృతి చెల్లించాలని విన్నవించారు. కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలి: పెన్షనర్ల సంఘం సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ పీఆర్సీకి నివేదించింది. కనీస వేతనంతో సమానంగా పెన్షన్ చెల్లించాలని కోరింది. ఉద్యోగి రిటైర్డ్ అయితే రూ. 15 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని అసోషియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్ రెడ్డి గురువారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్‌ను కలిసి విన్నవించారు. -
త్వరలో సమైక్య శంఖారావం
-
జనం గుండెచప్పుడై...
పండుపున్నమి వేళ సాగరసంగమానికి పోటెత్తిన జీవఝరిలా ప్రతి పదం జగన్మోహన్రెడ్డి బాటలో కదం తొక్కింది. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది. ప్రతి గుండెచప్పుడై జగన్నినాదం ప్రతిధ్వనించింది.బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది.మధురపూడి విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న అభిమానులుమధురపూడి విమానాశ్రయంలో జగన్‌కు స్వాగతం పలికేందుకు రంపచోడవరం నుంచి వచ్చిన గిరిజన మహిళలుతూర్పు గోదావరి జిల్లా గాడాలలో జగన్‌తో కరచాలనం చేస్తున్న మహిళబుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ జగన్జగన్‌కు ఉత్సాహంగా యువకుల అభివాదంరాజమండ్రి శానిటోరియం వద్ద బారులు తీరిన మహిళలురాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో జగన్‌కు అభివాదం చేస్తున్న విద్యార్థులురాజమండ్రి కొంతమూరులో వృద్ధుడిని పలకరిస్తూ....బస్సులో నుంచి ప్రయాణికులు, డ్రైవర్ అభివాదంజక్కంపూడి విజయలక్ష్మి నివాసంలో ఆమె కుమార్తె సింధుసహస్ర, అల్లుడు భుజంగరాయుడులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, కోడలు దివ్యశ్రీలకు శుభాకాంక్షలు తెలుపుతున్న జగన్క్వారీమార్కెట్ రోడ్డులో విద్యార్థినిని ముద్దాడుతూ...రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో కార్యకర్తలు ఇచ్చిన శంఖాన్ని పూరిస్తున్న జగన్భారీగా తరలివచ్చిన జనంకు అభివాదం చేస్తున్న జగన్అభిమానులకు అభివాదం చేస్తూ... -
త్వరలో సమైక్య శంఖారావం
సమైక్యాంధ్ర కోసం కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్ర: జగన్ సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలో సమైక్య శంఖారావం పూరించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టబోయే ఈ సమైక్య శంఖారావం యాత్ర రాష్ర్టవ్యాప్తంగా సాగుతుందని తెలిపారు. దారి మధ్యలో ఓదార్చాల్సిన కుటుంబాలను ఓదారుస్తూ త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ప్రజలనుద్దేశించి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీ వివాహానికి జగన్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. దారి మధ్యలో రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇక్కడ జక్కంపూడి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు నేను అనుకోని పరిస్థితుల్లో కుట్రలు, కుతంత్రాల మధ్య జైలుపాలయ్యాను. అందువల్లే రాలేకపోయాను. మీ ఆప్యాయతలు, దేవుని చల్లని ఆశీస్సులతో మళ్లీ మీ అందరి ప్రేమానురాగాలు పొందేందుకు మీ మధ్యకు రాగలిగాను’’ అని అన్నారు. త్వరలోనే సమైక్య శంఖారావం పూరిస్తూ ఇక్కడకు వస్తానని చెప్పారు. జగన్‌కు జన నీరాజనం.. ఏడాదిన్నర తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు మధురపూడి చేరుకున్న తమ అభిమాన నేతకు స్వాగతం చెప్పడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. మధురపూడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి కంబాల చెరువు సెంటర్‌కు చేరుకునేందుకు ఏకంగా నాలుగున్నర గంటల సమయం పట్టింది. దారిపొడవునా వేలాదిగా జనం బారులు తీరారు. మహిళలు అడుగడుగునా మంగళ హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. పెద్ద సంఖ్యలో యువకులు మోటారు బైకులపై ర్యాలీగా వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. పిల్లాపాపలతో సహా జనమంతా రోడ్లపైకి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. తనను చూసేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కంబాల చెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత జగన్ జక్కంపూడి విజయలక్ష్మి నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన జక్కంపూడి తనయ సింధుసహస్ర-భుజంగరాయుడు దంపతులను ఆశీర్వదించారు. తర్వాత అక్కడ్నుంచి కాకినాడ చేరుకొని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. జగన్ వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు గంపల వెంకట రమణ, జ్యోతుల నెహ్రూ, పార్టీ నేతలు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాతపాటి సర్రాజు, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరిజాల వెంకట స్వామినాయుడు తదితరులు ఉన్నారు.